మూత్రములో మంట (బాధాకరమైన మూత్రవిసర్జనకు) - Painful Urination in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

February 01, 2019

July 31, 2020

మూత్రములో మంట
మూత్రములో మంట

సారాంశం:

మన శరీరం వ్యర్ధమైన ఉత్పత్తులను, శరీరజన్య విషాన్ని,  మరియు హానికరమైన పదార్ధాలను మలం, మూత్రం మరియు చెమట ద్వారా విసర్జిస్తుంది. ఇందుగ్గాను మన శరీరం స్వాభావికమైన వ్యవస్థలను కల్గి ఉంది. ఈ వ్యవస్థలలో మూత్ర నాళము ఒకటి. మనకున్న మూత్ర నాళము కొన్ని అవయవాల కలయిక. ఈ అవయవాలు రక్తాన్ని వడపోసి వ్యర్థాలను మూత్రం రూపంలో మూత్రమార్గం (urethra) ద్వారా బహిష్కరిస్తాయి. మూత్రం విసర్జించేటపుడు నొప్పి, మంట లేదా ఏదైనా అసౌకర్యం కలిగినపుడు, ఆ కలిగే బాధనే “మూత్రంలో మంట” లేక  “బాధాకరమైన మూత్రవిసర్జన” అని పిలుస్తారు. మూత్రంలో మంటకు కొన్ని ముఖ్య కారణాలేవంటే మూత్రనాళ ప్రాంతంలో లేదా ఇతర కటి అవయవాలకు అంటువ్యాధులు సోకడం, వాపు, నిర్జలీకరణము, మూత్రపిండాల రాళ్ళు, కణితులు, మందులు మరియు రేడియోధార్మికత, ఇతర అలెర్జీల సంక్రమణలు. మూత్రవిసర్జనలో మంటకు అత్యంత సాధారణ లక్షణం ఏదంటే మూత్రం పోసేటపుడు నొప్పి కలగడం లేదా మూత్రవిసర్జన ప్రారంభించినపుడు నొప్పి కలగడం. మూత్రవిసర్జన సమయంలో నొప్పితో పాటుగా ఇంకా కొన్ని ఇతర లక్షణాలను కల్గి ఉండొచ్చు. ఆ లక్షణాలేవంటే దుర్వాసన, మూత్ర మార్గం లేదా మూత్ర విసర్జననాళం నుండి స్రావాలు కావడం, వస్తిక ప్రాంతం (pelvic area) లో ఎరుపురంగుదేలడం లేదా చికాకు కల్గించే మంట పుట్టడం మరియు ఇలాంటివే మరికొన్ని లక్షణాలు.

మూత్రవిసర్జన సమయంలో మంట రావడాన్ని నివారించేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తినడం, తగినంతగా ద్రవాహారాలు త్రాగడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం, మద్యం మరియు ధూమపానం మానడమో లేక కనీసం పరిమితం చేయడం మంచిది. మరియు కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మూత్రంలో మంటకు చికిత్స ఏమంటే సోకిన సంక్రమణ లేదా అంటురోగానికి మందులు తీసుకోవడం, వ్యాధి ప్రాంతంలో వచ్చే వాపుకు మరియు మూత్రపిండాల్లో ఏర్పడిన చిన్న చిన్న రాళ్ళను లభ్యమవుతున్న మందుల ద్వారానే చికిత్స చేయడం మరియు శస్త్రచికిత్స ద్వారా మూత్రపిండాల్లో ఏర్పడిన పెద్ద పెద్ద రాళ్లను, గడ్డలవంటి వాటిని తొలగించడం. సరైన సమయంలో చికిత్సను చేపట్టినపుడే రోగ నిరూపణ కూడా చేయడం సాధారణంగా మంచిది. మూత్రంలో మంటకు చికిత్సాసమయంలో ఉపద్రవాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి అరుదైన ఉపద్రవాల్లో పునరావృతమయ్యే అంటురోగం లేదా సంక్రమణం, రక్త సంక్రమణం లేదా విషపూరిత పుండ్లు (సెప్సిస్), మూత్రపిండాలకు దెబ్బ తగలడం, అకాల ప్రసవం లేదా తక్కువ బరువున్న శిశు జననం మరియు మరిన్ని ఉపద్రవాలు ఉండవచ్చు.

బాధాకరమైన మూత్రవిసర్జన లక్షణాలు - Symptoms of Painful Urination in Telugu

నొప్పి కల్గించి వచ్చే బాధాకరమైన మూత్రవిసర్జన కింద వివరించిన వివిధ లక్షణాలను కలిగి ఉంటుంది:

 • నొప్పి
  బాధాకరమైన మూత్రవిసర్జన యొక్క లక్షణాలు మూత్రం పొసేటప్పుడు ప్రస్ఫుటంగా తెలుస్తాయి. మూత్రం పోయడానికి ప్రారంభించినప్పుడు లేదా మూత్రవిసర్జన చేస్తున్నంత మొత్తం వ్యవధిలోను మీరు నొప్పిని అనుభవించవచ్చు. ఈ నొప్పి చాలా పదునైనదిగా, అసహ్యకరమైనది  మరియు అసౌకర్యంగా ఉంటుంది. ఈ నొప్పి మూత్రవిసర్జన తరువాత కూడా కొనసాగ వచ్చు లేదా లేకపోవచ్చు.
   
 • జ్వరం
  మూత్ర నాళం అంటురోగం బారిన పడినప్పుడు, తరచుగా మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుదలను మీరు గుర్తించవచ్చు. మీ జ్వరం తేలికపాటి నుంచి  ఓ మోస్తరు స్థాయి (38.5 ° C పై) వరకు ఉంటుంది. ఇలా వచ్చే జ్వరం చలితో కూడుకుని ఉండవచ్చు.
   
 • ముద్దగా లేదా రక్తంరంగులో మూత్రం
  నొప్పితో పాటు, మీ మూత్రంరంగులో వచ్చే మార్పును మీరు గమనించవచ్చు. మీ మూత్రం మామూలుగా లేత పసుపురంగులో కాకుండా, రక్తం కలవడం వల్ల ఎర్రగా ఉండడాన్ని లేదా కారుమేఘం నలుపురంగు లో మీరు గమనించవచ్చు.
   
 • మూత్రంలో చీము/రక్తం లేదా ఏదైనా ఇతర అసాధారణ ద్రవం
  కొన్నిసార్లు, మీరు మూత్రం పోసేటపుడు గాని మూత్ర విసర్జన అయిన తర్వాత గాని ఏదేని ద్రవం, రక్తం లేదా చీము రావడాన్ని మీరు గమనించవచ్చు. 
   
 • దుర్వాసన
  నొప్పితో కూడి వచ్చే మూత్రం గాఢమైన మరియు అసహ్యకరమైన వాసనను కూడా కలిగి ఉండవచ్చు.
   
 • ఎక్కువ సార్లు అయ్యే మూత్రవిసర్జన
  కొన్ని సందర్భాల్లో, బాధాకరమైన మూత్రవిసర్జన సమయంలో,  ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు పోవడంతో పాటు, మాటి మాటికీ మూత్రవిసర్జనకు పోవాలని అనిపిస్తూ ఉంటుంది. 
   
 • పార్శ్వపు నొప్పి లేక డొక్కలో నొప్పి
  డొక్కలో నొప్పి లేదా పార్శ్వపు నొప్పి అనేది పక్కటెముకలు మరియు తొడ ఎముకకు (ఇలియాక్ ఎముక అనేది ఇరువైపులా ఉన్న తొడ ఎముకల్లో ఉండే భాగం.) మధ్యలో లేదా కటిభాగంలో వచ్చే నొప్పి లేదా మిక్కిలి అసౌకర్యమైన పరిస్థితి. 
   
