ఉసిరి (లేదా ఉసిరికాయ) ‘యుఫోర్బియేసీ’ కుటుంబానికి చెందిన ఓ పండు, ఇక ‘మురబ్బా’ అంటే ఏమంటే ఉసిరిపండును సంరక్షించి భద్ర పరిచిన ఒక విధానం. కాబట్టి, ‘ఉసిరి ముర్బాబా’ అంటే మురబ్బా రూపంలో ఉసిరిని భద్రపరచడమే. ఉసిరిని ‘ఆమ్లా’ గా పిలుస్తారు. ఉసిరిని సాధారణంగా మరింత రుచికరంగా మార్చడానికి చక్కెర కలిపి తీపిని కల్పించడం జరిగింది, కాని చక్కెరను చేర్చడం ద్వారా అది (చక్కెర) ఉసిరిని భద్రపరిచేది (preservative) గా పనిచేస్తూ, ఆహార-ఆధారితమైన సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తుంది. .

కానీ దాన్ని ఎందుకు భద్రపరచాలి?

ఉసిరిని మనం సంవత్సరం పొడవునా పొందలేము. (మామిడి లాగా ఉసిరి కూడా సంవత్సరంలో ఒకసారే కాస్తుంది) ఇంకా ఏమంటే, ఉసిరి పండు చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి అది అందరికీ (పులుపు రుచి) బహుశా రుచించదు కదా. అయితే ‘ఉసిరి  మురబ్బా’ తియ్యగా మరియు రుచిగా ఉంటుంది కనుక అందరూ ఇష్టపడతారు కానీ మురబ్బా రూపంలో కూడా ఉసిరి తన అన్ని ఆరోగ్య ప్రయోజనాలనూ కల్గిఉంటుంది. మంచి ఆరోగ్య మరియు శక్తిని పునరుద్ధరించడానికి ఆయుర్వేదంలో ఉసిరి ఉపయోగించబడింది. ఈ పండు జీర్ణ గ్రంథులు మరియు ఆహారం యొక్క జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇది సాధారణంగా మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, మరియు గుండె సమస్యలు వంటి వివిధ రుగ్మతలకు సూచించబడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆమ్ల వంటి కొన్ని ఇతర ఒనరులు కూడా ఉన్నాయి. ఆసక్తికరంగా, ఉసిరి  యొక్క తాజా పండ్లలో నారింజ రసంలో ఉన్న దానికి సుమారుగా ఇరవై రేట్లు విటమిన్ సి ని కలిగి ఉంటుంది. ఒక చిన్నఉసిరి రెండు నారింజలకి సమానం మరియు ఉసిరిలోని అధిక విటమిన్ పదార్థాలు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి, ‘ఫిలంథుస్ ఎంబ్లీకా’ అనేది ఉసిరి కి ఉన్న శాస్త్రీయ నామం, దీనర్థం  "సస్టైనర్" (sustainer) అని అనువాదకార్ధం.

"ఇండియన్ గూస్బెర్రీ" గా ప్రసిద్ది చెందింది ఉసిరి, ఇది మధ్యప్రాచ్యంలో మరియు భారతదేశం కాకుండా కొన్ని ఆగ్నేయాసియా దేశాలలో కనిపిస్తుంది. ఉసిరిని ఎంబ్లిక్ అని కూడా పిలుస్తారు, ‘ఎమ్లికా అఫిలినాలిస్’ అని పిలవబడే దీని వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు నుండి ‘ఎంబ్లిక్’ ఉత్పన్నమయ్యింది. ఉసిరిచెట్టు బొద్దుగా ఉండే పండ్లతో కూడుకుని, దీని ఆకులు రంపంలో పండ్ల లాగా ఒక ఈనెకు అటూ ఇటూ ఉంటాయి. ఈ పండు శరదృతువులో పండుతుంది మరియు భారత ఉపఖండంలోని అడవులు మరియు కొండ ప్రాంతాలలో ఉసిరి యొక్క ఉనికిని గుర్తించడమైంది. ఉసిరి పండు యొక్క చర్మం కాస్త  కఠినమైనది కానీ అది పలుచగా ఉండి పులుపు మరియు చేదు రుచితో ఉంటుంది. ఉసిరి యొక్క గుజ్జు (flesh) ఒకింత వగరుగా ఉంటుంది. మధ్యలో రాయిలాగా ఆరు చిన్న గింజలతో కూడిన ఒక షడ్భుజి ఆకారంలో ఉసిరి పండు గింజ ఉంటుంది.

