అసలు మెంతులంటే ఏంటి?

మెంతిమొక్క ఒక మూలిక. మెంతులు ఒక సాధారణంగా ఉపయోగించే ఆహార పదార్దాన్ని సూచిస్తాయి. ఇది మధ్యధరా ప్రాంతం, దక్షిణ ఐరోపా మరియు పాశ్చాత్య ఆసియా ప్రాంతాలకు చెందినది. మెంతిమొక్క విత్తనాలు మరియు ఆకులు రెండింటినీ కలిగి ఉంటుంది, వీటి ఆహ్లాదకరమైన రుచి మరియు మూలిక యొక్క సువాసన కారణంగా వంటల కోసం మరియు ఔషధాలలో, ముఖ్యంగా ఆయుర్వేదంలో, దాని అసాధారణమైన లక్షణాలు కారణంగా ఉపయోగించబడుతుంది; మెంతిమొక్క యొక్క పెరుగుదలకు తగినంత సూర్యకాంతి మరియు సారవంతమైన నేల అవసరం మరియు ఇది సాధారణంగా భారతదేశంలో సాగు చేయబడుతుంది. భారతదేశం ఈ మూలిక యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారులలో ఒకటి. ఇక్కడ, మెంతు ఆకులును (మెథి) సాధారణంగా కూరగాయల వలె వండుతారు, మరియు విత్తనాలను మసాలాలు మరియు ఔషధాలలో క్రియాశీల పదార్ధంగా ఉపయోగిస్తారు. దీనిని వేరే ఔషదాలు లేదా మందులలో వాటి యొక్క వేరే పదార్దాల రుచి తెలియకుండా దాచిపెట్టే సంకలిత కర్తలా (additive agent ) కూడా ఉపయోగిస్తారు. ఇంతే కాకుండా, ఇది సాధారణంగా గృహ ఆధారిత నివారణలు (home based remedies) మరియు వివిధ రుగ్మతలు మరియు వ్యాధుల చికిత్సలకు ఉపయోగపడుతుంది, ఇది భారతీయ గృహాలు మరియు వంటశాలలలో ఒక అనివార్య భాగంగా ఏర్పడింది. జీర్ణ వ్యవస్థపై ఈ ఔషధం యొక్క చికిత్సా ప్రభావాల కారణంగా జీర్ణలోపాలును సాధారణంగా ఇంటి నివారణల (home remedies)తో వీటిని ఉపయోగించి చికిత్స చేస్తారు. ఈ వ్యాసంలోని తరువాతి విభాగాలలో అవి చర్చింపబడతాయి.

మెంతుల యొక్క ఉపయోగం మానవాళి చరిత్రలో, ప్రాచీన గ్రీకుల కాలం నుండి ఉంది, వారు శవాలు కుళ్లిపోకుండా చేసే పరిమళ ద్రవ్యములను తయారు చేసే క్రమములో (Process of emblaming)మెంతులు వాడేవారని వారి సమాధులలో ఉన్న మూలికలఅవశేషాల ద్వారా తెలిసింది. దాని బలమైన రుచి మరియు వాసన కారణంగా, ఇంట్లో కాఫీ మరియు పానీయాలలో వాడబడుతున్నది కెఫిన్ కానీ ప్రత్యామ్నాయంగా కాఫీలో దీనిని ఉపయోగిస్తారు.దీని యొక్క ప్రాధిమికనిజాలు మరియు పోషక విలువల గురించి ఒకసారి తెలుసుకుందాము

మెంతుల గురించి కొన్ని ప్రాధిమిక నిజాలు

  • శాస్త్రీయ నామము: ట్రెగోనెల్ల ఫోఎనుం-గ్రీసియం (Trigonella foenum -graecum)
  • కుటుంబం: ఫాబేసి (బఠాణి కుటుంబం)
  • సాధారణ పేర్లు: మెంతులు, మెంతికూర, మేథీ, గ్రీక్ హే, గ్రీక్ క్లోవర్
  • సంస్కృత నామం: బహుపర్ణి
  • ఉపయోగించే భాగాలు: విత్తనాలు, ఆకులు
  • శక్తి శాస్త్రం: వేడి
  1. మెంతుల పోషక విలువలు - Fenugreek Nutrition Facts in Telugu
  2. మెంతుల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of fenugreek in Telugu
  3. మెంతులను ఎలా ఉపయోగించాలి - How to use fenugreek seeds in Telugu
  4. మెంతుల మోతాదు - Fenugreek Dosage in Telugu
  5. మెంతుల యొక్క దుష్ప్రభావాలు - Side effects of fenugreek in Telugu

మెంతి అనేది చాల పోషకమైన మూలిక మరియు అధిక ఆహారపరమైన పీచు శాతాన్ని కలిగి ఉంది, ఇది బరువు తగ్గుదలలకు సహాయపడుతుంది. ఇది నీటిలో కరిగే హెటిరో పోలిసాకరైడ్ (heteropolysaccharide) అయిన గాలక్టోమన్నన్ (galactomannan)లో  అధికంగా ఉండి మరియు బరువు తగ్గే ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇతర విషయాలు మరియు మెంతులు పోషక విలువలు కింద పట్టికలో చర్చించబడ్డాయి.

 

విరములు

100 గ్రాములకు

నీరు

8.84 గ్రా

ప్రోటీన్

23.00 గ్రా

మొత్తం లిపిడ్

6.41 గ్రా

కార్బోహైడ్రేట్

 58.35 గ్రా

ఫైబర్

 24.6 గ్రా

ఐరన్ 

  33.53 గ్రా

మొత్తం శక్తి: 100 గ్రా కి 323 కిలోకెలోరీలు

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

  సంప్రదాయ చైనీస్ వైద్యం, పాశ్చాత్య సంప్రదాయ మూలికావైద్యం (హెర్బలిజం) మరియు ఆయుర్వేద వైద్య పద్ధతుల్లో దాల్చినచెక్క (సిన్నమోన్) అతి ముఖ్యమైన మసాలా దినుసులలో ఒకటి. కానీ ఆధునిక ఔషధవైద్య పధ్ధతి ఇప్పటికీ దాల్చినచెక్క యొక్క అనేక ఆరోగ్య గుణాలు మరియు దాని వైద్య-సంబంధ ప్రయోజనాలను తెలుసుకోవడంలో వెనుకబడి ఉంది. దాల్చినచెక్క గురించి మనకు తెలిసిన విషయాల గురించి ఇపుడు చూద్దాం.

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది: మెంతి పొడి, 5 నుండి 50 గ్రాముల మోతాదులో తీసుకోవడం వలన కార్బోహైడ్రేట్ జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు మధుమేహంతో  బాధపడుతున్న వ్యక్తుల్లో రక్త గ్లూకోస్ స్థాయిలను తగ్గిస్తుంది.
బరువు తగ్గుదలను ప్రోత్సహిస్తుంది: మెంతి నీటిలో గాలక్టోమన్నన్ (galactomannan) ఉంటుంది, ఇది ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది మాత్రమే కాక రక్తపోటు స్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది, రక్తపోటు ఊబకాయంలో ఒక సాధారణ సమస్య .
మహిళల ప్రయోజనాలు: ఋతుస్రావం మొదటి మూడు రోజులలో 1800-2700 mg మెంతులను తీసుకోవడం మరియు ఋతుస్రావం తరువాతి రోజులలో సుమారు 900mg తీసుకోవడం వలన ఋతుస్రావ సమయం నొప్పిని తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటుందని సూచించబడింది. ఇది కూడా ఋతు చక్రాలను క్రమబద్ధీకరించడంలో కూడా  సహాయపడుతుంది.
వ్యాయామ తీరుని మెరుగుపరుస్తుంది: మెంతులు, మందుల అనుబంధకాల రూపంలో తీసుకునప్పుడు, శరీర కొవ్వును తగ్గించడంతో పాటు కండరాల బలం  మెరుగుపరుస్తుందని కనుగొనబడింది. ఇది వ్యాయామ తీరుని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.
మెంతుల కడుపు ప్రయోజనాలు: ఉబ్బరం మరియు అజీర్ణం వంటి వివిధ కడుపు సమస్యలను నివారించడానికి మెంతి విత్తనాలు సాంప్రదాయకంగా ఉపయోగిస్తారు. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన, అవి మలబద్ధకాన్ని కూడా నివారించవచ్చు.
కీళ్ళవాపు లక్షణాలను తగ్గిస్తుంది: మెంతుల యొక్క పాలి ఇన్సురరేట్డ్ కొవ్వు ఆమ్లాలు (polyunsaturated fatty acids), అనేవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటానికి సూచించబడ్డాయి. వివిధ అధ్యయనాలలో, మెంతులు  కీళ్ళ నొప్పి తగ్గించడానికి మరియు ఆర్థిరైటిక్ వ్యక్తులలో వాపును తగ్గించడానికి ఉపయోగపడుతుందని కనుగొనబడింది.

