myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

మునక్కాయ లేదా మునక్కాడ అనేది మానవజాతి చరిత్రలో విస్తృతంగా ఉపయోగించే మొక్కలు ఒకటి. మునక్కాయ యొక్క విశిష్టత ఏంటి అంటే నీటి లోటు పరిస్థితులలో కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది జాగ్రత్త అవసరం లేకుండానే అవసరమైన పోషకాలు, ఖనిజాలు, మరియు విటమిన్లు ఇచ్చే ఒక గొప్ప వనరుగా ఉంది. వాస్తవానికి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పండితులు దీనిని సూపర్ ఫుడ్ గా (ఉత్తమ ఆహరంగా) భావిస్తారు. పరిశోధనా అభివృద్ధితో, ఈ మొక్క యొక్క ఆరోగ్య లాభాల గురించి మరింత మంది ప్రజలు తెలుసుకుంటున్నారు. ఆహారంగా మాత్రమే ఉపయోగించడం కాకుండా,మునక్కాయ మొక్కను ఇంధనం కోసం, పశువుల పెంపకం, ఎరువులు మరియు సౌందర్యసాధనాలు మరియు సుగంధద్రవ్యాలలో ఉపయోగిస్తారు.


ఇది ఈరోజు ఒక అద్భుతమైన చెట్టు, కానీ ఇది ఆధునిక ఆవిష్కరణ కాదు. మునగ చెట్టును మానవులు 150 బి.సి. లోనే ఉపయోగించారు. కొందరు చరిత్రకారుల ప్రకారం, మౌర్య సైన్యం యొక్క ప్రధాన పోషక పదార్ధంగా మునక్కాయ ఉంది, అదే అలెగ్జాండర్ సైన్యాన్ని ఓడించిందని ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేదం ప్రకారం, కనీసం 300 మానవ వ్యాధులకు చికిత్స చేయగల సామర్థ్యం మునక్కడకు ఉంది. కేవలం మునగాకులే వాటి అద్భుతమైన వైద్యం సంభావ్యత కోసం ప్రసిద్ది చెందాయి. మునక్కాయ చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అన్ని తెలుస్తే, మనం దాన్ని ఒక అద్భుతమైన చెట్టు అని తెలుసుకుంటాము.

మునగ చెట్టు గురించి కొన్ని ప్రాధిమిక నిజాలు

 • శాస్త్రీయ నామము: మొరింగా ఒలిఫెర (Moringa oleifera)
 • కుటుంబం: ఫెబెసీ (Fabaceae)
 • సాధారణ నామాలు: మునగచెట్టు, సాహిజన్, డ్రమ్ స్టిక్ ట్రీ, హార్స్రాడిష్ ట్రీ, బెన్ ఆయిల్ ట్రీ
 • సంసృత నామము: శోభంజాన, డన్సషముల, శీఘ్ర శోభంజాన
 • ఉపయోగించే భాగాలూ: వేర్లు, బెరడు, కాయలు, ఆకులు, పువ్వులు, పసరు.
 • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: మునగ చెట్టు ఉత్తర భారత దేశానికి చెందినది కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణమండలములు, ఉప ఉష్ణమండలములలో పెరుగుతుంది.
 • శక్తి శాస్త్రం: వేడి
 1. మునగ ఆరోగ్య ప్రయోజనాలు - Moringa health benefits in Telugu
 2. మునగ ఉపయోగాలు - Moringa uses in Telugu
 3. మునగ మోతాదు - Moringa dosage in Telugu
 4. మునగ దుష్ప్రభావాలు - Moringa side effects in Telugu

మునగ చెట్టును దాని యొక్క అనేక వైద్యం ప్రయోజనాల గురించి దానిని అద్భుత చెట్టు అని పిలుస్తారు. మునగ యొక్క క్రమమైన వినియోగం వ్యాధులను తొలగించడంలో మాత్రమే కాక దాని యొక్క పోషక లక్షణాలు, ఆరోగ్య ప్రయోజనాలు పోషక లోపాలు నిర్మించడంలో దానిని ఒక ఖచ్చితమైన ఆహార పదార్థంగా చేస్తాయి. మునగలోని కొన్ని ఔషధ ప్రయోజనాలను పరిశీలిద్దాము.

