బోట్యులిజం - Botulism in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

November 28, 2018

October 29, 2020

బోట్యులిజం
బోట్యులిజం

బోట్యులిజం(Botulism) అంటే ఏమిటి?

ఆహారం విషతుల్యం అవడం (Botulism) అంటే ఇదో జబ్బు, ఇది “బోటులినుం” అనే శరీరజన్య విషం (టాక్సిన్) వల్ల మనకు దాపురించే జబ్బు. “క్లోస్ట్రీడియం బోటులినుం” అనే బాక్టీరియా వల్ల ఈ జబ్బు ఉత్పత్తి అవుతుంది. క్లోస్ట్రీడియం బోటులినుం అనే సూక్ష్మ క్రిమి నేలనుండి పుట్టే క్రిమి. ఇది సర్వవ్యాపి మరియు దీన్ని చంపడం సాధ్యం కాదు. ప్రాయావాయువు లేనిచోటనే  ఎక్కువగా వృద్ధిచెందే ఈ క్రిమికి డబ్బాల్లో భద్రపరిచిన ఆహారాలు మంచి స్థావరం. కనుక ఈ బ్యాక్టీరియా డబ్బాల్లో భద్రపరచిన ఆహారాల్లో స్థానమేర్పరచుకుని సంతానోత్పత్తిని చేస్తుంది. బోటులిజం బ్యాక్టీరియా ఒక వ్యక్తికి వ్యాధికారకంగా సోకినప్పుడు ఇది “బాటిలినమ్ టాక్సిన్ను” విడుదల చేస్తుంది. ఇది పక్షవాతానికి దారితీస్తుంది. ఇలా సోకిన పక్షవాతం ముఖంతో మొదలవుతుంది, కీలక అవయవాలు మరియు కాళ్ళు, చేతులకు వ్యాప్తి చెందుతుంది. మనిషికి సోకిన తర్వాత, శ్వాసకోశ కండరాలను ఈ బాక్టీరియా గనుక చేరుకున్నట్లయితే, ఇది శ్వాస సంబంధమైన వైఫల్యాలకు దారితీయవచ్చు.  ఆహారం విషతుల్యమవడం (బోటులిజం) అనేది పక్షవాతానికి దారితీస్తుంది గనుక ఇది వైద్య అత్యవసర పరిస్థితి అంటే చాలా ప్రమాకర జబ్బు పరిస్థితి.

క్రింద బోటిలిజం రకాలున్నాయి:

  • బోటులినమ్ టాక్సిన్తో కలుషితమైన ఆహారాన్ని తినడం వలన ఆహారపదార్థ బోటులిజం దాపురిస్తుంది.  
  • బ్యాక్టీరియా బహిరంగ గాయంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు “గాయం బోటులిజం” ఏర్పడుతుంది మరియు ఆ గాయం లో విషాన్ని విడుదల చేస్తుంది.
  • కలుషిత ఆహారం తినడం ద్వారా శిశువు ఈ బ్యాక్టీరియాను తన శరీరంలోనికి గ్రహించినపుడు ఆ శిశువుకు ఈ ఆహారం విషతుల్యమవడమనే (బోటులిజం) అనబడే వ్యాధి దాపురిస్తుంది.  శిశువు బోటులిజంలో, ఆ శిశువు యొక్క భేది (stool) లో కూడా ఈ బాక్టీరియా విషం ఉంటుంది.
  • వయోజనుల్లో ఈ బాక్టీరియా జీర్ణవ్యవస్థకు వ్యాప్తి చెందినపుడు అది వారి పేగుల్లో స్థావరమేర్పరుచుకుని వృద్ధి చెందుతుంది. ఈ రకంగా ఆహారం విషతుల్యమవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.

చికిత్సానంతర ఆహార విషతుల్య జబ్బు (latrogenic botulism) చికిత్స అనంతరం వచ్చేది. లేక బోటియులిన్ టాక్సిన్ (బోడోక్స్) మందును అధిక మోతాదులో సేవించడంవల్ల సంభవించవచ్చు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఆహార విషతుల్య జబ్బు సంక్రమించిన 6 గంటల నుండి 10 రోజుల లోపు ఈ వ్యాధి సంకేతాలు, లక్షణాలు పొడజూపవచ్చు. ఈ వ్యాధి సోకిన శిశువులలోను మరియు ఆహారానికి-సంబంధించిన విషతుల్య జబ్బు (Botulism) వ్యక్తికి సోకిన 12 నుండి 36 గంటల లోపు వ్యాధి లక్షణాలు గోచరిస్తాయి.

