బెల్లం అన్నది చెరకు నుండి తయారుచేయబడే ఒక రకమైన స్వీటెనర్. శుద్ది చేయబడని కారణంగా చక్కెరకు ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయంగా ఇది పరిగణించబడుతుంది. చక్కెర మరియు బెల్లం దాదాపు ఒకే పరిమాణం‌లో కేలరీలు కలిగిఉన్నప్పటికీ, శరీరానికి అవసరమైన అనేక విటమిన్లు మరియు ఖనిజాలను కూడా బెల్లం కలిగిఉన్నందు వల్ల దీనిని ఉత్తమమైనదిగా భావిస్తారు.    

బెల్లం సాధారణంగా మూడు రూపాల్లో లభిస్తుంది – ఘన, ద్రవ మరియు పొడి రూపాలు. మహారాష్ట్ర మరియు పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాలలో ద్రవ రూపంలో ఉండే బెల్లం బాగా ప్రసిద్ధి చెందింది, అయితే గ్రామీణ ప్రజలలో పొడి బెల్లం సాధారణంగా లభిస్తుంది. బెల్లం విభిన్న రంగులను కలిగిఉంటుంది మరియు ఈ రంగు బంగారు గోధుమ రంగు నుండి ముదురు గోధుమ రంగు వరకు మారుతూ ఉంటుంది. గమనించదగ్గ చాలా ముఖ్యమైన విషయాలలో ముదురు గోధుమ రంగు బెల్లం అధికమైన మరియు లోతైన రుచిని కలిగిఉంటుంది అన్నది ఒక్క ముఖ్యమైన విషయం.      

దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలోని అనేక దేశాలలో బెల్లమును వినియోగిస్తారు. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు శ్రీలంకలోని స్థానిక వంటలలో బెల్లం విస్తారంగా వాడబడుతుంది మరియు ఇది భారతీయ వంటకాల్లోని అతి ముఖ్యమైన పదార్థాలలో ఒకటి. సాంబారు మరియు రసం యొక్క రుచిని పెంచేందుకు ఒక చిటికెడు బెల్లమును వాటిలో కలుపుతారు. పెద్దలు మరియు పిల్లలలో చాలా ప్రసిద్దిచెందిన చిక్కీలు అన్నవి వేరుశనగ కాయలు మరియు బెల్లంతో తయారుచేయబడతాయి. బెల్లం‌ను స్వీట్లు, మద్య పానీయాలు, చాకొలేట్లు, క్యాండీలు, టానిక్‌లు, సిరప్లు, షరబత్‌లు, కేకులు మొదలైన వాటి తయారీలో కూడా ఉపయోగిస్తారు. ప్రపంచం‌లోని బెల్లం ఉత్పత్తిదారుల్లో మహారాష్ట్ర అతి పెద్ద ఉత్పత్తిదారు. అమెరికా, ఆసియా, మరియు ఆఫ్రికాలో బెల్లం విస్తృతంగా వినియోగించబడుతుంది. బెల్లంలోని వివిధ రకాలలో చెరకు బెల్లం, ఖర్జూర బెల్లం, తాటి బెల్లం, టాడీ తాటి బెల్లం మొదలైన రకాలు ఉన్నాయి.            

బెల్లం అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిఉంది. ఇది ఆయుర్వేదం మరియు సంప్రదాయ వైద్యంలో ప్రత్యేక స్థానం కలిగిఉంది. దీనిలో ఇనుము సమృద్ధిగా ఉండడం వల్ల, రక్తహీనతను నివారించడంలో ఇది సహాయపడుతుంది. మీ భోజనం తర్వాత, ఒక చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల, అది జీర్ణక్రియలో సహాయపడుతుందని నమ్ముతున్నారు. మిరియాలతో పాటు బెల్లం తినడం మీ ఆకలిని పెంచుతుంది. ఆయుర్వేద ప్రకారం, బెల్లం‌ను క్రమంగా తీసుకోవడం మీ దృష్టిని పెంచుతుంది. బెల్లం మొటిమల చికిత్సలో మరియు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుటలో కూడా ప్రసిద్ధి చెందింది. రాతి ఉప్పుతో పాటు బెల్లం‌ను తీసుకోవడం ద్వారా పుల్లని త్రేన్పులను నయం చేయవచ్చు.        

బెల్లం గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

  • వృక్ష శాస్త్రీయ నామం: బెల్లం చెరకు యొక్క ఒక ఉప ఉత్పత్తి, సాచర‌మ్ ఆఫిసీనరమ్   
  • జాతి: పోసియో (చెరకు కోసం)
  • వ్యవహారిక నామం: గుడ్
  • సంస్కృత నామం: గుడ్డ్ / శర్కరా   
  • జన్మించే ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: బెల్లం యొక్క మూలం తూర్పు భారతదేశం‌లో ఉందని కొంతమంది ప్రజలు నమ్ముతారు, పోర్చుగీసు వారు దీనిని భారతదేశానికి పరిచయం చేసారని ఇతరులు నమ్ముతారు. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ మరియు శ్రీలంక దేశాలు  ప్రపంచం‌లో బెల్లం యొక్క అతి పెద్ద ఉత్పత్తిదారులు.
  • ఆసక్తికర అంశం: బెల్ల‌ం‌ను తరచుగా “ సూపర్‌ఫుడ్ స్వీటెనర్” గా సూచిస్తారు
  1. ఉపసంహారం - Takeaway in Telugu
  2. బెల్లం పోషక విలువలు - Jaggery nutrition facts in Telugu
  3. బెల్లం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Jaggery health benefits in Telugu
  4. బెల్లం దుష్ప్రభావాలు - Jaggery side effects in Telugu

బెల్లం అన్నది శుద్ధిచేయబడని చెరకు గడ, ఈ చెరకు గడ ముఖ్యమైన ఖనిజాలు మరియు విటమిన్లను అలాగే నిలుపుకొని ఉంటుంది. బెల్లం బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది, దీనిని ఋతుస్రావం యొక్క లక్షణాలను నివారించేందుకు ఉపయోగిస్తారు, నాడీ లక్షణాల సరైన పనితీరును ఇది ప్రోత్సహిస్తుంది మరియు ఇది యాంటిఆస్థమాటిక్ మరియు యాంటిఆక్సిడంట్ లక్షణాలను కలిగిఉంటుంది. అయితే, బెల్లం యొక్క అధిక వినియోగం మలబద్దకానికి దారితీస్తుంది మరియు బరువును పెంచుతుంది. డయాబెటిస్‌ ఉన్న వ్యక్తులకు స్వీటెనర్ యొక్క సరైన ఎంపిక కాదు. ప్రాసెస్ చేయని బెల్లం‌ను అమ్మే ఒక సురక్షితమైన స్థలం నుండి బెల్లం కొనడం మంచిది. బెల్లం యొక్క అన్ని ఆరోగ్య ప్రయోజనాల కారణంగా, తెలుపు చక్కెరకు ఇది ఒక మంచి ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది.    

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

బెల్లం రసాయనికంగా ప్రాసెస్ చేయబడలేదు. కాబట్టి, శుద్ధి చేసిన తెల్లటి చక్కెర వలె కాకుండా, ఇది చాలా ఖనిజాలను కలిగిఉంటుంది.   

యుఎస్‌డిఎ పోషక విలువల డేటాబేస్ ప్రకారం, 100 గ్రా. బెల్లం బిల్లలు క్రింది పోషకాలను కలిగిఉంటాయి:

పోషకాలు విలువ, 100 గ్రా. లకు
శక్తి 375 కి.కేలరీలు
కార్బోహైడ్రేట్ 92.86 గ్రా.
చక్కెర 85.71 గ్రా.
ఖనిజాలు  
క్యాల్షియం 29 మి.గ్రా.
ఇనుము 2.57 మి.గ్రా.
సోడియం 36 మి.గ్రా.

బెల్లం ఒక అద్భుతమైన స్వీటెనర్, ఇది మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. బెల్లం యొక్క సాక్ష్య-ఆధారిత ఆరోగ్య ప్రయోజనాలను మనం ఒకసారి పరిశీలిద్దాము.   

