క్యాలమైన్ లోషన్ అంటే ఏమిటి?  

జింక్ ఖనిజం యొక్క పురాతనమైన పేరే ‘క్యాలమైన్.’ దీన్ని తెలుగులో ‘తుత్తునాగమ’ని మరియు ‘తగరం’ అని కూడా అంటారు. అనేక రకాల చర్మ వ్యాధులకు మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి క్యాలమైన్ లోషన్ పలు విధాలుగా  ఉపయోగపడుతుంది. క్యాలామైన్ లోషన్ ను క్రీస్తుకు పూర్వం 1500 నాటి నుండి ఉపయోగిస్తున్నారు. క్యాలమైన్ ప్రధానంగా జింక్ ఆక్సైడ్ మరియు ఇనుప ఆక్సైడ్తో కూడుకుని ఉంటుంది. అనేక కాస్మెటిక్ ఉత్పత్తులలో ఇనుము ఆక్సైడ్లను ప్రముఖ భాగాలలో ఒకటిగా ఉపయోగిస్తున్నారు.

ఫినాల్ మరియు కాల్షియం హైడ్రాక్సైడ్ వంటి అదనపు సమ్మేళనాలను కలిపి గ్లిజరిన్-లాంటి చిక్కదనాన్ని క్యాలమైన్ లోషన్కు జోడించడం జరుగుతుంది. క్యాలమైన్ ఔషధం యొక్క వైద్యం గుణం లేక మాన్పుడు ప్రభావం జింక్ ఆక్సైడ్ ద్వారా ఒనగూడిందని నమ్ముతారు. లాటిన్ పదం 'లాపిస్ కాలమినారిస్' నుంచి ‘క్యాలమిన్’ అనే పేరు వచ్చింది, ఇది సాధారణంగా జింక్ ఖనిజాలకు పాత పేరు.

క్యాలమైన్ లోషన్లను ప్రధానంగా దురద చికిత్సకు వాడే లోషన్లలో ఉపయోగిస్తారు. ఈ లోషన్ ను నేరుగా చర్మంపై రాయడమో లేక పూయడానికో ఉపయోగించడం జరుగుతోంది. అంతేకాకుండా, క్యాలమైన్ లోషన్ ఎండవల్ల కమిలిన మచ్చలు, కీటకాల కాట్లు మరియు ‘పాయిజన్ ఐవీ ఓక్’ అనబడే మరోరకమైన దద్దుర్లవంటి చర్మవ్యాధి వల్ల కలిగే నొప్పికి ఉపశమనం కల్గించే మందుగా కూడా ప్రసిద్ది చెందింది. ఈ వ్యాసంలో క్యాలమైన్ లోషన్ యొక్క అనేక ప్రయోజనాలు మరియు దాని భాగాల గురించి ఈ వ్యాసంలో వివరంగా చర్చించబడ్డాయి.

 1. మీకు తెలుసా? - Did you know in Telugu
 2. క్యాలమైన్ లోషన్ ప్రయోజనాలు - Calamine lotion benefits in Telugu
 3. క్యాలమైన్ లోషన్ ధర మరియు మోతాదు - Calamine lotion price and dosage in Telugu
 4. క్యాలమైన్ లోషన్తో ఫేసు మాస్క్ - Calamine lotion face mask in Telugu
 5. క్యాలమైన్ లోషన్ యొక్క దుష్ప్రభావాలు - Side effects of calamine lotion in Telugu

క్యాలమైన్ లోషన్లో జింక్ ఆక్సైడ్ మరియు ఇనుము ఆక్సైడ్ (ఐరన్ ఆక్సైడ్) అని రెండు ప్రధాన భాగాలుంటాయి, చర్మానికి ఇవి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆ ప్రయోజనాలన్నీ క్రింద చర్చించబడ్డాయి.

జింక్ ఆక్సైడ్

జింక్ ఒక సహజ రక్తస్రావనివారిణి మరియు చర్మం కణాల్ని కుంచింపజేసి చర్మపు రంధ్రాలను తగ్గిస్తూ నూనె (సేబాషియస్) గ్రంధుల నుండి నూనె మరియు క్రొవ్వు పదార్ధాల ఉత్పత్తిని  తగ్గిస్తుంది. ఇలా చేయడంవల్ల చర్మం బిగుతు (tight) పడడానికి సహాయపడుతుంది. జింక్ ఆక్సిడ్ చర్మంపై వచ్చే వాపు, చర్మ దురద, మరియు మోటిమల వంటి చర్మ రుగ్మతల్ని తగ్గించడంలో కూడా ప్రభావవంతమైంది. ఇది హానికరమైన అతినీలలోహిత (UV) కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది, దాని కారణంగానే దీన్ని అనేక సన్స్క్రీన్ లోషన్, క్రీముల్లో ఉపయోగించబడుతుంది. జింక్ ఆక్సయిడ్ గాయాల్ని, పుండ్లను కూడా నయం చేయడంలో సహాయపడుతుంది.

ఐరన్ ఆక్సైడ్ లేదా ఫెర్రిక్ ఆక్సైడ్: ఐరన్ ఆక్సైడ్ ను సాధారణ చర్మపు రంగును మెరుగుపర్చడానికి ఉపయోగించబడుతుంది. ఇది విషకారకం కాదు మరియు తేమ నిరోధకత దీని సహజ లక్షణం. ఐరోనాక్సిడ్ యొక్క ఈ లక్షణమే దీన్ని అనేక సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఒక ప్రముఖ భాగంగా లేదా వస్తువుగా వాడుతున్నారు. ఇది ముఖ్యంగా ఖనిజ అలంకరణవస్తువుల్లో (మినరల్ మేకప్) ఒక ప్రాధమిక కలరింగ్ ఏజెంట్ గా  ఉపయోగించబడుతుంది. ఇనుము ఆక్సైడ్ వాడకం సాధారణంగా సురక్షితంగా భావించబడుతుంది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

చర్మానికి క్యాలమైన్ లోషన్ ఉపయోగాలు  మరియు దాని ప్రయోజనాలు విస్తారంగా ఉన్నాయి. ఈ లోషన్ యొక్క చాలా ముఖ్యమైన ప్రయోజనాల గురించి మరియు క్యాలమైన్ లోషన్ ను ఉపయోగించే ప్రక్రియను గురించి చూద్దాం.

మోటిమలకు క్యాలమైన్ లోషన్ - Calamine lotion for acne in Telugu

క్యాలమైన్ లోషన్ లోని జింక్ ఆక్సైడ్ బాక్టీరియా వ్యతిరేక లక్షణాలను కలిగి ఉన్నట్లు తెలిసింది. ఇది మోటిమల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే, జింక్ ఆక్సైడ్ యొక్క వాపు వ్యతిరేక లక్షణాలు (యాంటీ-ఇన్ఫ్లమేటరీ) చర్మంపై  ముందుకు పొడుచుకు వచ్చినట్లు కనిపించే (పులిపిర్లవంటి) చర్మపు మొటిమల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మొటిమల్లో ఏర్పడే మచ్చల్ని తొలగించడంలో క్యాలమైన్లోషన్  యొక్క ఐరన్ ఆక్సైడ్ సహాయపడుతుంది.  

మోటిమల చికిత్సకు క్యాలమైన్ లోషన్  ను ఎలా ఉపయోగించాలంటే, ఒకింత దూది (పత్తి)పై రెండు-మూడు చుక్కల క్యాలమైన్ లోషన్ ను తీసుకుని దానిని మొటిమలపై అద్దండి. ఓ రెండు లేక మూడు గంటల పాటు పొడిగా ఆరనివ్వండి, తర్వాత వెచ్చని నీటితో కడిగి శుభ్రపరచండి.

పొడిబారి దురదపెట్టే చర్మానికి క్యాలమైన్ లోషన్ - Calamine lotion for dry itchy skin in Telugu

పొడి చర్మానికి తేమను పునరుద్ధరించడంలో క్యాలమైన్ లోషన్  చాలా ప్రభావవంతమైనదిగా పనిచేస్తుంది. దురద మరియు మంట-వాపు వంటి లక్షణాలతో కూడిన రుగ్మతల్ని ప్రధానంగా పొడి చర్మ రుగ్మతల్లో గమనించవచ్చు. దురద మరియు వాపులతో కూడిన ‘కాంటాక్ట్ డెర్మటైటిస్’ లక్షణాలను తగ్గించడానికి క్యాలమైన్ లోషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్లోని జింక్ ఆక్సైడ్ భాగం వ్యక్తికి దురద, మంట నుండి ఉపశమనాన్ని కల్పిస్తుందని నమ్ముతారు మరియు వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అయితే, జింక్ ఆక్సైడ్ యొక్క ప్రభావాన్ని నిరూపించేందుకు అధ్యయనాలు అవసరం.

