శతావరి (Asparagus racemosus) అంటే ఏమిటి? 

హిమాలయ ప్రాంతానికి ప్రకృతిమాత అంతులేని కానుకల్ని కురిపించింది. ఆ కానుకలు బహువిధమైనవి. మానవుడి అలంకరణకు, వండుకుని తినేందుకు మరియు ప్రత్యేకమైన వైద్యానికి ఉపకరించే మూలికా కానుకలవి. దాదాపు మానవుడి ప్రతి  అవసరానికి సహజ ప్రత్యామ్నాయాలు (మూలికల రూపంలో) ఇక్కడ దర్శనమిస్తాయి. హిమాలయపర్వతాల్లో మరియు ఆ పర్వత పాదప్రాంతాల్లో పెరుగుతున్న అడవిమొక్కలలో కనిపించేదే “శతావరి” అనే మూలిక. ఆయుర్వేదవైద్యంలో పేర్కొన్న పురాతనమైన మూలికలలో శతావరి ఒకటి. శతావరి గురించిన ప్రస్తావనలు భారతదేశపు అత్యంత పురాతన వైద్య గ్రంధాలలో కనిపిస్తాయి. “చరక సంహిత” మరియు “అష్టాంగ హృదయ్యం” అనే వైద్యగంథాలు రెండింటిలోను శతావరిని "ఆడ టానిక్" (female tonic) గా పిలవడం జరిగింది. కాబట్టి శతావరి ఓ బలవర్ధకౌషధం (tonic) అన్నమాట.   నిజానికి, శతావరి అనే మాటకున్న అర్థం మీలో కుతూహలాన్ని రేపవచ్చు. “శతావరి” అంటే “వంద భర్తలను కలిగి ఉన్నది" అని అర్థం. కనుకనే ఇది స్త్రీ పునరుత్పాదక వ్యవస్థ యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో తిరుగులేని మూలికగా శతావరి ప్రసిద్ధి చెందింది. అంతేలే అని మీరు అనుకొంటే, మీకు మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని వెనువెంటనే చెప్పాలి. అదేమంటే, ఆయుర్వేదం ప్రకారం, శతావరిని "నూరు  వ్యాధుల్ని మాన్పునది" అని కూడా అంటారు.  అదనంగా, శతావరికి ఉన్న “ఒత్తిడి-వ్యతిరేకతా” (అడాప్తోజేనిక్) గుణం మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఒత్తిడి-సంబంధిత సమస్యలకు పరిణామకారి ఔషధీ. ఇది ముసలి వయస్సు-సంబంధిత వ్యాధులకు కూడా ఉపశమనకారిగా పని చేసే చాలా ప్రభావవంతమైన మూలిక. శతావరి మూలికకున్న ప్రాముఖ్యం అంతటిది కాబట్టే ఆయుర్వేదవైద్యం దీనిని "మూలికల రాణి" (queen of herbs)  గా పిలుస్తోంది.

శతావరి గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు: 

  • ఔషధీశాస్త్ర నామం (బొటానికల్ పేరు): అస్పరాగస్ రసిమోసస్
  • కుటుంబం: లిలియాసియా / ఆస్పరాగసేయే
  • సాధారణ పేరు: శతావరి, ఆస్పరాగస్ రూట్, ఇండియన్ ఆస్పరాగస్
  • సంస్కృతం పేరు: శతావరి, శట్ములి/శతములి
  • ఉపయోగించే భాగాలు: వేర్లు మరియు ఆకులు
  • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: భారత ఉపఖండంలోని ఉష్ణమండల ప్రాంతాలు శతావరికి నిలయంగా ఉన్నాయి, కానీ ఇది భారతదేశ హిమాలయ ప్రాంతాలలో కూడా విస్తారంగా పెరుగుతుంది. శతావరి శ్రీలంక మరియు నేపాల్ ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది.
  • శక్తిశాస్త్రం: శరీరానికి శీతలీకరణాన్ని మరియు తేమను కల్గించే గుణం శతావరికి ఉంది. ఆయుర్వేదంలో శతావరి గురించి ప్రస్తావించి, వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుందని చెప్పారు.
  1. శతావరి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of shataavari in Telug
  2. శతావరి (ఆస్పరాగస్) మొక్క మరియు దీన్ని ఎలా ఉపయోగించాలి - Asparagus plant and how is Shatavari used in Telugu
  3. శతావరి మోతాదు - Shatavari dosage in Telugu
  4. శతావరి దుష్ప్రభావాలు - Shatavari side effects in Telugu

శతావరి స్తీల యొక్క సంతానోత్పత్తికి మరియు వారి చక్కటి లైంగిక ఆరోగ్యానికి పని చేసే ఒక అద్భుతమైన మూలిక. కానీ ఈ మూలిక అనేకమైన ఉపశమనాల్ని కల్గించే మందుగా పిలువబడటానికి ఓ కారణం ఉంది.

సూక్ష్మజీవనాశినిగా శతావరి ప్రయోజనాలు - Shataavari benefits as an antibiotic in Telugu

శతావరి యొక్క సూక్ష్మజీవనాశక (antimicrobial) తత్వాలను పరీక్షించేందుకు పలు అధ్యయనాలు నిర్వహించారు. ప్రతి అధ్యయనం కూడా శతావరి యొక్క వేరు మరియు ఆకు చూర్ణం పలు రకాలైన సూక్ష్మజీవులను నాశనం చేయటంలో ప్రభావవంతంగా పని చేసినట్లు పేర్కొంది. మన పొట్టలో జనించే హానికారక సూక్ష్మజీవులైన ఈ-కోలి, బాసిల్లస్ సబ్లిటిస్, స్టాఫిలోకాకస్, సాల్మోనెల్లా మరియు సూడోమోనాస్ మరియు క్యాండిడా వంటి ఫంగస్ బ్యాక్టీరియాల విరుద్ధంగా శతావరి సూక్ష్మక్రిమినాశినిగా ప్రభావవంతంగా పని చేసిందని అధ్యయనాలు చెప్పాయి.అందువల్ల, చాలా మటుకు సూక్ష్మక్రిమికారక వ్యాధులు మరియు శిలీంధ్ర వ్యాధులకు చికిత్స చేయడానికి శతావరి వేర్లను సురక్షితంగా ఉపయోగించవచ్చు. ఇంకా, ఆధునిక వైద్యంలో కూడా శతావరి సహజ సూక్ష్మక్రిమినాశినిగా తన సామర్థ్యాన్ని చారావచ్చని చెప్పవచ్చు.  

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

దోమకారక వ్యాధులను నివారించడంలో శతావరి శక్తి - Shatavari potential in preventing mosquito-borne diseases in Telugu

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యాధులు ప్రబలి, తత్ఫలితంగా సంభవించే మరణాలకు గల సాధారణ కారణాలలో దోమల వలన కలిగే వ్యాధులు ఒకటి. అపరిశుభ్ర  పరిస్థితులు మరియు ఆరోగ్య పరిరక్షణ గురించిన సమాచారం లేకపోవడమే ఈ వ్యాధి నిష్పత్తి మరింత తీవ్రంగా ఉండటానికి ప్రధాన కారణం. వ్యాధుల నుండి రక్షణ పొందేందుకు తీసుకోవలసిన భద్రతా చర్యల గురించి ఉత్సుకత మరియు అవగాహన పెంపొందించడానికి చాలా కార్యక్రమాలే ఉన్నప్పటికీ, ఆయా కాలాల్లో దోమల పెరుగుదలను మనం పూర్తిగా ఆపలేము. దోమల నివారణకు సాధారణంగా ఉపయోగించే రసాయనిక-ఆధారితమైన జాగ్రత్తలు ఒకటి లేదా రెండు దుష్ప్రభావాలను కలిగించొచ్చు. కొత్త నిరోధక కీటక జాతుల (దోమలను అరికట్టేందుకు) అభివృద్ధిని నిరాకరించలేం, అలాంటి దోమ నిరోధక కీటకజాతులు ప్రస్తుతం మనం దోమ-నివారణకు ఉపయోగిస్తున్న రసాయనిక పదార్థాలకు లొంగవు. కనుక, దోమల పెరుగుదలను మరియు వాటి విపరీత వ్యాప్తిని నివారించడానికి కొన్ని కఠినమైన చర్యలు తప్పవు. ఇటీవలి కొన్ని అధ్యయనాల సూచనల మేరకు శతావరి వేర్ల నుండి తీసిన మిథనాల్ సారం దోమల్ని, వాటి  లార్వా, గుడ్లను సైతం అద్భుతంగా చంపేస్తాయి. అంటే డెంగ్యూ, మలేరియా మరియు చికున్ గున్యా వంటి వ్యాధులను నివారించడానికి ఈ శతావరి వేర్ల నుండి తీసిన ఇథనాల్ సారాన్ని ఉపయోగించుకోవచ్చు. పైగా ఇది పర్యావరణహిత కీటకనాశిని. శతావరి మూలికను దోమలనివారణకు అనువైనదిగా అభివృద్ధి చేయబడుతోంది కనుక ఇది విస్తృతమైన పరిధిలో పనిచేస్తుంది, కనుక శతావరి వేర్ల సారం యొక్క చర్యకు వ్యతిరేకంగా మరో నిరోధకతను పొందడం కష్టం.

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యాధులు ప్రబలి, తత్ఫలితంగా సంభవించే మరణాలకు గల సాధారణ కారణాలలో దోమల వలన కలిగే వ్యాధులు ఒకటి. అపరిశుభ్ర  పరిస్థితులు మరియు ఆరోగ్య పరిరక్షణ గురించిన సమాచారం లేకపోవడమే ఈ వ్యాధి నిష్పత్తి మరింత తీవ్రంగా ఉండటానికి ప్రధాన కారణం. వ్యాధుల నుండి రక్షణ పొందేందుకు తీసుకోవలసిన భద్రతా చర్యల గురించి ఉత్సుకత మరియు అవగాహన పెంపొందించడానికి చాలా కార్యక్రమాలే ఉన్నప్పటికీ, ఆయా కాలాల్లో దోమల పెరుగుదలను మనం పూర్తిగా ఆపలేము. దోమల నివారణకు సాధారణంగా ఉపయోగించే రసాయనిక-ఆధారితమైన జాగ్రత్తలు ఒకటి లేదా రెండు దుష్ప్రభావాలను కలిగించొచ్చు. కొత్త నిరోధక కీటక జాతుల (దోమలను అరికట్టేందుకు) అభివృద్ధిని నిరాకరించలేం, అలాంటి దోమ నిరోధక కీటకజాతులు ప్రస్తుతం మనం దోమ-నివారణకు ఉపయోగిస్తున్న రసాయనిక పదార్థాలకు లొంగవు. కనుక, దోమల పెరుగుదలను మరియు వాటి విపరీత వ్యాప్తిని నివారించడానికి కొన్ని కఠినమైన చర్యలు తప్పవు. ఇటీవలి కొన్ని అధ్యయనాల సూచనల మేరకు శతావరి వేర్ల నుండి తీసిన మిథనాల్ సారం దోమల్ని, వాటి  లార్వా, గుడ్లను సైతం అద్భుతంగా చంపేస్తాయి. అంటే డెంగ్యూ, మలేరియా మరియు చికున్ గున్యా వంటి వ్యాధులను నివారించడానికి ఈ శతావరి వేర్ల నుండి తీసిన ఇథనాల్ సారాన్ని ఉపయోగించుకోవచ్చు. పైగా ఇది పర్యావరణహిత కీటకనాశిని. శతావరి మూలికను దోమలనివారణకు అనువైనదిగా అభివృద్ధి చేయబడుతోంది కనుక ఇది విస్తృతమైన పరిధిలో పనిచేస్తుంది, కనుక శతావరి వేర్ల సారం యొక్క చర్యకు వ్యతిరేకంగా మరో నిరోధకతను పొందడం కష్టం.

రోగనిరోధకాలకు అనుపానకారిగా శతావరి - Shatavari as immunoadjuvant in Telugu

వ్యాధినిరోధక టీకామందుల యొక్క సమర్ధత మరియు పనితీరును మెరుగుపర్చడానికి ఆ టీకాలు వేయడంతోపాటు సహాయకారిగా ఇచ్చే  పదార్థమే అనుపానం. ఆంగ్లంలో దీన్ని immunoadjuvant అంటారు. కామెర్ల జబ్బు(హెపాటిటిస్) వంటి వ్యాధులకు ఇచ్చే “డిపిటి వాక్సిన్” వంటి వ్యాధినిరోధక  టీకామందులతో బాటు అనుపానకారిగా శతావరి వేర్ల సారాన్నిచ్చి శతావరి యొక్క పనితీరును పలు అధ్యయనాలు పరిశీలించాయి. అలా జరిపిన అధ్యయనాలన్నీ కూడా సూచించిందేమిటంటే శతావరి రోగనిరోధక-అనుపానకారిగా ఖచ్చితమైన ప్రభావాన్ని చూపుతుందని. శతావరిలో ఉన్న సహజ రసాయన సమ్మేళనాలే దాని రోగనిరోధకమందుల అనుపానకారి లక్షణానికి కారణమవుతున్నాయని ఇతర అధ్యయనాలు కూడా  పేర్కొంటున్నాయి. శరీరంలోని కణాధారిత రోగనిరోధకత (T కణాల క్రియాశీలత) ను ప్రేరేపించడం ద్వారా శతావరి శరీరంలో పనిచేస్తుంది. ఈ మూలిక మానవ శరీరంలోని తెల్ల రక్త కణాల్ని మరియు ప్రతిరక్షకాలను (antibodies) ఉత్తేజితం చేస్తుంది. అందువల్ల, చాలామటుకు రోగనిరోధక టీకామందులతో పాటు ఇచ్చే అనుపానంగా శతావరికి చికిత్సాపరమైన ఉపయోగాలు ఉన్నాయి.

రోగనిరోధకతను పెంచే శతావరి - Shatavari for improving immunity in Telugu

రోగనిరోధక మిశ్రకాలు మన శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి మరియు మన శరీరంలో దాపురించే అంటువ్యాధులతో పోరాడడానికి మనకు సహాయపడే మందులివి. ఇవి మందులు కావచ్చు, మొక్కలు-మూలికలు కావచ్చు లేదా మందుల సమ్మేళనాలు కూడా కావచ్చు. విజ్ఞాన పురోగతితో మార్కెట్లో వాణిజ్యపరంగా లభించే యాంటీబయాటిక్స్ (క్రిమినాశకాలు) చాలానే  ఉన్నాయి. గతంలో మానని ఎన్నో రోగాలకు ఇప్పుడు మందులతో మాన్పగల్గిన చికిత్సలున్నాయి. ఆ రోగాలు ఒకవేళ తీవ్రతరమైనవి అయితే వాటికి శస్త్రచికిత్స ద్వారా బాగుచేయడం ఉండనే ఉంది. కానీ ద్వితీయ క్రిమిదోషాలు/అంటురోగాల (secondary infections) మరణాల రేట్లను మనం నిరాకరించలేం. అధిక మోతాదుల్లో మందుల సేవనం వలన వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి తగ్గడం కారణంగా దాపురించేవే ఈ “ద్వితీయ అంటువ్యాధులు.” ఫలితంగా, మరింత వైద్య చికిత్స అవసరం అవుతుంది, అది ఆ వ్యక్తికి ఒక విషవలయమే అవుతుంది. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రకృతిలో సహజంగా లభించే పదార్థాలతో చేసే సంపూర్ణ చికిత్స మీ శరీరంలో దాపురించే ద్వితీయ సంక్రమణాల్ని నయం చేయడమే గాక మీ రోగనిరోధక వ్యవస్థను మరింత బలపరచి, అటుపై ఏ ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ద్వితీయ అంటురోగాలైన  కాండిడా మరియు స్టెఫిలోకోకస్ లను నయం చేసే ఒక అద్భుతమైన ఏజెంట్ శతావరి, అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శతావరిని మందుగా సేవించడం వల్ల మన శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను మరింత ప్రభావితం చేస్తుంది. తద్వారా శరీరంలో మరిన్ని ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి శతావరి తోడ్పడి సంక్రమణవ్యాధుల్ని మరింత సమర్థవంతంగా చంపుతుందని అధ్యయనకారులు సూచించారు.

(మరింత సమాచారం: రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా)

చెక్కెర వ్యాధికి శతావరి ప్రయోజనాలు - Shatavari benefits in diabetes in Telugu

శతావరి వేర్లు చక్కెరవ్యాధికి పనిచేసే ఒక అద్భుతమైన “యాంటీ-డయాబెటిక్ ఏజెంట్”. ఇది శరీరం యొక్క ఇన్సులిన్ పరిమాణాన్ని పెంచుతుంది. తద్వారా, శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను క్రమంగా తగ్గిస్తూ రోగికి సహాయం చేస్తుందీ మూలిక. జంతువులపై జరిపిన శాస్త్రీయ అధ్యయనాలు మధుమేహానికి చేసే చికిత్సలో ఈ మూలిక యొక్క శక్తిని సమర్ధించాయి. కానీ ఇంకా మనుషులపైన ఈ మూలిక గురించిన అధ్యయనాలు లేనందున, చక్కెరవ్యాధి కల్గిన వారు శతావరిని సేవించేందుకు ముందుగా మీ డాక్టర్ను సంప్రదించాల్సిందిగా మీకు సూచించడమైంది.

