భారతదేశంలో “శంఖపుష్పి” అని ప్రసిధ్ధంగా పిలవబడే ‘కన్వొల్వులస్ ప్లురికాలిస్’  పువ్వు ఆయుర్వేద వైద్యంలో అనేక ఉపయోగాలున్న ఒక మందు మూలిక. ఆయుర్వేద వైద్యంలో, ఈ మూలికా వస్తువు ప్రధానంగా 'రసాయనం' గా ప్రస్తావించబడింది, ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మరియు పునరుజ్జీవన (rejuvenation) చికిత్సల కోసం సిఫార్సు చేయబడింది. వైద్యపరంగా, మొత్తం ఈ మూలికను, అంటే ఈ మొక్క  పూలు, ఆకులు మరియు కాండాన్ని, పాలు మరియు జీలకర్రతో కలిపిన మిశ్రమాన్ని నాడీ రుగ్మతలు కలిగినవారికి మరియు జ్ఞాపకశక్తిని కోల్పోయిన వారికి మందుగా ఇస్తారు.  ఈ మూలికను జ్ఞాపకశక్తిని పెంపొందించే టానిక్కులు తయారు చేయడానికి అత్యంత ప్రసిధ్ధంగా ఉపయోగించబడుతోంది.  

ఈ మొక్క భారతదేశానికి చెందినది మరియు సంవత్సరం పొడుగునా లభించే మొక్క ఇది. శంఖపుష్పి మొక్క రెండు సంవత్సరాలకు పైగా జీవిస్తుంది.  ఈ మొక్క యొక్క శాఖలు మైదానంలో 30 సెం.మీ పొడవు వరకూ వ్యాపిస్తాయి. ఈ మొక్క యొక్క అండాకార (ఓవల్-షేప్) పుష్పాలు సాధారణంగా నీలం రంగులో ఉంటాయి. ఈ మూలిక యొక్క వివిధ భాగాలు అనేక వైద్య చికిత్సా ప్రయోజనాలను కలిగి ఉంది. అంతేకాకుండా, మెదడు యొక్క పనితీరును పెంచేదిగా, జ్ఞాపకశక్తిని పెంచేదిగా, నేర్చుకునే శక్తిని ఇనుమడించేదిగా, స్ఫురణశక్తిని పెంచే సామర్థ్యం ఉన్న ఏకైక మూలిక శంఖపుష్పి అని ఆయుర్వేద వైద్యులు నమ్ముతారు.

శంఖపుష్పి గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు

  • వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: కన్వోల్వులస్ ప్లురికొలైస్ (Convolvulus pluricaulis)
  • కుటుంబం: జెంటియనేసియా (Gentianaceae)
  • సాధారణ పేరు: శంక్పుష్పి, శంఖిని, కంబుమాలిని, శంఖ్ పుష్పి, సదాఫులి  
  • సంస్కృత నామం: లఘువిష్ణుక్రాంత్  (Lagubisnukrnt) , నిలాశంఖపుష్ష్పి, వైష్ణవ, విష్ణుక్రాంతి, విష్ణుకాంత, విష్ణుగంధి, శంక్పుష్పి,
  • వాడే భాగాలు: ఆకులు, కొమ్మలు, పువ్వులు, పండ్లు
  • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: ఈ పూమొక్క మూలిక భారతదేశానికి స్థానికంగా చెందినది, ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో ఎక్కువగా కన్పిస్తుంది.
  1. శంఖపుష్పి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of shankhpushpi in Telugu
  2. శంఖపుష్పి యొక్క ఔషధ ప్రయోజనాలు - Medicinal benefits of shankhpushpi in Telugu
  3. శంఖపుష్పి మోతాదు - Shankhpushpi dosage in Telugu
  4. శంఖపుష్పి సిరప్ - Shankhpushpi syrup in Telugu
  5. శంఖపుష్పి పౌడర్ - Shankhpushpi powder in Telugu
  6. శంఖపుష్పి యొక్క దుష్ప్రభావాలు - Shankhpushpi side effects in Telugu

శంఖపుష్పిని అనేక ఆరోగ్య ప్రయోజనాలకు విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఈ మూలిక సేవనం ప్రశాంతతా భావం, శాంతి, మంచి నిద్ర కలుగుతాయి. ఆందోళన, ఒత్తిడి, మానసిక అలసటల నుండి విముక్తిని కల్గించి విశ్రాంతినిస్తుంది. శంఖపుష్పి యొక్క ఈ ప్రయోజనాలు, ఇంకొన్ని ఇతర ఉపయోగాల గురించి దిగువ చర్చించడం జరిగింది.

