myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

పట్టుపురుగుచెట్టు పండ్లను లేదా మల్బరీ చెట్టు పండ్లను సాధారణంగా “మోరస్” అని పిలుస్తారు, ఇది మొరాసి కుటుంబానికి చెందినది. ఈ మొక్క అడవిలో పెరుగుతుంది, కానీ దాని వివిధ ప్రయోజనాల కోసం విస్తృతంగా సాగు చేస్తున్నారిపుడు. భారతదేశంలోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో మల్బెర్రీ చెట్లను (రేషం చెట్లు) పట్టుపురుగుల మేత కోసం పండించడం జరుగుతోంది. ముడి పట్టును ఉత్పత్తి చేసే పట్టుపురుగుల పెంపకానికి ఉపయోగపడే మల్బరీచెట్లు సాధారణంగా తెలుపు, ఎరుపు మరియు నలుపు రంగులలో కనిపిస్తాయి. ఐరోపా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా మరియు భారత ఉపఖండంలో మల్బరీ పండ్ల వాడకం విస్తృతంగా ఉంది. మల్బరీలు గ్రీస్‌లో కూడా విస్తృతంగా వ్యాపించాయి, ముఖ్యంగా మధ్య యుగాలలో ‘మోరియా’ అని పిలువబడే పెలోపొన్నీస్‌లో, దీని నుండి ‘మోరస్’ అనే పదం ఉద్భవించింది.

సంప్రదాయకంగా గ్రీస్‌లో, మల్బరీలను వారి జ్ఞానదేవత మినర్వాకు అంకితం చేశారు. సంప్రదాయ చైనా మూలికావైద్యం మందుల్లో గుండె జబ్బులు, మధుమేహం, రక్తహీనత మరియు ఆర్థరైటిస్ చికిత్సకు మల్బరీలను శతాబ్దాలుగా ఉపయోగించారు. ఇది జానపద ఔషధాల్లో కూడా విస్తృతంగా ఉపయోగిస్తూ వస్తున్నారు, ముఖ్యంగా తామర చికిత్స కోసం. ఆయుర్వేదంలో, మూత్ర సంక్రమణ, పేగు పురుగు బారిన పడటం మరియు చర్మ వ్యాధుల చికిత్స కోసం మల్బరీలను ఉపయోగించారు.

చారిత్రకంగా, మల్బెర్రీ పట్టు పరిశ్రమ అభివృద్ధితో ముడిపడి ఉంది. ఓరియంట్ ప్రాంతంగా పిలువబడే ఆసియా దేశాల్లో మల్బెర్రీ ఆకుల్ని పట్టు పురుగుల్ని (రేషం పురుగులని వీటిని పిలుస్తారు) బాగా లావుగా పెంచడానికి మేతగా ఉపయోగిస్తారు. ఈ పురుగులు ఉత్పత్తి చేసే పట్టు గూళ్ళను ఉపయోగించి పట్టు పోగుల్నిలేదా పట్టుదారాలను తయారుచేసి పట్టు చీరలు, తదితర వస్త్రాలను నేస్తారు. ప్రపంచవ్యాప్తంగా మల్బెర్రీ చెట్ల పంట వ్యాపించిందీ అంటే అది పట్టు పురుగుల పరిశ్రమ కారణంగానే. పట్టుపురుగుల మేతకోసం మల్బెర్రీ చెట్లను విశ్వవ్యాప్తంగా సాగు చేస్తున్నారు.   

మల్బెర్రీ చెట్టు చిన్నదిగా ఉన్నపుడు, అంటే నాటిన సమయంలో, వేగంగా పెరుగుతుంది, 10 నుండి 15 మీటర్ల వరకూ పెరుగుతుంది, కానీ  ఆ తర్వాత పెరగడం మానేస్తుంది. మల్బరీ అసంఖ్యాకమైన పండ్లను గుత్తులు గుత్తులుగా కలిగి ఉంటుంది, సాధారణంగా పండ్లు చిన్నవిగా ఉన్నపుడు ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉండి, పండ్లుగా మాగినపుడు ఎరుపు, నలుపు లేదా తెలుపు రంగులోకి వాటి వాటి  జాతులను బట్టి మారుతాయి. పండిన మల్బెర్రీ పండ్లు తీపి రుచిని కల్గి ఉంటాయి.

మల్బరీ (షాహూట్) గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు

 • వృక్షశాస్త్ర నామం (బొటానికల్ పేరు): మోరస్ ఆల్బా (Morus alba)
 • కుటుంబం: మొరాసి (Moraceae)
 • సాధారణ పేరు: మోరస్, మల్బరీ, పట్టుపురుగుచెట్టు పండ్లు, రేషంచెట్టుపండ్లు
 • సంస్కృత నామం: షాహూత్
 • ఉపయోగించే భాగాలు: పండ్లు, ఆకులు, బెరడు
 • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: ఉపఉష్ణమండల మరియు సమశీతోష్ణ ప్రాంతాలకు స్థానికం
 1. మల్బరీ యొక్క పోషక విలువ - Nutritional value of mulberry in Telugu
 2. మల్బరీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of mulberry in Telugu
 3. మల్బరీ యొక్క ఇతర ప్రయోజనాలు - Other benefits of mulberry in Telugu
 4. మల్బరీ యొక్క దుష్ప్రభావాలు - Side effects of mulberry in Telugu

పోషకాలు 

100 గ్రాములకు (mgలో)

శక్తి 

43 కిలోకేలరీలు 

నీరు

87.68

కార్భోహైడ్రేట్

9.80

ప్రోటీన్

1.44

ఫ్యాట్స్ (టోటల్ లిపిడ్స్)

0.39

ఫైబర్స్

1.7

చెక్కెర

8.1

విటమిన్లు 

విటమిన్ ఏ 

1

విటమిన్ బి1

0.029

విటమిన్ బి2

0.101

విటమిన్ బి3

0.620

విటమిన్ బి6

0.050

విటమిన్ బి9

0.006

విటమిన్ సి

36.4

విటమిన్ ఇ

0.87

మినరల్స్ 

పొటాషియం 

194

కాల్షియం

39

మేగ్నిషియం

18

ఫాస్ఫరస్

38

సోడియం

10

ఐరన్

1.85

జింక్ 

0.12

ఫ్యాట్స్ 

సాచురేటెడ్ 

0.027

మోనో అన్సాచురేటెడ్

0.041

పోలీ అన్సాచురేటెడ్

0.207

మల్బరీలు వివిధ రకాలైన ఔషధాలలో వాడటానికి ప్రసిద్ది చెందాయి, ఎందుకంటే వాటిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. మల్బరీ యొక్క వివిధ ఆరోగ్య ప్రయోజనాలు క్రింద చర్చించబడ్డాయి.

 • రక్తపోటుకు: మల్బరీలలో రెస్వెరట్రాల్ అనే యాంటీయాక్సిడెంట్ అధికంగా ఉండడం వల్ల అవి రక్తపోటును  తగ్గించడంలో సహాయం చేస్తాయి. అంతేకాక రెస్వెరట్రాల్ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది అది ఒక వేసోడైలేటర్ గా పని చేసిన రక్త నాళాలను సడలించేలా చేస్తుంది.
 • గుండెకు: పరిశోధనలు మల్బరీ  పళ్లకు హైపోలిపిడెమిక్ ఎఫెక్ట్ ఉంటుందని తెలిపాయి. వాటిలో ఉండే ఆహార ఫైబర్ మరియు లినోలెయిక్ ఆసిడ్లు హైపోలిపిడెమిక్ చర్యకు బాధ్యత వహిస్తాయి అవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
 • మధుమేహం కోసం:  మల్బరీ పళ్ళు రక్త గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాక మల్బరీ పళ్ళ వినియోగం ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది కొన్ని అధ్యయనాలు తెలిపాయి. వీటిలో ఉండే సూపర్ ఆక్సైడ్ డిస్మ్యుటెస్, కేటలెస్ వంటివి ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చేసి మధుమేహాన్ని తాగించడంలో పాత్ర పోషిస్తాయి.
 • కళ్ళకు: మల్బరీ పళ్ళ వినియోగం కంటి ఆరోగ్యానికి మంచిది, వీటిలో జీయజాన్థిన్ అనే కెరాటినోయిడ్ ఉంటుంది. ఇది రెటీనా నష్టాన్ని, కంటిశుక్లాలు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
 • రోగనిరోధక శక్తికి: మల్బరీ పళ్లలో ఉండే ఆల్కలాయిడ్ల ద్వారా మాక్రోఫేజ్ కణాలను ప్రేరేపించి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే మల్బరీలలో విటమిన్ సి కూడా ఉంటుంది ఈ విటమిన్ శరీరంలోని బయటి వ్యాధికారక సుక్ష్మజీవులపై పోరాడుతుంది.
 • కాలేయం కోసం: మల్బరీ పళ్లలో కాల్షియం మరియు ఐరన్ అధికంగా ఉంటాయి, ఇవి ఎముక కణజాలు బలంగా ఏర్పడడానికి సహాయపడతాయి.అలాగే ఆస్టియోపోరోసిస్ మరియు ఆర్థరైటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
 • క్యాన్సర్ కోసం: మల్బరీలో ఉండే అంతోసియానిన్లు వివిధ క్యాన్సర్ల నివారణకు సహాయం చేస్తాయి. మల్బరీ చెట్టు వేర్ల సారం  మానవ కోలొరెక్టల్ క్యాన్సర్ కణాల పెరుగుదల తగ్గిచాయని మరియు క్యాన్సర్ కణాల మరణనాన్ని పెంచాయని తేలింది.
 • మల్బరీ పళ్ళు న్యూరోప్రొటెక్టీవ్ చర్యలను కలిగి ఉంటాయి అందువల్ల మెదడు సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో విటమిన్ ఏ మరియు ఇ మరియు ల్యూటిన్, బీటా-కెరోటిన్ వంటి కెరోటినాయిడ్ భాగాలూ ఉంటాయి అవి చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
 1. మల్బెరీపండ్లు ఆరోగ్య ప్రయోజనాలను కల్గిస్తుంది, దీనితో పాటుగా, పట్టు పరిశ్రమకు మల్బరీ యొక్క ప్రాముఖ్యత దృష్ట్యా మల్బరీని విస్తృతంగా పండిస్తున్నారు. మల్బరీ ఆకులు, ముఖ్యంగా పర్యావరణపరంగా ముఖ్యమైన తెలుపు మల్బరీ రకానికి చెందినవాటిని, పట్టు పురుగు యొక్క ఏకైక ఆహార వనరుగా ఉపయోగిస్తారు. మోరస్ జాతికి చెందిన పురుగుకు బాంబిక్స్ మోరి అని పేరు పెట్టారు. అడవి పట్టు పురుగు మల్బరీని కూడా తింటుంది. ఈ పట్టు పురుగు ఉత్పత్తి చేసే పట్టుపోగుల గూళ్ళ (cocoons)ను పట్టు వస్త్రాల తయారీకి ఉపయోగిస్తారు.
 2. మల్బరీ పండులో ఆంథోసైనిన్స్ ఉండటం వల్ల దానికి ఆ రంగు వచ్చింది, మల్బరీపండ్లు వివిధ వ్యాధులను నివారించడంలో తన ప్రభావం చూపుతుంది. ఈ పండు యొక్క స్పష్టమైన రంగులకు ఆంథోసైనిన్లు కారణమవుతాయి. ఈ రంగులను తేలికగా తీయవచ్చు మరియు నీటిలో బాగా కరుగుతాయివి. అందుకే మల్బెరీ పండ్లు సహజ ఆహార రంగులనిస్తాయి. సహజ ఆహార రంగులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, ఆహార పరిశ్రమలో మల్బరీల యొక్క ప్రాముఖ్యత పెరుగుతోంది.

మల్బరీ యొక్క దుష్ప్రభావాలు క్రింద చర్చించబడ్డాయి.

 • మోరస్ ఆల్బా గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది, కాబట్టి, డయాబెటిస్ మందులతో కలిపి ఉపయోగిస్తే, హైపోగ్లైసీమియా (తక్కువ రక్తంలో చక్కెర) ప్రమాదాన్ని పెంచుతుంది.
 • మల్బరీస్ యొక్క పొటాషియం భాగం మూత్రపిండ లోపాలతో బాధపడుతున్నవారిలో సమస్యలను కలిగిస్తుంది.
 • కొంతమంది మల్బరీలకు అలెర్జీ ప్రతిచర్యను అనుభవించవచ్చు. క్రాస్ రియాక్టివిటీ కారణంగా బిర్చ్ పుప్పొడికి సున్నితంగా ఉండేవారిలో ప్రతిచర్యలు వచ్చినట్లు కూడా ఉన్నాయి. మీరు ఏదైనా రకమైన దుష్ప్రభావాలను అనుభవిస్తే, వాడకాన్ని నిలిపివేసి, మీ వైద్యుడితో మాట్లాడటం మంచిది.
 • మోరస్ ఆల్బా మార్పిడి రోగులలో ఉపయోగించే సైక్లోస్పోరిన్ అనే of షధం యొక్క శోషణ మరియు రక్త సాంద్రత తగ్గడానికి దారితీస్తుంది. ఇటీవల కాలేయం లేదా మూత్రపిండ మార్పిడి చేయించుకున్న రోగులు మల్బరీలను తినడం మానేయాలి.
 • కొంతమంది మల్బరీలను తిన్న తర్వాత భ్రాంతులు అనుభవించవచ్చు.
 • గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులపై మల్బరీల ప్రభావం గురించి డాక్యుమెంట్ నివేదికలు లేవు. అందువల్ల, మల్బరీలను సేవించే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
और पढ़ें ...

References

 1. Hongxia Zhang et al. Effects of Mulberry Fruit (Morus alba L.) Consumption on Health Outcomes: A Mini-Review . Antioxidants (Basel). 2018 May; 7(5): 69. PMID: 29883416
 2. Thanchanit Thaipitakwong, Surawej Numhom, Pornanong Aramwit. Mulberry leaves and their potential effects against cardiometabolic risks: a review of chemical compositions, biological properties and clinical efficacy. Pharm Biol. 2018; 56(1): 109–118. PMID: 29347857
 3. Ewelina Król et al. The Effects of Supplementary Mulberry Leaf (Morus alba) Extracts on the Trace Element Status (Fe, Zn and Cu) in Relation to Diabetes Management and Antioxidant Indices in Diabetic Rats . Biol Trace Elem Res. 2016; 174(1): 158–165. PMID: 27071614
 4. Yihai Wang et al. Antidiabetic and Antioxidant Effects and Phytochemicals of Mulberry Fruit (Morus alba L.) Polyphenol Enhanced Extract . PLoS One. 2013; 8(7): e71144. PMID: 23936259
 5. Qi Ge et al. Mulberry Leaf Regulates Differentially Expressed Genes in Diabetic Mice Liver Based on RNA-Seq Analysis . Front Physiol. 2018; 9: 1051. PMID: 30131712
 6. Hu Chen et al. Anti-Inflammatory and Antinociceptive Properties of Flavonoids from the Fruits of Black Mulberry (Morus nigra L.) . PLoS One. 2016; 11(4): e0153080. PMID: 27046026
 7. Shu Wang et al. An Efficient Preparation of Mulberroside A from the Branch Bark of Mulberry and Its Effect on the Inhibition of Tyrosinase Activity . PLoS One. 2014; 9(10): e109396. PMID: 25299075
 8. Muhammad Ali Khan et al. A comparative study on the antioxidant activity of methanolic extracts from different parts of Morus alba L. (Moraceae) . BMC Res Notes. 2013; 6: 24. PMID: 23331970
 9. Mark Lown et al. Mulberry-extract improves glucose tolerance and decreases insulin concentrations in normoglycaemic adults: Results of a randomised double-blind placebo-controlled study. PLoS One. 2017; 12(2): e0172239. PMID: 28225835