సారాంశం

మలేరియా అనేది దోమల చేత వ్యాపించబడే ఒక సాధారణమైన వ్యాధిఇది ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. దోమలు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా మరణాల యొక్క ప్రధాన కారణాల్లో ఒకటి. ఆడ దోమ కాటు ద్వారా మానవులలోకి ఈ పరాన్నజీవి ప్రవేశిస్తుంది మరియు జ్వరం, తలనొప్పి మరియు వాంతులు వంటి ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది. సమయానికి నిర్ధారణ చేసి చికిత్స చేస్తే ఇది పూర్తిగా నయం అవుతుంది. రోగ నిర్ధారణ మరియు చికిత్సలో ఆలస్యం ఉంటే సంక్రమణ తీవ్రంగా మారి, ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందితగినంత రోగ నిర్ధారణ సౌకర్యాలు మరియు సరైన చికిత్స లేనందువలన మలేరియా కారణంగా చాలా మరణాలు సంభవిస్తాయి. మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం పరాన్నజీవులు 5 రకాలు ఉన్నాయి. మలేరియాను కలిగించే నాలుగు రకాలలో, ప్లాస్మోడియం ఫల్సిపారమ్ ప్రతి సంవత్సరం 90% మలేరియా మరణాలకు కారణం.

మలేరియా అంటే ఏమిటి? - What is Malaria in Telugu

800,000 మరణాలకు ప్రతి సంవత్సరం మలేరియా బాధ్యత వహిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం, ప్రతి 45 సెకన్లకి ఒక పిల్లాడి మరణానికి మలేరియా కారణం. ఈ వ్యాధి దీర్ఘకాల చరిత్ర కలది మరియు క్రీస్తుపూర్వం 6000 నాటికి ఇలాంటి జ్వరం యొక్క నివేదికలు ఉన్నాయి. ఇది ఒక సాధారణ మరియు విస్తృత వ్యాధి, ముఖ్యంగా ఉష్ణమండలాల్లో ప్రబలంగా ఉంటుంది. 

మలేరియా ఆఫ్రికాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది అని నమ్మబడింది. మానవాళిని ప్రభావితం చేసిన అతి భయంకరమైన ప్రాణాలు తీసే వ్యాధుల్లో ఇది ఒకటిగా మారింది. అన్ని రకాల మలేరియా జాతులు పెద్ద కోతుల నుండి మనిషికి వలసవచ్చాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పి.ఫాల్సిపారం అనే రకం గొరిల్లాస్ నుండి ఉద్భవించిందని నమ్ముతారు. ప్రతి సంవత్సరం మలేరియాలో సుమారు 500 మిలియన్ కేసులు ఉన్నాయి, వీటిలో 85% ఉప-సహారా ఆఫ్రికాలో మరియు ఆఫ్రికాలో సంభవించే మలేరియా యొక్క అన్ని కేసులలో 85% పైగా మలేరియాలు పి.ఫాల్సిపారం అనే ఏకైక మలేరియా రకం వల్ల వస్తుంది.

మలేరియా అంటే ఏమిటి?

మలేరియా ప్రాణాంతకమమైన ఒక సాధారణ వ్యాధి. ఆఫ్రికా, ఆసియా మరియు దక్షిణ అమెరికాలోని  ఉపఉష్ణమండలాల్లో మరియు ఉష్ణమండలాల్లోని అనేక దేశాలలో ఇది విస్తృతంగా వ్యాపించింది. ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల ఇది సంభవిస్తుంది. ప్లాస్మోడియం యొక్క ఐదు జాతులు మలేరియా P. ఫాల్సిపారం, P. వివాక్స్, P. ఓవెలే, పి. నోలెస్ మరియు P. మలేరియే.  పరాన్నజీవి ఆడ అనోఫీలస్ దోమ (ఇది వ్యాధి యొక్క క్యారియర్ లేదా వాహకం) యొక్క కాటు ద్వారా మానవులకు ప్రసరిస్తుంది. పరాన్నజీవి మానవ రక్తప్రవాహంలోకి ప్రవేశించిన తరువాత, అది కాలేయంలో పెరుగుతుంది మరియు గుణించబడి మరియు తరువాత ఎర్ర రక్త కణాలను ఇన్ఫెక్ట్ చేసి నాశనం చేయడం ప్రారంభిస్తుంది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.

మలేరియా యొక్క లక్షణాలు - Symptoms of Malaria in Telugu

మలేరియా యొక్క లక్షణాలు రెండు విభాగాలుగా విభజించబడినాయి సరళమైన మరియు తీవ్రమైనవి.

సరళమైన మలేరియా యొక్క లక్షణాలు

సరళమైన మలేరియా సాధారణంగా మలేరియా యొక్క అన్ని విలక్షణమైన లక్షణాలను చూపిస్తుంది, అయితే ఈ లక్షణాలు తీవ్రమైన సంక్రమణ యొక్క లక్షణాలు కలిగి ఉండవు మరియు శరీరం యొక్క ముఖ్యమైన అవయవాలకు నష్టం కలిగించదు.

సరళమైన మలేరియా, చికిత్స చేయకుండా వదిలిస్తే, తీవ్రమైన మలేరియాకు దారితీస్తుంది. ఒక వ్యక్తికి చాలా తక్కువ రోగనిరోధక శక్తి ఉంటే కూడా తీవ్రమైన మలేరియా సంభవించవచ్చు. మలేరియా లక్షణాలు 6 నుంచి 10 గంటల వ్యవధి వరకు ఉంటాయి మరియు ప్రతి రెండో రోజుకి వాటంతట అవి పునరావృతమవుతాయి. ఈ లక్షణాలు దీన్ని కలిగించే పరాన్నజీవి యొక్క రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి మరియు కొన్ని సార్లు మిశ్రమ లక్షణాలు ఏర్పడతాయి.

సరళమైన మలేరియాలో లక్షణాల పురోగమనం క్రింది విధంగా ఉంది:

  • వణుకుతో పాటు జలుబుగా ఉన్నట్టు ఉండటం.
  • అధిక జ్వరం, తలనొప్పి, మరియు వాంతులు.
  • యువ రోగులకు కొన్నిసార్లు మూర్ఛ రావచ్చు.
  • జ్వరం తగ్గిపోవటంతో చెమట పట్టడం మరియు అలసట మరియు నీరసంగా అనిపించడం (మరింత చదువు - అలసట)

తీవ్రమైన మలేరియా యొక్క లక్షణాలు

తీవ్రమైన మలేరియాలో, శరీరంలో ముఖ్యమైన అవయవాలకు హానిని సూచిస్తున్న సంకేతాలు మరియు లక్షణాలు ఉంటాయి.

తీవ్రమైన మలేరియా యొక్క కొన్ని లక్షణాలు:

  • జ్వరం మరియు చలి.
  • అవగాహన తగ్గిపోవడం మరియు హుషారుతో పాటు స్పృహతో సమస్యలు.
  • ప్రమాదకరమైన భంగిమల్లో పాడుకోవాలనిపించడం(బోర్లగా పడుకోవడం).
  • లోతైన శ్వాస లేదా శ్వాసలో ఇబ్బందులు.
  • అలసిపోయినట్లు అనిపించడం మరియు సాధారణమైన బలహీనత వంటి రక్తహీనత లక్షణాలు.
  • కామెర్లు యొక్క చిహ్నాలు, ఉదాహరణకు, కళ్ళు మరియు గోళ్ళ తెల్లని ప్రాంతాల్లో పచ్చగా ఉండటంతో పాటు, పసుపు రంగులో మూత్రం.

చికిత్స చేయకపోతే తీవ్రమైన మలేరియా ప్రాణాన్నే కోల్పోయేలా చేస్తుంది.

మలేరియా యొక్క లక్షణాలు సాధారణ ఫ్లూ యొక్క లక్షణాలు లేదా ఒక వైరల్ వంటివి మరియు వ్యాధికి గురవ్వని వ్యక్తులలో రోగ నిర్ధారణ కష్టంగా ఉంటుంది.

మలేరియా యొక్క చికిత్స - Treatment of Malaria in Telugu

యాంటీ మలేరియల్ మందులు, యాంటీ మలేరియల్ చర్య మరియు రసాయన నిర్మాణంగా వర్గీకరించబడ్డాయి . ఇవి:

  • టిష్యూ స్కిజోన్టిసైడ్స్ 
    ఈ మందులు కాలేయంలో ఉండే పరాన్నజీవిపై పనిచేస్తాయి మరియు వాటి సంఖ్య పెరగకుండా నివారిస్తాయిసాధారణంగా మలేరియాకి కేవలం ఈ మందులతో చికిత్స చేయలేము ఎందుకంటే మలేరియా యొక్క లక్షణాలు పరాన్నజీవుల సంఖ్య పెరిగి ఎర్ర రక్త కణాలని నాశనం చేయడం మొదలుపెట్టిన తర్వాత మాత్రమే కనిపిస్తాయి. లక్షణాలు ప్రారంభం కావటానికి ముందే సంక్రమణ యొక్క ఉనికిని అంచనా వేయడం అసాధ్యం.
  • పునఃస్థితి కోసం టిష్యూ స్కిజోన్టిసైడ్స్
    ఈ మందులు మలేరియా యొక్క పునఃస్థితిని ప్రేరేపించే కాలేయంలోని పరాన్నజీవి యొక్క కొన్ని జాతులపై పనిచేస్తాయి.
  • రక్తపు స్కిజోన్టిసైడ్స్
    ఈ మందులు పరాన్నజీవి యొక్క రక్తపు రూపాలపైన పనిచేస్తాయి మరియు అతి ముఖ్యమైన యాంటీ-మలేరియా మందులు.
  • గెమెటోసైటోసైడ్స్
    ఈ మందులు రక్తంలో లైంగిక పరిపక్వం చెందిన పరాన్నజీవిపై పనిచేస్తాయి మరియు ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తిని కుట్టిన ఇతర దోమలకు సంక్రమణ వ్యాప్తి చెందకుండా నివారిస్తాయి. ఈ వర్గానికి చెందిన కొన్ని మందులు అన్ని రకాలైన మలేరియాకు వ్యతిరేకంగా సమర్ధవంతంగా పనిచేస్తే, ఇతర మందులు మాత్రం పరాన్నజీవి యొక్క కొన్ని జాతులపైనే పనిచేస్తాయి.
  • స్పారోన్టోసైడ్స్
    ఈ మందులు దోమలలో సంయుక్త బీజకోశాలు ఏర్పడడాన్ని ఆపి మరియు సంక్రమణ వ్యాప్తిని ఆపుతాయి.
  • కాంబినేషన్  థెరపీ
    సమర్థవంతమైన మలేరియా చికిత్సలో, ఒకే సమయంలో కాలేయంలో ఉండే పరాన్నజీవులపై మరియు రక్తంతో పాటు సంక్రమణ వ్యాప్తిని ఆపే ఔషధాల పైన పనిచేసే వివిధ రకాల మందులు వాడే కాంబినేషన్ థెరపీ కలిగి ఉంటుంది ఇది ఒకేసారి వివిధ రకాల చర్యా రీతులు ఉన్న రెండు లేదా అంతకంటే ఎక్కువ మందలు ఉపయోగించి పరాన్నజీవి యొక్క వివిధ భాగాలని లక్ష్యం చేయడం. ఈ రకమైన చికిత్సా నియమావళి చికిత్స సమయాన్ని తగ్గిస్తుంది మరియు తలెత్తే నిరోధక పరాన్నజీవుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సూచించిన మందుల రకాలు సంక్రమణ రకం, సంక్రమణ యొక్క తీవ్రత, రోగి యొక్క భౌతిక పరిస్థితి మరియు సంబంధిత పరిస్థితులు మరియు వ్యాధులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందిP. ఫాల్సిపారమ్ బారినపడిన వ్యక్తులను తరచూ  పరిశీలించి పరీక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైనది మరియు యాంటీ-మలేరియల్ మందులకు నిరోధకతను కలిగి ఉంటుంది. గర్భంతో ఉన్న రోగికి వేరే రకమైన మందులను ఇవ్వాలి ఎందుకంటే కొన్ని మలేరియా మందులు గర్భిణీ స్త్రీలకు సురక్షితమైనవి కావువైద్యులు మూర్ఛ, గుండె వ్యాధి, మూత్రపిండ వైఫల్యం మరియు చర్మశోథ వంటి వైద్య పరిస్థితుల ఉనికిని తనిఖీ చేయాలి, ఎందుకంటే ఈ రోగులకి వేర్వేరు మందులు లేదా వేరే బలం కలిగి ఉన్న మందులు ఇవ్వడం అవసరం.

జీవనశైలి నిర్వహణ

కారణాల్లో ఒకటైన కొన్ని జీవన విధానాలు దోమలకు వ్యక్తులను బహిర్గతం చేసేవిగా ఉండి, చికిత్స చేయకుండా వదిలేస్తే , సంక్రమణకు దారితీస్తాయిదోమల బారిన కనీసం లేదా అసలు పడకపోతే సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించి, తొలగిస్తుంది. దోమల బారిన పడకుండా ఉండడం పక్కనపెడితే, మలెరియాల్ ఇన్ఫెక్షన్లలో జీవన విధానాలకు చిన్న పాత్ర ఉంది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.

Dr Rahul Gam

Infectious Disease
8 Years of Experience

Dr. Arun R

Infectious Disease
5 Years of Experience

Dr. Neha Gupta

Infectious Disease
16 Years of Experience

Dr. Anupama Kumar

Infectious Disease

Medicines listed below are available for మలేరియా. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

OTC Medicine NamePack SizePrice (Rs.)
HCQS 200 Tablet (10)10 Tablet in 1 Strip64.1
Synriam Tablet3 Tablet in 1 Strip208.8
Hqtor Tablet10 Tablet in 1 Strip62.8
Oxcq 200 Tablet10 Tablet in 1 Strip69.96
REPL Dr. Advice No.63 Sterlin-M Drop Drug Brand ID30 ml Drops in 1 Bottle170.0
HASS Lakshmivilas Rasa (Nardiya) (80 tab of 250 mg each)20 gm Ras Rasayan in 1 Bottle205.0
Schwabe Methylene blue Dilution 6 CH30 ml Dilution in 1 Bottle72.25
Schwabe Chininum sulphuricum Dilution 200 CH30 ml Dilution in 1 Bottle89.25
Dr. Reckeweg Chininum sulph Dilution 200 CH11 ml Dilution in 1 Bottle153.0
Schwabe Chininum sulphuricum Dilution 6 CH30 ml Dilution in 1 Bottle76.5
Read more...
Read on app