మనం కాళ్లు లేకుండా జీవితాన్ని ఊహించలేము. మన రోజువారీ జీవితంలో మనం ప్రపంచ బరువును మొయ్యడం కోసం కాళ్ళు మన బరువుని మోస్తాయి. కాళ్ళ నొప్పి మరియు బలహీనత అనేది వయస్సుతో సంబంధం లేకుండా ప్రజలను ప్రభావితం చేసే ఒక సాధారణమైన సమస్య.

పిల్లలు నుండి వృద్ధుల వరకు, కాళ్ల నొప్పి అనేది ఒక సాధారణ ఇబ్బందికర సమస్య, ఇది మన రోజువారీ కార్యకలాపాల మీద దృష్టి కేంద్రీకరించడానికి మరియు నిర్వహించడానికి కుదరనివ్వదు. ఇది తేలికపాటి, బాధాకరమైన, విచారకరకరమైన నొప్పి నుండి తీవ్రమైన, పదునైన, మరియు భరించలేని నొప్పి వరకు చేరుకుంటుంది. కాళ్ళ నొప్పి అనేది, కండరాల బెణుకు, పోషకాహార లోపం, కండరాల అలసట, కండరాల బడలిక, ఎక్కువ సమయం నిలబడం, నరాల సమస్యలు, నిర్జలీకరణము, ఎముక పగుళ్ళు మొదలైన వాటి వలన సంభవించవచ్చు. పైన పేర్కొన్న సమస్యలన్నింటికి వైద్యం అవసరం మరియు వైద్యుడుని సంప్రదించాలి.

అయితే, ఇంటిలోనే మీ కాళ్ళ నొప్పిని తగ్గించే కొన్ని స్వీయ రక్షణ చిట్కాలను మేము ఇక్కడ తెలియజేస్తాము.

 1. కాళ్ళ నొప్పుల మందులు - Leg pain medicines in Telugu
 2. కాళ్ళ నొప్పిని నివారించడానికి సరైన బూట్లని ధరించాలి - Wear the right shoes to cure leg pain in Telugu
 3. కాళ్ళ నొప్పి కోసం నిమ్మ రసం - Lemon juice for leg pain in Telugu
 4. కాళ్ళ నొప్పి వదిలించుకోవడానికి మర్దన - Massage to get rid of leg pain in Telugu
 5. కాళ్ళ కండరాలను బలోపేతం చేయడానికి మరియు కాళ్ళ నొప్పిని వదిలించుకోవడానికి నడవండి - Walk to strengthen leg muscles and to get rid of leg pain in Telugu
 6. కాళ్ళ నొప్పి కోసం వ్యాయామం - Exercise for leg pain in Telugu
 7. బలమైన ఎముకలకు సూర్యరశ్మి - Sunlight for stronger bones in Telugu
 8. కాళ్ళ నొప్పి ఉపశమనం కోసం మంచు కాపడం - Cold compress for leg pain relief in Telugu
 9. కాళ్ళ నొప్పి చికిత్స కోసం పసుపు - Turmeric for leg pain treatment in Telugu
 10. బలమైన కాళ్లకు ఆరోగ్యకరమైన ఆహారం - Healthy food for strong legs in Telugu
 11. కాళ్ళ నొప్పి ఉపశమనం కోసం ఆపిల్ సైడర్ వినెగార్ - Apple cider vinegar for leg pain relief in Telugu
 12. కాళ్ళ నొప్పి కోసం భేది ఉప్పు - Epsom salt for leg pain in Telugu
 13. కాళ్ళ నొప్పి కోసం అల్లం - Ginger for leg pain in Telugu
 14. కాళ్ళ నొప్పి కోసం విటమిన్ డి - Vitamin D for leg pain in Telugu
 15. కాళ్ళ నొప్పి కోసం పొటాషియం - Potassium for leg pain in Telugu
 16. కాళ్ళ నొప్పికి వేడి నీటి కాపడం - Hot Compress for leg pain in Telugu
 17. కాళ్ళ నొప్పి కోసం టార్ట్ చెర్రీ పండ్ల రసం - Tart cherry juice for leg pain in Telugu
 18. కాళ్ళ నొప్పికి ధ్యానం - Meditation for leg pain in Telugu

ప్రజలు తరచగా సరైన రకమైన పాదరక్షలు ధరించరని గమనించబడింది. మీరు కూడా ఏప్పుడు గమనించి ఉండకపోవచ్చు, కానీ సరైన రకమైన బూట్లు ధరింస్తున్నారా లేదా అని ఒకసారి తనిఖీ చేసుకోండి.

