చక్కెర వ్యాధి - Diabetes in Telugu

Dr. Anurag Shahi (AIIMS)MBBS,MD

December 14, 2018

October 09, 2021

చక్కెర వ్యాధి
చక్కెర వ్యాధి

సారాంశం 

మీకు తెలుసా? రక్తంలో నిరంతరం పెరిగిపోతుండే చక్కర స్థాయిలు శరీరంలోని ఇతర ముఖ్య అవయవాలకు చేటు చేస్తాయని? అందుకే "చక్కర వ్యాధి మరింత విపరీతమయ్యే   పరిస్థితిని తెచ్చుకోకు" అంటూ మీ వైద్యులు, మీ శ్రేయస్సు కోరే మీ కుటుంబ సభ్యులు సతతం పట్టు బట్టి మరీ మీకు చెబుతూనే ఉంటారు.

షుగర్ వ్యాధి స్త్రీ-పురుషులెవరికైనా, ఏ వయసు వారికైనా రావచ్చు. ఈ వ్యాధినే డయాబెటీస్ అని మధుమేహవ్యాధి అని కూడా వ్యవహరిస్తారు. రక్త ప్రసరరణలో చక్కర శాతం ఎక్కువవటాన్ని బట్టి ఈ వ్యాధిని గుర్తించవచ్చు. ముఖ్యంగా, షుగర్ వ్యాధిని ‘టైపు 1’ మరియు ‘టైపు 2’ అని ‘ రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఇంకా, చిన్నపిల్లలు, గర్భిణీ స్తీలకు వచ్చే షుగర్ వ్యాధి  మరియు ‘ప్రీ-డయాబెటీస్’ అనే మరో మూడు రకాలుగా కూడా ఈ వ్యాధిని వర్గీకరించారు. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు వైద్యనిపుణులు తమ పరిశోధనల ద్వారా కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఈ షుగర్ వ్యాధి, గుడ్డితనం, గుండె సంబంధ వ్యాధులు, అంగఛేదనం (amputation) వంటి అతి ప్రమాదకర జబ్బులతో ముడిపడి ఉంది. కనుక షుగర్ వ్యాధిని సరిగా నయం చేసుకోకపోతే పైన పేర్కొన్న ప్రమాదకర జబ్బులకు లోనయ్యే ప్రమాదముందని వైద్యులు  హెచ్చరిస్తున్నారు. అయితే, షుగర్ వ్యాధిని, అది ముదరక మునుపే, ముందుగానే గుర్తించి ఆహారం, జీవన విధానంలో మార్పులు, మందులు, నిత్యవ్యాయామం మరియు కొన్ని చికిత్సల ద్వారా దీనిని పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.

చక్కెరవ్యాధి అంటే ఏమిటి? - What is diabetes?

మానవ శరీర రక్తప్రసరణలో అధిక స్థాయి గ్లూకోజ్ (చక్కెర) ను కలిగున్న పరిస్థితే కాక మరి కొన్ని జబ్బులతో బాధపడుతున్న రోగి స్థితిని ‘డయాబెటిస్’ అనే ఒక విస్తారమైన పదంతో చెబుతున్నారు. డయాబెటిస్ నేడు ప్రపంచవ్యాప్త అంటువ్యాధిగా వేగంగా ప్రబలుతోంది. ఒక్క భారతదేశంలోనే 7.3 కోట్ల మంది చక్కర వ్యాధితో వ్యధపడుతున్నారు. చక్కర వ్యాధి తరచుగా దీర్ఘకాలికంగా ఉండే జబ్బు. జబ్బు  ముదరక ముందే సరైన సమయంలో వ్యాధిని నయం చేయకపోతే ప్రమాదకరమైన దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుంది. గతంలో భావించినట్లుగా చక్కర వ్యాధి కేవలం వయసు ముదిరిన వారికి మాత్రమే వచ్చే వ్యాధి కాదు. వయసుతో నిమిత్తం లేకుండా ఆడ-మగా అనే తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు షుగర్ వ్యాధి. అయితే కొన్ని వైద్య అధ్యయనాలు చెప్పటాన్ని బట్టి చూస్తే 40 సంవత్సరాలకు పైబడ్డ వారికి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది

చక్కెర వ్యాధి రకాలు - Types of Diabetes in Telugu

షుగర్ వ్యాధి పలు రకాలు. అయితే మొదట, ‘టైప్ 1 మధుమేహం’ మరియు ‘టైప్ 2 మధుమేహం’ అనే రెండు ప్రధాన రకాలను వివరిస్తామిక్కడ.  --

ప్రీడయాబెటస్ స్థాయి 

ప్రీడయాబెటిస్ అనేది ఒక సూచిక రకం, మరియు తరచూ దీన్ని "బోర్డర్ లైన్ డయాబెటిస్" గా కూడా సూచిస్తారు. పరగడుపున్నే మరియు భోంచేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉన్నట్లయితే డాక్టర్ దీన్ని “ప్రీ-డయాబెటిస్” స్థాయిగా గుర్తిస్తాడు. ప్రీడయాబెటిస్ స్థాయిలో ఉన్నవారు పలు చర్యలు చేపట్టడం ద్వారా రెండో టైపు (Type 2) చక్కెరవ్యాధిని నివారించవచ్చు లేదా వాయిదా వేస్తూ వ్యాధి సోకడాన్ని విలంబం చేస్తూ పోవచ్చు అని పరిశోధనలు చెబుతున్నాయి. మరి ఆ చర్యలేవంటే చెక్కెరవ్యాధికి నిర్దేశించిన ఆహారాన్ని తీసుకోవడం, ఆహారంలో కార్బోహైడ్డ్రే ట్లను, సంస్కరించిన పంచదారను, ప్రాసెస్ చేసిన ఆహారాలను, బేకరీ పదార్థాలను గణనీయంగా తగ్గించడం. ఇంకా,  ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని అలవర్చుకుని, భౌతిక వ్యాయామ క్రీడలైన ఈత, జాగింగ్, జిమ్మింగ్, సైక్లింగ్ మరియు 45 నిముషాల వేగవంతమైన నడక వంటి వాటిని దిననిత్యం సాధన చేయడంవల్ల రెండో టైపు చక్కెరవ్యాధిని దూరం ఉంచవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

 • టైప్ 1 
  టైప్ 1 డయాబెటీస్’ ఇన్సులిన్ ఆధారిత డయాబెటిస్, తరచుగా పిల్లలు మరియు 30 సంవత్సరాలలోపు వారిలో గుర్తించిన జబ్బు. ఈ ‘టైప్ 1 మధుమేహా ’ నికి గురైన వారు ప్రపంచంలోని మధుమేహం రోగుల్లో 10 శాతం ఉంటారని నమ్ముతారు. దెబ్బతిన్న ప్యాంక్రియాటిక్ బీటా కణాల వలన మానవ శరీరం ఇన్సులిన్ ను    తక్కువగా లేదా అసలు ఇన్సులిన్ నే ఉత్పత్తి చేయనప్పుడు ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. దీనివల్ల శరీరంలో గ్లూకోజ్ నిల్వ ఉండదు మరియు శక్తి రూపంలో ఉపయోగించబడదు, తద్వారా రక్తప్రసరణలో ఎక్కువ చక్కెర (గ్లూకోజ్) జమవ్వటానికి దారితీస్తుంది.