ఉసిరి మురబ్బా అత్యంత పోషకమైనది, కానీ మురబ్బాను సరైన పద్దతిలో చేయకపోతే దాని పోషక విలువ తగ్గుతుంది.

ఉసిరి  యొక్క కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

  • ఉసిరి (అమ్లా) యొక్క శాస్త్రీయ నామం: ఎంబ్లీకా అఫిసినాలిస్ (Emblica officinalis)
  • సాధారణ పేరు:   ఉసిరి, ఇండియన్ గూస్బెర్రీ
  • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: భారతదేశం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాలు ఉసిరికి నివాసంగా ఉన్నాయి. ఇది భారతదేశంలోని ఉష్ణమండల ఎడారి ప్రాంతాల్లో పెరుగుతుంది మరియు ఉత్తర భారతదేశంలో వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడుతుంది.
  • తమాషా వాస్తవాలు (ఫన్ ఫాక్ట్స్):  ఉసిరి భారతదేశం యొక్క మతపరమైన ఆచారాలు మరియు వేడుకలకు దగ్గరగా ఉంటుంది.
  • రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, ఎండిన ఉసిరినుండి తయారైన పౌడర్ మరియు క్యాండీలు విటమిన్ సి అనుబంధకాహారంగా భారతీయ సైనికులకు తినేందుకు ఇవ్వబడ్డాయి.
  • గ్రామీణ భారతదేశంలో, ఉసిరిని తిన్న తరువాత తాగేందుకు నీటిని చప్పరిస్తే, చాలా తియ్యగా అనిపిస్తుంది.
  1. అమ్లా మురబ్బా పోషక వాస్తవాలు - Amla murabba nutrition facts in Telugu
  2. ఉసిరి మురబ్బా ఆరోగ్య ప్రయోజనాలు - Amla murabba health benefits in Telugu
  3. ఉసిరి మురబ్బా దుష్ప్రభావాలు - Amla murabba side effects in Telugu
  4. ఉపసంహారం - Takeaway in Telugu

పచ్చి ఉసిరియొక్క 100 గ్రాముల పరిమాణంలో 800% విటమిన్ సి ని కలిగి ఉంటుంది మరియు విటమిన్ E కూడా దీనిలో చాలా పుష్కలంగా ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు , ప్రోటీన్లు , కాల్షియం మరియు అనేక పోషకాలు ఉన్నాయి. ఏ ఇతర కాయ (లేదా బెర్రీ)  లాగానే ఉసిరిలో కూడా తక్కువ చక్కెర మరియు ఎక్కువ పీచుపదార్థాలు (ఫైబర్) ఉంటాయి. అందుకే ఉసిరిని దాదాపు ప్రతిఒక్కరూ దిననిత్యం తినదగిన ఓ మంచి పండుగా సూచించవచ్చు.

ఉసిరిలో ఇంకా భాస్వరం, ఇనుము, కెరోటిన్, విటమిన్ బి కాంప్లెక్స్ మరియు సోడియం వంటివి ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యానికి లాభదాయకమే.