తామర మరియు సోరియాసిస్ కు క్యాలమైన్ లోషన్ - Calamine lotion for eczema and psoriasis in Telugu

తామర మరియు సోరియాసిస్ చికిత్సలో క్యాలమైన్ లోషన్ వాడకం బాగా ప్రసిద్ధి చెందింది. జింక్ ఆక్సైడ్లు యాంటీ-సెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటాయి మరియు సంక్రమణలను నివారించడంలో సహాయం చేస్తాయి. మరోవైపు, దీన్లోని ఐరన్ ఆక్సైడ్ చర్మపు నాణ్యతను, రంగును మెరుగుపరుస్తుంది.

తామర మరియు సోరియాసిస్ లాంటి అంటురోగాల విషయంలో, ఈ వ్యాధులు సోకిన ఆయా శరీరభాగాల్లో తామర, సోరియాసిస్ పుండ్లపై ఈ లోషన్ ను పూయాలి. అయితే, ఈ లోషన్ను చేతివేళ్ళతో కాకుండా శుభ్రమైన పత్తి (దూది) ని ఉపయోగించి పుండ్లపై లోషన్ ను పూయవచ్చు. 

కీటకాల గాట్ల కోసం క్యాలమైన్లోషన్ - Calamine lotion for insect bites in Telugu

పురుగుల కాటు తరచుగా చర్మంపై విపరీతమైన నొప్పి,మంట, మరియు వాపును కల్గిస్తుంది. ఈ పురుగుకాట్లు తరచుగా పిల్లల విషయంలో మరింత నొప్పి, మంటను కలిగించవచ్చు. క్యాలమైన్ లోషన్ చర్మంపై చల్లదనాన్ని కలిగించి పురుగుల కాటు వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది. ఈ లోషన్ బాగా పని చేసి, ఉత్తమ ఫలితాలనివ్వాలంటే లోషన్ ను వ్యాధి-బాధిత ప్రాంతానికి పూసేటపుడు స్వల్పంగా మర్దన చేస్తే సరిపోతుంది.

పుండ్లు మరియు గజ్జికి క్యాలమైన్ లోషన్ - Calamine lotion for shingles and scabies in Telugu

పుండ్లు (షింగిల్స్) అనేది ఒక రకమైన వైరల్ సంక్రమణం, ఇది తరచూ చర్మంపై బాధాకరమైన దద్దుర్లతో కలిసి ఉంటుంది. దద్దుర్లు స్వభావరీత్యా చాలా దురదను కూడా కల్గిస్తుంది. గజ్జి-దురద (స్కెబీస్) విషయంలో స్చర్మం మీద పురుగులు, పురుగులు మరియు చాలా దురద దద్దుర్లకు కారణమవుతుంది. అటువంటి పరిస్థితులలో సంభవించిన దద్దుర్లు మీద దరఖాస్తు చేసినప్పుడు క్యాలమైన్లోషన్  ఉపశమనం కలిగించేలా చేస్తుంది మరియు దద్దుర్లు తగ్గించడంలో సహాయపడుతుంది.

అలాగే, క్యాలమైన్ లోషన్  యొక్క క్రిమినాశక స్వభావం దద్దుర్లను విపరీతం చేసే బాక్టీరియా పెరుగుదలను అరికడుతుంది. దద్దుర్లు సోకిన శరీర భాగాల్లో ఈ లోషన్ ను రాస్తే, ప్రత్యేకించి స్నానం చేసిన తరువాత రాసుకుంటే దద్దుర్లు చాలా వరకు తగ్గిపోవటానికి సహాయపడుతుంది.

