రాతి ఉప్పు (rock salt) అనేది ‘హాలైట్’ లేదా సోడియం క్లోరైడ్ (NaCl)కు మరో పేరు. భారతదేశంలో, ఈ రాతి ఉప్పును ‘హిమాలయన్ క్రిస్టల్ సాల్ట్’ లేదా ‘హిమాలయన్ ఉప్పు’ అని కూడా పిలువడం జరుగుతోంది. ఈ రాతి ఉప్పు హిమాలయ పర్వత ప్రాంతంలో సాధారణంగా లభిస్తుంది. రాతి ఉప్పును హిందీలో ‘సెంధానమక్’ అని పిలుస్తారు మరియు  సంస్కృతంలో ‘సైంధవ  లవణ’ అని పిలుస్తారు. రాతి ఉప్పును ఉప్పు గనుల నుండి తేమ లేకుండా పొడి (dry) గా గాని  లేదా ద్రావణం ప్రక్రియ ద్వారా గాని సేకరించే వారు. స్వఛ్చమైన రాతి ఉప్పు (ప్యూర్ రాక్ సాల్ట్) సాధారణంగా రంగు లేకుండా ఉంటుంది లేదా తెలుపు రంగులో ఉంటుంది. రాతి ఉప్పు దాని రకం మరియు దానిలో ఇమిడిఉన్న మలినాల పరిమాణం కారణంగా లేత నీలం, ముదురు నీలం, ఊదా రంగు, గులాబీ, నారింజ, ఎరుపు, పసుపు లేదా బూడిద రంగుల్లో కూడా లభిస్తుంది. హిమాలయన్ (రాతి) ఉప్పుయొక్క ఉత్తమాంశం ఏమంటే అది ప్రకృతిసిద్ధంగా ఎలాంటి రసాయనిక పదార్థాల కల్తీ లేకుండా స్వచ్ఛంగా లభిస్తుంది. ఇతర సాధారణ తినే ఉప్పులైతే రసాయనిక పదార్థాలతో మాలినమై ఉండేందుకు అవకాశాలున్నాయి. వాస్తవానికి, ఆయుర్వేద వైద్యం ప్రకారం, మనకు లభించే అన్ని లవణాలలో రాతి ఉప్పు ఉత్తమమైంది.

  1. రాతి ఉప్పు vs సాధారణ ఉప్పు - Rock salt vs common salt in Telugu
  2. రాతి ఉప్పు యొక్క మిశ్రమం - Rock salt composition in Telugu
  3. రాతి ఉప్పు ఆరోగ్య ప్రయోజనాలు - Rock salt health benefits in Telugu
  4. రాతి ఉప్పు ఉపయోగం - Rock salt use in Telugu
  5. రాతి ఉప్పు దుష్ప్రభావాలు - Rock salt side effects in Telugu
  6. ఉపసంహారం - Takeaway in Telugu

రాతి ఉప్పు మరియు సాధారణంగా మనం తినే ఉప్పు (table salt) ల మధ్య కొన్ని ముఖ్యమైన వ్యత్యాసాలున్నాయి.

  • రాతి  ఉప్పు లేదా సైంధవ  లవణం (Sendha Namak) అనేది ఉప్పు రకాల్లో అతి స్వచ్ఛమైన రూపం. అందువల్ల వాణిజ్యపరంగా లభించే ఉప్పు కంటే ఈ రాతి ఉప్పు  చాలా ఖరీదైనది.
  • వాణిజ్య ఉప్పును అయోడైజ్ చేసి మంచి స్పటికాలుగా తయారు చేస్తారు అదే రాతి ఉప్పు పెద్ద స్ఫటికాలతో మరింత పొడిగా ఉంటుంది.
  • రాతి ఉప్పు తక్కువ ఉప్పదనం రుచిని కలిగి ఉంటుంది మరియు ఇది రసాయనికంగా ప్రాసెస్ చేయబడదు.
  • రాతి ఉప్పు అనేది ఖనిజాలను కలిగి ఉన్న కారణంగా సాధారణ ఉప్పుకు ఇది ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం మరియు కళ్ళు ఉబ్బడం, శరీరంలో అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలను కగించదు.
Immunity Booster
₹288  ₹320  10% OFF
BUY NOW

రాతి ఉప్పు లేక సైంధవ లవణం (Sendha Namak) ఒక ఖనిజ రూపంలో ఉంటుంది మరియు సోడియం క్లోరైడ్ యొక్క సమపరిమాణ స్ఫటికాల్ని కల్గి ఉంటుంది.

రాతి ఉప్పు లేక సైంధవ లవణంలో అయోడిన్ చాలా తక్కువగా ఉంటుంది, అయితే మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఇనుము, జింక్ వంటి ఇతర అంశాలను కలిగి ఉంటుంది.

గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు రాతి ఉప్పును తినడానికి ఉపయోగించేందుకు ముందుగా రాతి ఉప్పులో ఐయోడైజ్డ్ ఉప్పును కలపడాన్ని సూచించబడింది. రాతి ఉప్పు (Sendha Namak) మరియు మామూలు అయోడిన్ కలిపిన (iodized) ఉప్పు రెండూ సమాన నిష్పత్తిలో మిళితం చేయవచ్చు మరియు ఆహార తయారీల్లో ఉపయోగించవచ్చు.

అమెరికా వ్యవసాయ శాఖ USDA న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం, 100 గ్రాముల రాతి  ఉప్పు లేదా హిమాలయన్ పింక్ ఉప్పు (Sendha Namak) క్రింది పోషక విలువలను కలిగి ఉంటుంది:

మినరల్స్

100 గ్రాముల రాతి ఉప్పు పోషక విలువ

కాల్షియం

1333 mg

సోడియం

38000 mg

ఖనిజాలు మరియు పోషకాల యొక్క గొప్ప మూలంగా ఉన్న రాతి ఉప్పు, మనం తినే  మామూలు ఉప్పు (లేదా table salt) కు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. కానీ ఈ రాతి  ఉప్పు సంభారం మన ఆరోగ్యానికి అందించేది కేవలం ఇంత మాత్రమే కాదు. మనమిప్పుడు రాతి ఉప్పు యొక్క కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆధారాలతో పాటు చర్చిద్దాం.

  • జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి: రాతి ఉప్పు కడుపు నొప్పికి ఒక అద్భుతమైన మందు. గ్యాస్, ఉబ్బరం మరియు గుండెల్లో మంట వంటి వివిధ జీర్ణశయాంతర రుగ్మతల నుండి ఉపశమనాన్ని అందించడంలో రాతి ఉప్పులో ఉన్న ఖనిజాలు సహాయపడతాయి.
  • బరువు కోల్పోవడాన్ని రాతి ఉప్పు ప్రోత్సహిస్తుంది: రాతి  ఉప్పు సేవనం చక్కెర కోరికను తగ్గిస్తుంది మరియు శరీరంలో కొవ్వు జీవక్రియను ప్రోత్సహిస్తుంది, ఇది బరువును తగ్గించడం మరియు ఊబకాయం నివారించడంలో సహాయపడుతుంది.
  • చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది: రాతి ఉప్పు వల్ల మన చర్మానికి అనేక ప్రయోజనాలున్నాయి. రాతి ఉప్పు మన చర్మంపై ఉండే  పొలుసుల్ని పోగొట్టి శుభ్రపరుస్తుంది, అంతేగాకుండా మొటిమలు మరియు దద్దుర్లు వంటి సాధారణ చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
  • గోళ్ళ ఫంగస్ కు రాతి ఉప్పు ఓ సహజ పరిహారం: పరిశోధన అధ్యయనాల ప్రకారం, రాతి ఉప్పు కాళ్లవేళ్ల గోళ్లపై బూజు (fungus) పెరుగుదలను అణిచివేసేందుకు మరియు గోళ్ళపై ఆరోగ్యకరమైన మెరుపును పొందడానికి  బాగా ఉపయోగపడుతుంది.
  • శ్వాసకోశ వ్యాధులను నిరోధిస్తుంది: రాతి ఉప్పును దీప రూపంలో ఉపయోగిస్తారు. ఇలా ఉప్పు దీపాన్ని ఉపయోగించడంవల్ల అధిక తేమను పీల్చుకునేందుకు ఉపయోగపడుతుంది. గాలిలోని ధూళి మరియు కాలుష్య కారకాల నుండి కాపాడుతుంది మరియు  సాధారణ శ్వాసకోశ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
  • రాతి ఉప్పు గొంతుకు ఉపశమనం కల్గిస్తుంది: గొంతు నొప్పి లేదా  గొంతులో మంట కలిగినపుడు కాలంతోపాటుగా నిరూపించబడ్డ పురాతనమైన చిట్కాల్లో  ఉప్పునీటి పుక్కిలింత ప్రక్రియ ఒకటి. ఇది వాపును తగ్గిస్తుంది మరియు సూక్ష్మజీవుల పెరుగుదలను అణిచివేస్తుంది, దీని వలన ఈ వ్యధభరిత స్థితి నుండి ఉపశమనం అందిస్తుంది.

జీర్ణక్రియకు రాతి ఉప్పు - Rock salt for digestion in Telugu

సయింధవ లవణం (రాతి ఉప్పు) జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగపడుతుంది మరియు కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందదానికి రాతిఉప్పు సేవనం ఒక సహజ మార్గం. రాతి ఉప్పు యొక్క కొన్ని అదనపు స్ఫటికాలు మరియు తాజా పుదీనా ఆకుల్ని కలిపి ఓ గ్లాసెడు  మజ్జిగలో కలుపుకుని తాగితే మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. ఈ రాతి ఉప్పు లాలాజలాన్ని నిరంతరంగా స్రవించడంలో, జీర్ణ రసాల ప్రవాహాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది, తద్వారా ఆహారం సులభంగా జీర్ణం కావడంలో సహాయపడుతుంది. అంతేకాక, శరీరంలో ఆమ్లత్వం యొక్క స్థాయిలను తగ్గించడంలో కూడా రాతి ఉప్పు బాగా పని చేస్తుందని ప్రతీతి.

రాతి ఉప్పు జీర్ణక్రియలో ఔషధ పాత్రను పోషిస్తుంది మరియు సాధారణంగా జీర్ణ-సంబంధ రుగ్మతల ఉపశమనం కోసం దీన్ని సూచిస్తుంటారు. మృదు విరేచనకారి భేదిమందులకు ఓ సహజ ప్రత్యామ్నాయంగా రాతి ఉప్పును పరిగణించడం జరుగుతోంది. ఇది ఆకలిని పెంచడానికి మరియు పొట్టలో వాయువును, కడుపుబ్బరాన్ని తగ్గించడానికి మరియు గుండెల్లో మంటను తగ్గిస్తుంది. కడుపులో సంభవించే అంటువ్యాధుల్ని నయం చేయడంలో మరియు నులి పురుగులను పొట్ట నుండి తొలగించడంలో కూడా రాతి ఉప్పు  సహాయపడుతుంది.

రాతి ఉప్పు యొక్క అనేక జీర్ణ ప్రయోజనాలు దానిలో ఉన్న ఖనిజాలవల్లనే కలుగుతాయని  సూచించబడుతోంది.

Nasal Congestion
₹224  ₹249  10% OFF
BUY NOW

చర్మానికి రాతి ఉప్పు ప్రయోజనాలు - Rock salt benefits for skin in Telugu

రాతి ఉప్పు (Sendha Namak) అనేక చర్మ ప్రయోజనాల్ని కల్గిస్తుందని నిరూపించబడింది. చర్మంలో ఉండే సహజ నూనెల్ని తొలగించకుండా చర్మనిర్విషీకరణకు, చర్మాన్ని బాగా శుభ్రపరిచేందుకు రాతి ఉప్పు తోడ్పడుతుంది. చర్మంలో మృతకణాలు అలాగే పేరుకుపోవడంవల్ల చర్మం దుర్భరంగా, కఠినమైనదిగా మరియు అందవిహీనంగా తయారవుతుంది. రాతిఉప్పు ఈ చర్మం కణాల్ని పొలుసులూడిపోయేలా (exfoliates) జేసి, తద్వారా, మీ చర్మం మెరుస్తూ శక్తివంతంగా కనబడేందుకు తోడ్పడుతుంది. మొటిమలు , దద్దుర్లు మరియు తామర వంటి సాధారణ చర్మ సమస్యలను నివారించడంలో రాతిఉప్పులో ఉన్న వివిధ ఖనిజాలు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. అందువల్ల, చర్మకణజాలాన్ని రాతిఉప్పు మరింత బలోపేతం చేసి చర్మం చైతన్యవంతంగా మారేట్లు చేస్తుంది. రాతిఉప్పుకు చర్మంపై ఎండిపోయే స్వభావం లేదు, దానివల్ల పాదాల్ని కుంచెతో శుభ్రపరిచేందుకు ముందుగా అరికాళ్లను రాతి ఉప్పుద్రావణంలో నానబెట్టుకోవచ్చు, అటుపై కుంచెతో శుభ్రం చేయచ్ఛు లేదా చేతితోనే రుద్ది శుభ్రం చేసుకోవచ్చు 

జుట్టుకు రాతి ఉప్పు ప్రయోజనాలు - Rock salt for hair in Telugu

ఇది అసంభవం అనిపించవచ్చు కానీ రాతిఉప్పు మన జుట్టుకు అనేక రకాలుగా ప్రయోజనకారిగా పనిచేస్తుంది. రాతిఉప్పులో శుభ్రపరిచేటువంటి మరియు పొలుసులూడదీసే గుణం ఉంది, ఈ గుణం మన జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. రాతిఉప్పు జుట్టును రక్షించి, జుట్టులో ఉండే స్వాభావిక నూనెలు కోల్పోకుండా కాపాడుతుంది. వాస్తవానికి, వివిధ షాంపూ మరియు వెంట్రుకల సంరక్షణా చికిత్సల్లో తలపై వెంట్రుకల్లోంచి పొట్టు, పొలుసుల్నితొలగించేందుకు రాతిఉప్పును ఉపయోగిస్తారు.

నెత్తిమీది మృతచర్మాన్ని, వెంట్రుకల్లోంచి మలినాలను తొలగించడంలో రాతి ఉప్పు సమర్థవంతంగా సహాయపడుతుంది. రాతిఉప్పు జుట్టులో ఉండే స్వాభావిక నూనెలు కోల్పోకుండా జుట్టుకు రక్షణ కల్పిస్తుంది. రాతి ఉప్పును షాంపూలో కలిపి స్నానానికి వాడటంవల్ల జుట్టు బలంగా ఉండేందుకు, వెంట్రుకల్ని కండిషన్ లో ఉంచుకునేందుకు మరియు వెంట్రుకలు చిట్లకుండా రక్షించుకునేందుకు వీలవుతుంది. రాతిఉప్పు కలిపిన షాంపూను తల వెంట్రుకలకు ఉపయోగించడంవల్ల వెంట్రుకలపరిమాణం పెరుగుతుంది. ఈ రాతిఉప్పుతో కూడిన షాంపూ మిశ్రమాన్ని తలకంటి తర్వాత చల్లటి నీటితో స్నానం చేసి జుట్టును శుభ్రం చేయడం వల్ల నెత్తిచర్మం నుండి మురికి తొలగిపోతుంది, నెత్తికి మరియు జుట్టుకు పోషణ కూడా ఒనగూడుతుంది.

గోళ్ళల్లో వచ్చే ఫంగస్ వ్యాధికి రాతి ఉప్పు - Sendha namak for nail fungus in Telugu

గోళ్ళకు సోకే ఫంగల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా గోళ్లను పసుపు రంగులోకి మార్చడం, గోళ్ళ ఆకారాన్ని వికారంగా మార్చడం జరుగుతుంది. ఈ గోళ్లబూజు అంటువ్యాధి కేవలం మనకు ఒక పీడ (nuisance) మాత్రమే కాదు, దీనికి సకాలంలో చికిత్స చేసుకోకపోతే అది అన్ని వేళ్ళ గోళ్లకు అంటుకుని బాధించే ప్రమాదముంది. రాతి ఉప్పు గోళ్లబూజు (సూక్ష్మజీవికారకాల్ని) ను సమర్థవంతంగా చంపేస్తుంది, ఆవిధంగా, రాతిఉప్పు ఈ బాధాకర గోళ్ళ రుగ్మత వ్యతిరేకంగా ఉపశమనాన్ని కల్గించి గోళ్లకు ఒక ఆరోగ్యకరమైన కాంతిని ప్రసాదిస్తుంది.