 • అత్యంత పోషకరమైనది: మునగ పోషకాలు మరియు ఖనిజాలతో నిండి ఉంటుంది, ఫైబర్ యొక్క అద్భుతమైన మూలం. ఇది భారతదేశం మరియు ఆఫ్రికాలో ఆరోగ్య సప్లిమెంట్లలో ఒక పదార్ధంగా విస్తృతంగా ఉపయోగించబడుతుంది.
 • పాలిచ్చు తల్లులకు ప్రయోజనాలు: మునగ ఒక గెలాక్టగాగ్ (galactagogue) నిరూపించబడింది. ఇది చనుబాలిచ్చు తల్లులలో పాల స్రావం మరియు ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
 • బరువు తగ్గుదలను ప్రోత్సహిస్తుంది: మునగ జీవసంభందమైన  ఏజెంట్లు కలిగి ఉంది అవి బరువు తగ్గుదల ప్రయోజనాలు కలిగి ఉంటాయని సూచించారు. అవి  శరీర బరువును తగ్గించి BMI ను మెరుగుపరుస్తాయి.
 • చర్మ మరియు జుట్టు ప్రయోజనం: మునగ చర్మం మరియు జుట్టు సమస్యలకు అన్నింటికీ ఒక చక్కటి పరిష్కారం. ఇది  చర్మాన్ని హైడ్రేట్ చేసి మరియు పోషిస్తుంది, జుట్టు పెరుగుదలను  మెరుగుపరుస్తుంది, UV నష్టం మరియు ముదురు మచ్చలు, ముడుతలు  మరియు జుట్టు నెరవడం సంకేతాలను నిరోధిస్తుంది.
 • రక్తపోటును తగ్గిస్తుంది: మునగ రసం హైపోటెన్సివ్ (రక్తపోటును తగ్గించడం) లక్షణాలను కలిగి ఉందని పరిశోధన సూచిస్తున్నాయి,  దానిలో ఉన్న ఫ్లేవానాయిడ్లకు అందుకు కారణం.
 • అల్జీమర్ యొక్క లక్షణాలను మెరుగుపరుస్తుంది: వివో (ప్రయోగశాల ఆధారిత) అధ్యయనాల్లో మునగలో ఉండే అనామ్లజనకాలు అల్జీమర్స్ విషయంలోని  జ్ఞాపకశక్తి మెరుగుపరచడంలో మరియు ఆలస్యంగా  జ్ఞానం కోల్పోవడంలో  ప్రభావవంతంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. ఏది ఏమయినప్పటికీ, క్లినికల్ గా ఇంకా ఈ పరిశీలనలు నిర్ధారించబడలేదు.

పైన చెప్పిన ప్రయోజనాలే కాకుండా, రక్తహీనతను నివారించడంలో మోర్రెరా ప్రభావవంతంగా సూచించబడింది.

 1. బరువు తగ్గుదల ప్రయోజనాలకు మునగ - Moringa weight loss benefits in Telugu
 2. మునగ ఒక పోషక వనరు - Moringa nutrition source in Telugu
 3. చర్మం కోసం మునగ ప్రయోజనాలు - Moringa benefits for skin in Telugu
 4. కొలెస్ట్రాల్ కోసం మునగ - Moringa for cholesterol in Telugu
 5. మధుమేహం కోసం మునగ - Moringa for diabetes in Telugu
 6. అధిక రక్తపోటు కోసం మునగ - Moringa for high blood pressure in Telugu
 7. మునగ యాంటి ఇన్ఫ్లమేటరీ సంభావ్యత - Moringa anti-inflammatory potential in Telugu
 8. కాలేయం కోసం మునగాకు - Moringa for liver in Telugu