డైపర్లు, పాయిజన్ ఐవీ దద్దుర్ల క్యాలమైన్ లోషన్ - Calamine lotion for diaper and poison ivy rash in Telugu

డైపర్లు (శిశువుల కౌపీన వస్త్రాలు) నిరంతరంగా తేమకు గురికావడం వలన శిశువుల్లో దద్దుర్లు కల్గిస్తాయి. అంతేకాకుండా, బ్యాక్టీరియా ఇటువంటి తేమ పరిస్థితుల్లో చర్మంపై బాగా పెరుగుతుంది. క్యాలమైన్ లోషన్ పూతవల్ల చర్మంపై తేమ లేకుండా ఉంచేందుకు మరియు దద్దుర్లను నిరోధించడానికి సహాయపడుతుంది మరియు దద్దుర్లు పునరావృతం  కాకుండా చేస్తుంది. ఇది చర్మంపై కలిగే మంటకు చల్లదనాన్నిచ్చి శాంతి చేకూరుస్తుంది, అందువలన, డైపర్ దద్దుర్లు చికిత్సకు ఒక అద్భుతమైన నివారణ.

పాయిజన్ ఐవీ అని పిలువబడే మొక్కలో ‘రెసిన్’ అనబడే పదార్థంవల్ల చర్మంపై కలిగే అలెర్జీ ప్రతిచర్య (allergy reaction) కారణంగా ‘పాయిజన్ ఐవీ రాష్’ సంభవించవచ్చు .దద్దుర్లు చాలా దురద, చిరాకు మరియు బాధాకరమైనవి. ఈ దద్దుర్లు చికిత్స చేయడానికి క్యాలమైన్మిశ్రమం ఉపయోగించవచ్చు.

దద్దుర్లు విషయంలో ఉత్తమ ఫలితం సాధించడానికి, సోకిన ప్రాంతాలను కలుషితమైన సోప్ తో కడగడం మంచిది, ప్రాంతం శుభ్రం చేసి, చర్మం కొద్దిగా తడిగా ఉన్నప్పుడు లోషన్ను వర్తిస్తాయి.

క్యాలమైన్ లోషన్ ను కల్గిన వివిధ రకాల లోషన్లు మార్కెట్లో లభ్యమవుతాయి, అవి ఇతర మందులతో (components) కలిసి వివిధ బ్రాండ్లరూపంలో ఉంటాయి. క్యాలమైన్ లోషన్  యొక్క ధర సాధారణంగా INR 75 / - నుండి INR 200 / - వరకు ఉంటుంది. క్యాలమైన్లోషన్ యొక్క రెండు నుండి మూడు చుక్కల ద్రవాన్ని వ్యాధి సోకిన భాగానికి పూయడం చేయాలి. ఈ లోషన్ వాడకం వేర్వేరు చర్మ పరిస్థితులకు అనుగుణంగా వాడటం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో లోషన్ వాడకం పధ్ధతి మరియు మోతాదు మారవచ్చు. అందువల్ల ఔషధ ప్రయోజనాల కోసం క్యాలమైన్మందుల వాడకానికి ముందు డాక్టర్ను సంప్రదించండి.

క్యాలమైన్ లోషన్ను ఉపయోగించి, దానికి ఇతర పదార్ధాలను కలిపి ముఖంపైన ఫేస్ మాస్క్ (face mask) పూత వేసుకోవచ్చు. చర్మంపై మోటిమలు మరియు చర్మం యొక్క ఆర్ద్రీకరణ (hydration)ను నిర్వహించడానికి గాని క్యాలమైన్ లోషన్ తో ఫేసుమాస్క్ వేసుకోవచ్చు.   క్యాలమైన్ లోషన్ ఫేస్ మాస్క్ తయారీకి క్రింది పదార్థాల అవసరం ఉంటుంది.

క్యాలమైన్ లోషన్ ఫేస్ మాస్క్ ను ఎలా వేసుకోవచ్చు

 • గంధపు పొడి యొక్క ఒక teaspoon టేక్ మరియు అది పసుపు ఒక చిటికెడు జోడించండి. సుమారు రెండు కలపాలి.
 • పైన మిశ్రమానికి క్యాలమైన్లోషన్  యొక్క ఒక tablespoon జోడించండి.
 • అప్పుడు ఒక టీస్పూన్ రోజ్వాటర్ ను ఒక పేస్ట్ వేయాలి.
 • నిమ్మ రసం యొక్క 6 నుండి 7 చుక్కల వరకు వేసి, మృదులాస్థిని తయారుచేయటానికి బాగా పదార్థాలు కలపాలి.

