కండరాల సంకోచాలు (బిగుసుకుపోవడం) - Muscle Spasms in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

December 23, 2018

March 06, 2020

కండరాల సంకోచాలు
కండరాల సంకోచాలు

కండరాల సంకోచాలు (బిగుసుకుపోవడం) అంటే ఏమిటి?

కండరాల బిగుసుకుపోవడం లేదా కండరాల సంకోచాలు అనేవి ఎప్పుడు సంభవిస్తాయంటే ఒక కండరం బలవంతంగా సంకోచించినపుడు అది బిరుసుగా లేదా గట్టిగా తయారై అది తిరిగి సడలింపును పొందడంలో (in getting relax) విఫలమవుతుంది. ఈ పరిస్థితి వ్యక్తిని నడిచేటప్పుడు తీవ్రంగా కష్టపెడుతుంది, కదలడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సంకోచానికి గురైన భాగాన్ని కదిపేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. శరీరంలో ఏ కండరమైనా హఠాత్సంకోచం రుగ్మతకు గురి కావచ్చు, కానీ చాలామటుకు ఈ రుగ్మతవల్ల బాధింపబడేవి కాళ్లలోని పిక్కలు, తొడనరాలు (హామ్ స్ట్రింగ్స్), పాదాల కండరాలు మరియు పొత్తికడుపు  కండరాలు.

దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఏ వయస్సువారికైనా, ఆడవారికైనా, మగవాళ్ళకైనా మరియు ఎప్పుడైనా ఎక్కడైనా కండరాల హఠాత్సంకోచాలు సంభవించవచ్చు. కండరాల బిగింపు (దీన్నే కండరాలు పట్టేయడం అంటారు), కీళ్ళు కదిలించడంలో అసమర్థత, సులభంగా కదల్లేకపోవడం ) లేక పరిమితమైపోయిన కదలికలు) అసాధారణ భంగిమ, కీళ్ళలో పెడసరం, చాలా అరుదుగా హఠాత్సంకోచానికి గురైన కీళ్లు పనిచేయకపోవడం అనేవి కండరాల హాఠాత్సంకోచం రుగ్మతతో గుర్తించబడే వివిధ వ్యాధి లక్షణాలు. పరీక్షగా పరిశీలిస్తే ఓ అతిశయోక్తికరమైన సహజప్రతిక్రియ (రిఫ్లెక్స్ స్పందన)ను చూడొచ్చు, మరియు బాధకు గురైన కండరాన్ని  తాకితేనే బాధాకరమైన నొప్పి కల్గుతుంది.

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

కండరాల హాఠాత్సంకోచంతో సంబంధం ఉన్న కొన్ని ప్రేరేపక కారకాలు ఉన్నాయి. వీటిలో మితిమీరిన కండరాల వాడుక, బరువుతో కూడిన వ్యాయామ శిక్షణను (weight training) చాలా చేయటం, సాగదీసే కసరత్తుల్ని క్రమంగా  చేయకపోవడం, డీహైడ్రేషన్ (నిర్జలీకరణము) మరియు కొందరు స్త్రీలలో ముట్టు కావడానికి ముందు ఈ కండరాల హాఠాత్సంకోచం సంభవించవచ్చు.

కండరాల హాఠాత్సంకోచం కొన్ని అంతర్లీన వైద్య రుగ్మతల కారణంగా కూడా సంభవించవచ్చు. అలాంటి అంతర్లీన వైద్య రుగ్మతలేవంటే ఎలక్ట్రోలైట్ అసమతుల్యత , కండరాలకు సరైన రక్త సరఫరా లేకపోవడం, నరాల సంపీడనం, గర్భం, శాశ్వత పక్షవాతం, స్ట్రోక్ మరియు అరుదుగా సంభవించే నరాల వ్యవస్థ దెబ్బ తినడంతో వచ్చే “క్రాబ్బ్ వ్యాధి”

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

రోగనిర్ధారణ అనేది ఏవైనా ప్రేరేపక కారకాల యొక్క ఉనికిని గుర్తించేందుకు సమగ్ర వైద్య చరిత్ర పరిశీలనపై ఆధారపడి ఉంటుంది. రోగి యొక్క చరిత్రే రోగానికి సంబంధించిన వివరాల్ని స్పష్టం చేస్తుంది కాబట్టి దీనికి ఏ రకమైన రక్త పరీక్షలను నిర్వహించవలసిన అవసరం లేదు.

