వాల్వ్యులర్ గుండె వ్యాధి - Valvular Heart Disease in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

January 14, 2019

March 06, 2020

వాల్వ్యులర్ గుండె వ్యాధి
వాల్వ్యులర్ గుండె వ్యాధి

వాల్వ్యులర్ గుండె వ్యాధి అంటే ఏమిటి?

మానవ గుండెకు నాలుగు కవాటాలు (వాల్వ్ లు) ఉంటాయి  - ద్విపత్ర (మిట్రల్ [mitral]), త్రిపత్ర (ట్రైకస్పిడ్ [tricuspid]), మహాధమని (అయోర్టిక్ [aortic]), మరియు పుపుస (పల్మనరీ [pulmonary]). ఈ కవాటాలు రక్త  ప్రసరణ హృదయం లోపలికి మరియు బయటికి ప్రవహించడాన్ని నియంత్రిస్తాయి, తద్వారా హృదయంలోకి రక్తం తిరిగి ప్రవహించకుండా చేస్తాయి. గుండె యొక్క ఈ పనితీరు వాల్యులార్ గుండె వ్యాధులలో చెదిరిపోతుంది. వివిధ రకాలైన వాల్యులార్ గుండె జబ్బులు వీటిని కలిగి ఉంటాయి:

 • రిగుర్గిటేషన్ (Regurgitation) : తప్పు దిశలో రక్తం ప్రవహించడం (వెనుకకు ప్రవహించడం)
 • మిట్రల్ వాల్వ్ ప్రొలేప్స్ (Mitral valve prolapse): మిట్రల్ వాల్వ్ (ద్విపత్ర కవాటం) యొక్క ఫ్లాప్ (flap) గట్టిగా/దృడంగా మూసుకోదు మరియు ఫ్లాపీగా (ఆడుతూ) ఉంటుంది
 • స్టెనోసిస్ (Stenosis): రక్త ప్రవాహాన్ని అడ్డుకునేలా వాల్వ్ చిన్నగా/ఇరుకుగా మారుతుంది

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

వాల్యులర్ గుండె జబ్బు యొక్క ప్రారంభ దశలలో, ఏటువంటి లక్షణాలు గుర్తించబడవు. కొందరు వ్యక్తులు శారీరక కార్యకలాపాలను/పనులను చేస్తున్నప్పుడు అలసిపోతారు, అందువల్ల, వారు శ్వాస ఆడకపోవడాన్ని లేక అలసట అనుభూతిని నివారించడానికి వారి పనిని కంచెంసేపు ఆపుతారు. సాధారణంగా ఈ పరిస్థితిలో కనిపించే కొన్ని సంకేతాలు మరియు లక్షణాలు:

 • తీవ్ర అలసట, నీరసం లేదా బలహీనత యొక్క భావన
 • ఏవైనా  పనులు చెయ్యడం లేదా కొన్నిసార్లు మాములుగా  పడుకున్నప్పుడు కూడా శ్వాస అందకపోవచ్చు/ఆడకపోవచ్చు
 • చీలమండలు, అడుగులు లేదా కడుపు యొక్క వాపు
 • గుండె దడ
 • ఒక అసాధారణ హృదయ స్పందన లేదా గుండె గొణుగుడు (heart murmur)
 • ముఖ్యంగా అయోర్టిక్ లేదా మిట్రాల్ వాల్వ్ స్టెనోసిస్ ఉన్న వ్యక్తులలో, మైకము లేదా స్పృహతప్పుట

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

వాల్యులర్ గుండె వ్యాధులకు దారి తీసే ప్రధాన కారణాలు:

దీనిని  ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వాల్యులర్ గుండె వ్యాధి గుండె గొణుగుడు (heart murmur)ను కలిగిస్తుంది, ఇది ఈ వ్యాధి యొక్క అత్యంత సాధారణ సంకేతంగా ఉంటుంది మరియు దీనిని స్టెతస్కోప్ తో  పరీక్షించే సమయంలో వైద్యులు గమనించవచ్చు. మర్మర్ లేని సందర్భాల్లో, వాల్యులర్ గుండె వ్యాధి యొక్క అనుమానం ఉన్నట్లయితే, గుండె పనితీరును తనిఖీ చేయడానికి వైద్యులు ఈ క్రింది పరీక్షలను సూచించవచ్చు:

 • ఛాతీ ఎక్స్-రే
 • ఎలెక్ట్రో కార్డియోగ్రామ్ (ECG,Electrocardiogram)
 • ఎఖోకార్డియోగ్రామ్ (Echocardiogram)
 • ఒత్తిడి పరీక్ష (Stress test)
 • ఆంజియోగ్రామ్ (Angiogram)

చికిత్స పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది మరియు కొన్ని తేలికపాటి/చిన్న సందర్భాలలో చికిత్స అవసరం కూడా ఉండదు. ఈ లక్షణాలను తగ్గించేందుకు మరియు కవాటాల (వాల్వ్) ను సరిచేసేందుకు చికిత్స చేస్తారు. వివిధ చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి అవి జీవనశైలి మార్పులు, మందులు మరియు వాల్వ్ లను  సరిచేసే విధానాలు.

జీవనశైలి మార్పులు వీటిని కలిగి ఉంటాయి:

 • ఒక ఆరోగ్యకరమైన ఆహారవిధానాన్ని పాటించాలి
 • దూమపానం ఆపివేయాలి
 • అధిక శ్రమతో కూడిన క్రీడల నుండి దూరంగా ఉండాలి
 • అధిక శ్రమను నివారించాలి

క్రింది విధులు కోసం మందులు ఉన్నాయి:

 • బీటా బ్లాకర్స్, వాసోడైలేటర్స్ (vasodilators), ఏసిఇ ఇన్హిబిటార్స్ (ACE inhibitors) ను  ఉపయోగించి రక్తపోటును మరియు హృదయ స్పందనను నిర్వహించడం
 • బ్లడ్ థిన్నర్స్ (blood thinners) ను ఉపయోగించి రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడం
 • డైయూరిటిక్స్ (diuretics) వాడకం ద్వారా శరీరం నుండి అదనపు ద్రవాన్ని తొలగించడం
 • యాంటీ- అర్థిమిక్ (anti-arrhythmic) మందులు ఉపయోగించి గుండె యొక్క లయ నిర్వహించడం

దెబ్బతిన్న లేదా గాయపడిన వాల్వ్ ల చికిత్సకు ఉపయోగించే పద్ధతులు:

 • వ్యక్తి వ్యాధి యొక్క తీవ్రత, వయస్సు, మరియు ఇతర కోమోర్బిడిటీల (comorbidities) ఆధారంగా కొంత మంది వ్యక్తులలో వాల్వ్ రిపేర్ దానిని వాల్వ్ రెప్లసిమెంట్ అని కూడా పిలుస్తారు అనే విధానం సలహా ఇవ్వబడుతుంది.వనరులు

 1. American College of Cardiology. Understanding Heart Valve Disease Washington [Internet]
 2. American College of Cardiology. Valvular Heart Disease Washington [Internet]
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Heart Valve Diseases
 4. Kameswari Maganti et al. Valvular Heart Disease: Diagnosis and Management . Mayo Clin Proc. 2010 May; 85(5): 483–500. PMID: 20435842
 5. Cleveland Clinic. [Internet]. Cleveland, Ohio. Valve Disease Types