మీరు ధరించే బూట్లు సౌకర్యవంతంగా మరియు మీ పాదాలకు సరిపోయే సరైన పరిమాణంలో ఉండాలి. మీ పాదాల పరిమాణం కంటే తక్కువ పరిమాణంలో ఉండే బూట్లు, ఎత్తుగా ఉండేవి, గట్టి పట్టీలు కలిగి ఉన్నవి, కాళ్ళ నొప్పికి కారణం కావచ్చు.

సుదీర్ఘకాలం ఇటువంటి బూట్లను ధరించడం వల్ల మీ భంగిమను ప్రభావితం చేయవచ్చు మరియు వెన్నెముక సమస్యలకు కూడా కారణం కావచ్చు. అందువల్ల,సౌకర్యంవంతంగా ఉండేందుకు ఒక మృదువైన మడమ (sole) కలిగిన బూట్లును ధరించాలి మరియు కాళ్ళ నొప్పి నిరోధించడానికి తక్కువ ఎత్తు ఉన్న వాటిని ధరించాలి.

నొప్పి ఉపశమనంలో నిమ్మకాయ ప్రభావాలపై 2011 లో నిర్వహించిన ఒక అధ్యయనం నిమ్మకాయ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుందని సూచించింది, ముఖ్యంగా దాన్ని చేప నూనెతో ఉపయోగించినప్పుడు. అనేక ఇతర మూలికల వలె, నిమ్మకాయలో కూడా యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.

దీన్ని ఎలా వాడాలి

ఒక నిమ్మకాయను రసం తీసి, అంతే పరిమాణంలో ఆముదం నూనెను కలపాలి. శరీరంలో నొప్పి ఎక్కడ ఉంటే అక్కడ ఈ మిశ్రమాన్ని పూయాలి.ఇలా రోజుకి రెండు లేదా మూడుసార్లు చేస్తే అది మీ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

నొప్పి తగ్గుదలలో మర్దన యొక్క ప్రభావం తెలుసుకోవడానికి ఇటీవల 2016 లో ఒక సమీక్ష జరిగింది. ముఖ్యంగా వ్యాయామం తర్వాత శరీరాన్ని మర్దనా చేయడం వల్ల కాళ్ళు చేతులలో నొప్పి తగ్గుతుంది. మీకు మీరే దీనిని చేసుకోవచ్చు, కుటుంబ సభ్యులని, స్నేహితులని అడగవచ్చు లేదా సరైన మార్గంలో మర్దన చేసుకునేందుకు వైద్యుడి నుండి సహాయం కోరవచ్చు.

ఇది ఎలా చెయ్యాలి

ఆవ నూనె, ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె వంటి మీ అభిరుచికి తగిన మరియు చర్మానికి సరిపోయే ఏవైనా నూనెను తీసుకోవచ్చు మరియు దానిని కొద్దిగా వేడి చేయండి. మరిగించకూడదు.

మీ చేతుల్లోకి ఈ నూనె కొంచెం తీసుకొని, మీ కాళ్ళు మరియు పాదాలను మర్దనా చేయడం మొదలుపెట్టండి. మరియు మీ కండరాల విశ్రాంతి కోసం నొక్కడం పాటు రాపిడిని మరియు వృత్తాకార స్ట్రోక్స్ ను ఉపయోగించండి. ఉపశమనం పొందటానికి ఇలా రెండు నుండి మూడు సార్లు చేయవచ్చు.

కాళ్ళ కండర-బలంపై నిర్వహించిన పరిశోధనలో నడకకు మరియు కండరాల బలానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని తెలుస్తుంది.

ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రకారం,నడక మీ కాళ్ళ కండరాలను బలోపేతం చేయడానికి ఉత్తమ మార్గాల్లో ఒకటి, చురుకైన నడక ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించబడింది, ఇది మీ కాలి కండరాలను గట్టిబర్చడమే కాకుండా, వాటిని బలోపేతం చేస్తుంది. ప్రతి రోజు లేదా కనీసం వారానికి ఐదు రోజులు 30 నిముషాలు పాటు నడవడం వల్ల బలాన్ని మరియు రక్త ప్రసరణను కూడా మెరుగుపరచాగలదని సూచించబడింది.

