ఎంతో అలంకారప్రాయమైన మరియు ఔషధ విలువలున్న పుష్పభరితమైన మొక్క పారిజాతం. దీని అందమైన తెల్లటి పువ్వుల సువాసన అందరి మనసుకు ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలుగజేస్తుంది. పారిజాతానికున్న వివిధ వైద్యప్రయోజనాల దృష్ట్యా ఆయుర్వేదం ఈ పూలమొక్కకు అగ్రస్థానాన్నే ప్రసాదించింది. సాధారణంగా ‘పారిజాతం’ అని, లేదా ‘రాత్రి పుష్పించే మల్లిక’ (night blooming jasmine) అని దీనిని పిలుస్తారు. ఈ పుష్పభరిత వృక్షం భారత పురాణాల్లో మరియు జానపద కథల్లో ఓ మహత్తు కల్గిన స్థానాన్ని కల్గి ఉంది. భగవద్గీత మరియు హరివంశ పురాణాల్లో ‘పారిజాతం మొక్క మరియు దాని పువ్వుల ప్రస్తావన ఉంది. భారతీయ పురాణ సాహిత్యం ప్రకారం, ‘పారిజాతం’ అనేది ఒకప్పుడు స్వర్గంలో ఉండి, ఆ తర్వాత భువికి దిగి వచ్చిన ఒక పూల చెట్టు. పారిజాతం చెట్టు రాత్రిపూట మాత్రమే పువ్వులు పూసి, ఉదయం పూట తాను పూసిన పూలన్నింటినీ రాల్చివేస్తుందని మీకూ తెలిసే ఉంటుంది. వాస్తవానికి, ఇది "రాత్ కీ రాణి" గా ప్రసిద్ది చెందింది. నిజానికి, పారిజాతం చెట్టు యొక్క ఔషధీశాస్త్ర నామాన్ని అనువదిస్తే "దుఃఖం యొక్క చెట్టు" గా అర్థమవుతుంది.  

పారిజాతం చెట్టు ఓ పొదలాగా లేదా చెట్టు గా కూడా పెరుగుతుంది. పారిజాతం చెట్టు 10-11 మీటర్ల  ఎత్తువరకూ పెరుగుతుంది మరియు దీని కాండం, కొమ్మలపైనా కఠినమైన పెచ్చులు పెచ్చులుగా ఉండే బెరడు ఉంటుంది. ఈ బెరడు బూడిద రంగులో ఉంటుంది. ఈ మొక్క యొక్క ఆకులు వెంట్రుకల్లాగా పొడవుగా ఉంటాయి. దీని తెల్లటి పుష్పాలు దాని శాఖల ఎగువన గుత్తులు-గుత్తులుగా పెరుగుతాయి. పారిజాతం పండు గుండ్రంగా లేదా హృదయా కారంలో ఉండే గుళికవంటిది. ఇది సాధారణంగా గోధుమ రంగులో ఉంటుంది. ఈ మొక్క పెరగడానికి భాగశః నీడ అవసరం. ఇక ఈ మొక్క యొక్క రోజువారీ సంరక్షణ విషయానికి వస్తే పారిజాతం మరీ అంత ఎక్కువ శ్రద్ధను ఆశించదు.

పారిజాతం గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

 • ఔషధ శాస్త్రనామం: నైక్తంటెస్ అర్బోర్-ట్రిస్టిస్ (Nyctanthes arbor-tristis)
 • కుటుంబం: ఒలేసియే (Oleaceae)
 • సంస్కృత పేరులు:  పారిజాత్, షెఫాలి, షెఫాలికా
 • సాధారణ పేరులు: పారిజాత్, హర్సింగార్, Tree of sorrow, క్వీన్ అఫ్ నైట్, నైట్ జాస్మిన్, కోరల్ జాస్మిన్, షులీ, రాత్ కి రాణి
 • ఉపయోగించే భాగాలు: ఆకులు, పువ్వులు, విత్తనాలు
 • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: పారిజాతం పొదరిల్లు దక్షిణ ఆసియాకు చెందినది. ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశం, నేపాల్, పాకిస్తాన్ మరియు థాయ్లాండ్ ప్రాంతాలలో కనిపిస్తుంది.

మీకు తెలుసా? 
పారిజాతపుష్పం భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధికారిక పుష్పం (state flower). పారిజాత పుష్పాలను హిందూ పండుగలలో దుర్గ మరియు విష్ణుదేవుడికి పూజా పుష్పాలుగా ఉపయోగించబడతాయి.