  టైప్ 1 డయాబెటీస్ లో మళ్ళీ రెండు ఉప-రకాలున్నాయి:  
  • చిన్నపిల్లల్లో డయాబెటీస్: 19 సంవత్సరాల వయస్సులోపు పిల్లలకు వచ్చే షుగర్ జబ్బు రకం. ఇన్సులిన్ పై  జీవితాంతం ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఇది. చిన్న పిల్లలకు ఇన్సులిన్ ఇంజెక్షన్ల నిర్వహణ సాధారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులు మరియు నర్సులు పర్యవేక్షిస్తారు. టీనేజ్ వయసు వారిలో వచ్చే డయాబెటిక్ వ్యాధికి  వైద్యులు సిఫార్సు చేసిన విధంగా ఇన్సులిన్ షాట్ల స్వీయ నిర్వహణను కూడా నిర్వహించుకోవచ్చు. అంటే టీనేజ్ వయసు షుగర్ వ్యాధి రోగులు తమంతట తామే ఇన్సులిన్ షాట్లను తీసుకోవచ్చు.
  • లాడా : ‘టైప్ 1 డయాబెట’ వర్గంలో ‘టైప్ 2 మధుమేహం’ కలిగిన రోగులు కూడా ఉంటారు. ఎందుకంటే ఈ రోగులు లాడా (LADA - లాంట్ ఆటోఇమ్యూన్ డయాబెటిస్ అడల్ట్ హుడ్) అని పిలవబడే ప్యాంక్రియాస్ యొక్క బీటా కణాల నుండి ఇన్సులిన్ స్రావం కారణంగా టైప్ 1 యొక్క పరిస్థితులను అనుకరిస్తారు.
    
 • టైప్ 2 డయాబెటీస్ (లేదా టైప్ 2 మధుమేహం): 
   పరిశోధకుల ప్రకారం ‘టైప్ 2 మధుమేహం’ చాలా సాధారణమైనది మరియు ప్రధానమైనది. అవసరమైనంత ఇన్సులిన్ ను శరీరం ఉత్పత్తి చేయలేకపోయినపుడు లేదా శరీరం ‘ఇన్సులిన్ సెన్సిటివిటీ’ అని పిలువబడే స్థితికి గురై ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ని ఉపయోగించుకోలేక  పోయినపుడు ‘టైప్ 2 మధుమేహం’ రోగికి సంభవిస్తుంది. ఈ వైఫల్యం కారణంగా, గ్లూకోజ్ (చక్కెర) రక్తంలో అధికంగా జమవుతుంది. ఫలితంగా, శరీరంలో చక్కర స్థాయి విపరీతంగా పెరుగుతుంది. ‘టైప్ 2 డయాబెటీస్’ సాధారణంగా 30 ఏళ్ళు పైబడిన వారికి దాపురించే అవకాశం ఉందని, కాని ఇది చాలా చిన్న పిల్లల్లో కూడా సంభవిస్తుందని ముఖ్యమైన అధ్యయనాలు సూచిస్తున్నాయి. ‘టైప్ 2 డయాబెటీస్’ తరచుగా జన్యుపరమైందని మరియు ఇది ఒక తరం నుండి మరొక తరానికి పాకనూవచ్చని అధ్యయనాలు అనుమానపడుతున్నాయి.  ‘టైప్ 2 డయాబెటీస్’ లేదా ‘రెండో రకం మధుమేహం’ బారిన పడ్డ రోగుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరగడానికి అనారోగ్యకరమైన జీవనశైలి, తక్కువ శారీరక శ్రమ లేక అసలు శరీరపరిశ్రమే చేయకపోవడం, ఒత్తిడి మరియు సరి అయిన ఆహారం తీసుకోకపోవడమేనని అధ్యయనాలు చెబుతున్నాయి.
   
 • గర్భిణీ స్త్రీలలో వచ్చే చక్కర వ్యాధి: 
  పేరు సూచించినట్లుగా ఈ చక్కర వ్యాధి గర్భధారణ సమయంలో స్తీలకు వాటిల్లుతుంది,  సాధారణంగా గర్భం దాల్చిన తదుపరి దశలలో తల్లికిది వచ్చే అవకాశం ఉందని మరియు అధిక రక్త - గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు గర్భం దాల్చిన తల్లిలో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ చక్కర వ్యాధి శిశువు యొక్క డెలివరీ తర్వాత  అదృశ్యమవుతుందని పరిశోధనల్లో గమనించబడింది. అలాగని దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం ను ముందుగానే గుర్తించి చికిత్స ద్వారా సమర్థవంతముగా నిర్వహించకపో తే, తల్లికి మరియు బిడ్డకు సంక్లిష్టతను కలిగిస్తుంది. మీరు మీ స్వంత మందులను తీసుకోవద్దని మరియు మీకు అవసరమైన జాగ్రత్తలు మరియు చర్యలను తీసుకోవటానికి మీ వైద్యుని సలహాను తీసుకోవాలని  సిఫారసు చేయడమైనది.

చక్కెరవ్యాధి లక్షణాలు - Symptoms of Diabetes in Telugu

మధుమేహం లేదా షుగర్ వ్యాధి యొక్క లక్షణాలు విలక్షణమైనవి. మన శరీరం ఇచ్చే సంకేతాల వైపు శ్రద్ధవహించి గ్రహిస్తే ఈ వ్యాధి లక్షణాలను త్వరగా గుర్తించవచ్చు. మరో శుభవార్త ఏమంటే ఈ వ్యాధిని ప్రారంభదశలోనే గుర్తించినట్లైతే దీన్ని సమర్థవంతంగా నయం చేయవచ్చు. కాబట్టి, కింది లక్షణాలు గనుక మీకున్నట్లైతే వెంటనే మీ డాక్టరును సంప్రదించండి.  : -

 • ఆకస్మిక ఆకలి మీకు కలగొచ్చు. వెంటనే తినాలన్న విపరీతమైన కోరిక కలగడం.
 • ప్రత్యేకించి రాత్రి వేళల్లో మామూలు కంటే ఎక్కువ సార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సిరావడం.
 • ఎప్పుడూ విపరీతంగా దాహం అనిపంచడం.
 • మీరు అకస్మాత్తుగా, విపరీతంగా బరువు తగ్గిపోవడం.
 • దృష్టి దోషాలైన- అస్పష్ట దృష్టి, ఒకటి రెండుగా గోచరించడం,
 • చాలా సులభంగా అలసిపోవడం, అలసటతో బాధపడటం,
 • పునరావృతమయ్యే అంటువ్యాధులు, ముఖ్యంగా చిగుళ్ళ వ్యాధులు , చర్మం మరియు మూత్రాశయ వ్యాధులు.
 • తెగిన గాయాలు మరియు పుండ్లు మానడానికి సాధారణ సమయం కంటే ఎక్కువ సమయం పట్టడం మీరు గమనించినపుడు
 • మీరు మానసిక కల్లోలం మరియు చిరాకు కు ఎక్కువగా లోనవడం
 • మీ పాదాలు మరియు అరచేతులు మండుతున్నట్లు అనిపించినపుడు
 • పురుషులైతే లైంగిక సమస్యలు ఎదుర్కొంటారు (అంగస్తంభన సమస్యలు). స్థూలంగా ఇవీ చక్కర వ్యాధి లక్షణాలు. 

వైద్యుణ్ణి ఎప్పుడు సంప్రదించాలి 

కింద కనబర్చిన రోగ లక్షణాలతో పాటు మీ శరీరంలో ఎక్కువ స్థాయిలో చక్కర (గ్లూకోస్) నిల్వలు ఉన్నట్లు మీరు గమనించినట్లయితే వెంటనే డయాబెటాలజిస్ట్ లేదా ఎండోక్రినాలజిస్ట్ అనబడే చక్కరవ్యాధి నిపుణుడైన డాక్టర్ ని కలవడం తప్పనిసరి.

 • 300 mg/dl కంటే ఎక్కువ స్థాయిలో స్థిరమైన అధిక రక్త చక్కెర నిల్వలను మీ రక్త నివేదికలు (blood reports) సూచించినపుడు.
 • ఒక కన్ను లేదా రెండు కళ్లలో ఆకస్మికంగా దృష్టిని కోల్పోయినప్పుడు లేదా అస్పష్టతను కలిగినప్పుడు
 • తగిన మందులు వాడినా గాయాలు మానడానికి 5 రోజుల కన్నా ఎక్కువ సమయం పట్టినపుడు లేదా గాయాలు మరింత తీవ్రమయినపుడు .
 • మీరు మీ గర్భధారణ సమయంలో అధిక రక్తచక్కెర స్థాయిలను కలిగి ఉన్నప్పుడు.
 • మీ అరచేతులు మరియు పాదాల్లో మండుతున్నట్లు భావన కల్గినప్పుడు.
 • మీ చేతులు, దవడలు, ఛాతీ మరియు చీలమండలంలో ఆకస్మిక నొప్పి మరియు వాపును అనుభవించినప్పుడు.
 • చర్మంతో పాటు తీవ్రమైన చర్మ వ్యాధులను అనుభవించినప్పుడు (చర్మపు పాలిపోవుట)

చక్కెరవ్యాధికి కారణాలు మరియు ప్రమాద కారకాలు - Causes of Diabetes and Risk Factors in Telugu

శరీరంలో చక్కెరవ్యాధి చోటు చేసుకోవడానికి గల కారణాలను నిశ్చయంగా చెప్పలేం, అంతేగాక ఈ వ్యాధి ఉన్న వ్యక్తి వ్యక్తికీ వ్యాధితీవ్రతలో తేడా ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చే జన్యుసంబంధ లక్షణాలు, నిశ్చలంగా ఎపుడూ కూర్చునే ఉండేటువంటి జీవనశైలి, అనారోగ్యకరమైన  ఆహారపుటలవాట్లు, రోగనిరోధక శక్తి పరిస్థితులు (autoimmune), కొన్ని మందుల సేవనం, ఊబకాయం వంటి కారణాల వల్ల చక్కర వ్యాధి శరీరంలో ఎక్కువగా విస్తరిస్తుంది.

మన ప్యాంక్రియాస్ (జీర్ణ వ్యవస్థ అవయవము) ఇన్సులిన్ అని పిలువబడే ముఖ్యమైన హార్మోనును లేదా అంతర్గత స్రావాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఇది మనం తినే ఆహారం నుండి తీసుకోబడిన గ్లూకోజ్ (చక్కెర) ను సరైనరీతిలో ఉపయోగించుకునేటందుకు  సహాయపడుతుంది. మన శరీరానికి గ్లూకోజ్ ని విచ్ఛిన్నం చేయడం, నిల్వ చేయడం లేదా గ్లూకోజ్ను సరిగ్గా ఉపయోగించడం సాధ్యం కానప్పుడు రక్తప్రసరణలో అధిక స్థాయి గ్లూకోజ్ (చక్కెర) నిల్వలు ఏర్పడడం జరుగుతుంది. రక్తం-గ్లూకోజ్ స్థాయిలు 70 mg/dl - 110 mg/dl ల మధ్య నిర్వహించబడాలని వైద్యులు సిఫారసు చేస్తున్నారు. పైన పేర్కొన్న రక్తం-గ్లూకోజ్ స్థాయిల రీడింగులకు మించినా లేదా తక్కువైనా అలాంటి రీడింగులను డాక్టర్ కు  నివేదించి వైద్యపరంగా దర్యాప్తు చేయించుకోవాలి.

మధుమేహం వ్యాధి పరీక్ష నిమిత్తం కొన్ని పరీక్షలు చేయాలని వైద్యుడు మిమ్మల్ని అడగవచ్చు. ఈ పరీక్షలు ప్రధానంగా  భోజనం తినక ముందు, తిన్న తర్వాత, గ్లూకోస్ ఎక్కువగా ఉండే చక్కర పానీయం సేవించిన తర్వాత రక్తంలో గ్లూకోస్ స్టాయిలెలా ఉన్నాయో తెలుసుకోవడానికి  చేస్తారు. రక్త ప్రసరణలో గ్లూకోస్ (చక్కర) గతి-గమనానికి సంబంధించి మీ శరీరసామర్థ్యం తెలుసుకోవడానికి కింది పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలు చేయడం వల్ల మీకు చక్కర వ్యాధి ఉన్నదీ లేనిదీ మీకు మరియు మీ డాక్టర్ కు నిర్ధారణ అవుతుంది. ఒకవేళ చక్కర వ్యాధి ఉంటే అది ఏ టైపు చక్కర (డయాబెటిస్) వ్యాధియో మీ వైద్యుడు గుర్తించడానికి ఈ పరీక్షలు ఉపకరిస్తాయి. ఆ ప్రకారం, వైద్య సాయము పొందడానికి అవకాశం ఉంటుంది.

ప్రమాద కారకాలు

పైన చెప్పినట్లుగా, మధుమేహం యొక్క ఖచ్చితమైన కారణం తెలియదు. కానీ చక్కర వ్యాధిని బహుశా మరింత తీవ్రతరం చేయడానికి అనేక కారకాలు ఉన్నాయి. ఈ ప్రమాద కారకాలలో కొన్ని:

 • అనారోగ్యకరమైన ఆహారం
 • వంశపారంపర్యంగా మధుమేహం ఉన్న కుటుంబపూర్వీకుల చరిత్ర
 • ఎపుడూ కూర్చునే ఉండేటువంటి (సెడెంటరీ) జీవనశైలి
 • అధిక బరువు ఉండటం
 • గర్భం
 • వయసు
 • కొన్ని మందులు
 • అసాధారణంగా ఉండే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు

పేర్కొన్న ఈ హాని కారకాలు ఏవైనా, లేదా అన్నీ కూడా కలిగి ఉండటం వలన మీకు చక్కెరవ్యాధి రానే వస్తుందని అర్థం కాదు.