మీ కండరాలను బలోపేతం చేయడానికి ఈత, ట్రెక్కింగ్, బైకింగ్, జాగింగ్ వంటి ఇతర వ్యాయామాలను కూడా ఎంచుకోవచ్చు.

ఇటీవలి సమగ్ర పరిశీలనలో యోగా మరియు వ్యాయామాలు నొప్పి ఉపశమనంతో ముడి పడి ఉన్నాయని తెలిసింది.

ఒక అధ్యయనం యోగ మరియు వ్యాయామం మీ కాళ్ళ నొప్పిని వదిలించుకోవటంలో సహాయపడుతుందని సూచిస్తుంది. సర్వాంగ అసానం అత్యంత ప్రయోజనకరమైన యోగాసనాలలో ఒకటి, ఇది మీ కాళ్ళకు మాత్రమే సహాయపడక, మీ శరీరానికి కూడా విశ్రాంతిని ఇస్తుంది.

ఇది ఎలా చెయ్యాలి?

నెల మీద పడుకోండి మరియు కొన్ని ఘాడమైన శ్వాసల ద్వారా విశ్రాంతిని పొందండి. మీ కాళ్ళును నెమ్మదిగా గాలిలోకి ఎత్తడం ప్రారంభించండి. ఒకసారి మీ కాళ్లు నిటారుగా అయిన తరువాత, మీ అరచేతులను వీపుకు ఆసరా ఇవ్వడం ద్వారా మీ నడుమును కూడా ఎత్తడానికి ప్రయత్నించండి.

ఇది ఒక్క ప్రయత్నంతో సులభం కాకపోవచ్చు కానీ ఆచరణతో, మీరు మీ యోగ ఆసన భంగిమలను మెరుగుపరచుకొని మరియు సమతుల్యం చేసుకోగలరు.

ఇతర వ్యాయామాలు మరియు వాటిని చేయడంలో సరైన మార్గం

కాలి తొడ నరములను సాగదీయడం

నెల మీద పడుకోండి తరువాత నెమ్మదిగా ఒక కాలును గాలిలో నిఠారుగా ఉంచండి అప్పుడు మీ పాదం పైకప్పుకు ఎదుఎదురుగా అవుతుంది .

మీ తొడకు చేతులతో లేదా ఒక టవల్ను చుట్టుకొని ఆధారం ఇవ్వండి. ఇలాగే 10 సెకన్లపాటు ఉండి తరువాత ఇతర కాలుతో అదే విధంగా చేయండి. ఒక కాలుకి కనీసం పది సార్లు చేయండి.

మడమను జార్చుట

నెల మీద పడుకొని విశ్రాంతి తీసుకోండి. కొన్ని ఘాఢ శ్వాసలను తీసుకోండి.ఇప్పుడు ఒక పట్టా (mat) మీద ఒక పాదము యొక్క మడమను ఉంచి నిదానంగా జార్చచండి తరువాత మడమ మీ తుంటికి దగ్గరగా వచ్చేలా కాలును మడవండి. ఇతర కాలితో అదే విధంగా చేయండి. ఈ వ్యాయామం ఐదు నిమిషాలు చేయండి.

స్విస్ బాల్ స్క్వాట్స్

స్విస్ బంతిని తీసుకొని మీ వీపు మరియు గోడ మధ్య ఉంచండి. మీ పాదములును శరీరం నుండి రెండు అడుగుల దూరంలో ఉండేలా నిలబడండి .ఇప్పుడు బంతిని స్థిరపరుస్తూ మీ తొడలు నేల వరకు సమాంతరంగా అయ్యేవరకు నిదానంగా కిందకి జారండి. మీ ఛాతీకి ఎదురుగా చేతులు చాపండి. ఇలా కనీసం 12-15 సార్లు చేయండి.

క్వాడ్ ప్రెస్

నేలపై మీ పాదాలు మరియు అరచేతులను ఉంచండి తరువాత మీ బరువును సమతుల్యం చేసుకోండి. మీ మడమలు నెలకు దూరంగా ఉండాలి. ఇప్పుడు, నెమ్మదిగా మీ మోచేతులు మరియు మోకాళ్ళను వంచి, మీ శరీరాన్ని కిందకి తీసుకురండి. దీన్ని చేస్తున్నప్పుడు మీ వెనుక భాగాన్ని సమంగా ఉంచండి. ఈ వ్యాయామం కనీసం పది సార్లు చేయండి.