ఆహార విషతుల్య జబ్బు యొక్క లక్షణాలు:

  • వికారం
  • వాంతులు
  • మలబద్ధకం తరువాత దాపురించే పొత్తికడుపు నొప్పి (తిమ్మిరి)
  • మ్రింగేటపుడు కష్టం మరియు మాట్లాడేటప్పుడు కష్టపడే సమస్య
  • నోరు ఎండిపోవడం
  • ముఖం యొక్క రెండు వైపులా బలహీనత కానరావడం
  • అస్పష్టమైన దృష్టి లేదా వస్తువులు రెండుగా కనిపించే స్థితి.
  • వాలిపోయిన (నిస్సత్తువగా) కనురెప్పలు
  • శ్వాసలో ఇబ్బంది  
  • శరీరంలోని వివిధ కండర సమూహాల పక్షవాతం

ఆహారానికి-సంబంధించి,గాయాలకు-సంబంధించి, చికిత్సా-ప్రేరిత-సంబంధమైన ఆహార విషతుల్య జబ్బుమరియు వయోజనులకు దాపురించే ఆహార విషతుల్య జబ్బు యొక్క లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. పుండు (గాయం)కు సంబంధించిన ఆహారవిషతుల్య జబ్బు యొక్క లక్షణాలు కనిపించడానికి 4 రోజులు నుండి 2 వారాలు పట్టవచ్చు. పుండు (గాయం)కు సంబంధించిన ఆహారవిషతుల్య జబ్బులో, మెదడును వెన్నెముకకు కలిపే నరములు మొదట వ్యాధి లక్షణాలను అనుభవిస్తాయి, ఆ తర్వాత మిగిలిన శరీర భాగాలకు వ్యాపిస్తాయి.

శిశువులకు దాపురించే ఆహార విషతుల్య జబ్బులో వ్యాధి సోకిన శిశువుకు మలబద్ధకం, ఆహారం సరిగా తినకపోవడం, తినిపించేప్పుడు చాలా కష్టపడాల్సి రావడం, అలసట , చిరాకు, చొంగ కార్చడం, వాలిపోయే కనురెప్పలు, బలహీనమైన మొరతో కూడిన అరుపులు, తలను సరిగా నిలపలేని బలహీనత, కండర బలహీనత వల్ల శిశువు చలనంలో వేలాడబడే తత్త్వం (అంటే చాలా బలహీనంగా కదలడం) వంటి లక్షణాలు పొడజూపుతాయి.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఆహార విషతుల్య జబ్బు (బొట్యులిజం) ప్రధానంగా బోట్యులినుం బ్యాక్టీరియా కలిగిన ఆహారం తినడంవల్ల లేదా కలుషితమైన నేలతో అంటు సోకడంవల్ల దాపురిస్తుంది. ఆహార విషతుల్య జబ్బుకు సంబంధించిన బీజకణాలు పేగుల్లోపల పెరుగుతాయి, అటుపై బోట్యులిన్ విషపదార్థాన్ని విడుదల చేస్తుంటాయి. ఈ బ్యాక్టీరియా యొక్క ప్రధాన ఆహార వనరులు ఇంట్లోనే డబ్బాల్లో భద్రపరచిన ఆహారాలు లేదా వాణిజ్యపరంగా డబ్బాల్లో భద్రపరచి, తినడానికి తయారుగా ఉన్న ఆహారాలు. ఆహార పదార్థాల్ని సరిగా క్రమమైన పద్ధతిలో (ప్రాసెసింగ్ చేయనివి) భద్రపరచక పోతే అలాంటి పదార్థాలు కూడా ఈ బాక్టీరియాకు ఆహారమవుతాయి. బీట్రూటు దుంపలు, కాయగూరలు , పుట్టగొడుగులు మరియు ఆకుపచ్చ బీన్స్ వంటి తక్కువ యాసిడ్ కల్గిన పదార్ధాలలో కూడా ఈ బోటులిజం విషక్రిమి దాగి ఉంటుంది. తినడానికి తయారుగా డాబాల్లో భద్రపరచిఉన్న ట్యూనా చేప, పులియబెట్టిన, పొగబెట్టిన, మరియు ఉప్పు చేప, పంది మాంసం మరియు వండేందుకు సిద్ధపరచిన “సాసేజ్” వంటి మాంసం ఉత్పత్తుల్లో కూడా ఈ బోటులిజం విషక్రిమి దాగుంటాయి.

గాయం లేదా పుండు-సంబంధ-ఆహార విషతుల్య (గాయం బోట్యులిజం) జబ్బ లు  ఎపుడు దాపురిస్తాయంటే కట్టు కట్టకుండా తెరచి ఉంచిన గాయం (open wound) లోకి ఈ బోటులిజం బీజానువులు ప్రవేశించినప్పుడు. ఈ బోటులిజం బీజానువులు హెరాయిన్, కోకైన్ల వంటి మాదక ద్రవ్యాల్లో దాగుంటాయి. ఈ మత్తు పదార్థాల్ని ఇంజక్షన్ ద్వారా గ్రహించడం అనేది గాయం ఆహార విషతుల్య జబ్బుకు ఒక సాధారణ కారణం.