చక్కెరవ్యాధి నిర్ధారణ - Diagnosis of Diabetes in Telugu

మీకున్న వ్యాధి  లక్షణాలను బట్టి, రక్త నమూనాల పరీక్ష ద్వారా డాక్టర్ మీకు ఏ రకమైన చక్కర వ్యాధి (అంటే టైప్ 1, టైప్ 2, ప్రిడయాబెటిస్, గర్భధారణ, జువెనైల్ లేదా లాడా-LADA) ఉండేదీ నిర్ధారిస్తారు. 

కెమిస్ట్ దుకాణాలలో లభించే వైద్య సాధనాలతో వ్యాధి   స్వీయ-నిర్ధారణకు పోకుండా డాక్టర్లసహాయం తీసుకొని కింది అత్యవసర పరీక్షలను పూర్తి చేయండి. మీరలా స్వీయ-నిర్ధారణ పరీక్షలు చేసుకుంటే అందులో లోపాలు ఉండే అవకాశం చాలా ఉంటుంది, తద్వారా, మీ రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలను గుర్తించడంలో  విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక, కింది కనబర్చిన అత్యవసర పరీక్షలను పూర్తి చేయడంలో నిపుణులైన వైద్యులు లేదా ఈ వైద్యపరీక్షలను నిర్వహించడంలో వృత్తికారులైనవారి సహాయం తీసుకోవాలని వైద్యులు మీకు సిఫార్సు చేస్తున్నారు.

 • పరగడుపు షుగర్ పరీక్ష: 
  షుగర్ వ్యాధి నిర్ధారణలో ఈ పరీక్ష చాలా ప్రాథమికమైంది. ఉదయాన్నే పరగడుపుతో (అంటే ఉదయమే ఏమీ తినకుండా, తాగకుండా ఖాళీ కడుపుతోనన్న మాట) చేయించుకోవాల్సిన పరీక్ష. (కనీసం 9 నుంచి 12 గంటల వరకూ ఏమీ తినకుండా ఉండాలి.) ఉదయాన్నే కనీసం నీరు కూడా తాగకుండా ఈ పరీక్షకు మీరు వెళ్లవలసి ఉంటుంది. దాహం తట్టుకోలేక పొతే కేవలం కొన్ని గ్రుక్కెళ్ల మంచినీళ్లు తాగండి. ఈ పరీక్షపరగడుపు స్థితిలో మీ రక్తంలో ఎంత చక్కర ఉండేదీ నిర్ధారిస్తుంది.

  ఈ పరీక్షలో 99 ఎం జి./డిఎల్ లకు తక్కువగా రీడింగ్ ఉన్నట్టయితే మీకు షుగర్ నిల్వలు సాధారణంగా ఉన్నాయని చక్కర వ్యాధి లేనట్టేనని అర్థం.  100 నుంచి 120 ఎం జి./డిఎల్ లకు మధ్య మీ రీడింగ్ ఉంటే గనుక చక్కెర వ్యాధికి చేరువలో మీరున్నారన్న మాటే. 126 ఎం జి./డిఎల్ లకు మించి మీ రీడింగ్ ఉంటే మీకు చక్కర వ్యాధి ఉందని నిర్ధారించుకోవచ్చు.
 •  
 • రాండమ్ ప్లాస్మా  గ్లూకోజ్ పరీక్ష:
  వైద్యుడు ఈ ‘రాండమ్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష’ ను భోంచేసిన తర్వాత రోగి రక్తంలో చక్కరనిల్వలు పెరిగాయేమో తెలుసుకోవడానికి నిర్వహిస్తారు. ఈ పరీక్షకు రక్తం నమూనాలను ఇవ్వడానికి మీరు ఎప్పడైనా వెళ్ళవచ్చు ఖాళీ కడుపు లేదా ఉపవాసంతో పోవాల్సిన అవసరం లేదు. ఈ పరీక్షలో 200 mg/dl పైన రీడింగ్ ఉన్నట్లయితే  మీకు డయాబెటీస్ ఉన్నట్లేనని సూచిస్తుంది.
   
 • భోజనానంతర రక్త-గ్లూకోజ్ పరీక్ష -
  భోజనానికి తరువాత రక్తంలో చక్కెర స్థాయిలను ఖచ్చితంగా  తెలుసుకోవడం కోసం డాక్టర్ ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష భోజనం తినడం అయ్యాక సరిగ్గా 2 గంటలకు చేస్తారు. ఈ ప్రత్యేక పరీక్షలో భోజనంఅనంతరం శరీరంలో రక్తం-చక్కెర స్థాయిల సర్దుబాటును అంచనా వేయటానికి డాక్టర్లు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో చక్కర స్థాయిలు సాధారణంగా  పెరగనూ వచ్చు లేదా చాలా తక్కువగా కూడా నమోదు కావచ్చు. ఆరీడింగ్ ని బట్టి డాక్టర్ రోగికి నిర్దిష్ట ఔషధాలను నిర్ణయిస్తారు.
   
 • HbA1C పరీక్ష: 
  చక్కర కాయలా నిర్ధారణ, దాని చికిత్సలో HbA1C పరీక్ష ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ పరీక్ష 3 నెలల్లో (90 రోజులు) సగటు రక్త చక్కెర స్థాయిలను సమర్థవంతంగా లెక్కిస్తుంది. ఈ పరీక్ష కోసం మీరు భోంచేసి వెళ్ళచ్చు. ఉపవాసం ఉండి పోనవసరం లేదు.  ఈ 90 రోజుల్లో మీ చక్కెర స్థాయిలలో వచ్చే హెచ్చు-తగ్గుల సగటు లెక్కించబడుతుంది. దాని ప్రకారం మీరు షుగర్ పేషెంట్ అవునా కాదా అని డాక్టర్ నిర్ణయిస్తారు. ఏదేమైనప్పటికీ, వయస్సు, ఈ పరీక్షా సమయంలో వ్యక్తి వయసు, లింగం, జాతి మరియు కొన్ని వైద్య పరిస్థితులు వంటి కొన్ని పరమితులను వ్యాధి నిర్ధారణకు ఆధారంగా వైద్యులు తీసుకుంటారు. రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులు ఈ HbA1C పరీక్షను తీసుకున్నా ఖచ్చితమైన రీడింగ్ రాక రోగ నిర్ధారణ జరుగదంటున్నారు. ఈ పరీక్ష ప్రకారం, 1 నుంచి 5.7 శాతం వరకు రీడింగ్ ఉన్నవారికి చక్కర సాధారణంగా ఉన్నట్టు లెక్క. 5.8 నుండి 6.4 శాతం వరకు ఉన్నవారు చక్కర వ్యాధి అంచున ఉన్నట్టు అంచనా. 6.4 శాతం అంతకు మించి రీడింగ్ కలిగినవారిని చక్కర కాయిలా లేదా డయాబెటిస్ వర్గానికి చెందిన వారుగా నిర్ధారిస్తారు. 

ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమంటే నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే ఈ పరీక్షలుచేయించుకుని వ్యాధి నిర్ధారణ చేసుకుని చికిత్స తీసుకోవాలి.

చక్కర వ్యాధికి చికిత్స - Diabetes treatment in Telugu

చక్కర వ్యాధి (మధుమేహం లేదా డయాబెటిస్) దీర్ఘకాలికమైనది  అయితే మధుమేహం చికిత్స క్లిష్టమైనదన్నఉద్దేశ్యంలో అర్థం చేసుకోకండి. ఈ రోగానికి సంబంధించిన నిజమేమంటే సరైన మార్గాలను అనుసరించి రోగి ఈ వ్యాధిని అధిగమించ వచ్చు.

 • చికిత్సలో వైవిధ్యం 
  చక్కర వ్యాధికి చికిత్స ఆ వ్యక్తికి ఉన్న వ్యాధి ఉధృతిని బట్టి ఉంటుంది. షుగర్ వ్యాధి రకాలైన  టైప్ 1, టైప్ 2, గర్భధారణ మధుమేహం అనుసరించి చికిత్స ఉంటుంది.
   
 • చికిత్సను త్వరగా ప్రారంభం అయ్యేట్లు చూడండి 
  డయాబెటిస్ కు  ఔషధ చికిత్స సాధ్యమైనంత త్వరలో ప్రారంభం కావాలి. ఎంత త్వరగా మందులు తీసుకుంటే అంత త్వరగా ఈ రోగం నుండి బయట పడవచ్చనేది డాక్టర్ల అభిప్రాయం.
   
 • ఔషధ సమ్మతి:
  ఔషధ సమ్మతి: చక్కర వ్యాధి చికిత్సా సమయంలో సరైన పథ్యం (అంటే తినాల్సినవి తింటూ తినకూడనివి తినకుండా ఉండడమన్నమాట) ఉండాలి. రోజువారీ మందులు సరైన సమయంలో క్రమబద్ధంగా తీసుకోవడం తప్పనిసరి.  పథ్యం పాటించక పోయినా, సరైన మోతాదులో క్రమంగా మందులు తీసుకోకపోయినా రక్తంలో చక్కెర స్థాయిలు, ఆకస్మికంగా పడిపోవటం లేదా పెరగడం జరిగి వ్యాధి ఉధృతమయ్యే ప్రమాదం ఉంది.
   
 • ఆహార సేవనంలో (డైట్) సవరణ 
  ఆహార సేవనంలో (డైట్) సవరణ - తక్కువ చక్కెర, తక్కువ పిండి పదార్థాలు మరియు అధిక పీచు (ఫైబర్) పదార్థాలుండే ఆహారంతోపాటు తరచుగా చిన్న భోజనం (రోజుకు 6 భోజనాలు) తినడం మధుమేహం నిర్వహణలో చాలా ముఖ్యమైనది. ఇది ఎంత ముఖ్యమంటే మనం గాలి పీల్చడం-వదలడమంతటి  ముఖ్యమన్నమాట.
   
 • భౌతికమైన చర్యలు 
  పరిశోధనలు తీవ్రంగా హెచ్ఛరించేదేమంటే, మందకొడి జీవనం, కదలకుండా ఎపుడూ ఒకే చోట కూర్చుని పనిచేయడం వంటి ఇతర అనారోగ్య జీవనశైలి కారణంగా చక్కర వ్యాధి తీవ్రతరం అవుతుంది అని. అందువల్ల ఈత (స్విమ్మింగ్), జాగింగ్, సైక్లింగ్, యోగ మరియు జిమ్మింగ్ వంటి వ్యాయామాది కార్యకలాపాలను స్వీకరించడం ఉత్తమం. దానివల్ల రక్తంలో చక్కెర స్థాయిలను చాలా మేరకు నియంత్రించడం జరిగిందని  నిరూపించబడింది.

‘టైపు 1 డయాబెటిస్’ కు చికిత్స:

ఒకటోరకం చక్కర వ్యాధి లేదా ‘టైపు 1 డయాబెటిస్’కి చికిత్స అనేది ఒక క్రమశిక్షణా విధానం.  ఈ విధానంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సాధారణంగా వివిధ సమయ వ్యవధిలో పర్యవేక్షించడం (ఒక చార్ట్ తయారు చేయబడుతుంది). రక్తంలో షుగర్ స్థాయిలను బట్టి ఇన్సులిన్ ను అనేక సార్లు ఇంజెక్ట్ చేయబడుతుంది. అదనంగా, నియంత్రిత ఆహారం మరియు వ్యాయామ పద్ధతులను పాటించడం ద్వారా ‘టైప్ 1 మధుమేహం’ రోగ నిర్వహణ మరియూ నియంత్రణ చేయవచ్చు. టైప్ 1 మధుమేహం ఎక్కువగా పిల్లలు మరియు యుక్తవయస్కులు (జువెనైల్ డయాబెటిస్ అని పిలుస్తారు) లో గుర్తించబడుతున్నందున వైద్యులు, తల్లిదండ్రులు, సంరక్షకులు, నర్సులకు చెప్పేదేమంటే పిల్లలకు జాగ్రత్తగా మందును "ఇంజెక్ట్” చేయడం నేర్చుకోవాలి. ఇంజక్షన్ అంటే పిల్లల్లో భయాన్ని పోగొట్టి సాధ్యమైనంత తక్కువ నొప్పితోనే వారికిఇంజక్షన్ చేయడం నేర్చుకోవాలి.

రెండో రకం చక్కర వ్యాధి లేదా ‘టైపు 2 డయాబెటిస్’ కు చికిత్స

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటానికి తరచుగా ఆహారం మార్పులను, వ్యాయామాలు మరియు ఔషధాల సేవనం సూచించడం ద్వారా డాక్టర్లుచికిత్స చేస్తారు. డాక్టర్ సిఫారసుపై టైప్ 2 ఉన్న వ్యక్తులకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు కూడా అవసరమవుతాయని గమనించబడింది. అందువల్ల టైప్ 2 డయాబెటిస్ను వైద్యులు ముందుగా  గుర్తించినప్పుడు, సదరు వ్యక్తి లేదా రోగి చురుకుగా చర్యలు తీసుకోవాలి మరియు ఆహారపు అలవాట్లను మార్చాలి, జాగింగ్, సైక్లింగ్ మరియు ఈత వంటి వ్యాయామాలను చేపట్టాలి. ఇవి చేస్తూనే బ్లడ్-గ్లూకోస్ స్థాయిలను కాలానుగుణంగా క్రమబద్ధంగా తనిఖీ చేకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాధి మరింత ముదరకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇలా వ్యాధిని  సాధ్యమైనంత త్వరగా నయం చేసుకోవాలి.

అపోహలు - చక్కెరవ్యాధి ఉన్నవారు ఏమి తినాలి మరియు వ్యాధికి జీవనశైలి చిట్కాలు - Myths - what to eat & lifestyle tips for diabetics in Telugu

షుగర్ వ్యాధి (డయాబెటిస్) కి మరియు ఆహారాలకు సంబంధించిన 5 ప్రముఖ అపోహలు

స్వల్ప ప్రమాణంలో, రోజుకు మూడుసార్లకు బదులు, చాలా సార్లు భోజనం చేయడం చాలా బాగుంటుంది. చక్కెరవ్యాధి విషయంలో ఆహారపుటలవాట్ల గురించి సామాన్యంగా ఉన్న కొన్ని అపోహల్ని తొలగించుకునేందుకు ముందుకు చదవండి. చక్కెరవ్యాధితో ఉన్నవారు ఏమి తినాలో తెలుసుకోండి.

