యోని ప్రాంతంలోని సంభవించే నొప్పి, అంటే, మూత్రమార్గము క్రింద ఋతుక్రమ రక్త స్రావం బయటకు వచ్చే స్థానంలో సంభవించే నొప్పిని యోని నొప్పి అని పిలుస్తారు. ఇది గర్భాశయంలోని ఫైబ్రాయిడ్లు (నిరపాయమైన కణితులు) లేదా యోని అంటువ్యాధి లేదా వాపు వంటి తీవ్రమైన కారణాల యొక్క లక్షణం కావచ్చు లేదా కొంతమంది మహిళల్లో లైంగిక సంభోగం వంటి చిన్న కారణాల వల్ల కూడా సంభవించవచ్చు.

తరచుగా, ప్రత్యేకించి యువతులలో, యోని నొప్పి ఋతు చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. ఋతుక్రమ సమయంలో నొప్పి లేదా డిస్మెనోరియా ఋతుచక్రాలు సంభవించే దాదాపు సగంమంది కంటే ఎక్కువ స్త్రీలలో ఉంటుంది. ఈ నొప్పి ఋతుచక్ర ప్రారంభంలో 1 నుండి 2 రోజులు ఉంటుంది. యోని నొప్పి తరచుగా మహిళల్లో వల్వార్ నొప్పితో ముడిపడి ఉంటుంది. యోనిలింగము, యోని మరియు లాబియా మినోరా (అంతరోష్ఠాలు) మరియు లాబియా మజోరా (యోని వెలుపలి బాహ్య ఓష్ఠాలు కండరపు ముడుతలు)తో సహా మొత్తం స్త్రీ యొక్క జననేంద్రియాల భాగాలను వల్వా సూచిస్తుంది.

ఈ వ్యాసం యోని నొప్పి యొక్క రకాలు, లక్షణాలు, కారణాలు మరియు నిర్దారణ పద్ధతులతో పాటు దాని చికిత్స మరియు రోగసూచన గురించి చర్చిస్తుంది.

  1. యోని నొప్పి యొక్క లక్షణాలు - Symptoms of vaginal pain in Telugu
  2. యోని నొప్పి కారణాలు - Vulvar pain causes in Telugu
  3. యోని నొప్పి నివారణ - Prevention of vaginal pain in Telugu
  4. యోని నొప్పి నిర్ధారణ - Diagnosis of vaginal pain in Telugu
  5. యోని నొప్పి చికిత్స - Treatment of vaginal pain in Telugu
  6. యోని నొప్పి రకాలు - Types of vaginal pain in Telugu
  7. రోగ సూచన మరియు సమస్యలు - Prognosis and complications in Telugu

ఋతుక్రమ సమయంలో యోని నొప్పి

  • తీవ్రమైన, పట్టినట్టు ఉండే యోని నొప్పి
  • ఈ నొప్పి నిరంతరంగా సంభవిస్తుంది లేదా అప్పుడప్పుడు తిమ్మిరివాలే సంభవించవచ్చు
  • పొత్తి కడుపులో నొప్పి, ఇది నడుము లేదా కాళ్ళ నొప్పిని సూచిస్తుంది
  • ఈ నొప్పి ఋతుస్రావ ప్రారంభంలో మొదలవుతుంది
  • మొదటి 24 గంటలు లేదా ఋతుస్రావం మొదటి రోజులో ఇది చాలా తీవ్రంగా ఉంటుంది
  • ఋతుస్రావ రక్తంలో గడ్డలు ఉండడం
  • వికారం, వాంతులు, ఉబ్బరం, అతిసారం మరియు వేరే జీర్ణ సమస్యలు వంటి ఇతర లక్షణాలు తరచుగా ఏర్పడతాయి.

ఋతుక్రమ సమయానికి ముందు వచ్చే నొప్పి

ఋతు చక్రం ప్రారంభానికి ముందు సంభవించే యోని నొప్పికి ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ కారణం కావచ్చు. దీనిలో ఈ క్రింది లక్షణాలు ఉండవచ్చు:

శృంగార సమయంలో యోని నొప్పి

  • పురుషాంగం ప్రవేశించేటప్పుడు ఒక పదునైన యోని నొప్పి కలుగుతుంది, ఇది తరువాత కూడా చాలా సమయం వరకు ఉంటుంది
  • ఇది సెక్స్ ముగిసిన తర్వాత కూడా ఉంటుంది
  • ఇది లైంగిక సంభోగం యొక్క మొత్తం సమయమంతా ఉండవచ్చు లేదా నిర్దిష్ట ప్రేరేపకాల వలన కూడా తలెత్తవచ్చు
  • గర్భాశయద్వారం వద్ద తీవ్రమైన సలిపే నొప్పి
  • లోతైన మరియు విపరీతమైన నొప్పి, ఇది యోనిలో మంట అనుభూతిని కలిగిస్తుంది
  • కండరాల తిమ్మిర్లు
    (మరింత చదవండి: కండరాల తిమ్మిరి చికిత్స)
  • పొత్తికడుపు తిమ్మిరి
  • కటిభాగపు నొప్పి
  • కటి కండరాలు బిగుసుకుపోవడం
  • యోని పొడిబారడం

గర్భధారణ సమయంలో యోని నొప్పి

  • ఘాడమైన మరియు పదునైన యోని నొప్పి
  • మంట అనుభూతి
  • సంక్రమణతో సంబంధం కలిగి ఉంటే దురద, వెన్నునొప్పి మరియు యోని నుండి స్రావాలు కారడం
  • ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో సంబంధం ఉన్నప్పుడు పదునైన నొప్పి మరియు పచ్చి పుండులా అనిపించే రొమ్ములు
  • వికారం, వాంతులు మరియు అలసట వంటి గర్భధారణ యొక్క సాధారణ లక్షణాలు అనుభవించబడతాయి.

ఎండోమెట్రియోసిస్ కారణంగా యోని నొప్పి

  • ఋతుస్రావ సమయంలో లేదా లైంగిక సంభోగ సమయంలో లేదా తరువాత తీవ్రమైన నొప్పి మరియు పొత్తి కడుపు తిమ్మిరి
  • ఇది నడుము లేదా కాళ్ళకు వ్యాపించవచ్చు
  • (మరింత చదవండి: కాళ్ల నొప్పి చికిత్స)
  • వికారం, వాంతులు, విరేచనాలు మరియు తీవ్రమైన తిమ్మిర్లు
  • బాధాకరమైన మూత్రవిసర్జన
  • మలవిసర్జనలో  సమస్య
  • సంతానోత్పత్తి సమస్యలు

ఫైబ్రాయిడ్ల వల్ల యోని నొప్పి

  • భారీ ఋతుస్రావం
  • దీర్ఘకాలిక ఋతు చక్రం
  • లైంగిక సంభోగ సమయంలో నొప్పి
  • కటి నొప్పి (కటి ప్రాంతంలో నొప్పి)
  • నడుము నొప్పి
  • తరచుగా మూత్ర విసర్జన
  • గట్టి గడ్డ ఉన్న ఉనికి
    (మరింత చదవండి: క్యాన్సర్ లక్షణాలు)

పెల్విక్ ఇన్ఫలమేటరీ వ్యాధి కారణంగా సంభవించే యోని నొప్పి

పెల్విక్ ఇన్ఫలమేటరీ వ్యాధి స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో వాపును కలిగిస్తుంది మరియు ఇది లైంగికంగా సంక్రమించే అంటువ్యాధి వలన సంభవిస్తుంది.

