సారాంశం

గర్భధారణ సమయంలో తగినంత పోషకాహార సేవనాన్ని నిర్వహించడానికి ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యం, ఎందుకంటే ఇది తల్లి మరియు శిశువు ఆరోగ్యం రెండింటికీ చాలా ముఖ్యమైంది కాబట్టి. బరువు పెరగడానికి మరియు శక్తి పుంజుకోవడానికి కావలసిన సమతుల్య ఆహారం కోసం గర్భధారణ సమయంలో పోషణ గురించిన ఎరుక (తెలివిడి-education) చాలా ముఖ్యం. అలాగే, విటమిన్లు, ఖనిజాలు మరియు బలవర్థకమైన ఆహారాల వంటి సూక్ష్మపోషకాల వాడకం గర్భవతి-తల్లికి కావలసిన రోజువారీ సిఫార్సు చేసిన పోషక అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం అనేది కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, వివిధ ఖనిజాలు మరియు విటమిన్లు మరియు నీటితో సహా అన్ని స్థూల మరియు సూక్ష్మపోషకాలను కలిగి ఉంటుంది.

 1. ఉత్తమ గర్భధారణ ఆహారం అంటే ఏమిటి? - What is a good pregnancy diet? In Telugu
 2. గర్భధారణ సమయంలో ఏమి తినాలి - What to eat during pregnancy In Telugu
 3. గర్భధారణ సమయంలో తినకూడని ఆహారాలు - Foods to avoid during pregnancy in Telugu
 4. గర్భధారణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు - Precautions to be taken during pregnancy in Telugu
 5. గర్భధారణ సమయంలో జీవనశైలి మార్పులు - Lifestyle modification during pregnancy in Telugu

గర్భధారణ సమయంలో బాగా తినడం చాలా ముఖ్యం. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారం ద్వారా సరైన పోషకాహారం గర్భవతి శరీరం మరియు ఆమె బిడ్డ యొక్క అదనపు డిమాండ్లను తీర్చడం అవసరం. పోషక విద్య (nutritional education) ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి సహాయపడిందని మరియు గర్భిణీ స్త్రీలలో రక్తహీనత మరియు గర్భధారణ-మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి, తద్వారా నవజాత శిశువు యొక్క బరువు పెరుగుతుంది మరియు నెలలు నిండకనే ప్రసవమయ్యే అవకాశాలను తగ్గిస్తుంది. భారతదేశంలోని అధ్యయనాల ప్రకారం, పోషకాహార లోపాలు రక్తహీనత, తక్కువ జనన బరువు మరియు వయోజన జీవితంలో టైప్ 2 చక్కెరవ్యాధి (డయాబెటిస్) వచ్చే ప్రమాదం వంటి స్వల్ప మరియు దీర్ఘకాలిక ప్రభావాన్ని శిశువు ఆరోగ్యంపై  చూపుతాయని తేలింది. అందువల్ల, తమ గర్భంలోని పిండం ఆరోగ్యాన్ని మరియు అభివృద్ధిని నిర్ధారించడానికి కాబోయే తల్లులైన గర్భవతులందరికీ పోషకాహారం గురించిన సలహాలు చాలా అవసరం. (మరింత చదవండి - గర్భధారణ ఆహారం చార్ట్)

పూర్తి కేలరీల ఆవశ్యత

గర్భధారణ సమయంలో, శిశువు పెరిగేకొద్దీ, మొత్తం కేలరీలను తీసుకోవడం అనేది కూడా పెరుగుతుంది. గర్భిణీ స్త్రీకి రోజుకు 300 మిగులు కిలో కేలరీలు అవసరం, కనీసం 1800 కిలో కేలరీలు అవసరమవుతాయి. గర్భంలో ఎక్కువ మంది పిల్లలు పెరుగుతున్న మహిళలకు ప్రతి శిశువుకు రోజుకు 300 కిలో కేలరీలు అదనంగా అవసరం అవుతుంది. ఈ విధంగా, ఒక మహిళ కవలలతో గర్భవతిగా ఉంటే, మొత్తం కేలరీల అవసరం రోజుకు 600 కిలో కేలరీలు ఉంటుంది.

రోజువారీగా అవసరమయ్యే ఇతర పోషకాలు మరియు మీరు తినగలిగే ఆహారాన్ని నెరవేర్చడానికి కావలసినవి క్రింది విధంగా ఉన్నాయి:

మాంసకృత్తులు - Proteins in Telugu

ఓ భవన నిర్మాణానికి ఇటుకలు లేక రాళ్లు (బిల్డింగ్ బ్లాక్స్) ఎంత అవసరమో, అట్లే శరీర కణజాలాల నిర్మాణానికి, వాటి యొక్క అఱుగుదల-తఱుగుదలల క్రమమైన మరమ్మత్తు కోసం మాంసకృత్తులు అవసరం. శిశువు, గర్భాశయం మరియు మావి యొక్క సరైన పెరుగుదలకు కూడా మాంసకృత్తులు అవసరం. మొత్తం రక్త పరిమాణాన్ని మెరుగుపరచడానికి ప్రోటీన్లు కూడా సహాయపడతాయి. మాంసం, చేపలు, గుడ్లు, కోడిమాంసం, గుడ్లు వంటి పౌల్ట్రీ ఉత్పత్తులు, పాలు, జున్ను, పాడి ఉత్పత్తులు, బీన్స్ వంటి ఆహారాల నుండి ప్రోటీన్లు పొందవచ్చు. శాఖాహారులకు, సొయా గింజల నుండి తయారేయ్యే ‘టోఫు’ ఆహారపదార్థం, కాయలు మరియు విత్తనాలు ప్రోటీన్ యొక్క మంచి వనరులు.

సిఫార్సు చేయబడిన రోజువారీ ఆహార భత్యం (recommended dietary allowance-RDA): గర్భం యొక్క చివరి అర్దభాగంలో 0.8 గ్రా / కేజీ / రోజు (79 గ్రా / రోజు) నుండి 1.1 గ్రా / కేజీ / రోజు (108 గ్రా / రోజుకు).

పిండిపదార్థాలు - Carbohydrates in Telugu

పిండిపదార్థాలు లేక కార్బోహైడ్రేట్లు రెండు రకాలు: సాధారణమైన పిండిపదార్థాలు మరియు సంక్లిష్టమైన పిండి పదార్థాలు. సాధారణ కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి కాబట్టి అవి రక్తంలో వేగంగా కలిసిపోతాయి. గర్భిణీ స్త్రీలలో మొత్తం ఆహార కేలరీల అవసరాలలో కార్బోహైడ్రేట్లు దాదాపు 55% ఉంటాయి. పండ్లు, చక్కెర, తేనె మరియు మాపుల్ సిరప్ సాధారణ కార్బోహైడ్రేట్ల యొక్క సాధారణ ఉదాహరణలు. సాధారణ కార్బోహైడ్రేట్లు అధిక కేలరీల సంఖ్యను కలిగి ఉన్నందున, చక్కెరలను కలిపిన పానీయాలకు దూరంగా ఉండటం మంచిది.

కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లకు శరీరంలో గ్రహించబడేందుకు ఎక్కువ సమయం పడుతుంది, అందువల్ల అవి ఎక్కువ కాలంపాటు శక్తిని అందిస్తాయి. బ్రెడ్, పాస్తా, మొక్కజొన్న, బంగాళాదుంప మరియు బియ్యం వంటి ఆహారాలలో పిండి పదార్ధాలు మరియు పీచుపదార్థాలు (ఫైబర్) ఉంటాయి. అన్ని కార్బోహైడ్రేట్లు చివరికి గ్లూకోజ్‌గా విభజించబడతాయి, ఇది శరీరం కార్యకలాపాలను నిర్వహించడానికి శక్తిని అందిస్తుంది. ఆహార పీచుపదార్థాలు (డైటరీ ఫైబర్) అనేవి మొక్కల వనరులలో కనిపించే పదార్ధం, దీన్ని మన శరీరం జీర్ణం చేసుకోలేదు. పీచుపదార్థాలు మలానికి గాత్రాన్ని జోడించడానికి మరియు మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడతాయి. మలబద్దకమనేది గర్భధారణలో ఒక సాధారణ లక్షణం. గర్భధారణ మధుమేహం ఉన్న మహిళలు వారి మొత్తం ఆహార కేలరీలను 40% -45% కు తగ్గించుకోవాలి.

సిఫార్సు చేయబడిన రోజువారీ ఆహార భత్యం (Recommended Dietary Allowance-RDA): రోజుకు 175 గ్రా.

కొవ్వులు - Fats in Telugu

కొవ్వులు చాలా అవసరమైన శక్తిని అందిస్తాయి మరియు మావి మరియు శిశువు యొక్క అవయవాలను నిర్మించడానికి సహాయపడతాయి. నూనెలు మరియు కొవ్వులు, ముఖ్యంగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా శిశువు మెదడును అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా, కొవ్వులు వ్యక్తి తీసుకునే మొత్తం కేలరీలలోదాదాపు 20% నుండి 30% వరకు ఏర్పడతాయి, ఇది రోజుకు 6 టేబుల్ స్పూన్లు పరిమాణమంత. ఈ కొవ్వులు రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి, అలాగే జీవక్రియ మరియు విటమిన్లు ఎ, డి, ఇ, మరియు కె. శోషణలో సహాయపడతాయి. కొవ్వులు కాలేయంలో జీర్ణమవుతాయి మరియు తరువాత కొలెస్ట్రాల్, ప్రోటీన్లు మరియు కొవ్వులను కలిగి ఉన్న లిపోప్రొటీన్లుగా మారుతాయి. ఆహారాలలో రకాల కొవ్వులు ఉంటాయి, వీటిని విస్తృతంగా సంతృప్త మరియు అసంతృప్త కొవ్వులుగా విభజించవచ్చు. వివిధ నూనెలు, వెన్న, పాల ఉత్పత్తులు, గుడ్డు పచ్చసొన, మాంసం, కాయలు మరియు మరింకెన్నిటి నుంచో కొవ్వుల్ని పొందవచ్చు. సాధ్యమైనంతవరకు, సంతృప్త కొవ్వులను కనిష్టంతక్కువగా తినాలి (నెయ్యి మరియు పందికొవ్వు వంటివి) మరియు తినడానికి అసంతృప్త కొవ్వులను ఎంచుకోవాలి (వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు యొక్క కూరగాయల నూనెలు).

సిఫార్సు చేయబడిన రోజువారీ ఆహార భత్యం (Recommended Dietary Allowance-RDA): పూర్తి గర్భధారణ సమయంలో రోజుకు 6 నుండి 8 టేబుల్ స్పూన్ల కొవ్వు తినాలి, అంటే, మీరు తీసుకునే రోజువారీ కేలరీల్లో 20-30% కొవ్వులుండాలి.

ఐరన్ - Iron in Telugu

ఐరన్ అనేది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషక పదార్థం, ఇది కణజాలాలకు మరియు అవయవాలకు ఆక్సిజన్‌ను తీసుకెళ్లడానికి సహాయపడుతుంది. ఇది అలసట, చిరాకు, బలహీనత మరియు నిరాశతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో, మావి ద్వారా శిశువుకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఎక్కువ ఇనుము అవసరం. ఇనుము అవసరాన్ని తీర్చకపోతే, అది రక్తహీనతకు దారితీస్తుంది. గర్భధారణ సమయంలో మొత్తం ఇనుము అవసరం 1000 మి.గ్రా. గర్భిణీ స్త్రీలందరికీ ఐరన్ సప్లిమెంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు చేస్తుంది. బహుళ గర్భాలతో ఇనుము తీసుకోవడం పరిమాణాన్ని పెంచాలి. గర్భధారణ చివరి భాగంలో కనీసం 100 రోజులు 500 మైక్రోగ్రాముల ఫోలిక్ ఆమ్లంతో పాటు 100 మి.గ్రా ఎలిమెంటల్ ఇనుముతో భారత ప్రభుత్వం సలహా ఇస్తుంది. సక్రమంగా ఇనుము తీసుకోవడం వల్ల తక్కువ ఇనుము స్థాయి తక్కువ జనన బరువుతో పాటు ముందస్తు ప్రసవ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎర్ర మాంసం, చేపలు వంటి జంతు ఆహారాలలో ఇనుము కనిపిస్తుంది.

సిఫార్సు చేయబడిన రోజువారీ ఆహార భత్యం (recommended dietary allowance-RDA): రోజూ 27 మి.గ్రా ఎలిమెంటల్ ఇనుము.

ఫోలిక్ ఆమ్లం - Folic acid

ఫోలిక్ యాసిడ్ లేదా ఫోలేట్ అనేది ఒక విటమిన్, ఇది గర్భధారణ సమయంలో గర్భవతికి చాలా ముఖ్యమైనది. పిండం యొక్క మెదడు మరియు వెన్నెముకలో పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి గర్భం దాల్చడానికి కనీసం ఒక నెల ముందు మరియు గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవాలని సూచించారు. ఫోలిక్ ఆమ్లం ముదురు ఆకుకూరలు, కమలాపళ్ళ రసం, బలవర్థకమైన రొట్టె, తృణధాన్యాలు మరియు ధాన్యాలలో ఉంటుంది. తగినంత ఫోలిక్ ఆమ్లం ఎల్లప్పుడూ ఆహార వనరుల నుండి మాత్రమే పొందలేము కాబట్టి, గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ మందులు సిఫార్సు చేయబడతాయి.

సిఫార్సు చేయబడిన రోజువారీ ఆహార భత్యం (recommended dietary allowance-RDA): గర్భధారణ ప్రణాళిక సమయం నుండి రోజుకు 600 మైక్రోగ్రాములు.

క్యాల్షియం - Calcium in Telugu

శిశువు యొక్క ఎముకలు మరియు దంతాల అభివృద్ధికి క్యాల్షియం అవసరం. ఇది పాలు, పాల ఉత్పత్తులు, జున్ను వంటి వాటిలో పుష్కలంగా ఉంటుంది. బలవర్థకమైన నారింజ రసం, సార్డినెస్, ఆంకోవీస్ మరియు బ్రోకలీ వంటి అనేక ఇతర ఆహారాలు శాకాహారులైన మరియు పాలచక్కెరల (లాక్టోస్) అసహనం కలిగిన గర్భవతి తల్లులకు కాల్షియం యొక్క మంచి మూలం.

సిఫార్సు చేయబడిన రోజువారీ ఆహార భత్యం (recommended dietary allowance-RDA):  రోజుకు 1000 మి.గ్రా

అయోడిన్ - Iodine in Telugu

థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేయడానికి అయోడిన్ అవసరం, ఇది శిశువు యొక్క పెరుగుదలకు మరియు అభివృద్ధికి సహాయపడుతుంది. అయోడిన్ తగినంత మొత్తంలో అందకపోతే నవజాత శిశువులో మానసిక వైకల్యం అవకాశాలను పెంచుతుంది. చేపలవంటి సీఫుడ్, గుడ్లు, మాంసం, పాడి ఉత్పత్తులు  మరియు అయోడైజ్డ్ ఉప్పు అయోడిన్ యొక్క మంచి వనరులు.

సిఫార్సు చేయబడిన రోజువారీ ఆహార భత్యం (recommended dietary allowance-RDA):   గర్భధారణ మరియు చనుబాలిచ్చే సమయంలో రోజుకు 150 మైక్రోగ్రాములు.

విటమిన్లు - Vitamins in Telugu

 • విటమిన్ డి
  శిశువు యొక్క దంతాలు మరియు ఎముకల పెరుగుదలను ప్రోత్సహించడానికి విటమిన్ డి మరియు కాల్షియం కలిసి పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన చర్మం మరియు కళ్ళకు విటమిన్ డి కూడా ఒక ముఖ్యమైన పోషకం. సాల్మన్ చేపల వంటి లావైన కొవ్వు చేపలు, బలవర్థకమైన పాలు మరియు నారింజ రసం, తృణధాన్యాలు మరియు గుడ్డులోని పచ్చసొన వంటివి విటమిన్ డి యొక్క మంచి వనరులు. శరీరాన్ని సూర్యరశ్మికి (ఎండకు)  గురిచేయడం వల్ల చర్మంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ప్రతిరోజూ 10-15 నిమిషాలపాటు మన శరీరం ఎండకు (సూర్యరశ్మికి) తగిలేట్లు చూసుకుంటే శరీరంలో తగినంత విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది.
  సిఫార్సు చేయబడిన రోజువారీ ఆహార భత్యం (recommended dietary allowance-RDA):  గర్భిణీలు మరియు పాలిచ్చే మహిళల్లో రోజుకు 600 ఐయు (15 మైక్రోగ్రాములు).
 • విటమిన్ ఎ
  ఆరోగ్యకరమైన కంటి చూపు, ఎముకలు మరియు చర్మం అభివృద్ధికి విటమిన్ ఎ ముఖ్యం.
  • మూలాలు: ఆకుకూరలు, క్యారెట్లు, చిలగడదుంపలు, బెల్ పెప్పర్స్ (పెద్ద మిరపకాయూయలు), క్యాప్సికమ్, బొప్పాయి, మామిడి, ఎరుపు మరియు పసుపు రంగు పండ్లు / కూరగాయలు.
  • సిఫార్సు చేయబడిన రోజువారీ ఆహార భత్యం (recommended dietary allowance-RDA):  వయోజన మహిళల్లో 770 మైక్రోగ్రాములు
 • విటమిన్ సి
 • ఆరోగ్యకరమైన చిగుళ్ళు, దంతాలు మరియు ఎముకలను నిర్వహించడానికి ఇది అవసరం. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.
  • మూలాలు: సిట్రస్ పండ్లలో, ఉసిరి (“ఆమ్లా” ​​విటమిన్ సి యొక్క ధనిక వనరు), స్ట్రాబెర్రీ, బ్రోకలీ, టమోటాలు.
  • సిఫార్సు చేయబడిన రోజువారీ ఆహార భత్యం (recommended dietary allowance-RDA):  85 మి.గ్రా.
 • విటమిన్ బి 6
 • ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి మరియు కొవ్వులు, ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్ల జీవక్రియకు ఇది అవసరం.
  • మూలాలు: కాలేయం, పంది మాంసం, గొడ్డు మాంసం, అరటి, తృణధాన్యాలు.
  • సిఫార్సు చేయబడిన రోజువారీ ఆహార భత్యం (recommended dietary allowance-RDA):  రోజూ 1.9 మి.గ్రా.
 • విటమిన్ బి 12
 • ఇది నాడీ వ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది. విటమిన్ బి 6 తో పాటు విటమిన్ బి 12 ఎర్ర రక్త కణాలను ఏర్పరచడంలో కూడా సహాయపడుతుంది.
  • మూలాలు: పాలు, చేపలు, పౌల్ట్రీ, మాంసం.
  • సిఫార్సు చేయబడిన రోజువారీ ఆహార భత్యం (recommended dietary allowance-RDA): రోజుకు 2.6 మైక్రోగ్రాములు.

గర్భంలోని శిశువు యొక్క పెరుగుదలకు మరియు అభివృద్ధికి ఆటంకం కలిగించే కొన్ని ఆహారాల్ని  తీసుకునే ముందు గర్భవతి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి తినకూడని ఆహార పదార్థాలు ఏవంటే:

మద్యం - Alcohol in Telugu

గర్భధారణ సమయంలో మద్యం సేవించడం సురక్షితం కాదు. గర్భవతి మద్యం సేవించడానికి సురక్షితమైన పరిమితి లేదా సురక్షిత సమయం అనేది అంటూ ఏదీ లేదు. గర్భధారణలో మద్యాన్ని, అంటే అది ఏ రూపంలోనైనా సరే-బీర్ మరియు వైన్‌తో సహా, సేవించడం హానికరమే అవుతుంది. స్త్రీ రక్తంలో మద్యం కలిసిపోయి బొడ్డు తాడు ద్వారా శిశువుకు వెళుతుంది, దీనివల్ల గర్భస్రావం, ప్రసవాలు మరియు వివిధ శారీరక, మేధో మరియు ప్రవర్తనా వైకల్యాల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ వైకల్యాలనన్నిటినీ కలిపి ‘పిండానికి మద్యంతో కూడిన పైశాచిక రుగ్మతలు’ లేక ఫెటల్ ఆల్కహాల్ స్పెక్ట్రల్ డిజార్డర్స్ (FASD) అని పిలుస్తారు. గర్భం పొందిన మొదటి 3 నెలల్లో మద్యపానం చేయడంవల్ల నవజాత శిశువులో ముఖ లక్షణాలను అసాధారణంగా మార్చేస్తుంది. మద్యపానం కారణంగా గర్భధారణ సమయంలో ఎప్పుడైనా మెదడు అభివృద్ధికి అంతరాయం ఏర్పడే ప్రమాదం రావచ్చు. అలాంటి పిల్లలు ఈ క్రింది లక్షణాలను ప్రదర్శించవచ్చు. 

 • చిన్న తలను కల్గి ఉండడం
 • తక్కువ శరీర బరువు.
 • మోటార్ సమన్వయం లేకపోవడం.
 • విపరీత ధోరణితో కూడిన (హైపర్యాక్టివ్) ప్రవర్తన.
 • తక్కువ శ్రద్ధ మరియు తక్కువ జ్ఞాపకశక్తి.
 • నేర్వడంలో వైకల్యాలు లేదా అభ్యాస వైకల్యాలు మరియు మాటలు రావడం ఆలస్యం కావడం.
 • మేధోపరంగా తక్కువ తెలివి  (IQ).
 • దృష్టి మరియు వినికిడి సమస్యలు.
 • పాలు పీల్చడంలో ఇబ్బంది.
 • గణితం వంటి తార్కికం మరియు విశ్లేషణాత్మక విషయాలను అర్థం చేసుకోలేకపోవడం.

కాఫీ - Coffee in Telugu

కెఫిన్ గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, గర్భధారణ సమయంలో రోజుకు 200 మి.గ్రా కెఫిన్ సురక్షితం అని వైద్యులు పేర్కొన్నారు. కాఫీతో పాటు, టీ, చాక్లెట్ మరియు కార్బోనేటేడ్ పానీయాలలో కూడా కెఫిన్ లభిస్తుంది.

పచ్చి బొప్పాయి - Unripe papaya in Telugu

గర్భధారణ సమయంలో బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రభావాలను తెలుసుకోవడానికి కొన్ని జంతువులపై అధ్యయనాలు జరిగాయి. పండిన బొప్పాయి సురక్షితం అని కనుగొనబడింది, అయితే పండని బొప్పాయి రబ్బరు పాలు కలిగి ఉంటుంది, ఇది గర్భాశయంలోని కండరాలలో సంకోచానికి కారణమవుతుంది, ఇది ఆడ సెక్స్ హార్మోన్లు, ఆక్సిటోసిన్ మరియు ప్రోస్టాగ్లాండిన్స్ వల్ల సంభవిస్తుంది. అందువల్ల, గర్భధారణ సమయంలో పచ్చి బొప్పఁపాయి కాయను తినడం సురక్షితం కాదు. అయితే, ఈ ప్రమాదాన్ని అంచనా వేయడానికి మరిన్ని అధ్యయనాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.

చేపలవంటి సీఫుడ్ మరియు షెల్ఫిష్ (గుల్లలుగల జల జంతువులు) - Seafood and shellfish in Telugu

గుల్లలుగల జల జంతువులు (షెల్ఫిష్) మరియు ఇతర సముద్రలభ్య ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల యొక్క అద్భుతమైన వనరులు, ఇవి చాలా అవసరం అని భావిస్తారు ఎందుకంటే అవి ఆహారం ద్వారా మాత్రమే సరఫరా చేయబడతాయి మరియు శరీరంచే ఉత్పత్తి చేయబడవు. ఈ ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు శిశువు యొక్క మెదడు మరియు నరాల అభివృద్ధికి సహాయపడతాయి. చేపలు కూడా ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం, వారానికి ఏవైనా చేపలవంటి (సీఫుడ్) సముద్రాలభ్య ఆహారాన్ని  కనీసం 3 పూటలైనా తినాలని సలహా ఇస్తారు. అయినప్పటికీ, కొన్ని చేపలలో అధిక స్థాయిలో పాదరసం ఉండవచ్చు, ఇది పుట్టుకతో వచ్చే లోపాలను కల్గించడంతో ముడిపడి ఉంటుంది. దీన్ని ఎదుర్కోవటానికి, రొయ్యలు, తేలికపాటి ట్యూనా, సాల్మన్ మరియు సార్డినెస్ వంటి తక్కువ పాదరసం కలిగిన చేపలను ఎంచుకోండి. మాకేరెల్, షార్క్ మరియు కత్తి చేపలను తినకండి, ఎందుకంటే వీటిలో అధిక స్థాయిలో పాదరసం ఉన్నట్లు కనుగొనబడింది.

పాలచక్కెర అసహనంతో ఉన్నవారికి పాల ఉత్పత్తులు - Dairy products in lactose intolerance in Telugu

పాలు మరియు పాల ఉత్పత్తులు జీర్ణించుకోవడంలో ఇబ్బంది పడుతున్న మహిళలకు ‘లాక్టోస్ అసహనం’ ఉన్నట్లు చెబుతారు. అలాంటి మహిళలు కొబ్బరి పాలు, బాదం పాలు, కాయలు మరియు సోయా వంటి ఇతర పాలేతర వనరుల ద్వారా వారి రోజువారీ కాల్షియం పొందే అవసరాన్ని తీర్చుకోవచ్చు. ఈ రోజుల్లో, పాలు మరియు జున్ను వంటి లాక్టోస్ లేని పాల ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. సిఫారసు చేసిన మొత్తాన్ని తీసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే, వైద్యులు కాల్షియం మందులను సూచించవచ్చు.

శాఖాహారం మరియు వేగన్ ఆహారం - Vegetarian and vegan diets in Telugu

వేగన్లుగా పరిగణించబడే శాకాహారులు మాంసం, గుడ్లు మరియు పాల ఉత్పత్తుల వంటి జంతువుల నుండి లభ్యమయ్యే ఉత్పత్తులను తిననివాళ్ళు. శాఖాహారులు తమ ఆహారంలో భాగంగా పాల ఆహారాలను తింటారు, కానీ మాంసం తినరు. ఎలాగైనా, పోషకాల యొక్క రోజువారీ అవసరం నెరవేరకుండా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ, గర్భధారణ సమయం అంతటా తల్లి మరియు బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలను పొందడానికి, అదనపు ప్రణాళిక అవసరం. మీ మొదటి సందర్శనంలోనే మీ వ్యక్తిగత ఆహార ప్రాధాన్యతల గురించి మీ వైద్యుడికి తెలియజెప్పడం మంచిది. పాలు-పాల ఉత్పత్తుల్ని తినని వేగన్ శాకాహారులు మరియు పాలు, పాల ఉత్పత్తుల్ని తినే శాకాహారులు సోయా పాలు, టోఫు మరియు బీన్స్ నుండి ప్రోటీన్లను పొందవచ్చు. ఆకుకూరలు, బచ్చలికూర, శెనగలు (చిక్‌పీస్), కిడ్నీ బీన్స్ తినడంవల్ల అవి మంచి మొత్తంలో ఇనుమును అందిస్తాయి. కాల్షియం కోసం, బలవర్థకమైన నారింజ రసాలు, టోఫు, బియ్యం మరియు సోయా పాలు సేవించవచ్చు.

గ్లూటెన్ - Gluten in Telugu

గ్లూటెన్ అంటే అసహనం ఉన్న మహిళలు గోధుమ, రై, బార్లీ ఆహారాల్ని తినలేరు. అలాంటి వారు ప్రత్యామ్నాయంగా పండ్లు, కూరగాయలు, బంగాళాదుంపలు, కోడిమాంసం (పౌల్ట్రీ) మరియు బీన్స్ తినవచ్చు. ఈ రోజుల్లో చాలా గ్లూటెన్ లేని ఆహారాలు అంగళ్లలో అందుబాటులో ఉంటున్నాయి.

చైనీస్ ఆహారం - Chinese food in Telugu

గర్భధారణ సమయంలో బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రభావాలను తెలుసుకోవడానికి కొన్ని జంతు అధ్యయనాలు జరిగాయి. పండిన బొప్పాయిని (పరింగి పండు) గర్భవతి తినడం సురక్షితమేనని కనుగొనబడింది, అయితే పండని పచ్చి బొప్పాయి రబ్బరు పాలు కలిగి ఉంటుంది, ఇది గర్భాశయం యొక్క కండరాలలో సంకోచానికి కారణమవుతుంది, ఇది ఆడ సెక్స్ హార్మోన్లు, ఆక్సిటోసిన్ మరియు ప్రోస్టాగ్లాండిన్ల వల్ల సంభవిస్తుంది. అందువల్ల, గర్భధారణ సమయంలో పచ్చి బొప్పాయి కాయను సేవించడం సురక్షితం కాదు. అయితే, ఈ ప్రమాదాన్ని అంచనా వేయడానికి మరిన్ని అధ్యయనాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.

కింద తెలిపినటువంటి పద్ధతులను అనుసరించడం ద్వారా  ఆహారం ద్వారా సంక్రమించే రోగాల ప్రమాదాన్ని తగ్గించండి:

 • ఆహారం తయారుచేసేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
 • వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి.
 • కలుషితమైన ఆహారాన్ని తినడం మానుకోండి.
 • తినడానికి ముందు పండ్లు మరియు కూరగాయలను బాగా కడగాలి.
 • వండిన ఆహారాన్నే వీలైనంత వరకు ఎక్కువగా తినండి.
 • పెంపుడు జంతువులను మరియు పక్షులను వంటగదికి దూరంగా ఉంచండి.
 • సరైన ఉష్ణోగ్రతల వద్ద ఆహారాన్ని నిల్వ చేయండి.

గర్భధారణ సమయంలో వ్యాయామం చేయండి 

నడక, జాగింగ్ మరియు 30 నిమిషాల పాటు వారానికి మూడుసార్లు ఈత వంటి తేలికపాటి ఏరోబిక్ వ్యాయామాలు గర్భధారణ సమయంలో సురక్షితంగా ఉంటాయి. గుర్రపు స్వారీ, స్కీయింగ్, సైక్లింగ్ మరియు జిమ్నాస్టిక్స్ వంటి కఠినమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి, ఎందుకంటే ఈ క్రీడలు శిశువుకు బాధ కలిగిస్తాయి. తేలికపాటి యోగాసనాలు, సూర్య నమస్కారాలు మరియు ప్రాణాయామాలు గర్భవతులకు చాలా సహాయపడతాయి.

గర్భధారణ సమయంలో ఆహారం తీసుకోవడం

చాలామంది మహిళలు గర్భధారణ సమయంలో అదనపు బరువును కలిగి ఉన్నామన్న ఆందోళన చెందుతుంటారు, మరి ఈ ఆందోళనను నివారించుకోవడానికి తక్కువగా తినండి. తక్కువగా తినడం (క్రాష్ డైటింగ్) లేదా ఆహారాలను తగ్గించడం అనేది తల్లి మరియు  ఆమె గర్భంలోని బిడ్డకు-ఇద్దరి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, గర్భధారణ సమయంలో ఆహారాన్ని తక్కువగా తినడాన్ని ఖచ్చితంగా సిఫారసు చేయబడలేదు.

రంజాన్ సందర్భంగా గర్భవతి తినడం గురించి

ఇస్లామిక్ మత చట్టం గర్భిణీలైన మహిళలకు మరియు పాలిచ్చే తల్లులకు రంజాన్ సందర్భంగా ఉపవాసం పాటించడం నుండి మినహాయింపును ఇస్తుంది. ఇలా తప్పిపోయిన ప్రతి ఉపవాస దినాలను పేద ప్రజలకు ఆహారాన్ని దానం చేయడం  ద్వారా భర్తీ చేయవచ్చు. అయినప్పటికీ, చాలా మంది మహిళలు రంజాన్ మాసంలో ఉపవాసం ఎంచుకుంటారు, ఇది వ్యక్తిగత ఎంపిక మరియు గర్భం యొక్క దశపై (అంటే ఎన్నో నెల అన్నదానిపై) ఆధారపడి ఉంటుంది. ఇలా గర్భవతి ఉపవాసం చేయడానికి నిర్ణయం తీసుకునే ముందు తన  గర్భంలోని శిశువుకు ఏవైనా ప్రమాదాలు మరియు సమస్యలను గుర్తించడానికి మొదట వైద్యుడితో చర్చించాలి. పవిత్ర మాసంలో అన్ని మందులు మరియు మందులు క్రమం తప్పకుండా తీసుకుంటున్నారని నిర్ధారించుకోండి.

నీరు పుష్కలంగా త్రాగాలి

ద్రవసేవనం లేక  నీళ్లు తాగడం అనేది  ప్రతి వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది, కానీ నియమం ప్రకారం, జలీకరణాన్ని (hydration) కల్గి  ఉండడం ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. రసాలు, పాలు, చిక్కని పళ్ళరసాలు (స్మూతీస్) మరియు మిల్క్‌షేక్‌లను తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా తాగునీటి సేవనం  బాగా పనిచేస్తుంది. హెర్బల్ టీలు అయితే, రోజుకు 4 కప్పులకు మించి తాగకుండా ఉండేట్లు చూసుకోవడం మంచిది.

और पढ़ें ...

వనరులు

 1. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Nutrition counselling during pregnancy.
 2. Prema Ramachandran. Maternal & Child Nutrition. Indian J Med Res 130, November 2009, pp 575-578
 3. American College of Obstetricians and Gynecologists [Internet] Washington, DC; Nutrition During Pregnancy
 4. Dr. Shailesh Kore et al. ANTENATAL CARE IN FIRST TRIMESTER. FOGSIFOCUS: Safe Pregnancy & Delivery
 5. American Pregnancy Association. [Internet]; Diet During Pregnancy.
 6. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Alcohol Use in Pregnancy
 7. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Pregnancy and diet
 8. British Nutrition Foundation. Physical activity in pregnancy. Scotland [Internet]
 9. Adebiyi A, Adaikan PG, Prasad RN. Papaya (Carica papaya) consumption is unsafe in pregnancy: fact or fable? Scientific evaluation of a common belief in some parts of Asia using a rat model. Br J Nutr. 2002 Aug;88(2):199-203. PMID: 12144723
 10. Gao J et al. [Transplacental neurotoxic effects of monosodium glutamate on structures and functions of specific brain areas of filial mice]. Sheng Li Xue Bao. 1994 Feb;46(1):44-51. PMID: 8085168