కాలేయ (లివర్) క్యాన్సర్ అంటే ఏమిటి?

కాలేయ క్యాన్సర్ లేదా హెపాటిక్ క్యాన్సర్ అనేది ఒక ప్రాథమిక లేదా ద్వితీయ రకమైన క్యాన్సర్ కావచ్చు. వివరంగా చెప్పాలంటే, ఈ సమస్య యొక్క మూలం కాలేయంలోనే (ప్రాధమిక) ఉండవచ్చు లేదా ఇతర అవయవాలు నుండి కాలేయానికి వ్యాపించవచ్చు (ద్వితీయ). అయినప్పటికీ, ప్రాధమిక క్యాన్సర్ కంటే ద్వితీయ రకమైన క్యాన్సర్ సాధారణమైనది.

క్యాన్సర్ అనేది కణాల యొక్క అసాధారణ పెరుగుదల, ఇందులో కణాల అభివృద్ధి యొక్క నిరోధక జీవక్రియ (restraining mechanism) ప్రభావితమవుతుంది. ఈ అసాధారణ కణాలు శరీర అవయవాల సాధారణ విధులు ప్రభావితం కావడానికి కారణమవుతాయి.అయితే, క్యాన్సర్ యొక్క హానికరమైన ప్రభావం ఉన్నప్పటికీ, కాలేయం పని చేయగలదు, అందువలన ఈ పరిస్థితి చాలాకాలం వరకు గుర్తించబడదు.

ప్రాథమిక కాలేయ క్యాన్సర్లు:

  • హెపాటోసెల్యులార్ కార్సినోమా (HCC, Hepatocellular carcinoma)
  • ఫైబ్రోలామెల్లర్ క్యాన్సర్ (Fibrolamellar cancer)
  • ఇంట్రాహెపటిక్ కోలన్జీయోకార్సినోమా (Intrahepatic cholangiocarcinoma)
  • లివర్ ఆంజియోసార్కోమా (Liver angiosarcoma)
  • హెపటోబ్లాస్టోమా (Hepatoblastoma)

దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పైన చెప్పినట్లుగా, ప్రాధమిక కాలేయ క్యాన్సర్ సాధారణంగా చాలాకాలం పాటు గుర్తించబడదు. లక్షణాలు వీటిని కలిగి ఉండవచ్చు

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కాలేయ క్యాన్సర్ అనేది కాలేయాన్ని నష్టం జరిగిన కారణంగా సంభవిస్తుంది, అవి (కారణాలు):

  • మద్య దుర్వినియోగం వలన సిర్రోసిస్, కాలేయపు కణజాలం దెబ్బతినడం
  • హెపటైటిస్ వైరస్లు బి (B), సి (C), లేదా డి (D)
  • ఆర్సెనిక్ (Arsenic)కి గురికావడం/బహిర్గతం కావడం  
  • ధూమపానం
  • చక్కర వ్యాధి
  • ప్రేగులు లేదా రొమ్ము యొక్క సెకండరీ క్యాన్సర్

దీనిని ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?

ఈ కింది విధానాలను ఉపయోగించి వైద్యులు వ్యాధి నిర్ధారిస్తారు:

  • కాలేయ పనితీరును గుర్తించేందుకు రక్త పరీక్ష
  • కాలేయ జీవాణుపరీక్ష (లివర్ బయాప్సీ
  • మేగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ (MRI) స్కాన్
  • పై భాగపు ఎండోస్కోపీ (endoscopy)
  • సిటి (CT) స్కాన్
  • అల్ట్రాసౌండ్
  • లాప్రోస్కోపీ (Laparoscopy)

ఒక సెంటీమీటర్ కంటే తక్కువగా ఉండే పుండ్లకు/గాయాలకు, ప్రతి మూడు నెలలకు ఒకసారి  వైద్యుని తనిఖీతో కూడిన చికిత్స సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో, కాలేయ కణాల నష్టాన్ని భర్తీ చేయడానికి మరియు పునరుత్పాదక (regenerative) పెరుగుదలకి సహాయపడటానికి చిన్నపాటి శస్త్రచికిత్స సరిపోతుంది.

కాలేయ క్యాన్సర్ యొక్క చికిత్స క్యాన్సర్ యొక్క అభివృద్ది మరియు స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అందువలన, చికిత్సా పద్ధతులు ఈ విధంగా ఉంటాయి:

  • ప్రభావితమైన భాగం మరియు దెబ్బతిన్న కణాలను తీసివేయడానికి శస్త్రచికిత్స (సర్జరీ)
  • దాత నుండి కాలేయ మార్పిడి
  • రేడియో లేదా మైక్రోవేవ్స్ (కిరణాలు) వంటి కణితి నిరోధక విధానాలు. ఈ ప్రక్రియ సాధారణ కణాలను కూడా నాశనం చేస్తుంది
  • కీమోథెరపీ అంటే, క్యాన్సర్ వ్యతిరేక మందులు (anti-cancer drugs) ఎక్కించడం
  • ఆరోగ్య కారణాల వలన శస్త్రచికిత్స చేయలేని వారికి ఎంబోలైజేషన్ చికిత్స (Embolization therapy)
  • కణాల పెరుగుదలను తగ్గించడానికి టార్గెటింగ్ థెరపీ (Targeting therapy)

Dr. Akash Dhuru

Oncology
10 Years of Experience

Dr. Anil Heroor

Oncology
22 Years of Experience

Dr. Kumar Gubbala

Oncology
7 Years of Experience

Dr. Patil C N

Oncology
11 Years of Experience

Medicines listed below are available for కాలేయ (లివర్) క్యాన్సర్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

OTC Medicine NamePack SizePrice (Rs.)
Celkeran 2 Tablet30 Tablet in 1 Strip1090.0
Leukeran Tablet25 Tablet in 1 Strip382.1
Nexavar Tablet60 Tablet in 1 Bottle146037.0
Soranib Tablet (30)30 Tablet in 1 Strip1881.0
Bufo Rana Dilution 200 C125.0
Bufo Rana Dilution 30 C105.0
Bufo Rana Dilution 1 M155.0
Rubizen 10 Mg Injection1 Injection in 1 Packet458.0
Erubin 10 Mg Injection1 Injection in 1 Packet500.0
Rubilon 10 Injection1 Injection in 1 Packet245.84
Read more...
Read on app