విటమిన్ బి9 లోపం - Vitamin B9 deficiency in Telugu

Dr. Anurag Shahi (AIIMS)MBBS,MD

January 15, 2019

March 06, 2020

విటమిన్ బి9 లోపం
విటమిన్ బి9 లోపం

విటమిన్ బి9 లోపం అంటే ఏమిటి?

విటమిన్ బి9 ని ఫోలిక్ ఆమ్లం లేదా ఫోలేట్ అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగిపోయే విటమిన్, అంటే దీన్ని శరీరంలో నిల్వ చేయలేము మరియు ఆహారంద్వారా రోజువారీగా ఫోలిక్ ఆమ్లం సరఫరా అవసరమవుతుంది. హెమోగ్లోబిన్ కలిగి ఉన్న ఎర్ర రక్త కణాలు (RBCs) ఉత్పత్తి చేయడానికి విటమిన్ బి9 చాలా అవసరం మరియు విటమిన్ బి9, DNA (డియోక్సిరిబోనక్యులిక్ యాసిడ్)ని మరమ్మత్తు చేస్తుంది. విటమిన్ బి9 యొక్క లోపం మెగాలోబ్లాస్టిక్ అనీమియాకు దారితీస్తుంది మరియు, ముఖ్యంగా, ఇది గర్భధారణ సమయంలో సంభవిస్తే ప్రమాదకరమైంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

విటమిన్ బి9 లోపం యొక్క ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

బలహీనమైన ఆహారం తీసుకోవడం ఫోలేట్ లోపాలకు దారితీస్తుంది. ఉదరకుహర వ్యాధి (coeliac disease) వంటి అపశోషణ (మాలాబ్జర్పషన్) పేగు వ్యాధులు ఆహారం నుండి ఫోలేట్ యొక్క శోషణను రక్తంలోకి పోకుండా నిరోధిస్తాయి. దీర్ఘకాలం పాటు గుండెపోటుతో పాటు, దీర్ఘకాలిక కాలంగా మూత్రపిండ వైఫల్యానికి ఉపయోగించే డయాలిసిస్ మరియు కాలేయ నష్టం కూడా ఫోలేట్ లోపానికి దారి తీయవచ్చు. మెథోట్రెక్సేట్, సల్ఫేసలజైన్ మరియు మూర్ఛలను నియంత్రించడానికి తీసుకోబడిన మందులు కూడా విటమిన్ బి9 లోపానికి దారితీస్తుంది.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

రుగ్మత నిర్ధారణకు వైద్యుడు లక్షణాల యొక్క సరైన చరిత్ర మరియు కొన్ని ప్రయోగశాల పరిశోధనలు చేయించమని సలహా ఇస్తారు. పూర్తి రక్త గణన (complete blood count) పరీక్షను పోషకాహారలోపానికి గురైన రోగుల్లో రక్తహీనతను గుర్తించేందుకు సూచించబడుతుంది. విటమిన్ బి9 లోపం మెగ్లోబ్లాస్టిక్ అనీమియాకు కారణమవుతుంది, దీనిలో RBC లు సాధారణ కంటే పెద్దవిగాను మరియు అపరిపక్వమైనవిగా ఉంటాయి. రక్తంలో తక్కువ విటమిన్ బి9 స్థాయిలు విటమిన్ బి9 లోపాన్ని సూచిస్తాయి. ఇతర ఔషధాల ద్వారా విటమిన్ బి9 యొక్క అపశోషణాన్ని (మాలాబ్జర్పషన్ను) తోసిపుచ్చడానికి వైద్యుడు ఔషధాలసేవన చరిత్రను వ్యక్తి పొందవచ్చు.

చికిత్స సాధారణంగా విటమిన్ B9 మందులు తీసుకోవడాన్ని కలిగి ఉంటుంది. ఓవర్ ది కౌంటర్ విటమిన్ B9 మాత్రలు అందుబాటులో ఉన్నాయి. గుడ్లు, షెల్ఫిష్ (చేపలు), బీట్రూట్, కాయధాన్యాలు, బఠానీలు మరియు ఆకుకూరల వంటివి విటమిన్ B9 సంపన్న ఆహారాలు, ఇవి మొత్తం ఆరోగ్యానికి మంచివివనరులు

  1. Guilland JC,Aimone-Gastin I. Vitamin B9. Rev Prat. 2013 Oct;63(8):1079, 1081-4. PMID: 24298825
  2. Malouf M,Grimley EJ,Areosa SA. Folic acid with or without vitamin B12 for cognition and dementia. Cochrane Database Syst Rev. 2003;(4):CD004514. PMID: 14584018
  3. Sobczyńska-Malefora A,Harrington DJ. Laboratory assessment of folate (vitamin B9) status. J Clin Pathol. 2018 Nov;71(11):949-956. PMID: 30228213
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Vitamin B9 benefits.
  5. National Health Service [Internet]. UK; Vitamin B12 or folate deficiency anaemia.

విటమిన్ బి9 లోపం వైద్యులు

Dr. Narayanan N K Dr. Narayanan N K Endocrinology
16 वर्षों का अनुभव
Dr. Tanmay Bharani Dr. Tanmay Bharani Endocrinology
15 वर्षों का अनुभव
Dr. Sunil Kumar Mishra Dr. Sunil Kumar Mishra Endocrinology
23 वर्षों का अनुभव
Dr. Parjeet Kaur Dr. Parjeet Kaur Endocrinology
19 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు