సారాంశం

శరీరము యొక్క విషపదార్థాలు మరియు వ్యర్థ పదార్థాలను శుభ్రపరచుటకు మన యొక్క మూత్రపిండాలు పునాది వంటివి.  అయితే, ఒకటి లేక రెండు మూత్రపిండాలలో అభివృధ్ధి చెందిన చిన్నగట్టి నిర్మాణాలు ఈ ప్రక్రియను అసౌకర్యముగాను మరియు అసహ్యకరముగాను చేస్తాయి.  మూత్రపిండాలలో రాళ్లు అనునవి సాధారణముగా ఎక్కువ బాధాకరమైనవి.  ఈ పరిస్థితి సాధారణముగా స్త్రీల జనాభాలో కంటే ఎక్కువగా పురుషుల జనాభాలో కనిపిస్తుంది, మూత్రపిండాలలో రాళ్లు చిన్నవిగా, గులకరాళ్లను పోలి ఒకటి లేక రెండు మూత్రపిండాలలో గట్టి నిర్మాణాలుగా పెరుగుతాయి.  ఇవి పరిమాణములో, స్వభావములో, రంగు మరియు రకములో తేడాలను కలిగిఉంటాయి.  కొన్ని ఖనిజాల యొక్క నిక్షేపణ కారణముగా ఇవి అభివృధ్ధి చెందుతాయి.  ఇవి కాల్షియం, యూరిక్ ఆమ్లము యొక్క కృత్రిమ స్థాయిల వలన లేక స్ట్రువైట్ లేక సిస్టినూరియా (మూత్రములో సిస్టైన్ ఆమ్లము యొక్క లీకేజి) యొక్క పరిస్థితి ఫలితముగా ఈ నిక్షేపణ జరుగుతుంది.

మూత్ర విసర్జనకు తరచుగా వెళ్లడము, వెళ్లిన ప్రతీసారి కొంత పరిమాణములో మాత్రమే పోయడము వంటి లక్షణముతో పాటు మూత్రము యొక్క రంగు మరియు వాసనలో మార్పు రావడము అనునవి సాధారణముగా కనిపించే మార్పులు.  దీనితోపాటు, నడుము క్రింది భాగములో, బొడ్డు క్రింది భాగములో, ప్రక్కలలో మరియు గజ్జలలో నొప్పిని అనుభవిస్తాము.  శరీరములోని ఆమ్లములు మరియు ఖనిజాల యొక్క కృత్రిమ స్థాయి పెరగడము మాత్రమే కాకుండా, ఇతర వైద్య పరిస్థితులు, అనగా హైపర్పారాథైరాయిడిజం, మూత్రపిండాల రోగాలు, జీర్ణ క్రియ రుగ్మతులు మరియు మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లు (UTIs) అనునవి వ్యక్తి యొక్క మూత్రపిండాలలో రాళ్లు అభివృద్ధి చేయడము ద్వారా ఎక్కువ హానిని కలుగచేస్తాయి.  వ్యక్తి యొక్క వైద్య చరిత్ర, ఒక పూర్తి శారీరక పరీక్ష, రక్త మరియు మూత్ర పరీక్షలు, X- రేస్, అల్ట్రాసోనోగ్రఫీ మరియు CT స్కాన్ల పైన ఆధారపడి మూత్రపిండాలలో రాళ్ల యొక్క నిర్దారణ అనునది ఏర్పాటుచేయబడుతుంది.

రాయి యొక్క పరిమాణముపైన ఆధారపడి చికిత్స ఉంటుంది  మరియు ఈ చికిత్స మూత్రములోనుండి రాళ్లు సులభముగా బయటకు వచ్చుటకు వేచి యుండు సమయము నుండి, శస్త్రచికిత్స లేక రాళ్లను విచ్చిన్నం చేయుటకు స్కోప్స్ ను ఉపయోగించడము ద్వారా నిర్వహించే ధ్వని తరంగ చికిత్స వరకు ఈ చికిత్సలు మారుతూ ఉంటాయి.  నివారణ అనునది ప్రధానముగా నీటిని సమృధ్ధిగా త్రాగడము, ఆహార నియమమును పాటించుటలో ఖనిజాల అవక్షేపాలను ఏర్పరచే ఆహారమును తొలగించడము మరియు ఉప్పును తక్కువగా తీసుకోవడము వంటి వాటి చుట్టూ తిరుగుతుంది.  తిరిగిబెట్టడము లేక మరలా వచ్చే ప్రమాదము ఉన్నప్పటికీ, రోగనిరూపణ అనునది సాధారణముగా మంచిది ఎందుకనగా వంశపారంపర్య ప్రభావము ఒకవేళ లేకపోతే మూత్రపిండాలలో రాళ్లకు సమర్థవంతముగా చికిత్స చేయవచ్చు.  ఉపద్రవాలు, అనగా మూత్రపిండాల నష్టము లేక ఇన్ఫెక్షన్, యుటిఐ, మూత్రనాళములో లేక మూత్రపిండాలలో అడ్డంకులు మరియు మూత్రములో రక్తము అనునవి మూత్రపిండాలలో రాళ్ల వలన ఏర్పడతాయి.

కిడ్ని స్టోన్స్ యొక్క లక్షణాలు - Symptoms of Kidney Stone in Telugu

మూత్రపిండాలలో రాళ్లు, ప్రత్యేకముగా ప్రారంభ దశలలో, వాస్తవముగా అధిక లక్షణాలను కలిగి ఉండవు.  ఈ లక్షణాలు తరువాతి దశలలో, అనగా రాయి చుట్టూ కదలడము ప్రారంభించిన్నప్పుడు లేక మూత్రనాళము గుండా ప్రవేశించి స్పష్టమైన ఇబ్బందిని కలిగించినప్పుడు మరియు ఈ ధశలలో లక్షణాలు కనిపించడము ప్రారంభిస్తాయి.
కొన్ని లక్షణాలు :

  • మూత్రము యొక్క రంగు ఎరుపు, గులాబీ లేక నల్లని గోధుమ రంగు లోనికి మారడం.
  • అప్పుడప్పుడూ మూత్రమునకు వెళ్లవలసిన తీవ్రమైన కోరిక కలగడం.
  • మూత్రములో ప్రత్యేకమైన వాసన రావడం.
  • ప్రతీసారి కొంత పరిమాణములో మాత్రమే మూత్రము బయటకు రావడం.
  • మూత్రవిసర్జన సమయములో మూత్ర మార్గములో నొప్పిని అనుభవించడం.  (మరింత తెలుసుకోవడానికి - బాధాకరమైన మూత్రవిసర్జనకు  కారణాలు)
  • వికారం మరియు వాంతులు.
  • నడుము క్రింద మరియు ప్రక్కలలో నొప్పి కలగడం.
  • గజ్జ ప్రాంతం మరియు పొట్ట క్రింది భాగములో నొప్పి కలగడం.

నొప్పి కొన్నిసార్లు వెంటనే లేక అప్పుడప్పుడూ రావడం, మరియు మూత్ర వ్యవస్థ యొక్క ఒక భాగము నుండి మరొక భాగమునకు రాయి ప్రయాణించినప్పుడు నొప్పి యొక్క స్థానం కూడా మారుతుంది.  తీవ్రముగా, ఎల్లప్పుడూ వచ్చే నొప్పి అనునది వెంటనే తీసుకోవాల్సిన అత్యవసర వైద్యమును సూచిస్తుంది.

కిడ్ని స్టోన్స్ యొక్క చికిత్స - Treatment of Kidney Stone in Telugu

రాయి ఎంత పెద్దదిగా ఉన్నది మరియు ఎంత ప్రభావమును చూపిస్తున్నది అను అంశముల పైన ఆధారపడి మూత్రపిండాలలోని రాళ్ల యొక్క చికిత్స విధానము జరుగుతుంది.  ఎక్కువ మంది వైద్యులు, మూత్రములో రాళ్లను సహజముగా పంపివేయుటకు అనుమతించబడుట అను అధిక సంరక్షణ పధ్ధతులను సూచిస్తారు.    మూత్రపిండములో రాళ్లకు వర్తింపచేయు చికిత్స ఎంపికలు:

మూత్రపిండములో చిన్న రాళ్ల కొరకు

వీటిని తొలగించడము చాలా సులభము.  ద్రవాలను ఎక్కువగా త్రాగడము ద్వారా, మూత్రములో రాళ్లు పూర్తిగా కొట్టుకొనిపోవుటకు ఈ ద్రవాలు సహాయము చేస్తాయి అని డాక్టర్లు సాధారణముగా వీటిని సూచిస్తారు.  బాధను తగ్గించుటకు తేలికపాటి నొప్పి కిల్లర్ ను సూచించడము అనునది ఈ విధానములో సహాయపడుతుంది, లేక కండరాల సడలింపు మరింత సునాయాసముగా రాయి వెళ్లిపోవుటకు సహాయముచేస్తుంది.

పెద్ద రాళ్ల కొరకు

మూత్రపిండములలోని పెద్ద రాళ్లకు చికిత్స చేయుటకు కొన్ని వైద్య విధానాలు అవసరమవుతాయి.

  • మందులు
    ఏర్పడిన రాయి యొక్క స్వభావము మరియు పరిస్థితి యొక్క తీవ్రత పైన ఆధారపడి మందులు సూచించబడతాయి. ఈ మందులు రాయిలోని లవణాలను కరిపోవుటకు సహాయం చేస్తాయి మరియు వాటి యొక్క పరిమాణమును తగ్గిస్తాయి.  కొంత కాలం తర్వాత, రాయి తగినంత చిన్న పరిమాణములోనికి మారిపోయి మూత్రములో సులువుగా బయటకు వెళ్లిపోతుంది.
  • శస్త్ర చికిత్స
    ల్యాపరోస్కోప్స్ అని పిలువబడే చిన్నటెలిస్కోపిక్ సాధనాలను ఉపయోగించి వెనుక భాగము గుండా మూత్రపిండాలలోనికి పంపిస్తారు,శస్త్రచికిత్స జరుగబోయే వ్యక్తికి అనస్థీషియాను అందించిన తరువాత డాక్టర్లు శస్త్రచికిత్స ద్వారా మూత్రపిండాలలోని రాళ్లను తొలగిస్తారు.  ఈ ప్రక్రియను మూత్రపిండములలోని రాళ్లను తొలగించు పెర్క్యుటేనియస్ నెఫ్రోలిథాటమీ ప్రక్రియ అంటారు, ఈ ప్రక్రియ కొనసాగు కొన్ని రోజుల వరకు హాస్పిటల్ లో అడ్మిషను పొందుట మరియు నిలిచియుండుట అవసరమవుతుంది.
  • స్కోప్స్
    రాళ్లు మూత్రపిండములో లేక మూత్రనాళములో నిలిచియున్నప్పుడు వీటిని ఉపయోగిస్తారు.  ఒక సన్నని వెలుతురు కలిగిన ట్యూబును మూత్రమార్గము గుందా మూత్రనాళములోనికి పంపించి రాయి యొక్క స్థానమును గుర్తిస్తారు, దీనిని తరువాత తొలగిస్తారు లేక పగులగొడుతారు.  ఈ స్వభావము కలిగిన అనేక ప్రక్రియలు స్థానిక అనస్థీషియాను ఉపయోగిస్తాయి మరియు ఇవి ఔవుట్ పేషెంట్ ప్రక్రియలుగా ప్రదర్శించబడతాయి.
  • షాక్-వేవ్ చికిత్స
    చర్మము గుండా కొన్నిసార్లు షాక్ వేవ్ లను పంపించి మూత్రపిండాలలోని రాళ్లను పగులగొడుతారు లేక ముక్కలుగా చేస్తారు, అందువలన అవి మూత్రము ద్వారా బయటకు వెళ్లిపోతాయి.  ఈ ప్రక్రియ అనునది ఒక గంటపాటు కొనసాగుతుంది మాఇయు ఇది కొంత నొప్పిని కలుగచేస్తుంది.  ఈ ప్రక్రియను అనుదరించడము వలన, ఇక్కడ కొంత అసౌకర్యము, గాయాలు లేక రక్తస్రావము జరుగుతుంది.

