myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

నల్ల జిలకరను (నల్ల జిలకర లేదా నిగెల్ల సీడ్) ప్రపంచవ్యాప్తంగా వివిధ పేర్లతో పిలుస్తారు. ఆంగ్లంలో దీన్ని “సమల్ ఫెన్నెల్”  (samal fennel) అంటారు. అనేక భారతీయ భాషల్లో నల్ల జిలకరకు అనేక పేర్లున్నాయి. నల్ల జిలకరను మలయాళంలో ఎల్ (ell) లేదా కరుణ్ జీరగం  అంటారు. గుజరాతీలో నల్ల జిలకరను కలోంజీ (kalonji) అని, బెంగాలీలో మొగ్రెల్ (Mogrel) అని మరియు మరాఠీలో కాలే తిల్  (kaale thil) అని అంటారు.

నల్ల జిలకర వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు “నిగెల్లా సాటివా” ( Nigella sativa) మరియు రణన్కులాసెయే (Ranunculaceae) కుటుంబానికి చెందిన సతత హరిత మొక్క నుండి వచ్చిందిది. అత్యంత విలువైన ఔషధ విత్తనాలలో ఒకటి నల్లజిలకర, దీన్నివంటలలో సువాసనను కల్పించే ఏజెంట్ గా కూడా వాడతారు. కూర మసాలా మరియు గరం మసాలా యొక్క చాలా ముఖ్యమైన భాగం ఈ నల్లజిలకర. భారతీయ ఊరగాయల యొక్క రుచి, సువాసనల్లో ఒకింత చేదురుచినిచ్చే రుచి  కూడా ఉండేందుకు కారణం ఈ నల్ల జిలకర విత్తనాలను వాటిల్లో వాడటం వల్లనే. ఇది ఖాడీ , సమోసా , కచోరి వంటి అనేక ప్రముఖ భారతీయ వంటలలో సువాసన కోసం ఉపయోగించబడుతుంది .

నల్ల జిలకరను వివిధ రూపాల్లో, అంటే నల్ల జిలకరనూనె, వేయించిన నల్లజిలకర విత్తనాలు, ముడి నల్లజిలకర విత్తనాలుగా, వాడుకోవచ్చు. నల్ల జిలకరను పచ్చివిగానే నమిలినా, తిన్నా రుచికి చేదుగా అనిపించినా, దాన్ని  వంటలో చేర్చినప్పుడు ఆ వంట రుచిని మరింత పెంచుతుంది. నల్ల జిలకరకు ఒక పదునైన మరియు కొద్దిగా చేదు రుచి, మరియు మసాలా కారం-తీపి కలిసిన సువాసనాభరిత రుచిని కలిగి ఉంటుంది. ఇది మూడు రంగులలో లభిస్తుంది. అనగా పసుపు-నారింజ కలగలిసిన రంగు, తెలుపు మరియు నలుపు రంగుల్లో నల్ల జిలకర లభిస్తుంది.

దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా మరియు నైరుతి ఆసియా ప్రాంతాలకు చెందిన నల్ల జిలకరను   మధ్య ప్రాచ్యం, మధ్యధరా ప్రాంతం, దక్షిణ ఐరోపా, భారతదేశం, పాకిస్తాన్, సిరియా, టర్కీ మరియు సౌదీ అరేబియా వంటి ప్రపంచంలోని అనేక దేశాలలో సాగు చేస్తారు.

యునాని మరియు ఆయుర్వేదం వంటి భారతీయ సాంప్రదాయ వైద్య వ్యవస్థలలో నల్ల జిలకర గింజలు మరియు నల్ల జిలకర నూనెను శతాబ్దాలుగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు మరియు”టిబ్-ఇ-నవాబి  (ప్రవచనాత్మక వైద్యంలో) కూడా సిఫార్సు చేయబడింది. నల్ల జిలకరను రక్తంలో ఎక్కువగా కొవ్వు చేరే రుగ్మత ‘కొలెస్టెరాల్’ ను  తగ్గించడంలో చాలా సహాయకారిగా ఉంటుంది, శరీర అమరికను ఉంచడంలో ఇది సహాయపడుతుంది. అదనంగా, అధిక రక్తపోటును తగ్గించడం, గుండె సమస్యలు మరియు చర్మ సమస్యలు మరియు అలెర్జీలను కూడా నయం చేయడం వంటి పలు ఆరోగ్య సమస్యలకు నల్ల జిలకర ఒక సహజ చికిత్సగా పనిచేస్తుంది.

నల్ల జిలకర గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

 • శాస్త్రీయ నామం: నిగెల్లా సాటివా (Nigella Sativa)
 • కుటుంబము: రణన్కులాసెయే
 • సాధారణ పేరు: నల్ల జిలకర, కలోంజి, బ్లాక్ కరవే, నిగెల్లా
 • సంస్కృతం పేరు: కృష్ణ జీరా
 • ఉపయోగించే భాగాలు: నిగెల్ల సాటివా మొక్క యొక్క పండ్లు చాలా విత్తనాలను కలిగి ఉంటాయి, వీటినే సాధారణంగా మసాలాగా వాడతారు.
 • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: నల్ల జిలకర గురించిన సమాచారం తగినంతగా లేకపోయినా ఈజిప్టు మరియు టర్కీలలోని పురాతన ప్రదేశాలలో జరిపిన  త్రవ్వకాలలో నల్ల జిలకర విత్తనాల గురించిన జాడలు దొరికాయి. ఈ పంటను ఐరోపాలో, భారతదేశం మరియు ఉత్తర ఆఫ్రికా వంటి సౌత్ వెస్ట్ ఆసియా దేశాలలో సాగు చేయబడుతుంది.
 • ఆసక్తికరమైన నిజాలు: ప్రఖ్యాత ముస్లిం పండితుడు అల్ బుఖారీ, నల్లజిలకరను 'ఆశీర్వదించబడింది' అనే అర్ధం స్ఫురించే విధంగా “హబ్బత్ అల్ బరకా” అని కొనియాడినాడు.  అతని ప్రకారం, ప్రవక్తలలో ఒకరు ఒక్క మృత్యువును మినహాయించి అన్ని వ్యాధులను నయం చేయగల మందుగా నల్ల జిలకర ను పేర్కొన్నారు.
 1. నల్ల జిలకర పోషక వాస్తవాలు - Kalonji nutrition facts in Telugu
 2. నల్ల జిలకర ఆరోగ్య ప్రయోజనాలు - Kalonji (Nigella seeds) health benefits in Telugu
 3. నల్ల జిలకర దుష్ప్రభావాలు - Kalonji (Nigella seeds) side effects in Telugu
 4. ఉపసంహారం - Takeaway in Telugu

నల్ల జిలకర గింజలు శరీరం యొక్క ముఖ్యమైన అవయవాలైన కడుపు, ప్రేగులు, హృదయం, మూత్రపిండాలు, కాలేయముతో ముడిపడ్డ అనేక రకాల వ్యాధుల కొరకు  మరియు రోగనిరోధక వ్యవస్థ మద్దతుకు ఉపయోగించబడతాయి. దాదాపు 70% సంప్రదాయ ఆయుర్వేద మందులు నల్ల జిలకర (నిగెల్లా) విత్తనాలను ఓ ముఖ్యమైన మందు వస్తువుగా (as an item of formula) కలిగి ఉంటాయి.

నల్ల జిలకర విత్తనాలు పోషకపదార్థాలు (ప్రోటీన్లు), కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, మరియు  పీచుపదార్థాల (ఫైబర్) యొక్క గొప్ప వనరు. ఈ నల్ల జిలకర విత్తనాలు వివిధ విటమిన్లు, ఖనిజాలైన రాగి, ఫాస్ఫరస్, జింక్, ఇనుము, విటమిన్ ఎ , విటమిన్ సి , విటమిన్ కె మొదలైన వాటిని కలిగి ఉంటాయి.