బరువు తగ్గుదల ప్రయోజనాలకు మునగ - Moringa weight loss benefits in Telugu

మునగ ఆయుర్వేద మరియు సాంప్రదాయ వైద్య వ్యవస్థలో తెలిసిన బరువు తగ్గుదల కర్త. జంతు ఆధారిత అధ్యయనాలు మునగలో ఉన్న ఐసోతయోసైనేట్స్ (isothiocyanates) కు స్థూలకాయ వ్యతిరేక లక్షణాలు ఉన్నాయని తెలిపాయి. రెండు వేర్వేరు క్లినికల్ ట్రయల్స్ లో, మునగ యొక్క పోలిహేర్బల్ (polyherbal) సూత్రీకరణలు ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలను చూపకుండా,శరీర బరువు మరియు BMI (బేసల్ మెటబోలిక్ ఇండెక్స్) తగ్గించడంలో ప్రభావవంతంగా ఉన్నాయని నివేదించబడింది.

అయినప్పటికీ, మునగ బరువు నష్ట చర్యలు మరియు సరైన మోతాదు తెలుసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు చేయాలి. మునగను బరువు తగ్గింపు కోసం ఉపయోగించటానికి ముందు ఆయుర్వేద వైద్యునితో మాట్లాడాలని ఎల్లప్పుడూ సిఫార్సు చేస్తారు.

(మరింత సమాచారం: ఊబకాయం లక్షణాలు)

మునగ ఒక పోషక వనరు - Moringa nutrition source in Telugu

పరిశోధన ప్రకారం, వృక్షలలో అత్యధిక పోషకాహార వనరులు కలిగి ఉన్న వాటిలో మునగ ఒకటి. మునగ బెరడు లిపిడ్ల యొక్క గొప్ప మూలం కాగా, దాని కాయలు పిండి పదార్దాలలో (కార్బోహైడ్రేట్లలో) పుష్కలంగా ఉంటాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దాదాపు మునగ యొక్క అన్నిభాగాలలో ఫైబర్(పీచు పదార్దాలు) అధికంగా కనిపిస్తుంది. జింక్, ఐరన్, కాల్షియం, సోడియం, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ఖనిజాలు కూడా మునగలో అధికంగా ఉన్నాయని నివేదించబడింది. వాస్తవానికి, ఇది భారతదేశం మరియు ఆఫ్రికాలో జరిగే వివిధ పోషణ కార్యక్రమాలలో ఆరోగ్య అనుబంధకంగా విస్తృతంగా ఉపయోగించబడింది. అయితే, కొన్ని ప్రయోగశాల అధ్యయనాలు మునగాకులో కొన్ని జీర్ణంకాలేని (indigestible) పోషకాలు ఉన్నాయని సూచిస్తున్నాయి. మీరు ఆరోగ్య సప్లిమెంట్గా మునగ సరైనదా లేదా అని తెలుసుకోవాలంటే, డైటీషియన్ లేదా ఆరోగ్య నిపుణుడితో మాట్లాడడం ఉత్తమం.

చర్మం కోసం మునగ ప్రయోజనాలు - Moringa benefits for skin in Telugu

యౌవనమైన మరియు ప్రకాశించే చర్మం కోరుకునే వారు ఎవరు ఉండరు? అనేక మంది వ్యాపారులు వారి సౌందర్య ఉత్పత్తుల ఉత్తమ శ్రేణులలో వృద్ధి చెందాలని కోరుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు, ఈ ఉత్పత్తుల్లో అధికభాగం రసాయన ఆధారిత పదార్దాలతో తయారు చేస్తారు, ఇవి దుష్ప్రభావాలను కలిగిస్తాయి. వీటిలో అవగాహన పెరగడంతో, మొక్క ఆధారిత లేదా సహజ ఉత్పత్తుల కోసం గిరాకీ పెరుగుతుంది.