(మరింత చదవండి: ఎయిడ్స్ లక్షణాలు)

దాని లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • యోని నొప్పి, ముఖ్యంగా సెక్స్ సమయంలో
  • దీర్ఘకాలిక కటిభాగపు నొప్పి
  • వాసనతో  కూడిన తెల్లటి యోని స్రావం
  • యోని యొక్క మంట, ఎరుపుదనం మరియు వాపు
  • పొత్తి కడుపు నొప్పి
  • జ్వరం
  • క్రమరహిత ఋతు చక్రాలు
  • బాధాకరమైన మూత్రవిసర్జన

అడెనోమైయోసిస్ కారణంగా యోని నొప్పి

అడెనోమైయోసిస్ అంటే ఎండోమెట్రియల్ కణజాలం గర్భాశయం యొక్క బయటి పొరకు జరుగుతుంది. దీని లక్షణాలు:

  • సంభోగ సమయంలో తేలికపాటి యోని నొప్పి
  • భారీ మరియు బాధాకరమైన ఋతు రక్తస్రావం
  • ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ కారణంగా యోని నొప్పి
  • కటి నొప్పి
  • అసాధారణ యోని రక్తస్రావం
  • ఉదరంలో తీవ్రమైన, పదునైన మరియు ఆకస్మిక నొప్పి
  • భుజం ప్రాంతంలో నొప్పి
  • అలసట లేదా కళ్ళు తిరిగిన భావన

గెస్టేషనల్ ట్రోఫోబ్లాస్టిక్ వ్యాధి కారణంగా యోని నొప్పి

ఈ పరిస్థితిలో, గర్భాశయం లోపల అసాధారణ ట్రోఫోబ్లాస్ట్ కణాలు పెరుగుతాయి, దీనిలో ఈ క్రింది లక్షణాలు ఉండవచ్చు:

  • కటి భాగంలో నొప్పి లేదా ఒత్తిడి
  • గర్భాశయం యొక్క పెద్ద పరిమాణం
  • ప్రసవం తరువాత కూడా కొనసాగే అసాధారణ యోని రక్తస్రావం
  • అలసట మరియు శ్వాస అందకపోవడం
  • అధిక రక్తపోటు
Women Health Supplements
₹719  ₹799  10% OFF
BUY NOW

యోని నొప్పి అనేది ఒక వ్యాధి అని కాకుండా ఒక ఆంతర్లీన వ్యాధి యొక్క లక్షణం అని ఈపాటికి మీరు అర్థం చేసుకుని ఉంటారు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు, అవి క్రింద ఇవ్వబడ్డాయి:

  • భారీ ఋతు రక్తస్రావం
  • డిస్మెనోరోయా యొక్క కుటుంబ చరిత్ర
  • యోని పొడిదనం
  • రబ్బరు (లేటెక్స్), స్పెర్మిసైడ్, కండోమ్‌లకు అలెర్జీ
  • దుస్తులకు అలెర్జీ ఉండడం
  • ముందుగా (చిన్న వయసులో) ఋతుచక్రం ప్రారంభం కావడం
  • క్రమరహిత ఋతు చక్రం
  • ధూమపానం
  • ప్రీ మెన్స్ట్రుల్ సిండ్రోమ్
  • యోని ప్రాంతపు వాపు లేదా వల్వార్ వెస్టిబ్యూలైటిస్
  • అడెనోమాయోసిస్
  • ఎండోమెట్రీయాసిస్
  • ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ
  • గెస్టేషనల్ ట్రోఫోబ్లాస్టిక్ వ్యాధి
  • ఆలస్యంగా గర్భం దాల్చడం
  • సెక్స్ సమయంలో మానసిక నొప్పి (Psychological pain)
  • ఫంగల్ ఇన్ఫెక్షన్
  • లైంగికంగా వ్యాపించిన సంక్రమణలు
  • యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్
  • మూత్ర మార్గ సంక్రమణ (యుటిఐ)
  • గర్భనిరోధకం కోసం గర్భాశయం లోపల పరికరాల (intrauterine devices) వాడకం
  • లైంగిక వేధింపుల
  • ఋతుక్రమం ఆగిపోయిన మహిళల్లో అట్రోఫిక్ వాజనైటిస్
  • లైకెన్ ప్లానస్ ఇన్ఫెక్షన్
  • కొన్ని మందుల దుష్ప్రభావాలు

యోని నొప్పి అనేక కారణాల వల్ల సంభవిస్తుంది కాబట్టి, దాని నివారణ అనేక రకాలుగా ఉంటుంది. ఋతుస్రావం సమయంలో సంభవించే యోని నొప్పికి కుటుంబ చరిత్ర కలిగి ఉంటే దానిని అనుభవించడం తప్పనిసరి. అయితే, క్రమాహిత ఋతుస్రావం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (పిసిఒఎస్) వంటి అంతర్లీన రుగ్మతతో ముడిపడి ఉంటే, దానికి  చికిత్స ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం మరియు బరువును నిర్వహించడం వంటివి పిసిఓడి ని నిర్వహణలో సహాయపడతాయి. అయితే, ముందుగా  గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.

లైంగిక సంభోగ సమయంలో యోని నొప్పిని లూబ్రికెంట్ ఉపయోగించడం ద్వారా నివారించవచ్చు, ఇది యోని పొడిదానాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. సెక్స్ సమయంలో పురుషాంగాన్ని లోతుగా ప్రెవేశపెట్టడాన్ని నివారించడం కూడా సహాయపడుతుంది. లేటెక్స్ రహిత కండోమ్‌ల వాడకం అలెర్జీక్ గా ఉన్నవారిలో నొప్పిని నివారించడానికి కూడా సహాయపడుతుంది. సెక్స్ సమయంలో కండోమ్ ఉపయోగం లైంగిక సంక్రమణ వ్యాధులు మరియు వాటివలన వచ్చే యోని నొప్పి నివారించడానికి సహాయం చేస్తుంది. వల్వర్ సంక్రమణను నివారించే ఇతర మార్గాలు:

  • అంతర్గత ప్రాంతం యొక్క సరైన పరిశుభ్రతను పాటించడం
  • వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో బ్యాక్టీరియా పెరుగుదల సంభవిస్తుంది కాబట్టి బిగుతుగా ఉండే సింథటిక్ దుస్తులు ధరించడం మానివేయాలి (ఇది బట్టల వలన కలిగే అలెర్జీని నివారించడంలో కూడా సహాయపడుతుంది)
  • యుటిఐని నివారించడానికి తగినంత నీరు త్రాగాలి
  • యోని మీద క్లేన్సార్లు (శుభ్రపరచడానికి ఉపయోగించేవి) మరియు ఇతర సువాసన వలన రసాయన ఉత్పత్తుల వాడకాన్ని నివారించాలి
  • అధికంగా యోనిని కడగడం మానుకోవాలి, ఎందుకంటే ఇది మంచి బ్యాక్టీరియాను కడిగివేస్తుంది
  • ప్రతి రోజు లోదుస్తులను మార్చడం

గర్భాశయంలోకి చేర్చబడే గర్భ నిరోధక పరికరాల వాడకాన్ని నివారించడం కూడా యోని నొప్పి నివారించడంలో సహాయపడుతుంది.

గర్భధారణ సమయంలో, ధూమపానం ఆపివేయడం ద్వారా యోని నొప్పిని నివారించవచ్చు, ఇది ఎక్టోపిక్ ప్రెగ్నన్సీల ప్రమాదాన్ని పెంచుతుంది. యోని అంటురోగాలను నివారించడానికి ఆరోగ్యం మరియు పరిశుభ్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

(మరింత చదవండి: యోని రక్తస్రావం చికిత్స)

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Prajnas Fertility Booster by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors for lakhs of male and female infertility problems with good results.
Fertility Booster
₹899  ₹999  10% OFF
BUY NOW

లక్షణాలు మరియు రోగనిర్ధారణ పరీక్షల ఆధారంగా వైద్యులు పైన చర్చించిన పరిస్థితుల యొక్క సంభావ్యతను గుర్తిస్తారు. రోగ నిర్ధారణ యొక్క వివిధ పద్ధతులు:

  • ఆరోగ్య చరిత్ర: యోని సంక్రమణ లేదా పిసిఒడి వంటి యోని నొప్పికి కారణమయ్యే అంతర్లీన కారకాల గురించి తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
  • కుటుంబ చరిత్ర: డిస్మెనోరియా యొక్క కుటుంబ చరిత్రను గురించి తెలుసుకోవడానికి
  • మందుల చరిత్ర: యాంటిహిస్టామైన్ వంటి కొన్ని మందులు మహిళల్లో, ముఖ్యంగా సెక్స్ సమయంలో యోని నొప్పిని కలిగిస్తాయి
  • శారీరక పరీక్ష: ఇది యోని ప్రాంతం యొక్క ఇన్ఫెక్షన్లు లేదా వాపును  నిర్ధారించడానికి సహాయపడుతుంది
  • మూత్ర పరీక్ష: మూత్రంలో రక్తం, ప్రోటీన్ మొదలైన వాటి ఉనికిని గుర్తించడం కోసం.
  • కటి ప్రాంతం యొక్క అల్ట్రాసౌండ్: నొప్పిని కలిగించే అంతర్లీన రుగ్మతను నిర్ధారించడానికి మరియు ధృవీకరించడానికి.

(మరింత చదవండి: గర్భ నిర్దారణ పరీక్ష)

  • ఋతుస్రావ సమయంలో కలిగే తేలికపాటి యోని నొప్పికి , పొత్తికడుపు మర్దన మరియు వేడి నీటి కాపడం ద్వారా మరియు వాటితో పాటు సూచించినటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జేసిక్ మందుల వాడకంతో నిర్వహించవచ్చు. ప్రీ మెన్‌స్ట్రువల్  సిండ్రోమ్‌ లో కలిగే ఆందోళన మరియు మూడ్ స్వింగ్స్ ను నివారించడానికి, తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు ధ్యానం చేయడం వంటివి చేయవచ్చు. యాంటీ-యాంగ్జైటీ మందులు కూడా సహాయపడవచ్చు.
  • ఈస్ట్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా యోని నొప్పి కలుగుతున్నట్లయితే, యాంటీ ఫంగల్ మందులు సూచించబడతాయి. ఇతర యోని ఇన్ఫెక్షన్లు లేదా వాపు నిర్వహణ కోసం స్టెరాయిడ్ క్రీములు మరియు ఇతర సమయోచిత ఏజెంట్లను ఉపయోగించవచ్చు.
  • యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే యోని నొప్పి చికిత్సలో యాంటీబయాటిక్స్ ఉపయోగం ఉంటుంది.
  • లైంగిక సంభోగం తర్వాత కలిగే నొప్పిని వెచ్చని నీటి స్నానం మరియు నొప్పి నివారణ మందుల వాడకంలో పరిష్కరించవచ్చు.
  • అట్రోఫిక్ వజనైటిస్ నిర్వహణ కోసం, మహిళలకు ఓరల్ లేదా యోని ఈస్ట్రోజెన్ సూచించబడుతుంది.
  • శృంగార సమయంలో తెలియని కారణాల వలన యోని నొప్పి కలుగుతున్న సందర్భంలో, కారణాన్ని గుర్తించడానికి మరియు నయం చేయడానికి మానసికవైద్య (psychological) సహాయం కోరడం మంచిది.
  • గర్భధారణ సమయంలో యోని నొప్పి చికిత్సకు కాళ్ళు మరియు కటి ప్రాంతాన్ని స్వల్పంగా పైకి ఎత్తడం, కటిభాగపు మర్దన మరియు వేడినీటి కాపడం పెట్టడం వంటివి చేయవచ్చు. సపోర్ట్ బెల్టులను కూడా ధరించవచ్చు కాని దానికి ముందు గైనకాలజిస్ట్ను సంప్రదించడం తప్పనిసరి. ప్రసవానంతర యోని నొప్పి నిర్వహణకు సమయోచితంగా పూసే మత్తుమందులు (anaesthetics) సహాయపడతాయి.
  • ఇవి కాకుండా, ఫైబ్రాయిడ్ల విషయంలో మందుల చికిత్స లేదా శస్త్రచికిత్స తొలగింపు వంటివి నిర్దిష్ట చికిత్సా చర్యలుగా అవసరమవుతాయి. తెలిసిన లేదా తెలియని కారణాల వల్ల తీవ్రమైన యోని నొప్పి ఎదురైతే  తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలని ఎల్లపుడూ సిఫార్సు చేయబడుతుంది.