మధుమేహం కోసం మెంతి టీ - Fenugreek tea for diabetes in Telugu

టైప్ 2 డయాబెటిస్ (మధుమేహం) ప్రధానంగా కణాల యొక్క ఇన్సులిన్ నిరోధకత చర్య వలన కలుగుతుంది, ఇది శరీరంలో గ్లూకోజ్ ను అధికంగా చేస్తుంది.ఫ్రెంచ్లో నిర్వహించబడిన ఒక ఫ్రెంచ్ అధ్యయనంలో,మెంతి విత్తనాల టీ శరీర కార్బోహైడ్రేట్ జీవక్రియను మెరుగుపరచడం ద్వారా రక్తం గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుందని రుజువైంది. మధుమేహ బాధిత వ్యక్తి యొక్క ఆహారంలో కలిసినప్పుడు,ఇది ప్రత్యేకించి టైప్2 డయాబెటిస్ మెల్లిటస్ విషయంలో, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది,. ఈ విత్తనం యొక్క 5 నుండి 50 గ్రాముల మోతాదుని ఆహారాన్ని కలిపి రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు,తీసుకుంటే టైప్ 2 మధుమేహ నియంత్రణకు అత్యంత ప్రభావవంతమైనదిగా చెప్తారు, అయితే టైప్1 మధుమేహా నియంత్రణకు ఎక్కువ మోతాదులో ఆహార సంకలితం కాకుండా,సుమారు 50 గ్రాముల పౌడర్ అవసరమవుతుంది. మెంతులపొడిని మెంతి విత్తనాల నుంచి పొందవచ్చు మరియు రోజుకు రెండుసార్లు తీసుకుంటే, రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుదల పై ప్రభావం చూపిస్తుంది, మూత్రంలో తగ్గిన గ్లూకోజ్ విసర్జన స్థాయి ద్వారా తెలిసింది.

వ్యాయామాన్ని మెరుగు పరచే మెంతి మాత్రలు - Fenugreek tablets improve exercise in Telugu

వ్యాయామం చెయ్యడం పై మెంతివిత్తనాల ప్రభావం విషయంలో విభిన్న అధ్యయనాల నుంచి వచ్చిన ఫలితాలు విరుద్ధంగా ఉన్నాయి, కానీ ఈ చాలా అధ్యయనాల్లో,ఇండస్ బయోటెక్ వంటి 300 మి.గ్రా మెంతి అనుబంధకాలను 8 వారాలపాటు రోజూ వినియోగిస్తే శరీరంలో కొవ్వు శాతం తగ్గిపోయి, కండరాల శక్తిని మరియు ఓర్పు మెరుగుపరుస్తుంది గుర్తింపబడినది. ఇది మొదటి పరిశోధకులు తెలిపినట్లుగా,కాలు మరియు శరీర దారుడ్య వ్యాయామాల పనితీరును మెరుగుపరిచేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇది వ్యక్తులలో వ్యాయామ శక్తిని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది, కానీ ఎక్కువ గంటలు వ్యాయామం చేయలేకపోవచ్చు లేదా ఎక్కువ బరువులు ఎత్తలేక పోవచ్చు.