అమెరికా వ్యవసాయ శాఖ యొక్క (USDA) న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం, 100 గ్రాముల పచ్చి ఉసిరికాయలో క్రింది పోషక విలువలు ఉంటాయి:

పోషక పదార్ధం

ప్రతి 100 గ్రాములకు విలువ

నీరు

87.87 గ్రా

శక్తి

44 గ్రా

ప్రోటీన్

0.88 గ్రా

కొవ్వులు (ఫాట్స్)

0.58 గ్రా

కార్బోహైడ్రేట్లు

10.18 గ్రా

పీచుపదార్థాలు (ఫైబర్స్)

4.3 గ్రా

మినరల్స్

 

కాల్షియం

25 mg

ఐరన్

0.31 mg

మెగ్నీషియం

10 mg

ఫాస్పరస్

27 mg

పొటాషియం

198 mg

సోడియం

1 mg

జింక్

0.12 mg

విటమిన్లు

 

విటమిన్ సి

27.7 mg

విటమిన్ B1

0.040 mg

విటమిన్ B2

0.030 mg

విటమిన్ B3

0.300 mg

విటమిన్ B-6

0.080 mg

విటమిన్ B9

6 μg

విటమిన్ ఎ

15 μg

విటమిన్ ఇ

0.37 mg

కొవ్వులు / కొవ్వు ఆమ్లాలు

 

సాచ్యురేటెడ్

0.038 గ్రా

మోనోఅన్శాచ్యురేటెడ్

0.051 గ్రా

పాలీఅన్శాచ్యురేటెడ్

0.0317 గ్రా

పైన పేర్కొన్న సమాచారం ఉసిరి మురబ్బాలో అదనంగా జోడించిన చక్కెర లేదా స్వీటెనర్లను పరిగణనలోకి తీసుకోదు. కాబట్టి, మార్కెట్ నుండి ఉసిరి మురబ్బాను కొనడానికి ముందు వివరాలకోసం ప్రోడక్ట్పై లేబుల్ను తనిఖీ చేయడం ఉత్తమం.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

ఉసిరి పండు నుండి ఉసిరి మురబ్బాను తయారుచేస్తారు. ఈ తీపి మరియు పుల్లని ఆహారం (ఉసిరి మురబ్బా) ఉసిరి పండు యొక్క అన్ని ప్రయోజనాలను తనలో పొందుపరుచుకుని ఉంటుంది. ఈ ప్రయోజనాలను అన్నింటినీ మనం ఇపుడు విశ్లేషిద్దాం.

  • రోగనిరోధకతను మెరుగుపరుస్తుంది: విటమిన్ సి యొక్క అత్యంత సుసంపన్న  వనరులలో ఒకటి ఉసిరి, ఇది ఒక అద్భుతమైన రోగ నిరోధకశక్తి ప్రేరకం (ఇమ్మ్యునోస్టిముంటెంట్, అంటే రోగనిరోధకతను మెరుగుపరుస్తుంది). ఇది శరీరం  లోపల అంటురోగాలకు కారణమయ్యే సూక్ష్మక్రిముల ప్రవేశాన్ని నివారించడంలో సహాయపడుతుంది. చర్మం నిర్వహించే ‘అవరోధక పనితీరు’ (skin barrier function)ను ఉసిరి మరింత మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
  • రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది: రోజుకు 1 నుండి 3 ఉసిరిపండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి మరియు డయాబెటిస్ లక్షణాలు మెరుగుపడతాయి, అని వైద్య అధ్యయనాల ద్వారా నిర్ధారించబడింది. ఉసిరికి ఉన్న ఈ ఔషధ గుణం ఆస్తి    ఉసిరిపండు లో విటమిన్ సి ఉనికిని కారణమని.
  • జీర్ణశక్తి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది: ఉసిరి మురబ్బా పీచుపదార్ధాల (ఫైబర్) మరియు నీరు యొక్క గొప్ప మూలం. ఇది పేగుల్లోని ఆహారానికి గాత్రాన్ని అందించడంలో సహాయపడుతుంది మరియు ప్రేగుల నుండి మలాన్ని సులభంగా విసర్జింపజేయడానికి వీలు కల్పిస్తుంది. ఉసిరి మురబ్బా జీర్ణ రసాల స్రావాన్ని కూడా మెరుగుపరుస్తుంది, తద్వారా జీర్ణశక్తిని ప్రోత్సహిస్తుంది..
  • గుండె ఆరోగ్యానికి ప్రయోజనం: ఉసిరి మురబ్బా యొక్క పోషక మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు దాన్ని ఒక ఉత్తమమైన గుండెకు అనువైన (heart-friendly) ఆహారాలలో ఒకటిగా చేసింది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఈ రక్తంలో కొవ్వులు లేదా కొలెస్ట్రాల్ గుండె-సంబంధ రోగాలకు కారణమయ్యే ప్రాథమిక రోగకారకం.
  • ప్రత్యక్ష ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది: పరిశోధక అధ్యయనాలు (రీసెర్చ్ స్టడీస్) ఉసిరి పండును ఒక సహజ కాలేయరక్షక (హెపాటోప్రొటెక్టివ్) ఏజెంట్ గా  సూచిస్తాయి. కాలేయం మీద మద్యం మరియు మందుల విషపూరితమైన ప్రభావాన్ని తగ్గిస్తుంది మరియు కాలేయం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది.