అమెరికా వ్యవసాయ శాఖ (USDA) న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం, 100 గ్రాముల నల్ల జిలకర క్రింది పోషక విలువల్ని కలిగి ఉంటుంది:

పోషక పదార్థం

100 గ్రాములకు విలువ

నీరు

8.06 గ్రా

శక్తి

375 కిలో కే

ప్రోటీన్

17.81 గ్రా

కొవ్వు (ఫ్యాట్)

22.27 గ్రా

కార్బోహైడ్రేట్

44.24 గ్రా

ఫైబర్

10.5 గ్రా

చక్కెర

2.25 గ్రా

మినరల్స్

 

కాల్షియం

931 mg

ఐరన్

66.36 mg

మెగ్నీషియం

366 mg

ఫాస్ఫరస్ 

499 mg

పొటాషియం

1788 mg

సోడియం

168 mg

జింక్

4.80 mg

విటమిన్లు 

 

విటమిన్ ఎ

64 μg

విటమిన్ బి6

0.435 mg

విటమిన్ సి

7.7 mg

విటమిన్ ఇ

3.33 mg

విటమిన్ కె

5.4 μg

కొవ్వులు / కొవ్వు ఆమ్లాలు

 

సాచ్యురేటెడ్

1.535 గ్రా

మోనోఅన్శాచ్యురేటెడ్

14.040 గ్రా

పాలీఅన్శాచ్యురేటెడ్

3.279 గ్రా

 

 • బరువు కోల్పోయేందుకు: నల్ల జిలకర విత్తనాలు ఒక ప్రతిక్షకారినిగా పని చేసి శరీర బరువు మరియు నడుము చుట్టుకొలతను తగ్గించడానికి సహాయపడతాయి.
 • చర్మం కోసం: నల్ల జిలకర విత్తనాలు అనామ్లజని మరియు యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉన్నందున, దాని నూనెను చర్మ రుగ్మతలైన మొటిమలు, మచ్చలు మరియు మచ్చల వంటి చర్మ రుగ్మతలను మాన్పడానికి ఉపయోగిస్తారు.
 • దగ్గు మరియు జలుబుకు: వెచ్చని నీరు మరియు తేనెతో కలిపి నల్ల జిలకర విత్తనాలను కషాయంగా తీసుకుంటే దగ్గు మరియు జలుబు నయమవుతాయి. ఒక పలుచనిబట్టలో (muslin cloth) చుట్టబడిన కొన్ని నల్ల జిలకర విత్తనాలను వాసన చూడ్డం ద్వారా జలుబు, ముక్కుల్లో అడ్డపడే శ్లేష్మం పెరుగుదల నుండి ఉపశమనం లభిస్తుంది.
 • నొప్పికి: నల్ల జిలకర విత్తనాలు నొప్పినివారిణి (అనాల్జెసిక్) మరియు వాపు నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. నల్ల జిలకర ఒక సహజ నొప్పినివారిణిగా పనిచేస్తుంది. నొప్పి, వాపు మరియు తలనొప్పి నుండి ఉపశమనానికి నల్ల జిలకర బాగా సహాయపడుతుంది.
 • కాలేయం జబ్బులకు: నల్ల జిలకర గింజల యొక్క అనామ్లజనిత (యాంటీఆక్సిడెంట్) లక్షణాలు కాలేయానికి తగిలిన గాయం ప్రభావాన్ని  తగ్గించడానికి మరియు ఇన్ఫెక్షన్లను నిరోదించడానికి ఉపయోగపడుతుంది.
 • గుండెకు: నల్ల జిలకర విత్తనాలసేవనం రక్త-కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు గుండె-సంబంధ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
 • క్యాన్సర్ కు వ్యతిరేకంగా: నల్ల జిలకర అనామ్లజనిత లక్షణాలను కల్గి ఉంటుంది, దీని కారణంగా, వీటి సేవనంవల్ల శరీరంలో కణితి పెరుగుదలకు వ్యతిరేకంగా పనిచేసి తద్వారా క్యాన్సర్ వృద్ధిని అరికట్టేందుకు ఉపయోగపడతాయి. ఇది (మెటాస్టాసిస్ను) క్యాన్సర్ వ్యాప్తిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

నల్ల జిలకరను (Kalonji) వంటలలో ఒక అద్భుతమైన సువాసనా కారకంగా వాడతారు  మరియు ఇది అందరికీ సురక్షితమైంది కూడా. నల్ల జిలకరను తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించదు. కానీ, కొన్ని సందర్భాల్లో, నల్లజిలకర కొన్ని దుష్ప్రభావాలను కల్గిస్తుంది.

 • నల్ల జిలకరను పెద్ద మొత్తంలో తీసుకున్నప్పుడు, అది తక్కువ రక్తపోటు మరియు రక్త చక్కెర స్థాయిలకు దారితీస్తుంది, ఇలా నల్ల జీలకర్రను ఎక్కువగా సేవిస్తే ప్రాణాలకు హాని కలిగించేది.
 • పరిశోధనల ప్రకారం నల్ల జిలకరను సేవించడంవల్ల గర్భాశయం యొక్క సంకోచాలను ఉద్దీపన చేయవచ్చు. ఎక్కువ మోతాదుల్లో నల్ల జిలకరను సేవించడంవల్ల గర్భస్రావం కలుగుతుంది. గర్భవతులు క్రమం తప్పకుండా లేదా ఎక్కువ మోతాదులో నల్ల జిలకరను తినడంవల్లఅది పిండం యొక్క ఆరోగ్యాన్ని దెబ్బ తీయవచ్చు. కాబట్టి, గర్భిణీ స్త్రీలు నల్ల జిలకరను సేవించకూడదని సూచించబడ్డారు.
 • ఏవైనా శస్త్రచికిత్సలకు ఇప్పటికే లోనై ఉంటే లేదా ఏదైనా శస్త్రచికిత్స చేయించుకోవాలని యోచిస్తున్నట్లైతే, నల్ల జిలకరను తీసుకోకూడదని సూచించబడింది. ఇది రక్తస్రావం ప్రమాదాన్ని కలిగిస్తుంది మరియు వైద్యంలో మానే ప్రక్రియకు అడ్డుపడే ప్రమాదముంది.
 • మీరు పొట్టలో పుండ్లు లేదా సున్నితమైన కడుపుతో బాధపడుతుంటే, నల్ల జిలకర విత్తనాలను సేవించకుండా ఉండటం ఉత్తమం, ఎందుకంటే అది కడుపులో మండే అనుభూతిని పెంచుతుంది.
 • శరీరంలో వేడిని భరించలేని పిత్త స్వభావం కల్గినవారికి, మసాలాలతో కూడిన ఆహారాలను తినలేనివారికి నల్ల జిలకర సేవనం మరింతగా ఉష్ణ (వార్మింగ్) ప్రభావాన్ని కలిగిస్తుంది. కాబట్టి పిత్త స్వభావం కల్గిన శరీరం ఉన్న వ్యక్తులు నల్లజిలకర మసాలాను సేవించడంవల్ల చాలా కష్టం కల్గుతుంది.

నల్లజీలకర విత్తనాలవల్ల అనేక ప్రయోజనకరమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇటీవలి పరిశోధనల ప్రకారం, ఈ నల్ల జిలకర విత్తనాలు గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో దాదాపు ప్రతి ఇతర సహజమైన మందు కంటే కూడా మెరుగైనవి. ఇది ఒక అద్భుతమైన ప్రతిక్షకారిని మరియు నొప్పినివారిణి.

ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాధుల చికిత్సలో నల్లజిలకర యొక్క ప్రయోజకత్వాన్ని గురించి  అధ్యయనాలు జరిగాయి.

అందువల్ల, మానవాళికి నల్ల జిలకర విత్తనాలు ప్రకృతి ప్రసాదించిన సహజసిద్దమైన ఆశీర్వాదమని సురక్షితంగా చెప్పవచ్చు.

और पढ़ें ...