మునగ అటువంటి విస్తృతంగా అధ్యయనం చెయ్యబడిన మొక్కలలో ఒకటి, మరియు దానిని చర్మాన్ని పోషించే మరియు వృద్ధాప్య వ్యతిరేక ప్రయోజనాలు కోసం ఉపయోగిస్తారు. దాన్నీ ఉపయోగించే వారికి ప్రయోజనాలను అందించడమే కాకుండా, ఈ సహజ ఉత్పత్తులు శరీరం లేదా చర్మంపై ఏ విధమైన దీర్ఘకాలిక దుష్ప్రభావాలు కలిగించవు.

ఇటీవల అధ్యయనాలు మునగాకు సారాలు చర్మం మీద UV నష్టాన్నితగ్గిస్తాయని, అలాగే చర్మం మెరిసేలా చేస్తాయని సూచిస్తున్నాయి. తదుపరి అధ్యయనాలు మునగలో ఓలీక్ యాసిడ్ (oleic acid) పుష్కలంగా ఉన్నట్లు సూచిస్తున్నాయి, ఇది చర్మానికి ఒక అద్భుతమైన తేమను మరియు శుభ్రతను కలిగిస్తుంది. మునగ నూనె యొక్క తేమ లక్షణం వివిధ లోషన్లు మరియు సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగించబడుతోంది.

అదనంగా, మునగలో ఉన్న ఫ్లేవానాయిడ్స్ మరియు ఫినాలిక్స్ శక్తివంతమైన వృద్ధాప్య వ్యతిరేక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఒక సహజ సమ్మేళనం చర్మాన్ని యవ్వనంగా మాత్రమే కాక ఆరోగ్యకరమైనదిగా కూడా చేస్తుంది మరియు మిమల్ని మరింత యవ్వనంగా చెయ్యడంలో సహాయపడుతుంది. మునగ యొక్క పైన పేర్కొన్న అన్ని లక్షణాలు పరిపూర్ణ ప్రకాశవంతమైన చర్మం కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికి కోసం మునగను ఒక సరైన ఎంపికను చేస్థాయి.

కొలెస్ట్రాల్ కోసం మునగ - Moringa for cholesterol in Telugu

ఇన్ విట్రో (ప్రయోగశాల ఆధారిత) అధ్యయనాలు మునగాకులలో ఉన్న ఫినాలిక్స్ మరియు టానిన్లు హైపోలిపిడెమిక్ (hypolipidemic) (కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది) లక్షణాలను ఉన్నట్లు సూచించారు.

మునగాకు యొక్క క్రియాశీలక (active components) భాగాలు ప్యాంక్రియాటిక్ ఎంజైమ్పై పై వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉన్నాయని నివేదించబడింది, ఇది శరీరం కొలెస్ట్రాల్ను గ్రహించడంతో తగ్గింపుకు దారి తీస్తుంది మరియు అదనపు కొలెస్ట్రాల్ను బయటకు విడుదల చేసేస్తుంది. ఒక ఇన్ వివో అధ్యయనంలో, మునగాకుల యొక్క బ్యూటనాల్ (butanol) శాతం శరీరంలోని రక్త కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడం ఉపయోగకరంగా ఉంటుంది సూచించారు.

అయితే, క్లినికల్ ఆధారాలు లేనందున, మానవులలో మునగ యొక్క హైపోలియోపిడెమిక్ చర్య గురించి ఎక్కువ చర్చించలేము.

మధుమేహం కోసం మునగ - Moringa for diabetes in Telugu

ఇన్ వివో (జంతు ఆధారిత) అధ్యయనాలలో మునగాకు సారాలా యొక్క హైపోగ్లైసెమిక్ (రక్త చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది) ప్రభావాలను సూచించాయి.

ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, శరీరంలోని ఇన్సులిన్ సున్నితత్వంపై మునగ ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగి లేదు. అయితే, ఇటీవలి క్లినికల్ అధ్యయనంలో, మునగ మరియు వేప పదార్ధాల కలయిక రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో మరింత శక్తివంతమైనదిగా గుర్తించబడింది ఈ మూలికల విడి విడి ఉపయోగం కంటే.

మరొక మానవ ఆధారిత పరిశోధనలో, మునగాకు మధుమేహంతో జీవిస్తున్న ప్రజలలో రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గించలేదు. అందువల్ల ముధుమేహం కోసం ఏ రూపంలో అయినా మునగాకు తీసుకునే ముందు మీ ఆయుర్వేద వైద్యుడిని అడగడం ఉత్తమం.

(మరింత సమాచారం: మధుమేహం లక్షణాలు)

అధిక రక్తపోటు కోసం మునగ - Moringa for high blood pressure in Telugu

శరీరంలో రక్తపోటును నిర్వహించడం లో మునగ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి అనేక అధ్యయనాలు చేయబడ్డాయి. కనీసం రెండు ఇన్ వివో అధ్యయనాలు, అధిక రక్తపోటును తగ్గించడంలో మునగ విత్తనాలు ఉపయోగకరంగా ఉన్నాయని సూచిస్తున్నాయి.

ఇటీవలి క్లినికల్ అధ్యయనంలో, అధిక రక్తపోటుతో బాధపడుతున్న 20 మందికి రోజుకు రెండు సార్లు 30 రోజుల పాటు మునగాకు రసం ఇవ్వబడింది. నియమిత సమయం ముగిసిన తరువాత, డయాస్టొలిక్ మరియు సిస్టోలిక్ రక్తపోటు స్థాయిలలో గణనీయమైన తగ్గింపు గమనించబడింది. ఇది మునగాకులలో ఉండే ఫ్లేవానాయిడ్లను ప్రాధమిక హైపోటాటెన్సివ్ (hypotensive) ఏజెంట్ (రక్తపోటును తగ్గిస్తుంది) వలన అని సూచించారు. అయినప్పటికీ, మహిళలపై మునగాకుల ప్రభావాలను పరీక్షించడానికి మరిన్ని అధ్యయనాలు నిర్వహించబడుతున్నాయి.

(మరింత సమాచారం: అధిక రక్తపోటు లక్షణాలు)

మునగ యాంటి ఇన్ఫ్లమేటరీ సంభావ్యత - Moringa anti-inflammatory potential in Telugu

వాపు అనేది శరీరం గాయపడడం మరియు ఎర్రబడడాన్ని సూచిస్తుంది. వైద్యుల ప్రకారం,నిజానికి వాపు, రోగనిరోధక వ్యవస్థ చురుకుగా ఇన్ఫెక్షన్లపై పోరాడుతుంది అనడానికి ఒక సూచన . బ్రోన్కైటిస్ (శ్వాస వ్యవస్థలో వాపు) మరియు డెర్మటైటిస్ (చర్మ వాపు) వంటి వ్యాధులు సాధారణంగా వాపుతో సంబంధం కలిగి ఉంటాయి.

అనేక అధ్యయనాలు మునగాకును ఒక అద్భుతమైన వాపు నిరోధక కర్త అని సూచిస్తున్నాయి. మునగాకుల యొక్క ఎథైల్ అసిటేట్ (ethyl acetate) సారాలు సిగరెట్ పొగకు వ్యతిరేకంగా శక్తివంతమైన వాపు నిరోధక ప్రభావాలు కలిగి ఉన్నాయని ఒక ఇన్ వివో అధ్యయన అభిప్రాయం. మునగాకులు రోగనిరోధక వ్యవస్థ యొక్క సైటోకైనిన్స్ మీద ప్రత్యక్ష నిరోధక ప్రభావాన్ని కలిగి ఉన్నాయని సూచించారు, సైటోకైనిన్స్ శరీరంలోని ప్రధాన వాపు కారకాలు. మునగాకుల యొక్క ఐసోతయోసైనేట్ (isothiocyanate) శాతం కూడా వాపు నిరోధక ప్రభావాలకు కారణమని మరో అధ్యయనం పేర్కొంది. అయినప్పటికీ, ఈ అధ్యయనాలు చాలావరకు ప్రయోగశాలలలో చేసినవి లేదా జంతు ఆధారిత నమూనాలు. మానవులలో మునగాకు యొక్క వాపు నిరోధక ప్రభావాలు గురించి చాలా స్పష్టంగా తెలియలేదు.