లంజెస్ (lunges)

మీ శరీర పై భాగాన్ని నిటారుగా ఉంచడం ప్రారంభించండి మరియు మీ గడ్డాన్ని పైకి పెట్టండి. మీ భుజాలను విశ్రాంత పరచండి. ఒక కాలుతో ముందుకు ఒక అడుగు వేయండి మీ శరీరం మీ మోకాళ్ళుకు 90 డిగ్రీల కోణంలోకి వచ్చే వరకు వంగండి.

మీ ముందు మోకాలు సరిగ్గా మీ చీలమండ (ankle) పైన ఉండాలి. ఇతర కాలితో కూడా ఇలా చేయండి. ఒక కాలితో ఇలా 10 సార్లు చేయండి.

ఈ వ్యాయామాలు మీకు అనుకూలమైనవా లేదా అని మీకు సందేహం ఉంటే, ఒక ఫిజియోథెరపిస్ట్ను సంప్రదించండి. ఫిజియోథెరపిస్టు ఈ వ్యాయామాల సరైన మార్గం తెలుసుకోవడంలో మీకు సహాయం చేస్తారు.

ఇంటర్నల్ మెడిసిన్ వారి ఒక పత్రిక ఎముకలు మరియు కండరాలపై సూర్యకాంతి ప్రభావం యొక్క ప్రత్యక్ష సంబంధంను నోక్కి చెప్తుంది. సహజంగా మన శరీరంలో విటమిన్ D ను ఉత్పత్తి చేయడంలో సూర్యకాంతిలో UV కిరణాలు ఉపయోగపడుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు.

కాల్షియం మరియు ఫాస్ఫరస్ జీవక్రియలో విటమిన్ D కీలక పాత్ర పోషిస్తుంది. మీలో చాలామంది ఇప్పటికే తెలిసినట్లుగా, కాల్షియం మరియు ఫాస్పరస్ కండరాల మరియు ఎముకల బలం కోసం ముఖ్యమైన ఖనిజాలు. అందువల్ల, విటమిన్ డి స్థాయిలు శరీరంలో తగినంతగా ఉన్నప్పుడు, నొప్పికి ఉపశమనం కలిగించి మరియు కండరాల బలహీనతను తగ్గిస్తుంది.

సహజంగా విటమిన్ D ను తయారు చేయడానికి ఉత్తమ మార్గం

ప్రతి రోజు కనీసం 10-15 నిమిషాలు ఉదయం సూర్యకాంతిలో కూర్చుని మీ శరీరంలో విటమిన్ D స్థాయిని సమతుల్యం చేసుకోండి. మీ ముఖం, చేతులు మరియు కాళ్ళకు సూర్యకాంతి తగిలేలా చేయండి. ఎండ వాల్ల చర్మం కమలడాన్ని నివారించడానికి, SPF 15 తో ఉన్న ఏ సన్స్క్రీన్ ను ఐన ఎంచుకోవచ్చు.

(మరింత సమాచారం: వడదెబ్బ)

కొన్నిసార్లు, కాళ్ళ నొప్పి బరువులు ఎత్తడం, పరుగులు పెట్టడం, ఈత, బైకింగ్ వంటి తీవ్రమైన శారీరక శ్రమల వాల్ల కూడా తలెత్తుతాయి. ఫిజియోథెరపీ ఆధారితమైన అధ్యయనాలు చల్లని మరియు వేడి కాపాడల వాడుకను సూచిస్తాయి అందులోనూ మంచు కాపడం మీ నొప్పికి ఉపశమనం కలిగించడమే కాక, ప్రభావిత ప్రాంతంలోని వాపును కుడా తగ్గిస్తుంది. అయితే, మంచు మరియు వేడి కాపడాలను ఉపయోగించే ముందు వాపులను ఒకసారి వైద్యుడు లేదా ఫిజియోథెరపిస్ట్ చేత తనిఖీ చేయించుకోవడం మంచిది.