  • అధిక ఖనిజాల కంటెంట్: ఇనుము, మెగ్నీషియం, జింక్ మరియు ఫాస్ఫరస్ వంటి ఆరోగ్య నిర్మాణ ఖనిజాలతో బెల్లం నిండి ఉంటుంది. పోషకాహార లోపం గల ప్రజలలో తెల్లటి చక్కెరకు ఇది ఒక మంచి ఆదర్శవంతమైన ప్రత్యామ్నాయం.    
  • హిమోగ్లోబిన్‌ను మెరుగుపరుస్తుంది: బెల్లం అన్నది ఇనుముకు ఒక సమృద్ధికరమైన వనరు, అందువల్ల రక్తహీనత గల వ్యక్తులలో హిమోగ్లోబిన్ కంటెంట్‌ను మెరుగుపరిచేందుకు ఇది ఒక అద్భుతమైన ఆహార సప్లిమెంట్. స్త్రీలు మరియు యవ్వనస్థులైన అమ్మాయిల్లో రక్తహీనత నివారణకు బెల్లం యొక్క క్రమమైన వినియోగం సూచించబడింది.  
  • రక్తాన్ని శుద్ధిచేస్తుంది: బెల్లం శరీరం‌పై ఒక నిర్విషీకరణ ప్రభావాన్ని కలిగిఉంది. శరీరం‌లోని విష పదార్థాలను తొలగించడంలో సహాయం చేస్తుంది, కాలేయం మరియు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.  
  • మెదడు పనితీరును మెరుగుపరుచుట: బెల్లం ఒక మంచి పరిమాణంలో మాంగనీస్‌ను అందిస్తుంది, ఇది మెదడు సంకేతాలను నిర్వహించే మరియు మెరుగుపరిచే బాధ్యత గల ఒక ఖనిజం. బెల్లం యొక్క వినియోగం జ్ఞాపకశక్తి మరియు జ్ఞాన సామర్థ్యాలను బలంగా ఉంచడం మాత్రమే కాకుండా ఇది న్యూరోడీజనరేషన్‌ను నిరోధిస్తుంది.      
  • బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది: ఒకవేళ మీరు కొన్ని పౌండ్ల బరువును తొలగించుకోవాలని చూస్తుంటే, బెల్లం చక్కెరకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం కావచ్చు. చక్కెర మాదిరిగా కాకుండా, బెల్ల‌ంలో ఉండే కేలరీలు ఆరోగ్యాన్ని నిర్మించే విటమిన్లు మరియు ఖనిజాల నుండి తయారుచేయబడతాయి మరియు బెల్లం కూడా జీవక్రియ పనితీరును మెరుగుపరచడానికి  కనుగొనబడింది, అందువల్ల అది బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.  
  • మహిళలకు ప్రయోజనాలు: బెల్లం రక్త ప్రవాహాన్ని పెంచుతుంది మరియు స్త్రీలలో కాలానుగుణంగా వచ్చే తిమ్మిరిని తగ్గిస్తుందని తెలుపబడింది. ఇనుము మరియు క్యాల్షియం యొక్క గొప్ప వనరు కారణంగా,ఇది ఎముకలను పరిరక్షించడంలో సహాయపడుతుంది మరియు రక్తహీనతను నివారిస్తుంది. 

రక్తహీనత కోసం బెల్లం - Jaggery for anaemia in Telugu

రక్తహీనత అన్నది శరీరం‌లో హిమోగ్లోబిన్ స్థాయి చాలా తక్కువగా ఉండే ఒక పరిస్థితి. దీని ఫలితంగా, కణజాలాలకు ఆక్సిజన్ సరిగ్గా తీసుకొనిపోబడదు, దీని ఫలితంగా ఒత్తిడి మరియు అలసట వంటి వివిధ సమస్యలు వస్తాయి. బెల్లం ఇనుమును సమృద్ధిగా కలిగిఉందని పరిశోధన చూపిస్తుంది మరియు అది రక్తహీనత నిరోధించేందుకు సహాయపడుతుంది.  

ఇతర సహజ పదార్థాలతో పాటు బెల్లం సిరప్‌ నుండి తయారుచేసిన ఒక మూలికా సారం యొక్క ప్రభావాలను గుర్తించేందుకు, ఇనుము లోపంతో బాధపడుతున్న యవ్వనస్థులైన అమ్మాయిల పైన ఒక అధ్యయనం జరిగింది. బెల్లం యొక్క సాధారణ వినియోగం శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది, తద్వారా రక్తహీనత నివారణ జరుగుతుందని అధ్యయనం నిర్ధారించింది.    