అపోహ 1: పూర్తిగా కార్బోహైడ్రేట్లను ఆపేయడం

వాస్తవం: కార్బోహైడ్రేట్లు తీసుకోవటాన్ని ఆపటం ద్వారా మనము శరీరం యొక్క వ్యవస్థను  బలహీనమైపోయేట్టు మరియు అలసట, నిస్సత్తువ మరింత ఎక్కువ అయ్యేట్టు చేస్తాము. వాస్తవానికి, వోట్మీల్, గోధుమ బియ్యం, సంపూర్ణ గోధుమ రొట్టె, బహుళ-గింజల ఆహారాలు, చియా విత్తనాలు, అవిసె గింజలు, సెమోలినా, అటుకుల అన్నం వంటి అధిక ఫైబర్ కల్గిన పిండి పదార్థాలు తినడం వల్ల మీకు శక్తిని పెంచడమే కాక మలబద్దకం నుండి మిమ్మల్ని రక్షిస్తాయి.

అపోహ 2: స్వీట్లు తినడం పూర్తిగా ఆపేయ్!

వాస్తవం: మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిని బాగా నియంత్రించుకోగల్గితే మీరు తీపి పదార్థాలను (కొద్ధి కొద్ధిగా అందిస్తారు) అపుడపుడూ తీసుకోవచ్చు. తీపి తినాలన్న మీ కోరికలకు పండ్లు ఓ మంచి ప్రత్యామ్నాయం. పండ్లలో ఉండే సహజ చక్కెరలు "ఫ్రూక్టోజ్" శుద్ధిచేసిన చక్కెరల నుంచి తయారైన తీపి వంటకాలకు  మరియు బేకరీ ఉత్పత్తులకు మంచి ప్రత్యామ్నాయం. కానీ కొన్ని పండ్లు చాలా ఎక్కువ పాళ్లల్లో చక్కెర (గ్లైసెమిక్ ఇండెక్స్) ను కలిగి ఉన్నందున పండ్లను కొద్ది కొద్ధి పరిమాణాల్లో సేవించడం మంచిది. తీపి పదార్థాలను తినేందుకు ముందుగా మీ శరీరంలో రక్తం- గ్లూకోజ్ స్థాయిలను తనిఖీ చేసుకోండి.

అపోహ 3: మూడు సార్లు మాత్రమే భోజనం తినండి

వాస్తవం: షుగర్ వ్యాధి నిపుణులైన డాక్టర్లు (ఎండోక్రినాలజిస్ట్స్) చెప్పేదేమంటే రోజుకు కేవలం 3 సార్లకు బదులు తక్కువ వ్యవధుల్లో (small intervalls) ఆరు సార్లు కొద్ధి కొద్ది పరిమాణంలో భోంచేయమని. దీనివల్ల మీరు తరచుగా ఆకలిగొనడం అనే సమస్యే ఉండదు. ఇంకా, మీ చక్కర వ్యాధిని మీరు సమర్థవంతంగా నిభాయించగలుగుతారు.     

అపోహ 4: సలాడ్లు (పచ్చి కూరగాయల ముక్కలు) తింటే మాత్రమే మధుమేహం వేగంగా నియంత్రించబడుతుంది

వాస్తవం: నిజానికి రక్తంలో చక్కెర స్థాయిలను చక్కబెట్టడం కోసం సమతుల్య భోజనం తినడం చాలా ముఖ్యం. నిపుణులు చెప్పేదేమంటే ‘ప్లేట్ పద్దతీ’ లో భోంచేయమని. అంటే   మీ ప్లేట్ లో సగభాగం సలాడ్లు మరియు పండ్లుతో నిండి ఉండాలి. ఇంక, మీ ప్లేట్ పాతిక భాగం కోడి మాంసం, చేప, కాటేజ్ చీజ్,పప్పులు మరియు తక్కువ కొవ్వు ప్రోటీన్లుఆ కల్గిన ఆహార పదార్థాలు నిండి ఉండాలి. ఇంక మిగిలిన పాతిక భాగం ప్లేట్ తక్కువ కార్బోరేట్లు కల్గిన రొట్టె, చపాతీలు, వివిధ గింజలతో తయారైన బ్రెడ్, బ్రౌన్ బియ్యం, అటుకులు కావచ్చునంటున్నారు నిపుణులు.

అపోహ 5: మీరు షుగర్ మందులు తీసుకుంటుంటే, మీకు నచ్చినది ఏదైనా తినొచ్చు.

వాస్తవం: మధుమేహ నిర్వహణ క్రమశిక్షణగా తినడం పై ఆధారపడి ఉంటుంది. ఔషధాల సేవనం రక్తంలో గ్లూకోస్ ను నిల్వ చేయడానికి, గ్లూకోజ్ ను ఉపయోగించుకొని విష పదార్థాలను వేరుచేయడానికి ఉపయోగపడుతుంది. మీరు ఔషధాలను తీసుకుంటున్నాను గదా అని ఎక్కువగా తినడం లేదా తాగడం కూడదు. బాధ్యతారాహిత్యంగా తినడంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలను మరింత పెంచే ప్రమాదం ఉంది.

చక్కెరవ్యాధి ఉపద్రవాలు - Complications of Diabetes in Telugu

మీకు తెలుసా? రక్తంలో నిరంతరం పెరిగిపోతుండే చక్కర స్థాయిలు శరీరంలోని ఇతర ముఖ్య అవయవాలకు చేటు చేస్తాయని? అందుకే "చక్కర వ్యాధి మరింతగా   ప్రేరేపితమయ్యే ఆరోగ్య పరిస్థితిని తెచ్చుకోకు" అంటూ మీ వైద్యులు, మీ శ్రేయస్సు కోరే ఆప్తులైన మీ కుటుంబ సభ్యులు సతతం పట్టు బట్టి మరీ మీకు చెబుతూనే ఉంటారు. సుమారు 15 నుండి 20 ఏళ్ళ దీర్ఘ కాలంపాటు చక్కర వ్యాధితో జీవిస్తున్నవారికి చక్కర వ్యాధి  (ప్రభావం ఇతర అవయవాల పై బడి) వారికి మరికొన్ని జబ్బులు దాపురింపజేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. చక్కర వ్యాధిని సరిగా నియంత్రించని పక్షంలో దాని ప్రభావం వల్ల ఏఏ శరీర భాగాలకు ప్రమాదమేర్పడుతుందో ఇపుడు తెలుసుకుందాం.    

కళ్ళు

నియంత్రించబడని మధుమేహం వలన, ముఖ్యంగా టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్ తో నివసించే వ్యక్తుల్లో, కళ్ళ నరాలు ఎక్కువగా బాధింపబడతాయి. కంటి నాడీ కణాలపై చక్కర వ్యాధి దాడి కారణంగా 'డయాబెటిస్ రెటినోపతీ', గ్లవుకోమా, కంటిశుక్లం వంటి తీవ్రమైన డయాబెటిక్ సంబంధమైన కళ్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. దృష్టిని పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా సంభవించవచ్చు.    

 • డయాబెటిస్ రెటినోపతీ' పరిస్థితి వల్ల కంటిలో ఉన్న రెటీనా రక్తనాళాలు చిట్లడం, గడ్లు కట్టడం వంటివి జరిగి అంతర్గత రక్తస్రావానికి కారణమవుతుంది. తత్ఫలితంగా పూర్తి దృష్టి నష్టం వచ్చే ప్రమాదమూ ఉంది.
 • గ్లవుకోమా-పరిస్థితిలో కంటి కండరాల లోపల ఒత్తిడి కారణంగా మెదడు కణాలకు అనుసంధానించబడిన నరాలు  దెబ్బతింటాయి. మధుమేహం లేని వ్యక్తులకు కూడా గ్లాకోమా సంభవిస్తుంది, కాని మధుమేహం సరిగ్గా నియంత్రించి, నిర్వహించబడకపోతే చక్కర వ్యాధి మరింత విషమించే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
 • కంటిశుక్లం లేక కంటి పొర ఏర్పడడం.   కంటి యొక్క సహజ కటకాలు సన్నని పొరను ఏర్పరుస్తాయి. అందువల్ల  దృష్టి చాలా మందగిస్తుంది. మధుమేహం లేని వారిలో కంటే మధుమేహం ఉన్నవారికి ఈ కంటిశుక్లం లేక 'కంటి పొర ఏర్పడడమనే సమస్య  5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
 • డయాబెటిస్ మాక్యులర్ ఎడెమా' - ఇది కంటి రెటీనాలో ఉండే మక్లలా ప్రాంతంలో మంట, వాపు కలిగి ఉన్న డయాబెటిస్ రెటినోపతి యొక్క ప్రగతిశీల రూపం.

మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, ప్రతి ఆరునెలలకు ఒకసారి మీ కళ్లను వైద్యుల చేత పరీక్షింపచేసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. కళ్ళు పొడిబారిపోవడం, కళ్ళ వెంట ఎక్కువగా  నీరుగారడం, కళ్ళ దురద, కళ్ళు ఎరుపెక్కడం దృష్టిలోపాలేర్పడడం వంటి లక్షణాలు కానవచ్చినట్లైతే ఏమాత్రం ఆలస్యం లేకుండా మీరు వైద్యుడిని సంప్రదించాలి.

ఓరల్ హెల్త్/నోటి పరిశుభ్రత 

నియంత్రణ లేని  చక్కర వ్యాధి మరియు పేలవమైన నిర్వహణ వల్ల వివిధ నరాల వ్యాధులకు, నోటి ఇన్ఫెక్షన్లకు  దారితీస్తుంది. ఇంకా, నోటిలో చిగుళ్ళు, దంత సమస్యలకు దారితీస్తుంది. అధిక గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు మీ నోటి కుహరంలో ప్రమాదాన్ని కలిగిస్తాయి. చక్కర వ్యాధిని సరిగా నిర్వహించి నియంత్రించకపోతే దవడలు, దంతాలు, నోటి ప్రాంతం, నాలుక మరియు మొత్తం నోటి ఆరోగ్యం పాడైపోయే ప్రమాదముంది. నోటిలో బ్యాక్టీరియల్ మరియు ఇతర వ్యాధికారకాలైన క్రిములు చోటు చేసుకోవడం వల్ల జింజివిటిస్, కండోవిటిస్, కాన్డిడియాసిస్, పియోరియా వంటి వ్యాధులకు, చెడు శ్వాస మరియు పొడి లేదా బర్నింగ్ సమస్యలు వంటి పరిస్థితులకు దారితీస్తుంది.

చక్కర వ్యాధికి గురైన వారు సరైన నోటి పరిశుభ్రతని పాటించాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. పళ్ళపై ఫలకాన్ని ఏర్పరుచుకోకుండా రోజుకి కనీసం రెండుసార్లు బ్రష్ చేయాలి. ఆహారపు కణాలతో కూడిన లవణంలో గ్లూకోజ్ ఉన్నందున పళ్ళపై ఫలకం ఏర్పడుతుంది, ఇది పళ్ళపై పొరను ఏర్పరుస్తుంది. ఈ పొర బాక్టీరియాకు ఆలవాలమై గింజివిటిస్ మరియు పార్డోంటైటిస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఇంకా, నోటి గాయాలు, పూతల సమస్యను ఎదుర్కొంటుంటే, 5-7 రోజులైనా అవి మానక పొతే తక్షణమే దంతవైద్యుడిని సందర్శించమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కెర వ్యాధితో బాధపడే వారు ఆరునెలలకు ఒకసారి దంత వైద్యులచేత తనిఖీ  చేయించుకోవడం అనివార్యం.

హృదయం:

మధుమేహం ఉన్నవారు ఆ వ్యాధి లేనివారికంటే గుండెసంబంధమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం మూడు నుంచి నాలుగు రేట్లు ఎక్కువ ఉంది. స్ట్రోక్స్ మరియు కార్డియోవాస్కులర్ వ్యాధులు బారిన పడే ప్రప్రమాదం హెచ్చు. కనుక,ఓరల్ హెల్త్ జాగ్రత్తలు, ప్రత్యేకించి టైప్ 2 మధుమేహం ఉన్న వారికి తప్పనిసరి. తరచుగా చక్కెర వ్యాధి ఎక్కువగా ఉన్నవారు అధిక రక్తపోటు, అధిక స్థాయి కొలెస్ట్రాల్, అధిక స్థాయి ట్రైగ్లిజరైడ్స్ మరియు ఊబకాయం కలిగి ఉండటం సాధారణం, మరి అలంటి వారికి గుండె జబ్బులు లేదా స్ట్రోక్లు వచ్చే అవకాశం ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మధుమేహం కారణంగా గుండె కండరాలు, రక్త నాళాలు, మరియు నరాలు బలహీనపడతాయి. చివరకు గుండె జబ్బులకు దారితీసే అవకాశం ఉంది. అధిక ట్రైగ్లిజరైడ్స్ (కొవ్వులు) తో పాటుగా నియంత్రించని మధుమేహం (హై ఎటమాటిక్ బ్లడ్ గ్లూకోస్ స్థాయిలు) హృదయ సంబంధిత సమస్యలను మరింతగా కలిగించే ప్రమాదం ఉందని వైద్య పరిశోధనలు సూచిస్తున్నాయి.  

చక్కెర వ్యాధితో బాధపడే వారు జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాలని, మంచి అలవాట్లు ఏర్పరచుకోవాలి అని, మద్యం మరియు పొగాకు తీసుకోవడం తగ్గించడం తప్పని సరి అని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దీనివల్ల మీ రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు సమతుల్యం చేయబడతాయి. అంతే కాక మార్చుకున్న మీ జీవనశైలి వివిధ హృదయ వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది అంటున్నారు వైద్యులు.