 1. పారిజాతం ఆరోగ్య ప్రయోజనాలు - Harsingar health benefits in Telugu
 2. పారిజాతాన్ని ఎలా ఉపయోగించాలి - How to use Harsingar in Telugu
 3. పారిజాతం మోతాదు - Harsingar dosage in Telugu
 4. పారిజాతం దుష్ప్రభావాలు - Harsingar side effects inTelugu
పారిజాతం ప్రయోజనాలు, ఔషధ ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు వైద్యులు

పారిజాతం వివిధ ఆరోగ్య ప్రయోజనాల మొక్క/పొదరిల్లు/చెట్టు. పారిజాతం చెట్టు యొక్క అనామ్లజని, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దాన్ని మానవ ఆరోగ్యానికి మరియు వారి సంక్షేమానికి ఒక ఆశీర్వాదంగా మార్చింది. ఇపుడు పారిజాతం యొక్క వైద్యలక్షణాలు కొన్నింటిని పరిశీలిద్దాం.

 • దగ్గుకు ఉపశమనం కలిగిస్తుంది: పారిజాత సారం శ్వాసనాళ కండరాలను వదులుపరుస్తుంది, తద్వారా దగ్గు మరియు బ్రోన్కైటిస్ లక్షణాల నుండి  ఉపశమనం కలిగిస్తుంది. ఇది గొంతులో వాపు తగ్గిస్తుంది మరియు వ్యాధికారక బ్యాక్టీరియాను చంపుతుంది,  గొంతు కండరాలను మృదువుగా చేస్తుంది.
 • జ్వరాన్ని తగ్గిస్తుంది: ఇటీవలి అధ్యయనాలు పారిజాతం యొక్క యాంటిపైరెటిక్ చర్యను గురించి తెలిపాయి. ఇది సాంప్రదాయకంగా శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి మరియు జ్వరం నుండి ఉపశమనం కలిగించడానికి ఒక టీ రూపంలో ఇవ్వబడుతుంది.
 • మలేరియా లక్షణాలను తగ్గిస్తుంది: పారిజాత ఆకుల పేస్ట్, నోటి ద్వారా తీసుకున్నపుడు మలేరియా  లక్షణాలను తగ్గించిందని మరియు  శరీరంలో మలేరియా పరాన్నజీవి సంఖ్యను తగ్గించిందని క్లినికల్ అధ్యయనాలలో తేలింది. ఇది రక్త పప్లేట్లెట్లను మరియు పూర్తి శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
 • ఆందోళనను తగ్గిస్తుంది: ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడానికి పారిజాత నూనెను పరిమళ చికిత్సలో ఉపయోగిస్తారు. ఇది మీ మెదడులోని సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది మరియు మానసిక స్థితిని నియంత్రించి, సంతోష భావనను కలిగిస్తుంది.
 • ప్రేగులలో  పురుగులను తొలగిస్తుంది: జంతు ఆధారిత అధ్యయనాలు పారిజాతం  యొక్క యాంటీహెల్మెంతిక్ (anthelmintic) చర్యను సూచిస్తున్నాయి. అయినప్పటికీ, మానవ అధ్యయనాలు లేనందున, ఈ ప్రయోజనం గురించి మరింత తెలుసుకోవడానికి  డాక్టర్తో మాట్లాడటం మంచిది.
 • అద్భుతమైన యాంటీ బాక్టీరియల్: వరుస అధ్యయనాలలో, పారిజాత సారాలు చాలా వ్యాధికారక బాక్టీరియా యొక్క పెరుగుదలను నిరోధించగలవని కనుగొన్నాయి, అందువల్ల అంటువ్యాధులని నివారించవచ్చు మరియు తగ్గించవచ్చు.
 • చర్మ ప్రయోజనాలు: పారిజాతం అద్భుతమైన ప్రతిక్షకారిని (antioxidant) మరియు వాపు నిరోధక ఏజెంట్. అది మొటిమలను నిరోధిస్తుంది అలాగే అకాలవృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.

కీళ్లనొప్పులు-నడుంనొప్పికి పారిజాతం - Harsingar for arthritis and sciatica

కీళ్లనొప్పులు మరియు నడుంనొప్పి ప్రపంచంలో అత్యంత ప్రబలమైన నొప్పిని కల్గించి బాధపెట్టే వ్యాధులు. కీళ్ళనొప్పులు శరీరపు కీళ్ళలోని నొప్పులకు, వాపులకు సంబంధించినదైతే, తుంటినొప్పి లేదా సయాటికా తొడ వెనుక భాగపు నరములు/గృధ్రసీనాడి (sciatic nerve)లో వచ్చే అతి తీవ్రమైన నొప్పి. మన శరీరంలోని నరములన్నింటి కంటే పొడవైన నరం ఈ గృధ్రసీనాడి లేదా సయాటిక్ నాడి. ఇది తుంటి కింది నుండి చీలమండ వరకు వ్యాపించి ఉంటుంది.  ఈ రెండు రకాలైన తీవ్రమైన నొప్పులకు (కీళ్లనొప్పులు, నడుం నొప్పి) శారీరక చికిత్స మరియు బలమైన యాంటీబయాటిక్స్ మందులు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు చికిత్సా పద్దతులు. రెండోపధ్ధతి అంటే యాంటీ బయోటిక్ ఔషధాల వాడకం మూలంగా రోగికి దుష్ప్రభావాలు కూడా దాపురిస్తాయి. ఇలాంటి ఈ సమయంలో పరిశోధకులు చివరికి మూలికావైద్యం మరియు ఆయుర్వేద నివారణల వైపు దృష్టి సారిస్తూ కదులుతున్నారు. కీళ్ళనొప్పుల ఉపశమనం కోసం ఆయుర్వేద వైద్యులు పారిజాతం ఆకుల కషాయాలను సేవించాల్సిందిగా సూచిస్తారు.

ఒక ఇటీవల జంతువులపై జరిపిన ఓ అధ్యయనం ప్రకారం, పారిజాతం యొక్క ఆకుల నుండి తీసిన రసం, తదితరాలు ఒక అద్భుతమైన నొప్పినివారణా ఏజెంట్ గా పని చేసింది.  అయినప్పటికీ, పారిజాతాన్ని ఔషధంగా తీసుకునే ముందు మీరు ఎల్లప్పుడూ వైద్యుడ్ని సంప్రదించండి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.

యాంటిబాక్టీరియాల్గా పారిజాతం - Harsingar as an anti-bacterial

శరీరంలో ఆరోగ్యానికి ఎదురుతిరిగే సూక్ష్మవిషక్రిములు(బాక్టీరియా) జాతులు పెరగడాన్ని గమనించిన వైద్య శాస్త్రవేత్తలు వీటిని నిర్మూలించేందుకు ప్రత్యామ్నాయ చికిత్సల్ని రూపొందించడం కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్నారు. ఇలా ఉద్భవిస్తున్న ఈ హానికారక బాక్టీరియా నిర్మూలనకు కావలసిన ఆయుర్వేద మూలికలు చాలా కాలం నుండే తమ ఉనికిని చాటుతున్నాయని పరిశోధకులు వాదిస్తున్నారు. అందువల్ల, ఈ సూక్ష్మవిషక్రిములకు ఈ మూలికాధారిత ఔషధాలపై నిరోధకతను సాధించడం కష్టమవుతుంది. ఆయుర్వేద వైద్యం మరియు జానపద ఔషధాలు పారిజాతాన్ని ఓ ప్రభావవంతమైన సూక్ష్మవిషక్రిమినాశిని (యాంటీమైక్రోబయాల్) గా గుర్తించాయి. రెండు వేర్వేరు అధ్యయనాలలో పారిజాతాన్ని అతి ఉత్తమంగా ఈ దిశలో ఎలా ఉపయోగించాలి అన్న విషయంపై పరిశోధకులు పరిశోధన జరిపారు. పారిజాత సారాన్ని వివిధ ద్రావణాలతో చేర్చి తయారు చేయబడిన మందును వివిధ రకాల సూక్ష్మ విషక్రిములపై ప్రయోగించగా పారిజాత రసంతో గూడిన ఆ మందులు తమ సమర్ధతను చూపాయని కనుగొనబడింది. ఈ అధ్యయనంలో పారిజాతానికి నీరు, ఇథనాల్, మెథనాల్ మరియు క్లోరోఫాంను ద్రావకం వలె చేర్చి సూక్ష్మజీవులపై ఉపయోగించబడింది. వివిధరకాలైన సూక్ష్మజీవుల్ని ఈ మందు ప్రభావవంతంగా చంపడాన్ని పరిశోధకులు గమనించారు. విస్తృత శ్రేణి బ్యాక్టీరియాలైన ఎస్చెరిచియా కోలి, స్యుడోమోనాస్, సాల్మోనెల్లా, బాసిల్లస్, స్టెఫిలోకోకస్, లిస్టెరియా, క్లబ్సియెల్లా మొదలైనవి ఈ మందు ప్రయోగంతో నాశనమవడం జరిగింది. అయినా, మీరు గనుక ఇలాంటి సూక్ష్మవిషజీవికారక రోగ నివారణకు పారిజాతాన్ని ఔషధంగా సేవించాలనుకుంటే మీ ఆయుర్వేద వైద్యుడి సలహా తీసుకున్న తర్వాతనే సేవించాలని సూచించడమైంది.