  • మెదడుకు ప్రయోజనాలు: శంఖపుష్పి ఉత్తమ మెదడు టానిక్కుల్లో ఒకటి, జ్ఞాపకశక్తి మరియు జ్ఞానం మీద ఈ మూలిక రక్షనాత్మక ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని కోల్పోవడాన్నిఅరికడుతుంది మరియు వయసు-సంబంధిత నాడీపతనాన్ని (న్యూరోడిజనరేషన్) నిరోధిస్తుంది. ఆందోళనను మరియు నిరాశను తగ్గించడంలో కూడా శంఖపుష్పి ప్రభావవంతంగా పని చేస్తుంది.
  • చర్మారోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: శంక్పుష్పి సారాన్ని చర్మంపై వేస్తే అది బాగా చర్మంలోనికి చొచ్చుకుపోతుంది, తద్వారా ఇది చర్మాన్ని బాగా పోషించి పునరుజ్జీవింపజేస్తుంది. ఈ మూలిక మన చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మం ఆరోగ్యకరంగా మరియు సహజమైన మెరుపును పొందడానికి శంఖపుష్పి తోడ్పడుతుంది. శంఖపుష్పి ప్రతిక్షకారిణి కావటంవల్ల ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు చర్మంపై ఏర్పడే ముడుతలు మరియు ముదురు మచ్చలు వంటి చర్మ-సంబంధ తొలి వృద్ధాప్య చిహ్నాలను త్వరగా రానీయకుండా జాప్యం చేస్తుంది.
  • కడుపుకు శంఖపుష్పి ప్రయోజనాలు: శంఖపుష్పి సంప్రదాయబద్ధంగా జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడానికి మరియు విరేచనాలను నివారించడానికి ఉపయోగిస్తారు. పెప్టిక్ పుండ్ల (పూతల) విషయంలో కడుపుగోడల్ని రక్షించడంలో ఈ మూలిక ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధన అధ్యయనాలు సూచిస్తున్నాయి.
  • హైపర్ థైరాయిడిజం కోసం శంఖపుష్పి: శంఖపుష్పి మూలిక థైరాయిడ్-వ్యతిరేక  లక్షణాలను సూచిస్తాయని ఇటీవలి అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇది ఒత్తిడి విషయంలో థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలను తగ్గిస్తుంది, తద్వారా అధిక థైరాయిడ్‌ గ్రంథి మాంద్యం (హైపర్ థైరాయిడిజం) యొక్క నిర్వహణలో సహాయపడుతుంది.
  • గుండెకు ప్రయోజనాలు: శంఖపుష్పి  యొక్క రసాయన (ఎథనోలిక్) పదార్ధాలు నాన్- ఎస్టేరిఫైడ్ కొవ్వు ఆమ్లాల (non-esterified fatty acids) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె పోటువంటి హృదయ సంబంధ రోగాలకు నాన్- ఎస్టేరిఫైడ్ కొవ్వు ఆమ్లాల సమీకరణం ఒక ప్రధాన కారణం. ఈ మూలిక కూడా రక్తంలో కొలెస్ట్రాల్ ను (కొవ్వు) తగ్గిస్తుంది మరియు రక్తపోటును నిర్వహించటానికి సహాయం చేస్తుంది. రక్తంలో కొవ్వుల పెరుగుదల మరియు రక్తపోటు అనేవి గుండె వ్యాధులకు ప్రధాన ప్రమాదకారకాల్లో రెండు.

జీర్ణశక్తికి శంఖపుష్పి - Shankhpushpi for digestion in Telugu

శరీరంలో జీర్ణక్రియ ప్రక్రియకు సహాయంగా ఉండేందుకు శంఖపుష్పిని సంప్రదాయకంగా వాడుతున్నారు. మొక్కలోని అన్ని భాగాల నుంచి సేకరించిన సారం శరీరంలో ద్రవం నిలుపుదలను నివారించడంలోను మరియు జీర్ణక్రియకు మద్దతుగా నిలవడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగు-సంబంధ రుగ్మతలకు, ముఖ్యంగా విరేచనాలకు చికిత్స చేయడానికి, ఒక గొప్ప నివారిణిగా పరిగణించబడుతుంది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

యాంటీబాక్టీరియాల్ శంఖపుష్పి - Shankhpushpi as an antibacterial in Telugu

ఇటీవలి అధ్యయనం ద్వారా శంఖపుష్పి యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉందని రుజువైంది. ఈ మూలిక యొక్క ఎథనాలిక్ సారానికి సూడోమోనాస్ ఎరుగినోసా , బాసిల్లస్ సబ్లిటిస్ మరియు ఎస్చెరిచియా కోలి వంటి ప్రముఖ సూక్ష్మజీవి జాతుల చర్యలకు వ్యతిరేకంగా పనిచేసే శక్తి కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. దీన్ని తగిన మోతాదులో తీసుకొంటే బాక్టీరియాల వలన కలిగే అతిసారం వంటి వ్యాధులను నివారించవచ్చు .

ఈ మూలికలోని టానిన్లు (టానిన్స్), సాఫోనిన్లు, కమారిన్లు, ఫ్లేవానాయిడ్లు, ఫెనాల్ మరియు ట్రిటెర్పెన్యియిడ్లు వంటి అనేక జీవక్రియా (బయోలాక్టివ్) సమ్మేళనాలు రోగకారక బాక్టీరియా చర్యలకు వ్యతిరేకంగా పని చేస్తాయి. శంఖపుష్పి యొక్క సూక్ష్మజీవి వ్యతిరేక (యాంటీ బాక్టీరియల్) లక్షణాలు గాయాల చికిత్సకు ఉపయోగకరంగా ఉంటుంది.

యాంటీయాక్సిడెంట్గా శంఖపుష్పి - Shankhpushpi as an antioxidant in Telugu

2017 లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, శంఖపుష్పి యాంటీ ఆక్సిడైజింగ్ లక్షణాలను కలిగి ఉందని కనుగొనబడింది. స్వేచ్చా రాశుల్ని (శరీరం యొక్క వివిధ అవయవాలకు నష్టం కలిగించేవి) తటస్తం చేయగల సామర్థ్యాన్ని ఈ మూలిక సారానికి  ఉంది.

శరీర కణాలకు నష్టాన్ని నివారించడంలో లేదా ఆ నష్టాన్ని జాప్యం చేయడంలో అనామ్లజనకాలు సహాయపడతాయి మరియు శరీరం యొక్క సరైన జీవక్రియ కోసం ఈ అనామ్లజనకాలు అవసరం. ఈ మూలికలో ఉన్నఫ్లేవానాయిడ్లు వంటి జీవ సంబంధిత సమ్మేళనాలు దాని బలమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణానికి మరియు సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలకు బాధ్యత వహిస్తాయి.

(మరింత చదువు:  యాంటీఆక్సిడెంట్ ఆహారాలు)

గుండెకు శంఖపుష్పి - Shankhpushpi for heart in Telugu

శంఖపుష్పి సేవనం గుండెకు ఉపయోగకరంగా ఉంటుందని కనుగొనబడింది. ఈ మూలిక యొక్క సారం రసాయన (ఎథనోలిక్) పదార్ధాలు నాన్-ఎస్టేరిఫైడ్ కొవ్వు ఆమ్లాల (non-esterified fatty acids) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని ఇటీవలి అధ్యయనం నిరూపించింది, గుండె పోటు వంటి హృదయ సంబంధ రోగాలకు నాన్- ఎస్టేరిఫైడ్ కొవ్వు ఆమ్లాల సమీకరణం ఒక ప్రధాన కారణం. NEFA స్థాయిలు ప్రాధమికంగా జీవక్రియా (బయోఆక్టివ్) సమ్మేళనం, కాఎమ్పెఫరోల్, మొక్కలో కనిపించే ఓ ఫ్లేవానోయిడ్ యొక్క కార్యకలాపాల ద్వారా తగ్గించబడతాయి, తద్వారా గుండె ఆరోగ్యాన్ని నిర్వహించడంలో శంఖపుష్పి పాత్రను సూచిస్తాయి.

