ఋతుక్రమ సమయ నొప్పిని ఋతు నొప్పి లేదా డిస్మెనోరియా అని కూడా పిలుస్తారు. దీనిని ఋతుస్రావ సమయంలో దాదాపు ప్రతి స్త్రీని అనుభవిస్తుంది.ఋతు నొప్పి ఒక్కొక మహిళకి ఒక్కొక్కలా ఉంటుంది. ఈ నొప్పిని మహిళలు ఒకొక్క రుతుక్రమంలో ఒకొక్కలా కూడా అనుభవిస్తారు. కొంతమందికి, ఇది తేలికపాటి మరియు తక్కువ అసౌకర్యంగా ఉంటుంది,కానీ కొంతమందికి ఇది చాలా బాధాకరము మరియు సమస్యాత్మకమైనది.

ఈ నొప్పి పొత్తి కడుపు నుంచి తొడలు, కాళ్లు, వీపు మరియు కొన్నిసార్లు ఛాతీకి కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఒక అమ్మాయి తన మొదటి ఋతుక్రమాన్ని పొందిన్నప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది.

అయితే, శారీరక, మానసిక మరియు పోషక పరిస్థితులపై ఆధారపడి, జీవితంలోని తదుపరి దశల్లో వివిధ తీవ్రతలతో ఈ ఋతుక్రమ నొప్పిని అనుభవించవచ్చు. ఎక్కువగా, దీనికి ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు, కానీ ఋతు నొప్పి తీవ్రంగా మరియు భరించలేకుండా ఉంటే, నొప్పికి ముడి పడి ఇతర వైద్యపరమైన సమస్య లేదా రుగ్మత లేదని నిర్ధారించడానికి స్త్రీల వైద్య నిపుణురాలును (గైనకాలజిస్ట్ను) సందర్శించాలని మేము ఎక్కువగా సిఫార్సు చేస్తాము.

 1. ఋతు క్రమ నొప్పి యొక్క రకాలు - Types of period pain in Telugu
 2. ఋతుక్రమ నొప్పి యొక్క లక్షణాలు - Symptoms of period pain in Telugu
 3. ఋతుక్రమ నొప్పి కారణాలు - Period pain causes in Telugu
 4. ఋతుక్రమ నొప్పికి గృహ చిట్కాలు - Home remedies for period pain in Telugu
 5. ఋతుక్రమ నొప్పి కోసం శస్త్ర చికిత్స - Surgery for period pain in Telugu
 6. ఋతుక్రమ నొప్పి చికిత్స - Menstrual pain treatment in Telugu
 7. చామంతి టీ - Chamomile tea in Telugu
 8. ఋతుక్రమ నొప్పి కోసం మందులు - Medicine for period pain in Telugu
 9. ఋతుక్రమ నొప్పి ఉపశమనం కోసం ఆక్యుప్రెజెర్ - Acupressure for menstrual pain relief in Telugu
 10. ఋతుక్రమ నొప్పి ఉపశమనం కోసం ఆక్యుపంక్చర్ - Acupuncture for period pain relief in Telugu
 11. ఋతుక్రమ నొప్పి కోసం నొప్పినివారుణులు - Painkillers for period pain in Telugu
 12. రుతుక్రమ నొప్పి కోసం ఉష్ణ (వేడి) చికిత్స / వేడి నీటి కాపడం - Heat therapy for period pain in Telugu
 13. ఋతుక్రమ నొప్పి కోసం మర్దన - Massage in period pain in Telugu
 14. ఋతుక్రమ నొప్పి విశ్రాంతి - Relaxation methods for period pain in Telugu
 15. తగిన ఆహార విధానం ఋతుక్రమ నొప్పిని తగ్గిస్తుంది - Diet to reduce period pain in Telugu
 16. ఋతుక్రమ నొప్పి పై నిద్ర ప్రభావం - Sleep effective in period pain in Telugu
 17. ఋతుక్రమ నొప్పిని తగ్గించడానికి వ్యాయామం - Exercise to reduce period pain in Telugu
 18. ఋతుక్రమ నొప్పిని తగ్గించడానికి నీటిని ఎక్కువగా తీసుకోవాలి - Increase water intake to reduce period pain in Telugu
 19. ఋతుక్రమ నొప్పి తగ్గించడానికి మెగ్నీషియం - Magnesium to reduce period pain in Telugu
 20. ఋతుక్రమ నొప్పి కోసం విటమిన్ B1 మరియు చేప నునె - Vitamin B1 and Fish oil for period pain in Telugu
 21. ఋతుక్రమ నొప్పి తగ్గించడానికి సోంపు గింజలు - Fennel seeds to reduce period pain in Telugu
 22. ఋతుక్రమ నొప్పిని తగ్గించడానికి బోరాన్ - Boron to reduce period pain in Telugu
 23. ఋతుక్రమ నొప్పిని వదిలించుకోవడానికి ఒత్తిడిని విడుదల చేయండి - Release stress to get rid of period pain in Telugu
 24. ఋతుక్రమ నొప్పిని వదిలించుకోవడానికి ఈ ఆహారాలను నివారించండి - Avoid these foods to get rid of period pain in Telugu
 25. ఋతుక్రమ నొప్పి కోసం అల్లం - Ginger for menstrual pain relief in Telugu
 26. పసుపు ఋతుక్రమ నొప్పిని వదిలించుకోవడానికి సహాయపడుతుంది - Turmeric helps get rid of period pain in Telugu
ఋతుక్రమ సమయ నొప్పి వైద్యులు

ఋతు నొప్పి లేదా డిస్మెనోరియాను ప్రాధమిక లేదా ద్వితీయ నొప్పులుగా వర్గీకరించవచ్చు.

 • ప్రాథమిక స్థాయి ఋతు నొప్పి లేదా ప్రాథమిక స్థాయి డిస్మెనోరియా
  గర్భాశయం యొక్క అంతర్గత వరస తొలగుట వలన మాత్రమే ఇది సంభవిస్తుంది. నొప్పికి కారణమయ్యే ఇతర వ్యాధి కూడా ఏది లేదు.
 • ద్వితీయ స్థాయి ఋతునొప్పి లేదా ద్వితీయ స్థాయి డిస్మెనోరియా
  ద్వితీయ డిస్మెనోరియా అనేది పునరుత్పత్తి అవయవాల యొక్క రుగ్మత కారణంగా సంభవించే నొప్పిగా నిర్వచించబడింది. ఇది ఋతు చక్రం మొదలయ్యే కొద్ది రోజుల ముందుగా మొదలవుతుంది, ఋతుక్రమ సమయంలో తీవ్రమవుతుంది మరియు రక్తస్రావం ఆగిన తరువాత కూడా తగ్గకపోవచ్చు.

డిస్మెనోరియా యొక్క అత్యంత సాధారణ లక్షణం పొత్తి కడుపులో నొప్పి. అయినప్పటికీ, ప్రాథమిక డిస్మెనోరియా యొక్క కొన్ని ఇతర లక్షణాలను కూడా స్రీలు అనుభవించవచ్చు:

 • తొడలలో నొప్పి కాళ్ళకు,నడుము, ఛాతీ, మొదలైన వాటికి కూడా వ్యాపింస్తుంది
 • వికారం
 • వాంతులు కూడా ఉండొచ్చు. సాధారణంగా, వంతు అయిన తర్వాత నొప్పి నుండి కొంత ఉపశమనాన్ని పొందవచ్చు.
 • అలసట
 • చిరాకు
 • మైకము

ఒక స్త్రీ వైద్య నిపుణులని (gynaecologist) ఎప్పుడు సంప్రదించాలి?

పైన పేర్కొన్న లక్షణాలు సాధారణంగా ప్రాధమిక డిస్మెనోరియాలో కనిపిస్తాయి మరియు గృహ చికిత్సలు మరియు విశ్రాంతి తీసుకోవడం సులభంగా తగ్గించవచ్చు. అయితే ద్వితీయ డిస్మెనోరియా యొక్క క్రింది లక్షణాలు ఏవైనా ఉంటే, వైద్యున్నిలేదా గైనకాలజిస్ట్ను కలవాలి.

 • దురద, ఎరుపుదనం, నొప్పి మొదలైన ఇతర లక్షణాలతో యోని స్రావాల విడుదల
 • రహస్య భాగాల నుండి మురికి వాసన.
 • ఋతు క్రమ సమయం కానీ సమయాలలో కూడా యోని నుండి రక్తస్రావం.
 • ఎటువంటి గుర్తించదగిన కారణము లేకుండా పొత్తి కడుపులో తీవ్రమైన పునరావృత నొప్పి.