దగ్గుకు పారిజాతం - Harsingar for cough

మీరు నిరంతరమైన దగ్గుతో బాధపడుతున్నారా? మీ గొంతు పూడుకుపోయి మంటకు గురవుతోందా? ఇలాంటి పరిస్థితి మీ గొంతుకు లేదా ఊపిరితిత్తులకు అంటువ్యాధి సోకిన సంకేతమని వైద్యులు సూచిస్తున్నారు. అవరోధం కలిగిన శ్వాసవ్యవస్థకు (ఊపిరితిత్తులు, ముక్కు, శ్వాస గొట్టాలు) శరీరం యొక్క సహజ ప్రతిస్పందనే మనకు నిరంతరంగా వచ్చే దగ్గు. కానీ అంటువ్యాధి (సంక్రమణం)  లేదా అసహనీయత (అలెర్జీ) తగిలి అది మరింత తీవ్రమై, వదలకుండా మరింత బాధిస్తుంది. ఆయుర్వేదలో, పారిజాతం ఆకులు మరియు పువ్వుల నుండి తయారైన తేనీరు (కషాయం) ను దగ్గు, జలుబు మరియు విపరీతమైన రొమ్ముపడిసెము (బ్రోన్కైటిస్) జబ్బులకు ఉపశమనంగా ఉపయోగిస్తారు. ఇటీవలి అధ్యయనాల సూచన ప్రకారం, పారిజాతం నుండి సంగ్రహించిన మధ్యసారం (ఇథనాల్) ఒక అద్భుతమైన “బ్రోన్చోడైలేటర్” (పూడుకుపోయిన గొంతు కండరాలను వ్యాకోపింప జేస్తుంది)గా పని చేస్తుంది. ఆస్తమా నివారిణ మందుగా పారిజాతం భవిష్యత్తులో ఉపయోగపడగలదని కూడా ఆ అధ్యయనం సూచించింది. అంతేకాక, పారిజాతం ఒక శక్తివంతమైన నొప్పినివారిణిగా పేర్కొనబడింది. అందువలన, పారిజాతం మొక్క యొక్క సూక్ష్మవిషక్రిమినాశక  మరియు నొప్పి నిరోధక చర్య మీ గొంతులో బాక్టీరియా కారణంగా ఏర్పడే ఏ అంటురోగాన్నైనా నివారించి నొప్పితో (దగ్గి దగ్గి) అలసిపోయిన మీ గొంతుకండరాలకు ఉపశమనాన్నివ్వగలదు. పారిజాతం మందు యొక్క మోతాదు విషయంలో మీరు ఆయుర్వేద డాక్టర్తో సంప్రదించడమే ఎల్లప్పుడూ మంచిదని మీకు సూచించడమైంది.

జ్వరానికి పారిజాతం ఆకులు - Harsingar leaves for fever

పారిజాతాన్ని జ్వరాన్ని తగ్గించే “జ్వరంమందు”గా (antipyretic) సంప్రదాయికమైన వైద్యశాస్త్రంలో పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్యులు దీర్ఘకాలిక జ్వరాలను తగ్గించడానికి పారిజాతం టీని సూచిస్తారు. పారిజాతం చెట్టు యొక్క బెరడు నుండి తీసిన సారం తదితర పదార్ధాలు జ్వరనివారిణిగా (యాంటిపైరేటిక్) ఉపయోగపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, పారిజాతం గురించిన అధ్యయనాలెవీ ఇంకా మనుషులపైన నిర్వహించబడక పోవడంతో, మీరు పారిజాతం మందును సేవించాలనుకుంటే మీ ఆయుర్వేద డాక్టర్తో మాట్లాడడం ఉత్తమం. పారిజాతం యొక్క ఉపయోగాలు జ్వరానివారిణిగా దీన్ని ఉపయోగించడం గురించి డాక్టర్ మీకు వివరించగలరు.