క్యాలమైన్ ఫేస్ మాస్క్ ను ఎలా వేసుకోవాలి

 • మీ ముఖాన్ని నీటితో సరిగా శుభ్రపరుచుకుని పొడిగా ఉంచండి.
 • మీ ముఖంపై ప్యాక్ పూతను వేసి దాన్ని సుమారు 20 నిమిషాల వరకూ ఉంచి ఆరనివ్వండి.
 • 20 నిమిషాల తర్వాత, సాధారణ నీటితో గాని లేదా గేరెచ్చని నీటితో ముఖంపై వేసుకున్న ఫేస్ ప్యాక్ ని కడిగేసుకోవాలి.
 • ఆ తర్వాత, త్వరలోనే, మీ చర్మానికి తేమను అద్దడం మరిచిపోకండి, అంటే మీ చర్మం తేమకల్గి ఉండేట్లుగా ఉంచుకోండి.

ఇలా ఈ లోషన్తో ఫేస్ మాస్క్ను వారానికి రెండు నుండి మూడు సార్లు వేసుకోవలసి ఉంటుంది. ఈ లోషన్ వల్ల ఏదైనా అలెర్జీ ప్రతిచర్యలు జరుగుతాయేమోనన్న సంగతి తెలుసుకోవడానికి చర్మంపై చిన్న ప్రాంతంలో ప్యాచ్ పరీక్ష అవసరం.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

క్యాలమైన్ లోషన్ యొక్క అనేక గొప్ప ప్రయోజనాల దృష్ట్యా క్యాలమైన్ లోషన్ ను అనేకవిధాలుగా ఉపయోగించడం జరుగుతోంది. అయితే, ఈ లోషన్  ను ఉపయోగించినప్పుడు కలిగే కొన్ని దుష్ప్రభావాలను కింద వివరించడం జరిగింది.

 • ఈ ద్రవరూప లోషన్  పైపూత వినియోగానికి మాత్రమే ఉద్దేశించబడింది. ఈ లోషన్ కళ్ళలో పడితే కళ్ళు ఎరుపెక్కి, కళ్ళ మంటను కలిగించవచ్చు. అటువంటి సందర్భంలో, వెంటనే నీటితో కళ్ళను శుభ్రం చేసుకుని ఆలస్యం చేయకుండా మొదట వైద్యుడిని సంప్రదించండి.
 • క్యాలమైన్ లోషన్ ఉపయోగించాక దీనివల్ల కొందరు కొన్ని రకాల అలెర్జీ (అసహనీయ)  ప్రతిచర్యలను అనుభవించవచ్చు. మీరు గనుక క్యాలమైన్ లోషన్ను రాసుకున్నపుడు మంటను గమనించినట్లయితే, వెంటనే దాని ఉపయోగించడం మానుకోండి మరియు ప్రత్యామ్నాయ మందు కోసం మీ డాక్టర్ను సంప్రదించండి.
 • క్యాలమైన్ లోషన్ వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు చాలా అరుదు, కానీ దుష్ప్రభావాలు ఒకవేళ కలిగితే దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో కష్టం మరియు నాలుక, గొంతు లేదా ముఖం యొక్క వాపు కలగొచ్చు. ఈ లోషన్ పూసుకోవడంవల్ల పేర్కొన్నటువంటి దుష్ప్రభావాలు ఏవైనా సంభవిస్తే వెంటనే మీ డాక్టర్ని సంప్రదించండి.

Medicines / Products that contain Calamine

వనరులు

 1. Gupta M et al. Zinc therapy in dermatology: a review. Dermatol Res Pract. 2014;2014:709152. PMID: 25120566
 2. Bibi Nitzan Y, Cohen AD. et al. Zinc in skin pathology and care. J Dermatolog Treat. 2006;17(4):205-10. PMID: 16971312
 3. Mak MF, Li W, Mahadev A. Calamine lotion to reduce skin irritation in children with cast immobilisation. J Orthop Surg (Hong Kong). 2013 Aug;21(2):221-5. PMID: 24014789
 4. Marc Tebruegge, Minju Kuruvilla, Isabel Margarson. Does the use of calamine or antihistamine provide symptomatic relief from pruritus in children with varicella zoster infection? Arch Dis Child. 2006 Dec; 91(12): 1035–1036. PMID: 17119083
 5. Mrinal Gupta, Vikram K. Mahajan, Karaninder S. Mehta, Pushpinder S. Chauhan. Zinc Therapy in Dermatology: A Review . Dermatol Res Pract. 2014; 2014: 709152. PMID: 25120566
Read on app