myUpchar Call

సంభోగం లేదా లైంగిక సంపర్కం అనేది మగ మరియు ఆడవారి మధ్య జరిగే ప్రేమకలాపాల ఓ కార్యాచరణ రూపం. మీ శరీరానికి ఎంత మటుకు సంభోగం కావాలి లేదా ఎంత మొత్తం సంభోగం కావాలి అనేదానికి నిర్దిష్టమైన కొలబద్ద లేనప్పటికీ, సంభోగంవల్ల  ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు ఉన్నాయి. తీవ్రమైన శారీరక శ్రమతో కూడిన సంభోగం బరువు కోల్పోవడానికి తోడ్పడవచ్చని మీకు తెలుసా? లేదా ఆ సంభోగమే మీకు మరియు మీ భాగస్వామికి ఒత్తిడిని మటుమాయంచేసే సాధకంగా (stress buster) పనిచేస్తుందని తెలుసా? అయితే, సంభోగం మూత్ర వ్యవస్థలో నొప్పి, అసౌకర్యం లేదా తేలికపాటి ఆటంకాల్ని కూడా కలుగజేయవచ్చు. అసురక్షితమైన సంభోగం చేశారంటే అది తీవ్రమైన నష్టాలను కలుగజేస్తుంది. సంభోగం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు క్రింద చర్చించబడ్డాయి.

  1. సంభోగం అంటే ఏమిటి? - What is sex? in Telugu
  2. సంభోగం యొక్క ప్రయోజనాలు - Benefits of sex in Telugu
  3. సంభోగం యొక్క దుష్ప్రభావాలు - Side-effects of sex in Telugu
సంభోగం అంటే ఏమిటి: ఆరోగ్యప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు వైద్యులు

సంభోగం అంటే పురుషుడు తన నిటారైన (నిక్కిన) పురుషాంగాన్ని స్త్రీ యొక్క మర్మాంగం (యోని) లోనికి చొప్పించడమనే ప్రక్రియను ప్రధానంగా సూచిస్తుంది. ఇది స్త్రీ పురుషుల ఆనందం కోసం కావచ్చు లేదా సంతానోత్పత్తి కోసం కావచ్చు. సంభోగం అనేది ఒక సహజమైన మరియు అనివార్యమైన చర్య, ఇది వారి లైంగిక ప్రాధాన్యతలను బట్టి వివిధ జంటలకు భిన్నంగా ఉండవచ్చు. అంతేకాకుండా, సంభోగం ఎల్లప్పుడూ ఒక జంట మధ్యనే ఉండవలసిన అవసరం లేదు మరియు సంభోగ ప్రక్రియలో బహుళ భాగస్వాముల యొక్క ప్రమేయం ఉండవచ్చు.

యోని సంభోగాన్నే ప్రధానంగా ‘సంభోగం’గా ప్రస్తావించబడింది మరియు ఈ వ్యాసంలో దీనిగురించి ఎక్కువ వివరాలు చర్చించబడుతున్నప్పటికీ, దీని గురించి చాలా ఎక్కువగానే ఉంది. కొందరు దంపతులు పాయువుద్వారం లోనికి లింగాన్ని (penis) చొప్పించడాన్నిఇష్టపడడం అనేది అదో పధ్ధతి, కొన్ని జంటలు మౌఖిక (oral) సంభోగాన్ని ఇష్టపడతారు. మౌఖిక సంభోగం అంటే వ్యక్తి తన నోటి కుహరాన్ని, అనగా, నోరు, పెదవులు లేదా నాలుకను, భాగస్వామి వ్యక్తి యొక్క జననేంద్రియాలను ప్రేరేపించే చర్యను సూచిస్తుంది. ఇది ఒక సహజమైన మరియు ఆనందించదగిన చర్య. కొన్ని జంటలు ఈవిధమైన సంభోగాన్ని ఇష్టంగా చేయడం జరుగుతుంది. ఇంకొందరు సంభోగం గురించి విభిన్న భావనను కలిగి ఉండవచ్చు, అందువల్ల వారికి తనభాగస్వామి యొక్క జననాంగాన్ని తాకడం లేదా పరస్పర హస్త ప్రయోగం చేయించుకోవడాన్ని ‘సంభోగం’ గా  పరిగణించవచ్చు.

మొత్తానికి సంభోగానికి నిర్దిష్టమైన నిర్వచనం లేదు, అది జంట యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ యోని సంభోగమే అత్యంత ప్రధానమైన సంభోగరూపం.

(మరింత చదువు: సురక్షిత సంభోగాన్ని పొందడం ఎలా)

అందరిచే అడిగిన అత్యంత సాధారణ ప్రశ్నలలో ఒకటి, 'ఆరోగ్యానికి సంభోగం మంచిదేనా? ' అని. ఈ ప్రశ్నకు సమాధానం “అవును” అనేదే. సంభోగంవల్ల కలిగి ఆరోగ్య ప్రయోజనాలు క్రిందవిధంగా చర్చించబడ్డాయి.

ఒత్తిడిని తగ్గించే సంభోగం - Sex as a stressbuster in Telugu

ఒత్తిడి అనేది సంభోగంతో ప్రతికూల సంబంధాన్ని కలిగి ఉంటుంది, అనగా మీ సంభోగ భాగస్వామితో లైంగికంగా ఎంత సన్నిహితమైన మరియు సంతృప్తికరమైన సంబంధాన్ని కల్గి ఉంటే మీరు ఒత్తిడికి అంత తక్కువగా లోనవుతారు అంటే ఒత్తిడికి అంత దూరమవుతారు. సంభోగం కారణంగా శరీరంలో లైంగిక హార్మోన్ల విడుదలలో పెరుగుదల ఏర్పడుతుంది, పెరిగిన ఈ లైంగిక హార్మోన్ల కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నివేదించిన అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి.

ఒక ముఖ్యమైన పరీక్షకు హాజరయ్యేందుకు ముందు 103 మంది మహిళా అభ్యర్థులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఏమాత్రం లైంగిక సంబంధం లేని మహిళలతో పోలిస్తే తమ భాగస్వామితో సంభోగంలో బాగా పాల్గొనే మహిళల్లో ఒత్తిడి చాలా తక్కువగా ఉన్నట్లు కనుక్కోబడింది. మూడు నెలలపాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో, అభ్యర్థుల రోజువారీ ఒత్తిడి స్థాయిలు మరియు అధ్యయనంలో కనుక్కున్న అన్ని విషయాలు నమోదు చేయబడ్డాయి.

స్త్రీ పురుష అభ్యర్థులు పాల్గొన్నమరొక అధ్యయనంలో కూడా ఇలాంటి ఫలితాలే కనుక్కోబడ్డాయి. ఈ ఫలితాలు సంభోగం ఒత్తిడిని ఉపశమనం చేయడంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తుందని సూచిస్తున్నాయి, ఈ ఒత్తిడి ఉపశమనం తమ భాగస్వామితో సన్నిహితసంబంధ భావన వల్ల కావచ్చు. కాబట్టి, శరీరంలో సరైన హార్మోన్ స్థాయిలు నిర్వహించడానికి మరియు రోజువారీ ఒత్తిడిని తగ్గించేందుకు ఎలాంటి సంభోగ కార్యకలాపాల్లోనైనా పాల్గొనడం ఉపయోగకరంగా ఉంటుంది.

గుండెకు సంభోగం ప్రయోజనాలు - Benefits of sex for the heart in Telugu

మీలో కొంతమందికి తెలిసినట్లుగా, ఒత్తిడి కల్గించే ప్రభావాలు గుండెపై ప్రాణాంతక ప్రభావాలను కలిగిస్తాయి. ప్రత్యేకించి  రక్తపోటు (అధిక రక్తపోటు) మరియు ఇతర హృదయ సంబంధ రుగ్మతలకు ఒత్తిడి అపాయకారి. ఒత్తిడిని తగ్గించే స్వభావం కల్గిన సంభోగసుఖం మీ గుండె మీద సానుకూల ప్రభావాన్ని కలిగించొచ్చు. అంతేకాకుండా, ఏదైనా శారీరక శ్రమ మరియు వ్యాయామం మీ గుండె ఆరోగ్యానికి మంచిదని సూచించబడింది. సంభోగం కూడా అలాంటి వ్యాయామంతో సమానం. అయితే తీవ్రమైన శారీరక వ్యాయామాల్లో మనం అనుభవించే అలసట అనుభూతి సంభోగంలో మనకు కల్గించకుండానే అది (సంభోగం) మనకు రక్షిత పాత్ర కలిగి ఉండవచ్చు.

