ఎన్నో యుగాల నుంచి, కొబ్బరి నీరు, ఉష్ణమండల యొక్క అమృతంగా, అందరికి ఇష్టమైన ఒక సహజ పానీయంగా ఉంది. కోస్టా రికా, డొమినికన్ రిపబ్లిక్, ఇండోనేషియా, శ్రీలంక, ఫిలిప్పీన్స్, బ్రెజిల్, కరీబియన్ దీవులు, మెక్సికో మరియు భారతదేశంతో సహా అనేక దేశాల్లో ఇది ఒక ప్రముఖ పానీయం.

కొబ్బరికాయలు అరకాసియా కుటుంబానికి చెందినవి, వీటిలో 4000 జాతులు ఉన్నాయి. కొబ్బరి నీటి రుచి అది పండించే నేల మీద ఆధారపడి ఉంటుంది. కొబ్బరి చెట్టు సముద్రపు నీరు లేదా సముద్ర తీర సమీపంలో ఉన్నట్లయితే కొబ్బరి నిటి రుచి కొద్దిగా ఉప్పగా ఉంటుంది.

ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద కొబ్బరికాయల ఉత్పత్తి కేంద్రం, తర్వాత ఫిలిప్పీన్స్ మరియు భారతదేశాలు ఉన్నాయి. భారతదేశంలో, కేరళ, కర్ణాటక మరియు తమిళనాడులో కొబ్బరిని ప్రాధిమిక ఉత్పత్తిచేస్తున్నారు.

ఇది సుమారు 95% నీరు కలిగిన, తక్కువ కేలరీల మరియు కొవ్వు రహిత పానీయం. అదనంగా, కొబ్బరి నీటిలో అనేక విటమిన్లు, ఖనిజాలు మరియు ఎలెక్ట్రోలైట్ల యొక్క శక్తి ఉంది, ఇవి శరీరానికి ఉపయోగకరంగా ఉంటాయి.

  1. కొబ్బరి నీటి పోషణ విలువలు - Coconut water nutrition facts in Telugu
  2. కొబ్బరి నీళ్ల ఆరోగ్య ప్రయోగానాలు - Coconut water health benefits in Telugu
  3. కొబ్బరి నీటి దుష్ప్రభావాలు - Coconut water side effects in Telugu
  4. ఉపసంహరణ - Takeaway in Telugu

కొబ్బరి నీటి యొక్క ప్రధాన భాగం దాని నీటి శాతం. అయినప్పటికీ, కొబ్బరి నీటిలో విటమిన్ సి మరియు కాల్షియం, మెగ్నీషియం, పటాషియం మరియు ఫాస్ఫారెస్ వంటి వివిధ ఖనిజాలలో కూడా సమృద్ధిగా ఉంటుంది.

USDA న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం, 100 ml కొబ్బరి నీరు క్రింది విలువలను కలిగి ఉంటుంది:

పోషకాలు

100 ml కి

శక్తి

29 కిలో కేలరీలు

మాంసకృతులు(Protein)

0.30 గ్రా

పిండి పదార్దాలు(Carbohydrate)

6.97 గ్రా

చెక్కెర (Sugars)

6.36 గ్రా

 

ఖనిజాలు

100 ml కి

కాల్షియమ్(Calcium)

6 మీ.గ్రా

మెగ్నీషియం(Magnesium)

2 మీ.గ్రా

ఫాస్ఫారెస్(Phosphorus)

6 మీ.గ్రా

పటాషియం (Potassium)

176 మీ.గ్రా

సోడియం (Sodium)

12 మీ.గ్రా

విటమిన్లు

100 ml కి

విటమిన్ C

5.5 మీ.గ్రా

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

కొబ్బరినీరు యాంటియోక్సిడెంట్లలకు మరియు యాంటీ బాక్ట్రియల్ పదార్దాలకు గొప్ప మూలకం. ఇది చర్మాన్ని మరియు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది అలాగే అధిక సంఖ్యలో ఎలెక్ట్రోలైట్స్ ను కలిగి ఉంటుంది. శాస్త్రీయంగా నిర్దారితమైన కొబ్బరినీళ్ల యొక్క కొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాము.     

శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది: కొబ్బరి నీరు అధికంగా వ్యాయామం తర్వాత రీహైడ్రేషన్ చేసే పానీయంగా ఉపయోగించబడుతోంది. ఇది వ్యాయామం చేసే సమయంలో కోల్పోయిన నీరు మరియు ఎలెక్ట్రోలైట్స్ను నిరుత్సాహపరుస్తుంది.
మూత్రపిండాల రాళ్ళని నిరోధిస్తుంది: కొబ్బరి నీరు శరీరం నుండి అదనపు విషాపదార్దాలను (toxins) బయటకు పంపివేస్తుంది తద్వారా మూత్రపిండాలలో విషాపదార్దాలు పేరుకుపోకుండా చేస్తుంది. ఇది మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది మరియు మూత్రపిండాల రాళ్ల సంఖ్యను తగ్గింస్తుంది కూడా.
చర్మ ప్రయోజనాలు: వాపు మరియు UV నష్టం విషయాలలో  కొబ్బరి నీరు  చర్మానికి మంచి సహాయం చేస్తుంది. కొబ్బరి నీరు సహజ యాంటీఆక్సిడెంట్  మరియు యాంటీమైక్రోబియాల్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది చర్మ వ్యాధులను నిరోధిస్తుంది మరియు అకాల వృద్ధాప్య  సంకేతాలను తగ్గిస్తుంది.
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: కొబ్బరి నీరు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో ప్రభావవంతంగా \ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది మరియు HDL లేదా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది, దీని వలన గుండె వ్యాధుల ప్రమాదం  తగ్గుతుంది.
దంత క్షయాలను నిరోధిస్తుంది: కొబ్బరి నీటిలో లారిక్ ఆమ్లం, ఒక కొవ్వు ఆమ్ల రకం, శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉందని సూచించబడింది. ఇది నోటిలో క్యావిటీలను కలిగించే బాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది తద్వారా దంత క్షయాలను  నిరోధిస్తుంది.

కొబ్బరి నీటి రీహైడ్రేషన్ ప్రయోజనాలు - Coconut water rehydration benefits in Telugu

కొబ్బరి నీళ్లు, నీరు మరియు ఎలెక్ట్రోలైట్ల తో సమృద్ధిగా ఉండడంవల్ల, శరీరం కోల్పోయిన ఖనిజాలు మరియు ద్రవాలను సమర్థవంతంగా తిరిగి తీసుకురావచ్చు. పని తర్వాత తాగే పానీయాలకు సహజ ప్రత్యామ్నాయ పానీయంగా కొబ్బరి నీటి ఉపయోగం పెరుగుతుంది. కొబ్బరి నీటి ప్రభావాన్ని అంచనా వేయడానికి, కార్బోహైడ్రేట్-ఎలక్ట్రోలైట్ సంతులనం మరియు స్వచ్చమైన నీటిని కలిగిన ఒక పానీయంతో పోల్చి ఒక అధ్యయనం నిర్వహించబడింది,అది కొబ్బరి నీరు రుచిలో తియ్యగా ఉందని మరియు దాని వినియోగం వికారం కలిగించలేదు అని ఆ అధ్యయనం సూచించింది. ఇది కడుపు నిండిన భావనను ప్రోత్సహించింది మరియు కడుపు తిప్పును కలిగించలేదు. ఈ అధ్యయనం, కొబ్బరి నీటిని వ్యాయామం తరువాత రీహైడ్రేషన్ కోసం మంచి వనరుగా ఉపయోగించుకోవచ్చని తేల్చింది.

(మరింత సమాచారం: డీహైడ్రేషన్ చికిత్స)

కొబ్బరి నీటి యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలు - Coconut water antioxidant benefits in Telugu

స్వేచ్ఛా రాశులు (free radicles) అనేవి శరీర యొక్క సహజ జీవక్రియ విధుల నుండి ఉత్పత్తి ఐన అస్థిరమైన అణువులు (unstable molecules). కానీ ఈ రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల అధిక మోతాదు శరీరం కణాలను దెబ్బతీస్తుంది మరియు ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది. క్యాన్సర్, అథెరోస్క్లెరోసిస్ మరియు మధుమేహం వంటి వివిధ వ్యాధులకు అధిక ఆక్సీకరణ ఒత్తిడి కారణం అవుతుంది. కాబట్టి స్వేచ్ఛా రాశులు చేరికను ఎలా నిరోదించాలి?

యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని స్వేచ్ఛా రాశుల చేరికను నివారించే పదార్థాలు. పరిశోధన కొబ్బరి నీటిలో ఆక్సీకరణ ఒత్తిడి నిరోధించడానికి సహాయపడే అధిక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని సూచిస్తుంది. కొబ్బరి నీటిలో ఆస్కార్బిక్ ఆమ్లం (ascorbic acid), కాఫీక్ ఆమ్లం( caffeic acid) మరియు అనేక రకాల ఫినాల్ కాంపౌండ్స్ ఉన్నాయి, ఇవి స్వేచ్ఛా రాశులను తుడిచివేయడానికి బాధ్యత వహిస్తాయి. కొబ్బరి నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయి మరియు శరీరంలోని కొవ్వు ఆమ్ల స్థాయిలను సమర్ధవంతంగా తగ్గిస్తాయని మరియు శరీర సహజ యాంటీఆక్సిడెంట్ కార్యకలాపాలను గణనీయంగా మెరుగుపరుస్తాయని ఒక ప్రీక్లినికల్ అధ్యయనం తెలిపింది.

(మరింత సమాచారం: యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు)

బరువు తగ్గుదలకు కొబ్బరి నీరు - Coconut water for weight loss in Telugu

బరువు పెరగడానికి  ప్రధాన కారణాలలో ఒకటి  కేలరీలను అధికంగా తీసుకోవడం. గ్యాస్ ఉన్న పానీయాలు మరియు రసాలలో అధిక చక్కెర పదార్థాలు ఉంటాయి మరియు ఈ పానీయాలు  క్యాలరీలను అధికం చేస్తాయి, అయినప్పటికీ ఆకలిని తగ్గించవు కూడా. కొబ్బరి నీరు రసాలు, శీతల పానీయాల, మరియు స్పోర్ట్స్ పానీయాలు (sports drinks) కంటే తక్కువ చక్కెరలను కలిగి ఉంటుంది. ఆ అదనపు కేలరీలను నివారించాలని కోరుకుంటే దానికి కొబ్బరినీరు సహాయం చేస్తుంది. కొబ్బరి నీరు సేవించడం అనేది  బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీరు డైటరీ ఫైబర్ కు ఒక గొప్ప మూలం, అది  జీర్ణం అవ్వడానికి సమయం పడుతుంది  అందుకే అది శరీరంలో అధిక సమయం పాటు ఉంటుంది మరియు సంపూర్ణమైన భావనను కలిగిస్తుంది. అందువల్ల,  ఆకలి తక్కువ వేస్తుంది మరియు తక్కువ తినవచ్చు.

(మరింత సమాచారం: ఊబకాయం చికిత్స)

మూత్రపిండాల్లో రాళ్ళ కోసం కొబ్బరి నీరు - Coconut water for kidney stones in Telugu

మూత్రపిండాల రాళ్ళు అనేవి మూత్రపిండాల్లో ఏర్పడిన ఘన స్ఫటికాలు (solid crystals) అవి మూత్రం విసర్జన చేస్తున్నపుడు తీవ్రమైన కడుపు నొప్పి మరియు మంటని కలిగిస్తాయి. ఇది హెమటూరియా (మూత్రంలో రక్తం) ను కూడా కలిగి ఉంటుంది, ఇది మూత్ర వ్యవస్థ గోడలపై రాళ్ళ యొక్క రాపిడి ద్వారా సంభవిస్తుంది. ఏడు వారాల పాటు జంతు నమూనాలపై జరిపిన ఒక అధ్యయనం కొబ్బరి నీటి వినియోగం మూత్రపిండాల రాళ్ళను తగ్గించిందని మరియు మూత్రంలో ఏర్పడిన స్ఫటికాల (crystals) సంఖ్యను తగ్గిస్తుందని వెల్లడించింది. ఈ పరిశోధన కొబ్బరి నీటిని మూత్రపిండాల రాళ్ల చికిత్స కోసం ఒక సహజ కర్తగా ఉపయోగించవచ్చని సూచిస్తుంది.

చర్మం కోసం కొబ్బరి నీరు ప్రయోజనాలు - Coconut water benefits for skin in Telugu

సాధారణ అంటువ్యాధులు, కాలుష్యం మరియు హానికరమైన UV కిరణాల నుంచి రక్షించే మొట్టమొదటి రక్షణ శ్రేణి మన చెర్మం. ఇది అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. సర్వోత్తమంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, చర్మ వ్యాధులు, నల్లబడటం మరియు హానికరమైన స్వేచ్ఛారాశులు వంటి వివిధ సమస్యల నుండి దీనిని కాపాడటం చాలా అవసరం. ఒక ప్రకాశవంతమైన, ఆరోగ్యకరమైన మరియు దోషరహిత చర్మం కోసం ఏమి చెయ్యాలంటే? చర్మం నల్లబడడాన్ని తగ్గించేందుకు కొబ్బరి నీటిని ఉపయోగించవచ్చని పరిశోధనలో తేలింది. కొబ్బరి నీరు విటమిన్ సి తో సమృద్ధిగా ఉంటుంది, ఇది ఒక ఉపయోగకరమైన ప్రతిక్షకారిణి (యాంటీఆక్సిడెంట్).

చర్మం UV కిరణాలుకు, వాపుకు మరియు ఇన్ఫెక్షన్లకు గురికావడం వలన చర్మంనల్లబడటం, చర్మ వృద్ధాప్య లక్షణాలు సంభవిస్తాయి. వాటి నివారణకు కొబ్బరి నీటిలో ఉన్న విటమిన్ సి ను ఉపయోగించవచ్చు అని పరిశోధనలు తెలుపుతున్నాయి.

మరోక అధ్యయనం కొబ్బరి నీరు అనేక రకాల యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలతో సమృద్ధిగా ఉందని సూచించింది, ఇది సాధారణ చర్మ వ్యాధుల నుండి చర్మాన్ని రక్షించగలదు.

జుట్టు కోసం కొబ్బరి నీరు ప్రయోజనాలు - Coconut water benefits for hair in Telugu

కొబ్బరి నీరు జుట్టు కోసం అనేక ప్రయోజనాలను కలిగి ఉంది.యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల జుట్టుకి నష్టం జరగకుండా మరియు త్వరగా జుట్టు నెరవడాన్ని తగ్గించవచ్చు. ఒక పరిశోధన కొబ్బరి నీటిని జుట్టుకు పూస్తే, జుట్టుకు తేమను మరియు జుట్టు మేరవాడానికి సహాయపడుతుందని తెలిపింది. అదనంగా, కొబ్బరి నీటిలో ఉండే కాప్రిలిక్ ఆమ్లం (caprylic acid) చుండ్రు నివారించడానికి ఉపయోగకరంగా ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది అని తెలిసింది.