దీన్ని ఎలా వాడాలి

ఒక మందపాటి టవల్ తీసుకోండి, దానిలో 3-4 మంచు గడ్డలు ఉంచండి మరియు టవల్ పై భాగాన్ని కట్టేయండి. కనీసం 10-15 నిమిషాలు ప్రభావిత ప్రాంతంలో ఈ సంచిని సమాంతరంగా ఉంచండి. ఉపశమనం పొందడానికి, మీరు ఈ రోజుకు పలుమార్లు చేయాలి.

గమనిక: మంచు గడ్డలను మీ చర్మంపై నేరుగాపెట్టరాదు అది చర్మాన్ని మంచు తిమ్మిరికి గురిచేస్తుంది.

పసుపు యొక్క ఆరోగ్య ప్రభావాలపై జరిపిన ఒక సమీక్ష ప్రకారం పసుపు వాపు నిరోధక మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉందని తెలిపింది. చాలా ఏళ్ల నుండి పసుపు నొప్పి ఉపశమనం కోసం మరియు వివిధ శరీర గాయాలను నయం చేయడం కోసం ఉపయోగించబడుతుంది. పసుపు లో వాపు తగ్గించే  కర్కుమిన్ను (curcumin) ఉంటుంది.

దీన్ని ఎలా వాడాలి

ఒక చెంచా పసుపు తీసుకొని దానిని ముద్దలా  చేయడానికి నువ్వుల నూనె, కాస్టర్ ఆయిల్ లేదా ఆవాలు నూనెతో కలపవచ్చు. కనీసం ఒక ఐదు నిమిషాల పాటు ప్రభావిత ప్రాంతంలో ఈ ముద్దతో మర్దన చెయ్యాలి. తర్వాత దానిని దాదాపు ఒక  అరగంట పాటు ఉంచి, వెచ్చని నీటితో కడగాలి. నొప్పి నుంచి ఉపశమనం కలిగించేంత వరకు రోజుకు రెండు సార్లు ఈ ప్రక్రియను చేయాలి.

ఆహారం మరియు జీవనశైలి ఆధారంగా సుమారు 8500 మంది ప్రజలపై ఒక బ్రిటీష్ అధ్యయనం నిర్వహించబడింది.ఒకవేళ అనారోగ్యకరమైన,సరిలేని ఆహారం తింటుంటే మరియు మీ శరీరంలో తక్కువ నీటి శాతం ఉంటే, మీరు శరీర నొప్పి మరియు కండరాల నొప్పులు నుండి బాధ ఉండవచ్చు అని ఈ అధ్యయనంలో సూచించారు. అందువల్ల, నీరు పుష్కలంగా త్రాగడం మాత్రమే కాక, ఎక్కువ నీరు కలిగి ఉన్న పండ్లు మరియు కూరగాయలను కూడా తినాలి.

 • ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం, మరియు విటమిన్లు సమృద్ధిగా ఉన్నఆహారం తీసుకోవాలి. కండరాల బలం కోసం సాధారణంగా ప్రోటీన్ అధికంగా అందుబాటులో ఉండె ఆహార పదార్దాలు గుడ్లు, బ్రోకలీ, సోయ్, బాదం, కాటేజ్ చీజ్, మరియు పెరుగు.
 • పొటాషియం అధికంగా ఉండే ఆహార పదార్దాలను మీ భోజనంలో కలుపుకోవడం వలన కూడా కాళ్ళ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.పొటాషియం అధికంగా ఉండేవి ఉడికించిన పాలకూర, బంగాళాదుంపలు, తీపి బంగాళాదుంపలు, అరటిపండ్లు, పుట్టగొడుగులు, రేగుపళ్ళు, దోసకాయ, ఎండుద్రాక్ష, మరియు టమోటాలు మొదలైనవి.
 • మెగ్నీషియం అధికంగా ఆహారం కూడా కాళ్ళ నొప్పి, శరీర నొప్పుల యొక్క లక్షణాలు చికిత్సలో ఉపయోగకరంగా ఉందని తేలింది. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు గుమ్మడికాయ విత్తనాలు, కాలే, చిక్కుడు కాయలు, క్యాబేజీ, పొద్దుతిరుగుడు విత్తనాలు, బ్రోకలీ, సీఫుడ్, పాలకూర, అత్తి పండ్లను, అవోకాడో మొదలైనవి.
 • మీరు గుడ్డు, క్యారట్లు, గోధుమ, తీపి బంగాళాదుంప, వోట్స్, కాటేజ్ చీజ్, చేపలు మొదలైనవి విటమిన్ బి ఎక్కువగా ఉన్న ఆహార పదార్దాలను కూడా తినాలి.
 • ఖనిజాలు మరియు విటమిన్ల తో పాటు, కాళ్ళ నొప్పి ఉపశమనం మరియు బలహీనత కోసం ఆపిల్ సైడర్ టానిక్ కూడా సహాయపడుతుంది ఇది శరీరానికి బలమును, ఆరోగ్యాన్ని ఇచ్చే మందు.

ఆపిల్ సైడర్ టానిక్ ను ఎలా తయారు చెయ్యాలి

శరీరానికి బలమును, ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ మందును తయారు చేయడానికి, ఒక గ్లాసు వెచ్చని నీటిని తీసుకుని దానికి ముడి మరియు వడకట్టని ఆపిల్ సైడర్ వినెగార్ను ఒకటి టీస్పూన్ జోడించండి. దీనికి కొద్దిగా నిమ్మ రసం మరియు తేనె చేర్చండి మరియు బాగా కలపండి. ఈ టానిక్ను రోజుకు ఒకటి నుండి రెండుసార్లు తీసుకొండి.

మీ ఆహారంలో ఇనుము, కాల్షియం, పొటాషియం, మరియు విటమిన్ B లను చేర్చడానికి బెల్లం పాకాన్ని ఉపయోగించుకోండి.

దీన్ని ఎలా వాడాలి

ఒక గ్లాసు వెచ్చని నీటిలో లేదా పాలలో బెల్లం పాకాన్ని ఒక టీస్పూన్ కలపవచ్చు. ఈ పానీయం రోజుకి ఒకసారి లేదా రెండుసార్లు రోజుకు తీసుకోవాలి. మీకు రుచిలో మార్పు కావాలనుకుంటే, మీరు ఒక కప్పు నీటికి రెండు టీస్పూన్లు బెల్లం పాకాన్ని కూడా జోడించవచ్చు. దీనిలో, ముడి, వడకట్టిని ఆపిల్ సైడర్ వినెగార్ను రెండు టీస్పూన్లు జోడించండి. దీన్ని రోజుకు ఒకసారి తీసుకోండి.

ఆపిల్ సైడర్ వెనిగార్ యొక్క బాహ్య పూత యొక్క ప్రభావాలపై ఇటీవల జరిపిన అధ్యయనంలో, కాళ్ళ నొప్పి చికిత్సలో ఆపిల్ సైడర్ వినెగార్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తుంది. ఇది రక్తంలో యురిక్ ఆమ్ల స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు మీ శరీరంలోని విషాన్ని బయటకు తీస్తుంది.

దీన్ని ఎలా వాడాలి?

వెచ్చని నీటితో నింపిన మీ స్నానపు తొట్టెలో ఒక కప్పు ఆపిల్ సైడర్ వినెగర్ను కలపండి. 20-30 నిముషాలు ఆ స్నానపు తొట్టిలో కూర్చొండి లేదా అది స్నానం చేయండి. ప్రతిరోజు ఒకసారి ఇలా చేస్తే నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

భేది ఉప్పును నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ప్రజలు ఉపయోగించారు. చర్మం ద్వారా ఎప్సోమ్ ఉప్పు మీ శరీరంలోకి ప్రవేశిస్తుందని చెప్పబడింది, అయినప్పటికీ, అది ఇంకా నిరూపించబడలేదు. ఇది కాళ్ళ నొప్పికి మాత్రమే ఉపశమనం కలిగించడంలో సహాయపడక, గొంతు కండరాలను మెత్తబర్చడంలో కూడా సహాయపడుతుంది.

దీన్ని ఎలా వాడాలి?

స్నానం చేసే వెచ్చని నీటిలో భేది ఉప్పుని జోడించవచ్చు. ప్రత్యామ్నాయంగా, 15-20 నిముషాల పాటు భేది ఉప్పు కలిపిన వెచ్చని నీళ్లలో కాళ్ళుని ఉంచవచ్చు.

