సారాంశం

మెడనొప్పి గురించి చెప్పేవారిలో ప్రతి ముగ్గురిలోనూ ఒకరిలో అది సాధారణ ఆరోగ్య సమస్యగా ఉంది. ఇందుకు కారణం మెడ కండరాలలో శ్రమ కలగడం అంతటి సులువైనది కావచ్చు, లేదా వెన్నెముక యొక్క నరాలు సంపీడనం కావడం లాంటి తీవ్రమైనది కావచ్చు. వెన్నుపూస (వెన్నెముక యొక్క ఎముకలు) యొక్క వ్యాధులు, ఆర్థరైటిస్, సెర్వికల్ స్పాండిలోసిస్, మరియు ఇతర స్థితులు కూడా మెడనొప్పికి దారితీయవచ్చు మరియు తక్షణ వైద్య సహాయం అవసరం కావచ్చు. మెడనొప్పిని వృద్ధి చేసుకునే ప్రమాదావకాశము ఎక్కువగా ఉండే వ్యక్తులలో మహిళలు, ప్రత్యేకించి ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు మరియు ఆరోగ్యము బాగా లేని వ్యక్తులు ఉంటారు. మెడ బెణుకు (సాధారణంగా ఒక ఆక్సిడెంటు సందర్భంగా ఏర్పడుతుంది) వల్ల కలిగే మెడనొప్పి అనేక సంవత్సరాల పాటు లక్షణాలను చూపవచ్చు. మెడనొప్పికి చికిత్స చాలా వ్యత్యాసముగా ఉంటుంది మరియు దాగియున్న కారణాలపై ఆధారపడి ఉంటుంది. అనేక సమయాల్లో మెడనొప్పి ఒక వారం లోపున నయమైపోతుంది.  చాలా అరుదుగా, అది ఏళ్ళపాటు ఉంటుంది. వ్యాయామము, మందులు తీసుకోవడం, మరియు భంగిమ సరిచేసుకోవడం అనేవి, మెడనొప్పి యొక్క యాజమాన్యం కొరకు వినియోగించుకోబడే వ్యూహాలుగా ఉంటాయి. శస్త్రచికిత్స అనేది చికిత్స యొక్క మొదటి ఐచ్ఛికం కాదు. అన్ని ఐచ్ఛికాలూ అయిపోయేవరకూ దీన్ని నివారించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక మెడనొప్పి కొరకు, వ్యాయామాలు, కండర ధృఢత్వ శిక్షణ, మందుల వాడకం మరియు జీవనశైలి మార్పులతోకూడిన ఒక బహుళ-మార్గాల పద్ధతిని అవలంబించవలసి ఉంటుంది.

మెడ నొప్పి యొక్క కారణాలు - Causes of Neck Pain in Telugu

అనేక కారణాల వల్ల మెడనొప్పి కలుగవచ్చు మరియు వాటిలో కొన్ని ఈ క్రింద కనబరచబడ్డాయి:

  • బలహీనమైన మరియు అతిగా వినియోగించిన కండరాలు
    బిగదీసుకున్న కండరాలతో ఎక్కువ సేపు కూర్చోవడం మెడలో మరియు భుజాలలో నొప్పికి మరియు బిగపట్టివేయడానికి దారితీస్తుంది సైకిలింగ్ లేదా స్విమ్మింగ్ వంటి భౌతిక చర్యలలో బలహీనంగా ఉన్న కండరాలను మితిమీరి ఉపయోగించడం కూడా మెడలో మరియు భుజాలలో నొప్పికి దారితీస్తుంది.
  • మెడ కణజాలము యొక్క అరుగుదల మరియు తరుగుదల మెడ కణజాలములో వయో-సంబంధిత అరుగుదల మరియు తరుగుదల సెర్వికల్ స్పాండిలోసిస్ మరియు మెడనొప్పికి దారితీయవచ్చు. సెర్వికల్ స్పాండిలోసిస్ అనేది, ఎముకల మధ్య ఉండే ఖాళీలు కుదించుకుపోయి, మరియు ఎముకల అంచుల వెంబడి చిన్న ఎముకలాంటి పదార్థం పెరుగుదల ఉండే ఒక స్థితి.
  • వెన్నెముక కుదురు మార్పులు
    వెన్నెముక యొక్క అరుగుదల మరియు తరుగుదల వెన్నెముక కుదుళ్ళు తమ సాగే గుణాన్ని కోల్పోయేందుకు కారణం కావచ్చు. అప్పుడప్పుడూ, వెన్నెముక డిస్క్ కణజాలము ఉబ్బిపోవడం కారణంగా డిస్క్ జారిపోవడం  ఏర్పడవచ్చు.
  • ఇరుకైన వెన్నుపూస మార్గము
    ఇరుకైన వెన్నుపూస మార్గము నరాలను కలిగి ఉంటుంది మరియు నొప్పిని కలిగించవచ్చు మరియు అది భుజానికి లేదా చేతికి వ్యాపించవచ్చు.
  • భౌతికంగా గాయపడుట లేదా ట్రామా
    ఒక ప్రమాద ఘటనలో, ఆకస్మిక తిరుగు లేదా కుదుపు కారణంగా మెడ తీవ్రంగా గాయపడవచ్చు. దీనిని మెడ బెణుకు గాయం అంటారు.
  • తప్పు భంగిమ గంటల కొద్దీ తలవంచుకునే ఉండడం వంటి ఒక తప్పు భంగిమలో కూర్చోవడం వల్ల మెడపై ఎంతో శ్రమ పడుతుంది, తద్వారా మెడనొప్పి కలుగుతుంది. అంతే కాకుండా, నిద్రించునప్పుడు గంటలకొద్దీ మెడ బిగుసుకుపోయి ఉండవచ్చు. ఇది మెడలో తీవ్రమైన నొప్పి మరియు బిగువుకు దారితీయవచ్చు, తద్వారా తలను ప్రక్కకు త్రిప్పడం కూడా కష్టం కావచ్చు.

మెడ నొప్పి యొక్క చికిత్స - Treatment of Neck Pain in Telugu

మెడ నొప్పి యొక్క అత్యధిక కేసులను మందులతో పాటుగా జీవనశైలి మార్పులతో సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. మీ డాక్టరు సూచించగల కొన్ని చికిత్సా ఐచ్ఛికాలలో పెయిన్ కిల్లర్స్ మరియు మంటను తగ్గించే మందులు, కండరాలకు ఉపశాంతినిచ్చేవి, వెన్నెముకకు ఇంజెక్షన్లు, శారీరక థెరపీ, చలనమును పరిమితి చేయడానికి కంకణాల వినియోగం మరియు కైరోప్రాక్టిక్ రక్షణ వంటి మందులు చేరి ఉంటాయి.

  • బలమునిచ్చే శిక్షణ
    దీర్ఘకాలిక మెడ నొప్పి ఇతర చికిత్సలకు స్పందించదని మరియు కండరాల ధృఢత్వ శిక్షణ ద్వారా నయం చేయవచ్చుననడానికి సంబంధించి బలమైన ఋజువులు ఉంటూనే ఉన్నాయి. ఈ వ్యాయామాలు మెడ యొక్క బిగువుదనమును వదులు చేసి అవి హాయి పొందడానికి సహకరిస్తాయి. మెడ కండరాలను బలోపేతం చేయడానికి నిర్దిష్ట వ్యాయామాలు రూపొందించబడ్డాయని, వాటిని క్రమం తప్పకుండా అభ్యాసము చేస్తే మెడ నొప్పి నుండి దీర్ఘకాలిక ఉపశమనం లభిస్తుందనీ ఒక అధ్యయనములో కనుక్కోబడింది. మీకు గనక అనేక నెలల పాటు మెడ నొప్పికి చికిత్స చేయబడకుండా ఉంటే, నొప్పి తగ్గించుకోవడానికి గాను, కండర ధృఢత్వ శిక్షణ గురించి మీ డాక్టరు గారితో మాట్లాడండి. మీరు ఏదైనా వ్యాయామ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా, ప్రత్యేకించి మీకు ఇదివరకే మెడ నిప్పి ఉండి ఉంటే, అందుకు డాక్టరు ఆమోదము కావాల్సి ఉంటుందని గుర్తు ఉంచుకోండి. మీ వ్యాయామముపై ఒకవేళ మీకు క్షీణించే స్థితి గనక ఉన్న పక్షములో, డాక్టరు అందుకు తగిన సలహా ఇస్తారు.
  • ఫిజియోథెరపీ:
    ఒకవేళ మీకు గనక ఎడతెగని మెడ నొప్పి ఉంటే, మీ డాక్టరు మిమ్మల్ని ఒక ఫిజియోథెరపిస్టు వద్దకు పంపించవచ్చు. ఫిజియోథెరపిస్టు మీకు వివిధ వ్యాయామాలపై సమాచారము అందిస్తారు మరియు మీ నొప్పిని నయం చేసుకోవడానికి సహాయపడతారు. వ్యక్తులు తమ మామూలు స్థితికి తిరిగి రావడానికి ఫిజియోథెరపీ సహాయపడుతుంది.
  • శస్త్ర చికిత్స:
    డాక్టర్లు చాలా అరుదుగా శస్త్ర చికిత్సకు సిఫారసు చేస్తారు, మరియు మిగతా అన్ని ప్రత్యామ్నాయాలూ పూర్తి అయిన తర్వాత బహుశః ఇది అంతిమ ఆప్షన్ గా ఉంటుంది. సర్వికల్ వెన్నెముక అస్థిరత్వము లేదా నరాల సంబంధిత విధుల నిర్వర్తన సరిగా లేనటువంటి తీవ్రత ఉన్న కేసులలో ఇది అవసరం అవుతుంది.
  • కైరోప్రాక్టిక్ థెరపీ:
    కైరోప్రాక్టిక్ థెరపీ అనేది, నిర్దిష్ట చోటుల వద్ద ఒక నియంత్రిత ఒత్తిడిని ఉపయోగించి మెడ నొప్పికి చికిత్స అందించబడే ఒక ప్రత్యామ్నాయ మందు రూపము.