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది - Jaggery purifies blood in Telugu

శరీరం‌లో ఆక్సిజన్, పోషకాలు మరియు ఇతర హార్మోన్లను తీసుకెళ్లడం‌లో రక్తం బాధ్యత వహిస్తుంది. మన రక్తం శరీరం నుండి బయటకు వ్యర్థపదార్థాలను కూడా రవాణా చేస్తుంది అయితే జీవనశైలి మరియు ఆహార ఎంపికలు వంటి కారకాలు రక్తంలో విష పదార్థాల యొక్క దారి తీస్తాయి. అధిక టాక్సిన్లు తర్వాత సాధారణ శరీర పనితీరును దిగజారుస్తాయి. శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి కాలేయం మరియు మూత్రపిండాలు ప్రధానంగా బాధ్యత వహిస్తాయి, తద్వారా రక్తం శుద్ధి చేయబడుతుంది. అయితే సహజంగా రక్తాన్ని శుద్ధిచేయగల కొన్ని ఆహార పదార్థాలతో సహా కొన్ని ఆహార మార్పులను మనం కూడా చేయవచ్చు.     

రక్తం శుద్ధిచేయగల సామర్థ్యం కలిగిన పదార్థాలలో బెల్లం ఒక పదార్థంగా ఉందని పరిశోధన వెల్లడిస్తుంది. తగిన పరిమాణంలో బెల్లం యొక్క క్రమమైన వినియోగం శరీరం నుండి హానికరమైన టాక్సిన్లను కడగడానికి బెల్లం సహాయంచేస్తుంది. పురాతన వైద్య లేఖనం సుష్రుత సంహిత  కూడా బెల్లం యొక్క రక్తశుద్దీకరణ సామర్థ్యం గురించి ప్రస్తావిస్తుంది. రక్తం యొక్క శుద్దీకరణ కూడా ఆరోగ్యకరమైన కాలేయం మరియు మూత్రపిండాల ఫలితాలను ఇస్తుంది, ఇది క్రమంగా బెల్లం యొక్క నిర్విషీకరణ ప్రయోజనాలను కూడా జోడిస్తుంది.     

 (మరింత చదవండి: సహజంగా రక్తాన్ని ఎలా శుద్ధి చేస్తారు

బెల్లం యొక్క ఖనిజాల కంటెంట్ - Jaggery mineral content in Telugu

ఐరన్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం మొదలైనటు వంటి ఖనిజాలను బెల్లం సమృద్ధిగా కలిగిఉంటుంది. ఇది క్యాల్షియం , జింక్ మరియు ఫాస్ఫరస్ లను సహేతుకమైన మొత్తం‌లో కలిగిఉంటుంది. బెల్లం ప్రాసెస్ చేయబడని కారణంగా, అన్ని ఖనిజాలు మరియు విటమిన్లు బెల్లంలో చెక్కుచెదకుండా ఉంటాయి, ఇది తెలుపు చక్కెరకు ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా దీనిని మార్చింది. అన్ని ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాల యొక్క ఉనికి, లోపంతో ఉండే పిల్లలు మరియు పెద్దల కోసం ఒక ఆదర్శవంతమైన స్వీటెనర్ ఎంపికగా దీనిని చేసింది.    

ఊపిరితిత్తుల కోసం బెల్లం ప్రయోజనాలు - Jaggery benefits for lungs in Telugu

ఊపిరితిత్తులు నిరంతరం హానికరమైన దుమ్ము కణాలు మరియు కాలుష్యానికి బహిర్గతం అవుతుంటాయి. ఈ ధూళి కణాలను స్వయంగా తొలగించుకునే అనుమతి కలిగిన రక్షణ యంత్రాంగం మన ఊపిరితిత్తులకు ఉన్నప్పటికీ, ధూళికి ఎక్కువ కాలం పాటు బహిర్గతంగా ఉండడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులకు దారితీస్తుంది. ఇది సాధారణంగా కలుషిత వాతావరణాల్లో పనిచేసే వ్యక్తులు అనగా భవన కార్మికులు, గని కార్మికులు వంటి వారిలో మరియు కొన్ని రసాయన పరిశ్రమల్లో పనిచేసే వ్యక్తులలో ఈ వ్యాధి గమనించబడుతుంది. ఊపిరితిత్తుల నుండి దుమ్ము కణాలను తొలగించడంలో బెల్లం సమర్థవంతమైనదని ప్రిక్లినికల్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. బొగ్గు ధూళి వల్ల కలిగే గాయాలు తగ్గించడంలో కూడా బెల్లం సమర్థవంతమైనదని ఈ అధ్యయనం సూచిస్తుంది.      

బెల్లంలో ఉండే సూక్ష్మ పోషకాలు యాంటికార్సినోజెనిక్ లక్షణాలు కలిగిఉంటాయని, వీటి ద్వారా ఊపిరితిత్తుల క్యా‌న్సర్ అవకాశాలను ఇది నిరోధిస్తుందని మరొక అధ్యయనం సూచించింది. 

బెల్లం యాంటిఆక్సిడంట్ లక్షణాలను కలిగిఉంటుంది - Jaggery has antioxidant properties in Telugu

స్వేచ్చా రాడికల్స్‌ (రియాక్టివ్ ఆక్సిజన్ స్పిసీస్) ద్వారా ఏర్పడే హానికరమైన ప్రభావాలతో పోరాడడం శరీరానికి సాధ్యం కానప్పుడు ఆక్సీకరణ ఒత్తిడి సంభవిస్తుంది. ఇది క్యా‌న్సర్, ఆర్థరైటిస్ మరియు గుండె సంబంధ వ్యాదుల వంటి పరిస్థితులలో ఒక ప్రమాధకారకంగా ఉండవచ్చు. యాంటిఆక్సిడంట్లు ఈ హానికరమైన స్వేచ్చా రాడికల్స్‌ తటస్థీరణకు బాధ్యత వహిస్తాయి, తద్వారా వ్యాధులను కలిగించకుండా వాటిని నిరోధించవచ్చు. పరిశోధన ప్రకారం, బెల్లం‌లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది మరియు ఇది సెలీనియం‌తో పాటు స్వేచ్చా రాడికల్స్ నష్టం జరుగకుండా నివారించడంలో సహాయపడుతుంది, తద్వారా వివిధ రకాల అంటువ్యాధులకు వ్యతిరేకంగా మీ శరీరం యొక్క రోగనిరోధకతను పెంచుతుంది. బెల్లం అవసరమైన ఫినాలిక్ ఆమ్లాలను కలిగిఉందని, ఇది ఆక్సీకరణ నష్టానికి వ్యతిరేకంగా 97% శారం రక్షణ చూపించిందని మరొక అధ్యయనం వెల్లడించింది,    

 (మరింత చదవండి: యాంటిఆక్సిడంట్ సమృద్ధిగా కలిగిన ఆహారాలు

మెదడు కోసం బెల్లం ప్రయోజనాలు - Jaggery benefits for brain in Telugu

బెల్లం యొక్క సాధారణ వినియోగం మిమ్మల్ని తెలివైనవారిగా చేయగలదని మీకు తెలుసా?

నాడీవ్యవస్థ అన్నది నరాలు మరియు కణాల సమూహాన్ని కలిగిఉంటుంది, ఇవి మెదడు, వెన్నెముక మరియు శరీరం‌లోని వివిధ భాగాలకు నాడీవ్యవస్థ నుండి మరియు వాటి నుండి నాడీ వ్యవస్థకు సందేశాలను ప్రసారం చేయడంలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థలో ఏదైనా అసమతుల్యత మరియు నష్టం అన్నది మూర్ఛ, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అల్జీమర్స్‌ వ్యాధి మొదలైనటువంటి వివిధ నాడీ సంబంధిత రుగ్మతలకు దారితీయవచ్చు.

బెల్లం మాంగనీస్ ‌కు ఒక మంచి వనరు, ఇది చాలా ముఖ్యమైన ఒక ఖనిజం, కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క సరైన పనితీరుకు ఇది చాలా అవసరం. మాంగనీస్ మెదడులో న్యూరో‌ట్రా‌న్స్మిటర్ గ్రాహకాల యొక్క పనితీరును నియంత్రిస్తుందని పరిశోధన వెల్లడించింది, శరీరం ద్వారా సంవేదనాత్మక సిగ్న‌ల్స్ వేగంగా ప్రయాణించేలా చూసుకోవాలి.

మెగ్నీషియం న్యూరోప్రొటెక్టివ్ లక్షణాలను కూడా ప్రదర్శిస్తుంది, మరియు ఇది నాడీ వ్యవస్థను మరింత బలపరుస్తుంది. 

ఆస్థమా కోసం బెల్లం - Jaggery for asthma in Telugu

ఆస్థమా అన్నది ఊపిరితిత్తుల వాయుమార్గాలు మరియు శ్వాస ఇబ్బందిలో మంట చేత కలిగిన దీర్ఘకాలిక పరిస్థితి. అన్ని వయసుల ప్రజలలో ఆస్థమా చాలా సాధారణమైనది. క్లీ‌న్సింగ్ మరియు యాంటిఆస్థమాటిక్ లక్షణాలను బెల్లం ప్రదర్శిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి, ఇవి ఊపిరితిత్తులు మరియు నాసికా ఎముక రంధ్రాలను శుభ్రపరుస్తాయి మరియు గురక, దగ్గు మరియు జ్వరం వంటి ఆస్థమా లక్షణాలను తగ్గిస్తాయి. ఇది దుమ్ము మరియు ఇతర కాలుష్యాలకు సున్నితంగా ఉన్నవారికి ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది. బెల్లం యొక్క యాంటి-అలెర్జిక్ లక్షణాల కారణంగా అనేక ఆయుర్వేదిక మందులు మరియు టానిక్‌లు వాటి యొక్క ప్రధాన పదార్థాలలో ఒకదానిగా బెల్ల‌ంను కలిగిఉన్నాయి.   

ఋతుస్రావం‌లో బెల్లం ప్రయోజనాలు - Jaggery benefits in menstruation in Telugu

చాలామంది మహిళలు ఋతుస్రావం సమయం‌లో వివిధ లక్షణాలను అనుభవిస్తారు. వీటిలో ఉబ్బరం, పొత్తికడుపు తిమ్మిరి, మానసిక కల్లోలం, తలనొప్పి మరియు కండరాల తిమ్మిరి వంటివి ఉంటాయి. ఈ సమస్యలకు బెల్లం‌ను గృహచికిత్సగా ఉపయోగిస్తారు. పరిశోధన ప్రకారం, ఋతుస్రావం సమయంలో బెల్లం యొక్క వినియోగం స్వేచ్చా రక్త ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది. బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉండే కారణంగా, వారి ఋతుస్రావం సమయం‌లో రక్తహీనత భావన నుండి మహిళల్ని నిరోధించేందుకు ఇది సహాయపడుతుంది.   

బరువు తగ్గడం కోసం బెల్లం - Jaggery for weight loss in Telugu

నేటి ప్రపంచంలో, బరువు తగ్గడం కోసం ప్రతీ ఒక్కరూ త్వరితమైన మరియు సులువైన నివారణ కోసం చూస్తున్నారు. అధిక చక్కెర కంటెంట్ ఉన్నప్పటికీ, బరువు తగ్గడంలో బెల్లం సహాయపడుతుందన్న ఈ విషయంలో మీరు అశ్చర్యపడి ఉండవచ్చు.

చక్కెర మరియు బెల్లం ఒకే పరిమాణం‌లో కేలరీలను కలిగిఉంటాయి. అయితే ఈ రెండిటి మధ్య తేడా ఏమిటంటే, చక్కెర ఖాళీ కేలరీలను కలిగిఉంటుంది అయితే బెల్లం అనేక ఖనిజాలు మరియు విటమిన్లతో నిండి ఉంటుంది, ఇవి శరీరానికి ప్రయోజనకరమైనవి. బరువు తగ్గడంలో బెల్లం సహాయపడుతుందని పరిశోధన చూపుతుంది. ఇది పొటాషియం‌ను సమృద్ధిగా కలిగిఉంటుంది, శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా శరీరం‌లో నీటి నిలుపుదలను ఇది నిరోధిస్తుంది. మీరు తిన్న కేలరీలను మీ శరీరం ఎంత వేగంగా మండించింది అన్నదానిని జీవక్రియ అంటారు. అదనపు కేలరీలను కరిగించా లనుకునే వ్యక్తులకు ఇది ఒక ముఖ్యమైన కారకం. బెల్లం‌ను తీసుకోవడం మీ జీవక్రియను పెంచడానికి సహాయపడుతుందని, అది బరువు తగ్గేందుకు దారితీస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి,      