చర్మానికి శంఖపుష్పి - Shankhpushpi for the skin in Telugu

శంఖపుష్పి మూలిక యొక్క ప్రముఖ ఉపయోగం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం. చర్మం నాణ్యత కోసం ఈ శంఖపుష్పి మూలికను ఒక ప్రత్యామ్నాయంగానో లేదా టానిక్ గాను ఉపయోగించవచ్చు. ఇది చర్మము లోనికి చొచ్చుకొనిపోయి, దాని అన్ని పొరలకు పోషకాలను అందిస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి. ఇది చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తుంది. అంతేకాకుండా, మొటిమలు వంటి చర్మ రుగ్మతలక్కూడా ఈ మూలిక ద్వారా చికిత్స చేయవచ్చు. శంఖపుష్పి యొక్క చర్మపు ప్రయోజనాలను సాధించడానికి జీలకర్ర మరియు పాల మిశ్రమంతో కలిపి ఈ మూలికను (శంఖపుష్పి) సేవిస్తారు.

జ్ఞాపకశక్తికి శంఖపుష్పి - Shankhpushpi for memory in Telugu

మన శరీరానికి శంఖపుష్పి యొక్క ముఖ్యమైన ఉపయోగం మెదడు శక్తిని పెంచడం. ఇది ప్రధానంగా మెదడుకు టానిక్ (బలవర్ధిని)గా మరియు ప్రేరేపణకారిగా (స్టిమ్యులేటర్గా) పని చేస్తుంది. ఈ మూలికలో ఉన్న అనేక జీవక్రియాశీల (బయోఆక్టివ్) సమ్మేళనాలు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి, జ్ఞాపకశక్తి కోల్పోవడమనే తొందరను నివారించడంలో సహాయపడుతుంది. ఈ మొక్కకు నాడీరక్షణ (మెదడును కాపాడుతుంది) లక్షణాలను కలిగి ఉంది. జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడే ఒక ప్రముఖ సహజ ఔషధం గా ఇది పరిగణించబడుతుంది.

భారతదేశంలో, పురాతన కాలం నుంచి, అన్ని వయసులవారికి ఈ శంఖపుష్పి మూలికను ఉపయోగించడం జరిగింది. మెదడు సామర్థ్యాన్ని మరియు శక్తిని మెరుగుపరచడం ద్వారా ఈ మూలిక మెదడుకు ఉత్తేజకంగా పనిచేస్తుంది. మూలిక యొక్క సహజ రసాయనిక పదార్థాలు మెదడులో ఉద్రిక్తతను తగ్గించి నెమ్మదిని మరియు శాంతిని కలుగజేయడానికి సహాయపడుతుంది. శంఖపుష్పి (కన్వల్ల్యులస్ ప్లురికొలైస్) ని నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తులకు ఓ ట్రాంక్విలిజెర్ (ఆదుర్దాను తగ్గించే మందు) గా ఉపయోగపడుతుంది.

అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే శంఖుపుష్పిలో ఉన్న ఔషధ లక్షణాల కొరకు ఈ మూలికను విస్తృతంగా ఉపయోగించడం జరుగుతోంది. అనేక రకాల వ్యాధులకు  విరుగుడుగా ఈ మూలిక సమర్థవంతంగా పనిచేస్తుంది. శంఖపుష్పిని కింది వ్యాధులకు ఔషధంగా ఉపయోగించవచ్చునని ఇక్కడ వివరించడమైంది.

  • అధిక రక్తపోటుకు: శంఖపుష్పి నయం చేసే ఒక ప్రధాన సమస్య అధిక రక్తపోటు. ఇది శరీరంలో అడ్రినాలిన్ మరియు కార్టిసోల్ వంటి స్ట్రెస్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రణలో ఉంచి అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయం చేస్తుంది. 
  • నరాల సమస్యలకు: అల్జిమర్స్, మూర్ఛ, చిత్తవైకల్యం వంటి నరాల సంబంధిత  రుగ్మతలను శంఖపుష్పి తగ్గిస్తుంది. 
  • థైరాయిడ్ కు: ఈ మూలిక యొక్క వేరుల సారాలు హైపర్ థైరాయిడిజంపై వ్యతిరేక చర్యలు చూపించినట్లు  2017లో నిర్వహించిన ఒక అధ్యయనం తెలిపింది . ఈ మూలిక యాంటీ-థైరాయిడ్ లక్షణాలను కలిగి ఉంటుంది.
  • పెప్టిక్ అల్సర్లకు: శంఖపుష్పి రసం పెప్టిక్ అల్సర్ల కోసం సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనికి యాంటీ- అల్సర్ చర్య ఉన్నట్లు పరిశోధనలు తెలిపాయి.
  • ఆందోళన కోసం: ఆందోళన, కుంగుబాటు వంటి రుగ్మతలను తగ్గించడంలో కూడా శంఖపుష్పి ప్రభావవంతంగా పనిచేస్తుంది. పలు అధ్యయనాలు ఈ మూలిక ప్రశాంతమైన భావనను కలిగిస్తుందని సూచించాయి.              

ఆందోళనకు శంఖపుష్పి - Shankhpushpi for anxiety in Telugu

ఆందోళన మరియు కుంగుబాటు వంటి రుగ్మతలపై శంఖపుష్పి (కాన్వాల్యులస్ ప్లరికాలిస్) ప్రభావవంతంగా పని చేస్తుందని గుర్తించారు. ఈ మూలిక సేవనంవల్ల శాంతి మరియు మనసుకు నెమ్మదిని కల్గించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు సాక్ష్యంతో పాటు నిరూపించాయి. ఈ మొక్క మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఆందోళన మరియు మానసిక అలసటకు ఉపశమనం కల్గించడంలో కూడా ఇది ప్రభావశాలి. ఆందోళనతో కూడిన రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు ఈ మూలికా సేవనం ఉపయోగకరంగా ఉంటుందని ఈ మూలికపై అధ్యయనాలు జరిపిన వైద్య అధ్యయనాలు కనుగొన్నాయి.

పెప్టిక్ పుండ్లకు శంఖపుష్పి - Shankhpushpi for peptic ulcers in Telugu

గ్లైకోప్రోటీన్ స్రావాల కారణంగా శరీరంలో ఏర్పడే వివిధ పండ్లను నయం చేయడంలో కూడా శంఖపుష్పి ప్రభావవంతంగా పనిచేస్తుంది. మొత్తం మొక్క యొక్క రసం సేవించడంవల్ల జీర్ణమండల పుండ్లను (peptic ulcers) తగ్గించడంలో బాగా పని చేస్తుంది. ఈ మూలిక యొక్క పండ్లను  నయం చేసే సామర్థ్యం దాన్లోని ‘ముసిన్’ స్రావం వంటి కొన్ని శ్లేష్మ రక్షణాత్మక కారకాల యొక్క క్రియాశీలతను ఈ మూలిక క్రియాశీలకంగా మారుస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి.

(మరింత చదువు: కడుపులో పుండ్లు)

థైరాయిడ్ గ్రంధి అతి క్రియకు శంఖపుష్పి - Shankhpushpi for hyperthyroidism in Telugu