(మరింత సమాచారం: బ్రోన్కిటిస్ లక్షణాలు)

కాలేయం కోసం మునగాకు - Moringa for liver in Telugu

మునగాకు యొక్క హెపటోప్రొటెక్టీవ్ (hepatoprotective) (కాలేయాన్నిరక్షించే) చర్యను పరీక్షించడానికి అనేక ఇన్ వివో అధ్యయనాలు జరిగాయి. అన్ని ప్రయోగశాల అధ్యయనాలు మునగాకును కాలేయ నష్టాన్ని సమర్థవంతంగా అరికడుతుంది అని సూచించాయి. అటువంటి ఓక అధ్యయనం ప్రకారం,మునగాకులు కాలేయంలో వాపు మరియు కొవ్వులు చేరడాన్ని తగ్గించడానికి జెనెటిక్ ఎక్సప్రెషన్ లో జోక్యం చేసుకుంటుందని తెలిపాయి.

(మరింత సమాచారం: హెపటైటిస్ లక్షణాలు)

ఫైబ్రోసిస్ విషయంలో కాలేయ నష్టాల లక్షణాలను తగ్గించడానికి మునగాకులు బలమైన శోథ నిరోధక మరియు యాంటీఆక్సిడెంట్ ప్రభావాన్ని ప్రదర్శిచాయని మరిన్ని జంతు ఆధారిత అధ్యయనాలు సూచించాయి. మానవ అధ్యయనాలు లేనందున, ఆరోగ్య అనుబంధకంగా మునగను తీసుకునే ముందు మీ వైద్యున్ని సంప్రదించడం మంచిది.

మునగ యొక్క అన్ని భాగాలు వాటి పాక (వంట) లేదా వైద్య ప్రయోజనాలు కోసం ఉపయోగిస్తారు. మునగ దక్షిణ భారత వంటకాల్లో అత్యంత సాధారణ భాగం. మునగ కొన్ని వంటలలో సలాడ్తో కూడా వినియోగిస్తారు. మునగ నూనెను సాధారణంగా వంటల కోసం ఉపయోగిస్తారు. కొందరు పరిశోధకుల ప్రకారం, మునగ నూనె మోనోసాచులేటెడ్ ఫ్యాటీ ఆసిడ్ల (MUFA లు, మంచి కొవ్వు) లో సమృద్ధిగా ఉంటుంది అందువలన అది ఆలివ్ నూనెకు ఒక పరిపూర్ణ ప్రత్యామ్నాయంగా మారింది. మునగ నూనెను ఇప్పుడు శరీర లోషన్లు, లిప్ బాంలు, క్రిములు మొదలైన కొన్ని సౌందర్య సాధనాల యొక్క వాణిజ్య ఉత్పత్తిలో వాడుతున్నారు. కొన్ని బరువు తగ్గింపు వంటకాలలో మునగ నూనెను రసం మరియు టీ రూపాలలో తేనెతో కలిపి ఉపయోగిస్తారు.

మునగ యొక్క అధిక పోషక విలువ కోసం వాటిని ఎనర్జీ బార్లు మరియు ఎనర్జీ డ్రింక్స్ రూపంలో తయారుచేసి వాడుతున్నారు. మునగాకు పొడి, మునగ మాత్రలు, మరియు మునగ గుళికలు వంటి ఇతర ఉత్పత్తులు దాని ఔషధ మరియు ఆరోగ్యలక్షణాల కోసం కొన్ని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.