తాపన ప్యాడ్తో వేడి కాపడం పెట్టడం, మృదువుగా సాగదీసి మర్దన చేయడం,  రుద్దడం వంటి ప్రక్రియలు సాధారణంగా సంకోచానికి గురైన కండరాలకు విశ్రాంతినివచ్చు. కండరాల హాఠాత్సంకోచాలవల్ల నొప్పులు తీవ్రంగా ఉన్నా లేదా అవి అట్లాగే కొనసాగుతున్నట్లైతే లేదా  కండరాల సంకోచాల కారణంగా అసౌకర్యం మరింతగా పెరుగుతున్నా లేదా కదలికల్లో అసమర్థత ఉంటే చికిత్స అవసరమవుతుంది. లక్షణాలు తీవ్రత మరియు స్వభావం ఆధారంగా, మీ డాక్టర్ మీకు కొన్ని కండరాల సడలింపులను అభ్యాసం చేయమని సూచించి, నరాల బ్లాకర్స్, మత్తుమందులు మరియు వాపు నిరోధక మందులు సేవించమని  సలహా చేయవచ్చు. ఈ మందుల్ని సాధారణంగా 5 రోజులకు మాత్రమే ఇవ్వబడతాయి. స్టెరాయిడ్లను సాధారణంగా ఉపయోగించరు. ఈ మందులలో కొన్ని మగత, వికారం మరియు గందరగోళం వంటి దుష్ప్రభావాలను కల్గించేవిగా ఉన్నాయి. మందులు సహాయపడనప్పుడు శస్త్రచికిత్స (సర్జరీ) సిఫారసు చేయబడుతుంది మరి ఈ శస్త్ర చికిత్సలో బాధిత భాగంలో స్నాయువును విడుదల చేయడమనేది ఉంటుంది.

స్వీయ రక్షణలో భాగంగా పర్యవేక్షణతో కూడిన క్రమమైన సాధారణ సాగతీత వ్యాయామాలు ఉంటాయి, చాలా బిగుతుగా ఉండే బట్టలు ధరించక పోవడం, నీటిని, ద్రవాహారాల్ని  దండిగా సేవించడం (మంచి హైడ్రేషన్) మరియు తగినంతగా నిద్రపోవడం చేయాలి.

కండరాల హాఠాత్సంకోచానికి చికిత్స చేయడం చాలా ముఖ్యం. దీనికి చికిత్స చేయకపోతే   కీళ్ల పెడసరం, చలనశీలతను కోపోవడం మరియు కండరాల నష్టానికి గురికావాల్సి వస్తుంది.



వనరులు

  1. Krismer M, van Tulder M. Strategies for prevention and management of musculoskeletal conditions. Low back pain (non-specific). Best Pract Res Clin Rheumatol. 2007;21:77–91. PMID: 17350545
  2. Skootsky SA, Jaeger B, Oye RK. Prevalence of myofascial pain in general internal medicine practice. West J Med. 1989;151:157–160. PMID: 2788962
  3. Salaffi F et al. Health-related quality of life in multiple musculoskeletal conditions: a cross-sectional population based epidemiological study. II. The MAPPING study. Clin Exp Rheumatol. 2005;23:829–839. PMID: 16396701
  4. McCleskey EW, Gold MS. Ion channels of nociception. Annu Rev Physiol. 1999;61:835–856. PMID: 10099712
  5. Reinöhl J et al. Adenosine triphosphate as a stimulant for nociceptive and non-nociceptive muscle group IV receptors in the rat. Neurosci Lett. 2003;338:25–28. PMID: 12565132
  6. Hoheisel U et al. Acidic pH and capsaicin activate mechanosensitive group IV muscle receptors in the rat. Pain. 2004;110:149–157. PMID: 15275762

కండరాల సంకోచాలు (బిగుసుకుపోవడం) వైద్యులు

Dr. G Sowrabh Kulkarni Dr. G Sowrabh Kulkarni Orthopedics
1 Years of Experience
Dr. Shivanshu Mittal Dr. Shivanshu Mittal Orthopedics
10 Years of Experience
Dr. Saumya Agarwal Dr. Saumya Agarwal Orthopedics
9 Years of Experience
Dr Srinivas Bandam Dr Srinivas Bandam Orthopedics
2 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

కండరాల సంకోచాలు (బిగుసుకుపోవడం) కొరకు మందులు

Medicines listed below are available for కండరాల సంకోచాలు (బిగుసుకుపోవడం). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.