ప్రతి రోజు 100 తంతువుల (వెంట్రుకలు) జుట్టును రాలిపోవడం సాధారణం. జుట్టు యొక్క సహజ జీవిత చక్రం (natural life cycle) దీనికి కారణం. పాత జుట్టు కొత్తదానితో భర్తీ చేయబడుతుంది. కానీ, జుట్టు పలుచబడడం, జుట్టు దువ్విన ప్రతి సారి అధికంగా జుట్టు రాలిపోవడం, బట్టతల వంటి పాచెస్ (ఖాళీలు) ఏర్పడడం వంటి లక్షణాలు గమనించిన్నప్పుడు సమస్య తలెత్తుతుంది. అది ఒక భయానకమైన విషయం, కదా?
జుట్టు రాలడం మహిళల కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది, వయస్సుతో పాటు దాని తీవ్రత క్రమంగా పెరుగుతుంది. ఇది ఒత్తిడి, ఆకస్మికంగా బరువు తగ్గడం, పోషక లోపాలు, కొన్ని మందుల వలన వస్తుంది. కానీ, ముఖ్యంగా వ్యక్తి జన్యువుల వల్లన ఇది సంభవిస్తుంది.
కొంత మొత్తంలో జుట్టు రాలడం అనివార్యం, కానీ, తీవ్రమైన జుట్టు నష్టాన్ని నివారించడానికి సులువుగా అనుసరించగల కొన్ని చిట్కాలు, నివారణలు మరియు చికిత్సలు ఉన్నాయి. కొబ్బరి నూనె మరియు లావెండర్ నూనె వంటి కొన్ని నూనెలు మరియు విటమిన్ ఇ వంటి విటమిన్లు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిరూపించబడ్డాయి మరియు అవి సమర్థవంతమైన జుట్టు రాలడాన్ని తగ్గించే చిట్కాలుగా కూడా పనిచేస్తాయి.
ఈ వ్యాసంలో జుట్టు రాలడాన్ని నివారించగల అనేక ముఖ్యమైన నివారణలు/చిట్కాలు చర్చించబడ్డాయి.