కొబ్బరి నీరు అధిక కొలెస్ట్రాల్ కు మంచిది - Coconut water is good for high cholesterol in Telugu

హైపర్లిపిడెమియా (hyperlipidemia) అనేది రక్తంలో అధికంగా కొవ్వు శాతం ఉండే ఒక పరిస్థితి. గుండె జబ్బులు, గుండె పోటు మొదలైన సమస్యల ప్రమాదాన్ని ఇది పెంచుతుంది. కొబ్బరి నీరు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించగలదని పరిశోధన సూచిస్తుంది. కాల్షియం, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు మరియు ఆస్కార్బిక్ ఆమ్లం (ascorbic acid) మరియు ఐ-ఆర్గిన్ (i - arginine) వంటివి కొవ్వు స్థాయిలపై సానుకూల ప్రభావాలను కలిగి ఉంటాయి.

కొబ్బరి నీరు మొత్తం కొలెస్ట్రాల్ స్థాయి (TC), చెడ్డ కొలెస్ట్రాల్ స్థాయి (LDL) స్థాయిని తగ్గించి మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిని (HDL) పెంచుతుందని ఒక ప్రీక్లినికల్ అధ్యయనం వెల్లడించింది.

హ్యాంగోవర్ కోసం కొబ్బరి నీరు - Coconut water for hangover in Telugu

మీకు పార్టీలు ఇష్టమైతే , కొబ్బరి నీటి ఈ ప్రయోజనం గురించి మీకు తెలిసే ఉంటుంది. కొబ్బరి నీరు హ్యాంగోవర్ కోసం ఒక అద్భుతమైన చిట్కాలా పనిచేస్తుంది. మద్యం వలన  శరీరం నుండి బయటకు పోయిన ముఖ్య ద్రవాలను తిరిగి శరీరానికి చేరుస్తుంది.    

మధుమేహం కోసం కొబ్బరి నీరు - Coconut water for diabetes in Telugu

మధుమేహం అనేది రక్తంలో చక్కెర జీవక్రియను నిర్వహించడంలో శరీర అసమర్థత కారణంగా దీర్ఘకాలిక హైపర్గ్లైసీమియా (Hyper glycemia) (రక్తంలో గ్లూకోజ్ అధికంగా ఉంటుంది) వలన సంభవించే ఒక పరిస్థితి. అనేక అధ్యయనాలు కొబ్బరి నీటి హైపోగ్లైసీమిక్ (రక్తం లో చెక్కెర స్థాయిని తగ్గించే) సంభావ్యతను సూచిస్తున్నాయి. జంతు నమూనాలపై జరిపిన ఒక అధ్యయనం కొబ్బరి నీరు రక్తం గ్లూకోజ్ స్థాయిని మరియు గ్లైకోసైల్డ్ హేమోగ్లోబిన్ (glycosylated haemoglobin) స్థాయిని తగ్గిస్తుందని చూపించింది, గ్లైకోసైల్డ్ హేమోగ్లోబిన్ అనేది ఒక వ్యక్తి యొక్క సగటు రక్త గ్లూకోస్ స్థాయి యొక్క కొలత.

కండరాల తిమ్మిరి కొబ్బరి నీళ్లు - Coconut water for muscle cramps in Telugu

వివిధ రకాల కారణాల వల్ల కండరాల తిమ్మిరి కలుగుతుంది. మెగ్నీషియం యొక్క లోపం వలన కండరాల తిమ్మిరి కలుగుతుందని అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారం మీ కండరాలు బలంగా ఉండిపోతాయి. అధిక వ్యాయామం కూడా కండరాల తిమ్మిరికి కారణం కావచ్చు. చెమట శరీరంలో ద్రవాలను కోల్పోయేలా చేస్తుంది, ఇది కండరాల తిమ్మిరికి కారణమవుతుంది. ఈ కండరాల తిమ్మిరిని ఎలెక్ట్రోలైట్స్ తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చు. కొబ్బరి నీరు మెగ్నీషియం మరియు ఎలెక్ట్రోలైట్స్ లో  పుష్కలంగా ఉంటుంది, ఇది  శరీరంలో నుండి  కోల్పోయిన ద్రవ పదార్ధాలను భర్తీ చేయడానికి సహాయపడుతుంది. ఇది క్రీడా పానీయాలకు (sports drinks) తగిన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.