కండరాల నొప్పిలో అల్లం ప్రభావాలపై 2010 లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం అల్లం ముఖ్యంగా వ్యాయామాల తర్వాత సంభవించే కండరాల నొప్పిని తగ్గిస్తుందని తెలిపింది. అల్లం ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా ఉపయోగించే మూలికలలో ఒకటి. ఇది వాపు, వాపు వల్ల కలిగే నొప్పిని తగ్గించడం మాత్రమే కాక శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

దీన్ని ఎలా వాడాలి

నీటిలో ఒక అంగుళం అల్లం ముక్క వేసి మరిగించాలి,ఈ టీని రోజుకి మూడు సార్లు త్రాగాలి. రుచిని మెరుగుపరచడానికి తేనె, నిమ్మకాయలు కూడా చేర్చవచ్చు.

అల్లం రుచితో మీకు ఇబ్బంది లేకపోతే, రోజులో ఒక 2-3 అల్లం ముక్కలను కూడా తినవచ్చు

కొన్నిసార్లు, కాళ్ళ నొప్పి మరియు బలహీనత శరీరంలో విటమిన్ D యొక్క లోపం వలన కూడా సంభవించవచ్చు. విటమిన్ D లోపం చికిత్స కోసం, క్రింది వాటిలో ఒకదాన్ని ప్రయత్నించవచ్చు:

ఏం చేయాలి?

కనీసం 15-20 నిమిషాలు ప్రతిరోజూ ఉదయపు సూర్యకాంతిలో నిలబడండి. ఇలా చేయడం వలన మీ చర్మం శరీరంలో విటమిన్ D ను ఉత్పత్తి చేస్తుంది.

మీరు విటమిన్ డి అనుబంధకాలను తీసుకునేందుకు వైద్యుణ్ణి సంప్రదించవచ్చు. అది మీ శరీరంలో కాల్షియం మరియు పోటాషియం స్థాయిలు పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.

హైపోకలేమియా (తక్కువ పొటాషియం స్థాయిలు) మీద జరిపిన ఇటీవలి అధ్యయనం, పొటాషియం స్థాయిలో తగ్గుదల కాళ్లనొప్పికి  మరియు కండరాల బలహీనతకి దారితీస్తుందని తెలిపింది.

ఏమి చెయ్యాలి?

పొటాషియం ఉండే ఆహారాలు అయిన అరటి, చిలకడ దుంప మొదలైనవి రోజుకి రెండు నుంచి మూడు సార్లు తింటే శరీరంలో పొటాషియం స్థాయిలు నిర్వహించబడతాయి. ఇది జీవక్రియను పెంచి కాళ్ళ కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది అలాగే నొప్పిని కూడా తగ్గిస్తుంది.

మేము పైన చెప్పినట్లుగా మంచు కాపడం, వేడి నీటి కాపడం కూడా కాళ్ళ నొప్పిని తగ్గిస్తుంది.వేడి నీటి కాపడాన్ని ప్రభావితమైన శరీర భాగంపై ఉపయోగించడం వల్ల కండరాలలో రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ పెరుగడం వలన, మీరు నొప్పి నుండి ఉపశమనం పొందుతారు.

ఇది ఎలా చెయ్యాలి

ఒక ప్లాస్టిక్ సీసా లేదా నీటి సంచిని వేడి నీటితో నింపి 15-20 నిముషాల పాటు ప్రభావిత ప్రాంతం మీద సమాంతరంగా ఉంచండి. ఇలా రోజుల్లో పలుమార్లు చేస్తే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

గమనిక: మీ చర్మంపై నేరుగా వేడి నీటి బాటిల్ ఉంచవద్దు. అలా చేయడం వలన కాలిన గాయాలు ఏర్పడతాయి. ప్రభావిత ప్రాంతాన్ని మందపాటి టవల్ తో కప్పి, ఆపై వేడి నీళ్ళ సీసాని పెట్టండి.

టార్ట్ చెర్రీ పండు దాని యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. 2013 లో ప్రచురించిన ఒక అధ్యయనంలో నొప్పి ఉపశమనంపై చెర్రీస్ మరియు వాటి యాంటీ ఆక్సిడెంట్ సంభావ్యత నొప్పిని తగ్గించడానికి మాత్రమే కాక వాపులను తగ్గించడానికి కూడా సహాయపడే సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను కలిగి ఉన్నాయి అని తెలిపింది.

