myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

సారాంశం

 

మలబద్దకం అనేది ఒక సాధారణ పరిస్థితి, ఇందులో ప్రేగు కదలికలు కష్టంగా ఉంటాయి మరియు అవి తక్కువగా జరుగుతాయి ఇది ఆహారం, వైద్య చరిత్ర లేదా ఇతర ఆరోగ్య పరిస్థితుల ఉనికి వంటి అనేక అంశాలకు సంబంధించినది. కొన్నిసార్లు, కొన్ని మందులు కూడా మలబద్ధకం కలిగిస్తాయి. వైద్యులు మలబద్ధకం ఒక వ్యాధి కాదు కానీ అంతర్లీన జీర్ణ స్థితి యొక్క అభివ్యక్తి అని అభిప్రాయపడుతున్నారు. మలబద్ధకం యొక్క  ఇతర కారణాలలో పేగు అడ్డంకులు, బలహీన కటి కండరములు, ఆహారం లో ఫైబర్ లేకపోవడం, లేదా నిర్జలీకరణము కూడా ఉన్నాయి.

మలబద్దకం అనేది లాక్సిటివ్ గా పిలువబడే ఓవర్-ది-కౌంటర్ మందులతో సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. ఈ మందులు వెంటనే ఉపశమనం కలిగించినప్పటికీ, అవి రోజూ తీసుకోకూడదు. అనేక ఇంటి చిట్కాలు కూడా ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యాత్మకంగా ఉంటుంది మరియు దీని కారణాన్ని గుర్తించేందుకు వైద్యుడు అనేక పరీక్షలు చేయవలసిన అవసరముంటుంది.. మలబద్ధకం అదుపు అవడానికి ఆహార మార్పులు చాలా తోడ్పడతాయి. చికిత్స చేయకుండా ఉంటే మలబద్ధకం యొక్క సంగ్రహాలు ఉత్పన్నమవచ్చు.

 1. మలబద్ధకము యొక్క లక్షణాలు - Symptoms of Constipation in Telugu
 2. మలబద్ధకము యొక్క చికిత్స - Treatment of Constipation in Telugu
 3. మలబద్ధకము కొరకు మందులు
 4. మలబద్ధకము వైద్యులు

మలబద్ధకము యొక్క లక్షణాలు - Symptoms of Constipation in Telugu

మలబద్ధకం యొక్క లక్షణాలు గుర్తించడం సులభం మరియు ఇలా ఉంటాయి:

 • మాములుగా కంటే తక్కువ ప్రేగు కదలికలు.
 • అసంపూర్ణ ప్రేగు కదలికల భావన.
 • మల విసర్జనలో ఇబ్బంది లేదా నొప్పి
 • గట్టి విరేచనాలు

ఈ లక్షణాలు కొన్ని గంటలలో ఉపశమనం కలిగించవచ్చు లేదా ఎక్కువ సేపు ఉండవచ్చు. ఏదైనాసరే, ఒక వ్యక్తి ఈ క్రింది లక్షణాలను అనుభవిస్తే, అతను / ఆమె వారి వైద్యుడ్ని వెంటనే సందర్శించాలి:

మలబద్ధకము యొక్క చికిత్స - Treatment of Constipation in Telugu

వెంటనే ఉపశమనం అందించడానికి, మీ వైద్యుడు విరేచనాకారిని సిఫారసు చేయవచ్చు. ఈ లాక్సేటివ్స్ మలబద్ధక చికిత్సకు  అప్పుడప్పుడు సహాయం చేస్తాయి, కానీ అంతర్లీనంగా ఉండే సమస్యను నయం చేయలేవు. లాక్సైటివ్ల మితిమీరిన ఉపయోగం చాలా దుష్ప్రభావాలకు దారి తీస్తుంది మరియు దీర్ఘకాలిక ఉపయోగం హానికరం కావచ్చు

వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే లాక్సైటివ్ల మితిమీరిన వాడకం మలబద్ధకం ఉన్న ప్రజలలో చాలా సాధారణం. తినడంలో  లోపాలు  ఉన్న వ్యక్తులలో, లాక్సైటివ్ల నిరంతరాయ వినియోగం చాలా హానికరం మరియు జీర్ణాశయం యొక్క గోడకు హాని చేయవచ్చును. కాబట్టి, ఉపశమనం పొందడానికి  ఓవర్ ది కౌంటర్ లాక్సేటివ్స్ జాగ్రత్తగా వాడాలి.

లాక్సేటివ్స్ తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి ఈ క్రింది లక్షణాలను అనుభవిస్తే, వెంటనే వైద్యుని సంప్రదించాలి:

 • మల విసర్జన చేసేటప్పుడు రక్తం రావడం.
 • ముక్కు నుండి రక్తస్రావం అవ్వడం
 • పొత్తి కడుపు నొప్పి.
 • వికారం.
 • ప్రేగు కదలికలలో మార్పు.
 • బలహీనత.

మలబద్ధక చికిత్స కోసం అనేకమైన లాక్సేటివ్స్ మందుల దుకాణాలలో లభిస్తున్నాయి. ఓరల్ ఓస్మోటిక్ ఏజెంట్లు మల విసర్జన సులభం చేయటానికి పెద్దప్రేగులోకి  నీటిని ఆకర్షిస్తాయి ఓరల్ బల్క్ ఫార్మర్లు మలం ఏర్పడటానికి నీటిని శోషించడం ద్వారా సరసన మార్గంలో పనిచేసి, మల విసర్జనను తేలిక చేస్తాయి. ఇతర లాక్సేటివ్స్ లో ఓరల్ స్టూల్ సాఫ్టేనెర్స్ మరియు  ఓరల్  స్టిములంట్స్ కూడా ఉన్నాయి.

ఓరల్ లాక్సేటివ్స్ కొన్ని పోషకాలు మరియు ఔషధాలను శోషించడానికి శరీర సామర్ధ్యానికి అడ్డు కలగచేయవచ్చును. కొన్ని లాక్సేటివ్స్  ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను కూడా కలిగిస్తాయి. లాక్సేటివ్స్  తీసుకునే ముందు, ఈ క్రింది విషయాలను సరి చూడటానికి  లేబుల్ చదవడం ముఖ్యం:

 • కూడుకున్న దుష్ప్రభావాలు.
 • ఔషధ సంకర్షణ.
 • మధుమేహం, మూత్రపిండ సమస్యలు, లేదా గర్భం వంటి ఆరోగ్య పరిస్థితుల ఉనికి.
 • 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ముందుగా వైద్యులను సంప్రదించకుండా లాక్సేటివ్స్ ని ఇవ్వకూడదు.
 • తినే అలవాట్లు మరియు ఆహార జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా మలబద్ధక సమస్యను దూరంగా ఉంచవచ్చని వైద్యులు  సిఫార్సు చేస్తున్నారు. మలబద్ధకం తీవ్రంగా మరియు కాలక్రమేణా తీవ్రస్థాయిలో ఉంటే, వైదేడు కొన్ని ఇతర మందులను సూచించవచ్చుఒకవేళ ఏదైనా అడ్డుపడితే, దాన్ని సరిదిద్దడానికి వైద్యులు శస్త్రచికిత్స ను సిఫార్సు చేయవచ్చు.

ఇంటి చిట్కాలు

మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందించడంలో ఇంటి చిట్కాలు చాలా సహాయకరంగా ఉంటాయి. కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఈ  క్రింది విధంగా ఉన్నాయి:

 • ఇంగువ
  ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చిటికెలు ఇంగువ కలిపి రోజుకి రెండుసార్లు తీసుకోవాలి
 • వాము విత్తనాలు
  ఒక పాన్లో వాము విత్తనాలను దోరగా వేయించి పొడి చేసుకొని, గోరువెచ్చని నీటితో దీన్ని తాగండి
 • నీళ్లు
  మీరు అప్పుడప్పుడు స్వల్ప మలబద్ధత ఎదుర్కొంటున్నట్లైతే, ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో మీ రోజును ప్రారంభించండి, ఇది ప్రేగు కదలికలను కలగజేస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగాలి. నిర్జలీకరణాన్ని నివారించడానికి రోజంతా క్రమంగా నీరును త్రాగుతూ ఉండాలి.
 • కాఫీ
  కెఫీన్ ఒక సహజమైన లాక్సేటివ్ మరియు సహజంగా ఇది చాలా తేలికపాటిది.. ఉదయాన్నే ఒక కప్పు బ్లాక్ కాఫీ కాచుకుని తాగండి. ఎవరైనా ఈ చిట్కా మీద ఆధారపడకూడదు ఎందుకంటే కెఫీన్ నిర్జలీకరణాన్ని కలుగజేసి మరియు నిద్రవేళలో తీసుకున్నప్పుడు నిద్ర సమస్యలు కలుగజేయవచ్చు.

జీవనశైలి నిర్వహణ

 • ఆహరం
  మలబద్ధకం నుండి దీర్ఘకాలిక ఉపశమనం కలగాలంటే తీసుకోవాల్సిన మొట్టమొదటి అడుగు ఆహరం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం. ఆహారం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకం నివారించడానికి, ఆహారంలో మరింత పీచు పదార్ధాలు చేర్చడం ముఖ్యం. పుష్కలమైన నీటితో పాటు పీచు పదార్ధం అధికంగా ఉండే ఆహారాలు ఉపశమనాన్ని అందించడంలో బాగా సహాయపడతాయి. ఒక సగటు మనిషికి ప్రతిరోజూ 25 గ్రాముల పీచు పదార్ధం అవసరమవుతుంది. గోధుమ రొట్టె, వోట్మీల్ వంటి తృణధాన్యాలు పీచుపదార్ధాలు అధికంగా ఉండే మంచి ఆహార వనరులు. రాజ్మా మరియు సోయాబీన్స్ వంటి పప్పుదినుసులలో  కూడా పీచు పదార్ధం అధికంగా ఉంటుంది. ఆకు కూరలు పీచు పదార్ధాలు అందించడమే కాకుండా అవసరమైన పోషకాలను కూడా సరఫరా చేస్తాయి. అధిక పీచు పదార్ధాలకై బాదం మరియు వేరుశెనగ వంటి పప్పులను, ఆరోగ్యకరమైన కొవ్వులుగా తీసుకోవచ్చు. 
 • జీర్ణప్రక్రియలు సజావుగా సాగడానికి ప్రతిరోజూ తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం. మలం మృదువుగా మరియు విసర్జన సులభం అవ్వడానికి కూడా నీరు సహాయపడుతుంది. పండ్ల రసాలు వంటి ఇతర ద్రవాలను కూడా తీసుకోవచ్చు.
 • ప్రోబయోటిక్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం కూడా జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు దీర్ఘకాల ప్రయోజనాలను అందిస్తుంది.
 • ఆహారం-సంబంధ మలబద్ధతను నివారించడానికి, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, ఎయిరేటెడ్ పానీయాలు మరియు ఘనీభవించిన ఆహారాలను తినకుండా ఉండండి

వ్యాయామం

క్రమం తప్పని శారీరక వ్యాయామం జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది మరియు ప్రేగు కండరాలను ప్రేరేపిస్తుంది. వైద్యుడు కూడా పేగులు ఒక క్రమ పద్ధతిలో రూపొందించడానికి ప్రేగుల శిక్షణను సూచించవచ్చు, తద్వారా మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు.

మందులు

మీరు ఏదైనా మందులు లేదా సప్లిమెంట్లను తీసుకుంటున్నట్లైతే, మలబద్ధకానికి కారణం ఇవి కావచ్చేమో అని తెలుసుకోవడానికి మీ వైద్యుడిని సంప్రదించండి. అలా గనుక అయితే, మీరు ప్రత్యామ్నాయ మందు కోసం అభ్యర్థించవచ్చు.

Dr. Sushila Kataria

Dr. Sushila Kataria

सामान्य चिकित्सा

Dr. Sanjay Mittal

Dr. Sanjay Mittal

सामान्य चिकित्सा

Dr. Prabhat Kumar Jha

Dr. Prabhat Kumar Jha

सामान्य चिकित्सा

మలబద్ధకము की जांच का लैब टेस्ट करवाएं

LFT ( Liver Function Test )

20% छूट + 10% कैशबैक

Thyroid Stimulating Hormone (TSH)

20% छूट + 10% कैशबैक

మలబద్ధకము కొరకు మందులు

మలబద్ధకము के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
Gelusil MpsANTACID MPS SYRUP 170ML0
DigeneDigene Gel Mint 130
DuphalacDUPHALAC 150ML SYRUP134
CremaffinCREMAFFIN (BLUE) 200ML SYRUP102
SoftdropsSoft Drops Liquigel181
FreegoFreego Granules 90 gm164
AristozymeARISTOZYME FIZZ TABLET 4S15
NormalaxNormalax 10 Mg Tablet41
ADEL 28 Plevent DropADEL 28 Plevent Drop200
SBL Asafoetida DilutionSBL Asafoetida Dilution 1000 CH86
NovalaxNovalax Syrup44
Schwabe Natrum muriaticum TabletSchwabe Natrum muriaticum Biochemic Tablet 200X560
Bjain Asafoetida DilutionBjain Asafoetida Dilution 1000 CH175
OslaxOSLAX 100ML SYRUP73
SBL Arnica Montana Hair Oil Arnica Montana Hair Oil56
Schwabe Sabal PentarkanSchwabe Sabal Pentarkan 128
PiclinPICLIN SYRUP 100ML81
Arnica Montana Herbal ShampooArnica Montana Herbal Shampoo With Conditioner72
Schwabe Agnus castus MTSchwabe Agnus castus MT 88
Schwabe Ananas sativus CHSchwabe Ananas sativus 12 CH96
ADEL Nux Vomica Mother Tincture QADEL Nux Vomica Mother Tincture Q 184

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Constipation .
 2. Stanford Health Care [Internet]. Stanford Medicine, Stanford University; Constipation Causes
 3. National Health Service [Internet]. UK; Laxatives.
 4. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Constipation
 5. Stanford Health Care [Internet]. Stanford Medicine, Stanford University; Complications of Constipation
और पढ़ें ...