రోగనిరోధకానికి పారిజాతం - Harsingar for immunity

రోగనిరోధకానికి పారిజాతం - Harsingar for immunity

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం కోసం ఆయుర్వేద వైద్యం చాలా కాలం నుండి పారిజాతాన్ని ఉపయోగిస్తోంది. పారిజాతం యొక్క ఉత్ప్రేరకమైన  రోగనిరోధక ప్రభావాల్ని పరీక్షించడానికి ప్రయోగశాల అధ్యయనాలు జరిగాయి. పారిజాతం ఆకుల యొక్క మద్య-సంబంధమైన (ఎథనాలిక్) పదార్ధాలు నాడీ ధాతుమండలానికి (యాంటీబాడీ మధ్యవర్తిత్వం) మరియు కణ-మధ్యవర్తిత్వానికి   (ప్రతిరక్షక పదార్థాల కంటే ఇతర రోగనిరోధక కణాలు) సంబంధించిన రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తాయి. అయితే, ఈ రంగంలో మరిన్ని అధ్యయనాలు ఇంకా నిర్వహించబడాల్సి ఉంది. కాబట్టి, మీ ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి పారిజాతం యొక్క రోగనిరోధక శక్తినిర్మాణ శక్తిని బాగా అర్థం చేసుకోవడం  మంచిది.

(మరింత సమాచారం: రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు)

మలేరియా కోసం పారిజాతం - Harsingar for malaria

మలేరియా అనేది ప్లాస్మోడియం (Plasmodium) అనే  పరాన్నజీవి వలన సంభవించే ఒక దోమ-సంక్రమణ వ్యాధి. ఈ వ్యాధి జ్వరం, కండరాల నొప్పి, మరియు వాంతులు కలిగి ఉంటుంది, ఇది తీవ్రమైన దశలలో మూర్ఛలు మరియు అధిక జ్వరానికి దారితీస్తుంది. చికిత్స చేయకుండా వదిలేసినప్పుడు, మలేరియా ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంది. మలేరియా లక్షణాలను తగ్గించడానికి భారతీయ సాంప్రదాయ వైద్యం పారిజాతాన్ని ఉపయోగిస్తుంది. మలేరియా యొక్క లక్షణాలను తగ్గించడంలో పారిజాతం యొక్క ఉపయోగం పరీక్షించడానికి అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. మరియు వారు ఆయుర్వేద వాదన నిజమని సూచిస్తారు. ఇటీవలి అధ్యయనంలో, మలేరియాతో ఉన్న 20 మంది రోగులు ఒక వారం పాటు పారిజాత  ఆకుల పేస్ట్ ను ఇవ్వగా, రోగులలో మలేరియా జ్వరం మరియు మలేరియా పరాన్నజీవి యొక్క స్థాయిలో గుర్తించదగిన తగ్గుదల కనిపించింది. ఈ రోగులులో వాపు లక్షణాలు కూడా గణనీయంగా తగ్గాయని ఈ అధ్యయనం పేర్కొంది. అంతేకాకుండా, రక్త ప్లాట్లట్  స్థాయిలలో మెరుగుదల మరియు శరీర అవయవాల పనితీరు కూడా మెరుగుపడిందని గుర్తించబడినది.

చక్కెరవ్యాధికి పారిజాతం - Harsingar for diabetes

చక్కెరవ్యాధికి పారిజాతం ఆకులు ఓ మంచి  మందు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు పారిజాతం ఆకులు ఉపయోగించబడుతున్నాయి. పారిజాతం చెట్టు పూలు నుండి తీసిన పదార్థాలు శక్తివంతమైన చక్కెరవ్యాధినిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటాయని జంతువులపై జరిపిన అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ మూలిక గురించిన అధ్యయనాలు మనుషులపైన ఇంకా నిర్వహించనందున పారిజాతం యొక్క చక్కెరవ్యాధినిరోధక ప్రభావాలను అర్థం చేసుకునేందుకు మీ ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

(మరింత సమాచారం: చక్కెరవ్యాధి చికిత్స)

పేగుల్లో పురుగులకు పారిజాతం - Harsingar for intestinal worms

పొట్ట పరాన్నజీవి పురుగులతో నిండుకుని కలుషితమైనపుడు దాపురించేదే ‘జీర్ణ నాళంలో పురుగులు’ లేదా “పేగుల్లో పురుగులు” అనే సమస్య. ఏటికపాము పురుగులు లేదా  గుండ్రని పురుగులు, పట్టీ పురుగులు, కొంకి పురుగులు అనే మూడు ప్రధానమైన పురుగుల రకాల్ని ఈ సమస్యకు కారణంగా చెప్పచ్చు. ఈ వ్యాధి సాధారణంగా పేగుల్లో అసౌకర్యం, అతిసారం మరియు కొన్ని కేసుల్లో రక్తహీనతతో కూడా గుర్తించబడింది. క్రుళ్ళిన ఆహారం లేదా అంటు సోకిన ఆహారం, పేలవమైన పరిశుభ్రత (అంటే అపరిశుభ్రమైన), మరియు పారిశుద్ధ్యలోపం అనే వాటిని “పేగుల్లో పురుగులు” సమస్యకు ప్రాధమిక కారణాలుగా వైద్యులు సూచిస్తున్నారు. ప్రేగుల్లో పురుగుల సమస్యకు సాధారణమైన ఆయుర్వేద నివారణల్లో పారిజాతం ఒకటి. అయినప్పటికీ, పారిజాతం యొక్క సూక్ష్మక్రిమినాశక ప్రభావాలను ధృవీకరించడానికి చాలా శాస్త్రీయ అధ్యయనాలే జరిగినా అవన్నీ జంతువుల మీద జరిగిన పరిశోధనలే. ఇందుకుగాను వైద్య అధ్యయనాలు (క్లినికల్ స్టడీస్) లేకపోవడం వల్ల, పారిజాతామనే ఈ మూలిక మనుషుల్లో ఓ సంభావ్య సూక్ష్మక్రిమినాశినిగా (యాంటీహల్మిన్టిక్) ఎలా పని చేస్తుందనే దాన్ని తెలుసుకోవటానికి ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించడం మంచిది.

ఆందోళనకు పారిజాతం - Harsingar for anxiety

పారిజాత తైలానికి ఉన్న శాంతింపజేసే ప్రయోజనాల దృష్ట్యా ఈ మూలికను వైద్యులు సుగంధతైలమర్ధనంలోనూ మరియు మూలికావైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఈ మూలిక గురించి  జంతువులపై జరిపిన అధ్యయనాల ప్రకారం, పారిజాతం ఆకు నుండి తీసిన రసానికి లేదా ‘ఆకుసారానికి’ ఆందోళనను నివారించే కొన్ని లక్షణాలు ఉండవచ్చునని సూచిస్తున్నాయి. పారిజాతంలోని పదార్దాలు మన మెదడులోని “సెరోటోనిన్” స్థాయిలను పెంచుతాయి, తద్వారా, పారిజాతం నిద్రను ప్రేరేపించే హార్మోన్ గా పని చేస్తుంది. కానీ, ఈ మూలిక యొక్క ప్రభావాన్ని నిరూపించేందుకు వైద్య అధ్యయనాలు ఇంకా జరగాల్సి ఉంది. కనుక, పారిజాతాన్ని సేవించే ముందు ఆయుర్వేదవైద్య నిపుణుల్ని సంప్రదించండి.

(మరింత సమాచారం: ఆందోళన కరణాలు)

గాయాలకు, విరిగిన ఎముకల వైద్యానికి పారిజాతం - Harsingar for wounds and fractures

సంప్రదాయ వైద్య పద్ధతుల్లో పుండ్లను నయం చేయగల ఔషధ గుణానికి పారిజాతం బాగా పేరు పొందింది. దీన్ని పైపూత మందుగా మరియు కడుపు లోనికి సేవించే మందుగా కూడా ఉపయోగిస్తారు. ఇంకా, విరిగిన ఎముకల చికిత్సలో కూడా పారిజాతాన్ని బాగా వాడుతున్నారు. అయితే, పారిజాతం యొక్క వైద్య ప్రయోజనాలను రుజువులతో సహా నిర్ధారించే ఆమోదయోగ్యమైన అధ్యయనం ఇంకా జరగలేదు.

చర్మానికి పారిజాతం ప్రయోజనాలు - Harsingar benefits for skin

పారిజాతం చర్మానికిగాను ఓ వరమే. పారిజాతం యొక్క చర్మ-సంబంధ రోగాలను నయం చేసే గుణాలను సంప్రదాయక ఔషధపధ్ధతి గుర్తించింది. పారిజాతం మొక్క పూల నుండి తీసిన పదార్ధాలకు అద్భుతమైన అనామ్లజనకంగా పనిచేసే తత్వముందని ప్రయోగశాల అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ అనామ్లజనక(యాంటీఆక్సిడెంట్) తత్వమే పారిజాతం మన శరీరం లో ఏర్పడే స్వేఛ్చారాశులకు సంబంధించిన హానికి విరుద్ధంగా పోరాట చేసే ఏజంటుగా పని చేస్తుంది. శరీరంలో ఏర్పడే స్వేఛ్ఛా రాశి (ఫ్రీ రాడికల్) లేదా ప్రతిక్రియ ఆమ్లజని జాతులు శరీరంలోని అన్ని ప్రధాన అవయవాలకు విషపూరితం. ఒత్తిడి లేదా ఇతర శారీరక మరియు దేహధర్మాల కారణంగా స్వేచ్ఛా రాశులు శరీరంలో అధికంగా జమవుతూ ఉండడం వల్ల శరీర విధుల సామర్థ్యం తగ్గుతుంది. అందువలన, పారిజాతం ఓ అనామ్లజనకంగా మన పని సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు చర్మంపై ఏర్పడే ముదురు మచ్చలు మరియు వివిధ చర్మ-సంబంధ గాయాలు, తదితర వృద్ధాప్య సంకేతాలను పోగొట్టడంలో పారిజాతం శక్తివంతంగా పని చేస్తుంది. సూక్ష్మవిషక్రిమినాశినిగా, నొప్పినివారిణిగా ఈ మూలిక అనేక చర్మ సమస్యలకు ఓ  ఔషధంగా ఉపయోగపడుతుంది. అయితే, పారిజాతాన్ని మీరు ఏ రూపంలోనైనా సరే తీసుకోవడానికి ముందుగా మీ డాక్టర్తో మాట్లాడటం మంచిది.

కేశసంరక్షిణిగా పారిజాతం - Harsingar benefits for hair

 ఆయుర్వేదంలో పారిజాతాన్ని జుట్టు నష్టాన్ని నివారించేందుకు మందుగా ఉపయోగిస్తారు. పారిజాతం గింజలతో చేసిన కాషాయం లేదా టీ ని జుట్టుకు దాపురించే చుండ్రు, తలలో పేనుల బెడద నివారణకు ఆయుర్వేద వైద్యులు  సూచిస్తున్నారు. పారిజాతం పువ్వులను కేశపుష్టి కోసం ఉపయోగించడమనేది సంప్రదాయికంగా వస్తోంది.  మగువలు పొడవైన మరియు ఆరోగ్యకరమైన వెంట్రుకలు పొందడానికి పారిజాత పుష్పాల మందును సాంప్రదాయికంగా ఉపయోగిస్తున్నారు. జుట్టు మీద పారిజాతం మొక్క యొక్క చర్యలను పరీక్షించించిన ప్రత్యక్ష పరిశోధనలేవీ ఇప్పటివరకూ లేనప్పటికీ, దీని అనామ్లజనక (యాంటీ ఆక్సిడెంట్), నొప్పినివారక (యాంటీ ఇన్ఫ్లమేటరీ) మరియు సూక్ష్మజీవనాశక (యాంటీ బాక్టీరియల్) లక్షణాలు ఇక్కడ ప్రస్తావించడం సముచితం. అంటే, పారిజాతం సాధారణంగా తలమీది చర్మానికి సంబంధించిన పలు సమస్యలను తగ్గించడంలో మాత్రమే గాకుండా పిన్న వయస్కుల్లో జుట్టు రాలిపోవడాన్ని (జుట్టు యొక్క అకాల పతనాన్ని) నిరోధిస్తుంది మరియు అత్యంత సాధారణ జుట్టు-సంబంధ వ్యాధుల నుండి ఉపశమనాన్ని కల్గిస్తుంది.

 • పారిజాతం ఆకులు మరియు పువ్వుల్ని ఇంటిలోనే టీ లేదా కషాయాన్ని  తయారు చేసుకోవడానికి ఉపయోగించవచ్చు.
 • పారిజాతం మాత్రలు, చూర్ణం మరియు క్యాప్సూల్స్ (గుళికలు) కూడా మార్కెట్ లో వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్నాయి.
 • పారిజాతం నుండి తీసిన (ఆల్కహాలిక్) మధ్యసారపదార్దాలు లేదా ఈ మొక్కల టింక్చర్ను ఆయుర్వేద ఔషధాల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తారు.
 • జుట్టు (కేశాలు) పెరుగుదల, జుట్టు ఆరోగ్య ప్రయోజనాలకు పారిజాతం నూనెను ఉపయోగిస్తారు.
 • పారిజాత తైలాన్ని (సుగంధ)తైలమర్ధనం లో ఉపయోగిస్తారు మరియు ఈ మొక్క యొక్క సువాసనను కొన్ని అత్తరువంటి సుగంధ పరిమళాల్లోను, (air fresheners) ఉపయోగిస్తారు.
 • ఈ మొక్క యొక్క పువ్వుల్ని పట్టుబట్టలకు రంగులద్దే పరిశ్రమలో (dyeing of silks) మరియు కొన్ని తీపి వంటకాల్లో ఉపయోగిస్తారు. లేలేత పారిజాతం ఆకుల్ని చెట్టు నుండి కోసి “షుక్టో” అనే  బెంగాలీ కూరకు ఓ విశిష్టమైన చేదు రుచిని కల్గించేందుకు వాడతారు.