 (మరింత చదవండి: ఊబకాయ చికిత్స

  • డయాబెటిస్ ప్రమాధాన్ని పెంచుతుంది
    బెల్లం అన్నది ఒక స్వీటెనర్. ఏదైనా స్వీటెనర్‌ను అదనంగా తీసుకుంటే అది దుష్ప్రభావాలను కలిగిస్తుంది. డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు లేదా ఈ వ్యాధిని పొందే ప్రమాదం ఉన్న వ్యక్తులకు బెల్లం అధికంగా తీసుకోవడాన్ని సిఫార్సు చేయలేము. బెల్లం యొక్క వివిధ ఆరోగ్య ప్రయోజనాల వల్ల దాన్ని సిఫార్సు చేసిన ఆయిర్వేదం కూడా, డయాబెటిస్ కలిగిన వ్యక్తులు బెల్లం ఉపయోగించరాదని వాదిస్తుంది.     ​​
  • ·ఇన్‌ఫెక్షన్‌ కు కారణం కావచ్చు
    నియోగానికి ముందు బెల్లం‌ను శుద్ధిచేయడం అవసరం. ఒకవేళ బెల్లం సరిగ్గా శుభ్రం చేయకపోతే, అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారుచేసినప్పుడు, బెల్లం దానిలో రోగ-కారక సూక్ష్మసూక్ష్మజీవులను కలిగి ఉండవచ్చు. బెల్లం ఆకర్షనీయంగా కనిపించడానికి దానికి రసాయనాలు జోడించినప్పుడు, బెల్లం యొక్క కల్తీ కూడా సాధారణమవుతుంది. అందువల్ల, ప్రాసెస్‌ చేయని బెల్లం‌ను విక్రయించే వాస్తవమైన స్థలం నుండి బెల్లం కొనడం చాలా అవసరం.                                                 
  • బరువు పెరుగుదలను పెంచుతుంది
    శుద్ధి చేసిన తెలుపు చక్కెర కంటే బెల్లం మంచిది. అయితే పెద్ద పరిమాణంలో బెల్లం తినడం కేలరీల పెరుగుదలకు దారి తీస్తుంది, ఇది క్రమంగా బరువు పెరుగుదలకు దారితీస్తుంది.
  • ఇతర దుష్ప్రభావాలు  
    సమృద్ధిగా బెల్లం వినియోగించడం మలబద్ధకానికి దారితీస్తుందని నమ్ముతారు మరియు అలెర్జీకి కారణమవుతుంది, ఇది దద్దుర్లు, వికారం మరియు జ్వరం వంటి లక్షణాలను కలిగిఉంటుంది. 

Medicines / Products that contain Jaggery

వనరులు

  1. United States Department of Agriculture Agricultural Research Service. Full Report (All Nutrients): 45218052, JAGGERY BALL, UNREFINED CANE SUGAR. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
  2. Resmi.S, Fathima Latheef, R.Vijayaraghavan. Effectiveness of Herbal Extract in Enhancing the Level of HB among Adolescent Girls with Iron Deficiency Anemia at Selected Higher Secondary Schools at Bangalore. International Journal of Health Sciences and Research, Vol.6; Issue: 10; October 2016
  3. Priyanka Shrivastav, Abhay Kumar Verma, Ramanpreet Walia, Rehana Parveen, Arun Kumar Singh. JAGGERY: A REVOLUTION IN THE FIELD OF NATURAL SWEETENERS. ejpmr, 2016,3(3), 198-202
  4. A P Sahu, A K Saxena. Enhanced translocation of particles from lungs by jaggery. Environ Health Perspect. 1994 Oct; 102(Suppl 5): 211–214. PMID: 7882934
  5. Health Harvard Publishing, Updated: April 3, 2019. Harvard Medical School [Internet]. Potassium and sodium out of balance. Harvard University, Cambridge, Massachusetts.
  6. Yogesh Shankar Kumbhar. STUDY ON GUR (JAGGERY) INDUSTRY IN KOLHAPUR. International Research Journal of Engineering and Technology Volume: 03 Issue: 02 | Feb-2016
Read on app