స్వీయ-రక్షణ

  • ఒకవేళ మీరు మెడను కదిలించలేకుండా ఉంటే, మీరు డ్రైవింగ్ లేదా రైడింగ్ వంటి పనులను చేయకుండా ఉండడం మంచిదని సలహా ఇవ్వబడుతోంది, ఎందుకంటే ఇవి మీ స్థితిని క్షీణింపజేయవచ్చు.
  • మీ డాక్టరుగారు అలా చెబితే తప్ప మీ మెడను కదిలించవద్దు లేదా నెక్ కాలర్ ని ధరించవద్దు.
  • నొప్పి ఉపశమనం కోసం మీ మెడపై వేడి లేదా శీతల ప్యాక్ లు ఉపయోగించడం వంటివి మీరు చేయవచ్చు.
  • నొప్పిని తగ్గించుకోవడానికి పారాసిటమోల్ లేదా ఐబుప్రోఫెన్ వంటి పెయిన్ కిల్లర్స్ ని కూడా వాడవచ్చు. స్వీయ వైద్యము ప్రమాదకరం కావచ్చునని మరియు సమస్యలు కలిగించవచ్చునని గుర్తుంచుకోండి. ఒకవేళ ఒక వారం రోజుల లోపున మీ నొప్పి మెరుగు కాకపోతే,మీ డాక్టరు గారిని సంప్రదించండి .

జీవనశైలి యాజమాన్యము

ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి దీర్ఘకాలిక మెడ నొప్పి వృద్ధిని నివారించుటలో సహాయపడగలుగుతుంది. ఒక అధ్యయనము ప్రకారము, శారీరకంగా చురుగ్గా ఉండటం, మద్యపానమును అదుపులో ఉంచడం లేదా మానివేయడం పొగత్రాగడం మానివేయడం, మరియు ఆరోగ్యకరంగా తినడం వంటి కొన్ని అలవాట్లు మెడనొప్పి నివారణలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి మాత్రమే మెడనొప్పిని నివారించలేకపోవచ్చు, ఐతే దాని నిర్వహణలో సహాయపడవచ్చు. ఒకవేళ మీకు బలహీనపరచే మెడనొప్పి ఉండి, ఏ చికిత్సా పని చేయకపోతే, మీ మెడనొప్పి ఉపశమనములో జీవనశైలి యాజమాన్యము ఒక ముఖ్య పాత్రను పోషించవచ్చు.

దీర్ఘకాలిక మెడనొప్పి అనేది, ఒత్తిడిఉత్సుకత, క్రుంగిపోయిన భావన, మరియు మానసిక ఆరోగ్యం బాగా లేకపోవడంతో లింక్ చేయబడుతుంది. ఒకవేళ మీకు తరచుగా ఒత్తిడి మరియు ఉత్సుకత ఘటనలు జరుగుతూ ఉంటే, అప్పుడు వాటితో వ్యవహరించడమనేది దీర్ఘకాలిక మెడనొప్పిని తగ్గించుటలో సహాయపడగలదు. ఇంటికి బయటి ప్రాంతాల్లో ఎక్కువ సమయం గడపండి మరియు శారీరకంగా చురుగ్గా ఉండండి. ఒత్తిడిని ఒక మెరుగైన మార్గములో జయించడానికి ఒక అలవాటును వృద్ధి చేసుకొని అభ్యాసం చేయండి.

Dr. G Sowrabh Kulkarni

Orthopedics
1 Years of Experience

Dr. Shivanshu Mittal

Orthopedics
10 Years of Experience

Dr. Saumya Agarwal

Orthopedics
9 Years of Experience

Dr Srinivas Bandam

Orthopedics
2 Years of Experience

Medicines listed below are available for మెడ నొప్పి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

OTC Medicine NamePack SizePrice (Rs.)
Biomedison Care 4 U Lidocaine Patch (5)5 Patch in 1 Box880.0
Prakruti Jiyofresh Vednari Liniment50 ml Liniment in 1 Bottle170.0
Rhuto Oil 60 ml60 ml Oil in 1 Bottle125.0
Jagat Pharma ISO Pain Relief Roll On30 ml Liquid in 1 Bottle115.0
Schwabe Fel tauri Dilution 1000 CH30 ml Dilution in 1 Bottle102.0
Schwabe Fel tauri Trituration Tablet 6X20 gm Trituration Tablet in 1 Bottle135.0
Schwabe Fel tauri Dilution 200 CH30 ml Dilution in 1 Bottle89.25
Volini Pain Relief Gel 100gm100 gm Gel in 1 Tube294.5
Volini Spray 100gm100 gm Spray in 1 Bottle304.0
Omnigel 75gm75 gm Gel in 1 Tube241.39
Read more...
Read on app