ఋతుక్రమ నొప్పితో ముడిపడి ఉన్న కారణాలు క్రింద ఉన్నవి

ప్రాథమిక స్థాయి డిస్మెనోరియా

ఋతుస్రావం మొదలైయ్యే ముందు ఇది మొదలవుతుంది. అండం ఫలదీకరణం కానప్పుడు, గర్భాశయం దాని అంతర్గత వరస (ఎండోమెట్రియం) ను తొలగించే ప్రక్రియను ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో, గర్భాశయం యొక్క అంతర్గత వరసలో ప్రోస్టాగ్లాండిన్లు (గర్భాశయం ద్వారా ఉత్పత్తి చేయబడే హార్మోనులు) అను హార్మోన్లు చేరడం ప్రారంభమవుతాయి. ఈ హార్మోన్లు గర్భాశయ గోడల యొక్క సంకోచానికి కారణమవుతాయి. ఈ సంకోచాలు బలంగా ఉంటాయి మరియు పొత్తికడుపు ప్రాంతంలోని తిమ్మిరి వలె భావించబడతాయి. గర్భాశయ లోపలి పొరను (endometrium) తొలగిస్తున్నప్పుడు, రక్త నాళాలు సంకోచించబడతాయి ఫలితంగా, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఇది మెదడుకు సంకేతాలను పంపుతుంది మరియు నొప్పి గ్రాహకాలను ప్రేరేపిస్తుంది. తత్ఫలితంగా, ఋతుస్రావం యొక్క మొదటి రోజున నొప్పి తీవ్రమవుతుంది. రోజులు పెరిగే నాటికి, ఎండోమెట్రియం (గర్భాశయ పోర) యొక్క మందం తగ్గుతుంది, ప్రోస్టాగ్లాండిన్ల స్థాయి కూడా పడిపోతుంది. అందువల్ల, ఋతుచక్ర కాలం పెరుగుతున్నపుడు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. కడుపు ఉబ్బరం వలన నొప్పి కూడా సంభవిస్తుంది, ఇది ఋతుక్రమ సమయంలో చాలా సాధారణ లక్షణంగా ఉంటుంది. ప్రాథమిక డిస్మెనోరియాలో నొప్పి కలిగించే ఇతర అంతర్లీన రుగ్మత ఏది లేదు.

ద్వితీయ స్థాయి డిస్మెనోరియా

ఇది పునరుత్పత్తి వ్యవస్థ (reproductive system) యొక్క అంతర్లీన రుగ్మత కారణంగా సంభవిస్తుంది. "డిస్మెనోరియా మరియు సంబంధిత రుగ్మతల" పై ఒక పరిశోధనా వ్యాసం ప్రకారం, ద్వితీయ స్థాయి డిస్మెనోరియా ఫలితంగా కొన్ని వైద్య సమస్యలు ఉన్నాయి:

 • ఎండోమెట్రీయాసిస్ (Endometriosis)
  దీనిలో ఎండోమెట్రియం యొక్క కణాలు బాగా పెరిగి మరియు గర్భాశయం కంటే ఇతర ప్రదేశాలకు విస్తరించాయి. అవి బీజస్రోతస్సులు (fallopian tubes), అండాశయము, ముత్రాశయము, మొదలైన వాటికి గుండా పెరిగిపోతాయి. ఈ ఎండోమెట్రియం హార్మోన్ల మార్పులకు ప్రతిస్పందనగా సాధారణ ఋతుక్రమ సమయంలో తొలగిపోతుంది. ఫలితంగా, రక్తస్రావం గర్భాశయంలో అలాగే ఎండోమెట్రియం పెరిగిన ప్రదేశాలలో మొదలవుతుంది. ఈ రక్తం వివిధ అవయవాలకు అంటుకు పోతుంది మరియు నొప్పికి కారణమవుతుంది. (మరింత సమాచారం: ఎండోమెట్రీయాసిస్ చికిత్స)
 • అడెనొమయోసిస్ (Adenomyosis)
  ఎండోమెట్రియామ్ యొక్క కణజాలం గర్భాశయ కండరాలను పక్కకు నెట్టి మరీ పెరుగుగుతుంటే, అది అడెనోమయోసిస్ గా పిలువబడుతుంది. ఇది పొత్తికడుపు, ఋతుక్రమ తిమ్మిరి, గర్భాశయం యొక్క విస్తరణ మరియు అధిక రక్తస్రావ ప్రవాహంలో తీవ్ర నొప్పిని కలిగిస్తుంది.
 • ఫైబ్రాయిడ్లు (Fibroids)
  ఫైబ్రోయిడ్లు గర్భాశయ గోడ యొక్క క్యాన్సర్ కానీ కణుతుల వంటివి. ఇవి సాధారణంగా చిన్నవిగా ఉంటాయి మరియు గర్భాశయంలో ఎక్కడైనా పెరగవచ్చు. చిన్న ఫైబ్రాయిడ్లు సమస్యలను కలిగించవు కానీ పెద్ద పరిమాణంలో ఉన్నవి తీవ్ర నొప్పి, అధిక ఋతు రక్తస్రావం, మొదలైన వాటికి కారణం కావచ్చు. (మరింత సమాచారం: యూటిరైన్ ఫైబ్రోయిడ్ లక్షణాలు)    
 • పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి (Pelvic inflammatory disease) (PID)
  గర్భాశయం, బీజస్రోతస్సులు (fallopian tubes) లేదా అండాశయాలలో బ్యాక్టీరియా సంక్రమణ ఉన్నప్పుడు, ఇది కటి వలయ ప్రభావిత ప్రాంతాల వాపుకు కారణమవుతుంది. దీనిని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధిగా గుర్తిస్తారు. ఇది ఋతుక్రమ సమయంలో తీవ్ర నొప్పికి కారణమవుతుంది. రక్తస్రావం ఆగిపోయిన తరువాత కూడా పొత్తి కడుపు నొప్పి కొనసాగుతుంది.
 • గర్భాశయ పరికరములు (Intrauterine Devices) (IUD లు)
  గర్భాశయ పరికరములు అనేవి గర్భాన్ని నివారించడానికి గర్భాశయంలోకి చొప్పించబడుతున్న గర్భనిరోధక పద్ధతులు. శరీరం ఆ పరికరాన్ని స్వీకరించడానికి కొన్ని నెలల సమయం పడుతుంది మరియు ఈ సమయంలో, అవి ఋతుక్రమ నొప్పికి కారణం కావచ్చు. కొంతకాలం తర్వాత, నొప్పి పూర్తిగా కనిపించకపోవచ్చు.
 • గర్భాశయ స్టెనోసిస్ (Cervical stenosis)
  గర్భాశయ లేదా జనన వాహిక సాధారణం కొలత కన్నా సన్నగా ఉన్నప్పుడు, ఋతుక్రమ రక్తం శరీరంలో నుండి బయటికి ప్రవహించటానికి ప్రయత్నించినప్పుడు అది బాధాకరమవుతుంది. ఫలితంగా, తీవ్రమైన నొప్పి కలుగవచ్చు.

ప్రాధిమిక స్థాయి ఋతుక్రమ నొప్పి లేదా డిస్మెనోరియాకి ఇంటిలో చికిత్స చేసుకోవచ్చు. క్రింద మా దగ్గర ఉన్న కొన్ని చిట్కాలను మీరు పాటించవచ్చు.

ఋతుక్రమ నొప్పికి మందుల చికిత్స పని చేయనట్లయితే, వైద్యుడు లేదా గైనకాలజిస్ట్  దాని యొక్క అంతర్లీన కారణాన్ని తీసివేయడానికి శస్త్రచికిత్స చేయవలసి ఉంటుందని సూచిస్తారు. అందువల్ల ఎండోమెట్రియోసిస్, ఫెబిరాయిడ్స్, అడెనోమయోసిస్, గర్భాశయ స్టెనోసిస్, మొదలైనవాటికి చికిత్స చేయటానికి శస్త్రచికిత్స  చేయించుకోవలిసి రావచ్చు.

ఋతుక్రమ నొప్పి చికిత్స ముఖ్యంగా  అంతర్లీన కారణం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాక ఇంటి  చికిత్స, మందులు, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, శస్త్రచికిత్స మొదలైనవి కూడా ఉండవచ్చు.

చామంతి యొక్క చికిత్సా ప్రభావాల గురించి అధ్యయనం చేసిన క్రమబద్ధమైన సమీక్ష, కండరాల తిమ్మిరి మరియు ఋతు చక్రాలకు సంబంధించిన ఇతర లక్షణాలను తగ్గించడంలో చామంతులు ప్రభావవంతమైనవని సూచిస్తున్నాయి.

ఏమి కావాలి?
చామంతి రేకలు 1-2 టీస్పూన్లు, ఒక గ్లాసు నీరు, తేనె ఒక అర టీస్పూన్.

దీన్ని ఎలా వాడాలి?
చామంతి టీ చేయడానికి, ఒక గ్లాసు నీటీలో చామంతి రేకులను జోడించి 5-7 నిమిషాలు నానబెట్టండి. దానిని రోజుకు 2-3 సార్లు రుతుక్రమ సమయంలో త్రాగాలి.

 • ప్రాథమిక స్థాయి డిస్మెనోరియాను పైన పేర్కొన్న పద్ధతులను ఉపయోగించి సాధారణంగా చికిత్స చేయ్యవచ్చు. అయితే, కొన్నిసార్లు నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు, వైద్య సహాయం అవసరం కావచ్చు. వైద్యులు  ఋతుక్రమ నొప్పి తీవ్రత తగ్గించే బలమైన నొప్పి నివరుణులు లేదా హార్మోన్ మాత్రలు సూచించవచ్చు.
 • ద్వితీయ స్థాయి డిస్మెనోరియా ఉంటే, వైద్యులు  యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు, లేదా హార్మోనల్  ఓరల్ కాంట్రాసెప్టివ్స్ ను అంతర్లీన బాక్టీరియా లేదా వాపు వ్యాధులకు లేదా ఇతర కారణాల చికిత్సకు  సూచించవచ్చు.

ప్రాధమిక స్థాయి డిస్మెనోరియాపై  ఆక్యుప్రెషర్ మరియు ఆక్యుపంక్చర్ యొక్క ప్రభావాలపై నిర్వహించిన ఒక అధ్యయనం ఈ రెండు వైద్య విధానాలు, ఋతుక్రమ  నొప్పి యొక్క వ్యవధి మరియు తీవ్రతను తగ్గించడంలో ఉపయోగకరంగా ఉన్నాయని సూచిస్తుంది.
ఋతుక్రమ నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు  ఆక్యుప్రెషర్ లేదా ఆక్యుపంక్చర్ వృత్తినిపుణుడి నుండి సహాయం పొందవచ్చు.