కిడ్నీ మరియు పిత్తాశయం

రక్తంలో అధిక గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు మన శరీర వడపోత వ్యవస్థ (మూత్రపిండాలు మరియు మూత్రాశయం) కు గొప్ప ముప్పును కలిగిస్తాయి. మన శరీరంలో మూత్రపిండాలు మరియు మూత్రాశయం మన శరీరం నుండి అన్ని వ్యర్థాలను తొలగించడానికి సహాయపడతాయని తెలుసు. నియంత్రించని మధుమేహంతో, మూత్రపిండాల యొక్క రక్త నాళాలు దెబ్బతింటాయి, తద్వారా, మన శరీర వడపోత వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుంది. కనుక చక్కెరవ్యాధి ఉన్నవారు తమ మూత్రపిండాలు మరియు మూత్రాశయం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పరిశోధనలు చెబుతున్నాయి. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులను ప్రారంభ దశలోనే పరీక్షల ద్వారా కనుగొని చికిత్స చేయకపోతే ప్రాణాంతక ప్రమాదమని వైద్యులై చెప్తున్నారు. మూత్రపిండాల వ్యాధుల లక్షణాలైన రాత్రుల్లో పలుసార్లు మూత్రవిసర్జనకు పోవాల్సి రావడం, మూత్రానికి పొయ్యేటపుడు మంట పుట్టడం, మూత్ర పరిమాణం గణనీయంగా తగ్గినా గాని లేదా పాదాలు, మడిమల్లో (మిడి-పాదాలు) వాపు రావడం మీరు గమనించినట్లయితే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం చాలా అవసరం.    

లైంగిక ఆరోగ్యం

చక్కర వ్యాధి కల్గిన వారు-పురుషులు మరియు మహిళలు ఇద్దరూ కూడా- తమ లైంగిక ఆరోగ్య విషయంలో ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటారు. చక్కెరవ్యాధున్న పురుషులకు అంగస్తంభన, నపుంసకత్వము, లిబిడో నష్టం, అకాల స్ఖలనం మరియు ఆలస్య స్ఖలనం వంటివి దాపురిస్తాయి. పది నుంచి పదిహేను సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం  మధుమేహం కలిగిన 50% పురుషులు అంగస్తంభన నుండి బాధపడుతున్నారని గణనీయమైన అధ్యయనాలు చెబుతున్నాయి. అంగస్తంభనతో బాధపడుతున్న పురుషులు తరచుగా హృదయ సంబంధ వ్యాధులకు గురవుతున్నారని పరిశోధకులు గుర్తించారు.

దీనికి విరుద్ధంగా మహిళలు, ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ కు లోనైనవారు హార్మోన్ల అసమతౌల్యంతో బాధపడుతున్నారు. పిసిఒఎస్ (పాలీసిస్టిక్ అండాశయ సిండ్రోమ్) వంటి వ్యాధులు తరచుగా మధుమేహంతో అనుసంధానించబడి ఉంటాయి, ఇది (పాలీసిస్టిక్) మహిళల్లో వంధ్యత్వానికి ప్రధాన కారణం. మధుమేహం కారణంగా సంభవించే కొన్ని ఇతర సాధారణ పరిస్థితులేవంటే పొడి యోని , లైంగిక కోరికలు లేకపోవడం, సెక్స్ సమయంలో నొప్పి, మరియు ఉద్రేకం ఇబ్బందులు.

లైంగిక సమస్యలకు పురుషులు మరియు మహిళలు కూడా వైద్యుడుని సంప్రదించాలి. దీనివల్ల లైంగిక ఆరోగ్యానికి   సంబంధించిన చీకు చింతలు సులభంగా తగ్గటానికి ఎన్నో పరిష్కారాలు లభిస్తాయి. వైద్య టెక్నాలజీ మరియు తత్సంబంధ ఉత్పత్తులు, మందులు మరియు చికిత్సలు ఇటీవలికాలంలో ఎంతో పురోగమనం చెందాయి. అంగస్తంభన మరియు వంధ్యత్వం వంటి సమస్యలకు వైద్యులను సంప్రదించడం చాలా సహాయపడుతుంది. అయినప్పటికీ, చక్కెర వ్యాధి గలవారు రెగ్యులర్ గా  వ్యాయామం చేస్తూ రక్తంలో గ్లూకోజ్ స్థాయిల నియంత్రణకు శ్రద్ధ వహించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. అంగస్తంభన మరియు వంధ్యత్వం వంటి లైంగిక ఆరోగ్య సమస్యలను నివారించడానికి డాక్టర్లు షుగర్ పేషంట్లకు సిఫారసు చేసేదేమంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిం చుకొమ్మని మరియు సాధారణమైన వ్యాయామం నిత్యం చెయ్యమని. దీనివల్ల లైంగిక సమస్యలు కూడా తలెత్తవని డాక్టర్లంటున్నారు.      

మానసిక ఆరోగ్యం:

దీర్ఘకాలికంగా చక్కెర వ్యాధి ఉన్నవారు తరచూ భావోద్వేగ సంక్షోభానికి గురవుతారని మనస్తత్వవేత్తలు అంటున్నారు. మధుమేహమున్నవారు దేహారోగ్యంతో బాటు మానసిక ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలని పరిశోధనలు సూచిస్తున్నాయి. చక్కెర వ్యాధి ఉన్నవారు తమ తమ జీవితంలో సంతోషంగా సంతృప్తిగా ఉన్నయెడల తమ శరీరములో చక్కెర నిల్వల ను కూడా సమర్ధవంతంగా నియంత్రించుకుంటున్నారని పరిశోధనలు తెలుపుతున్నాయి. సంతోషంగా లేని చక్కెర వ్యాధి గ్రస్తులతో పోల్చి చూద్దాం వల్ల ఇది నిరూపితమైంది అని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. 

కుటుంబ సభ్యులు కూడా చక్కెర వ్యాధి ఉన్న తమవారికి మానసికంగా వెన్నుదన్నుగా నిల్చి, వారిని ఎప్పుడూ సంతోషంగా ఉండేట్లు చూసుకొని, తద్వారా, వారి రక్తంలో చక్కెర నిల్వల సమతౌల్యతకు తోడ్పడాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. జీవిత సుఖ-సంతోషాలను ఆస్వాదించడంలో చక్కెర వ్యాధి ఓ అడ్డంకి కాకూడదు మరి.  వనరులు

 1. National Kidney foundation [Internet]. New York: National Kidney Foundation; Diabetes - A Major Risk Factor for Kidney Disease
 2. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Diabetes, Gum Disease, & Other Dental Problems
 3. National Health Service [internet]. UK; What is type 2 diabetes?
 4. Diabetes.co.uk [internet] Diabetes Digital Media Ltd; Causes of Diabetes.
 5. Diabetes.co.uk [internet] Diabetes Digital Media Ltd; Juvenile Diabetes.
 6. National Health Service [Internet]. UK; Overview - Gestational diabetes

చక్కెర వ్యాధి వైద్యులు

Dr. Narayanan N K Dr. Narayanan N K Endocrinology
16 वर्षों का अनुभव
Dr. Tanmay Bharani Dr. Tanmay Bharani Endocrinology
15 वर्षों का अनुभव
Dr. Sunil Kumar Mishra Dr. Sunil Kumar Mishra Endocrinology
23 वर्षों का अनुभव
Dr. Parjeet Kaur Dr. Parjeet Kaur Endocrinology
19 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

చక్కెర వ్యాధి కొరకు మందులు

చక్కెర వ్యాధి के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

translation missing: te.lab_test.sub_disease_title

translation missing: te.lab_test.test_name_description_on_disease_page