కడుపులో పురుగులు - Intestinal Worms in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

December 03, 2018

March 06, 2020

కడుపులో పురుగులు
కడుపులో పురుగులు

కడుపులో పురుగులు అంటే ఏమిటి?

కడుపులో పురుగులు సంక్రమణ/ఇన్ఫెక్షన్ అనేది సాధారణమైన సంక్రమణ రకం ఇది సాధారణంగా పేద ఆర్థిక పరిస్థితులు మరియు అనారోగ్యకర జీవన పరిస్థితులతో ముడిపడి ఉంటుంది. ఇది విప్వార్మ్ (whipworms), ఏలికపాము (టేప్వార్మ్స్), కొంకిపురుగు (హుక్స్వార్మ్స్) , నులిపురుగు (థ్రెడ్వార్మ్స్) మరియు రౌండ్వార్మ్స్ (roundworm) వంటివాటి వల్ల సంభవించవచ్చు. ఈ పరాన్నజీవులు (parasites) శరీరంలో ముఖ్యంగా ప్రేగులులో పునరుత్పత్తి అవుతాయి.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కడుపులో పురుగుల సంక్రమణల/ఇన్ఫెక్షన్ల యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు ఈ విధంగా ఉంటాయి:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కడుపులో పురుగుల సంక్రమణకు కారణమయ్యే పరాన్నజీవులు వివిధ మార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశించవచ్చు. వ్యక్తికి సంక్రమణను కలిగించే సాధారణ కారకాలు:

 • పరిశుభ్రత లేకపోవడం
 • పచ్చి లేదా వండని ఆహారం తినడం
 • కలుషిత ఆహార మరియు నీటి ఉపయోగం
 • అనారోగ్యకరమైన ప్రాంతాలలో చెప్పులు లేకుండా నడవడం
 • కలుషిత మట్టిని తాకడం
 • ప్లేట్లు, తినే పాత్రలు, బొమ్మలు, టాయిలెట్ సీట్లు, పరుపులు మొదలైనటువంటి కలుషితమైన వస్తువులను తాకడం (సంబంధం కలిగి ఉండడం).
 • దగ్గరగా ఉండడం వలన ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

రోగ నిర్ధారణ ప్రధానంగా రోగి యొక్క సంకేతాలు మరియు లక్షణాల ఆధారంగా ఉంటుంది మరియు వైద్యులు ఈ కింది పరీక్షలను ఆదేశిస్తారు/నిర్వహిస్తారు:

 • స్టూల్ రొటీన్ (Stool routine) లేదా సంక్రమణ నిర్దారణ కోసం మల సాగు
 • టేప్ పరీక్ష(Tape test): ఈ పరీక్షలో, పరాన్నజీవుల గుడ్లు యొక్క మైక్రోస్కోపిక్ పరీక్ష చేయబడుతుంది, అంటే పాయువు/మలద్వారం చుట్టూ ఉన్న చర్మంపై సెల్లోఫేన్ టేప్ను (cellophane tape) నొక్కిపెడతారు, తర్వాత మైక్రోస్కోప్ ద్వారా పరిశీలిస్తారు.
 • విజువల్ పరీక్ష(Visual examination): పిల్లల పాయువు/మలద్వారం, లోదుస్తుల లేదా డైపర్లు పరిశీలించడం.

కడుపులో పురుగుల సంక్రమణ యొక్క నిర్వహణ:

 • కడుపులో పురుగుల సంక్రమణ నిర్వహణకు తగిన పరిశుభ్రమైన విధానాలు పాటించడం  అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
 • పాఠశాల పిల్లలు కోసం పారిశుధ్య పద్ధతులు మెరుగుపరచడం వారు చేతులు కడుగుకోవడాన్ని ప్రోత్సహించడం.
 • ఆరోగ్యం మరియు పరిశుభ్రత వంటి ఆరోగ్యకరమైన నడవడికల గురించి తెలియజేయడం సంక్రమణల వ్యాప్తిని మరియు మళ్ళి సంక్రమణ సంభవించడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
 • తగినంతగా పారిశుద్ధ్య సౌకర్యాలను అభివృద్ధి చేయడం.
 • అప్పుడప్పుడు  పొట్టలోని పురుగులను నిర్మూలించే (డివార్మింగ్) మాత్రలు ఉపయోగించడం  కూడా సహాయపడుతుంది.
 • ప్రీస్కూల్ పిల్లలకు విటమిన్ ఏ (A) తో పాటు అదనపు పోషకాలని అందించడం.
 • అంత్హెల్మెంతిక్ (anthelminthic) మందులతో చికిత్సను అందించడం.వనరులు

 1. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Intestinal worms.
 2. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Intestinal worms.
 3. Rashidul Haque. Human Intestinal Parasites. J Health Popul Nutr. 2007 Dec; 25(4): 387–391. PMID: 18402180
 4. Cooper PJ. Intestinal worms and human allergy.. Parasite Immunol. 2004 Nov-Dec;26(11-12):455-67. PMID: 15771681
 5. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Intestinal worms.

కడుపులో పురుగులు వైద్యులు

Dr Rahul Gam Dr Rahul Gam Infectious Disease
8 वर्षों का अनुभव
Dr. Arun R Dr. Arun R Infectious Disease
5 वर्षों का अनुभव
Dr. Neha Gupta Dr. Neha Gupta Infectious Disease
16 वर्षों का अनुभव
Dr. Lalit Shishara Dr. Lalit Shishara Infectious Disease
8 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

కడుపులో పురుగులు కొరకు మందులు

కడుపులో పురుగులు के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।