సరైన గుండె ఆరోగ్యానికి భౌతిక కార్యకలాపాలు మరియు క్రమబద్ధమైన వ్యాయామంతో పాటు సంభోగాన్ని కూడా కలిగి ఉండాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. లైంగిక ప్రేరేపణ అనేది హృదయ స్పందన రేటును పెంచడంలో సహాయపడుతుంది. పురుషులతో పోలిస్తే సంభోగం యొక్క మంచి ఆరోగ్య ప్రయోజనాలు మహిళలకే ఎక్కువ అని కనుక్కోబడింది. సంభోగాది లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే మహిళలకు హృదయ సంబంధ రుగ్మతలు మరియు రక్తపోటు ప్రమాదం తక్కువ అని నివేదించబడింది.

భాగస్వామి(ముల)తో కూడిన సంభోగం ముసలి ఆడవాళ్ళలో గుండె-సంబంధమైన ఆరోగ్యాన్ని ప్రోత్సహించిందని ఒక అధ్యయనం గుర్తించింది. అయితే, అదే  పురుషుల విషయంలో అది తద్విరుద్ధమని ఆ అధ్యయనం కనుక్కొంది. అందువల్ల, మీరు గుండెసంబంధ రుగ్మతలతో బాధపడుతున్నట్లైతే సంభోగంలో పాల్గొంటున్నపుడు  జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయమై మీ గుండె చికిత్సా నిపుణుడ్ని(కార్డియాలజిస్ట్ను) ముందుగానే సంప్రదించడం ఉత్తమం.

(మరింత చదువు: గుండెపోటు నిర్వహణ)

బరువు కోల్పోవడానికి సంభోగం - Sex for weight loss in Telugu

సంభోగం అనేది ఒక తీవ్రమైన భౌతిక వ్యాయామం. మీరు దీన్ని నమ్మట్లేదా? సంభోగం ఓ మంచి వ్యాయామం అన్నదాన్ని సమర్థించేందుకు తగినంతగా పరిశోధనాపరమైన  రుజువుంది. 21 జంటలపై (heterosexual) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, సంభోగ కార్యకలాపాల్ని ఓ మోస్తరు తీవ్రతలో జరిపినపుడు సుమారు 85 కిలో కేలరీలను దహించినట్లు ధృవీకరించబడింది. ఈ లెక్కన, సగటున నిముషానికి 3.6 కిలో కేలరీలు ఖర్చు చేయబడినట్లు నివేదించబడింది.

భౌతిక వ్యాయామే కాకుండా, సంభోగం కూడా ఒక శక్తివంతమైన ఒత్తిడి-ఉపశమనకారి మరియు హార్మోన్ నియంత్రకం. ఒత్తిడి మరియు హార్మోన్ల అసమతుల్యం గణనీయంగా బరువు పెరుగుటతో సంబంధం కలిగి ఉన్నాయని గుర్తించబడింది, కాబట్టి, ఈ కారకాలను నిర్వహించడం ద్వారా, సంభోగం కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

(మరింత చదువు: బరువు నష్టం ఆహారం పట్టిక)

సంభోగం మీ సంతానోత్పత్తి శక్తిని పెంచుతుంది - Sex boosts your fertility in Telugu

సంభోగం సంతానోత్పత్తి శక్తిని పెంచుతుందన్న వాస్తవంలో ఎటువంటి ఆశ్చర్యకరమైన సంగతీ లేదు; మీ లైంగిక హార్మోన్లను నియంత్రణలో ఉంచడం అనేది సంతానోత్పత్తి శక్తివల్లనే జరుగుతుంది, అధిక స్థాయి లైంగిక కార్యకలాపాలు మంచి సంతానోత్పత్తితో సంబంధాన్నికల్గి ఉంటాయి, దీన్నికాదనలేం కూడా. తరచుగా సంభోగం చేసే పురుషులు, అనగా, కనీసం వారానికోసారి సంభోగంలో పాల్గొనేవారు, అలా తరచుగా సంభోగంలో పాల్గొనని పురుషుల కంటే మెరుగైన వీర్యపరమైన ఆరోగ్యాన్ని కల్గి  ఉంటారు. అందుకే, నిపుణులు ఏం చెబుతారంటే, గర్భం ధరించాలంటే, తరచుగా సంభోగంలో పాల్గొనాలని సిఫారసు చేస్తుంటారు, కేవలం స్త్రీలలో అండోత్పత్తి (గుడ్డు విడుదలయ్యే కాలం) కాలంలో మాత్రమే సంభోగం జరపడం కాకుండా మిగతా సమయాల్లో కూడా తరచుగా సంభోగంలో పాల్గొనాలని నిపుణులు సిఫారసు చేస్తారు. ఇలా చేయడంవల్ల గర్భం వచ్చే అవకాశాలను పెంచుతుంది.