చెక్కెర వ్యాధికి శతావరి ప్రయోజనాలు - Shatavari benefits in diabetes in Telugu

శతావరి వేర్లు చక్కెరవ్యాధికి పనిచేసే ఒక అద్భుతమైన “యాంటీ-డయాబెటిక్ ఏజెంట్”. ఇది శరీరం యొక్క ఇన్సులిన్ పరిమాణాన్ని పెంచుతుంది. తద్వారా, శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను క్రమంగా తగ్గిస్తూ రోగికి సహాయం చేస్తుందీ మూలిక. జంతువులపై జరిపిన శాస్త్రీయ అధ్యయనాలు మధుమేహానికి చేసే చికిత్సలో ఈ మూలిక యొక్క శక్తిని సమర్ధించాయి. కానీ ఇంకా మనుషులపైన ఈ మూలిక గురించిన అధ్యయనాలు లేనందున, చక్కెరవ్యాధి కల్గిన వారు శతావరిని సేవించేందుకు ముందుగా మీ డాక్టర్ను సంప్రదించాల్సిందిగా మీకు సూచించడమైంది.

జుట్టు మరియు నెత్తిచర్మారోగ్యానికి శతావరి - Shatavari benefits for hair and scalp in Telugu

మీరు చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? నెత్తి చర్మానికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని అస్సలు వదలడం లేదా ఎప్పుడూ? ఇది చర్మ-సంబంధమైన అంటువ్యాధికి (సంక్రమణకు) సంకేతంగావచ్చు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, శతావరి వేర్ల నుండి తీసిన ఎథనోలిక్ పదార్ధాలు సాధారణమైన చర్మసంబంధమైన శిలీంధ్రాలకు వ్యతిరేకంగా పని చేసే ఒక అద్భుతమైన “యాంటీబయాటిక్” మందు అని చెప్పవచ్చు. చుండ్రు మరియు “సెబోరెయిక్ డెర్మటైటిస్స్” (తామర మరియు సోరియాసిస్ వంటి చర్మం-డంబంధమైన దురదలన్నిటి చర్మసమస్య.) చర్మ వ్యాధి చికిత్సలో శతావరి చాలా ప్రభావకారిగా ఉంటుంది. ఆయుర్వేదలో సూచించిన మేరకు శతావరి నొప్పిని, వాపుల్ని హరించే మందుగా దీర్ఘకాలంగా పిలవబడుతోంది, అనగా మీరు చర్మం-సంబంధమైన దద్దుర్లు, విపరీతమైన దురదతో, దానికితోడు తలమీది చర్మం మీద వచ్చే సాంక్రామిక దద్దుర్లు మరియు చిన్న కురుపుల బాధ నుండి ఉపశమనం పొందటానికి శతావరి బాగా పని చేస్తుంది. కానీ ఇలా నెత్తి  చర్మపు సమస్యలకు చికిత్సలో శతావరి సామర్థ్యాన్ని నిరూపించైనా మానవ అధ్యయనాలు ఇప్పటి వరకూ లేవు. కాబట్టి, మీ వెంట్రుకల ఆరోగ్యానికి శతావరిని ఉపయోగించే ముందు మీ ఆయుర్వేద డాక్టర్తో మాట్లాడడం మంచిది.

మూత్రవిసర్జనకారిగా శతావరి - Shatavari as a diuretic in Telugu

శరీరంలోంచి తరచుగా సాధ్యమైనంతగా నీటిని విడుదల చేసేందుకు దోహదపడే మూలిక లేదా మందును “మూత్రకారకం” (diuretic) గా పేర్కొనవచ్చు. సహజసిద్ధంగా నిర్విషీకరణ ఏజెంట్ గా మరియు మూత్రవర్ధకంగా పనిజేసే మందుకోసం చూస్తున్నట్లయితే శతావరి ఈ విషయంలో మీకెంతో తోడ్పడుతుంది.   శరీరంలో ఉండే అధిక నీటిని, ఇతర విషపదార్థాలను బయటికి విడుదల చేస్తుంది, తద్వారా శరీరం ఆరోగ్యాంగా తయారవుతుంది. అంతేకాకుండా, అదనపు లవణాలు మరియు నీటిని బయటకు పంపేయడం ద్వారా శతావరి మూత్రపిండాలను శుభ్రం చేస్తుంది. జంతువులపై శతావరి ప్రభావాలపై జరిపిన అధ్యయనాల ప్రకారం, ఈ మూలికా సేవనం మూత్రపిండాల రాళ్ళను విచ్ఛిన్నం చేస్తుందని తేలింది.

అతిసారం చికిత్సకు శతావరి - Shatavari for treating diarrhoea in Telugu

ఆయుర్వేద వైద్యులు అతిసారం చికిత్సలో శతావరిని వాడుతూనే ఉన్నారు, కానీ ఈ మూలిక యొక్క సామర్ధ్యాన్ని పరీక్షించడానికి శాస్త్రవేత్తలు పరీక్షలు చేశారు. అత్యంత సాధారణ ఆరోగ్య సమస్య అయిన అతిసార చికిత్సలో శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనపరీక్షల ఫలితాలు ఆయుర్వేద వాదనలు ఖచ్చితమైనవేనని గుర్తించబడ్డాయి. అయితే, మానవుడికొచ్చే అతిసారం మరియు విరేచనాలను చికిత్స చేయడంలో శతావరి మోతాదు మరియు చర్యలను పరీక్షించే నిమిత్తమై అధ్యయనాలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. 

కీళ్లవాపుల నొప్పినివారిణిగా శతావరి - Shatavari for arthritis as an anti-inflammatory in Telugu

ఆధునిక జీవితంలో మనం ఎదుర్కొంటున్న వ్యాధులు మరియు ఆరోగ్య సమస్యలు చాలవన్నట్లు దిననిత్యం మనమెదుర్కొనే ఒత్తిడి మరియు ఆహారంలో చోటు చేసుకొంటున్న విధాయితాహారాలు (processed foods) మన జీవితం యొక్క నాణ్యతను మరింత చెత్తగా మారుస్తోంది. ఈ రోజుల్లో యువతరానికి కూడా దాపురిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఎముక సంబంధితమైన కీళ్ళవాపు  ఒకటి.  మార్కెట్లో వాణిజ్యపరంగా లభించే అనేక మందులు రసాయనపదార్థాలతో కూడుకున్నవి మరియు ఇవి చాలా ప్రభావవంతమైన దుష్ప్రభావాలను కలుగజేసే విగా ఉంటాయి. స్వేచ్చా రాశులు కల్గించే హాని మరియు ఆక్సీకరణ ఒత్తిడి అనేవి కీళ్ళనొప్పులకు కారకమయ్యే ముఖ్య కారణాల్లో ఒకటి. శతావరి ఓ అనామ్లజనిగా శరీరంలో స్వేచ్ఛా రాశుల్ని పూర్తిగా తొలగించేందుకు సహాయపడుతుంది, తద్వారా, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి, ముఖ్యంగా యువకులలో, కీళ్ళనొప్పులు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అదనంగా, అధ్యయనాలు చాటుతున్నదేమంటే శతావరి ఓ చక్కటి నొప్పి నిరోధకంగా పని చేయడం మూలంగా ఇది కీళ్ళలో వచ్చే వాపు మరియు కీళ్ళ నొప్పులకు విరుగుడుగా పని చేస్తుంది.

కడుపులో పుండ్లకు శతావరి - Shataavari for ulcers in Telugu

మీకు తరచుగా ఆమ్లత్వం మరియు గుండెమంటతో బాధపడుతున్నారా? మీ జీవితవిధానం చాలా ఒత్తిడితో కూడుకొని ఉందా? మీరు తీసుకునే ఆహారంలో  చాలా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ లు, మసాలాలు ఎక్కువగా కల్గిన ఆహారాలు తీసుకోవడం జరుగుతోందా? పైన ఉదహరించినవి ఏవీ మీ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మీకు ఆమ్లత్వం, గుండెమంట వంటి బాధలు దాపురించినా ఆశ్చర్యం ఏమీ లేదు.  వైద్యుల ప్రకారం, మన కడుపు చాలా సన్నని రక్షిత పొరను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఉత్పత్తి చేయబడిన హానికరమైన జీర్ణ ఆమ్లాల ప్రభావాల నుండి మనల్ని రక్షిస్తుంది. ఈ ఆమ్లాలు మనం తీసుకునే ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో మరియు కడుపులో బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించటానికి సహాయపడి పొట్టను ఆరోగ్యాంగా ఉంచుతాయి. అయితే కొందరు అధికంగా తీసుకునే మసాలాలు దట్టించిన ఆహారపదార్థాలు లేదా వారి జీవనశైలి అలవాట్ల కారణంగా మన పొట్టలో ఈ ఆమ్లాలు అధికంగా ఉత్పత్తి అయ్యేందుకు దారి తీయవచ్చు. జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే అధిక ఆమ్లాల ప్రభావాల నుండి కడుపు తనను తానూ రక్షించుకోలేకపోయినప్పుడు ఆ ఆమ్లాలు కడుపు లోపలి భాగాలను కాల్చడానికి (బర్న్ చేయటానికి) మొదలు పెడతాయి. తద్వారా కడుపులో పుండ్లు (లేక కడుపులో పూత/పేగుపూత అని కూడా అంటారు దీన్ని) ఏర్పడటానికి దారితీస్తుంది. “పెప్టిక్ పుండు” (peptic ulcer) అనేది వైద్య పదం. అంటే ఈ పెప్టిక్ పుండ్లు కడుపులో అధిక ఆమ్లాల ఉత్పత్తి కారణంగా ఏర్పడతాయి. భారతదేశంలో జీర్ణకోశపు పూతల లక్షణాలను ఉపశమనం చేయడంలో శతావరి ప్రభావాన్ని పరీక్షించే ఓ అధ్యయనంలో భాగంగా పెప్టిక్ పుండ్లతో దీర్ఘకాలికంగా బాధపడుతున్న 30 మంది స్తీ-పురుషులకు మూడు గ్రాముల మోతాదులో శతావరి వేర్ల చూర్ణాన్ని పాలతో కలిపి ఆరు వారాల పాటు ఇచ్చి, వారికి ఖచ్చితమైన ఓ నియమితమైన ఆహారాన్ని కూడా పరీక్షాకాలంలో తినబెట్టారు. ఆరు వారాల తర్వాత, శతావరిని సేవించిన పురుషులు మరియు స్త్రీలను పరీక్షించగా అద్భుతమైన ఫలితాలు గోచరించాయి. కడుపులో పుండ్లకు చికిత్సగా శతావరి చూర్ణం చక్కగా పని చేసినట్లు అధ్యయనకారులు కనుగొన్నారు. కానీ, ఇందులో  రోగికి తినబెట్టిన ఆహారం ప్రణాళిక మరియు సాధారణ పర్యవేక్షణ వంటి పలు అంశాలు కీలకంగా ఉన్నాయి. అందువల్ల, మీరు కూడా ఈ మూలికను సేవించి దాని సంపూర్ణ ఫలితాల్ని పొందడానికి ముందుగా మీ ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించడం మంచిది.