ఉసిరి మురబ్బా రోగనిరోధక శక్తిని పెంచుతుంది - Amla murabba boosts immunity in Telugu

విటమిన్ ఎ మరియు విటమిన్ సి.లను ఉసిరి పుష్కలంగా కల్గి ఉన్నందున ఉసిరి మురబ్బా సహజంగా మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి మురబ్బా టానిన్లను కలిగి ఉన్నందున, ఇది ఉసిరిలోని విటమిన్లతో కలిసి స్వేచ్చారాశులు (శరీరంలో సాధారణ జీవక్రియవల్ల ఏర్పడే ఒకవిధమైన ప్రాణవాయువు) కల్గించే నష్టాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల శరీరానికి వ్యాధుల విరుద్ధంగా పోరాడే సామర్ధ్యం పెరుగుతుంది.

ఉసిరిని ఏ రూపంలోనైనా సరే సాధారణంగా తిన్నట్లైతే ఇది శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి, శరీర కణాల వెలుపల ఒక రక్షిత పొరను (a lining) ఏర్పాటు చేయడం ద్వారా వ్యాధి అభివృద్ధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని, అధ్యయనాలు సూచిస్తున్నాయి.

చక్కెరవ్యాధికి ఉసిరి మురబ్బా - Amla murabba for diabetes in Telugu

వైద్య అధ్యయనాల సూచన ప్రకారం, ఉసిరి ఒక అద్భుతమైన హైపోగ్లైసిమిక్ (రక్త చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది)గా పని చేస్తుంది. ఫుడ్ సైన్స్ మరియు న్యూట్రిషన్ యొక్క ఇంటర్నేషనల్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, 1-3 గ్రాముల ఉసిరిసారాన్ని క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది.

ఉసిరిలోని విటమిన్ సి పరిమాణం దాని యొక్క యాంటీ-డయాబెటిక్ పనితీరుకు కారణమని ఇంకొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రతి దీర్ఘకాల వ్యాధికి కారకాలుగా  శరీరంలోని స్వేచ్ఛా రాశులను మరియు ఆక్సీకరణ ఒత్తిడిని సూచించడమనే ధోరణి పెరుగుతుండడం గమనార్హం. ఉసిరి మురబ్బాలో విటమిన్ సి తో పాటు మరో ప్రతిక్షకారిని, క్రోమియం ఉంటుంది. ఈ రెండు సమ్మేళనాలు కలిసి శరీరంలో ఏర్పడిన ఆక్సీకరణ (ఆక్సిడరేటివ్) ఒత్తిడిని తగ్గించడం వలన చక్కెరవ్యాధితో సంబంధం ఉన్న కొన్ని లక్షణాలు తగ్గిపోతాయి