మెంతి నీళ్ల ప్రయోజనాలు - Benefits of Fenugreek water in Telugu

మెంతులునునీటి రూపంలో, సహజంగా బరువు తగ్గించే పదార్థంగా, ప్రాచీన కాలం నుండి ముఖ్యంగా భారతీయులు ఉపయోగిస్తున్నారు.దీని సహజంగా బరువును తగ్గించే లక్షణాల కారణంగా, ఇతర బరువు తగ్గుదల ఉత్పత్తులు మరియు మాత్రలవలె, ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించదు. ఇది కేవలం బరువు తగ్గుదలకు మాత్రమే కాకుండా అధిక రక్తపోటు (రక్తపోటు), ఇన్సులిన్ నిరోధకత మరియు అజీర్ణం, వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అవి ఇతర విభాగాలలో చర్చించారు. బరువు తగ్గడం అనేది గాలక్టోమన్నన్ (galactomannan) సహాయంతో ప్రారంభమవుతుంది, ఇది మెంతి విత్తనాల నీటిలో కనిపించే ఒక నీటిలోకరిగే హెటిరోపోలీసాసారైడ్ (heteropolysacchride). ఇది ఆకలి తగ్గించడం ద్వారా పనిచేస్తుంది, ఇది మీకు కడుపు నిండిన అనుభూతిని కలుగచేస్తుంది. బరువు తగ్గింపు ఉత్త్పతులలో మెంతులను ఎంత మోతాదులో ఉపయోగిస్తారో తరువాతి విభాగాలలో తెలుసుకుందాం.

అధిక రక్త పోటుకి మెంతి పొడి - Fenugreek powder for hypertension in Telugu

మెంతి పొడి బరువు తగ్గడానికే కాకుండా, మధుమేహం రోగులలో రక్తపోటు యొక్క నిర్వహణ మరియు నియంత్రణలో కూడా ప్రభావవంతమైనది. అధిక రక్తపోటు రక్తంలో అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు (HDL) ఎక్కువ శాతంలో ఉండడం కలుగుతుంది, దీనిని 'చెడ్డ కొలెస్ట్రాల్' అని కూడా పిలుస్తారు.ఎక్కువ శాతంలో అధిక సాంద్రత కలిగినలిపోప్రొటీన్లు (HDL) మరియు తక్కువ శాతంలో తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు (LDL) ఉండడంఅధిక రక్తపోటుకు ప్రధాన కారణాలు. HDL యొక్క ప్రభావాలు బాగా అర్థం చేసుకోగా, LDLలో మెంతులు విత్తనాల ప్రభావాలకు సంబంధించిన విషయాలు ఇంకా గందరగోళంగా ఉన్నాయి.

మలబద్దకం కోసం మెంతి పొడి - Fenugreek powder for constipation in Telugu

మెంతి విత్తనాలను వివిధ జీర్ణ సమస్యలను నివారించడానికి ఉపయోగిస్తారు, మరియు ఈ ప్రయోజనాల గురించి వీటిని సుదీర్ఘకాలంగా ఆయుర్వేదలో వాడుతున్నారు. శరీరంలో దాని వేడిచెసే మరియు నొప్పి తగ్గించే ప్రభావం,మలబద్ధకం మరియు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను నివారించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రోజుకు కనీసం రెండుసార్లు మెంతిపొడిని తీసుకుంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని కూడా నిరోధిస్తుంది. మెంతి గింజలలో ఉన్న అధిక పీచుపదార్థం కారణంగా ఇది సంభవించవచ్చు.

వాపును తగ్గించే మెంతి పొడి - Fenugreek powder reduces inflammation in Telugu

మెంతులు లినోలెనిక్ (linolenic) మరియు లినొలిక్ (linoliec) యాసిడ్స్ ను కలిగి ఉంటాయి, ఇవి వాపు నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి మరియు శరీరంలో మంట ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి. మెంతుల పొడి సారాల సహాయంతో సహాయంతో నిర్వహించిన అధ్యయనాలు కూడా కీళ్ళవాపు ఉన్న వ్యక్తులలో వాపులో తగ్గుదలని ప్రభావితం చేశాయని, తద్వారా అవి యాంటి-ఇన్ఫ్లమేటరీతో పాటు యాంటి ఆర్తరైటిక్ (anti arthritic) లక్షణాలను కలిగివున్నాయి అని తెలియజేశాయి.

అర్థిరైటిస్ కోసం మెంతుల సారం - Fenugreek extract for arthritis in Telugu

మెంతులు లినోలెనిక్ (linolenic) మరియు లినొలిక్ (linoliec) యాసిడ్స్ ను కలిగి ఉంటాయి, ఇవి వాపు నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి మరియు శరీరంలో మంట ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి. మెంతుల పొడి సారాల సహాయంతో సహాయంతో నిర్వహించిన అధ్యయనాలు కూడా కీళ్ళవాపు ఉన్న వ్యక్తులలో వాపులో తగ్గుదలని ప్రభావితం చేశాయని, తద్వారా అవి యాంటి-ఇన్ఫ్లమేటరీతో పాటు యాంటి ఆర్తరైటిక్ (anti arthritic) లక్షణాలను కలిగివున్నాయి అని తెలియజేశాయి.