రోగనిరోధక శక్తి కోసం కొబ్బరి నీరు - Coconut water for immune system in Telugu

కొబ్బరి నీరు విటమిన్లు మరియు పోషకాలకు మంచి వనరు. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, విటమిన్ సి యాంటీబోడీలను ఉత్త్పత్తి చేసేందుకు ఉపయోగపడుతుంది అవి వ్యాధికారకక్రిముల పై వ్యతిరేకంగా పనిచేస్తాయి. కొబ్బరి నీరుకి  యాంటీ బాక్టీరియాల్  మరియు  యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి అవి వ్యాధి నిరోధకశక్తిని మెరుగుపరుస్తాయి మరియు ఫ్లూ , జలుబు వంటి లక్షణాలు తగ్గించడంలో సహాయపడతాయి.      

దంత క్షయం కోసం కొబ్బరి నీటి ప్రయోజనాలు - Coconut water benefits in dental caries in Telugu

దంత క్షయం అంటే పళ్ళు పుచ్చిపోవడం అని అర్ధం. ఇది ప్రధానంగా S. మ్యుటాన్స్ (S. mutans.) అని పిలువబడే ఒక రకం బాక్టీరియా కారణంగా సంభవిస్తుంది. కొబ్బరి నీరు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉందని పరిశోధన వెల్లడించింది. ఇది సాధారణంగా కొబ్బరి నీటిలో లారిక్ ఆమ్లం (lauric acid) వలన అని పరిశోధన సూచిస్తుంది.

నోటి పూతల వంటి కొన్ని నోటి సమస్యలను నివారించడానికి కొబ్బరి నీటి యొక్క యాంటిమైక్రోబియాల్ ప్రభావం సహాయపడుతుంది. కొబ్బరి నీటిలో ఉండే సుక్రోజ్ మోనోలారేట్ (sucrose monolaurate) మరియు గ్లైకోపిడ్ (glycolipid) భాగాలు, S. మ్యుటాన్స్ (S.mutans) యొక్క పెరుగుదలను నిరోధిస్తూ దంత క్షయాలను నివారించడంలో సహాయపడతాయని అధ్యయనాలు నివేదించాయి.

కొబ్బరి నీరు కొవ్వు రహితమైనది కాని సరదా-రహితమైనది  కాదు. ఇది హుషారుగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే ఒక ఇంద్రజాల కషాయము అని నమ్ముతారు. ఏదేమైనా,అతి ఎప్పుడు మంచిది కాదు అని మనం గుర్తించాలి. కొబ్బరి నీరు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, దానికి కొన్ని అనారోగ్య ప్రభావాలు మరియు అప్రయోజనాలు కూడా ఉన్నాయి.

  • హైపర్కలేమియాకు (hyperkalemia) కారణం కావచ్చు
    అధిక పొటాషియం స్థాయిలు హైపర్కలేమియా అని పిలువబడే ఒక పరిస్థితిని కలిగిస్తాయి. పొటాషియం యొక్క సున్నిత సంతులనం శరీరంలో ఆరోగ్యకరమైన గుండె పనితీరుకు మరియు కండరాలను నిర్వహించడానికి అవసరం. అధికంగా కొబ్బరి నీరు తీసుకోవడం అనేది శరీరం యొక్క పొటాషియం స్థాయిలలో పెరుగుదలకు కారణం కావచ్చు, ఇది గుండె లయలో ప్రమాదకరమైన మరియు తీవ్రమైన మార్పులకు దారితీస్తుంది. ఈ పరిస్థితికి  చికిత్స చేయకపోతే, అది మరణానికి దారితీస్తుంది.
  • రక్త పోటును తగ్గించవచ్చు
    ఒక హైపోటెన్సివ్ (రక్తపోటును తగ్గిస్తుంది) గా కొబ్బరి నీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్న ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయినప్పటికీ, తక్కువ రక్తపోటు సమస్య ఉన్న వారు కొబ్బరి నీటిని నివారించాలి, ఎందుకంటే ఇది రక్తపోటును మరింతగా  తగ్గించగలదు. (మరింత సమాచారం: అల్ప రక్తపోటు చికిత్స)
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