దాని సంభావ్యత ఆధారంగా యోని నొప్పి 3 రకాలుగా విభజించబడింది. ఆ రకాలు మరియు లక్షణాలు  ఈ విభాగంలో చర్చించబడ్డాయి.

ఋతుక్రమ సమయంలో వచ్చే యోని నొప్పి - Vulvar pain during periods in Telugu

ప్రతి 28 రోజులకొకసారి యోని నుండి రక్త స్రావం జరగడాన్ని ఋతుక్రమం లేదా ఋతుచక్రం అని అంటారు. కొంత మంది స్త్రీలు ఋతుక్రమ సమయంలో నొప్పిని అనుభవిస్తారు, ఇది ఒక సహజ పరిణామంగా  భావింపబడుతుంది. అయితే తీవ్ర నొప్పికి అంతర్లీన కారణం ఉండవచ్చు.

మహిళల్లో భారీ రక్తస్రావం జరిగినపుడు, గర్భాశయ పోర చీలి అధికంగా రక్తం పోవడం వలన సాధారణంగా యోని నొప్పి సంభవిస్తుంది. చిన్న వయసులో (11 సంవత్సరాల లోపు) రజస్వల ఐన స్త్రీలు మరియు ఇంకా బిడ్డకు జన్మనివ్వని వారు అధిక యోని నొప్పిని అనుభవిస్తారు. సాధారణంగా బాధాకరమైన ఋతుచక్రాలు కలిగిన కుటుంబ చరిత్ర కలిగిన స్త్రీలు కూడా  వారు రజస్వల ఐన తోలి రోజులలో మరియు వారి యుక్త వయసులో నొప్పిని అనుభవిస్తారు, అది 20 సంవత్సరాల వయసు తర్వాత తగ్గిపోతుంది.

ఋతుచక్రాల సమయంలో గర్భాశయ పోర తొలగడానికి గర్భాశయ సంకోచాలు (uterine contractions) ముడి పడి ఉన్నప్పుడు, యోని లేదా వల్వర్ నొప్పి ప్రాధమికంగా లేదా ద్వితీయంగా ఉండవచ్చు. నొప్పి కేవలం ఈ సంకోచాలు కారణంగా అయితే అది ప్రాధమికంగా పరిగణించబడుతుంది, మరియు వేరే అదనపు కారకాలు కూడా కారణమైతే దానిని ద్వితీయమైనది (secondary) అని పిలుస్తారు. ఒకవేళ నొప్పి ద్వితీయమైనది అయితే అది ఆందోళన కలిగించే విషయం మరియు అది గర్భాశయంలోని నిరపాయమైన పెరుగుదలలు (benign growths), అంటే ఫైబ్రాయిడ్లు లేదా పాలిప్స్ వంటి కారణాల వల్ల సంభవించవచ్చు. గర్భనిరోధకం (జనన నియంత్రణ) కొరకు గర్భాశయంలో గర్భనిరోధక పరికరాలను అమర్చడం వలన కూడా తరచుగా ఋతుస్రావ సమయంలో యోని నొప్పి సంభవిస్తుంది.

Ashokarishta
₹360  ₹400  10% OFF
BUY NOW

లైంగిక సంభోగ సమయంలో యోని నొప్పి - Vaginal pain during sexual intercourse in Telugu

కొంతమంది మహిళలు లైంగిక సంభోగ సమయంలో లేదా తరువాత నొప్పిని అనుభవించవచ్చు, దీనిని డిస్స్పరేనియా (dyspareunia) అంటారు. ఈ నొప్పి యోనిలో, యోనిలింగము లేదా లాబియాలో సంభవించవచ్చు మరియు నొప్పి యొక్క రకం మరియు తీవ్రతలో తేడా ఉండవచ్చు. ఇది తరచుగా యోని పొడిదనం (పదునైన సలిపే నొప్పికి కారణమవుతుంది) తో సంబంధం కలిగి ఉంటుంది లేదా కండోమ్స్ యొక్క లేటెక్స్ కు లేదా స్పెర్మిసైడ్లకు అలెర్జీ ప్రతిచర్య వలన కావచ్చు. గతంలో లైంగిక వేధింపుల చరిత్ర లేదా లైంగిక సంభోగం అంటే భయం కూడా  ఈ నొప్పిని అధికం చేస్తుంది. ఈ రకమైన యోని నొప్పి యోని పొర పలుచబడడం లేదా క్షీణించడం వంటి కారణాల వల్ల పెద్ద వయసు మహిళలలో ఎక్కువగా కనిపిస్తుంది. లైంగిక సంభోగ సమయంలో నొప్పికి కారణమయ్యే మరింత తీవ్రమైన కారణాలు యోని యొక్క వాపు లేదా సంక్రమణ, ముఖ్యంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా కొన్ని లైంగిక సంక్రమణ వ్యాధులు (STD లు) కావచ్చు.

(మరింత చదవండి: యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ కోసం గృహ చిట్కాలు)

నోప్పి ఋతుస్రావంతో కూడా ముడిపడి ఉండడం వలన, ఈ రకమైన వల్వర్ నొప్పి కూడా ప్రాధమిక మరియు ద్వితీయ రకాలుగా విభజించబడింది, దీనిలో ప్రాధమిక నొప్పి స్త్రీ యొక్క మొత్తం లైంగిక జీవితకాలమంతా ఉంటుంది మరియు ద్వితీయ నొప్పి లైంగిక జీవితం మొదలైన కొంత కాలం తర్వాత ప్రారంభమవుతుంది.

డిస్స్పరేనియా ఎండోమెట్రియోసిస్ యొక్క సాధారణ లక్షణం కూడా, ఎండోమెట్రియోసిస్ అంటే గర్భాశయంలో కాకుండా ఇతర ప్రాంతాలలో ఎండోమెట్రియల్ కణజాలం (గర్భాశయం కణజాలం కణజాలం) పెరగడం. ఇది లైంగిక సంభోగం మరియు ఋతుస్రావ సమయంలో వల్వాలో తీవ్ర నొప్పిని కలిగిస్తుంది మరియు ఇది సంతానోత్పత్తి సమస్యలకు కారణం కావచ్చు. మహిళల్లో ఈ పరిస్థితి తరచుగా గుర్తించబడకుండా ఉండిపోతుంది, అయితే ఇది ఒక ఆందోళనకరమైన విషయం.

(మరింత చదవండి: సంతానలేమికి చికిత్స)

గర్భధారణ సమయంలో యోని నొప్పి - Vaginal pain during pregnancy in Telugu

ప్రతి స్త్రీ జీవితంలో గర్భధారణ సహజంగానే ఒక క్లిష్టమైన దశగా ఉంటుంది, ఇక్కడ ఆమె ఆరోగ్యం అనేక హార్మోన్ల మార్పుల కారణంగా ఒకటి కంటే ఎక్కువ విధాలుగా ప్రభావితమవుతుంది. ఈ సమయంలో యోని లేదా వల్వార్ నొప్పి అనేది ఆందోళనకరమైన విషయంగా చెప్పవచ్చు, ఇది అధికమైన కటిభాగపు ఒత్తిడికి యొక్క దుష్ప్రభావం అని చెప్పవచ్చు. అయితే, తేలికపాటి యోని నొప్పి గర్భధారణ సమయంలో సాధారణమైనదిగా పరిగణించబడుతుంది.

గర్భధారణ యొక్క చివరి దశల్లో అధిక గర్భాశయ సంకోచాల కారణంగా యోని నొప్పి చాలా సాధారణముగా మరియు తీవ్రంగా ఉంటుందని గుర్తించబడింది. రిలాక్సిన్ (హార్మోన్) విడుదల గర్భధారణ సమయంలో కటి భాగపు లిగమెంట్లు వదులుగా అవుతాయి, ఇది శిశివు కదలికలను సులభం చేస్తుంది.

కానీ, శిశువు యొక్క అధిక కదలికలు ఈ కండరాలను బలహీనం చేసి మరియు కండరాల సాగతీతకు కారణమవుతాయి ఇది కటి భాగపు ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఇది గర్భధారణ దశ చివరలో సెర్విక్స్ యొక్క విస్తరణ వల్ల కావచ్చు, ఇది ప్రసవానికి సహాయపడే ఒక శారీరక (సాధారణ పనితీరుకు సంబంధించినది) ప్రక్రియ. అరుదుగా, ఇది అంటువ్యాధులు లేదా ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ లేదా గెస్టేషనల్  ట్రోఫోబ్లాస్టిక్ వ్యాధితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ పరిస్థితులు తర్వాత వివరంగా చర్చించబడతాయి.

(మరింత చదవండి: గర్భం దాల్చడం ఎలా)

యోని నొప్పి సాధారణంగా తీవ్రమైన కారణాలతో ముడిపడి ఉండదు మరియు ఎక్కువగా స్వీయ పరిమితి కలిగి ఉంటుంది (దానికదే తగ్గిపోతుంది). అరుదుగా, ఇది యోని ఫైబ్రాయిడ్లు లేదా ఎండోమెట్రియోసిస్‌కు సంబంధించి కలుగవచ్చు, ఇది స్త్రీలో ఫలదీకరణం (fertilisation) మరియు గర్భధారణ ప్రక్రియలో ఇబ్బందులను కలిగిస్తుంది. ఒక ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ విషయంలో, గర్భస్రావం ఎక్కువగా జరుగుతుంది.

యోని నొప్పి కారణంగా మరణ ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, యోని నొప్పి ఉన్నంత వరకు మహిళ యొక్క లైంగిక జీవితపు నాణ్యత ప్రభావితం అవుతుంది.

వనరులు

  1. American College of Obstetricians and Gynecologists [Internet] Washington, DC; Dysmenorrhea: Painful Periods
  2. American Pregnancy Association. [Internet]; Stages Of Childbirth: Stage I.
  3. InformedHealth.org [Internet]. Cologne, Germany: Institute for Quality and Efficiency in Health Care (IQWiG); 2006-. Period pain: Overview. 2008 Feb 22 [Updated 2016 Jul 1].
  4. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Menstruation - pain (dysmenorrhoea)
  5. InformedHealth.org [Internet]. Cologne, Germany: Institute for Quality and Efficiency in Health Care (IQWiG); 2006-. Diary: Premenstrual syndrome (PMS). 2017 Jun 14.
  6. InformedHealth.org [Internet]. Cologne, Germany: Institute for Quality and Efficiency in Health Care (IQWiG); 2006-. Endometriosis: Overview. 2008 Feb 25 [Updated 2017 Oct 19].
  7. UCLA Health. What are Fibroids. California, United States [Internet]
  8. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Pelvic inflammatory disease.
  9. National Center for Advancing and Translational Sciences. Adenomyosis. Genetic and Rare Diseases Information Center
  10. Government of Western Australia. Ectopic pregnancy. Department of Health
  11. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Ectopic pregnancy
  12. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Gestational Trophoblastic Disease Treatment
  13. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Vaginal infections.
  14. F. A. Taran, E. A. Stewart, S. Brucker. Adenomyosis: Epidemiology, Risk Factors, Clinical Phenotype and Surgical and Interventional Alternatives to Hysterectomy. Geburtshilfe Frauenheilkd. 2013 Sep; 73(9): 924–931. PMID: 24771944
  15. Quality-assessed Reviews [Internet]. York (UK): Centre for Reviews and Dissemination (UK); 1995-. Dyspareunia and quality of sex life after surgical excision of endometriosis: a systematic review.
Read on app