శ్వాసకోశ సిన్సిషియల్ వైరస్ ఇన్ఫెక్షన్ - Respiratory Syncytial Virus (RSV) Infection in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 05, 2019

March 06, 2020

శ్వాసకోశ సిన్సిషియల్ వైరస్ ఇన్ఫెక్షన్
శ్వాసకోశ సిన్సిషియల్ వైరస్ ఇన్ఫెక్షన్

శ్వాసకోశ సిన్సిషియల్ వైరస్ (RSV) సంక్రమణ అంటే ఏమిటి?

శ్వాసకోశ సిన్సిషియల్ వైరస్ శ్వాసకోశ సిన్సిషియల్ వైరస్ ఇన్ఫెక్షన్ ఒక సాధారణ మరియు అత్యంత తీవ్రమైన అంటువ్యాధి. ఈ సంక్రమణం సాధారణంగా 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులలో కనిపిస్తుంది. ఇది సాధారణ జలుబు వలె ఓ తేలికపాటి సంక్రమణం కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో పరిస్థితి ప్రాణాంతకంగా మారవచ్చు. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు లేదా నెలలు నిండగానే  పుట్టిన శిశువులు శ్వాసకోశ సిన్సిషియల్ వైరస్ ఇన్ఫెక్షన్ కు ఎక్కువగ గురయ్యే ప్రమాదం ఉంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

శ్వాసకోశ సిన్సిషియల్ వైరస్ యొక్క విలక్షణ సంకేతాలు జలుబు రుగ్మతకుండే సంకేతాలే ఉంటాయి, కానీ శిశువు ఇంకా కింది లక్షణాల్ని కూడా అనుభవించవచ్చు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

నోరు, కళ్ళు లేదా చెవులు ద్వారా ఈ వ్యాధికారక వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. పిల్లలు ఈ వ్యాధిసోకిన వ్యక్తిచే నిర్వహించబడే ఒక వస్తువును తాకడం వంటి పరోక్ష సంబంధాల ద్వారా లేదా సంక్రమణ ఉన్న వ్యక్తితో నేరుగా సంపర్కం కలగడం ద్వారా వ్యాధికి గురవుతారు. వైరస్ వ్యాధి సోకిన పిల్లల శరీరంలో వారాలపాటు ఉండవచ్చు, మరియు అది మొదటి కొన్ని రోజుల్లో చాలా తీవ్రమైన అంటుకునే స్వభావాన్ని కల్గిఉంటుంది.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

సాధారణ భౌతిక పరీక్ష నిర్వహించడం మరియు శ్వాస సమస్యలను తనిఖీ చేయడం ద్వారా శ్వాసకోశ సిన్సిషియల్ వైరస్ సంక్రమణ సాధారణంగా నిర్ధారణ అవుతుంది. తదుపరి పరిశోధనల్లో రక్త పరీక్షలు, ఛాతీ X- కిరణాలు లేదా నాసికా స్రావాల పరీక్షలు కలిగి ఉండవచ్చు

.ఆసుపత్రిలో చేర్చుకోవాల్సిన శిశువులకు సంబంధించిన కొన్ని తీవ్రమైన కేసులను మినహాయించి, శ్వాసకోశ సిన్సిషియల్ వైరస్ (RSV) అంటువ్యాధుల చికిత్సను ఎక్కువగా ఇంటివద్దనే నిర్వహించబడుతుంది. జ్వరం మందులు, ముక్కులో శ్వాసనాళాల్నిఅవరోధరహితం (క్లియర్) చేయడానికి డ్రాప్స్ మందు మరియు యాంటీబయాటిక్స్ ను సాధారణంగా చికిత్సకు సూచిస్తారు. ఇంట్లో, గాలిలో తేమను నింపే హ్యూమిడిఫైర్ ఉపయోగిస్తే అది శిశువుకుఏంతో సహాయకారిగా ఉంటుంది, శిశువు దేహంలో నీరు తగ్గకుండా ఉండేందుకిది దోహదపడుతుంది.క్రమమైన చిన్న చిన్న విరామాలలో శిశువుకు ఆహారం తినిపించాలి. శిశువు ఆసుపత్రిలో ఉన్నట్లయితే, బిడ్డ త్వరగా కోలుకోవటానికి సహాయంగా వైద్యులు IV ద్రవాల్ని  మరియు ఆక్సిజన్లను ఉపయోగించవచ్చు.



వనరులు

  1. National Institute of Allergy and Infectious Diseases [Internet]. U.S. Department of Health and Human Services; Diseases & Conditions.
  2. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Respiratory Syncytial Virus Infection (RSV).
  3. Schweitzer JW, Justice NA. Respiratory Syncytial Virus Infection (RSV). [Updated 2018 Oct 27]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
  4. National Institutes of Health; [Internet]. U.S. National Library of Medicine. The Long-term Effect of RSV Infection.
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Respiratory syncytial virus (RSV).

శ్వాసకోశ సిన్సిషియల్ వైరస్ ఇన్ఫెక్షన్ వైద్యులు

Dr Viresh Mariholannanavar Dr Viresh Mariholannanavar Pulmonology
2 Years of Experience
Dr Shubham Mishra Dr Shubham Mishra Pulmonology
1 Years of Experience
Dr. Deepak Kumar Dr. Deepak Kumar Pulmonology
10 Years of Experience
Dr. Sandeep Katiyar Dr. Sandeep Katiyar Pulmonology
13 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు