సున్నితమైన దంతాలు అంటే ఏమిటి?

దంతాల సున్నితత్వం (Sensitive Teeth) అనేది ఓ సాధారణమైన దంతాల రుగ్మత, ఇది దంతాలకు అసౌకర్యం లేదా నొప్పిని కలిగిస్తుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మీరు ఏవైనా ప్రత్యేకమైన ఆహారాలు తినేటపుడు మరియు కొన్ని ఉష్ణోగ్రతలకు బహిర్గతమైనపుడు తేలికపాటి నుండి తీవ్రమైన స్థాయి దంతాల అసౌకర్యానికి తాత్కాలికంగా గురైనపుడు మీరు సున్నితమైన దంతాలు కలిగి ఉండవచ్చు. ఈ దంత రుగ్మత లక్షణాలు వేర్వేరు వ్యక్తులలో తేలికపాటివిగా లేదా తీవ్రమైనవిగా ఉండొచ్చు మరియు కొన్నిసార్లు స్పష్టమైన కారణం లేకుండానే సున్నితమైన దంతాల రుగ్మత సంభవించవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కింది వ్యాధికారకాల యొక్క ప్రతిస్పందనకు దంతాల సున్నితత్వ నొప్పి రావచ్చు:

  • వేడి పానీయాలు మరియు శీతల పానీయాల సేవనం
  • చల్లని గాలి
  • చల్లని నీరు తాగడంవల్ల
  • పళ్ళు తోముకోవడంవల్ల
  • తీయని ఆహారాలు (స్వీట్ ఫుడ్స్) మరియు పానీయాల సేవనం
  • ఆమ్ల-సంబంధ (యాసిడ్) ఆహారాలు మరియు పానీయాల సేవనం

దంతం యొక్క దంతిక లేక పింగాణీ (enamel) అనేది దంతకిరీటం యొక్క దంతధాతువును కప్పి ఉన్న దంతం యొక్క ప్రథమ బాహ్య పొర. ఈ ఎనామెల్ లేదా సిమెంట్ కు ఏదైనా దెబ్బ లేదా నష్టం కలిగినా పంటి సున్నితత్వానికి (sensitivity of tooth) దారితీస్తుంది. కింది కారణాలవల్ల “సున్నితమైన దంతాల రుగ్మత” సంభవించవచ్చు

  • దంతాలను చాలా గట్టిగా బ్రష్ చేయడం లేదా చాలా కఠినమైన పెళుసైన కుంచెలు (bristles) కల్గిన టూత్ బ్రష్ను ఉపయోగించడంవల్ల
  • కడుపు ఆమ్లం (యాసిడ్ రిఫ్లక్స్ వ్యాధి) రుగ్మతకు గురికావడం
  • రాత్రిపూట పళ్ళు నూరడం (గ్రైండింగ్) వల్ల
  • తరచుగా ఆమ్ల ఆహారాలు మరియు ఆమ్లా పానీయాలు తినడం లేదా తాగడం వల్ల
  • విరిగిన దంతాల కారణంగా (ఫ్రాక్చర్డ్ టూత్)
  • ఇంతకు ముందు ఫిల్ చేసిన దంతాల (old fillings)వల్ల
  • దంతాల బ్లీచింగ్ కారణంగా

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

సాధారణంగా, రోగి తనకు తానుగా పంటి సున్నితత్వాన్ని వైద్యుడికి ఫిర్యాదు చేస్తాడు మరియు అంతర్లీనంగా దంత కుహరం లేదని నిర్ధారించుకోవడానికి డాక్టర్ ఆవద్దకు వ్యక్తి వెళ్తాడు. రూట్ సెన్సిటివిటీని (దంత సున్నితత్వం) కలిగించే నశించిన దంతిక లేక పింగాణీ (ఎరోడెడ్ ఎనామెల్) పొర లేదా దెబ్బతిన్న నొప్పెడుతున్న చిగుళ్ళను వ్యక్తి కల్గి ఉన్నదేమోనని దంత వైద్యుడు దంతాలను పూర్తిగా పరిశీలిస్తాడు. రోగ నిర్ధారణను నిర్ధారించడానికి, మీ దంతవైద్యుడు దంత సున్నితత్వం కోసం మీ పళ్ళను “వేడి మరియు చల్లని” పరీక్షతో (hot and cold test) పరీక్షిస్తాడు. పంటి సున్నితత్వాన్ని కలిగించే దంత క్షయాలను తోసిపుచ్చడానికి మౌత్ ఎక్స్-రేలు సహాయపడతాయి.

దంత సున్నితత్వాన్ని తగ్గించడానికి విరిగిన దంతపూరణలు (ఫ్రాక్చర్డ్ ఫిల్లింగులు) లేదా దంతక్షయకారక గాయాలకు సరైన పునరుద్ధరణ అవసరం. దెబ్బతిన్న దంతిక లేక పింగాణీ లకు (ఎరోడెడ్ ఎనామెల్స్ను) సున్నితమైన టూత్పేస్ట్ మరియు ఫ్లూరైడ్ వార్నిష్లతో చికిత్స చేయవచ్చు. కొన్నిసార్లు, బహిర్గతమైన దంతికలు లేక పింగాణీ (enamel) కు దంత పూరణలు (dental fillings) చేయడం జరుగుతుంది.

దంతకుహరం (క్యావిటీ) లోతైనది ఉండడం లేదా దంతంలోని పల్ప్ బహిర్గతమయినప్పుడు, వేడి మరియు చల్లని ఆహారం సేవించినపుడు తీవ్రమైన సున్నితత్వం ఉండవచ్చు. రూట్ కెనాల్ థెరపీ దీనిని పరిష్కరించగలదు.

దంత చిగుళ్ల వ్యాధి ఉన్నప్పుడు, చిగుళ్లవ్యాధి చికిత్సతో పాటుగా సున్నితమైన మౌత్వాషులు ఉపయోగపడతాయి.

Dr. Parampreet Kohli

Dentistry
10 Years of Experience

Dr. Priya gupta

Dentistry
2 Years of Experience

Dr. Shrishty Priya

Dentistry
6 Years of Experience

Dr. Hanushri Bajaj

Dentistry
3 Years of Experience

Medicines listed below are available for సున్నితమైన దంతాలు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

OTC Medicine NamePack SizePrice (Rs.)
Himalaya Hiora K Mouthwash150 ml Mouthwash in 1 Bottle76.0
Hydent K Oral Gel100 gm Gel in 1 Tube158.68
Thermokind F Gel 50gm50 gm Gel in 1 Tube76.0
Senolin Foaming Medicated Dental Cream 100gm100 gm Cream in 1 Tube121.6
Elsenz Toothpaste70 gm Paste in 1 Tube225.15
Vantej Toothpaste 50gm 50 gm Paste in 1 Tube168.15
Medent Toothpaste142.5
Agrow Dant Vardaan Toothpaste 200gm And 1 Sensitive Toothbrush Pack Of 31 Kit in 1 Combo Pack255.0
Vantej Toothpaste 100gm100 gm Paste in 1 Tube301.3
Agrow Dant Vardaan Toothpaste 100gm Pack Of 41 Kit in 1 Combo Pack135.0
Read more...
Read on app