myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

సారాంశం

ఎర్ర రక్త కణాల సంఖ్య (RBC) లేదా హేమోగ్లోబిన్ సాంద్రత తగ్గడం వలన రక్తహీనత ఏర్పడుతుంది. ఇనుము లోపం వలన కలిగే రక్త హీనత, మెగాలోబ్లాస్టిక్ అనీమియా, అప్లాస్టిక్ అనీమియా మరియు మరిన్ని అనేక రకాలైన రక్తహీనతలు ఉన్నాయి. పరాన్నజీవి సంక్రమణ వలన భారీ రక్త నష్టం, భారీ రుతుస్రావo, గర్భం మరియు అసమతుల్య పోషణ వంటివి ఈ పరిస్థితికి కారణాలు కావచ్చు. రక్త హీనత అనేది అలసట, బలహీనత, పాలి పోయిన లేత చర్మం మరియు శ్వాసలో ఇబ్బందులు వంటి లక్షణాలకు దారితీస్తుంది. హేమోగ్లోబిన్ మరియు ఎర్ర రక్త కణాలు లెక్కింపు, పరాన్నజీవి సంక్రమణను తొలగించడానికి మల పరీక్ష, మరియు అప్లాస్టిక్ రక్తహీనత విషయంలో ఎముక మజ్జ యొక్క పరీక్షతో సహా పూర్తి రక్త కణాల లెక్కింపు వంటి విశ్లేషణ పరీక్షల ద్వారా దీనిని పరిశోధించవచ్చు. రక్తహీనత యొక్క చికిత్స దాని సంబంధిత కారణం మీద ఆధారపడి ఉంటుంది మరియు పోషకాహార లోపం అనీమియా విషయంలో సరైన పోషకాహారం మరియు ఐరన్ కలిగిన మందులు వాడవచ్చు. తీవ్రమైన రక్తహీనత అయినచో మొత్తం రక్త మార్పిడి చేయుట ద్వారా నయం చేయబడుతుంది. అప్లాస్టిక్ రక్తహీనత లేదా నిరంతర రక్తహీనత విషయంలో, ఎముక మజ్జ మార్పిడి సాధారణంగా చివరి ప్రయత్నం అవుతుంది. రక్తహీనత యొక్క ఫలితం సంబంధిత స్థితిపై ఆధారపడి ఉంటుంది మరియు చాలా వరకు దీని కారణాలపై చికిత్స చేయవచ్చు, ఇది మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది. పరిస్థితి సరిగా లేనట్లయితే, రక్తహీనత వలన అకాల డెలివరీ, నవజాత శిశువులో రక్తహీనత, తక్కువ బరువు కలిగి ఉండడం, మూర్ఛలు మరియు ఇతరులలో అవయవ నష్టం వంటి సమస్యలకు దారి తీస్తుంది.

 1. రక్తహీనత (అనీమియా) యొక్క లక్షణాలు - Symptoms of Anemia in Telugu
 2. రక్తహీనత (అనీమియా) యొక్క చికిత్స - Treatment of Anemia in Telugu
 3. రక్తహీనత (అనీమియా) కొరకు మందులు
 4. రక్తహీనత (అనీమియా) వైద్యులు

రక్తహీనత (అనీమియా) యొక్క లక్షణాలు - Symptoms of Anemia in Telugu

పైన చెప్పినట్లుగా, రక్తహీనతలో, రక్తం యొక్క ఆక్సిజన్-వాహక సామర్థ్యం తగ్గిపోతుంది. అందువలన, ఈ మార్పుకు సంబంధించిన లక్షణాలు కూడా ఇలా ఉంటాయి:

 • బలహీనత
  బలహీనత భావన అనేది రక్తహీనత యొక్క అత్యంత సాధారణ లక్షణం మరియు ఏదైనా ముఖ్యమైన భారీ పని చేయకుండానే అలసట కలిగి ఉండటాన్ని గుర్తించవచ్చు.
 • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం
  రక్తహీనత యొక్క అత్యంత గుర్తించదగ్గ లక్షణాలలో ఒకటి శ్వాస తీసుకోవడంలో లేదా శ్వాసను కోసం ప్రయత్నాలు చేపట్టడంలో కష్టoగా ఉంటుంది.
 • అసౌకర్య భావన
  రక్తహీనత కారణంగా కొన్నిసార్లు మీకు ఆరోగ్యంగా ఉన్న భావన కలుగకపోవచ్చు లేడా ఇది చెప్పలేని విధంగా అసౌకర్య భావన కలిగి ఉంటుంది.
 • మైకము
  ఒక్కోసారి పడిపోవడం కారణంగా కూడా గాయం వంటి సమస్యలకు దారి తీయవచ్చు కాబట్టి మైకమును విస్మరించరాదు. ఇది మీ మెదడుకు తగిన ప్రాణవాయువు సరఫరా లేని కారణంగా ఇలా జరుగుతుంది.
 • పనితీరులో తగ్గుదల
  మీరు ఇంతకు ముందు సులభంగా చేయగలిగిన వాటిని ఇప్పుడు చేయలేరు అలాగే మీరు ఎలాంటి వ్యాయామం కూడా చేయలేరు. ఇది ఏకాగ్రత చేయలేకపోవడం లేదా పనిలో దృష్టి పెట్టలేకపోవడం వంటివి ఉండవచ్చు
 • తలనొప్పి
  ఒక తలనొప్పి అనేది అనారోగ్యం యొక్క ఒక అరుదైన లక్షణం, ఇది తేలికపాటి నుండి మధ్యస్థ నొప్పికి కారణమవుతుంది.
 • పికా
  సున్నం, ఐస్ మరియు బంకమట్టి వంటి సామాన్యంగా తినదగని వస్తువులను తినడం లేదా తినాలి అనిపించడం. ఇది రక్తహీనతతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటుంది కాని తరచూ చూస్తుంటాము

రక్తహీనత (అనీమియా) యొక్క చికిత్స - Treatment of Anemia in Telugu

రక్తహీనత చికిత్స అనేది సాధారణంగా సంబంధిత కారణం, రక్తహీనత యొక్క గ్రేడ్ మరియు వ్యక్తి యొక్క మొత్తం ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

రక్తహీనత చికిత్స కోసం సాధారణ సూచనలు:

 • మీ డాక్టర్ సూచన ప్రకారం ఐరన్, విటమిన్ B12 మరియు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా సరైన పోషణను నిర్వహించడం.
 • ఆకుపచ్చ ఆకు కూరలు, తాజా పండ్లు, గుడ్డు, మాంసం, చేప వంటి ఐరన్ కలిగిన ఆహారం తీసుకోవాలి.
 • నిమ్మకాయలు, నారింజ, మామిడి, మరియు మరిన్ని సహా సిట్రస్ పండ్లు వంటి విటమిన్-రిచ్ ఆహారాలు తగినంత మొత్తంలో తీసుకోవడం. అంతేకాకుండా, విటమిన్ C సప్లిమెంట్స్ కూడా కౌంటర్­లో అందుబాటులో లభిస్తాయి. అయితే, మీ వయస్సు మరియు శరీర బరువు వంటి సరైన మోతాదును తెలుసుకోవడానికి మీ వైద్యుడిని సంప్రదించాలి.
 • పిల్లల కడుపులోని పురుగుల నిర్మూలన కోసం అల్పెండజోల్ టాబ్లెట్ ప్రతి ఆరునెలలకొకసారి ఇవ్వడం
 • యుక్తవయసులో గల బాలురు మరియు బాలికలు మరియు గర్భిణీ స్త్రీలలో వారి రక్తహీనత స్థితితో సంబంధం లేకుండా ఒక నిర్బంధ ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ఇవ్వడం.

రక్తహీనత యొక్క స్థాయి ఆధారంగా చికిత్స:

 • తేలికపాటి రక్తహీనత కోసం, మీ డాక్టర్ ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ అధికంగాలభించే ఆహారం తీసుకోవాలని మీకు సలహా ఇస్తారు.
 • రక్తపోటు యొక్క ఒక మోస్తరు స్థాయిలో, ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మందులను మీ డాక్టర్ సిఫార్సు చేయవచ్చు. ప్రత్యేకంగా మీరు ఏ లక్షణం కన్పించని విధంగా ఉంటే మరియు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అసహనత వంటి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా నోటి ఐరన్ థెరపీని తట్టుకోగలిగితే, ఇది అతిసారం ఏర్పడుతుంది. నోటి ద్వారా ఐరన్ తీసుకోవడంలో అసహనంగా ఉంటే, మీ వైద్యుడు సూది చికిత్సను ప్రారంభించవచ్చు, సాధారణంగా ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేదు, మరియు తగిన మోతాదు తీసుకున్న తరువాత మీరు ఇంటికి వెళ్ళవచ్చు.
 • తీవ్రమైన రక్తహీనత సందర్భంలో, మీ మొత్తం ఆరోగ్యo బట్టి, మీ డాక్టర్ సూది ద్వారా వేయు ఐరన్ ఎంచుకోవచ్చు లేదా నాడి, రక్తపోటు, శ్వాస వంటి మీ కీలకమైన వాటిని ఆసుపత్రిలో తనిఖీ చేయిన్చికోవలసినడిగా సలహా ఇవ్వవచ్చు. అలాగే, కొన్నిసార్లు కృత్రిమ ఆక్సిజన్ కూడా అవసరం కావచ్చు
 • రక్త మార్పిడి
  తీవ్రమైన రక్తహీనత మరియు సికిల్ సెల్ రక్తహీనత మరియు థాలస్సేమియా వంటి పరిస్థితులలో, రక్తమార్పిడి ఎంపికయే సరియైన చికిత్స.
 • ఎముక మజ్జ మార్పిడి
  ఎముక మజ్జ అనేది పొడవైన ఎముకలలో గల రక్త కణాల ఉత్పత్తి కణజాలం. అప్లాస్టిక్ అనీమియా వంటి పరిస్థితులలో, ఎముక మజ్జలో ఒక నాశనం లేదా వైఫల్యం, మరియు ఇది రక్త కణాలను ఉత్పత్తి చేయదు. అందువలన, ఆరోగ్యకరమైన దాత నుండి ఎముక మజ్జను ఒక వ్యక్తికి సర్జరీ ద్వారా మార్చవచ్చు.
 • ఎరిథ్రోపోయిటిన్
  ఇది మూత్రపిండంలో ఉండే ఒక హార్మోన్, ఇది రక్త కణాల ఉత్పత్తికి అవసరం. ఇది మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ప్రజలలో రక్తహీనతకు చికిత్స చేయటానికి ఉపయోగించవచ్చు, ఇవి మూత్రపిండాల నష్టం కారణంగా ఎరిత్రోపోయిటేన్­ను ఉత్పత్తి చేయలేకపోతాయి.
 • స్ప్లెనెక్టమీ
  ప్లీహము అనేది కడుపునకు సమీపంలో ఉన్న చిన్న అవయవము, కొత్త ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇది ముఖ్యమైనది అలాగే పాత రక్త కణాలను నాశనం చేస్తుంది. ఎర్ర రక్త కణాలు 120 రోజులు వరకు జీవిస్తాయి. రక్తహీనత ఉన్నవారిలో, కొన్నిసార్లు ప్లీహములోని ఎర్ర రక్త కణాల అధిక పతనానికి కారణం అవుతాయి. ఇటువంటి సందర్భాల్లో, శస్త్రచికిత్స ద్వారా ప్లీహము యొక్క తొలగింపు అనేది చికిత్స యొక్క సరైన ఎంపిక (స్ప్లెనెక్టమీ).

గర్భంతో ఉన్న వారిలో రక్తహీనత యొక్క చికిత్స:

 • 9-11 g/dL యొక్క హిమోగ్లోబిన్ స్థాయిలలో తేలికపాటి రక్తహీనత కోసం, మీ డాక్టర్ రోజువారీ నోటి ద్వారా తీసుకొనే ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవలసినదిగా సలహా ఇవ్వవచ్చు మరియు దాని ప్రభావాన్ని తనిఖీ చేసుకోవటానికి ఒక నెల తర్వాత ప్రయోగశాలలో పరీక్షలు చేయించుకోవలసినదిగా చెప్పవచ్చు.
 • 7-9 g / dL యొక్క హేమోగ్లోబిన్ స్థాయిలతో ఒక మోస్తరు రక్తహీనత కోసం, మీ వైద్యుడు మొదట కారణాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు మరియు తర్వాత నోటి ద్వారా తీసుకొనే ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఇవ్వడం ద్వారా చికిత్సను ప్రారంభించవచ్చు. హెమోగ్లోబిన్ స్థాయిలు 8-9 g / dL మధ్య చేరుకున్నాయా అనేదానిని పరిశీలించడానికి నెలవారీ తిరిగి అంచనా వేయుట జరుగుతుంది. మీ వైద్యుడు మీ హేమోగ్లోబిన్ స్థాయిలను 9 g/dL చేరుకొనేలా చేయడానికి ఇంజెక్షన్ చేయగల ఐరన్ సప్లిమెంట్లను కూడా మొదలుపెడతారు, తరువాత మళ్లీ మీ నోటి ద్వారా తీసుకొనే మందులను కొనసాగిస్తారు.
 • 7 g / dL కంటే తక్కువ హేమోగ్లోబిన్ స్థాయిలతో కలిగే తీవ్రమైన రక్తహీనతకు, మీ డాక్టర్ అలాంటి తక్కువ స్థాయిలకు కారణం తెలుసుకొని మరియు సూది ద్వారా వేసే ఐరన్ సప్లిమెంట్లను వెంటనే ప్రారంభించవచ్చు. డెలివరీ సమయం దగ్గరవుతున్నట్లయితే లేదా హేమోగ్లోబిన్ స్థాయి చాలా తక్కువగా ఉన్నట్లయితే కూడా డాక్టర్ రక్త మార్పిడి కోసం ఆసుపత్రిలో చేరవలసినదిగా చెప్పవచ్చు.

జీవనశైలి నిర్వహణ

రక్తహీనతను కొన్ని సాధారణ జీవనశైలి మార్పులు ద్వారా సమర్థవంతంగా నిర్వహించవచ్చు.

వీటితొ పాటు

 • పొగాకు వినియోగాన్ని నివారించుట
  పొగాకు వినియోగం ఐరన్ శోషణ మరియు జీవక్రియను ప్రభావితం చేస్తుంది, ఇది శరీరంలో ఐరన్ స్థాయిని తగ్గిస్తుంది. అందువలన, పొగాకు వాడకాన్ని నివారించడం రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది.
 • ఆహారంతో టీ తీసుకోవటాన్ని నివారించడం
  టీ అనేది ఐరన్ శోషణకు హాని కలిగిస్తుంది, అందువలన భోజనాలతో టీ తీసుకోవడాన్ని నివారిస్తే ఐరన్ యొక్క శోషణను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.
 • ఐరన్­ కూడిన ఆహారాన్ని తీసుకోవడం
  శరీరంలో తగినంత ఐరన్ నిల్వలను నిర్వహించడానికి, పచ్చని ఆకు కూరలు, తాజా పండ్లు, బీన్స్, గుడ్లు, చేపలు మరియు మాంసంలో అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
Dr. Gaurav Chauhan

Dr. Gaurav Chauhan

सामान्य चिकित्सा

Dr. Sushila Kataria

Dr. Sushila Kataria

सामान्य चिकित्सा

Dr. Sanjay Mittal

Dr. Sanjay Mittal

सामान्य चिकित्सा

రక్తహీనత (అనీమియా) కొరకు మందులు

రక్తహీనత (అనీమియా) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
G NeuroG Neuro 75 Mg/750 Mcg Capsule83
Zifol XtZifol Xt Suspension122
Deca Durabolin InjectionDeca Durabolin 50 Mg Injection270
Haem Up FastHaem Up Fast Tablet70
Pregeb MPregeb M 150 Capsule200
RicharRichar Cr 100 Tablet Cr116
MethycobalMethycobal Tablet96
Orofer XtOrofer XT Kit Tablet0
CrespCresp 25 Mcg Injection1279
Orofer SOrofer S 100 Mg Injection225
Pregalin MPregalin M 1500 Mcg/150 Mg Tablet200
Milcy ForteMilcy Forte Tablet0
NeuroxetinNeuroxetin 20 Mg/0.5 Mg Capsule37
Deca AnabolinDeca Anabolin 25 Mg Injection108
Mecobion PMecobion P 750 Mcg/150 Mg Tablet68
Rejunuron DlRejunuron Dl 30 Mg/750 Mg Capsule52
Schwabe Natrum muriaticum TabletSchwabe Natrum muriaticum Biochemic Tablet 200X560
Decabolin (Medinova)Decabolin 25 Mg Injection60
Mecoblend PMecoblend P Tablet72
Dulane MDulane M 20 Mg/1.5 Mg Tablet81
DecadurakopDecadurakop 25 Mg Injection77
Neurodin GNeurodin G 300 Mg/1500 Mcg Tablet72
Mecofort PgMecofort Pg Capsule0
Dumore MDumore M Capsule103