ఆహార విషతుల్య జబ్బు ఎలా నిర్ధారింపబడుతుంది మరియు దీనికి చికిత్స ఏమిటి?

రోగ నిర్ధారణ కోసం, మీ డాక్టర్ గత కొన్ని రోజుల్లో మీరు వినియోగించిన ఆహారం గురించి ప్రశ్నలు అడుగుతారు. ఇంకా, మీకున్న బహిరంగ గాయం ద్వారా బ్యాక్టీరియా మీ శరీరంలోనికి ప్రవేశించిందా వంటి విషయాలకు సంబంధించి తెలుసుకునేందుకు మిమ్మల్ని వైద్యుడు ప్రశ్నిస్తాడు. బలహీనమైన కంఠస్వరం,  కండరాల బలహీనత, వాలి పోతున్న కనురెప్పలు, లేదా పక్షవాతం వంటి వ్యాధి లక్షణాల్ని వైద్యుడు మీలో తనిఖీ చేయవచ్చు. శిశువులకు సంబంధించి, సదరు వ్యాధి సోకికిన శిశువుకు తేనె ఏమైనా తినిపించారా, మలబద్ధకం ఉందా మరియు శిశువు నిరుత్సాహంగా డీలా పడిపోయి బాధపడుతోందా వంటి ప్రశ్నల్ని వైద్యుడు తల్లిదండ్రులు లేక సంరక్షకుల్ని అడగవచ్చు.

డాక్టర్ అప్పుడు బోటులినం విషపదార్థ  ఉనికిని నిర్ధారించడానికి రక్తం, మలం లేదా వాంతికి సంబంధించిన ప్రయోగశాల పరీక్షలు చేయించామని మిమ్మల్ని అడగవచ్చు. ప్రయోగశాల నుండి ఈ పరీక్షల ఫలితాలను స్వీకరించడానికి కొన్ని రోజులు పట్టవచ్చు, అందువల్ల మీ డాక్టర్ మీకు ఆహార విషతుల్య జబ్బు (బోటులిజం) ఉందని అనుమానించినట్లయితే, అతను / ఆమె వెంటనే చికిత్స ప్రారంభించవచ్చు. కొన్ని సందర్భాల్లో, వైద్యుడు కింద తెల్పినటువంటి ప్రత్యేక పరీక్షలు కూడా నిర్వహించవచ్చు:

  • బ్రెయిన్ స్కాన్
  • వెన్నెముక ద్రవ పరీక్ష
  • నరాల మరియు కండరాల పనితీరు పరీక్షలు

ఆహార విషతుల్య జబ్బు (బోటిలిజమ్) చికిత్సకు ఉపయోగించే మందును “యాంటీ-టాక్సిన్” అంటారు. యాంటిటోక్సిన్ మందు ఆహార విషతుల్య జబ్బు (బోట్యులిజం) శరీరంలో విషయాన్ని నరాలకు మరింత హాని కలిగించకుండా నిరోధిస్తుంది. అయితే, ఈ విషపదార్థంవల్ల ఇప్పటికే జరిగిన నష్టాన్ని యాంటిటాక్సిన్ మందు నయం చేయదు. అనేక సార్లు, ఆహారపు విషతుల్య జబ్బుల్లో, వైద్యుడు (మందుల ద్వారా) వాంతిని  ప్రేరేపించవచ్చు. లేదా భేదులు ప్రేరేపించడానికి మందులను మీకు సూచంచవచ్చు. విషతుల్య జబ్బు కారణంగా అయినా పుండు లేదా గాయం జబ్బు (బోటిలిజం) విషయంలో, వైద్యుడు ఆ గాయానికి సంబంధించిన కణజాలాల్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించివేసి యాంటీబయాటిక్స్ను అనబడే మందుల్ని సూచించవచ్చు.

శ్వాస కండరాల పక్షవాతానికి కారణమైన టాక్సిన్ వల్ల మీకు శ్వాస కష్టాలు సంభవిస్తే, టాక్సిన్ ప్రభావాన్ని తగ్గించే వరకు డాక్టర్ మిమ్మల్ని వెంటిలేటర్లో ఉంచవచ్చు, తద్వారా మీరు మీ శ్వాసను పీల్చుకోవచ్చు. వ్యాధి బారిన పడినవారికి  మాట్లాడగల్గడం, మ్రింగడం, మరియు ఇతర విధులు మెరుగుపరచడానికి చికిత్స అవసరమవుతుంది. ఈ వ్యాధి సోకినవాళ్లలో 5 నుండి 10% శతం మంది మరణించడం సంభవించవచ్చు.



వనరులు

  1. French National Institute for Health and Medical Research. [Internet]; The portal for rare diseases and orphan drugs.
  2. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Botulism
  3. Carrillo-Marquez MA et al. botulism . Clin Infect Dis. 2019 Jun 7. pii: ciz479. PMID: 31247064
  4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Botulism
  5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Botulism