పొట్ట ఆరోగ్యానికి ఉసిరి మురబ్బా - Amla murabba for stomach in Telugu

ఉసిరి మురబ్బాలో జీర్ణ వ్యవస్థకు చాలా ఉపయోగకరంగా వుండే అధిక పీచుపదార్థాలు మరియు నీటి పరిమాణం ఉంది. ఉసిరిలోని ఈ పీచుపదార్థాలు, పేగుల్లోని మలానికి గాత్రాన్ని అందిస్తుంది, తద్వారా ప్రేగుల ద్వారా ఆహారాన్ని సులభంగా విసర్జించేందుకు వీలవుతుంది, దీనివల్ల మలబద్ధకం నయమవుతుంది. ఉసిరి మురబ్బా వివిధ జీర్ణ మరియు గ్యాస్ట్రిక్ రసాల స్రావాన్ని ప్రేరేపిస్తుంది, దానివల్ల శరీరం ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడం మరియు దాని నుండి అవసరమైన పోషకాలను సులభంగా గ్రహించడం జరుగుతుంది.

‘అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ’లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, ఉసిరి శరీరంలో నీటిని మిగిల్చి తద్వారా కొన్ని సాధారణ జీర్ణశయాంతర రుగ్మతల లక్షణాలను ఉపశమనం చేయవచ్చని, ఇంకా కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించగలదని  పేర్కొంది.

గుండెకు ఉసిరి మురబ్బా ప్రయోజనాలు - Amla murabba benefits for heart in Telugu

గుండె వ్యాధులకు అత్యంత సాధారణ కారణాలలో ఒకటి రక్తంలో అధిక కొవ్వులు పేరుకుపోవడం (కొలెస్ట్రాల్) మరియు శరీరం అంతటా రక్తప్రసరణ సరిగా జరక్కపోవడం.    ఉసిరి మురబ్బా శరీరంలో పేరుకుపోయిన రక్తంలో చెడుకొవ్వుల్ని తగ్గిస్తుంది, ఇలా రక్తంలో అధికంగా కొవ్వులు పేరుకుపోతే సంభవించే ప్రమాదకర వ్యాధే ‘రక్తనాళాల కాఠిన్యత’ లేదా ‘ఎథెరోస్క్లెరోసిస్” సాధారణంగా గుండె జబ్బు యొక్క మొట్టమొదటి చిహ్నంగా కనబడే  సూచన ధమనులు గట్టిపడటం (రక్తనాళాల కాఠిన్యత) దీని నివారణలో ఉసిరి ఉపయోగాన్ని అధ్యయనాలు చూపించాయి. అదనంగా, శరీరంలో మంచి కొవ్వుల సాంద్రతను ఉసిరి మురబ్బా పెంచుతుంది. మంచి కొవ్వులు శరీర పనితీరుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

శరీరమంతా సరైన రక్త ప్రసరణకు దారితీసే హృదయ కండరాల బలోపేతానికి ఉసిరి చక్కగా పనిచేస్తుంది. కాబట్టి, ఉసిరి యొక్క సాధారణ సేవనం గుండెకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు గుండె జబ్బు యొక్క ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

కళ్ళకు ఉసిరి మురబ్బా ప్రయోజనాలు - Amla murabba benefits for eyes in Telugu

ఉసిరి మురబ్బా ను క్రమం తప్పకుండా సేవిస్తే కంటి చూపు మెరుగుపడుతుంది. వాస్తవానికి, ఆయుర్వేద వైద్యంలో ఉసిరిని కంటికి ఓ మంచి టానిక్ గా పేర్కొనడం జరిగింది. విటమిన్ ఎ ఉసిరిలో పుష్కలంగా ఉంటుంది గనుక ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉసిరి కంటిలోపల కలిగే ఉద్రిక్తతను తగ్గించి హ్రస్వదృష్టి దోషాన్ని (లేదా సమీప దృష్టిదోషాన్ని) మరియు శుక్లాలను తగ్గించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కాలేయానికి ఉసిరి మురబ్బా ప్రయోజనాలు - Amla murabba benefits for liver in Telugu

పరిశోధన ప్రకారం ఉసిరి మురబ్బా యొక్క సాధారణ వినియోగంవల్ల మద్యపానం కారణంగా కాలేయానికి కలిగే దుష్ప్రభావాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఉసిరి యొక్క కాలేయరక్షణ (హెపాటోప్రొటెక్టివ్) లక్షణాలపై జరిపిన మరొక అధ్యయనం ప్రకారం కాలేయంపై అధిక ఔషధసేవనం మరియు భారీ లోహాలు విషపూరితమైన ప్రభావాలను నివారించడంలో ఉసిరిపండు ఉపయోగపడుతుంది.

ఉసిరి యాంటీఆక్సిడెంట్ కావడం వల్ల, ఆమ్లజనీకరణ (ఆక్సిడేటివ్) వల్ల కాలేయానికి కలిగే  హానిని నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆమ్లజనీకరణ కాలేయ పనితీరును క్షీణింపజేస్తుంది. అందువలన ఉసిరి మురబ్బా కాలేయాన్నిసమర్థవంతంగా పునరుజ్జీవింపచేయగలదు, జీవశక్తి మరియు బలాన్ని పెంచుతుంది.

క్యాన్సర్కు ఉసిరి మురబ్బా - Amla murabba for cancer

క్యాన్సర్ ప్రివెన్షన్ (క్యాన్సర్ నివారణ) అనబడే ఒక యూరోపియన్ పత్రిక (జర్నల్) ప్రకారం ఓ చిన్న ఉసిరి (ఆమ్ల) పండు వివిధ రకాల విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటుంది, ఇది ప్రారంభంలో క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడుతుంది .

'ఆక్సిడెటివ్ మెడిసిన్ అండ్ సెల్యులార్ లాంగివిటీ' పత్రిక లో ప్రచురించిన ఓ పరిశోధన ప్రకారం, ఉసిరి పండులో ఉండే పాలీఫెనోల్స్ మరియు టానిన్లు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలకు బాధ్యత వహిస్తాయి. గర్భాశయ క్యాన్సర్ , ఊపిరితిత్తుల క్యాన్సర్ , లివర్ క్యాన్సర్ , రొమ్ము క్యాన్సర్ , మరియు అండాశయ క్యాన్సర్ వంటి వివిధ రకాలైన క్యాన్సర్లకు వ్యతిరేకంగా ఉసిరి పదార్ధాలు సైటోటాక్సిక్ కార్యకలాపాలను కలిగి ఉన్నాయని కూడా పత్రిక  పేర్కొంది .

  • ఉసిరి మురబ్బా విటమిన్ సి యొక్క గొప్ప మూలం, ఇది శరీరం లో ఆమ్లత్వం పెంచుతుంది. మీరు అధిక ఆమ్లతతో (hyperacidity) బాధపడుతున్నట్లయితే ఈ ఉసిరి పండును తీసుకోకుండా ఉండడమే మేలు. అయితే, ఉసిరిమురబ్బా నిర్విషీకరణ కోసం ఖాళీ కడుపుతో తీసుకోవలసిందిగా సూచించడమైంది. కాని ఉసిరిమురబ్బా యొక్క అధిక వినియోగం కడుపుకు సమస్యలకు (stomach upset) కారణమవుతుంది .
  • ఉసిరి మురబ్బా రక్తములో చక్కెర స్థాయిని తగ్గించేందుకు బాగా ప్రజాదరణ పొందింది. ఇది డయాబెటిక్-నిరోధక ఔషధాన్ని చెడగొడుతుంది, అంతేగాక, ఇది వ్యక్తిని హైపోగ్లైసీమియాకు గురిచేస్తుంది. అదనంగా, ఈ మురబ్బా యొక్క కొన్ని వాణిజ్య రకాలు అధిక మొత్తంలో చక్కెరలను కలిగి ఉంటాయి. కాబట్టి, చక్కెరవ్యాధి ఉన్నవాళ్లు ఉసిరి మురబ్బా తినే ముందు వైద్యుడ్ని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిదని సూచించడమైంది.
  • తగినంతగా పరిశోధన లేకపోవడం వలన, గర్భధారణ సమయంలో ఉసిరి మురబ్బాను తీసుకోవడం వద్దని సూచించబడింది.
  • మీరు మార్కెట్ నుండి  ఉసిరి మురబ్బాను కొనుగోలు చేస్తే, దాని ఉత్పత్తి నాణ్యతను మరియు ఉత్పాదన వివరాలను తనిఖీ చేయడం మంచిది. సరైన పరిమాణానికి మించి వినియోగించినప్పుడు, అది కడుపు నొప్పిని కూడా కల్గిస్తుంది, కడుపు నొప్పితోపాటు వాంతులు కూడా కలిగించొచ్చు
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

ఉసిరి అనేక ప్రయోజనాల్ని కల్గించే పండు. మురబ్బా రూపంలో ఉసిరిని తిన్నపుడు నాలుక యొక్క రసాంకురాల్ని తృప్తిపరిచి, మీరు ఓ ఆరోగ్యకరమైన జీవనశైలిని గడిపేందుకు సహాయపడుతుంది. అయినప్పటికీ, ఈ రుచికరమైన ఆహారాన్ని సేవించేటపుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య ప్రభావాలు సంభవిస్తాయి. మంచి ఆరోగ్యం కోసం ఉసిరి మురబ్బా యొక్క అనేక ప్రయోజనాలను పొంది ఆనందించడం మంచిదే కానీ దానివల్ల ఎలాంటి ప్రతికూలతలు కలక్కుండా జాగ్రత్తవహించడం మంచిదని సూచించడమైంది.

వనరులు

  1. Tambekar et al. ANTIBACTERIAL POTENTIAL OF SOME HERBAL PREPARATION: AN ALTERNATIVE MEDICINE IN TREATMENT OF ENTERIC BACTERIAL INFECTION. Int J Pharm Pharm Sci, Vol 2, Suppl 4, 176­179
  2. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 09107, Gooseberries, raw. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
  3. AK Meena et al. EVALUATION OF PHYSICOCHEMICAL AND PRELIMINARY PHYTOCHEMICAL STUDIES ON THE FRUIT OF EMBLICA OFFICINALIS GAERTN. National Institute of Ayurvedic Pharmaceutical Research, Patiala, Punjab, India.
  4. Grover HS, Deswal H, Singh Y, Bhardwaj A. Therapeutic effects of amla in medicine and dentistry: A review. J Oral Res Rev 2015;7:65-8
  5. Akhtar MS, Ramzan A, Ali A, Ahmad M. Effect of Amla fruit (Emblica officinalis Gaertn.) on blood glucose and lipid profile of normal subjects and type 2 diabetic patients. Int J Food Sci Nutr. 2011 Sep;62(6):609-16.
  6. Swetha Dasaroju, Krishna Mohan Gottumukkala. Current Trends in the Research of Emblica officinalis (Amla): A Pharmacological Perspective. Int. J. Pharm. Sci. Rev. Res., 24(2), Jan – Feb 2014; nᵒ 25, 150-159
  7. Poonam Mishra, Charu Lata Mahanta. Comparative Analysis of Functional and Nutritive Values of Amla (Emblica officinalis) Fruit, Seed and Seed Coat Powder. American Journal of Food Technology
  8. Ekta Singh et al. Phytochemistry, traditional uses and cancer chemopreventive activity of Amla (Phyllanthus emblica): The Sustainer. Journal of Applied Pharmaceutical Science 02 (01); 2011: 176-183
  9. Biswas Gopa, Jagatkumar Bhatt, Kovur G. Hemavathi. A comparative clinical study of hypolipidemic efficacy of Amla (Emblica officinalis) with 3-hydroxy-3-methylglutaryl-coenzyme-A reductase inhibitor simvastatin . Indian J Pharmacol. 2012 Mar-Apr; 44(2): 238–242. PMID: 22529483
  10. Baliga MS, Dsouza JJ. Amla (Emblica officinalis Gaertn), a wonder berry in the treatment and prevention of cancer. Eur J Cancer Prev. 2011 May;20(3):225-39. PMID: 21317655
  11. Tiejun Zhao, Qiang Sun, Maud Marques, Michael Witcher. Anticancer Properties of Phyllanthus emblica (Indian Gooseberry) . Oxid Med Cell Longev. 2015; 2015: 950890. PMID: 26180601
Read on app