 • దద్దుర్లు, దురద, మంట
  అనారోగ్యకరమైన అంటువ్యాధి లేదా సంక్రమణంతో ముడిపడిన బాధాకరమైన మూత్రవిసర్జన తరచూ ఆయా భాగాల్లో దద్దుర్లు, ఎరుపురంగుదేలడం,  మరియు మంటను కలిగి ఉంటుంది. ఈ సమయంలో నొప్పితో కూడిన మూత్రవిసర్జనను అనుభవిస్తున్న వ్యక్తి పొత్తికడుపు కింది (పెల్విక్) ప్రాంతంలో దురదను అనుభస్తారు గనుక కొంత ఉపశమనం పొందేందుకు అక్కడ గీరుకుంటూ ఉంటారు.
   
 • బొబ్బలు, పొక్కులు/పుళ్ళు
  నొప్పితో కూడిన మూత్రవిసర్జన సమయంలో సాధారణంగా వచ్చే బొబ్బలు మరియు పుళ్ళు లైంగికంగా సంక్రమించినవి. ఇలాంటి బొబ్బలు యోని చుట్టూ మరియు పురుషాంగం చుట్టూ (పెల్విక్ ప్రాంతంలో) అగుపడతాయి.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

బాధాకరమైన మూత్రవిసర్జనకు కారణాలు మరియు ప్రమాద కారకాలు - Causes and Risk Factors of Painful Urination in Telugu

బాధాకరమైన మూత్రవిసర్జనకు కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:

 • అంటువ్యాధి (ఇన్ఫెక్షన్)
  త్తికడుపు కింది భాగంలో (పెల్విక్ ప్రాంతంలో) అంటువ్యాధి సోకడం లేదా ఇన్ఫెక్షన్ అవడం మూలాన బాధాకరమైన మూత్రవిసర్జన సమస్య రావడం అనేది అత్యంత సాధారణ కారణం మరియు లక్షణము. పురుషులు మరియు మహిళలు ఇద్దరిలోను మూత్రవిసర్జనావయవాలు మరియు ప్రత్యుత్పత్తి అవయవాలు చాలా దగ్గరగా పక్క పక్కనే ఉంటాయి కాబట్టి, ఈ రెండింటిలో ఏ ఒక్కదానికి అంటువ్యాధి/సంక్రమణం సోకినా   బాధాకరమైన మూత్రవిసర్జన సమస్య కల్గుతుంది.
   
 • మూత్ర వ్యవస్థకంతా అంటువ్యాధి సోకడం :
  మన శరీరంలోని మూత్ర వ్యవస్థలోని అవయవాలు ఒకటిగా గుమిగూడి ఉండి, రక్తం ద్వారా శరీరంతో అనుసంధానమై ఉన్నాయి. మూత్రం ద్వారా మన శరీర వ్యర్థాలను తొలగించడంలో మూత్ర వ్యవస్థ తోడ్పడుతుంది. మూత్రపిండాలు, మూత్రనాళం (మూత్రపిండాల నుండి బయటకు వచ్చి మూత్రాశయంతో వాటిని కలిపే గొట్టం), మూత్రాశయం (మూత్రం సేకరించే తిత్తి), మరియు మూత్రద్వారం లేదా యూరేత్ర (మూత్రద్వారం అనేది ఒక చిన్న గొట్టం,  మూత్రాశయనానికి అనుసంధానించబడి ఉంటుంది మరియు మూత్రం దీన్నుండే బయటకు విసర్జించబడుతుంది) ఇవీ మూత్ర వ్యవస్థ యొక్క ముఖ్య అవయవాలు. మూత్రం పోసేటపుడు మీరు అసౌకర్యాన్ని లేదా నొప్పిని అనుభవిస్తే, మీ మూత్ర వ్యవస్థలో ఏ అవయవానికైనా అంటువ్యాధి సోకి ఉంటుంది-అది మీయొక్క మూత్రపిండాలు కావచ్చు, మూత్రనాళం (ureter) కావచ్చు, లేదా మూత్రాశయం కావచ్చు. లేదా మూత్రద్వారం అయినా కావచ్చు. ఇలా మూత్ర వ్యవస్థలో ఏ ఒక్క అవయవానికి అంటువ్యాధి సోకినా దాన్నే ‘మూత్ర నాళపు అంటువ్యాధులు” లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (యుటిఐ) అని పిలువబడతాయి. స్త్రీలలో మూత్రద్వారం యొక్క పొడవు తక్కువగా ఉంటుంది. ఆడవారికి మూత్రద్వారం పొడవు తక్కువగా ఉండడం వల్ల  మూత్ర విసర్జన వ్యవస్థలోని ఇతర భాగాలకు అంటువ్యాధి వేగంగా మరియు సులభంగా వ్యాపిస్తుంది. కలుషితమైన టాయిలెట్లను (శౌచాలయాలు) ఉపయోగించడం ద్వారా మూత్ర వ్యవస్థకు అంటువ్యాధి సోకుతుంది. ఇంకా, మలినమైన చేతులతో కటిప్రాంతం లేదా మొల ప్రదేశంలో తాకడం వల్ల, మరియు కొన్నిసార్లు ఇది రక్తంతో కూడా సంభవించవచ్చు. అంటే, ఇప్పటికే రక్తంలో అంటువ్యాధి ఉండి, ఆ రక్తం మూత్ర వ్యవస్థను చేరడం మూలంగా ఈ అంటువ్యాధి సోకుతుంది.
   
 • పునరుత్పత్తి వ్యవస్థకు అంటువ్యాధి
  ఆడవారు మరియు మగవారు ఇద్దరిశరీరాల్లోనూ మూత్ర వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థలు రెండూ పరస్పరం పక్కపక్కనే నిర్మితమై ఉన్నాయి. పురుషాంగంలో (అంటే మగవారి మేడ్రం లేదా శిశ్నములో) మూత్రం మరియు పునరుత్పాదక స్రావాలకు ఒకే గొట్టం (ట్యూబ్) ఉంది. స్త్రీలలో కూడా మూత్ర విసర్జనానికి తెరవబడే మూత్రద్వారం యోనిద్వారానికి పక్కనే ఉంటుంది. కాబట్టి, మీ పునరుత్పాదక వ్యవస్థలో ఎటువంటి సంక్రమణం లేదా అంటువ్యాధి ఉన్నా మూత్రవిసర్జన సమయంలో నొప్పిని కలిగించవచ్చు. హెర్పెస్ (చర్మంపై మొబ్బలు, దురద), గోనేరియా (సెగవ్యాధి) , లేదా క్లామిడియా అనే లైంగిక అంటురోగాలు కలిగిఉన్న మీ లైంగిక భాగస్వాముల సంపర్కంతో మీరూ ఈ వ్యాధులకు గురి కావచ్చు. యోనిలో వచ్చే శిలీంధ్ర-సంబంధ అంటువ్యాధులు (ఫంగల్ ఇన్ఫెక్షన్లు) సాధారణమైనవి మరియు బాధాకరమైనవి. ఈ అంటువ్యాధులు ప్రభావిత చర్మంలో మార్పులకు కారణమవుతాయి, ఇలా అంటువ్యాధికి గురైన మూత్రవ్యవస్థ యొక్క అంతర్గత చర్మం మూత్రవిసర్జన సమయంలో మూత్రనాళం ద్వారా ప్రయాణిస్తున్న మూత్రంతో తాకినప్పుడు తీవ్రమైన నొప్పిని కలుగజేస్తుంది. స్త్రీ పునరుత్పత్తి అవయవాలకు సోకే అంటువ్యాధిని “పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి”గా పిలుస్తారు.
   
 • నొప్పితోకూడిన వాపు
  కటి ప్రదేశంలో వాపు, మంట ఉండడం నొప్పితో కూడిన మూత్రవిసర్జనకు మరొక సాధారణ కారణం. మేము ఇప్పటికే వివరించినట్లుగా, మూత్ర వ్యవస్థ లేదా పునరుత్పత్తి వ్యవస్థ (రెప్రొడక్టివ్ సిస్టమ్లో) లో వాపు, మంట ఉన్నట్లయితే అది మూత్రవిసర్జన  సమయంలో నొప్పిని, తొందరను కలిగించవచ్చు. వాపు-మంట మూత్రవ్యవస్థ లేదా ప్రత్యుత్పత్తి నిర్మాణ వ్యవస్థలో ఎక్కడైనా ఎటువంటి స్థాయిలో అయినా సంభవించవచ్చు. ఉదాహరణకు, నెఫ్రైటిస్ (మూత్రపిండాల్లో వాపు లేదా వాపుతో కూడిన మంట), పిలేనేఫ్రిటిస్ [వృక్కసంపుటము లేదా మూత్రపిండాల పొత్తికడుపు యొక్క వాపు- (గరాటు ఆకారంలో ఉన్న మూత్రనాళ భాగం], మూత్రనాళం వాపు, మూత్రద్వారం వాపు (మూత్రపిండాల వాపు యురేత్రా), యోని యొక్క వాపు, గర్భాశయం యొక్క వాపు, సెర్విసిటీస్ (అంటే గర్భాశయంతో యోనిని కలిపే జననకాలువ భాగం (cervix) లో వాపుతో కూడిన మంట మొదలైనవి.
   
 • ఆహారం, మందులు  మరియు చికిత్సలు
  తగినంతగా నీరు, తదితర ఆరోగ్యకర ద్రవాహారాలను మీరు తీసుకోవడం లేదంటే మీరు సులభంగా అంటువ్యాధులకు లోనవుతారు. నిర్జలీకరణము లేదా డీ-హైడ్రేషన్ మీ మూత్రమార్గాన్ని మరింత మంటకు గురి చేసి మూత్రం యొక్క కేంద్రీకరణాన్ని పెంచుతుంది. తగినంతగా ద్రవాలను తీసుకోకపోయినా, డీ-హైడ్రేషన్కు గురైనా-మూత్రవిసర్జన సమయంలో చాలా నొప్పిని కల్గిస్తాయి మరియు మూత్ర నాళపు అంటువ్యాధు (UTI) లకు గురయ్యే అవకాశాలు జాస్తి. మీరు మద్యం, కాఫీ, టీ, చాలా చక్కెర, ఆమ్ల పదార్థాలు మరియు మసాలా పదార్థాలు  (స్పైసి ఫుడ్), కర్బనీకరించిన పానీయాలు, మొదలైన వాటిని ఎక్కువగా తీసుకుంటున్నట్లైతే మీ మూత్రాశయంలో మంటను చికాకును కలిగించవచ్చు. అపుడు, మీరు మూత్రవిసర్జనకు వెళ్ళినప్పుడల్లా మీ మూత్రాశయయం నొప్పితో మిమ్మల్ని బాధిస్తుంది.
  నొప్పి ఉపశమనం కోసం ఉపయోగించే మందులు (NSAIDs), కాన్సర్ చికిత్స-కెమోథెరపీలో ఉపయోగించే మందులైనటువంటి సైక్లోఫోస్ఫమైడ్ (Cyclophosphamide), టియాప్రోఫినిక్ యాసిడ్ (tiaprofenic acid) యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు, కీళ్ళరోగం-వాతరోగం (gout) మరియు మూత్రపిండాల వ్యాధులలో వాడే అలోపిరినాల్ వంటి మందులు మూత్రాశయం రోగాలకు మరియు మూత్రం ఆపుకోలేని (మూత్రవిసర్జనను నియంత్రించలేకపోవడం) రోగానికి కారణమవుతాయి.
    
 • రేడియోథెరపీ చికిత్స
  రేడియోథెరపీ అనేది ఒక రకం క్యాన్సర్ చికిత్స. ఇందులో క్యాన్సర్ కణితి/గడ్డ యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి కిరణాలను (రేడియోధార్మికత) ఉపయోగిస్తారు. రేడియోథెరపీ కూడా మూత్రాశయంలో మంట, చిరాకును కల్గించే దుష్ప్రభావాన్ని (side effect)  కలిగి ఉంటుంది గనుక బాధాకరమైన మూత్రవిసర్జనకు రేడియోథెరపీ కూడా కారణమే.
   
 • కణుతులు (tumours) 
  మూత్ర వ్యవస్థ యొక్క గడ్డలు/కణితులు అంటే మూత్రపిండాలు పైన ఉండే గ్రంధులు (అడ్రినల్‌ గ్రంధులు), మూత్రనాళములో గడ్డలు శరీరంలోని మూత్రం యొక్క సాధారణ ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. గర్భాశయం, అండాశయము, ప్రొస్టేట్ గ్రంధి, టెస్టిస్ వంటి ప్రత్యుత్పత్తి అవయవాల గడ్డలు లేక కణితులు కూడా మూత్ర వ్యవస్థ యొక్క అవయవాలు మరియు గొట్టాల యొక్క కుదింపును కలిగించవచ్చు, దీని వలన బాధిత వ్యక్తికి మూత్రవిసర్జన బాధాకరంగా ఉంటుంది.
   
 • మూత్రకోశ మార్గంలో అడ్డంకులు
  కొంతమందికి పుట్టుకతో వచ్చిన మూత్రనాళ ప్రతిబంధకాలు ఉంటాయి. అవేమంటే మూత్రనాళం గోడలు, మూత్రనాళం ద్వారాలు, మూత్ర నాళాలు కుదించుకుపోవడం, మూత్ర నాళములో రాళ్ళు, మరియు మూత్రనాళం గోడలు అసాధారణంగా గట్టిపడటం అవచ్చు. వీటి కారణంగా మూత్రనాళంలో అడ్డంకులేర్పడి మూత్రవిసర్జన సాఫీగా అవదు. నొప్పితో కూడిన మూత్రవిసర్జనకు దారి తీస్తుంది.
   
 • మూత్ర వ్యవస్థ యొక్క శస్త్రచికిత్స
  గతంలో మీరు మూత్రావాహిక ప్రాంతంలో లేదా కటి ప్రాంతంలో శస్త్రచికిత్స చేయించుకొన్నట్లైతే, ఆ శస్త్రచికిత్స సమయంలో లేదా తర్వాత సంభవించే అంటువ్యాధి (సంక్రమణ) బాధాకరమైన మూత్రవిసర్జనాన్ని కలిగించవచ్చు.శస్త్రచికిత్స జరిగిన స్థలంలో వాపు మరియు ద్రవ నిర్మాణం లేదా మచ్చ కణజాలం కారణంగా గొట్టాల సంకుచితం కారణంగా అడ్డంకి ఏర్పడి నొప్పితో కూడిన మూత్రవిసర్జనకు దారి తీయవచ్చు.   
   
 • అలర్జీలు
  కొందరు ఆడవారు సున్నితమైన యోనిని కలిగి ఉంటారు. సువాసనాభరితమైన సబ్బులు (సెంటు సోపులు), స్నాన లవణాలు, టాయిలెట్ పేపర్లు, సానిటరీ మెత్తలు (sanitary pads), స్పెర్మిసైడ్లు మొదలైన వాటి ద్వారా వారి యోనిలో సులభంగా మంటను కల్గిస్తాయి. ఇది కూడా  బాధాకరమైన మూత్రవిసర్జనను కలిగిస్తుంది.

ప్రమాద కారకాలు

కొన్ని కారకాలు లేదా పరిస్థితులు బాధాకరమైన మూత్రవిసర్జనను కలిగిస్తాయి. ఇవే ప్రమాద కారకాలుగా పిలువబడతాయి. బాధాకరమైన మూత్రవిసర్జనకు కొన్ని ప్రమాద కారకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 • లింగం
  నొప్పితో కూడిన మూత్రవిసర్జన మగవాళ్ళలోకంటే ఆడవాళ్లలోనే ఎక్కువ. ఎందుకంటే మూత్రమార్గము మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలో చాలా చిన్నదిగా ఉండటం వలన స్త్రీలు తమ మూత్రమార్గంలో అంటువ్యాధులకు ఎక్కువగా గురై బాధాకర మూత్రవిసర్జనకు సాధారణంగా లోనవుతుంటారు.
   
 • వయస్సు
  వయస్సుతో పాటు, వృద్ధాప్యకణాలు, అవయవాల అరుగుదల-తరుగుదలల కారణంగా మూత్రపిండాలు మరియు మొత్తం శరీరం యొక్క విధులు సాధారణంగా నిధానమైపోతాయి. శరీరం యొక్క రక్షణ వ్యవస్థ కూడా వయస్సుతో పాటు బలహీనమవుతుంది, తద్వారా   అంటువ్యాధులకు లోనవుతుంటారు. ఇటువంటి సందర్భాల్లో, మూత్ర నాళపు అంటువ్యాధులు (UTIs) అనారోగ్యానికి గురైన వయసుమళ్ళినవాళ్ల కు వచ్చే అవకాశం ఉంది. అటుపై బాధాకరమైన మూత్రవిసర్జనకూ గురవుతుంటారు.
   
 • చక్కెరవ్యాధి లేదా డయాబెటీస్
  మీరు డయాబెటిక్ (అంటే మీకు చక్కర వ్యాధి ఉన్నట్లయితే) అయితే మీ డాక్టర్ మీకు చెప్పే ఉంటాడు మీకు మీరక్తంలో చక్కర అధికంగా ఉందని, సూక్ష్మజీవులకు అది మంచి ఆహారంగా మారిందని, శరీర రక్షణ యొక్క తీవ్రత కూడా తగ్గడంతో ఆరోగ్యవంతులకంటే మీరు మూత్రనాళ రోగాలకు సులభంగా లోనవుతారని, తద్వారా మీకు బాధాకరమైన మూత్రవిసర్జన సమస్య కల్గుతుందని. (మరింత సమాచారం: మధుమేహం చికిత్స)  
   
 • ప్రోస్టేట్ గ్రంధి పెద్దదవడం 
  ప్రోస్టేట్ గ్రంధి మగ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్న గ్రంధులలో ఒకటి. 40 ఏళ్లపైబడిన వయసు కల్గిన మగవారు ప్రోస్టేట్ గ్రంధి పెరగడమనే ఉపద్రవానికి గురవుతుంటారు. ఇలా  ప్రోస్టేట్ గ్రంధి పెరగడం మూలంగా మూత్రమార్గం (యూరేత్ర) కుంచించుకుపోయి అసౌకర్యమైన మరియు బాధాకరమైన మూత్రవిసర్జనకు దారి తీస్తుంది.
   
 • కిడ్నీ రాళ్ళు
  కిడ్నీ రాళ్ళు పరిమాణంలో వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని మూత్రపిండాల రాళ్ళు చిన్నవిగా ఉండడం మూలంగా మూత్ర నాళం గుండా సులభంగా ప్రవహిస్తాయి, అయితే కొంచెం పెద్దవిగా ఉండే మూత్రపిండాల రాళ్లు మూత్రనాళం గొట్టానికి అడ్డపడి మూత్రవిసర్జన సమయంలో తీవ్ర నొప్పికి దారి తీయవచ్చు.
   
 • గర్భధారణ
  గర్భధారణ సమయంలో గర్భధారణ హార్మోన్ల కారణంగా  మీ శరీరం వివిధ మార్పులకు గురవుతుంది. ఈ మార్పులు బ్యాక్టీరియా లేదా సూక్ష్మక్రిములు (వైరస్లు) పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని కలుగజేస్తాయి. అందువల్ల, గర్భధారణ సమయంలో మహళలు మూత్రమార్గ వ్యాధులకు (UTIs) ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది.
   
 • మూత్రోద్ధరణనాళిక (Urinary catheter) 
  మీ మూత్రనాళాల్లో అడ్డంకులేర్పడి మీరు సులభంగా మూత్రవిసర్జన చేయలేక బాధపడుతుంటే వైద్యులు మూత్రోద్ధరణనాళిక (లేక ‘మూత్ర కాథెటర్’ అనే సన్నపు గొట్టం) ను ఉపయోగించి కట్టుకుపోయిన మూత్రాన్ని సులభంగా విసర్జించేందుకు సహాయపడతారు. కొన్నిసార్లు, మీకు అమర్చే ఈ మూత్రోద్ధరణనాళిక (urinary catheter) అంటువ్యాధిబారిన పడడం మూలంగా మీ మూత్ర వ్యవస్థకు ఆ అంటు సోకుతుంది. మూత్రోద్ధరణనాళికను తొలగించిన తర్వాత కూడా ఈ అంటు వ్యాధి సంక్రమించి బాధాకరమైన మూత్రవిసర్జనకు కారణమవ్వచ్చు.
   
 • రోగ నిరోధక వ్యవస్థా వైఫల్యం
  శరీరం యొక్క రక్షణ శక్తి తగ్గడం లేదా రోగకారక సూక్ష్మజీవుల విరుద్ధంగా శరీరంలో పోరాట సామర్థ్యం తగ్గడాన్ని “రోగ నిరోధక వ్యవస్థా వైఫల్యం” (ఇమ్యునో డెఫిషియన్సీ) అని నిర్వచించబడింది. రోగ నిరోధక వ్యవస్థా వైఫల్యం జన్మతః సిద్ధినుంచి ఉండవచ్చు. అంటే శిశువు యొక్క జన్యువుల్లో (genes)నే ఉండే లోపాల కారణంగా రోగ నిరోధక వ్యవస్థా వైఫల్యం కలగొచ్చు. ఉదాహరణకి, తీవ్రమైన “కంబైన్డ్ ఇమ్యునోడిఫిసిఎన్సి సిండ్రోమ్”, డిజార్జి సిండ్రోమ్, బ్రూటన్ వ్యాధి, లేదా ఎయిడ్స్ (HIV-AIDS) వంటి కొన్ని వ్యాధులు ఉండటం వలన కూడా ఇది దాపురించవచ్చు. ఉదాహరణకు, పైన పేర్కొన్న వ్యాధుల కారణంగా మీ శరీరం యొక్క రక్షణశక్తి తగ్గి, మూత్ర నాళంలో సూక్ష్మజీవులు సంక్రమించేందుకు కారణమై, తద్వారా, మూత్ర నాళంలో మంట పుట్టి బాధాకర మూత్రవిసర్జన ఏర్పడుతుంది.
   
 • మెనోపా జ్ (ముట్లుడగటం)
  రుతువిరతి లేక ముట్లుడగటం (మెనోపాజ్) శరీరంలో కొన్ని హార్మోన్ల మార్పులను కలుగజేసి ఈ యోని-సంబంధ వ్యాధులను దాపురింపజేస్తాయి.

బాధాకరమైన మూత్రవిసర్జన నిర్ధారణ - Diagnosis of Painful Urination in Telugu

మీకు దాపురించిన “బాధాకర‘మూత్రవిసర్జన వ్యాధి”ని నిర్ధారించడానికి వైద్యుడు మీనొప్పి యొక్క వివరణాత్మక చరిత్రతో ప్రారంభిస్తాడు. తరువాత శారీరక పరీక్ష మరియు విశ్లేషణ పరీక్షల్ని జరుపుతాడు.

చరిత్ర
మీ వైద్యుడు మీరు బాధ పడుతున్న “బాధాకరమైన మూత్రవిసర్జన” గురించిన వ్యాధి నిర్ధారణను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడంతో ప్రారంభిస్తాడు. మీకొస్తున్న “మూత్రంలో మంట” యొక్క తీవ్రత, స్థానం, పౌనఃపున్యం (freequency), తత్సంబంధ లక్షణాలైన జ్వరం, చలి, కడుపు నొప్పి, మూత్రంలో చీము లేదా రక్త స్రావం అవుతోందా, మీ గర్భధారణ స్థితి, ఏమి మందులు వాడుతున్నారు, మద్యం గనుక పుచ్చుకుంటుంటే ఎంత ప్రమాణం పుచ్చుకుంటారు, మంట, నొప్పి మూత్రం పోయడానికి ప్రారంభించినపుడు వస్తుందా లేక మూత్రం పోస్తున్నంతసేపూ ఉంటుందా, ప్రస్తుతం మూత్రప్రవాహం ఎలా ఉంది, మూత్రవిసర్జన పౌనఃపున్యంలో పెరుగుదల ఉందా, మూత్రవిసర్జనకు పోవాలన్న ప్రేరేపణ (లేక ఉద్దేపన) కల్గుతోందా, గతంలో మూత్ర నాళాల సంక్రమణకారణంగా సతమతమయ్యారా     వంటి కొన్ని ప్రశ్నలను అడగడం జరుగుతుంది.

శారీరక పరీక్ష
వివరణాత్మక వైద్యచరిత్రను మీనుండి రాబట్టుకున్న తరువాత మూత్రంలో నొప్పికి గల మూలమేంటి, మంట తీవ్రత,  నొప్పి యొక్క స్వభావం గురించి తెలుసుకునేందుకు మీ వైద్యుడు మీ కటి ప్రాంతం యొక్క సంపూర్ణ భౌతిక పరీక్షను నిర్వహిస్తాడు. వివరణాత్మక వైద్య చరిత్రను తీసుకున్న తరువాత, మీ వైద్యుడు రోగనిర్ధారణ కోసం క్రింది ప్రయోగశాల మరియు రేడియోలాజికల్ పరీక్షల్ని చేయించామని మిమ్మల్ని కోరవచ్చు అలాంటి పరీక్తో కొన్ని:

మూత్రవిశ్లేషణ
మీ నుండి మూత్రం నమూనాను సేకరించిన తరువాత మూత్రంతో ప్రతిచర్య చెందే రసాయనిక పదార్థాలతో కొన్ని ప్రయోగశాల పరీక్షలను ‘మూత్రవిశ్లేషణ’ కోసం మీ వైద్యుడు  నిర్వహించవచ్చు. మీ మూత్రం యొక్క రసాయన విశ్లేషణలో ఏమేమి విషయాలు బయటపడతాయంటే మూత్రంలో ఉన్న మిశ్రమాని (composition) కి సంబంధించిన పూర్తి సమాచారం. ఇంకా ముఖ్యంగా మూత్రంలో ఉండకూడని (అసాధారణంగా తయారైన లేక చేరిన) పదార్ధం యొక్క ఉనికిని గుర్తించి అందిస్తుంది ఈ ప్రయోగశాల పరీక్ష. టెలీస్కోపిక్ పరికరాన్ని ఉపయోగించి చేసే ఈ సూక్ష్మదర్శిని పరీక్షలో మూత్రమిశ్రమంలో ఉండే పదార్థాలు కంటికి పెద్దవిగా కన్పిస్తాయి. ప్రయోగశాల సాంకేతిక నిపుణుడు మూత్రంలో కనబడే రక్త కణాలు, చీము కణాలు, స్ఫటికాలు వంటి అసాధారణ పదార్థాలను గుర్తించడంలో ఈ సూక్ష్మదర్శిని పరీక్ష సహాయపడుతుంది.  

మూత్రంలో ఉన్న సూక్ష్మక్రిముల సాగు    
మూత్రంలో ఉన్న సూక్ష్మక్రిముల సాగులో, మీ మూత్రం నమూనాలో కొంత భాగం తీసుకొని బ్యాక్టీరియా అభివృద్ధికి అనుకూలమైన ఒక మాధ్యమంలో ఉంచబడుతుంది. కొంత కాలం తర్వాత, మీడియంపై ఏదైనా సూక్ష్మజీవి (bacteria) యొక్క పెరుగుదల ఉంటే అది ఈ పరిశీలనలో బయటపడ్డమనేది జరుగుతుంది. ఎటువంటి సూక్ష్మజీవుల పెరుగుదల లేకపోతే, మీ మూత్రం సంక్రమించకుండా ఉందన్నమాటే.  అయితే, బ్యాకతేరియా పెరుగుదల కనిపించినట్లయితే, ఈ పరీక్షలో మరింత ప్రాసెస్ చేసి సూక్ష్మదర్శిని కింద పరిశీలించబడుతుంది, మీ మూత్ర నాళం ఎలాంటి మూత్ర సంక్రమణాన్ని కల్గివుందో ఈ పరీక్షలో బయల్పడొచ్చు.

స్త్రీలలో యోని దూది (స్వాబ్) మరియు మగవాళ్లలో యూరేత్రల్ దూది(స్వాబ్) 
మూత్రనాళ సంక్రమణాన్ని పరీక్షించేందుకు యోని మరియు మూత్రనాళపు స్రావాల నమూనాను ఒక స్టెరైల్ (బ్యాక్టీరియా-రహిత) దూదిని ఉపయోగించి తీసుకోబడతాయి.  సేకరించిన స్రావాల నమూనాల్ని కొంతకాలం బ్యాక్టీరియా పెరుగుదల మాధ్యమంలో ఉంచబడుతాయి. ఆ మాధ్యమంలో బాక్టీరియా కొంత పెరిగిన తర్వాత, మీ యోని లేదా మూత్రనాళంలో ఉన్న స్రావాన్ని పరీక్ష చేయడానికి సూక్ష్మదర్శినిని ఉపయోగిస్తారు.

రేడియోలాజికల్ పరీక్ష

లాబ్ పరీక్షలు అసంపూర్తిగా ఉన్నప్పుడు, వైద్యుడు మీ నొప్పి యొక్క కారణం తెలుసుకోవడానికి కొన్ని రేడియోలాజికల్ పరీక్షలు చేయించుకోవాలని మీకు సలహా ఇస్తారు:

 • ఎక్స్- రే
  మీ మూత్ర వ్యవస్థ మరియు దాని ప్రక్కనే ఉన్న అవయవాలను మెరుగ్గా చిత్రించటానికి మీ వైద్యుడు మీకు ఎక్స్-రే (X-ray) చేయించుకొమ్మని సూచించవచ్చు. X- కిరణాలు సులభంగా రాళ్లు లేదా కణితుల ఉనికిని గుర్తించగలవు, రాళ్లు లేదా కణితులే మూత్రావాహికలో అడ్డుపడటానికి కారణం కావచ్చు. పురుషుల X- రే ప్రోస్టేట్ గ్రంధి (మూత్రాశయం మరియు కేవలం మూత్రాశయంలోని ప్రక్కన ఉన్న మగ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క గ్రంధి) మూలాన్ని చూపుతుంది. ఒక విరుద్ధ మాధ్యమాన్ని ఇంజెక్ట్ చేసిన తరువాత తీసుకునే కొన్ని ఎక్స్-రేలు ఉన్నాయి. వీటిలో IVP (ఇంట్రావెనస్ పైలెగోగ్రామ్) మరియు VCUG (వాయిడింగ్ సిస్టోరెత్రోగ్రాం/voiding  cystourethrogram) అనే రకాలు ఉన్నాయి.
 • ఇంట్రావీనస్ పైలోగ్రామ్ (Intravenous Pyelogram)
  ఈ పరీక్షలో, ఒక విరుద్ధమైన మాధ్యమాన్ని సదరు వ్యక్తి యొక్క చేతి నరం ద్వారా ఇంజెక్ట్ చేయబడుతుంది. కొంత సమయం తర్వాత ఇంజెక్ట్ చేయబడిన వ్యతిరేక మాధ్యమం మూత్రపిండాల ద్వారా వడగట్టబడుతుంది. మూత్రవ్యవస్థలోని అవయవాలను ఈ ఎక్స్-రే స్పష్టంగా చూపుతుంది.  ఇది మూత్ర నాళంలో ఉన్న అవరోధం యొక్క ఉనికిని కూడా చూపిస్తుంది.
 • వాయిడింగ్ సిస్టోరెత్రోగ్రాం (VCUG)
  ఈ పరీక్ష లో, మీ డాక్టర్ పరీక్షకు ముందు మిమ్మల్ని నీరు త్రాగమని అడగవచ్చు. కొంత సమయం తరువాత, ఒక మూత్రోద్ధరణనాళిక/కాథెటర్ చేర్చబడుతుంది. అటుపైన మూత్రాశయం పూర్తిగా భర్తీగా ఉన్నప్పుడు, అలాగే పూర్తిగా ఖాలీ అయినపుడు కూడా ఎక్స్-రే (X-ray) తీసుకోబడుతుంది. ఈ పరీక్ష ద్వారా మూత్రంలో మంట సమస్య మీ మూత్రాశయం లో ఉందా, మూత్రనాళంలో ఉందా లేక మూత్రద్వారంలో ఉందా అనే విషయాన్ని నిర్ణయించడానికి ఓ మంచి పధ్ధతి.    
 • సిస్టోస్కోపీ
  ఈ పరీక్ష మీ మూత్రాశయాన్ని పరిశీలించేందుకు జరుపబడుతుంది. ఒక సన్నని “సీస్టోస్కోప్”  (టెలీస్కోప్తో ఉన్న పరికరం) ను మూత్రద్వారం ద్వారా మూత్రాశయం చేరుకునే వరకు జొప్పిస్తారు. సిస్టోస్కోపీ రెండు రకాలు: 1. వంగనిది (దృఢమైనది) మరియు 2. వంగేది (వంగే గుణంతో సౌకర్యవంతమైనది). ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ గాయపరచదు, ఎందుకంటే పరికరం వంగేగుణంతో అనువైనది కాబట్టి. ఈ వంగుడు గుణం కారణంగానే ఈ పరీక్షలో దీన్ని జొప్పించేందుకు కటి వలయము/పెల్విక్ ప్రాంతంలో మత్తుమందును ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే, దృఢమైన సిస్టోస్కోపీ పరీక్షలో, మీ వైద్యుడు మీరు నిద్రపోయేలా చేయవచ్చు లేదా పరీక్షను ప్రారంభించబడటానికి ముందుగా మీ కటిభాగం లోపలివైపున తిమ్మిరెక్కించ వచ్చు. పరీక్ష నిమిత్తం, మీ వైద్యుడు మూత్రాశయంలోకి నీటిని పంప్ చేసి తద్వారా మూత్రాశయం యొక్క మెరుగైన చిత్రాన్ని పొందుతాడు.
 • అల్ట్రాసౌండ్ 
  అల్ట్రాసౌండ్ అనేది మీ శరీరం యొక్క అంతర్గత అవయవాలను మరియు నిర్మాణాలను పరిశీలించేందుకు మీ వైద్యుడు ధ్వని తరంగాలను ఉపయోగించే పరికరం. రెండు రకాల అల్ట్రాసౌండ్లున్నాయి, 1 పొత్తి కడుపు ఆల్ట్రాసౌండ్ (మీ ఎముకలు మరియు పొత్తికడుపు మధ్య భాగం) మరియు 2. ట్రాన్స్ రెక్టల్ (పురీషనాళం ద్వారా) ఆల్ట్రాసౌండ్.  పొత్తికడుపు అల్ట్రాసౌండ్లో, ఒక జెల్ మీ కడుపు ప్రాంతానికి పూయబడుతుంది, అటుపైన ఓ పరికరం చర్మంపై కదులుతుంది. ఇలా పరికరం పొత్తికడుపు చర్మంపై కదులుతుండగా ఈ అవయవాల చిత్రాలను చూపించే ఒక తెరపై వైద్యులు పరిశీలిస్తారు, పరీక్ష చేస్తారు. ట్రాన్స్ రెక్టల్ ఆల్ట్రాసౌండ్డ్లో, పెన్ కన్నా కొంచం పెద్దదిగా ఉండే పరికరాన్ని పాయువు ద్వారా మీ పురీషనాళంలోకి చొప్పించబడుతుంది. అది ప్రోస్టేట్ గ్రంధి దగ్గరకు చేరుకున్నప్పుడు, డాక్టర్ ప్రొస్టేట్ గ్రంధి లేదా దాని ప్రక్క ప్రదేశంలో ఏదైనా అసాధారణ పెరుగుదల జరిగుంటే వాటి చిత్రాలను పరీక్షలో నిశితంగా పరిశీలిస్తాడు.
 • ఎమ్మారై పరీక్ష (MRI, మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్)
  ఈ ప్రక్రియలో, మీ అంతర్గత అవయవాలు యొక్క చిత్రాల శ్రేణిని విభిన్న కోణాల నుండి తీసుకోబడుతుంది. ఈ ప్రక్రియలో మీ శరీరం ఒక MRI మెషిన్ యొక్క సొరంగం లాంటి భాగంలోకి ప్రవేశిస్తుంది, తర్వాత ఆ ఎమ్మారై యంత్రం చిత్రాలను తీస్తుంది. ఈ విధానంలో కొన్నిసార్లు ఒక విరుద్ధ మాధ్యమా న్నీ(ఒక రంగును) ఇంజెక్ట్ చేసే అవసరం రావచ్చు. ఈ ఎమ్మారై పరీక్ష వివిధ కోణాల నుండి మీ మూత్రావాహిక యొక్క చిత్రాల శ్రేణిని అందిస్తుంది.
 • సీటీ స్కాన్ (కంప్యూటెడ్ టోమోగ్రఫీ స్కాన్)
  ఈ విధానంలో కూడా మిమ్మల్ని పడుకోబెట్టి ఒక సొరంగం లాంటి యంత్రం ద్వారా పంపబడడం అవసరం అవుతుంది. ఇందులోనూ ఒక విరుద్ధ మాధ్యమాన్ని ఇంజెక్షన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ యంత్రం X- కిరణాలను (ఎక్స్-రే) ఉపయోగించి వేర్వేరు కోణాల నుండి మీ శరీర భాగాల చిత్రాలను తీస్తుంది మరియు ఒక కంప్యూటర్ తెరపై మీ అంతర్గత అవయవాల యొక్క త్రిమితీయ (three-dimensional) చిత్రాన్ని అందిస్తుంది. సీటీ స్కాన్ మూత్రపిండాలలో  రాళ్ళు, మూత్ర నాళంలో ఏర్పడి ఉండే కణితలు, ఇతర అడ్డంకులు, ఊతలు (swellings), ఇంకా, మీ శరీర అవయవాలేవైనా విడ్డూరంగా పెరిగి ఉంటే వాటిని కూడా చూపిస్తుంది.
 • రేడియోన్యూక్లిడ్ స్కాన్స్
  రేడియోన్యూక్లిడ్ స్కాన్లో, రేడియోధార్మికత (రేడియోధార్మికతను విడుదల చేసే రసాయనాలు) పదార్థాన్ని రక్తంలోకి ఎక్కించబడుతుంది. ఈ రేడియోధార్మిక పదార్థం మీ మూత్రావాహికను చేరుకుంటుంది, అదే సమయంలో శరీరంలో  రేడియోధార్మిక పదార్ధం వెళ్ళేటప్పుడు ప్రత్యేక కెమెరాల ద్వారా చిత్రాలు తీసుకోబడతాయి. ఈ పరీక్ష మీ మూత్రపిండాలు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అని తనిఖీ చేస్తుంది.