2017 లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, శంఖపుష్పి (కాన్వాల్యులస్ ప్లురిరికోలిస్)లో  థైరాయిడ్ రుగ్మతకు వ్యతిరేకంగా పని చేసే గుణాన్ని కలిగి ఉందని కనుగొనబడింది. శంఖపుష్పి వేర్ల సారం థైరాయిడ్ గ్రంథి అతి క్రియ (హైపర్ థైరాయిడిజం)కు వ్యతిరేకంగా పని చేసి రుగ్మత తగ్గుముఖం పట్టడానికి ఉపయోగకరంగా ఉంటుందని కనుగొనబడింది. మొక్క యొక్క సారం ఒత్తిడి పరిస్థితుల్లో ఉత్పత్తి చేయబడిన థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలను తగ్గించడం ద్వారా థైరాయిడ్ చర్యను నిరోధిస్తుంది. ఈ  మూలిక హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాలేయం ఉత్పత్తి చేసే కొన్ని ఎంజైములపై ఈ మూలిక గట్టిగా పనిచేసి థైరాయిడ్ గ్రంధి అతిక్రియ వ్యాధి లక్షణాల్ని గుణముఖం పట్టిస్తుంది.

కొలెస్టరాల్ తగ్గించే శంఖపుష్పి - Shankhpushpi for cholesterol in Telugu

శంఖపుష్పి సారం రక్తంలో కొవ్వుల (కొలెస్ట్రాల్) స్థాయిని తగ్గిస్తుందని ఇటీవలి అధ్యయనం కనుగొంది. మన శరీరానికి హానికరమైన ట్రైగ్లిసెరైడ్స్, ఫాస్ఫోలిపిడ్లు మరియు తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్టరాల్ (LDL) తగ్గించడంలో ఈ మొక్క యొక్క ఎథనొలిక్ పదార్ధాలు ప్రయోజనకరంగా ఉన్నాయని రుజువు చేయబడింది.

(మరింత చదువు: అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు)

నరాలవ్యాధులకు శంఖపుష్పి - Shankhpushpi for neurodegenerative diseases in Telugu

నాడీ వ్యవస్థలో కణాల నాశనానికి కారణమయ్యే వ్యాధులు, నాడీపతన వ్యాధుల నివారణకు విస్తృతంగా ఉపయోగించే ఔషధం ఇది. నాడీ కణాల (న్యూరాన్స్) యొక్క క్షీణతకు కారణమయ్యే అల్జీమర్స్ , ఎపిలెప్సీ మరియు చిత్తవైకల్యం వంటి వ్యాధులు శంఖపుష్పి సేవనం ద్వారా చికిత్స చేయబడతాయి.

శంఖపుష్పి మొత్తం మొక్క నుండి సేకరించిన పదార్ధాలు నాడీ కణాల యొక్క సహజసిద్ధమైన పనితీరును తగ్గించడంలో ఉపయోగపడతాయని అధ్యయనాలు కనుగొన్నాయి, ఈ మూలిక మూర్ఛలను తగ్గించడంలో సహాయపడుతుంది.

రక్తపోటుకు శంఖపుష్పి - Shankhpushpi for hypertension in Telugu

శంఖపుష్పిని సేవించడం ద్వారా చికిత్స చేయబడిన అత్యంత సాధారణ వ్యాధులలో అధిక రక్తపోటు ఒకటి. ఈ మూలిక రక్తపోటును పెంచే అడ్రినలిన్ మరియు కార్టిసోల్ వంటి శరీరంలోని ఒత్తిడిని పెంచే హార్మోన్లు ఉత్పత్తిని నియంత్రిస్తుందని కనుగొనబడింది. ఆ విధంగా ఇది ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. శంఖపుష్పి మూలికను ప్రముఖంగా పునరుజ్జీవన (rejuvenation) చికిత్సల్లో ఉపయోగిస్తారు (దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది).

(మరింత చదువు: అధిక రక్తపోటు లక్షణాలు)

వివిధ వ్యాధులు మరియు రుగ్మతలకు చికిత్స చేయడానికి శంఖపుష్పి యొక్క సిఫార్సు చేయబడిన మోతాదు భిన్నంగా ఉంటుంది. వ్యాధిని బట్టి వైద్యులు వివిధ మోతాదులను సిఫార్సు చేస్తారు. ఒక వ్యక్తి యొక్క శరీర తత్త్వం  మరియు ఆరోగ్య పరిస్థితుల మీద ఆధారపడి సరైన మోతాదును నిర్ణయించుకునేందుకు ఒక ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹425  ₹850  50% OFF
BUY NOW

సాధారణంగా అందుబాటులో ఉన్న శంఖపుష్పి సిరప్ రూపంలో ఉంటుంది. ఈ సిరప్ జ్ఞాపకశక్తి అభివృద్ధికి మరియు తలనొప్పికి చికిత్స చేయటానికి సిఫారసు చేయబడుతుంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక ప్రముఖ బ్రాండ్లు శంఖుపుష్పి సిరప్ ఉన్నాయి. అందుబాటులో ఉన్న శంఖపుష్పిసిరప్ల ధర 70 నుండి 150 రూపాయల వరకు వస్తుంది.

శంఖపుష్పి మూలిక పొడి రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఈ పొడిని సేవించడానికి సాధారణంగా సిఫారసు చేయబడిన పరిమాణంలో వేన్నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, ఇది వేన్నీళ్ళలో కరిగిపోతుంది. శంఖపుష్పి పొడి ధర రూ 60 నుండి రూ 200 ల మధ్య ఉంటుంది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹719  ₹799  10% OFF
BUY NOW

శంఖపుష్పి సాధారణంగా ఎలాంటి దుష్ప్రభావాలను ఉత్పత్తి చేయదు. దీన్ని ఏ వయస్సు లేదా ఆడ-మగ అన్న లింగ భేదం లేకుండా అందరు వ్యక్తులచే ఉపయోగించబడుతుంది. సిఫార్సు చేయబడిన మోతాదు ప్రకారం తీసుకుంటే ఇది తరచూ ఉపయోగకరంగా ఉంటుంది. అయినా కొందరిలో కొన్ని దుష్ప్రభావాలు క్రింద వివరించిన విధంగా  ఉంటాయి:

  • శంఖపుష్పిఅల్పరక్తపోటు (హైపోటెన్షియల్) (రక్తపోటు తగ్గించే ప్రభావాన్ని) ను కల్గించగలదు. అందువల్ల, తక్కువ రక్తపోటు ఉన్నవారికి శంఖపుష్పిని ఉపయోగించేటపుడు జాగ్రత్తగా ఉండాలి.
  • ఇతర వ్యాధులకు మందులు తీసుకుంటున్నవారు డాక్టర్ను సంప్రదించిన తర్వాతే ఈ మూలికను సేవించాలి.
  • గర్భిణీ స్త్రీలలో శంఖపుష్పి యొక్క ప్రభావాల గురించి గణనీయమైన అధ్యయనాలు చేయలేదు. ఓ ముందు జాగ్రత్త చర్యగా గర్భిణి స్త్రీలు శంఖపుష్పిని సేవించకూడదు.

Medicines / Products that contain Shankhpushpi

వనరులు

  1. Asma'a Al-Rifai et al. Antibacterial, Antioxidant Activity of Ethanolic Plant Extracts of Some Convolvulus Species and Their DART-ToF-MS Profiling. Evid Based Complement Alternat Med. 2017; 2017: 5694305. PMID: 29317894
  2. Parul Agarwa, Bhawna Sharma, Amreen Fatima, Sanjay Kumar Jain. An update on Ayurvedic herb Convolvulus pluricaulis Choisy. Asian Pac J Trop Biomed. 2014 Mar; 4(3): 245–252. PMID: 25182446
  3. Verma S et al. Study of Convolvulus pluricaulis for antioxidant and anticonvulsant activity. Cent Nerv Syst Agents Med Chem. 2012 Mar;12(1):55-9. PMID: 22280406
  4. Nasir A Siddiqui et al. Neuropharmacological Profile of Extracts of Aerial Parts of Convolvulus pluricaulis Choisy in Mice Model. Open Neurol J. 2014; 8: 11–14. PMID: 25110532
  5. Dhingra D, Valecha R. Evaluation of the antidepressant-like activity of Convolvulus pluricaulis choisy in the mouse forced swim and tail suspension tests. Med Sci Monit. 2007 Jul;13(7):BR155-61. PMID: 17599020
  6. Debjit Bhowmik. Traditional Indian Herbs Convolvulus pluricaulis and Its Medicinal Importance . Journal of Pharmacognosy and Phytochemistry
Read on app