దీన్ని ఎలా వాడాలి

మీరు ఒక కప్పు టార్ట్ చెర్రీ పళ్ళను తినవచ్చు లేదా మీ కాళ్ళ నొప్పి మరియు వాపు చికిత్సకు రోజుకు ఒకసారి టార్ట్ చెర్రీ జ్యూస్ తాగవచ్చు.

ధ్యానం మనసుకు విశ్రాంతి కలిగించి, ఆందోళన తగ్గించి నొప్పిని తగ్గించడం సులభతరం చేస్తుంది.

పడుకొని లేదా నిటారుగా కూర్చుని మీ కళ్ళు మూసుకోండి. ఘాడమైన శ్వాస తీసుకొని శ్వాస పై ద్రుష్టి ఉంచండి. ఇలా రోజుకి 15-20 నిముషాలు చెయ్యండి.

వనరులు

 1. Castro D, Sharma S. Hypokalemia. [Updated 2019 Feb 17]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
 2. Nuria Caturla, Lorena Funes, Laura Pérez-Fons, Vicente Micol. A Randomized, Double-Blinded, Placebo-Controlled Study of the Effect of a Combination of Lemon Verbena Extract and Fish Oil Omega-3 Fatty Acid on Joint Management. J Altern Complement Med. 2011 Nov; 17(11): 1051–1063. PMID: 22087615
 3. Black CD1, Herring MP, Hurley DJ, O'Connor PJ. Ginger (Zingiber officinale) reduces muscle pain caused by eccentric exercise. J Pain. 2010 Sep;11(9):894-903. PMID: 20418184
 4. Kuehl KS. Cherry juice targets antioxidant potential and pain relief.. Med Sport Sci. 2012;59:86-93. PMID: 23075558
 5. Derya Atik, Cem Atik, Celalettin Karatepe. The Effect of External Apple Vinegar Application on Varicosity Symptoms, Pain, and Social Appearance Anxiety: A Randomized Controlled Trial. Evid Based Complement Alternat Med. 2016; 2016: 6473678. PMID: 26881006
 6. Vaughn AR, Branum A, Sivamani RK. Effects of Turmeric (Curcuma longa) on Skin Health: A Systematic Review of the Clinical Evidence.. Phytother Res. 2016 Aug;30(8):1243-64. PMID: 27213821
 7. Cindy Crawford. The Impact of Massage Therapy on Function in Pain Populations—A Systematic Review and Meta-Analysis of Randomized Controlled Trials: Part I, Patients Experiencing Pain in the General Population Pain Med. 2016 Jul; 17(7): 1353–1375. PMID: 27165971
 8. Malanga GA, Yan N, Stark J. Mechanisms and efficacy of heat and cold therapies for musculoskeletal injury. Postgrad Med. 2015 Jan;127(1):57-65. Epub 2014 Dec 15. PMID: 25526231
 9. Elizabeth G VanDenKerkhof, Helen M Macdonald, Gareth T Jones, Chris Power, Gary J Macfarlane. Diet, lifestyle and chronic widespread pain: Results from the 1958 British Birth Cohort Study. Pain Res Manag. 2011 Mar-Apr; 16(2): 87–92. PMID: 21499583
 10. Barry M. Popkin, Kristen E. D’Anci, Irwin H. Rosenberg. Water, Hydration and Health. Nutr Rev. 2010 Aug; 68(8): 439–458. PMID: 20646222
 11. MICHAEL F HOLICK. Sunlight and Vitamin D: Both Good for Cardiovascular Health. J Gen Intern Med. 2002 Sep; 17(9): 733–735. PMID: 12220371
 12. Laidi Kan. The Effects of Yoga on Pain, Mobility, and Quality of Life in Patients with Knee Osteoarthritis: A Systematic Review. Evid Based Complement Alternat Med. 2016; 2016: 6016532. PMID: 27777597
 13. Mary McGrae McDermott. PHYSICAL ACTIVITY, WALKING EXERCISE, AND CALF SKELETAL MUSCLE CHARACTERISTICS IN PATIENTS WITH PERIPHERAL ARTERIAL DISEASE. J Vasc Surg. 2007 Jul; 46(1): 87–93. PMID: 17540532
 14. InformedHealth.org [Internet]. Cologne, Germany: Institute for Quality and Efficiency in Health Care (IQWiG); 2006-. Using medication: The safe use of over-the-counter painkillers. 2016 Apr 6 [Updated 2017 Aug 10].
ऐप पर पढ़ें