అదనంగా, మునగాకులు పశువుల మేతగా కూడా వాడబడుతున్నాయి మరియు మొక్కల పెరుగుదలను పెంచడానికి గ్రోత్ హార్మోన్ గా మునగాకు సారాలు ఉపయోగంలో ఉన్నాయి.మునగ కాండం ఎరువు రూపంలో కూడా ఉపయోగించబడుతుంది.

(మరింత సమాచారం: ఆలివ్ నూనె ఉపయోగాలు)

క్లినికల్ అధ్యయనాల లేకపోవడం వలన,మునగ కోసం ఎటువంటి సరైన మోతాదు లేదు. అందువల్ల, మీరు ఆరోగ్య సప్లిమెంట్ గా మునగాకు తీసుకోవలని చూస్తుంటే, మీ ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

 • గర్భధారణ సమయంలో మునగ యొక్క భద్రతను నిర్ధారించడానికి గణనీయమైన పరిశోధన ఏది లేదు. కొన్ని అధ్యయనాలు మునగ లోని కొన్ని భాగాలు గర్భస్రావంకు కారణమవుతాయని సూచిస్తున్నాయి. గర్భిణీ స్త్రీలు ఏ రూపంలోనైనా మునగను తీసుకునే ముందు వారి వైద్యునితో విచారణ అవసరం.
 • మునగ యొక్క హైపోగ్లైసీమిక్ ప్రభావాల వలన, రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తగ్గించే ఔషధాలను ఇప్పటికే వాడుతున్న మధుమేహ రోగులకు సరికాదు.
 • మునగ రక్తపోటును తగ్గిస్తుంది. సహజంగా తక్కువ రక్తపోటు కలిగి ఉన్నవారు లేదా రక్తపోటును నిర్వహించడానికి మందులు వాడుతున్న వారు, ఏ రూపంలోనైనా మునగను తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించాలి.
 • ముంగాకులను దీర్ఘకాలికంగా తీసుకోవడం కాలేయం మరియు మూత్రపిండాలు దెబ్బతినడానికి కారణమవుతుందని జంతు ఆధారిత అధ్యయనం సూచించింది. అందువల్ల మునగ యొక్క ఏ రకమైన మోతాదులో సూచించిన మోతాదు కంటే మించకూడదు.
और पढ़ें ...