డాక్టర్లు సాధారణముగా రాళ్లను సేకరించుటకు రికమెండ్ చేస్తారు, అది వాటి యొక్క స్వభావమును పరిశీలించడానికి అనుమతించబడుతుంది. ఇది తరువాత తీసుకోబోయే చికిత్స విధానమునకు సహాయపడుతుంది మరియు అవి మరలా తిరిగి ఏర్పడకుండా నివారించడానికి తీసుకోవాల్సిన జీవనశైలి చర్యలకు సహాయము చేస్తుంది.

జీవనశైలి నిర్వహణ

మూత్రపిండాలలోని రాళ్లకు సంబంధించిన కఠిన వాస్తవము ఏమనగా, అవి మరలా తిరిగివచ్చే అవకాశాలు అసాధారణముగా అధికముగా ఉంటాయి.  దీని అర్థమేమనగా, చికిత్స మాత్రమే కీలకము కాదు గాని, అయితే వాటిని గుర్తించడానికి మనము తీసుకునే సమయము మరియు మనము తీసుకునే ఎంపికలు ఈ క్రింది విధముగా ఉంటాయి.  జీవనశైలి క్రింద రికవరీని మేనేజింగ్ మరియు నిర్వహణ చేయుటకు, మీకు అవసరమైన కొన్ని విషయాలు కారకాలుగా ఇవ్వబడ్డాయి:

  • సమృధ్దిగా ద్రవాలను వినియోగించుకొనాలి, ప్రధానముగా నీటిని.
  • ఇంతకు మునుపు ఏర్పడిన కొన్ని రకాల మూత్రపిండాలలోని రాళ్లు మరలా అభివృధ్ధిచెందుటకు దోహదం చేసే ఆహారమును తొలగించుటకు ఆహారనియమమును సవరించాలి.
  • ఎత్తు మరియు వయసుకు సరిపోయే విధముగా బరువును మేనేజింగ్ చేయాలి మరియు మెయింటెయిన్ చేయాలి.
  • రక్తము మరియు మూత్రములో ఖనిజాలు మరియు యూరిక్ ఆమ్లము యొక్క స్థాయిలను పరిశీలించడానికి క్రమముగా ఆరోగ్య మరియు రక్తము చెక్-అప్ లను చేసుకోవాలి.
  • ఆరోగ్య స్పృహ కలిగి ఉండడము మరియు వ్యక్రిగత పరిశుభ్రతను నిర్వహించడము ద్వారా యుటిఐలను నివారించవచ్చు, ఒకసారి మీరు మూత్రపిండాలలో రాళ్లను కలిగిఉన్నట్లయితే, ఇవి చాలా సులభముగా మిమ్మల్ని చేరుతాయి.

Dr. Anvesh Parmar

Nephrology
12 Years of Experience

DR. SUDHA C P

Nephrology
36 Years of Experience

Dr. Mohammed A Rafey

Nephrology
25 Years of Experience

Dr. Soundararajan Periyasamy

Nephrology
30 Years of Experience

Medicines listed below are available for కిడ్ని స్టోన్స్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

OTC Medicine NamePack SizePrice (Rs.)
Vrikkum Capsule by myUpchar Ayurveda60 Capsule in 1 Bottle719.0
Doliosis D1 Detoxifier Drop30 ml Drops in 1 Bottle180.0
Herbal Canada Chandra Prabha (100)100 Tablet in 1 Bottle119.0
Haslab Drox 12 Galolith Drop30 ml Drops in 1 Bottle153.0
Ayurvedix Gokhru Kaata Ark200 ml Ark in 1 Bottle199.0
Planet Ayurveda Chandraprabha Vati Pack of 2240 Vati/Bati in 1 Combo Pack830.0
REPL Dr. Advice No.31 Calculus Drop30 ml Drops in 1 Bottle171.0
Planet Ayurveda Mutra Krichantak Churna200 gm Powder in 1 Box530.0
Baidyanath Bangashwar Ras (Ord.)40 Tablet in 1 Bottle174.0
Herbal Canada Stone Cut Tablet (100)100 Tablet in 1 Bottle164.05
Read more...
Read on app