(మరింత చదువు: గర్భాన్ని పొందడం ఎలా?)

మహిళల ఆరోగ్యానికి సంభోగం ప్రయోజనాలు - Sex benefits for women's health in Telugu

సంభోగంవల్ల చాలా విస్తారమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి, లైంగిక హార్మోన్లలో వ్యత్యాసం కారణంగా, పురుషులు మరియు మహిళల్లో సంభోగం యొక్క ప్రయోజనాలు భిన్నంగా ఉండవచ్చు. సంభోగం మహిళల్లోఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయిని పెంచుతుంది, వారి సంతానోత్పత్తిశక్తిని కూడా పెంచుతుంది.

(మరింత చదువు: లైంగిక వాంఛను పెంచే ఆహారాలు)

ఈస్ట్రోజెన్ హార్మోన్లు స్త్రీలలో ఉండే లైంగిక హార్మోన్‌లు, ఇవి స్త్రీలలో సంతానోత్పత్తిశక్తిలో పాత్ర కాకుండా, స్త్రీలలో అనేక ఇతర విధుల్ని నిర్వహిస్తాయి. మహిళల్లో రొమ్ము కణజాల పెరుగుదలకు ఈస్ట్రోజెన్ హార్మోన్లు ముఖ్యమైనవి, మహిళలకు రొమ్ము కణజాలం చాలా ముఖ్యం, ముఖ్యంగా, చనుబాలిచ్ఛే చంటిపిల్లల తల్లులకు ఈస్ట్రోజన్లు బహు ముఖ్యం. ఈస్ట్రోజెన్ హార్మోన్లు యోని సరళతను తన జారుడుగుణం (lubricant)తో మెరుగుపరుస్తుంది, ఇది యోని ఎండిపోకుండా కందెనలా రాపిడిని తగ్గించి పొడిదనాన్ని నివారించడంలో సహాయపడుతుంది. యోని పొడిబారిపొయ్యే రుగ్మతవల్ల యోని నొప్పి మరియు యోని అంటురోగాలు సంభవిస్తాయి, కాబట్టి యోని పొడిబారడం అనేది యోనిలో నొప్పి, అంటురోగాలకు ఓ ముఖ్యమైన ప్రమాద కారకంగా గుర్తించబడింది. యోని ఈస్ట్ సంక్రమణ సంభావ్యత ముఖ్యంగా పెరిగింది.

స్త్రీలపై నిర్వహించిన అధ్యయనంలో తేలిందేమంటే సంభోగక్రియ తక్కువగా ఉన్న మహిళల్లో మైథున సమయంలో నొప్పి (లేదా బాధాకరమైన సంభోగం) మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది యోనియొక్క పొడిదనం కారణంగా కూడా కావచ్చు. కాబట్టి, ఈ స్త్రీలలో యోనిసంబంధమైన ఈ రుగ్మతలన్నింటికీ ఆనందంగా సంభోగంలో పాల్గొనడమే ఓ మంచి పరిష్కారం మరియు రక్షణచర్య కావచ్చని చెప్పడం జెరిగింది.  

యోనిలో నొప్పి మరియు పొడిదనాన్ని తగ్గించడానికి, ఒక తేలికపాటి కందెన (lubricant) వాడకాన్ని ఈ మహిళలకు సూచించవచ్చు. అంతేకాక, మహిళలకు సంభోగం చాలా ముఖ్యం, అంతే ముఖ్యంగా  మహిళల్లో యోనిసరళతని నిర్వహించడానికి సంభోగానికి ముందు వారిలో సంభోగప్రేరణ (foreplay) కల్గించడం చాలా అవసరం, కాబట్టి ఈ సంభోగప్రేరణను భాగస్వామి సమర్ధవంతంగా నిర్వహించాలి.

ముట్లుడిగిన (మెనోపాజ్) తర్వాత మహిళల్లో యోని పొడిబారడం  మరియు క్షీణత ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, అందుచే ఆడవారు సంభోగానికి దూరంగా ఉండరాదు. కాబట్టి యోని క్షీణత (వయస్సు పైబడ్డ మహిళలు లేక ముట్లుడిగినవాళ్లలో యోని కణజాలం సన్నబడి పోవడం) ను ఎదుర్కొనేందుకు ముట్లు ఆగిపోయిన (ఋతుక్రమం ఆగిన) మహిళలకు యోని సరళతను నిర్వహించేందుకు క్రీములవంటి ‘యోని ఈస్ట్రోజెన్’ (topical or vaginal estrogen)లను వైద్యులు సిఫార్సు చేస్తారు.

సంభోగంవల్ల మహిళలకు కలిగే గుండె సంబంధ రక్షణచర్యలు (కార్డియోప్రొటెక్టివ్ చర్యలు) ఇప్పటికే చర్చించబడ్డాయి. కాబట్టి మహిళలకిది ముట్లుడిగిన తర్వాత (మెనోపాజ్) కూడా సంభోగ  కార్యకలాపాల్లో మునిగిపోవడానికి తగినంత కారణాన్ని మరియు ఆవశ్యకతను తెలియజేస్తుంది. మరొక అత్యంత ఆశ్యర్యదాయకమైన విషయమేమంటే సంభోగంవల్ల చర్మం యొక్క రూపులో మెరుపు (glow) వస్తుంది. ఒత్తిడిని తొలగించి, ఆనందాన్ని కల్గించడంలో సంభోగం పాత్ర అమోఘంగా ఉన్నందున వయస్సు మీరుతున్న గుర్తులు కనిపించకుండా ఉండేందుకు సంభోగం దోహదపడవచ్చు .

సాధారణంగా, ఒత్తిడి ముఖంపైన, ఇతర శరీరభాగాలపై వచ్చే గీతలు (fine lines) మరియు ముడుతలతో సంబంధం కలిగి ఉంటుంది మరియు వారి సంభోగంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఒత్తిడి ఉపశమనం మరియు ఆనందం కల్గించడంలో సంభోగానికి ఉన్న పాత్ర కారణంగా వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో కూడా సంభోగం  సహాయపడుతుంది.

మరో సిద్ధాంతం ప్రకారం, సంభోగం ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచడంలో  సహాయపడుతుంది. ఈ ఈస్ట్రోజెన్ స్థాయిలు చర్మం యొక్క స్థితిస్థాపకత (elasticity) ను నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. చర్మం యొక్క స్థితిస్థాపకతే ముడుతలను తగ్గిస్తుంది. సిద్ధాంతం ఏది అయినా, మీ చర్మం రూపలావణ్యాదుల్ని మెరుగుపర్చడంలో సంభోగం యొక్క పాత్ర ఉండగలదని గమనించడం ముఖ్యం.

ఇది కాకుండా, సంభోగం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా అవకాశం ఉంది. జంతువుల నమూనాలపై జరిపిన కొన్ని అధ్యయనాలు కూడా సంభోగం మహిళల్లో  జాగరూకతను పెంచుతుందని తెలుపగా, మరికొన్ని అధ్యయనాలు ఏ నిర్దిష్ట సంబంధాన్ని బయటపెట్టలేదు. ఈ విషయంలో మరిన్ని అధ్యయనాల అవసరం ఉంది.

పురుషులకు సంభోగంవల్ల ప్రయోజనాలు - Sex benefits for men in Telugu

మనం చూసినట్లుగా, సంభోగంవల్ల మహిళలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అయితే సంభోగంవల్ల పురుషులకెలాంటి ఉపయోగం ఉంది? పురుషులకు సంభోగంవల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ చర్చిస్తున్నాం. తరచుగా సంభోగంలో పాల్గొనడంవల్ల స్త్రీలలో లాగే పురుషుల్లో కూడా సంతానోత్పత్తిశక్తి పెరుగుతుంది, సంభోగం మగవారిలో వీర్యం యొక్క నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని పెంచుతుంది, ఇది లైంగిక ఆరోగ్యానికి మరియు పురుషుల పనితీరుకు చాలా అవసరం. సంభోగం పురుషులలో కండర ద్రవ్యరాశిని మెరుగుపరచడంలో తనవంతు పాత్రను కల్గి ఉండవచ్చని ఊహిస్తున్నారు. .

(మరింత చదువు: టెస్టోస్టెరాన్ స్థాయిల బలవర్థకానికి గృహ చిట్కాలు)

ఎక్కువ మంది లైంగిక వాంఛలు కలిగి ఉన్న స్త్రీలు పురుషులలో సుదీర్ఘమైన యువతకు దారి తీయవచ్చు, ఇది వారి చర్మ ఆరోగ్యం మరియు శక్తి యొక్క శక్తిలో ప్రతిబింబిస్తుంది. కొన్ని అధ్యయనాలు పురుషులలో నిద్ర చక్రాన్ని క్రమబద్దీకరించడంలో సంభోగం సహాయపడుతుందని సూచించాయి, ఇది వాటిని నిద్రలో బలపరుస్తుంది. ఇది ఒక ఉద్వేగం తర్వాత విడుదలయ్యే హార్మోన్ల వల్ల కావచ్చు, ఇది వాటిని సులభంగా ఉంచుతుంది మరియు నిద్రావస్థకు సహాయపడుతుంది.

(మరింత చదువు: నిద్రలేమి నిర్వహణ)

ఇది కాకుండా, అనేక అధ్యయనాలు పేర్కొనేదేమంటే పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సంభోగం తోడ్పడుతుందని. ఒక అధ్యయనం ప్రకారం, పురుషులు సంభోగంలో పాల్గొంటూ ఉంటే వారానికి మూడుసార్లు కంటే ఎక్కువసార్లు  స్ఖలనం యొక్క పౌనఃపున్యతను (freequency) పెంచడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని 15% తగ్గించవచ్చని కనుగొనబడింది.

దీన్ని, అంటే సంభోగంద్వారా మగాళ్లలోప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడాన్ని,   స్ఖలనం ప్రక్రియ ద్వారా సాధించిన ఒత్తిడి ఉపశమనానికి నిర్ధారణ చేయవచ్చు, మరియు స్ఖలనమైన వీర్యంతోబాటు కార్సినోజెనిక్ ఏజెంట్లను కూడా శరీరం బయటకు పంపిస్తుంది.  మరొక అధ్యయనం పై అధ్యయనాలు కనుగొన్నవిషయాల్ని, సూచనల్ని ధృవీకరించింది మరియు ముసలితనానికి చేరువలోఉన్నపురుషులకు కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని మూడింట ఒక వంతు తగ్గించిందని పేర్కొంది. ఈ అధ్యయనాల్లో కనుగొన్న విషయాలు సంభోగంవల్ల పురుషులకు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిర్ధారిస్తున్నాయి మరియు పురుషులు తమ భాగస్వామితో మరింత ఎక్కువగా సంభోగించేందుకు గల మరిన్ని సరైన కారణాల్ని వివరిస్తున్నాయి.

సంభోగం యొక్క ఆరోగ్య లాభాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి:

అసురక్షితమైన సంభోగం మరియు లైంగిక అంటువ్యాధుల (ఎస్.డి.డిల) ప్రమాదం

అసురక్షితమైన సంభోగం మీకు మరియు మీ భాగస్వామికి ఇద్దరికీ కూడా ఎయిడ్స్ (AIDS),  సిఫిలిస్ మరియు గోనేరియా వంటి తీవ్రమైన లైంగిక అంటువ్యాధులు (STDs) వచ్చే ప్రమాదం ఉంది.  ప్రత్యేకించి మీరు బహుళ సంభోగ భాగస్వాములను కలిగి ఉంటే, కండోమ్ పరికరాన్ని ఉపయోగించడం చాలా అవసరం  .

సంభోగం తర్వాత నొప్పి

సాధారణంగా, సంభోగం తర్వాత ఆడ-మగా ఇద్దరికీ కూడా నొప్పి అనుభవంలోకి రావచ్చు. మహిళలు యోనిలో నొప్పిని అనుభవించవచ్చు, ఆడవాళ్ళకు తొడలో కూడా నొప్పి రావచ్చు. పురుషులకు వారి శిశ్నములో తేలికపాటి నొప్పి రావచ్చు. నొప్పి తీవ్రంగా ఉంటే ఆందోళన కలిగించే విషయమే కాబట్టి మీరు వెంటనే మీ డాక్టర్ను సంప్రదించాల్సిందిగా మీకు  సిఫారసు చేయడమైంది.

సంభోగం తర్వాత వచ్చే నొప్పి కాలితిమ్మిరి (ఈడ్పు)కి కారణమవుతుంది

సంభోగం తర్వాత వచ్చే కాళ్లలో నొప్పి మరియు కాళ్ళ తిమ్మిరి (కాళ్ళ ఈడ్పులు లేదా కాళ్ళు బిగపట్టడం) స్త్రీ పురుషులిద్దరికీ కూడా సాధారణమే. అయితే, కొద్ధి సమయం తర్వాత అదే సర్దుకుని ఉపశమనం లభిస్తుంది.

మహిళల్లో సంభోగం యొక్క దుష్ప్రభావాలు - Side effects of sex in women in Telugu

మహిళలలో లైంగిక దుష్ప్రభావాలు కిందివిధంగా ఉంటాయి:

సంభోగం మహిళల్లో మూత్ర మార్గ సంక్రమణకు కారణమవుతుంది

లైంగిక కార్యకలాపాలు మహిళల్లో మూత్ర నాళాల సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంటాయి (అన్ని వయస్సుల స్త్రీలలో మూత్రవిసర్జన చేయాలన్న ప్రేరేపణను కలుగజేస్తుంది.)

సంభోగం రోగనిరోధకతను దెబ్బ తీస్తుంది

మెకానిజం  స్పష్టంగా లేనప్పటికీ, సంభోగానికి-రోగనిరోధక శక్తితో సంబంధం కలిగి ఉంటుంది, ప్రత్యేకించి కుంగుబాటుకు లోనైన మహిళల్లో సంభోగం రోగనిరోధకశక్తిని తగ్గించొచ్చు.

(మరింత చదువు:  రోగనిరోధకశక్తిని పెంచే ఆహారాలు)

మహిళల్లో సంభోగం మరియు నిద్ర

సంభోగం మహిళల్లో నిద్రలేమికి పెంచుతుందని అధ్యయనాలు సూచించాయి, అలాంటపుడు మహిళలు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే సంభోగం నిద్రలేమిని కల్గిస్తే అది వారికి సమస్యగా పరిణమిస్తుంది..

మహిళల్లో సంభోగం మరియు క్యాన్సర్

కొన్ని అధ్యయనాల్లో, మహిళల అధిక సంభోగంవల్ల సంభవించే ఈస్ట్రోజెన్ స్థాయిల పెరుగుదలను ఎండోమెట్రియల్ క్యాన్సర్ ప్రమాదానికి అనుసంధానించడం జరిగింది. కానీ ఈ అధ్యయన ఫలితాలు స్పష్టంగా లేవు, ఈ విషయమై మరిన్ని పరిశోధనలు అవసరం.

సంభోగంవల్ల పురుషులకు కలిగే దుష్ప్రభావాలు - Side effects of sex in men in Telugu

సంభోగంవల్ల పురుషులకు కలిగే దుష్ప్రభావాలు కిందివిధంగా ఉంటాయి:

సంభోగం మరియు హృదయ సంబంధ రుగ్మతలు

ఇటీవలి ఓ అధ్యయనం లైంగిక సంపర్కం గుండె వ్యాధుల ప్రమాదానికి గురిచేస్తుందని సూచించింది. వృద్ధులలోఅయితే, లైంగికంగా చురుగ్గా లేని మగాళ్ల కంటే లైంగికంగా చురుగ్గా ఉన్న వృద్ధపురుషుల్లోనే హృదయ సంబంధ రుగ్మతలు రెండింతలుగా సంభవించే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది.

సంభోగం వ్యాయామం పనితీరును దెబ్బ తీయొచ్చు

లైంగిక కార్యకలాపాలు నేరుగా వ్యాయామం పనితీరును తగ్గించకపోయినా, అథ్లెటిక్ పనితీరుకి 2 గంటలు ముందు సంభోగంలో గడిపితే, వ్యక్తి పనితీరు గరిష్ట సంభావ్యతను అడ్డుకోవచ్చని నివేదించబడింది.

సంభోగం చిరాకు కలిగించవచ్చు

రబ్బరుకు (latex) అలెర్జీకి గురయ్యే పురుషులలో, సంభోగంలో వాడే  లేటెక్స్ కండోమ్ల వలన దురద లేదా మంట కలిగించవచ్చు. ఇటువంటి సందర్భాల్లో పాలియురేతేన్ కండోమ్లను ఉపయోగించడం మంచిది.

సంభోగం మరియు నిద్ర

మహిళల్లో కనిపించే ప్రభావానికి విరుద్ధంగా, సంభోగం పురుషుల్లో నిద్రను ప్రేరేపిస్తుంది, అలాంటపుడు పనిలోకెళ్లేందుకు ముందు సంభోగంలో పాల్గొంటే (పనిలో నిద్ర  ముంచుకొస్తుంటే) పురుషులకిదో సమస్య కావచ్చు.

సంభోగం మరియు అలసట

సంభోగం కూడా, ముఖ్యంగా పురుషుల్లో, అలసటకు  కారణం కావచ్చు. కాబట్టి, సంభోగంలో అతి ఎక్కువగా పాల్గొనడాన్ని నిరోధించాలి.

సంభోగం బాధాకరమైన మూత్రవిసర్జనకు కారణమవుతుంది

సంభోగమైన వెంటనే మూత్రవిసర్జనకెల్లినపుడు కొంతమంది పురుషులు తీవ్రమైన నొప్పిని ఎదుర్కొంటారు.

Dr. Hemant Sharma

Dr. Hemant Sharma

Sexology
11 Years of Experience

Dr. Zeeshan Khan

Dr. Zeeshan Khan

Sexology
9 Years of Experience

Dr. Nizamuddin

Dr. Nizamuddin

Sexology
5 Years of Experience

Dr. Tahir

Dr. Tahir

Sexology
20 Years of Experience

వనరులు

  1. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Oral sex
  2. Brecher J. Sex, stress, and health. Int J Health Serv. 1977;7(1):89-101. PMID: 832938
  3. Bodenmann G et al. The association between daily stress and sexual activity. J Fam Psychol. 2010 Jun;24(3):271-9. PMID: 20545400
  4. National Health Service [Internet]. UK; Benefits of love and sex.
  5. Hui Liu, Linda Waite, Shannon Shen, Donna Wang. Is Sex Good for Your Health? A National Study on Partnered Sexuality and Cardiovascular Risk Among Older Men and Women . J Health Soc Behav. 2016 Sep; 57(3): 276–296. PMID: 27601406
  6. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Heart disease and intimacy
  7. Julie Frappier et al. Energy Expenditure during Sexual Activity in Young Healthy Couples . PLoS One. 2013; 8(10): e79342. PMID: 24205382
  8. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Vaginal dryness
  9. Holly M. Thomas et al. Dyspareunia is Associated with Decreased Frequency of Intercourse in the Menopausal Transition . Menopause. 2011 Feb; 18(2): 152–157. PMID: 20962696
  10. D. Edwards, N. Panay. Treating vulvovaginal atrophy/genitourinary syndrome of menopause: how important is vaginal lubricant and moisturizer composition? . Climacteric. 2016 Mar 3; 19(2): 151–161. PMID: 26707589
  11. healthdirect Australia. Vaginal dryness. Australian government: Department of Health
  12. Paul KN, Turek FW, Kryger MH. Influence of sex on sleep regulatory mechanisms. J Womens Health (Larchmt). 2008 Sep;17(7):1201-8. PMID: 18710368
  13. Brissette S et al. Sexual activity and sleep in humans. Biol Psychiatry. 1985 Jul;20(7):758-63. PMID: 4005334
  14. Hooton TM et al. A prospective study of risk factors for symptomatic urinary tract infection in young women. N Engl J Med. 1996 Aug 15;335(7):468-74. PMID: 8672152
  15. Elya E. Moore et al. Sexual Intercourse and Risk of Symptomatic Urinary Tract Infection in Post-Menopausal Women . J Gen Intern Med. 2008 May; 23(5): 595–599. PMID: 18266044
  16. Tierney Lorenz, Sari van Anders. Interactions of Sexual Activity, Gender, and Depression with Immunity . J Sex Med. 2014 Apr; 11(4): 966–979. PMID: 23448297
Read on app