2015 లో ఆక్యుపంక్చర్ మరియు ఆక్యుప్రెజెర్ వైద్య విధానాల యొక్క ప్రభావం జీవిత నాణ్యతను  మెరుగుపరచడం మరియు ప్రాధమిక స్థాయి డిస్మెనోరియాను తగ్గించడం పై ఒక అధ్యయనం నిర్వహించబడింది. ఆక్యుప్రెజెర్ నొప్పి ఉపశమనంలో  నొప్పి నివరుణులంత ప్రభావవంతమైనదిగా, మరియు ఆక్యుపంక్చర్ ఋతుక్రమ స్త్రీలోని జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని సూచించింది.
ఋతుక్రమ నొప్పి లక్షణాల  నుండి ఉపశమనం పొందేందుకు ఆక్యుప్రెషర్ లేదా ఆక్యుపంక్చర్ వృత్తినిపుణుడి నుండి సహాయం పొందవచ్చు.

నొప్పి భరించలేనంతగా మారినప్పుడు, మీరు డైక్లోఫెన్క్, ఇబుప్రోఫెన్, ఎసిటమైనోఫెన్హెన్, మొదలైనటు వంటి అందుబాటులో ఉన్న ఓవర్-ది-కౌంటర్ (OYC) స్టెరాయిడ్-కానీ ఇన్ఫ్లమేటరీ వ్యతిరేక మందులను తీసుకోవచ్చు. ఈ మందులు శరీరంలో ప్రోస్టగ్లాండిన్ల స్థాయిని తగ్గిస్తాయి మరియు ఋతుక్రమ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ఈ ఔషధాలకు ఔషధపత్రం (ప్రిస్క్రిప్షన్) అవసరం కానప్పటికీ, కడుపు పుండ్లు, మూత్రపిండాల వ్యాధులు, కాలేయ వ్యాధులుహృదయ వ్యాధులుఉబ్బసం మొదలైనవాటితో బాధపడుతుంటే ఈ మందులను తీసుకోకూడదు. అలాంటి పరిస్థితులలో ఋతుక్రమ నొప్పిని తగ్గించడానికి ఒక ప్రత్యామ్నాయ నొప్పి నివారణ మందు కోసం వైద్యుడిని సంప్రదించాలి.

ప్రాధమిక స్థాయి డిస్మెనోరియాపై ఉష్ణ చికిత్స యొక్క ప్రభావాలపై ఆధారపడిన అధ్యయనాల క్రమబద్ధమైన సమీక్షను 2016 లో నిర్వహించారు. ఈ సమీక్ష ఉష్ణ/వేడి ప్రసరణ చికిత్స ఋతుక్రమ కడుపు నొప్పిని గణనీయంగా తగ్గిస్తుందని సూచించింది.

ఏమి కావాలి?
వేడి నీరు, ప్లాస్టిక్ సీసా లేదా నీటి సంచి.

దీన్ని ఎలా వాడాలి?
ఉష్ణ/వేడి చికిత్స కోసం, వేడి నీటితో ఒక నీటి లేదా ప్లాస్టిక్ బాటిల్ను నింపి, మీ పొత్తికడుపుపై ఉంచండి. వేడి నీటి గాయాలను నివారించడానికి నీరు బయటకు రావడం లేదని నిర్ధారించుకోండి.
దానికి ప్రత్యామ్నాయంగా, నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి ఒక అరగంట వేడి నీటి తొట్టెలో కూర్చుని లేదా వేడి నీటిలో షవర్ తీసుకోవచ్చు.

డిస్మెనోరియాపై మర్దన యొక్క ప్రభావాలపై ఒక అధ్యయనం పొత్తి కడుపు ప్రాంతాన్ని మర్దనా చేయడం వాళ్ళ ఋతుక్రమ నొప్పిని గణనీయంగా తగ్గిస్తుందని సూచిస్తుంది.

ఏమి కావాలి?
ఆవ నూనె, ఆముదం నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, మొదలైనవి.

దీన్ని ఎలా వాడాలి?
పైన తెలిపిన నూనెలలో దేనినైనా తీసుకోవచ్చు. నూనె కొంచెం వేడి చెయ్యాలి మరిగించ కూడదు. చేతిలోకి కొంచెం నూనెను తీసుకోని, పొత్తికడుపు ప్రాంతంలో మర్దన చేసుకోవాలి చిన్న చిన్న వృత్తాకార సున్నితమైన కదలికలను ఉపయోగించి ఒక 10-15 నిమిషాల పాటు చేసుకోవాలి. ఇది ఋతుక్రమ నొప్పి నుండి కొంత ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. మర్దన తరువాత, వేడి నీటి స్నానం కూడా చెయ్యవచ్చు.

కొన్నిసార్లు, ఒత్తిడి, ఆందోళన, మరియు కుంగుబాటు కూడా ఋతుక్రమ నొప్పిని మరింత తీవ్రతరం చేయవచ్చు. అందువల్ల గర్భాశయ కండరాలను సడలించడం వంటి ఉపశమన పద్ధతులను ఉపయోగించడం వాల్ల నొప్పి యొక్క తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. మరియు శరీరంలోని ఎండోర్ఫిన్లను (ఆనంద హార్మోన్లు) ఉత్పత్తి చేస్తాయి.