కొబ్బరి నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో సహజ మరియు సేదతీర్చే ఒక పానీయం. ఇది వ్యాయామం తర్వాత శరీరాన్ని రీహైడ్రేట్ చేసుకోవడంలో సహాయపడుతుంది, ఇది చర్మాన్ని మరియు జుట్టును కాపాడుతుంది, దాని యాంటీమైక్రోబియాల్ లక్షణాలు దంత క్షయాలను నిరోధించగలవు, తక్కువ రక్తపోటుకు సహాయపడతాయి మరియు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది . అయినప్పటికీ, పొటాషియం యొక్క అధిక శాతం హైపర్కలేమియా అని పిలవబడే పరిస్థితికి దారితీయవచ్చు, దీనికి  చికిత్స చెయ్యకపోతే అది ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే, కొబ్బరి నీరు ఖచ్చితంగా శీతల పానీయాలు మరియు శక్తి పానీయాలకు ఒక మంచి ప్రత్యామ్నాయం.


Medicines / Products that contain Coconut Water

వనరులు

  1. United States Department of Agriculture Agricultural Research Service. Full Report (All Nutrients): 45222490, PURE COCONUT WATER, UPC: 898999000695. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
  2. Saat M, Singh R, Sirisinghe RG, Nawawi M. Rehydration after exercise with fresh young coconut water, carbohydrate-electrolyte beverage and plain water. J Physiol Anthropol Appl Human Sci. 2002 Mar;21(2):93-104. PMID: 12056182
  3. Bhagya D, Prema L, Rajamohan T. Therapeutic effects of tender coconut water on oxidative stress in fructose fed insulin resistant hypertensive rats. Asian Pac J Trop Med. 2012 Apr;5(4):270-6. PMID: 22449517
  4. Gandhi M, Aggarwal M, Puri S, Singla SK. Prophylactic effect of coconut water (Cocos nucifera L.) on ethylene glycol induced nephrocalcinosis in male wistar rat. Int Braz J Urol. 2013 Jan-Feb;39(1):108-17. PMID: 23489503
  5. Pumori Saokar Telang. Vitamin C in dermatology. Indian Dermatol Online J. 2013 Apr-Jun; 4(2): 143–146. PMID: 23741676
  6. DebMandal M, Mandal S. Coconut (Cocos nucifera L.: Arecaceae): in health promotion and disease prevention. Asian Pac J Trop Med. 2011 Mar;4(3):241-7. PMID: 21771462
  7. Sandhya VG, Rajamohan T. Comparative evaluation of the hypolipidemic effects of coconut water and lovastatin in rats fed fat-cholesterol enriched diet. Food Chem Toxicol. 2008 Dec;46(12):3586-92. PMID: 18809454
  8. Pinto IF et al. Study of Antiglycation, Hypoglycemic, and Nephroprotective Activities of the Green Dwarf Variety Coconut Water (Cocos nucifera L.) in Alloxan-Induced Diabetic Rats. J Med Food. 2015 Jul;18(7):802-9. PMID: 25651375
  9. J. N. Rukmini et al. Antibacterial Efficacy of Tender Coconut Water (Cocos nucifera L) on Streptococcus mutans: An In-Vitro Study. J Int Soc Prev Community Dent. 2017 Mar-Apr; 7(2): 130–134. PMID: 28462183
Read on app