దిగబడని వృషణం అంటే ఏమిటి?

మగ శిశువుకు ఆరునెలల వయస్సు రాగానే అతని వృషణము (testicle) వృషణతిత్తిలోకి జారకపోతే, అట్టి రుగ్మతనే “దిగబడని వృషణం” (undescended testicle) అని పిలుస్తారు. ఈ రుగ్మతనే “గుప్తవృషణ స్థితి” (cryptorchidism) అని కూడా పిలుస్తారు. ఈ స్థితిలో, పుట్టినప్పుడు ఒక వృషణం లేదా రెండు వృషణాలు కూడా లేకపోవచ్చు. దిగబడని వృషణాల రుగ్మత చిన్నపిల్లల్లో సాధారణం. ఒక సంవత్సరం వయస్సులో ఉన్న బాలురలో దాదాపు 1 శాతం మంది మరియు నెల తక్కువ (premature) బాలురలో సుమారు 30 శాతం మందికి దిగబడని ఒక వృషణాన్ని కల్గి ఉన్నారు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

రుగ్మత ఏర్పడ్డ వైపు వృషణతిత్తి చిన్నదిగా లేదా అసలు వృషణతిత్తి అభివృద్ధి కానట్లుగా కన్పించడం అనేది దిగబడని వృషణము రుగ్మతతో ఉన్న బాలుడిలో గోచరించే ఒకే ఒక వ్యాధిలక్షణం. కొన్నిసార్లు, వృషణతిత్తిలో వృషణం లేనట్లుగా కూడా గోచరిస్తుంది, దీన్నే “ఖాళీ వృషణతిత్తి” గా వర్ణించబడింది. చిన్నపిల్లలైన కొందరు అబ్బాయిల్లో దిగబడని వృషణాలు మెలిబడి ఉండడం లేదా గజ్జలో తీవ్రమైన నొప్పిని కలుగజేస్తాయి. .

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

దిగబడని వృషణాల రుగ్మత యొక్క ప్రధాన కారణాలు కిందివిధంగా ఉంటాయి:

  • నెలతక్కువ పుట్టుక
  • ముడుచుకొనే వృషణాలు (వృషణాలు వృషణాలతిత్తి మరియు గజ్జల మధ్య ముందుకు వెనుకకు కదులుతుంటాయి)
  • అసాధారణ వృషణాలు
  • గర్భంలో మగశిశువు యొక్క పెరుగుదల సమయంలో సమస్యలు

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వైద్యుడు వృషణతిత్తిని పరిశీలిస్తారు మరియు వృషణతిత్తిలో (స్క్రోటంలో) ఒకటి లేదా రెండు వృషణాలూ లేకపోవడాన్నినిర్ధారిస్తారు. శారీరక పరీక్ష కష్టంగా ఉంటే, వైద్యుడు CT స్కాన్ లేదా అల్ట్రాసౌండ్ వంటి ఇమేజింగ్ టెస్ట్ను ఆదేశించవచ్చు.

దిగబడని వృషణం రుగ్మత యొక్క చాలా సందర్భాలలో, శిశువు యొక్క మొదటి సంవత్సరములో వృషణం వృషణతిత్తిలోకి జారుతుంది. ఇలా వృషణతిత్తిలోకి వృషణాలు సహజంగా జారకపోతే కిందపేర్కొన్న చికిత్సలు చేయవచ్చు:

  • హార్మోన్ ఇంజెక్షన్లు (సూది మందులు): టెస్టోస్టెరాన్ లేదా బీటా-హ్యూమన్ చోరియోనిక్ గోనాడోట్రోపిన్ (B-HCG) హార్మోన్ ఇంజెక్షన్లు
  • శస్త్రచికిత్స: ఆర్కియోపోక్సీ శస్త్రచికిత్సా పద్దతి, ఈ శస్త్రచికిత్స వల్ల వృషణతిత్తిలోకి  వృషణము తిరిగి చేరుతుంది. ఈ శస్త్రచికిత్సను తొలిదశలోనే చేయడంవల్ల వంధ్యత్వం మరియు వృషణాలకు నష్టం వంటి భవిష్యత్తు సమస్యలను తొలగిస్తుంది.
  • తరువాతి జీవితంలో దిగబడని వృషణము కనిపిస్తే, ఇక దాన్ని తీసివేయవలసి ఉంటుంది. వృషణ తొలగింపు ఎందుకంటే ఆ వృషణం సాధారణ విధుల్ని నిర్వర్తించలేదు మరియు అది క్యాన్సర్కు దారితీసే ప్రమాద కారకంగా ఉంటుంది కాబట్టి.

Dr. Anurag Kumar

Andrology
19 Years of Experience

Read more...
Read on app