ఇది ఎలా చెయ్యాలి?
మృదువైన పరుపు పడుకోండి. ఘాడ శ్వాసలను తీసుకోని, మీ శ్వాస మీద దృష్టి పెట్టండి. కళ్ళు మూసుకొని మీ తల నుండి కాళ్ల వరకు ప్రతి కండరాల మీద దృష్టి కేంద్రీకరించడం ద్వారా మీ శరీరాన్ని విశ్రాంతిని ఇవ్వండి. దీన్ని కనీసం 15-20 నిమిషాలు చేయండి. ధ్యాన సంగీతాన్ని కూడా విశ్రాంతి కోసం ఉపయోగించవచ్చు. మార్గదర్శక ధ్యానాలు మరియు ధ్యాన సంగీతం రెండూ వివిధ వెబ్సైట్లలో చూడవచ్చు.

ఆహారం, డిస్మెనోరియా మరియు ఋతుక్రమ సమయానికి ముందు వచ్చే నొప్పి లక్షణాల మధ్య ఉన్న సంబంధంపై నిర్వహించిన ఒక అధ్యయనం, తక్కువ కొవ్వు మరియు అధిక ఫైబర్ కలిగిన శాఖాహారం ఆహారం ఋతుక్రమ నొప్పిని మరియు దాని తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుందని సూచిస్తుంది.

సమయానికి ముందు కొన్ని రోజులు, కొవ్వు అధికంగా ఆహారం, జంక్ ఫుడ్, అధిక నూనె ఉండే ఆహారం మొదలైనవి తినడం నివారించలి. అధిక నీరు మరియు ఫైబర్ కంటెంట్లు ఉన్న పండ్లు మరియు కూరగాయలు వంటి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోండి. ఇది ఋతుక్రమనొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తుంది మరియు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కూడా సహాయపడుతుంది.

ఒక మంచి నిద్ర అనేది ఎప్పుడైనా ఏ రకమైన నొప్పినైనా తగ్గించడానికి సహాయపడుతుంది. 2015లో ఋతుచక్ర సమయం ముందు ఉండే లక్షణాలు, ఋతుక్రమ సమయ వైఖరి మరియు నిద్ర నాణ్యత మధ్య సంబంధంపై నిర్వహించిన ఒక అధ్యయనం, నిద్ర విధానాలలో ఆటంకాలు ప్రత్యక్షంగా ఋతుక్రమ నొప్పి లక్షణాలను తీవ్రతరం చేసి మరియు నొప్పి వ్యవధిని కూడా పెంచుతాయని సూచిస్తున్నాయి.

అందువల్ల, ఋతుక్రమ నొప్పి తీవ్రతను తగ్గించడానికి, 7-8 గంటల నిద్రను నిరంతరంగా తీసుకొని, విశ్రాంతి తీసుకోవడం అవసరం.

ప్రాధమిక స్థాయి డిస్మెనోరియాపై వ్యాయామం లేదా యోగా యొక్క ప్రభావాల గురించి గత రెండు దశాబ్దాలుగా వివిధ అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. ఈ అధ్యయనాలు, ఋతుక్రమ సమయంలో మరియు తరువాత మితమైన వ్యాయామం చెయ్యడం వాల్ల ఋతుక్రమ నొప్పి యొక్క తీవ్రత తగ్గుతుందని సూచిస్తున్నాయి.

అందువల్ల, యోగా, వ్యాయామం,సాగడం, ఈత వంటి ఇతర శారీరక శ్రమలు ఎండోర్ఫిన్లు లేదా సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేసి ఋతుక్రమ నొప్పిని తగ్గిస్తాయి. వ్యాయామాన్ని క్రమంగా చేస్తే, తరువాతి ఋతు చక్రాల సమయంలో నొప్పి తీవ్రతను కూడా తగ్గించవచ్చు. స్వీయ ప్రేరణ ద్వారా లేదా శృంగారం ద్వారా యోని ఉద్వేగం కలిగినప్పుడు కూడా ఋతుక్రమ నొప్పిని తగ్గించవచ్చు.ఆ సమయంలో మీ భాగస్వామి కండోమ్ ను ధరించినట్లు నిర్ధారించుకోండి, ఎందుకంటే ఋతుస్రావ సమయాలలో శృంగారంలో పాల్గొంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి వంటి అంటువ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

నీటిని పుష్కలంగా తాగడం అనేది ఎప్పుడు ఆరోగ్యానికి చేటు కాదు. తగినంత నీరు త్రాగడం వాల్ల అది నీరు నిలుపుదలని నిరోధిస్తుంది మరియు కడుపు ఉబ్బరం నుంచి దూరంగా ఉంచుతుంది. ఋతుక్రమంలో ఉన్నప్పుడు ఉబ్బరం అనేది బాధాకరంగా ఉంటుంది. అందువల్ల, ఋతుక్రమ సమయంలో మరియు ముందు తగినంత నీరు త్రాగండి.

ఋతుక్రమ సమస్యల్లో మెగ్నీషియం యొక్క ప్రభావాలపై ఒక విద్యా సమీక్ష, మెగ్నీషియం ఋతుక్రమ నొప్పిని తగ్గించడంలో సహాయపడిందని సూచించింది.

అందువల్ల,ఋతుక్రమ నొప్పి నుంచి ఉపశమనానికి, ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే, బచ్చలి కూర, కాలే, అవకాడొలు, కోరిందకాయలు (raspberries), అరటిపండ్లు మొదలైనవిఉండాలి.ఋతుక్రమ నొప్పిని తగ్గించడం కోసం మెగ్నీషియం అనుబంధకాల గురించి గైనకాలజిస్ట్ తో మాట్లాడవచ్చు.

ప్రాధమిక స్థాయి మరియు ద్వితీయ స్థాయి డిస్మెనోరియా చికిత్సకు మూలికలు మరియు ఆహార పదార్ధాల సంబంధంపై నిర్వహించిన ఒక అధ్యయనం, విటమిన్ B1 లేదా థయామిన్ 100 mg తో పాటుగా చేప నూనె గుళికలు రోజువారీ తీసుకుంటే ఋతుక్రమ నొప్పిని తగ్గిస్తుందని సూచించింది.

విటమిన్ B1 తీసుకునే ముందు గైనకాలజిస్ట్ తో మాట్లాడండి. వైద్యులు మీ కోసం సరైన మోతాదులను మరియు వాటిని తీసుకోవలసినది సమయాన్ని సూచిస్తారు. విటమిన్ B1 అధికంగా బఠానీలు, చిక్కుళ్ళు, కాయలు, వోట్స్, పాలు, బియ్యం తదితర ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. (మరింత సమాచారం: విటమిన్ బి ప్రయోజనాలు)

2012 లో ఋతుక్రమ నొప్పిపై సోంపు గింజల యొక్క ప్రభావాలను  తెలుసుకోవడానికి ఒక అధ్యయనం నిర్వహించారు. దానిలో 30 mg సోంపు గింజ సారాలా గుళికలు  తీసుకోవడం వల్ల ఋతుక్రమ నొప్పిని గణనీయంగా తగ్గిస్తుంది సూచించారు. ఈ అధ్యయనంలో ఋతుక్రమ మొదటి రోజు నుంచి మూడు రోజుల వరకు రోజుకి  నాలుగు సార్లు ఈ గుళికలను ఇవ్వడం జరిగింది. అందువల్ల, ఋతుక్రమ నొప్పి ఉపశమనం కోసం, సోంపు టీని త్రాగవచ్చు, సోంపు గింజలను నోట్లో వేసుకొని  నమలవచ్చు, లేదా సోంపు గింజ సారాలా అనుబంధకాలను తీసుకోవచ్చు.

ఏమి కావాలి?
ఒక టీస్పూన్  సోంపు గింజలు, ఒక కప్పు నీరు, అల్లం మరియు తేనె.

దీన్ని ఎలా వాడాలి?
ఒక కప్పు నీటిలో  సోంపు గింజలను జోడించి. 2-3 నిమిషాలు దానిని మరగబెట్టాలి. కావాలంటే, అల్లం మరియు తేనెను వేసి రుచిని మెరుగుపరచవచ్చు. ఈ టీ ఋతుక్రమ సమయంలోరోజుకు  2-3 సార్లు త్రాగండి.
సోంపు గింజ సారాలా గుళికలు  తీసుకోవడానికి సరైన మోతాదు కోసం ఒక వైద్యుడిని లేదా ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించండి.

ఋతుక్రమ సమయం ముందు వచ్చే లక్షణాలను తగ్గించడంలో బోరాన్ యొక్క ప్రభావాలను తెలుసుకోవడానికి ఇటీవలి ఒక నిర్దేశకమైన సమీక్ష, రోజుకు 10 mg బోరాన్ అనుబంధకాలను తీసుకుంటే, ఋతుక్రమ నొప్పి యొక్క తీవ్రత మరియు వ్యవధిని గణనీయంగా తగ్గిస్తుందని సూచించింది.

ఋతుక్రమ సమయంలో ఉన్నప్పుడు ప్రతిరోజూ బోరాన్  అనుబంధకాలను తీసుకోవచ్చు, కానీ వాటిని ప్రారంభించడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.

ఒత్తిడి మరియు ఆందోళన శరీరంలో ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తికి దారితీస్తుంది, ఇది నొప్పి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఒత్తిడి మరియు డిస్మెనోరియాపై  ఒక ఉజ్జాయింపు అధ్యయనం, ఒత్తిడిలో ఉన్న స్త్రీలలో డిస్మెనోరియా అధికమయ్యే (ఒత్తిడి లేని మహిళల్లో రెండు రెట్లు ఎక్కువ) ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సూచించింది.

అందువల్ల, వ్యాయామం, యోగా, ధ్యానం, నృత్యం, సంగీతం మొదలైన వాటి ద్వారా ఒత్తిడిని తగ్గించడం వల్ల ఋతుక్రమ నొప్పి తీవ్రతను తగ్గించటానికి సహాయపడవచ్చు. దాని కోసం ఏదైనా వృత్తినిపుణుడి  సహాయం పొందవచ్చు.

ఉబ్బరం అనేది ఋతుక్రమ సమయంలో చాలా సాధారణమైన లక్షణం. కాఫీ, ఆల్కాహాల్, జంక్ ఫుడ్, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం, చక్కెర ఎక్కువగా ఉన్నఆహారం, తదితర ఆహార ఉత్పత్తులను తినడం వల్ల శరీరంలో నీటిని నిలుపుదలకు కారణమవుతుంది. అది ఉబ్బరం కలిగించి నొప్పికి దారి తీయవచ్చు. అందువల్ల, కొంతకాలం వాటి నుండి దూరంగా ఉండటం మంచిది.

అల్లం ప్రపంచంలోని అనేకమంది ప్రజల ఇష్టమైన మూలికలలో ఒకటి. ఇది  అధిక మోతాదులో ఆహార వంటకాల్లో అలాగే దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం  ఒక ముఖ్య వస్తువుగా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ప్రాధమిక స్థాయి డిస్మెనోరియాపై అల్లం యొక్క  ప్రభావాల మీద 2012 లో నిర్వహించిన ఒక అధ్యయనంలో, అల్లం ఋతుక్రమ నొప్పి యొక్క తీవ్రతను మరియు వ్యవధిని గణనీయంగా తగ్గిస్తుందని  కనుగొన్నారు.

ఏమి కావాలి?
3-4 అల్లం ముక్కలు లేదా ఒక అంగుళం అల్లం ముక్క, ఒక కప్పు నీరు, నిమ్మ రసం కొన్ని చుక్కలు మరియు తేనె సగం టీస్పూన్.

దీన్ని ఎలా వాడాలి?
రోజుకు 3-4 అల్లం ముక్కలను తినవచ్చు లేదా అల్లం టీ ను మూడు సార్లు తాగావచ్చు. అల్లం టీ చేయడానికి, ఒక గిన్నెలో నీరు మరిగించి, తరిగిన లేదా  నలగొట్టిన అంగుళం అల్లం ముక్కని జోడించాలి. రుచిని మెరుగుపరచడం కోసం దీనిలో తేనె, నిమ్మకాయ రసం కూడా కలపవచ్చు.

పసుపు సాధారణంగా ఉపయోగించే మసాలా దినుసులలో ఒకటి. ఇది దాని వాపు నిరోధక మరియు యాంటియోక్సిడెంట్ లక్షణాలకు కూడా ప్రసిద్ధి చెందింది. 2015 లో ఋతుక్రమ  లక్షణాలపై పసుపు యొక్క ప్రభావాల మీద ఒక అధ్యయనం నిర్వహించబడింది. ఈ అధ్యయనం పసుపులో ఉండే కర్కుమిన్ (curcumin) , వాపు నిరోధక మరియు న్యూరోట్రాన్స్మిటర్ ను  (నరములు ప్రేరేపించే రసాయనాలు) సరిచేసే లక్షణాలను కలిగి ఉంటుంది తెలిపింది. ఫలితంగా, ఇది ఋతుక్రమ సమయంలో భరించవలసిన లక్షణాలను తగ్గిస్తుంది.

ఏమి కావాలి?
పసుపు సగం టీస్పూన్, ఒక కప్పు నీరు, అర అంగుళం అల్లం ముక్క, తేనె సగం టీస్పూన్, కొన్ని చుక్కల నిమ్మ రసం.

దీన్ని ఎలా వాడాలి?
ఒక కప్పు నీటిని మరగబెట్టి, పసుపు, తేనె, అల్లం వేసి, 2-3 నిమిషాలు కాచాలి. ఈ టీని రోజుకు మూడు సార్లు త్రాగాలి.

ప్రత్యామ్నాయంగా, ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించి  కర్కుమిన్ సారాలా గుళికలని ఎంత మోతాదులో తీసుకోవాలో  తెలుసుకోవచ్చు.

Dr. Swati Rai

Dr. Swati Rai

Obstetrics & Gynaecology
10 वर्षों का अनुभव

Dr. Bhagyalaxmi

Dr. Bhagyalaxmi

Obstetrics & Gynaecology
1 वर्षों का अनुभव

Dr. Hrishikesh D Pai

Dr. Hrishikesh D Pai

Obstetrics & Gynaecology
39 वर्षों का अनुभव

Dr. Archana Sinha

Dr. Archana Sinha

Obstetrics & Gynaecology
15 वर्षों का अनुभव

ऐप पर पढ़ें