ఋతుక్రమ సంబంధమైన నొప్పి కోసం మెంతులు - Fenugreek for menstrual pain in Telugu

మెంతులు స్త్రీలలో వివిధ రకాల రుగ్మలను నయం చేయడానికి ఉపయోగించబడతాయి, వీటిలోని విశేష ప్రభావాలు ఋతుసంబంధమైన నొప్పుల చికిత్సలో వాడతారు. రుతుస్రావ సమయంలో ఋతుసంబంధమైన నొప్పుల నిర్వహణలో 1800 - 2700 mg మెంతులు ఋతుస్రావం యొక్క మూడు రోజులలో రోజుకు మూడు సార్లు ప్రతిరోజూ వినియోగించి అలాగే తరువాతి రోజుల్లో రోజుకి మూడుసార్లు 900 mg మోతాదులో తీసుకుంటే ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ మోతాదు బాధాకరమైన ఋతు చక్రంతో బాధపడుతున్న స్త్రీల నొప్పిని తగ్గిస్తుంది, కాబట్టి అనాల్జేసిక్స్ (నొప్పి కిల్లర్స్) అవసరాన్ని తగ్గిస్తుంది.

అండాశయ కణుతుల వ్యాధి (పోలీసిస్టిక్ ఓవరీయన్ సెండ్రోమ్) కోసం మెంతుల సారం - Fenugreek extract for polycystic ovarian syndrome (PCOS)

మహిళల ఆరోగ్యంపై మెంతుల మరో ముఖ్యమైన ప్రభావం ఏమిటంటే, పాలిసిస్టిక్ అండాశయ వ్యాధి లేదా సిండ్రోమ్ యొక్క లక్షణాలను నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది, ముఖ్యంగా మహిళల్లో ఋతు చక్రాల నియంత్రణలో.ప్రాధిమిక పదిశోధకులు, కొన్ని రకాల మెంతులను కొంత పరిమాణంలో తీసుకోవడం వలన ఋతు చక్రాలు నియంత్రణలో ఉంటాయని మరియు వాటి మధ్యకాలంఏదైతే, పిసిఓయస్ (PCOS) స్త్రీలలో క్రమంగా లేదో అది తగ్గుతుందని సూచించారు. ఈ పరిశోధకులు మెంతి విత్తనాల రకాలైన Furocyst, Cepham Inc., Piscataway, NJ వంటివి 1000 మి.జి.లో ఈ ప్రయోజనాలకు సహాయపడటానికి సూచించారు. అంతే కాకుండా,ఈ రకమైన మెంతి విత్తనాల దీర్ఘకాలిక వినియోగం కూడా అండాశయ తిత్తులు మొత్తం పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

శ్వాసకోశ సమస్యలకు మెంతి ఆకులు - Fenugreek leaves for respiratory tract disorders in Telugu

మెంతికూర కు గాయాన్ని తగ్గించే మరియు వాపును నివారించే లక్షణాలు ఉండడం వలన దీనిని ఎక్కువగా శ్వాసకోశ వ్యాధుల లక్షణాల ప్రభావాన్ని తగ్గించేందుకు వినియోగిస్తారు. దీనికి అదనంగా, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటివైరల్ లక్షణాలను కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది, ఇది శ్వాసకోశ వ్యాధులకు బాధ్యత వహిస్తున్న సూక్ష్మజీవులను నాశనం చేయడానికి సహాయపడుతుంది.దీని ఉపశమనం కలిగించే చర్యలు శ్లేష్మ పొరను మెత్తగా చేసి కఫాన్ని పోగొడతాయి. ఇంకా శరీరంపై దాని వేడి ప్రభావాలు, బ్రోన్కైటిస్ వంటి వివిధ శ్వాసకోశ రుగ్మతల లక్షణాల నుండి మరియు దగ్గు మరియు సాధారణ జలుబు వంటి సాధారణ అంటురోగాల నుండి ఉపశమనం కలిగించడంపై చూపిస్తాయి.

నిర్దిష్ట రుగ్మతల యొక్క చికిత్సకు ప్రత్యేకమైన మోతాదు ఇప్పటికే ఉన్న విభాగాలలో చర్చించబడి నది, కాబట్టి కొన్ని మెంతి వంటకాలను ఈ విభాగంలో చెప్పబడినవి, అవి మీ రోజువారీ వాడుకలో చురుకుగా వంటగది పదార్ధంగా మరియు గృహ చికిత్సలో చేర్చుకోవాలి

మెంతుల నీరు

బరువు తగ్గడానికి, మెంతుల నీరు చాలా సమర్థవంతంగా పని చేస్తుంది. ఈ స్టెప్స్ ను అనుసరించడం ద్వారా ఇంట్లో సులభంగా తయారు చేయవచ్చు:

  • నీటిలో ఒక మందపాటి వస్త్రన్ని ముంచి, దానిపై మెంతులను ఉంచండి, దానిని ఒక భారీ వస్తువు లేదా బరువుతో నొక్కి ఉంచండి.
  • మూడు రాత్రులు ఇదే విధంగా వదిలేసి తరువాత బరువును తొలగించండి
  • మొలకలు కావలసినట్టు వచ్చిన తర్వాత, సమర్థవంతంగా బరువు తగ్గడం కోసం మెంతి నీటిని తాగండి

అలాగే కాక మెంతుల పేస్టును వేడినీటిలో కలిపి కూడా బరువు తగ్గేందుకు సేవించవచ్చు. 

మెంతుల టీ

ఇప్పటికి మనకు టైప్ 2 మధుమేహాన్ని నియంత్రించడంలో మెంతులు ప్రభావాన్ని చుపిస్తాయని తెలిసు కాబట్టి, ఈ వంటకం సులభతరం అవుతుంది. మెంతుల టీ ని సులభంగా, సాధారణ వంటగది పదార్ధాలను ఉపయోగించడం ద్వారా ఇంటిలో తయారు చేయవచ్చు. క్రింది దశలను అనుసరించవచ్చు:

  • కొన్ని మెంతులు గింజలను కొంచెం నీటితో కలిపి, ముద్దలా చేయాలి.
  • మరిగే నీటిలో ఈ ముద్దను వేసి టీ ల చెయ్యాలి
  • దాల్చినచెక్క, అల్లం లేదా మిరియాలు వంటి ఇతర పదార్ధాలను రుచిని పెంచడానికి, మీ ఎంపికను బట్టి ఇతర జోడించవచ్చు
  • మూత పెట్టి ఒక 5 నిముషాలు తక్కువ మంటతో మరిగించి అప్పుడు సేవించాలి.

ప్రతి రోజు ఖాళీ కడుపుతో ఈ టీని సెవెంచడం వలన మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు, ఇది మీ ఇన్సులిన్ మరియు ఇతర నియంత్రిత ఔషధాలపై మీరు ఆధార పడడాన్ని తగ్గిస్తుంది.

మెంతులు మరియు తేనె

మీకు మెంతుల బలమైన రుచి మరియు తీవ్రమైన వాసన నచ్చకపోతే, మీరు మెంతులను తేనెతో తీసుకోవడం ద్వారా దానిని తగ్గించవచ్చు. తేనే పోషక ప్రయోజనాలను, రుచిని మెరుగుపరుస్తుంది. ఈ స్టెప్స్ ను అనుసరించడం ద్వారా టీ రూపంలో ఇది తయారు చేయవచ్చు:

  • మరిగే నీటిలో మెంతుల ముద్దను వేసి టీ ని తయారు చెయ్యండి తరువాత ఆ మిశ్రమానికి 3గంటలు మూత పెట్టి ఉంచండి
  • ఇప్పుడు టీ ను వడపోసి తేనె మరియు నిమ్మరసం జోడించండి
  • ఉత్తమ ఫలితాల కోసం ప్రతిరోజూ వినియోగించండి
  • మెంతుల ప్రత్యేకమైన మోతాదు వయస్సు, బరువు, ఎత్తు, లింగం మరియు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. మెంతుల రోజువారీ మోతాదు 5 నుంచి 30 గ్రాములు పొడిగా సూచించబడినది. ఈ మొత్తాన్ని భోజనం ముందు తినడం ఉత్తమం. మీరు మెంతులను రక్తపోటు నివారణగా తీసుకుంటే,అధిక మోతాదు అంటే 25 నుండి 50 g యాంటీ ఇన్ఫ్లమేటరీగా పని చేస్తుంది. కానీ వ్యాద్యుణ్ని సంప్రదించకుండా తీసుకోరాదు.
  • మీరు ఒక డయాబెటిక్ అయితే, హైపోగ్లైసీమియా నివారించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, మరియు మీ వైద్యుడు లేదా ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించకుండా మీరు మెంతులు తినకూడదు.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

ఈ అద్భుత విత్తనాల ప్రయోజనాలు లెక్కలేనంతగా ఉండగా,మీరు ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతుంటే, మెంతులు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను మారుస్తుండటం వలన, మీ వైద్యుడితో సంప్రదించడానికి ముందు మెంతులను తినరాదు.మెంతులు ఒక సురక్షితమైన మూలిక అయినప్పటికీ, ఆహారంలో ఉపయోగించినప్పుడు ఏవైనా దుష్ప్రభావాలను కలిగించలేకపోయినప్పటికీ, ఔషధ ప్రయోజనాల కోసం అదనపు ఉపయోగంతో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కింది దుష్ప్రభావాలు ఏవైనా ఉంటే వెంటనే మీ వైద్యుని సంప్రదించండి.

  1. అతిసారం
  2. కడుపు నొప్పి
  3. ఉబ్బరం లేదా వాయువు
  4. తలనొప్పి
  5. మైకము

మరింత తీవ్రమైన దుష్ప్రభావాలు:

  1. దగ్గు
  2. గురక
  3. ముక్కు దిబ్బెడ
  4. ముఖ వాపు

ఈ మూలికకు తీవ్ర సున్నితత్వ (hyper sensitivity) స్పందన ఉంటే వీటిని గమనించవచ్చు.

హెచ్చరిక

  • గర్భధారణ సమయంలో మెంతుల ఉపయోగం సిఫారసు చేయబడదు, ఎందుకంటే పిండంలో మార్పులు లేదా వైకల్యాలు ఏర్పడవచ్చు.
  • డయాబెటిస్ మెల్లిటస్లో, హైపోగ్లైసీమియా (hypoglycemia) (రక్తంలో తక్కువ చక్కెర స్థాయి) ప్రమాదాన్ని నివారించడానికి సూచించిన మోతాదుని జాగ్రత్తగా ఉపయోగించాలి, ఇది ఒక అత్యవసర వైద్య పరిస్థితి.
  • ఆహారంలో దాని ఉపయోగం కాకుండా, ఔషధ పరంగా మెంతులను 6 నెలల కంటే ఎక్కువ కాలం ఉపయోగించరాదు.
  • పిల్లలలు మెంతులు తినరాదు, ముఖ్యంగా మెంతి విత్తనాలను ప్రత్యక్షంగా తినరాదు.

Medicines / Products that contain Fenugreek

వనరులు

  1. Bahmani M et al. Obesity Phytotherapy: Review of Native Herbs Used in Traditional Medicine for Obesity. J Evid Based Complementary Altern Med. 2016 Jul;21(3):228-34. PMID: 26269377
  2. Kilambi Pundarikakshudu, Deepak H. Shah, Aashish H. Panchal, Gordhanbhai C. Bhavsar. Anti-inflammatory activity of fenugreek (Trigonella foenum-graecum Linn) seed petroleum ether extract. Indian J Pharmacol. 2016 Jul-Aug; 48(4): 441–444. PMID: 27756958
  3. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 02019, Spices, fenugreek seed. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
  4. Nagulapalli Venkata KC, Swaroop A, Bagchi D, Bishayee A. A small plant with big benefits: Fenugreek (Trigonella foenum-graecum Linn.) for disease prevention and health promotion.. Mol Nutr Food Res. 2017 Jun;61(6). PMID: 28266134
  5. Arpana Gaddam et al. Role of Fenugreek in the prevention of type 2 diabetes mellitus in prediabetes. J Diabetes Metab Disord. 2015; 14: 74. PMID: 26436069
  6. Chris Poole et al. The effects of a commercially available botanical supplement on strength, body composition, power output, and hormonal profiles in resistance-trained males. J Int Soc Sports Nutr. 2010; 7: 34. PMID: 20979623
Read on app