పైన పేర్కొన్న అన్ని పరీక్షలకు ముందుగా మీ వైద్యుని సూచనలను తూచా-తప్పకుండా పాటించాలి. ఎందుకంటే, ఈ పరీక్షలను మీకు చేసే ముందు తినడం మరియు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవలసిన ఖచ్చితమైన అవసరాలు ఉన్నాయి.

బాధాకరమైన మూత్రవిసర్జనకు చికిత్స - Treatment of Painful Urination in Telugu

బాధాకరమైన మూత్రవిసర్జనకు చికిత్స అనేది శరీరంలో అంతర్లీనంగా ఉండే ప్రాథమిక కారణంపై ఆధారపడి ఉంటుంది.

మందులు

మూత్రంలో మంటకు మూత్ర నాళం లేదా పునరుత్పత్తి వ్యవస్థలో అంటు లేదా సంక్రమణం కారణం అయితే, మీ వైద్యుడు కొన్ని మందులు (యాంటీబయాటిక్స్ లేదా యాంటివైరల్స్) సూచించవచ్చు. సూచించిన సమయంమేరకు మందులు సేవించిన తర్వాత మీ వైద్యుడు తనను సందర్శించి పరీక్ష ఛేహ్యించుకోమని అడగొచ్చు. తద్వారా మీ వ్యాధి లక్షణాలు తగ్గి రోగం తగ్గుముఖం పట్టిందా లేదా అన్న విషయం వైద్యుడికి అవగతమౌతుంది.

మూత్రంలో మంటకు కారణం మూత్రపిండాల్లో రాళ్ళు అని తేలితే అప్పుడు ఆ రాళ్ళ పరిమాణం మీద చికిత్స ఆధారపడి ఉంటుంది, దానికనుగుణంగా చికిత్స భిన్నంగా ఉంటుంది. మీ మూత్రపిండాల్లో రాళ్లు చిన్నవే అయితే మీ డాక్టర్ రాళ్ళు మూత్రనాళం ద్వారా కరిగిపోయేంతవరకు చికిత్స ద్వారానే వేచి ఉండమని మిమ్మల్ని అడగవచ్చు. మూత్రపిండాల రాళ్ళు కరిగించడానికి కొన్ని మందులను  కూడా వైద్యుడు మీకు సూచించవచ్చు.

శస్త్రచికిత్స

మీకు మూత్రపిండాల్లో అవరోధంగా ఏర్పడిన రాళ్ళు పెద్దవి అయితే లేదా మూత్ర మార్గములో గడ్డ, కణితి ఉన్నా, లేదా మూత్రమార్గమే సంకోచానికి గురై ఉంటె మీ వైద్యుడు దీనిని పరిష్కరించడానికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సిందిగా మీకు సలహా ఇస్తారు.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

బాధాకర మూత్రవిసర్జన యొక్క ఉపద్రవాలు - Complications of Painful Urination in Telugu

మీ యొక్క బాధాకర మూత్రవిసర్జన పరిస్థితిని చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది కొన్నిసార్లు ప్రమాదకరమైనదిగా  పరిణమించవచ్చు. ఇది కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదకరమైనది కావచ్చు. అలాంటి ఉపద్రవాలేవంటే:

పునరావృత సంక్రమణం
మీకున్న మూత్రంలో మంట మూత్ర నాళము యొక్క సంక్రమణం వలన అయినచో అది తీవ్రమైంది కావచ్చు. చికిత్స చేయకుండా వదిలేస్తే, అది బాగైనట్లే అయి-కొంతకాలం తగ్గి తిరిగి తిరిగి సంభవించే “మూత్రంలో మంట”గా  పరిణమించొచ్చు. మూత్రనాళంలో పునరావృతమయ్యే సంక్రమణం దీనికి ముఖ్యకారణం.

క్రిమిజన్య విషదోషము (సెప్సిస్)
మీరు మూత్ర నాళంలో సంక్రమణాన్ని కలిగి ఉంటే, అది వ్యాప్తి చెంది రక్తప్రవాహంలోకి ప్రవేశించవచ్చు. ఇది క్రిమిజన్య విషదోషము (సెప్సిస్) లేదా యురోసెప్సిస్ (urosepsis) గా పిలువబడుతుంది. ఇది మూత్ర వ్యవస్థ నుండి రక్తప్రవాహంలోకి వ్యాపిస్తుంది. ఇది ప్రాణాంతక స్థితి మరియు అత్యవసర వైద్యసహాయం అవసరం.

మూత్రపిండ నష్టం
మూత్రంలో మంటకు కారణమైన అంటువ్యాధి/సంక్రమణం  మొత్తం మూత్ర వ్యవస్థకు వ్యాపిస్తుంది, అటుపై మూత్రపిండాలోకి ప్రవేశిస్తుంది, ఈ పరిస్థితి నిజంగా చాలా తీవ్రమైనది. ఈ అంటువ్యాధి/సంక్రమణం మూత్రపిండంలోకి ప్రవేశించినప్పుడు, అది శాశ్వత నష్టం కలిగిస్తుంది. అదేవిధంగా, దీర్ఘకాలంపాటు చికిత్స చేయని మూత్రపిండంలో రాయి కూడా మూత్రపిండాలకు నష్టాన్ని కలిగించవచ్చు.

నెలలు నిండని ప్రసవం లేదా తక్కువ జనన బరువు
గర్భవతి అయిన మహిళలో చికిత్స చేయని మూత్రనాళిక సంక్రమణం (UTI) తల్లికి అలాగే ఆమె బిడ్డకు కూడా ప్రమాదకరం. ఇది నెలలు నిండకుండానే పుట్టే శిశువు జననానికి లేదా తక్కువ జనన బరువును కలిగించేందుకు కారణమవుతుంది.

బాధాకర మూత్రవిసర్జన నివారణ - Prevention of Painful Urination in Telugu

బాధాకరమైన మూత్రవిసర్జన నివారణ

మేము తరచూ చెబుతున్నట్లుగా, డాక్టర్ చేతిలో కంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాథమిక విషయాలను అనుసరించడం ద్వారా, బాధాకరమైన మూత్రవిసర్జన మరియు దాని అంతర్లీన కారణాలు మాత్రమే కాకుండా ఇతర అనేక వ్యాధులను మీరు నివారించవచ్చు. బాధాకరమైన మూత్రవిసర్జనను నివారించడానికి చేపట్టాల్సిన చర్యల జాబితాను క్రింద పేర్కొంటున్నాం:

 • వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడుకోవడం
  మీరు వ్యక్తిగత పరిశుభ్రతను సమర్థవంతంగా కాపాడుకోవడం వల్ల, మీమూత్ర నాళం యొక్క వ్యాధిని నివారించుకోగలరని గమనించబడింది.   
 • ఆరోగ్యకరమైన శరీరానికి కీలకం ఆరోగ్యకరమైన పోషకాహారం తినడం.
  శరీరంలో బలమైన రోగనిరోధకత ఒక రోజులో నిర్మించబడదు. ముఖ్యమైన నూనెలు, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు వంటి అవసరమైన కీలకమైన పోషకాలతో మీ శరీరాన్ని ఎల్లప్పుడూ పోషించడం ద్వారా రోగనిరోధకత పెంపొందింపబడుతుంది. ఇది మీకు సంక్రమణాన్ని పోరాడటానికి, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించడానికి మరియు గడ్డలు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తాయి
 • మలవిసర్జన తర్వాత ముందు నుండి వెనుకకు తుడుస్తూ శుభ్రం చేసుకొండి  
  మలవిసర్జన తరువాత మలద్వారాన్ని శుభ్రపరచుకునేప్పుడు ముందు నుండి వెనుకవైపుకు తుడుస్తూ శుభ్రం చేసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల పాయువు నుండి సూక్ష్మజీవులు మీ యోనిలోకి, మూత్రమార్గంలోకి ప్రవేశించకుండా అరికట్టి యోనిలో మూత్ర నాళాల అంటురోగాలను నివారించవచ్చు.
 • మద్యపానం పరిమితం చేసి ధూమపానం ఆపండి
  మద్యపానం మీ శరీరంలో నిర్జలీకరణం (డీ-హైడట్) సృష్టిస్తుంది, తద్వారా మిమ్మల్ని అంటువ్యాధులకు గురి చేస్తుంది. ఇది కూడా మీ మూత్రపిండాలకు  హానికరం.
 • అంటువ్యాధికి ఇంట్లో పుష్కలమైన విశ్రాంతి
  మీకు అంటువ్యాధి సోకినట్లు అనుమానం కల్గినట్లయితే మీరు ఇంట్లో పుష్కలమైన విశ్రాంతి తీసుకోవాలి. ఇందుగ్గాను ఔషధాలను సమయానికే తీసుకోండి. ఇలా విశ్రాంతి తీసుకోవడం వల్ల అంటువ్యాధికి వ్యతిరేకంగా పోరాడటానికి మీ శరీరానికి మద్దతు ఇస్తుంది.
 • సురక్షిత సంభోగాన్ని పాటించండి
  అనేకమంది లైంగిక భాగస్వాములను కలిగి ఉండకూడదు అనేది ఎల్లప్పుడూ సూచించదగ్గ సలహా.  సంతాన నియంత్రణకు గాను భౌతిక పద్ధతులైన కండోమ్స్, డయాఫ్రాగమ్, మొదలైనవాటిని వాడండి. వీటిని వాడటం వల్ల మీరు లైంగిక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకున్నవారవుతారు. ప్రతి సంభోగం (లైంగిక చర్య) తర్వాత మీరు మూత్రవిసర్జన చేస్తే మీ జననాంగాల్లోంచి సూక్ష్మజీవుల్ని తొలగించుకోవడానికి తోడ్పడుతుంది.
 • నిత్య వ్యాయామం చేయండి
  దిననిత్యం వ్యాయామం చేయడం వల్ల మీ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు మీ శరీరం వ్యాధులతో  పోరాడటానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసేందుక్కూడా సహాయపడుతుంది.
 • వైద్యుడిని కలవడానికి సంకోచించకండి  
  మీ శరీరంలో ఎలాంటి అసాధారణ పరిస్థితిని మీరు అనుమానించినా వెంటనే వైద్యుడిని సందర్శించండి, త్వరిత రోగ నిర్ధారణ, చికిత్స కొరకు మీ శరీరాన్ని వైద్యతనిఖీ చేయించుకోండి.
 • ఆరోగ్యకరమైన బరువును కొనసాగించండి
 • ప్రతి 6 నెలలకు వాడుకగా రక్త పరీక్ష చేయించుకోండి
  ప్రతి 6 నెలలకు ఓసారి వాడుకగా రక్త పరీక్ష చేయించుకోండి, ఇలా చేయడం వల్ల రక్త-సంబంధమైన రోగాలను, ఇతర ఉపద్రవాది రోగాలను దూరముంచవచ్చు మరియు మీ శరీర పనితీరుపై ఒక నిఘాను కూడా ఉంచుతుంది.
 • ఏడాదికోసారి పూర్తిస్థాయిలో ఆరోగ్య పరీక్ష 
  మీరు రోగరహితులై, పూర్ణారోగ్యవంతులుగా ఉన్నారని మీకు మీరు ఖచితపరచుకునేందుకు మీ పూర్తి శరీరాన్ని సంవత్సరానికి ఒకసారి వైద్యతనిఖీ చేసుకోవదాన్ని ఒక అలవాటుగా చేసుకోండి.
 • మీరు ఇప్పటికే మధుమేహం, హెచ్ఐవి వంటి వైద్య పరిస్థితిని కలిగి ఉంటే ఆ పరిస్థితిని నియంత్రణలో ఉంచుకుంటూనే, మిమ్మల్ని మీరు మరిన్ని అంటువ్యాధులు సోకకుండా రక్షించుకునేందుకు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి.

బాధాకరమైన మూత్రవిసర్జన (డైసూరియా) అంటే ఏమిటి? - What is Painful Urination (Dysuria) in Telugu

ఆరోగ్యవంతులైన వయోజనులు రోజుకు సరాసరి కనీసం ఐదు నుండి ఆరు సార్లు మూత్రవిసర్జన చేస్తారు, అలాగే ప్రతి రోజూ, సామాన్యంగా 1.2 లీటర్ల నుండి 1.5 లీటర్ల ప్రమాణంలో మూత్ర విసర్జన చేస్తారు. మూత్రవిసర్జన ప్రారంభించినపుడు కానీ, లేదా మూత్రవిసర్జన చేస్తున్నంతసేపూ నొప్పి, మంటతో కూడిన బాధ,  లేక తీవ్ర అసౌకర్యమైన స్థితిని అనుభవించినట్లైతే దాన్నే "బాధాకరమైన మూత్రవిసర్జన" లేదా “డైసూరియా” అంటారు. ఇది మూత్రనాళానికి సంబంధించిన రోగాల్లో అతి సామాన్యంగా కానవచ్చే రోగలక్షణాల్లో ఒకటి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹719  ₹799  10% OFF
BUY NOW


వనరులు

 1. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Urinary Tract Imaging
 2. STD-GOV [Internet]. St SW, Rochester, USA. Painful Urination (Dysuria)
 3. Bueschen AJ. Flank Pain. In: Walker HK, Hall WD, Hurst JW. Clinical Methods: The History, Physical, and Laboratory Examinations. 3rd edition.. 3rd edition. Boston: Butterworths; 1990. Chapter 182.
 4. Hochreiter W . [Painful micturition (dysuria, algiuria). Ther Umsch. 1996 Sep;53(9):668-71.PMID: 8966693.
 5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Urination - difficulty with flow

మూత్రములో మంట (బాధాకరమైన మూత్రవిసర్జనకు) వైద్యులు

Dr. Samit Tuljapure Dr. Samit Tuljapure Urology
4 Years of Experience
Dr. Rohit Namdev Dr. Rohit Namdev Urology
2 Years of Experience
Dr Vaibhav Vishal Dr Vaibhav Vishal Urology
8 Years of Experience
Dr. Dipak Paruliya Dr. Dipak Paruliya Urology
15 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

మూత్రములో మంట (బాధాకరమైన మూత్రవిసర్జనకు) కొరకు మందులు

Medicines listed below are available for మూత్రములో మంట (బాధాకరమైన మూత్రవిసర్జనకు). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Lab Tests recommended for మూత్రములో మంట (బాధాకరమైన మూత్రవిసర్జనకు)

Number of tests are available for మూత్రములో మంట (బాధాకరమైన మూత్రవిసర్జనకు). We have listed commonly prescribed tests below: