చేపలు 530 మిలియన్ల సంవత్సరాల క్రితం కేంబ్రియన్ పేలుడు సమయంలో ఉనికిలోకి వచ్చాయి, అటుపైన, ఇవి జీవ వైవిధ్యపరంగా బాగా పెరిగినాయి. మొట్టమొదటిగా గుర్తించబడిన చేప ‘అగ్నాథ’ లేదా దవడల్లేని చేప (jawless fish). ఈ అగ్నాథ కారణంగానే ‘దేవొనియన్’ కాలంలో విస్తృత స్థాయిలో చేపల పెరుగుదల కనిపించింది. దేవొనియన్ యుగాన్ని 'చేపల కాలం' అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం, ప్రపంచం లో సుమారు 25,000 చేపల జాతులు ఉన్నాయి. అతిపెద్ద చేప ‘వేల్ షార్క్’ కాగా, చిన్న చేప ‘ఫిలిప్పైన్ గోబీ’ గా గుర్తించబడ్డాయి.

చేపలు చల్లని-రక్తపు జంతువు మరియు పర్యావరణానికి అనుగుణంగా దాని శరీర ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసుకుంటుంది. చేపలు సహజంగా చాలా శక్తివంతమైనవి, ఇవి  వాటికున్న ఎర్రని కండర ఫైబర్లతో అనేక గంటలపాటు నీటిలో ఈదగలవు. ఇవి తమ చిన్న కండరాలను ఉపయోగించి వేగవంతమైన చిన్న చిన్నవిసుర్ల (bursts)ను విసరగలవు. చేపలు సుదీర్ఘకాలంపాటు ఈత కొట్టగలవు, అందుగ్గాను వాటి యొక్క రెడ్ ఫైబర్లకు ప్రాణవాయువు కావలసి ఉంటుంది, దీనివల్ల అవి వేగంతో ఈదగలవు. చేపల్లో మైయోగ్లోబ్బిన్తో కూడిన రక్తసరఫరా చేపల్లో కావలసినంతగా ఉంటుంది కాబట్టీ అవి వేగంగా ఈదగల్గుతాయి.

చేపలు మాంసకృత్తులను సమృద్ధిగా కల్గిన ఒక ముఖ్యమైన సముద్రపు ఆహారం.అంతేగాక చేపలు రుచికరమైన ఆహారంగా ప్రసిద్ధి. వాస్తవానికి, ప్రపంచ ప్రోటీన్లో ఆరింటా ఒక వంతు చేపల నుండే వస్తుంది. పురాతన కాలం నుండి మానవులు చేపల్ని ఆహారంగా ఉపయోగిస్తున్నారు మరియు అనేక నాగరికతల్లో చేపలు ఒక ముఖ్యమైన ఆహారంగా ఉంది. దాని తలతో సహా మొత్తం చేపను తినవచ్చు. అందువల్ల, అనేక రకాల చేప-ఆధారిత వంటకాలను ప్రపంచ వంటల్లో మనం చూడవచ్చు. సుషీ వంటి కొన్ని వంటకాల్లో పచ్చి చేపల్నే తినడానికి వాడుతుండగా, చేపల్ని ఆవిరిమీద ఉడికించి, మంటల్లో కాల్చి (grilled), వివిధ వంటలలో వేయించి తినడం జరుగుతుంది. చేపలు మరియు చిప్స్ బహుశా ఇంగ్లీష్ వంటల్లో అత్యంత సాధారణ వంటలలో ఒకటి.

ప్రోటీన్ యొక్క గొప్ప వనరుగానే కాకుండా, చేపలు ఒమేగా 3-కొవ్వు ఆమ్లం మరియు విటమిన్ డి యొక్క అద్భుతమైన మూలం. కొన్ని రకాల చేపలలో కనిపించే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరుకు మరియు మానసిక అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చేపల్లో కొవ్వు పదార్ధం సాధారణంగా చేపయొక్క రకం మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమయినప్పటికీ, చేపల్ని సాధారణంగా తినడంవల్ల జుట్టు, మెదడు మరియు శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

చేప చమురు (fish oil) దాని ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యేకంగా సేవించబడుతుంది మరియు చేపలను ఆక్వేరియంలు, కొలనులు, చెరువులు మరియు సరస్సుల్లో వాటిని చూచి ఆనందించేందుకు, అంటే సౌందర్య ప్రయోజనాల కోసం, పెంచబడతాయి. చేపలవల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ప్రధాన ఉపయోగం మాత్రం కమ్మదనంతో కూడిన వీటి రుచి, కనుక చేపల ఆహారప్రియులు వాటిని తిని ఆనందించడం కొనసాగుతోంది.

మీకు తెలుసా? 

ఈ జలచర జంతువులైన చేపలు పురాతనమైనవే కావు, ఇవి అనేక మతాలలో ముఖ్యమైన పౌరాణిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నా యి. ‘ఎంకి’ పేరిట సుమేరియన్లు చెప్పాను తమ వరుణ దేవుడిగా (god of water) కొలుస్తారు, చేప దేహాన్ని కల్గిన సిరియా దేవత, ‘అతార్గటి’ ని సిరియన్లు పవిత్రంగా కొలుస్తారు. చేపను సూచించే గ్రీకు పదం యేసుక్రీస్తుకు సంబంధించిన ఒక సంక్షిప్తపదం (acronym), అందువల్ల ప్రాచీన క్రైస్తవులు యేసుక్రీస్తును సూచించడానికి చేప చిహ్నాన్ని ఉపయోగిస్తారు. హవాయి మరియు ముస్లిం సంస్కృతులలో చేపలకు కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. మెసొపొటేమియన్లు మరియు హిందూ సంస్కృతిలో కొన్ని జాతుల ప్రజలు తమ పండుగలు, దేవుని జాతర్ల వంటి సంబరాలలో చేపలను దేవునికి నైవేద్యంగా సమర్పించి ప్రార్థిస్తారు.

చేప గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

  • ప్రాణిజాతి (Kingdom) : యానిమాలియా (Animaalia)
  • ప్రజాతి (phylum): చొర్డేటా (chordata)
  • చేపల తరగతులు  లేక వర్గాలు:  గట్టి నరమయమైన, మెత్తని నరముతో  కూడిన (cartilaginous) మరియు ఎముకలతో కూడినది (bony)
  • చేపల సాధారణ రకాలు: సాల్మోన్, సార్డైన్, కాడ్, పెర్చ్, హాలిబుట్, ట్రౌట్, టిలాపియా, కార్ప్, టెట్రా, బిల్ఫిష్ మొదలైనవి.
  • చేపల ఉపయోగాలు: ఆహారంగా తినడానికి, మసాజ్ చికిత్సలో, ఆక్వేరియమ్స్ లో అలంకారప్రాయంగా చేపల్ని ఉపయోగిస్తారు
  • చేపల పరిణామం: చేపలు సుమారు 530 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించాయి. మొట్టమొదటిగా సిలూరియన్లచేత చేపల యొక్క రెండు గ్రూపుల్ని సూచిస్తూ  శిలాజ రికార్డులో ప్రాతినిధ్యం వహించాయి: ఆ రెండు గ్రూపులు: సాయుధ చేప మరియు అకాంతోడీ రకం చేప .
  • ఆసక్తికరమైన నిజం: కొన్ని చేపలు ఉప్పునీటిలో నివసిస్తాయి, హాలిబట్ మరియు కాడ్ చేపలు అలాంటివే. అవి హాసముద్రాలు మరియు సముద్రాలలో నివసిస్తాయి. ట్రౌట్ చేపలు మరియు క్యాట్చేపలు సరస్సులు మరియు నదుల వంటి మంచినీళ్లలో (freshwaters) నివసిస్తాయి.
  1. చేపల పోషక వాస్తవాలు - Fish nutrition facts in Telugu
  2. చేపలు తినడంవల్ల ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of eating fish in Telugu
  3. చేపలు తినడంవల్ల కలిగే దుష్ప్రభావాలు - Side effects of eating fish in Telugu
  4. ఉపసంహారం - Takeaway in Telugu

చేపల్లో అనేక పోషకపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని రకాల చేపలు పొడవాటి గొలుసు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను పుష్కలంగా కల్గి ఉంటాయి. చేపలు కాల్షియం మరియు భాస్వరం మరియు ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, మరియు పొటాషియం వంటి అనేక రకాల ఖనిజాల్ని పుష్కలంగా కల్గి ఉంటాయి.

చేపలు రెండు రకాలు: జిడ్డు చేపలు మరియు జిడ్డు లేని చేపలు.

గుండె వ్యాధుల నష్టాలను తగ్గించటానికి సహాయపడే జిడ్డు చేపలు ఒమేగా -3 బహుళఅసంతృప్త కొవ్వు ఆమ్లాలను పుష్కలంగా కల్గి ఉంటాయి. సాల్మొన్, ట్రౌట్, మేకెరెల్, హెర్రింగ్, సార్డినెస్, పిచ్చార్డులు, కిప్పర్, ట్యూనా (తాజాగా ఉండేవి పెట్టెల్లో నిల్వ ఉంచనివి), హిల్స్సా , కత్తి చేప (sword fish) , కార్ప్, ఈల్ మొదలైనవి.

జిడ్డు లేని చేప ఎక్కువగా తెల్ల మాంసంతో కూడుకుని ఉంటుంది మరియు బరువు 2% కొవ్వు మాత్రమే కలిగి ఉంటుంది. జిడ్డు లేని చేపలకు ఉదాహరణలు - కాడ్, హాడాక్, పామ్ఫ్రేట్, ప్లాయిస్, లెమన్ కాలే, కోలే, టిన్నెడ్ ట్యూనా (tinned tuna), సి బాస్, మొదలైనవి.

USDA న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం, పచ్చి అట్లాంటిక్ సాల్మన్ (జిడ్డు చేప) రకం చేప  యొక్క 100 గ్రా: పరిమాణం క్రింది విలువలను కలిగి ఉంటుంది:

పోషకాలు

100 గ్రాముల విలువకు 

నీరు

68.5 గ్రా

శక్తి

142 కిలో కేలరీలు

ప్రోటీన్

19.84 గ్రా

కొవ్వులు

6.34 గ్రా

మినరల్స్

 

కాల్షియం

12 mg

ఐరన్

0.80 mg

మెగ్నీషియం

29 mg

ఫాస్పారస్ 

200 mg

పొటాషియం

490 mg

సోడియం

44 mg

జింక్

0.64 mg

విటమిన్లు

 

విటమిన్ B1

0.226 mg  

విటమిన్ B2

0.380 mg 

విటమిన్ B3

7.86 mg 

విటమిన్ B9

0.818 mg 

విటమిన్ B-9

25 μg 

విటమిన్ B-12

0.96 mg 

విటమిన్ ఎ

12 mg 

విటమిన్ ఇ

3.92 mg

కొవ్వులు / కొవ్వు ఆమ్లాలు

 

అసంతృప్త

0.981 గ్రా

మోనోఅన్శాచ్యురేటెడ్

2.103 గ్రా

పాలీఅన్శాచ్యురేటెడ్

2.539 గ్రా

కొలెస్ట్రాల్

55 mg

(మరింత సమాచారం: విటమిన్ బి - కాంప్లెక్స్ ఆహార వనరులు)

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

దాదాపు అన్ని రకాల చేపలు పోషకాలను పుష్కలంగా కల్గిఉంటాయి. అవి ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. సాల్మోన్, ట్రౌట్, ట్యూనా వంటి కొవ్వు చేపలు కొవ్వు ఆధారిత పోషకాల్ని అధికంగా కల్గిఉంటాయి మరియు ఇతర చేపలతో పోలిస్తే ఇవి మనిషి శరీరానికి మరింత ఉపయోగకరంగా ఉంటాయి.  చేప కొవ్వుశరీరానికి మరియు మెదడుకు చాలా మంచిది మరియు ప్రత్యేకంగా గుండె లోపాలు అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, ఈ చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లం దండిగా ఉంటుంది. చేపలను ఎప్పుడూ తినడం ద్వారా పొందగల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇక్కడ గమనించండి.

  • గుండెకు ప్రయోజనం: చేపలు, ప్రత్యేకంగా ఉప్పు చేపలు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను సహజ ఒనరుగా కల్గి ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో మరియు హృదయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. గుండెజబ్బుల రోగులకు చేపల ప్రయోజనాలను నిర్ధారించడానికి ఇంకా ఎక్కువ అధ్యయనాలు జరపవలసిన అవసరముంది.
  • స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: చేపలలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు రక్త ప్రసరణ మెరుగుపరచడానికి మరియు మెదడులో రక్తం గడ్డకట్టకుండా నిరోధించటానికి సహాయపడుతుంది, చేపల్ని తినడంవల్ల ఆ విధంగా స్ట్రోకుల ప్రమాదం తగ్గుతుంది.
  • దృష్టిని రక్షిస్తుంది మరియు మెరుగుపరుస్తుంది: అధ్యయనాల ప్రకారం, చేపల్ని సాధారణంగా తినడంవల్ల దృష్టి నష్టం యొక్క అవకాశాలను 4% తగ్గిస్తుంది.  కళ్ళలోపల ఏర్పడే కేంద్ర దృష్టి నష్టం (లేదా మచ్చల క్షీణతను-macular degeneration) నివారించడంలో మరియు మొత్తం కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో చేపల సేవనం సహాయపడుతుంది.
  • కీళ్ళనొప్పుల లక్షణాలను తగ్గిస్తుంది: ఎముకలలో వాపును తగ్గించి, తర్వాత పూర్తిగా నివారించడానికి చేపలసేవనం సూచించబడుతుంది. ఎముకల్లో వాపు కీళ్ళ నొప్పికి మరియు కీళ్ళ వాపుకు కారణమవుతుంది. కీళ్లవాపు రోగులు చేపలు తినడంవల్ల ఎముకల సాంద్రతను పెంచి ఎముకలు విరగడాన్ని నివారిస్తుంది.
  • పిండం యొక్క మెదడు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది: చేపలు అసంతృప్త కొవ్వులకు, ప్రత్యేకించి ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు, ఓ మంచి మూలం, కాబట్టి, కాబోతున్నతల్లులు (expecting mothers) చేపలు తినడంవల్ల వారి గర్భంలో పెరిగే  పిండం యొక్క మెదడు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. గర్భధారణ సమయంలో చేపలు బాగా తినే మహిళల పిల్లలు తరువాత జీవితంలో ఉన్నత జ్ఞాన సామర్ధ్యాలను ప్రదర్శించినట్లు నివేదించబడింది.

చేప స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది - Fish reduces risk of stroke in Telugu

వైకల్యం, చిత్తవైకల్యం మరియు మరణానికి దారి తీసే ప్రధాన కారణం స్ట్రోక్. మెదడు కణజాలానికి రక్తం సరఫరా తగ్గిపోవడానికి రక్తనాళాల అవరోధం లేదా రక్తనాళాల నుండి రక్తం కారడం (లీకేజ్) కారణమవుతుంది. చేపలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి మరియు ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్ విటమిన్లకు చేపలు ఓ మంచి మూలం. చేపలు తినడంవల్ల శరీరంలో రక్తం యొక్క రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు ధమని నిరోధక ప్రమాదాన్ని తగ్గిస్తుంది, దీని వలన స్ట్రోక్ అవకాశాలు తగ్గుతాయి. ఒక మెటా-విశ్లేషణ ప్రకారం, నెలకు 1 నుండి 3 సార్లు చేపలు తిన్నట్లైతే వ్యక్తికి స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

గర్భిణీ స్త్రీలకు చేప ప్రయోజనాలు - Fish benefits for pregnant women in Telugu

గర్భస్థ పిండం చాలా వరకూ తల్లి నుండీనే పోషకాహారం పొందుతుంది. అందువల్ల, శిశువు పుట్టేందుకు ముందు గర్భిణీ స్త్రీల ఆహారం పిండం యొక్క అభివృద్ధిలో ఓ గొప్ప పాత్ర పోషిస్తుంది. నవజాత శిశువు యొక్క మెదడు అభివృద్ధిని కూడా పాలిచ్చే తల్లి తీసుకునే ఆహారమే నిర్ణయిస్తుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మానవులలో జ్ఞానపరమైన అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉన్నందున, గర్భధారణ సమయంలో చేపలు తినడం మరియు నవజాత శిశులలో జ్ఞానం యొక్క అభివృద్ధి యొక్క ఔచిత్యాన్ని పరీక్షించటానికి వివిధ అధ్యయనాలు చేయబడ్డాయి. గర్భధారణ సమయంలో కాబోయే తల్లి చేపలు బాగా తినడంవల్ల గర్భస్థ పిండంలో మెదడు యొక్క ఉత్తమ అభివృద్ధికి దారితీస్తుందని ఒక అధ్యయనం నివేదిస్తుంది. అటువంటి మహిళల పిల్లలు కూడా అధిక అభిజ్ఞాత్మక పనులను ప్రదర్శించారు.

ఎముకలకు చేప ప్రయోజనాలు - Fish benefits for bones in Telugu

ముఖ్యంగా బాల్యంలో మరియు ముసలి వయస్సులో శరీరానికి విటమిన్ D చాలా అవసరం. ఇది ఎముకలు మరియు కండరాలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి చాలా అవసరం. విటమిన్ D యొక్క లోపం బోలు ఎముకల వ్యాధి వంటి వివిధ వ్యాధులకు కారణమవుతుంది. సూర్యకాంతి లేనప్పుడు, శరీరానికి రోజుకు 1000 IU విటమిన్ D అవసరం ఉంటుంది. చేపలు విటమిన్ డి యొక్క గొప్ప ఒనరుగా ఉన్నాయి. ప్రతిరోజూ చేప నూనె మాత్రలు సేవించడం వల్ల ఎముక ఆరోగ్యాన్ని నిర్మించడంలో మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది.

కళ్ళకు చేప ప్రయోజనాలు - Fish benefits for eyes in Telugu

చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లం ఉండడం వలన, చిన్నవయసులోనే చేపలను తినడంవల్ల ప్రారంభ సంవత్సరాల్లో దృష్టిని రక్షించడంలో మరియు దృష్టిని మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. చిన్న వయస్సులో చేపలు తిన్న వ్యక్తులు, వారిలా చిన్నపుడు చేపలు తిననివాళ్ళతో పోలిస్తే, తమ కంటిచూపును కోల్పోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వాస్తవానికి, చేపలసేవనంవల్ల 4% కంటిచూపు కోల్పోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. నెలలో ఒకసారి మాత్రం చేపలు తినే వారిలో కంటే వారానికి రెండుసార్లు అంతకంటే ఎక్కువసార్లు చేపల్ని తినేవారిలో కంటి కేంద్ర మచ్చ క్షీణత (మాక్యూలర్ డిజెనెరేషన్) అనే దృష్టి రుగ్మత ముందుగా లేదా అకాలంగా సంభవించే ప్రమాదం తగ్గినట్లు ఓ అధ్యయనం  పేర్కొంది.

కీళ్ళనొప్పుల రోగులకు చేప ప్రయోజనాలు - Fish benefits for arthritic patients in Telugu

కీళ్లనొప్పి మనిషిని బలహీనపరిచే వ్యాధి. కీళ్లనొప్పి సాధారణంగా వాపుదేలిన మరియు బాధాకరమైన కీళ్ళతో ముడిపడి ఉంటుంది. వాపుదేలిన మరియు బాధాకరమైన కీళ్లు, కీళ్లలో ఉండే ఎముకమజ్జ నష్టానికి కారకమవుతాయి, తద్వారా ఎముకలు బలహీనపడి సులభంగా ఎముకల గాయాలకు మరియు ఎముక నష్టానికి రురయ్యే అవకాశం ఉంటుంది. చేపల నూనె ఎముక సాంద్రత పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, చేప యొక్క ముఖ్య భాగాలలో ఒకటి, ఇది వాపును నివారించడానికి సహాయపడుతుంది. అందువల్ల, చేపల్ని ఎపుడూ తింటుంటే కీళ్ళనొప్పులను దరి చేరనీయకుండా చేయచ్చు.

(మరింత చదువు: ఆర్థరైటిస్ రకాలు )

గుండెకు చేప ప్రయోజనాలు - Fish benefits for heart in Telugu

గుండె ఆరోగ్యానికి చాలా మంచిదిగా భావించే ఒమేగా -3 కొవ్వు ఆమ్లం చేపల్లో పుష్కలంగా ఉంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లం శరీరంలో ట్రైగ్లిజరైడ్ల  స్థాయిలను తగ్గిస్తుందని నివేదించబడింది. ట్రైగ్లిజరైడ్లు గుండె -సంబంధ వ్యాధుల్ని సంభవింపజేసే కారకంగా చెప్పవచ్చు.

ఒక పీర్ రివ్యూ జర్నల్ లో ప్రచురించబడిన మెటా-విశ్లేషణ ప్రకారం, చేపల క్రమమైన  వినియోగం హృదయనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితాలు అసంబద్ధమైనవి అయినప్పటికీ, హృదయ రోగులకు చేపల ప్రయోజనాలను నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు చేపట్టాల్సి  ఉంది.

(మరింత చదువు: హార్ట్ డిసీజ్ నివారణ)

చేపలను తినడంవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని తినడంవల్ల మనకు భౌతిక మరియు మానసిక లాభాలు చేకూరుతాయి. అయినప్పటికీ, చేపల్ని అధికంగా తినడంవల్ల ఆరోగ్య సమస్యలు ఉద్భవించొచ్చు.

  • చేపలెక్కువగా తింటే అధిక రక్త చక్కెరలకు దారి తీస్తుంది
    అధిక మొత్తంలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లున్న పదార్థాల్ని తినడంవల్ల చక్కెరవ్యాధి ఉన్నవారిలో రక్తచక్కెరలు పెరిగేందుకు దారి తీయవచ్చు. ఒమేగా -3 కొవ్వు ఆమ్లం యొక్క ఎక్కువ మోతాదు రక్తంలో చక్కెరల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తుంది. 2016 లో నిర్వహించిన పరిశోధన ప్రకారం, 6 నెలల కన్నా ఎక్కువకాలంపాటు చేప నూనెను తింటున్న రోగులకు చక్కెర స్థాయిలలో తేలికపాటి పెరుగుదల కన్పించింది.
  • చేపల వల్ల వచ్చే అలర్జీలు
    కొంతమంది వ్యక్తులు కొన్ని రకాల చేపలకు సహజంగానే అలెర్జీగా ఉండవచ్చు.
  • చేపలు విషపూరితం కావచ్చు
    కొన్ని చేపలు పాదరసం (mercury) వంటి విషాలతో కలుషితమవుతాయి. కలుషితమైన చేపలను తరచుగా తినడం వలన పిల్లలలో మూర్ఛవ్యాధికి దారి తీయొచ్చు మరియు మెదడు కూడా దెబ్బతినవచ్చు.
  • చేప ముల్లులు గొంతులో అడ్డుపడి ఊపిరాడకుండా చేస్తాయ్  
    అనేక ప్రాణాంతక సంఘటనలు చేపముల్లులు గొంతుకు అడ్డుపడ్డం కారణంగా సంభవిస్తుంటాయి, ఇది కేవలం ప్రమాదవశాత్తు అయినప్పటికీ ఇది వాస్తవం
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

చేపల్లో విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు (ఫ్యాటీ యాసిడ్లకు) పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి మరియు మెదడుకు ఎంతో ఉపయోగకరం, కానీ మరోవైపు, చేపలు తినడంవల్ల కొన్ని ప్రతికూలతలు కూడా  కలుగుతాయి. వ్యక్తిగత జీవపరమైన (biological) ప్రాధాన్యతలకు అనుగుణంగా చేపల్ని తినడం మంచిది. అయినప్పటికీ, రోజువారీగా చేపలను తినడానికి ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు, మరి అందుకే, చేపలు మాధుర్యకరమైన ఆహార విభాగంలో చేరిపోయింది.

చేపలవల్ల కలిగే ప్రతికూలతలను నిరోధించేందుకు చేపల్ని మితంగా, పర్యవేక్షణలో తినడం మంచిదని సూచించడమైంది. చేపల్ని అధికంగా తినడంవల్ల ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలను నివారించడానికి వ్యక్తి  తన సొంత వివేకంతో మితంగా తినడం మంచిదని సలహా ఇవ్వడమైంది.

(మరింత సమాచారం: గుండె వ్యాధుల నివారణ)

వనరులు

  1. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 15076, Fish, salmon, Atlantic, wild, raw. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
  2. Walter Alexander. Prostate Cancer Risk And Omega-3 Fatty Acid Intake From Fish Oil. P T. 2013 Sep; 38(9): 561–564. PMID: 24273402
  3. He K et al. Fish consumption and incidence of stroke: a meta-analysis of cohort studies. Stroke. 2004 Jul;35(7):1538-42. Epub 2004 May 20. PMID: 15155968
  4. Daniels JL et al. Fish intake during pregnancy and early cognitive development of offspring. Epidemiology. 2004 Jul;15(4):394-402. PMID: 15232398
  5. Jyrki K Virtanen et al. Fish Consumption, Bone Mineral Density, and Risk of Hip Fracture Among Older Adults: The Cardiovascular Health Study . J Bone Miner Res. 2010 Sep; 25(9): 1972–1979. PMID: 20572022
  6. J A Bastiaansen, et al. The efficacy of fish oil supplements in the treatment of depression: food for thought . Transl Psychiatry. 2016 Dec; 6(12): e975. PMID: 27922634
  7. Huan Yang, Pengcheng Xun, Ka He. Fish and Fish Oil Intake in Relation to Risk of Asthma: A Systematic Review and Meta-Analysis . PLoS One. 2013; 8(11): e80048. PMID: 24265794
  8. K H Basavaraj, C Seemanthini, R Rashmi. DIET IN DERMATOLOGY: PRESENT PERSPECTIVES . Indian J Dermatol. 2010 Jul-Sep; 55(3): 205–210. PMID: 21063507
  9. Cakiner-Egilmez T. Omega 3 fatty acids and the eye. Insight. 2008 Oct-Dec;33(4):20-5; quiz 26-7. PMID: 19227095
  10. C H MacLean et al. Effects of omega-3 fatty acids on lipids and glycemic control in type II diabetes and the metabolic syndrome and on inflammatory bowel disease, rheumatoid arthritis, renal disease, systemic lupus erythematosus, and osteoporosis. Evid Rep Technol Assess (Summ). 2004 Mar; (89): 1–4. PMID: 15133890
  11. Aryeh D Stein et al. Growth to Age 18 Months Following Prenatal Supplementation with Docosahexaenoic Acid Differs by Maternal Gravidity in Mexico. J Nutr. 2011 Feb; 141(2): 316–320. PMID: 21178082
  12. Yang H, Kenny A. The role of fish oil in hypertension. Conn Med. 2007 Oct;71(9):533-8. PMID: 17966723
  13. Luc Djoussé et al. Fish consumption, omega-3 fatty acids and risk of heart failure: a meta-analysis . Clin Nutr. 2012 Dec; 31(6): 846–853. PMID: 22682084
  14. Susan K. Raatz et al. Issues of Fish Consumption for Cardiovascular Disease Risk Reduction. Nutrients. 2013 Apr; 5(4): 1081–1097. PMID: 23538940
Read on app