అనామ్లజనిగా శతావరి - Shatavari, the antioxidant in Telugu

శరీరంలో స్వేచ్ఛా రాశులు కల్గించే హానికి వ్యతిరేకంగా పని చేసి మన శరీర ఆరోగ్యానికి దోహదపడే సహజ రక్షణ వ్యవస్థే అనామ్లజనకాలు. ఈ “స్వేచ్ఛా రాశులు” అంటే ఏమిటబ్బా అని మీరు ఆశ్చర్యపోతున్నారా, రోజువారీ పనుల ద్వారా శరీరంలో ఏర్పడే కణాలు లేదా అణువులే స్వేచ్ఛా రాశులు. కానీ, చివరికి, ఈ స్వేచ్ఛా రాశులే శరీరం యొక్క సొంత కణాలనే చంపడం ద్వారా శరీరానికి విషపూరితం అవుతుంటాయి. ఈ స్వేచ్ఛా రాశులు పెద్ద సంఖ్యలో శరీరంలో గుమిగూడుకుపోవడాన్నే “ఆక్సీకరణ ఒత్తిడి”గా పిలువబడుతుంది. ఈ ఆక్సీకరణే బలహీనమైన శరీర విధులకు  మరియు అకాల వృద్ధాప్యానికి ప్రధాన కారణం. మీ శరీరం నుండి అన్ని హానికరమైన స్వేచ్ఛా రాశులను తొలగించేందుకు సహాయపడే మూడు అతి శక్తివంతమైన అనామలీజనకాలు- రసమూఫరాన్, అస్పార్గామిన్, రేసిమోసోల్ లను శతావరి కలిగి ఉందని అధ్యయనాలు పేర్కొన్నాయి. కాబట్టి మీ ఆహారంలో శతావరిని ఓ భాగంగా తీసుకుంటే మీ శరీరంలో కలిగే జీవక్రియాహానిని అరికట్టి ఆరోగ్యవంతమైన జీవక్రియకు ఈ మూలిక సహాయపడుతుంది.

(మరింత సమాచారం: యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహరం)

ఒత్తిడిని తగ్గించేందుకు శతావరి - Shataavari helps in reducing stress in Telugu

ఒత్తిడిని తగ్గించే ప్రసిద్ధ మందులలో శతావరి కూడా ఒకటని ఆయుర్వేదం ఉటంకించింది. అంటే, శతావరిలో ఒత్తిడికి వ్యతిరేకంగా పని చేసే బలవర్ధక లక్షణాలున్నాయన్నమాట. శతావరిని సేవించడం మూలంగా మెదడుకు గల మార్గంపై ఇది ప్రభావవంతంగా పనిజేసి శరీరంలోని ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లను తగ్గిస్తుందని తద్వారా ఒత్తిడి లేని ప్రశాంతమైన మనసు ఏర్పడుతుందని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి. కానీ ఈ అధ్యయనాలన్నీ ఎక్కువగా విజయవంతమయ్యాయి కానీ, అవన్నీ జంతువులపై జరిపిన అధ్యయనాలే, మానవులపై కాదు. ఇప్పటివరకూ, మానవుల్లో శతావరి సామర్థ్యాన్ని నిరూపించడానికి ఎటువంటి పరిశోధనా ఇప్పటివరకు జరగలేదు. అందువల్ల, ఒత్తిడికి శతావరిని ఔషధంగా సేవించే ముందు ఒక వైద్య నిపుణుడిని సంప్రదించాల్సిందిగా మీకు సూచించడమైంది.

బాలింత తల్లులకు శతావరి ప్రయోజనాలు - Shatavari benefits for nursing mothers in Telugu

ఆయుర్వేదలో, శతావరిని చనుబాలసంవర్ధిని (galactagogue)గా  పిలుస్తారు, అంటే స్తన్యపానమిచ్చే తల్లులలో (బాలింతల్లో) చనుబాల ఉత్పత్తిని శతావరి  పెంచుతుందని మరియు ఆయుర్వేద వైద్యులు బాలింతలైన ఆడవారిలో చను పాలు ఎక్కువగా వృద్ధి కావడానికి శతావరిని సేవించమని సూచించారు. ఆధునిక వైద్య శాస్త్రం కూడా సహజ మూలికలను మందులుగా ఉపయోగించడం వైపు వేగంగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ శ్రేణిలో భాగంగా, శతావరిని చనుబాలసంవర్ధినిగా ఎంతమాత్రం పనిచేస్తుందో పరీక్షించేందుకు ఒక పరిశోధన జరిగింది. ఆ పరిశోధన కనుగొన్నదేమంటే క్షీరదాలైన (అంటే తమ పిల్లలకు స్తన్యంతో పాలిచ్చే) జీవులన్నీ శతావరిని సేవించడం మూలంగా ఆ జీవుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. అయినప్పటికీ, మానవులలో శతావరి ఖచ్చితంగా చనుపాల ఉత్పత్తిని పెంచుతుందనే విషయాన్ని నిరూపించిన పరీక్షలు ఇప్పటికీ జరగలేదు. కనుక బాలింత స్త్రీలకు ఈ మూలికను సేవించేందుకు ఇచ్చేటందుకు ముందుగా మీ ఆయుర్వేద డాక్టర్తో సంప్రదించడం మంచిది.

(మరింత సమాచారం: రొమ్ము పాలను పెంచే ఆహారాలు)

పురుషులకు శతావరి ప్రయోజనాలు - Shatavari benefits for men in Telugu

ఆడవారికి బాగా ఉపయోగపడే  సుప్రసిద్ధ మూలికలలో శతావరి ఒకటి. కానీ ఈ మూలిక  సామర్థ్యం కేవలం ఒక్క ఆడవారికి మాత్రమే పరిమితం కాదు. శతావరి నుండి తీసిన జల-మద్యపాన (hydro-alcoholic) మరియు నీటి సారం పురుషులక్కూడా ఒక కామోద్దీపనంగా చాలా సమర్థవంతంగా పని చేస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆయుర్వేదంలో చెప్పిన ప్రకారం, ఏ మూలికయినా లేదా మరేదైనా మందైనా సరే స్త్రీ పురుషుల లైంగిక పనితీరును మరియు లైంగికశక్తిని (లిబిడో) మెరుగుపర్చడానికి ఉపయోగించినట్లైనా దాన్ని కామోద్దీపకమైన మందు లేకా వీర్యవృద్ధికర మందు అని అంటారు. అయినప్పటికీ, ఎలాంటి అధ్యయనాలు ఇంతవరకూ శతావరి కామోద్దీపనకారి అని ఘంటాపదంగా నిరూపించలేదు. కనుక ఈ విషయమై శతావరి సామర్ధ్యం గురించి ప్రస్తుతం ఏమీ చెప్పలేము.

(మరింత సమాచారం: పురుషుల లైంగిక సమస్యలు మరియు పరిష్కారాలు)

మహిళలకు శతావరి ప్రయోజనాలు - Shatavari benefits for woman in Telugu

మహిళల ఆరోగ్య కోసం ఒక విజేతలాగా పని చేసే మందు అంటే అది శతావరి మాత్రమే. శతావరి సేవనం మహిళల్లో అధిక లైంగిక శక్తిని పెంచడమే కాక వారి గర్భాశయం సమగ్ర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆడవారి శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేయడానికి మరియు మహిళల సంతానోత్పత్తిని శతావరి మెరుగుపరుస్తుంది. శతావరి లోని పోషకాలు స్త్రీల మాతృజీవకణాల (Oocytes) పునరుత్పత్తి నాణ్యతను పెంచుతాయని ఇటీవలి వైద్య అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ మూలిక ఇతర ప్రయోజనాలు కూడా నిజమని ఆ అధ్యయనం పునరుద్ఘాటించింది.  అంతేకాకుండా, శతావరి కారణంగా మహిళల్లో హార్మోన్ల సమతుల్య వ్యవస్థ ఏర్పడడం వల్ల వారికి పొత్తి కడుపులో వచ్చే నొప్పి లేక తిమ్మిరి కూడా తక్కువై నొప్పి లేని ఋతుచక్రం వారి సొంతమవుతుంది.

శతావరి ఏడాదంతా లభ్యమయ్యే మొక్క. (ఈ మొక్క అనేక సంవత్సరాలు జీవించి ఉంటుంది), ఇది ఆలంబనగా ఉండే కలప కాండాల  సహాయంతో 1-2 మీటర్ల ఎత్తుకు ఎగబాకుతుంది. దీని ఆకులు సన్నని మరియు సూది వంటివి మరియు దీని పువ్వులు చిన్నవిగా, తెల్లని రంగులో ఉంటాయి. శతావరి (ఆస్పరాగస్) మొక్క యొక్క వేర్లు దుంపాకారంలో (అంటే tuberous లేదా గడ్డాకారం) ఉంటాయి. శతావరి యొక్క అన్ని ఔషధ ప్రయోజనాలను కలిగిఉండే ప్రధాన భాగమే దీని వేరు, అంటే గడ్డల (కందిల మూలములు) రూపంలో ఉండే శతావరి వేర్లు.   పురాతన వైద్య గ్రంథాలు చెప్పేదేమంటే శతావరిని తాజాగానే సేవించాలని అంటే పచ్చిగానే. గ్రంథాలు ఆవిధంగా తాజాగా సేవించాలని సూచిస్తున్నప్పటికీ,  సాధారణంగా శతావరిని పొడి/చూర్ణం రూపంలోనే తీసుకోవడం జరుగుతోంది. ఇదెందుకంటే పరిపూర్ణ సౌలభ్యం కారణంగానే-పచ్చి శతావరి చేదుగా ఉంటుంది, కనుకనే చూర్ణం సేవించడం జరుగుతోంది. వాణిజ్యపరంగా శతావరి కాప్సూల్స్,  గుళికలు, మరియు (కణికలు) గ్రాన్యూల్స్ రూపంలో లభిస్తుంది. మీ రోజువారీ ఆహారంలో శతావరిని కూడా ఓ భాగంగా చేర్చడానికి ముందు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ నుండి సలహాను పొందండం సముచితం. మోతాదు, మోతాదుల మధ్య వ్యవధి  (పౌనఃపున్యం) ని వైద్యుడిని అడిగి తెలుసుకోండి.

ఇటీవలే జరిపిన అధ్యయనాలు చెబుతున్నదాని ప్రకారం అనేక మాంస-సంబంధమైన ఉత్పత్తుల్నీ ప్యాక్ చేసేందుకు శతావరిని ఖాద్యయుతమైన జీవపొర  (బయోఫిల్మ్)గా తయారు చేయవచ్చని. మాంసాహారాన్ని ప్యాక్ చేయడానికి పనికొచ్చే ఈ శతావరి జీవ పొరలు (biofilms) ప్యాక్ చేసిన ఆహారాన్ని తాజాగా ఉంచడానికి మాత్రమే కాకుండా, సాధారణ పాలీపోర ప్యాక్ లో ఉపయోగించే దుష్ప్రభావాలను కూడా కలిగి ఉండవని, అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇది ఎందుకంటే శతావరి యొక్క అనామ్లకారి, మరియు యాంటిబాక్టీరియల్ లక్షణాల కారణంగానేనని పరిశోధకులు  భావిస్తున్నారు. అంతే కాక, శతావరితో తయారైన బయోఫీల్మ్ లను మాంసాహార పదార్థాలను ప్యాక్ చేయడానికి వాణిజ్యపర సంస్థలు ఉపయోగించినట్లైతే అవి చెడిపోకుండా చాలా కాలం (shelf life) మార్కెట్లో నిల్వ ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు

రోజులో రెండు సార్లు శతావరి చూర్ణాన్ని ఓ టీస్పూన్ మోతాదులో టీ మాదిరిగా సేవించవచ్చు. ఈమేరకు ఆయుర్వేద వైద్యులు సూచించారు. సంతానోత్పత్తి సమస్యలున్నవారు గర్భం దాల్చడానికి కొన్ని నెలల ముందుగానే శతావరి సేవనాన్ని ఓ క్రమపద్ధతిలో మొదలుపెట్టడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇది మీ సంతానోత్పత్తిశక్తిని పెంచడమీ గాక గర్భందాల్చడానికి మీ గర్భాశయం యొక్క పరిస్థితులను మెరుగుపరుస్తుంది. కనుక గర్భం దాల్చేందుకు కొన్ని నెలలు ముందే ఈ మూలికను సేవించడం గర్భధారణకు మరింత అనుకూలంగా ఉంటుంది. ఆడవాళ్లు 2 టీస్పూన్ల శతావరి చూర్ణాన్ని పాలతోబాటు తీసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు సూచించారు. ఇది స్త్రీలలో గర్భధారణకు అనుకూలించడమే గాక వారిలో లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని సూచించారు.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

గర్భధారణ సమయంలో శతావరిని సేవించడం సురక్షితం కాదు, ఎందుకంటే ఇది గర్భస్రావం, జనన లోపాల్ని తదితర దుష్ప్రభావాల్ని కల్గించేదిగా జంతువులపై జరిపిన లాబొరేటరీ అధ్యయనాల మూలంగా తెలిసొచ్చింది.  అయితే, మానవులలో ఈ మూలిక ప్రభావం ఎలా ఉంటుందో గ్రహించడానికి ఇంకా ఎటువంటి పరిశోధన జరగలేదు. కాబట్టి, గర్భిణీ స్త్రీలు శతావరిని సేవించేందుకు ముందుగా వైద్యుడిని తప్పకుండా సంప్రదించితీరాలి. శతావరి కుటుంబానికి చెందిన మూలికలు ఎవరి శరీరానికి పడవో అలాంటివారికి శతావరి కూడా పడకుండా పోవచ్చు, అలెర్జీకారకంగా తయారవచ్చు. ఈ ఔషధ మూలిక యొక్క పరస్పర చర్యల గురించి మనకు తెలియదు. ఒకవేళ మీరు ఇప్పటికే ఏవైనా డాక్టర్ సూచించిన ఔషధాలను తీసుకుంటున్న యెడల, శతావరిని కూడా ఆ మందులతో పాటు సేవించాలని మీరనుకుంటుంటే నిపుణుడైన వైద్యుడ్ని సంప్రదించడం చాలా మంచిది.


Medicines / Products that contain Shatavari

వనరులు

  1. Shashi Alok et al. Plant profile, phytochemistry and pharmacology of Asparagus racemosus (Shatavari): A review. Asian Pac J Trop Dis. 2013 Jun; 3(3): 242–251.
  2. Noor S1, Bhat ZF2, Kumar S1, Mudiyanselage RJ. Preservative effect of Asparagus racemosus: A novel additive for bioactive edible films for improved lipid oxidative stability and storage quality of meat products. Meat Sci. 2018 May;139:207-212. PMID: 29459296
  3. Wiboonpun N1, Phuwapraisirisan P, Tip-pyang S. Identification of antioxidant compound from Asparagus racemosus. Phytother Res. 2004 Sep;18(9):771-3. PMID: 15478181
  4. Krishnamurthy S1, Garabadu D, Reddy NR. Asparagus racemosus modulates the hypothalamic-pituitary-adrenal axis and brain monoaminergic systems in rats.. Nutr Neurosci. 2013 Nov;16(6):255-61. PMID: 23485433
  5. Govindarajan M1, Sivakumar R. Ovicidal, larvicidal and adulticidal properties of Asparagus racemosus (Willd.) (Family: Asparagaceae) root extracts against filariasis (Culex quinquefasciatus), dengue (Aedes aegypti) and malaria (Anopheles stephensi) vector mosquitoes (Diptera: Culicida. Parasitol Res. 2014 Apr;113(4):1435-49. PMID: 24488078
  6. Onlom C1,2, Khanthawong S3, Waranuch N2, Ingkaninan K. In vitro anti-Malassezia activity and potential use in anti-dandruff formulation of Asparagus racemosus.. Int J Cosmet Sci. 2014 Feb;36(1):74-8. PMID: 24117781
  7. Pandey AK et al. Impact of stress on female reproductive health disorders: Possible beneficial effects of shatavari (Asparagus racemosus).. Biomed Pharmacother. 2018 Jul;103:46-49. PMID: 29635127
  8. S. A. Dayani Siriwardene et al. Clinical efficacy of Ayurveda treatment regimen on Subfertility with Poly Cystic Ovarian Syndrome (PCOS). Ayu. 2010 Jan-Mar; 31(1): 24–27. PMID: 22131680
  9. Pandey SK, Sahay A, Pandey RS, Tripathi YB. Effect of Asparagus racemosus rhizome (Shatavari) on mammary gland and genital organs of pregnant rat.. Phytother Res. 2005 Aug;19(8):721-4. PMID: 16177978
  10. Bhatnagar M1, Sisodia SS. Antisecretory and antiulcer activity of Asparagus racemosus Willd. against indomethacin plus phyloric ligation-induced gastric ulcer in rats.. J Herb Pharmacother. 2006;6(1):13-20. PMID: 17135157
  11. Kaur P et al. Immunopotentiating significance of conventionally used plant adaptogens as modulators in biochemical and molecular signalling pathways in cell mediated processes.. Biomed Pharmacother. 2017 Nov;95:1815-1829. PMID: 28968926
  12. Gautam M et al. Immunomodulatory activity of Asparagus racemosus on systemic Th1/Th2 immunity: implications for immunoadjuvant potential. J Ethnopharmacol. 2009 Jan 21;121(2):241-7. PMID: 19038322
  13. Tiwari N et al. Adjuvant effect of Asparagus racemosus Willd. derived saponins in antibody production, allergic response and pro-inflammatory cytokine modulation.. Biomed Pharmacother. 2017 Feb;86:555-561. PMID: 28024292
Read on app