బరువు కోల్పోయేందుకు రాతి ఉప్పు - Rock salt for weight loss in Telugu

నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ సమస్యలలో ఊబకాయం ఒకటి. శరీర భాగంలో కొవ్వు పదార్ధాలను తగ్గించడం ద్వారా శరీర బరువును తగ్గించడానికి రాతి ఉప్పు సేవనం సహాయపడుతుంది. ఇంకా, రాతి ఉప్పులో ఉన్న ఖనిజాలు చక్కెర కోసం మన మనసు కోరికను తగ్గిస్తుంది. మనసులో చక్కర తినాలన్న కోరిక తగ్గిపోతే అది చివరకు తక్కువ ఆహారం తీసుకోవడానికి దారితీస్తుంది.

కాబట్టి, మన శరీరం బరువు పెరగకుండా, మరియు ఊబకాయంలా తయారు కాకుండా ఉండేట్టు రాతి ఉప్పు సాధారణ సేవనం సహాయపడుతుంది .

(మరింత చదువు: బరువు నష్టం కోసం డైట్ చార్ట్ )

ఒత్తిడి ఉపశమనానికి రాతి ఉప్పు - Rock salt for relieving stress in Telugu

ఒత్తిడి అనేది మనకు కలిగే ప్రమాదం లేదా ముప్పు వంటి వివిధ ఉద్దీపనాల యొక్క ఉనికికి వ్యతిరేకంగా శరీరం చూపే ఒక సహజ ప్రతిస్పందన. సాధారణ శరీర పనితీరు కోసం ఒత్తిడి చాలా అవసరం అయినప్పటికీ, అధిక ఒత్తిడి అనేది సమస్యాత్మకమైనదే కాదు, కొన్ని పరిస్థితుల్లో ఇది మనల్ని బలహీనపరుస్తుంది.  చిన్న చిన్న కారణాలే ఒత్తిడికి గురయ్యే తత్త్వం ఉన్నవాళ్లను ఈ ఒత్తిడి ముంచెత్తుతుంటుంది మరియు ఆందోళన ,కుంగుబాటు,  ఆకలిని కోల్పోవటం వంటి తీవ్రమైన సమస్యలకు కూడా దారితీస్తుందిది. పరిశోధనల ప్రకారం రాతి ఉప్పు మనస్సు మరియు శరీరం విశ్రాంతి తీసుకోవడంలో సహాయపడుతుంది. రోజువారీగా రాతి ఉప్పును సేవిస్తే ఆందోళన మరియు ఒత్తిడిని నియంత్రించవచ్చు.

రాతి ఉప్పును ఏదైనా పానీయంతో కలిపి గాని లేదా సాదా నీరులో కలిపి సేవించొచ్చు. రాతి ఉప్పును ఒక స్నానపు ఉప్పు (bath salt) రూపంలో కూడా వాడవచ్చు. రాతి ఉప్పుతో  కూడిన వేడినీటితో నింపిన ఒక హాట్ టబ్ లో స్నానం చేయడంవల్ల ఒత్తిడి నుండి ఉపశమనం పొంది మరియు తాజాదనాన్ని అనుభవించొచ్చు. అదనంగా, రాతి ఉప్పు నీరు నిలుపుదల (water retention) విరుధ్ధంగా పని చేస్తుంది, కండరాల నొప్పుల్ని సేదదీరుస్తుంది, నిద్రను నియంత్రిస్తుంది మరియు శరీరమును నిర్వీకరణ చేస్తుంది. ఇది రక్తపోటును కూడా తగ్గిస్తుంది.

రాతి ఉప్పు కండరాల తిమ్మిరిని అధిగమించడానికి సహాయపడుతుంది. రాతి ఉప్పు యొక్క అద్భుతమైన ప్రయోజనాల్లో ఇదీ ఉంది. కండరాల తిమ్మిరితో బాధపడేవాళ్లు ఓ చెంచాడు రాతిఉప్పును నీటిలో కలుపుకుని తాగితే తక్షణ ఉపశమనం పొందవచ్చు .

రాతి ఉప్పు దీపాలు విడుదల చేసే ఒక ప్రత్యేక వాసన మన ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఇది మన మనస్సు మరియు శరీరానికి సడలింపును కల్గించి విశ్రాంతిని కల్పిస్తుంది.

గాలిని శుభ్రపర్చడానికి రాతి ఉప్పు - Rock salt purifies air in Telugu

సాంకేతికత మరియు పారిశ్రామికీకరణ పెరుగుదలతో, ప్రపంచంలో కాలుష్యం చాలా స్పష్టమైన సమస్యగా మారింది. వాహనాల నుండి విడుదలయ్యే ప్రమాదకరమైన విషకారక ధూమం ఒక్కటే చాలు గాలి విపరీతంగా కలుషితమైపోవడానికి. పర్యావరణంలో ఉండే విషపూరిత అంశాలను తొలగించి వాటిని తటస్తం చేయడంలో రాతిఉప్పు సమర్థంగా పని చేస్తుందని నమ్ముతున్నారు. అలాగే, గాలిలో ఉండే నీటి ఆవిరిని శోషించటం (absorbing) ద్వారా రాతి ఉప్పు వ్యాధికారకాల్ని మరియు అసహనీయతల్ని కల్గించే కారకాల్ని తగ్గించటానికి ప్రయత్నిస్తుంది.

గదిలో ఒక హిమాలయన్ ఉప్పు దీపాన్ని వెలిగించినట్లైతే అందులోంచి వెలువడే పదార్థాల కారణంగా మీ పరిసరాలు శుద్ధి అవుతాయి, కాబట్టి మన పరిసరాల్లోని గాలిని శుద్ధిచేసేందుకుడిఇది ఒక అద్భుతమైన మార్గం.

శ్వాస-సంబంధ రుగ్మతలకు రాతి ఉప్పు - Rock salt for respiratory problems in Telugu

నాశికా సరణి (సైనస్) వాపు, గొంతు నొప్పి లేక గొంతు వాపు మరియు ఇతర శ్వాస రుగ్మతలతో బాధపడుతున్నవారికి రాతి ఉప్పుచాలా ఉపయోగకరంగా ఉంటుంది. రాతి ఉప్పుతో పుక్కిలింతను సాధన చేయడంవల్ల  బాధాకరమైన టాన్సిల్స్ (గొంతుతో గడ్డలవంటివి), పొడి దగ్గు , వాచిన గొంతు, మరియు గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. .

(మరింత చదువు: టాన్సిలైటీస్ చికిత్స )

రాతిఉప్పును నీటిలో కరిగించి ఆ ద్రావణాన్ని ముఖానికి ఆవిరి గా ఉపయోగించినట్లైతే చాలా మంచి ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా, చెవి లేదా ముక్కుకు సంబంధించిన రుగ్మతలకు, ఆస్తమా , బ్రోన్కైటిస్ తో బాధపడుతున్నవాళ్లకు రాతిఉప్పు నీటి ఆవిరి పట్టడంవల్ల అపారమైన ప్రయోజనాలున్నాయి. ఇది చేయడంవల్ల నాశికా కుహరాలు బాగా తెరుచుకోబడి సులభంగా శ్వాస పీల్చుకోవడానికి వీలవుతుంది.

రాతి ఉప్పు సేవనం అవసరమైన అన్ని పదార్ధాలను అందించడంవల్ల, రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఆ విధంగా ఇది సాధారణ శ్వాసకోశ సక్రమణకు వ్యతిరేకంగా పోరాడేందుకు సహాయపడుతుంది.

రాతి ఉప్పు జీవక్రియను మెరుగుపరుస్తుంది - Rock salt improves metabolism in Telugu

రక్తంలో ఉప్పు స్థాయిలు సమంగా ఉన్నప్పుడే శరీరంలో కణాల పనితీరు మరియు సమాచార రవాణా (కమ్యూనికేషన్) సాధ్యమని నమ్ముతారు. రాతి ఉప్పు లాంటి ఒక సహజ ఉప్పును శరీరం లోపల జీవక్రియను ప్రేరేపించి పెంపొందించడానికి ఉపయోగిస్తారు. మెరుగైన జీవక్రియ సాధారణంగా ఆరోగ్యకరమైన శరీరంతో ముడిపడి ఉంటుంది. శరీరం యొక్క అన్ని ముఖ్యమైన అవయవాలు సరిగా పనిచేయటానికి అవసరమైన శరీర నీటి శోషణను పెంచడంలో కూడా రాతి ఉప్పు బాగా పనిచేస్తుంది. ఇంకా, రాతిఉప్పులో కొన్ని  విలువైన ఖనిజాలు మరియు పోషకాలున్నాయి, ఇవి వివిధ శరీరవిధులకు చాలా ఉపయోగపడతాయి.

ఏదేమైనప్పటికీ, ప్రతికూల ప్రతిచర్యలను నివారించడానికి రాతి ఉప్పును మితమైన మోతాదులో తీసుకోవాలన్నసంగతిని గుర్తుంచుకోవాలి.

రాతి ఉప్పు పదార్థాలను భద్రపరిచేందుకు ఉపయోగపడే ఓ సహజ సంరక్షణకారి (natural preservative) కావడంతో, దీన్నితినే ఆహారాల్ని భద్రపరిచేందుకు మరియు ఆహారపదార్థాల రుచిని హెచ్చించేందుకు “సీసనింగ్” గాను విస్తృతంగా వాడబడుతోంది. మంచు ఘనీభవించే సమయాన్ని (freezing point) రాతిఉప్పు తగ్గిస్తుంది గనుక ఐస్క్రీమును తయారు చేయడంలో కూడా దీన్ని వాడతారు. అంతే గాక రాతి ఉప్పు ఐస్క్రీంను మరింత చల్లగా ఉండేట్టుగా చేస్తుంది. 

ఉప్పు దీపాలను తయారు చేయడానికి హిమాలయన్ ఉప్పును ప్రత్యేకంగా ఉపయోగిస్తారు, గాలిని శుద్ధి చేయడంలో మరియు పరిసర ప్రాంతంలోని శక్తిని సమతుల్యం చేయడంలో ఇది సహాయపడుతుందని నమ్ముతారు.

రాతి ఉప్పు గురించిన అవగాహన పెరగడంతో, హిమాలయన్ ఉప్పు (రాతి ఉప్పు)కు డిమాండ్ క్రమంగా పెరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా, ఆరోగ్య స్పృహ కల్గినవారు ఎంపిక చేసుకునే ఉప్పుగా త్వరితగతిలో అభివృద్ధి చెందుతోంది. .

వాస్తవానికి, మన రోజువారీ వినియోగంలో వాడే తినే ఉప్పు లేక టేబుల్ సాల్ట్ కు బదులు అందరూ ఈ రాతి ఉప్పుని వినియోగించడం వరుగుతుందని ఊహించబడుతోంది.

  1. ఏ రకమైన లవణాలనైనా అధికంగా సేవించడం ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది. చాలా సందర్భాలలో ఇది నిర్జలీకరణము, కండర తిమ్మిరి, మరియు ఎలెక్ట్రోలైట్ అసమతుల్యత వంటి సమస్యలకు దారి తీస్తుంది. అయితే, అధిక రక్తపోటు , ఆస్టియో ఆర్థరైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్లు, మరియు కొన్ని గుండె-సంబంధమైన రుగ్మతలు మరియు మూత్రపిండ రుగ్మతలతో  సహా కొన్ని తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు ఇది దారితీయవచ్చు .
  2. రసాయనికంగా, ఉప్పును సోడియం క్లోరైడ్ అంటారు. అందువల్ల ఉప్పును ఎక్కువగా తీసుకోవడం కూడా క్లోరైడ్ (క్లోరిన్) ను ఎక్కువగా తీసుకోవడంతో సమానం. శరీరంలో ఎక్కువైన క్లోరైడ్ల పరిస్థితిని ‘హైపెర్క్లోరేమియా’ అని పిలుస్తారు. హైపర్క్లోరేమియా’ తో సంబంధం ఉన్న ముఖ్య అపాయం అధిక శరీర ఆమ్లత మరియు నిర్జలీకరణం మరియు బలహీనమైన మూత్రపిండాల పనితీరు. మన శరీరాలు చాలా ఆమ్లత్వంతో కూడి ఉంటే, రోగనిరోధక చర్యలు మరియు ఇతర సెల్యులార్ ప్రక్రియలు సమర్థవంతంగా పని చేయవు. అదనంగా, ఇది ఇన్సులిన్ నిరోధకత మరియు చక్కెరవ్యాధి (డయాబెటిస్) ప్రమాదాన్ని పెంచుతుంది.-
  3. అయోడిన్ లేని ఉప్పు ను తీసుకుంటున్న వారు  లేదా అయోడిన్ ను తగినంతగా ఆహారం తో పాటుగా తీసుకోని వారికి అయోడిన్ లోపం ఒక సాధారణ సమస్య. థైరాయిడ్ పనితీరుకు అయోడిన్ చాలా ముఖ్యమైనది కాబట్టి, అయోడిన్ యొక్క లోపం ‘హైపో’ లేదా హైపర్ థైరాయిడిజం, మరియు గాయిటర్  వంటి సమస్యలకు దారితీయవచ్చు.
    హిమాలయన్ పింక్ ఉప్పు ఒక గ్రాముకు 100 మైక్రోగ్రాముల కంటే తక్కువగా ఉన్న అయోడిన్ పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఇది అయోడిన్ యొక్క నమ్మదగని మూలం.
  4. మీరు ప్రస్తుతం ఏవైనా ఔషధాల్ని సేవిస్తున్నట్లైతే మీ ఆహారంలో రాతి ఉప్పును చేర్చడానికి ముందు మీ డాక్టర్తో మాట్లాడటం మంచిది.
Cough Relief
₹719  ₹799  10% OFF
BUY NOW

అనేక రుగ్మతలు మరియు రోగాలకు రాతి ఉప్పు (లేదా సయింధవ లవణం-Sendha Namak) ను ఒక సహజ ఔషధంగా మరియు అనేక రుగ్మతలు మరియు రోగాల కోసం ఒక గృహ చికిత్సగా ఉపయోగిస్తారు. అయినప్పటికీ, దుష్ప్రభావాలను నివారించడానికి రాతి  ఉప్పును ఎల్లప్పుడూ సరైన మోతాదులోనే తీసుకోవాలి. జాగ్రత్తగా వాడితే, ఎవరైనా రాతి ఉప్పు అందించే అనేక ప్రయోజనాలను పొంది ఆనందించవచ్చు.


Medicines / Products that contain Sendha Namak

వనరులు

  1. United States Department of Agriculture Agricultural Research Service. Full Report (All Nutrients): 45186601, HIMALAYAN PINK ROCK SALT. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
  2. Dhrubo et al. HALITE; THE ROCK SALT: ENORMOUS HEALTH BENEFITS. World Journal of Pharmaceutical Research
  3. Kalra S, Kalra B, Sawhney K. Usage of non-iodized salt in North West India. Thyroid Res Pract [serial online] 2013 [cited 2019 Jun 1];10:12-4.
  4. Office of Disease Prevention and Health Promotion. Table of Contents. [Internet]
  5. Angela M. Leung, Lewis E. Braverman, Elizabeth N. Pearce. History of U.S. Iodine Fortification and Supplementation. Nutrients. 2012 Nov; 4(11): 1740–1746. PMID: 23201844
  6. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; New Research: Excess Sodium Intake Remains Common in the United States
  7. Ma Y, He FJ, MacGregor GA. High salt intake: independent risk factor for obesity? Hypertension. 2015 Oct;66(4):843-9. PMID: 26238447
Read on app