రొమ్ము పడిసెం - Bronchitis in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

November 29, 2018

March 06, 2020

రొమ్ము పడిసెం
రొమ్ము పడిసెం

రొమ్ము పడిసెం  అంటే ఏమిటి?

రొమ్ము పడిసెం అనేది శ్వాసనాళాల యొక్క లోఅస్తిరి మంటకు లేదా వాపుకు గురయ్యే  ఒక సాధారణ ఊపిరితిత్తుల స్థితి. ఈ శ్వాసనాళాలు (గొట్టాలు) ఊపిరితిత్తుల నుండి గాలిని లోనికి బయటకు పడతాయి. ఈ శ్వాసనాళాల వాపు కారణంగా గొట్టాలు సంకోచానికి గురై  మనిషి శ్వాస తీసుకోవడంలో కష్టమవుతుంది. రొమ్ము పడిసెంలో వచ్చే దగ్గు సాధారణంగా దట్టమైన శ్లేష్మ ఉత్పత్తికి సంబంధించినది. రొమ్ము పడిసెం  తీవ్రమైనది లేదా దీర్ఘకాలికమైంది కావచ్చు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

రొమ్జుపడిసెం యొక్క లక్షణాలు పరిస్థితి యొక్క దశపై ఆధారపడి వేరు వేరుగా ఉంటాయి. కొన్ని లక్షణాలు తీవ్రమైన మరియు దీర్ఘకాలికమైన రెండు రకాలైన రొమ్ము పడిశానికీ ఒకేవిధంగా ఉన్నప్పటికీ, కొన్ని నిర్దిష్ట లక్షణాలు దీర్ఘకాలకాళిక రొమ్ముపడిసెంలోనే  గుర్తించబడతాయి.

సాధారణ లక్షణాలు:

 • ఛాతీ బిర్రబిగుసుకుపోవడం మరియు శ్వాస పీల్చడంలో కష్టం
 • తేలికపాటి జ్వరం మరియు చలి
 • శ్లేష్మంతో దగ్గు, ఇది స్పష్టమైన, ఆకుపచ్చ లేదా లేత పసుపు రంగులో, మరియు కొన్నిసార్లు రక్తం మరకలతో కూడుకుని ఉండవచ్చు

తీవ్రమైన రొమ్ము పడిసెం :

దగ్గు ఎక్కువ కాలం ఉండవచ్చు కానీ చాలా లక్షణాలు సాధారణంగా ఒక వారం లోపల తగ్గుముఖం పట్టి పరిస్థితి మెరుగవుతుంది.

దీర్గకాలిక రొమ్ము పడిసెం:

 • తేపలు-తేపలుగా పునరావృతమయ్యే దగ్గు
 • దగ్గు తేలికగా ఉండవచ్చు లేదా మరింత తీవ్రమవచ్చు.
 • కనీసం మూడు నెలలు ఉంటుంది

రొమ్ము పడిసెం  యొక్క ప్రధాన కారణాలు ఏమిటి?

ఇన్ఫ్లుఎంజా వైరస్ వంటి జలుబుమరియు ఫ్లూ జబ్బుల్ని కలిగించే సాధారణ వైరస్లు రొమ్ము పడిశానికి కూడా కారణమవుతాయి.అయితే, దీర్ఘకాలిక రొమ్ము పడిసెం “గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్” కారణంగా రావచ్చు, ఇంటిలో లేదా కార్యాలయంలో ఊపిరితిత్తుల్ని చికాకుపరిచే  వస్తువులు మరియు రసాయనాలకు బహిర్గతం కావడంవల్ల రావచ్చు, రోగ నిరోధకత తగ్గడం లేదా ధూమపానం వల్ల రావచ్చు.

రొమ్ము పడిశాన్ని ఎలా నిర్ధారించేది మరియు దీనికి చికిత్స ఏమిటి?

రొమ్జుపడిశాన్ని దాని ప్రారంభ దశలలో సాధారణ జలుబు నుండి వేరు చేసి ప్రత్యేకంగా పరిగణించడం ఒకింత కష్టం కావచ్చు. వైద్యులు సాధారణంగా ఈ క్రింది పరీక్షలను ఈ పరిస్థితిని విశ్లేషించడానికి ఉపయోగిస్తారు:

 • అలెర్జీలు లేదా ఇతర వ్యాధుల సంకేతాల కోసం కఫం యొక్క పరీక్ష
 • ఛాతీ X- రే: ధూమపానం చేసేవారిలో వచ్చే దగ్గును పరీక్షించేందుకు, న్యుమోనియా లేదా ఇతర సమస్యల ప్రమాదాల్ని తొసిపుచ్చేటందుకు ఛాతీ X- రే పరీక్ష
 • ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని అంచనా వేయడానికి మరియు ఎంఫిసెమా (ఊపిరితిత్తులలోని వాయు గోళాల వాపు) మరియు ఉబ్బసం సంకేతాల కోసం శ్వాసకోశ (పుపుస) పనితీరు పరీక్షలు

తీవ్రమైన రొమ్ము పడిసెం అనేకమందికి వైరస్లు వల్లనే దాపురిస్తుంది. ఇందుకు యాంటీబయాటిక్స్ మందులు సూచించబడవు. చాలా తరచుగా,ఈ వ్యాధి కొన్ని రోజుల్లో దానంతటదే తగ్గిపోతుంది. ఏదేమైనా, బాగా నిద్రపట్టేందుకు వైద్యులు దగ్గు సిరప్లను సూచించవచ్చు మరియు శ్వాసక్రియను తగ్గిస్తుంది మరియు సన్నని వాయువులను పెంచడానికి ధ్వని నిద్ర మరియు శ్వాసనాళాల్లో మంట, వాపును తగ్గించేందుకు, కుంచించుకుపోయిన శ్వాసగొట్టాలను వెడల్పు చేయడానికి వైద్యులు మందులను ఇవ్వవచ్చు. ఆస్టమా (ఉబ్బసం), ఊపిరితిత్తుల వ్యాధులగ్గాను వైద్యులు మందులు సూచించవచ్చు. శ్వాస వ్యాయామాలు, ఆక్సిజన్ థెరపీ, ధూమపానం విడిచిపెట్టడం,  ద్రవాహారాల్ని అధికం చేయటం, మరియు ఆవిరి పీల్చడం అనేవి ఈ వ్యాధి విషయంలో వ్యాధి లక్షణాల నుండి ఉపశమనం కలిగించే ఇతర ముఖ్యమైన చర్యలు. ఇందుగ్గాను, తీసుకోవల్సిన ముందు జాగ్రతలీవిధంగా ఉన్నాయి. :

 • బయట ఉన్నప్పుడు ముసుగు ధరించడం
 • ఇంటి లోపల తేమనందించే పరికరం హ్యూమిడిఫయ్యర్ ను ఉపయోగించండం
 • కాలుష్యం మరియు మంటను కల్గించే వాటికి దూరంగా ఉండటం
 • రొమ్ము పడిసెం పునరావృతమవటాన్నినిరోధించడానికి ఫ్లూ టీకా మందును  తీసుకోవడం.వనరులు

 1. National Heart, Lung, and Blood Institute [Internet]: U.S. Department of Health and Human Services; Bronchitis
 2. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Bronchitis
 3. American lung association. Learn About Acute Bronchitis. Chicago, Illinois, United States
 4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Acute Bronchitis
 5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Chronic Bronchitis

రొమ్ము పడిసెం కొరకు మందులు

Medicines listed below are available for రొమ్ము పడిసెం. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.