పారిజాతానికి ఎటువంటి నిర్దేశిత మోతాదు లేదు. కాబట్టి, మీ భౌతిక, శారీరక పరిస్థితులననుసరించి పారిజాతం యొక్క సరైన మోతాదును తెలుసుకోవడానికి ఆయుర్వేద డాక్టర్తో సంప్రదించడం మంచిది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.

పారిజాతం సేవనం గురించిన అధ్యయనాలు మనుషులపైన ఇంకా జరపబడకపోవడం వలన, ఈ మందు మొక్క యొక్క దుష్ప్రభావాలు ఏమిటో తెలియదు. అయితే, ఈ మొక్కలోని పదార్ధాలు జంతువులపై చూపే ప్రభావం గురించి జరిపిన అధ్యయనాల్లో తెలిసిందేమంటే జంతువుల్లో ఇది గ్యాస్ట్రిక్ గాయాలకు కారణమవుతుంది. కాబట్టి, పారిజాతాన్ని సేవించే ముందు మీ శరీరధర్మానికి ఈ మొక్క యొక్క సంభావ్య ప్రభావాలు సరిపడతాయో లేదోనన్న విషయం గురించి మీఆయుర్వేద డాక్టర్తో  సంప్రదించి పరిశీలించటం మంచిది.

Dr. Sooraj M

Dr. Sooraj M

Ayurveda
3 Years of Experience

Dr. Heena Kakwani

Dr. Heena Kakwani

Ayurveda
3 Years of Experience

Dr. Shekhar Goswami

Dr. Shekhar Goswami

Ayurveda
4 Years of Experience

Dr Hrishikesh S Acharya

Dr Hrishikesh S Acharya

Ayurveda
3 Years of Experience

వనరులు

 1. Puri A et al. Immunostimulant activity of Nyctanthes arbor-tristis L. J Ethnopharmacol. 1994 Mar;42(1):31-7. PMID: 8046941
 2. Chhaya S. Godse et al . Antiparasitic and disease-modifying activity of Nyctanthes arbor-tristis Linn. in malaria: An exploratory clinical study. J Ayurveda Integr Med. 2016 Oct-Dec; 7(4): 238–248. PMID: 27914754
 3. Agrawal J, Shanker K, Chanda D, Pal A. Nyctanthes arbor-tristis positively affects immunopathology of malaria-infected mice prolonging its survival.. Parasitol Res. 2013 Jul;112(7):2601-9. PMID: 23624584
 4. Agrawal J, Pal A. Nyctanthes arbor-tristis Linn--a critical ethnopharmacological review. J Ethnopharmacol. 2013 Apr 19;146(3):645-58. PMID: 23376280
 5. Bramanage Sachini Rangika, Pavithra Dilakshini Dayananda, Dinithi Champika Peiris. Hypoglycemic and hypolipidemic activities of aqueous extract of flowers from Nycantus arbor-tristis L. in male mice. BMC Complement Altern Med. 2015; 15: 289. PMID: 26285827
 6. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Intestinal worms.
 7. Sanjita Das, D. Sasmal, S. P. Basu. Evaluation of CNS Depressant Activity of Different Plant parts of Nyctanthes arbortristis Linn. Indian J Pharm Sci. 2008 Nov-Dec; 70(6): 803–806. PMID: 21369448
 8. Saxena RS, Gupta B, Lata S. Tranquilizing, antihistaminic and purgative activity of Nyctanthes arbor tristis leaf extract. J Ethnopharmacol. 2002 Aug;81(3):321-5. PMID: 12127232
 9. Anowar Hussain, Anand Ramteke. Flower extract of Nyctanthes arbor-tristis modulates glutathione level in hydrogen peroxide treated lymphocytes. Pharmacognosy Res. 2012 Oct-Dec; 4(4): 230–233. PMID: 23225968
 10. Bibhuti Bhusan Kakoti, Paresh Pradhan, Sudarshana Borah, Kabita Mahato, Mritunjay Kumar. Analgesic and Anti-Inflammatory Activities of the Methanolic Stem Bark Extract of Nyctanthes arbor-tristis Linn.. Biomed Res Int. 2013; 2013: 826295. PMID: 23984409
Read on app