మల్టిపుల్ స్క్లిరోసిస్ - Multiple Sclerosis in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

December 10, 2018

July 31, 2020

మల్టిపుల్ స్క్లిరోసిస్
మల్టిపుల్ స్క్లిరోసిస్

మల్టిపుల్ స్క్లెరోసిస్ (MS) అంటే ఏమిటి?

మల్టిపుల్ స్క్లెరోసిస్ (అనేక రకాలుగా రక్తనాళాలు గట్టిపడడం) అనేది మెదడు, వెన్నెముక మరియు కళ్ళ యొక్క నరాలను దెబ్బతీసే ఓ దీర్ఘకాల వ్యాధి. శరీర రోగనిరోధక వ్యవస్థ దాని స్వంత కణజాలంపై దాడిచేసిన కారణంగా సంభవించేదే మల్టి స్క్లెరోసిస్ వ్యాధి, అందుకే ఇది స్వయం ప్రతిరక్షక వ్యాధిగా చెప్పబడుతుంది. మెదడు మరియు వెన్నెముకలో నాడీ ఫైబర్స్ చుట్టూ ఉండే మైలిన్ అనే కొవ్వు పదార్థాన్ని ఈ వ్యాధి దెబ్బ తీస్తుంది. ఈ మైలిన్ కొవ్వుపదార్థాన్ని ఈ రుగ్మత దెబ్బతీయడంవల్ల నాడీ వ్యవస్థలో మార్పులు జరగడమో లేదా సందేశాలు రవాణా కావడం ఆగిపోయే పరిస్థితికి దారితీస్తుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఈ వ్యాధి లక్షణాలను ప్రాధమిక, ద్వితీయ మరియు తృతీయ వర్గాలుగా కింది విధంగా వర్గీకరించబడ్డాయి:

ప్రాథమిక లక్షణాలు

సాధారణమైనవి

  • తిమ్మిరి మరియు జలదరించటం
  • దురద
  • మంట (బర్నింగ్)
  • నడవడానికి కష్టపడడం (అలసట , బలహీనత, దుస్సంకోచ స్థితి [స్పాస్టిసిటీ], సంతులనం లేదా కదలికల నష్టం కారణాల వల్ల )
  • దృష్టి సమస్యలు
  • మలబద్దకం మరియు మూత్రాశయం పనిచేయకపోవడం
  • మైకము
  • లైంగిక సమస్యలు

అరుదైన లక్షణాలు

ద్వితీయ (సెకండరీ) లక్షణాలు

తృతీయ లక్షణాలు

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

మల్టిపుల్ స్క్లెరోసిస్ కు కారణం తెలియదు. అయితే, పర్యావరణ మరియు జన్యు కారకాలు ఈ వ్యాధికి బాధ్యత వహిస్తున్నట్లు గోచరిస్తుంది.

మల్టిపుల్ స్క్లెరోసిస్ కు కారణమయ్యే ప్రమాద కారకాలు క్రింది విధంగా ఉన్నాయి:

  • 15 మరియు 60 సంవత్సరాల మధ్య వయసులోని వ్యక్తులు సాధారణంగా ఈ రుగ్మతకు ప్రభావితమవుతారు
  • పురుషులు కంటే ఎక్కువ మంది మహిళలు మల్టిపుల్ స్క్లెరోసిస్ ను కలిగి ఉన్నారు
  • మల్టిపుల్ స్క్లెరోసిస్ యొక్క కుటుంబ చరిత్ర
  • ఎప్స్టీన్-బార్ వైరస్ వంటి వైరస్లు మల్టిపుల్ స్క్లెరోసిస్ కు సంబంధం కలిగి ఉన్నాయి
  • థైరాయిడ్ వ్యాధి, మధుమేహం లేదా ప్రేగుల్లో మంట వ్యాధి కలిగిన వారు మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధికి మరింతగా గురయ్యే ప్రమాదముంది
  • రక్తంలో విటమిన్ D స్థాయిలు తక్కువగా ఉండడం
  • భూమధ్యరేఖ నుండి దూరంగా నివసిస్తుండడం
  • ఊబకాయం
  • ధూమపానం

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

మల్టిపుల్ స్క్లెరోసిస్ యొక్క లక్షణాలు అనేక ఇతర నరాల రుగ్మతల లక్షణాల్ని అనుకరిస్తుంది కాబట్టి, ఈవ్యాధి యొక్క నిర్ధారణ కష్టం.

డాక్టర్ మీ వైద్య చరిత్రను అడుగుతాడు మరియు మీ మెదడు, వెన్నుముక, మరియు నేత్రనాడుల్లో నరాలు దెబ్బ తిన్నాయా లేదా అనే విషయాన్ని తెలిపే సంకేతాల్ని  పరిశీలిస్తారు.

కింది పరీక్షలు మల్టిపుల్ స్క్లెరోసిస్ ను విశ్లేషించడానికి సహాయపడుతాయి:

  • రక్త పరీక్షలు ఇలాంటి లక్షణాలనే కలిగి ఉన్న వ్యాధుల్ని తోసిపుచ్చడానికి చేస్తారు. .
  • నరాల పనితీరును నిర్ణయించటానికి అవయవాల సంతులనం, సమన్వయం (కోఆర్డినేషన్), దృష్టి, మరియు ఇతర పని తీరుల అంచనా.
  • శరీరం యొక్క నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని మాగ్నెటిక్ రెసోనాన్స్ ఇమేజింగ్ (MRI) పరీక్షలు చేస్తారు.
  • ప్రోటీన్లలో ఏదైనా అసాధారణతను గుర్తించడానికి సెరెబ్రోస్పానియల్ ద్రవం పరీక్ష.
  • మీ మెదడులోని విద్యుత్ చర్యను పరీక్షించే పరీక్షలు.

మల్టిపుల్ స్క్లెరోసిస్  కోసం ఎటువంటి నివారణ లేదు, కానీ అనేక రకాల చికిత్సలు శరీరం తన విధులు విర్వర్తించడాన్ని మెరుగుపరుస్తాయి. ఆ చికిత్సలు కిందివిధంగా ఉన్నాయి:

  • వ్యాధి క్రమాన్ని తగ్గించడానికి, వ్యాధి దాడులను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి మరియు వ్యాధి లక్షణాలను తగ్గించడానికి మందులు సూచించబడతాయి. స్టెరాయిడ్లు మల్టిపుల్ స్క్లెరోసిస్ దాడిని తక్కువ వ్యవధుల్లో వుండేట్లుగా చేసేందుకు మరియు తక్కువ తీవ్రతాను కల్గిఉండేవిగా చేసేందుకు సహాయపడతాయి. కండరాల బిగుతుదనాన్ని  తగ్గించేందుకు ట్రాంక్విలైజర్లు లేదా విశ్రామక మందులు తోడ్పడతాయి.
  • ఫిజియోథెరపీ బలం పుంజుకునేందుకు మరియు సంతులనం పొందడానికి సహాయపడుతుంది మరియు అలసట మరియు నొప్పి నిర్వహణలోనూ ఫిజియోథెరపీ సహాయపడుతుంది.
  • ఊతకర్ర, వాకర్ లేదా కట్టు బంధకం అనే పరికరాలు మరింత సులభంగా నడవడానికి మీకు సహాయపడుతాయి.
  • వ్యాయామం మరియు యోగ అనే వాటి అభ్యాసం అలసట లేదా ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడతాయి.



వనరులు

  1. National Multiple Sclerosis Society [Internet]: New York,United States; What Is MS?
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Multiple Sclerosis: Hope Through Research.
  3. Ghasemi N, Razavi S, Nikzad E. Multiple Sclerosis: Pathogenesis, Symptoms, Diagnoses and Cell-Based Therapy. Cell J. 2017 Apr-Jun;19(1):1-10. PMID: 28367411
  4. National Center for Complementary and Integrative Health [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Multiple Sclerosis.
  5. National Institute of Neurological Disorders and Stroke [internet]. US Department of Health and Human Services; Multiple Sclerosis Information Page.

మల్టిపుల్ స్క్లిరోసిస్ వైద్యులు

Dr. Vinayak Jatale Dr. Vinayak Jatale Neurology
3 Years of Experience
Dr. Sameer Arora Dr. Sameer Arora Neurology
10 Years of Experience
Dr. Khursheed Kazmi Dr. Khursheed Kazmi Neurology
10 Years of Experience
Dr. Muthukani S Dr. Muthukani S Neurology
4 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

మల్టిపుల్ స్క్లిరోసిస్ కొరకు మందులు

Medicines listed below are available for మల్టిపుల్ స్క్లిరోసిస్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.