References

 1. S. G. Zaku1, S. Emmanuel, A. A. Tukur, A. Kabir. Moringa oleifera: An underutilized tree in Nigeria with amazing versatility: A review. African Journal of Food Science, Vol. 9(9), pp. 456-461, September, 2015
 2. Alessandro Leone et al. Moringa oleifera Seeds and Oil: Characteristics and Uses for Human Health. Int J Mol Sci. 2016 Dec; 17(12): 2141. PMID: 27999405
 3. Teixeira EM, Carvalho MR, Neves VA, Silva MA, Arantes-Pereira L. Chemical characteristics and fractionation of proteins from Moringa oleifera Lam. leaves. Food Chem. 2014 Mar 15;147:51-4. PMID: 24206684
 4. Carrie Waterman. Isothiocyanate-rich Moringa oleifera extract reduces weight gain, insulin resistance and hepatic gluconeogenesis in mice. Mol Nutr Food Res. 2015 Jun; 59(6): 1013–1024. PMID: 25620073
 5. Sidney J. Stohs, Gilbert R. Kaats, Harry G. Preuss. Safety and Efficacy of Banaba–Moringa oleifera–Green Coffee Bean Extracts and Vitamin D3 in a Sustained Release Weight Management Supplement. Phytother Res. 2016 Apr; 30(4): 681–688. PMID: 26871553
 6. Krishanu Sengupta. Efficacy and tolerability of a novel herbal formulation for weight management in obese subjects: a randomized double blind placebo controlled clinical study. Lipids Health Dis. 2012; 11: 122. PMID: 22995673
 7. Ali MA, Yusof YA, Chin NL, Ibrahim MN, Muneer S. Development and Standardization of Moringa oleifera Leaves as a Natural Dietary Supplement. J Diet Suppl. 2019;16(1):66-85. PMID: 29469600
 8. Ndong M, Uehara M, Katsumata S, Suzuki K. Effects of Oral Administration of Moringa oleifera Lam on Glucose Tolerance in Goto-Kakizaki and Wistar Rats. J Clin Biochem Nutr. 2007 May;40(3):229-33. PMID: 18398501
 9. Jaiswal D, Kumar Rai P, Kumar A, Mehta S, Watal G. Effect of Moringa oleifera Lam. leaves aqueous extract therapy on hyperglycemic rats. J Ethnopharmacol. 2009 Jun 25;123(3):392-6. PMID: 19501271
 10. Anggit Listyacahyani Sunarwidhi, Sudarsono Sudarsono, Agung Endro Nugroho. Hypoglycemic Effect of Combination of Azadirachta indica A. Juss. and Gynura procumbens (Lour.) Merr. Ethanolic Extracts Standardized by Rutin and Quercetin in Alloxan-induced Hyperglycemic Rats. Adv Pharm Bull. 2014 Dec; 4(Suppl 2): 613–618. PMID: 25671197
 11. Rutchaporn Taweerutchana, Natchagorn Lumlerdkij, Sathit Vannasaeng, Pravit Akarasereenont, Apiradee Sriwijitkamol. Effect of Moringa oleifera Leaf Capsules on Glycemic Control in Therapy-Naïve Type 2 Diabetes Patients: A Randomized Placebo Controlled Study. Evid Based Complement Alternat Med. 2017; 2017: 6581390. PMID: 29317895
 12. Giacoppo S et al. The Isothiocyanate Isolated from Moringa oleifera Shows Potent Anti-Inflammatory Activity in the Treatment of Murine Subacute Parkinson's Disease. Rejuvenation Res. 2017 Feb;20(1):50-63. PMID: 27245199
 13. Das N, Sikder K, Ghosh S, Fromenty B, Dey S. Moringa oleifera Lam. leaf extract prevents early liver injury and restores antioxidant status in mice fed with high-fat diet. Indian J Exp Biol. 2012 Jun;50(6):404-12. PMID: 22734251
 14. Hamza AA. Ameliorative effects of Moringa oleifera Lam seed extract on liver fibrosis in rats. Food Chem Toxicol. 2010 Jan;48(1):345-55. PMID: 19854235
 15. Suaib Luqman. Experimental Assessment of Moringa oleifera Leaf and Fruit for Its Antistress, Antioxidant, and Scavenging Potential Using In Vitro and In Vivo Assays. Evid Based Complement Alternat Med. 2012; 2012: 519084. PMID: 22216055
 16. S. Dehshahri, M. Wink, S. Afsharypuor, G. Asghari, A. Mohagheghzadeh. Antioxidant activity of methanolic leaf extract of Moringa peregrina (Forssk.) Fiori. Res Pharm Sci. 2012 Apr-Jun; 7(2): 111–118. PMID: 23181088
 17. Il Lae Jung. Soluble Extract from Moringa oleifera Leaves with a New Anticancer Activity. PLoS One. 2014; 9(4): e95492. PMID: 24748376
 18. Abdulrahman Khazim Al-Asmari et al. Moringa oleifera as an Anti-Cancer Agent against Breast and Colorectal Cancer Cell Lines. PLoS One. 2015; 10(8): e0135814. PMID: 26288313
 19. Karim NA et al. Moringa oleifera Lam: Targeting Chemoprevention. Moringa oleifera Lam: Targeting Chemoprevention. PMID: 27644601
 20. Saima Jadoon. Anti-Aging Potential of Phytoextract Loaded-Pharmaceutical Creams for Human Skin Cell Longetivity. Oxid Med Cell Longev. 2015; 2015: 709628. PMID: 26448818