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. N. J. Kassebaum, R. Jasrasaria, M. Naghavi et al. A systematic analysis of global anemia burden from 1990 to 2010. Blood.2014; 123 (5): 615–624. PMID: 24297872
 2. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Worldwide prevalence of anaemia 1993–2005.
 3. Powers JM, Buchanan GR. Diagnosis and management of iron deficiency anemia. Hematol Oncol Clin North Am. 2014; 28:729–45. PMID: 25064710
 4. M. Goonewardene, M. Shehata, A. Hamad. Anaemia in pregnancy. Best Pract Res Clin Obstet Gynaecol. 2012 Feb;26(1):3-24. PMID: 22138002
 5. Ware, R. E., de Montalembert, M., Tshilolo, L., & Abboud, M. R. (2017). Sickle cell disease. The Lancet, 390(10091), 311–323. PMID: 28159390
 6. Taher, A. T., Weatherall, D. J., & Cappellini, M. D. (2018). Thalassaemia. The Lancet, 391(10116), 155–167. PMID: 28774421
 7. Sugimori C, Chuhjo T, Feng X, et al. Minor population of CD55-CD59-blood cells predicts response to immunosuppressive therapy and prognosis in patients with aplastic anemia. Blood. 2016; 107(4):1308–1315. PMID: 16179371
 8. Al-Atrakji MY. The effects of ferrous sulfate as an iron supplement on ejection fraction in patients with iron deficiency anemia associated with decompensated heart failure. Mustansiriya Med J 2018; 17:22-8. [Internet]
 9. Gupta, U. C. and Gupta, S. C. (2014). Sources and deficiency diseases of mineral nutrients in human health and nutrition: A review. Pedosphere 24(1):13–38. [Internet]
 10. A.Rammohan, N. Awofeso, and M.-C. Robitaille. “Addressing female iron-deficiency anaemia in India: is vegetarianism the major obstacle?” ISRN Public Health, vol. 2012, 8 pages, 2012. [Internet]
 11. Oh R, Brown DL. Vitamin B12 deficiency. Am Fam Physician. 2003; 67(5): 979–986.
 12. G. S. Toteja, P. Singh, B. S. Dhillon et al. “Prevalence of anemia among pregnant women and adolescent girls in 16 districts of India,” . Food and Nutrition Bulletin, vol. 27, no. 4, pp. 311–315, 2006 [Internet]
 13. Ananth JV, Sudharshan S, Selvakumar A, Devaleenal BJ, Kalaivani K, Biswas J. Idiopathic intracranial hypertension associated with anaemia, secondary to antiretroviral drug in a human immunodeficiency virus positive patient. Indian Journal of Ophthalmology. 2018; 66(1):168-169. doi:10.4103/ijo.IJO_592_17.
 14. Besarab A, Hörl WH, Silverberg D. Iron metabolism, iron deficiency, thrombocytosis, and the cardiorenal anemia syndrome. Oncologist 2009; 14 Suppl 1:22 33. PMID: 19762514
 15. B. Lonnerdal. “Soybean ferritin: implications for iron status of vegetarians,”. The American Journal of Clinical Nutrition, vol. 89, no. 5, pp. 1680S–1685S, 2009.
 16. Rammohan A, Awofeso N, Robitaille M.A. Addressing Female Iron-Deficiency Anaemia in India: Is Vegetarianism the Major Obstacle?. ISRN Public Health. 2012; 1-8.
 17. Kocyigit A, Erel O, Gur S. Effects of tobacco smoking on plasma selenium, zinc, copper and iron concentrations and related antioxidative enzyme activities. Clin Biochem. 2001; 34:629–33. PMID: 11849622
 18. Chen, C., Grewal, J., Betran, A. P., Vogel, J. P., Souza, J. P., & Zhang J. Severe anemia, sickle cell disease, and thalassemia as risk factors for hypertensive disorders in pregnancy in developing countries. Pregnancy Hypertension. 2018; 13:141–147. PMID: 30177043
 19. B. J. Brabin, M. Hakimi, and D. Pelletier. “An analysis of anemia and pregnancy-related maternal mortality,” Journal of Nutrition, vol. 131, no. 2, pp. 604S–614S, 2001.
और पढ़ें ...