myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

మింగడంలో కష్టం లేక అచలసియా అంటే ఏమిటి?

మన ఆహార నాళము (food pipe) బిగుసుకుపోయి మ్రింగ లేక పోవుటాన్నే ”మింగడంలో కష్టం” అని, ఆంగ్లంలో అచలసియా (Achalasia) అని అంటారు. మింగడంలో కష్టం కల్గడమనేది అరుదైన సమస్యే కాని ఇది ఓ తీవ్రమైన పరిస్థితి. ఆహారనాళం (ఎసోఫాగస్) పై ప్రభావాన్ని  చూపుతుందీ సమస్య. మింగడంలో కష్టం కల్గడమనేది ఆడవారికి, మగవారికి ఇలిద్దరికీ సమానంగా దాపురిస్తుంది. మరియు ఏ వయస్సువారికైనా ఈ సమస్య సంభవించవచ్చు. అయినప్పటికీ, 30-70 ఏళ్ల వయస్సు మధ్యలో ఉండేవారికి ఇది ఎక్కువగా  సంభవించవచ్చునని వైద్యులు చెబుతున్నారు.

సాధారణంగా, ఆహారనాళం యొక్క కండరాలు ప్రత్యామ్నాయ పద్ధతిలో సంకోచించడం-విశ్రాంతి పొందడం (peristalsis) అనే ప్రక్రియ ద్వారా  ఆహారాన్ని కడుపులో పడవేస్థాయి. ఆహారనాళం యొక్క దిగువకొనను ఉంగరం లాంటి కండరాల కవాటం (lower oesophageal sphincter) కడుపుతో కలపడం జరిగింది. నోటి నుండి ఆహారాన్ని పొట్టలోకి పంపాల్సి వచ్చినపుడు, ఈ ఉంగారం లాంటి కండర కవాటం తనను తాను సడలింపజేసుకుని (relaxes) ఆహారాన్ని పొట్టలోకి నెడుతుంది. “మింగడంలో కష్టం” లేక “అచలసియా” అనే ఈ కష్టకర పరిస్థితిలో ఆహారం ప్రవేశించడం, ఆహారనాళం సడలడం అనే ఈ రెండు ప్రక్రియలలో సమస్య ఏర్పడుతుంది. ఈ ఆహారనాళం యొక్క కండరాలు సరిగ్గా సంకోచించవు మరియు సరిగ్గా సడలవు మరియు రింగ్ వంటి కండరాల కవాటం కూడా సరిగా సడలదు, సడలినా అసంపూర్తిగా సడలడం జరుగుతుంది, తత్ఫలితంగా ఆహారం ఆహారణాళిక పీఠం వద్దనే చిక్కుకుపోవడం , తద్వారా గొంతులో తీవ్ర అసౌకర్యం మరియు తీక్ష్ణమైన  లక్షణాలకు దారితీస్తుంది.

మింగడంలో కష్టం ఏర్పడ్డపుడు కలిగే ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి? 

మింగడంలో కష్టం సమస్యతో బాధపడుతున్నవారు సాధారణంగా ఆహారం మరియు ద్రవాలను చాలా కష్టపడి (డైస్ఫేజియా) మ్రింగుతారు. దీనికి చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే కాలక్రమేణా పరిస్థితి తీవ్రమవుతుంది, అటుపై మ్రింగడమే అసాధ్యం అయ్యే పరిస్థితి దాపురించవచ్చు. దీన్ని అలాగే, చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది ఆహారనాళపు క్యాన్సర్ (food pipe cancer) గా పరిణామం చెందే ఓ లఘు ప్రమాదం కూడా ఉంది. అందువల్ల, దీని లక్షణాలు పొడ జూపిన ప్రారంభదశలోనే చికిత్స చేయించుకోవడం చాలా అవసరం.

దీని ఇతర లక్షణాలు ఇలా ఉన్నాయి:

 • ఛాతీ లో మండినట్లుండే సంచలనభావం.
 • మింగినపుడు ఆహారం గొంతుకు అడ్డుపడి ఊపిరాడని (చోకింగ్) గడ్డు పరిస్థితి.
 • తెరలు తెరలుగా దగ్గు  
 • ఆహారం తిన్న తరువాత నొప్పి లేదా అసౌకర్యం.
 • మింగిన తరువాత ఆహారాన్ని వాంతి చేసుకోవడం.
 • క్రమంగా బరువు కోల్పోవడం జరుగుతుంది, అయితే ఆ బరువు నష్టం  గణనీయంగా ఉంటుంది.

మింగడంలో కష్టంగా ఉండే అచలాసియా వ్యాధి లక్షణాలు పులితేన్పుల వ్యాధిని పోలి ఉంటాయి. జీర్ణాశయ-అన్నవాహిక తేన్పులు (గ్యాస్ట్రోయస్ఫేగల్ రిఫ్లక్స్ వ్యాధి) వ్యాధిలో కడుపు లోని  ఆమ్ల పదార్థాలు ఆహార గొట్టంలోకి తిరిగి ప్రవహిస్థాయి. ఎసోఫాజియల్ పర్స్ఫికేషన్ (ఆహార గొట్టం యొక్క చీలిక), మరియు ఎసోఫాజియల్ క్యాన్సర్ లు అనేవి ఆమ్లత్వ లక్షణాలు. ఈ లక్షణాల్నే “మింగడానికి కష్టపడే” అచలాసియా కూడా పోలి ఉంటుంది.

ప్రధాన కారణాలు ఏమిటి?

దెబ్బ తిన్న అన్నవాహిక నరాలు (esophageal nurves) వాటి పనితీరును కోల్పోవటం వల్లనే “మింగడం కష్టం” అనే పరిస్థితి దాపురిస్తుంది. అంతేకాకుండా, కండరాల కవాటం (వాల్వ్) మరియు అన్నవాహిక సరిగా పనిచేయవు.

“మింగడం కష్టం” పరిస్థితి (అచలసియా) దాపురించడమనేది వైరల్ ఇన్ఫెక్షన్లు, ఆటో ఇమ్యూన్ పరిస్థితులు మరియు వంశపారంపర్య కారణాలతో కూడా ముడిపడి ఉండడం జరుగుతోంది.  

మింగడంలో కష్టపడటాన్ని ఎలా నిర్ధారణ చేయడం, దీనికి ఎలా చికిత్స చేయాలి? 

మింగడంలో  కష్టం (Achalasia) అయ్యే సమస్యను సాధారణంగా కిందివాటి ద్వారా నిర్ధారించడం జరుగుతుంది:

 • బేరియం సల్ఫేట్ ను మింగించడం (Barium Swallow)  
  బేరియం సల్ఫేట్ను అన్నవాహిక (ఎసోఫాగస్) ద్వారా పంపి, ఆ ప్రక్రియను X-రే (క్ష-కిరణాల ద్వారా) తీయడం అనేది  ఒక సాధారణ ప్రక్రియ. ఈ ప్రక్రియ ఎందుకంటే, అన్నవాహిక ద్వారా ఆహారం కడుపులోకి చేరడానికి ఎంత సమయం పడుతుంది అనేదాని గురించి తెలుసుకోవడానికి.
 • అన్నవాహిక మనోమెట్రీ (Oesophageal Manometry)
  ఈ ప్రక్రియకు 45 నిమిషాల సమయం పడుతుంది మరియు కండరాల కవాటం యొక్క పనితీరుతో పాటుగా అన్నవాహిక యొక్క (ఎసోఫేగల్) కండరాల బలం మరియు చలనము చూచేందుకు చేయబడుతుంది.
 • ఎండోస్కోపీ (Endoscopy)
  ఒక సన్నని గొట్టాన్ని గొంతు గుండా అన్నవాహిక ద్వారా జారవిడవడం జరుగుతుంది, ఈ ప్రక్రియను నేరుగా చిత్రీకరించడం కూడా ఒకేసారి జరుగుతుంది. దీనివల్ల అన్నవాహిక యొక్క స్థితి-గతులు తెలుస్తాయి.

మింగడంలో కష్టపడే సమస్యకు (అచలసియాకు) ఎటువంటి నివారణ లేదు కానీ దీని లక్షణాలను తగ్గించడానికీ లభ్యమయ్యే చికిత్స సహాయపడుతుంది.

 • వైద్య సంరక్షణ (Medical Care)
  • నైట్రేట్లు మరియు కాల్షియం ఛానల్ బ్లాకర్స్ దిగువ అన్ననాళిక కండరం (lower oesophageal sphincter) యొక్క ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ బ్లాకర్లు సులభంగా మ్రింగడానికి సాయం చేస్తాయి.
  • ఎండోస్కోప్ ద్వారా అన్నవాహిక కండరాల కవాటంలోకి బోటులినుం టాక్సిన్ (బొటాక్స్) ను ఇంజెక్ట్ చేయబడుతుంది, దీనివల్ల కవాటం సడలుతుంది. అయితే, ఈ ఎండోస్కోపీ ఇంజక్షన్ ప్రభావం దీర్ఘకాలం ఉండదు గనుక బొటాక్స్ ఇంజక్షన్ ను అపుడపుడూ (పునరావృతరీతిలో) తీసుకోవడం అవసరం అవుతుంది. .
  • మత్తు మందు ఇచ్చి (అనస్థీషియా ఇచ్చి), ఒక ఊపిరి బుడగ (balloon) ను  అన్నవాహిక గుండా చివరివరకూ జారవిడిచి తరువాత ఆ ఊపిరి బుడగ లోనికి గాలిని ఊది అన్నవాహికను విస్తరించడం జరుగుతుంది, దీన్నే “బెలూన్ డిలేటేషన్” చికిత్సగా సూచిస్తారు.
 • శస్త్ర చికిత్సా సంరక్షణ (Surgical Care)   
  సాధారణ మత్తుమందు ఇచ్చి (జనరల్ అనస్థీషియా) దిగువ అన్ననాళిక కండర (lower oesophageal sphincter)పీచుల్ని కత్తిరించడం జరుగుతుంది. ఈ శస్త్రచికిత్సను లాపరోస్కోప్ ను ఉపయోగించి చేయబడుతుంది. దీనివల్ల రోగి వేగవంతంగా కోలుకుని ఆసుపత్రి నుండి తక్కువ సమయంలోనే విడుదలవుతారు
 1. మింగడంలో కష్టం కొరకు మందులు

మింగడంలో కష్టం కొరకు మందులు

మింగడంలో కష్టం के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
Sorbitrate HF SORBITRATE HF 20/37.5MG TABLET 10S49
IsolazineIsolazine Tablet104
CordilCordil 5 Mg Tablet84
IsordilIsordil 10 Mg Tablet5
SorbidineSorbidine 10 Mg Tablet128
SorbitrateSORBITRATE 10MG TABLET 30S38
Cardicap TrCardicap Tr 20 Mg Capsule48
Bmd MaxBmd Max 2.5 Mg Capsule151
CardicapCardicap 10 Mg Tablet8
GlyinGlyin 6.4 Mg Tablet91
DinosprayDinospray 20 Mg Spray132
GlytrateGlytrate 2.6 Mg Tablet88
Isosorbide Dinitrate TabletIsosorbide Dinitrate 5 mg Tablet0
Gtn SorbitrateGTN SORBITRATE 0.5MG TABLET 25S142
Isosorbide Dinitrate TabletIsosorbide 5 Mg Tablet24
NitrobidNitrobid 2.6 Mg Tablet93
NitroglycerinNitroglycerin 5 Mg Injection24
Nitro (Three Dots)Nitro 6.4 Mg Tablet117
Vasovin XlVasovin Xl 2.5 Mg Capsule93

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. Mayberry JF. Epidemiology and demographics of achalasia. Gastrointest Endosc Clin N Am. 2001 Apr;11(2):235-48. PMID: 11319059
 2. Podas T, Eaden J, Mayberry M, Mayberry J. Achalasia: a critical review of epidemiological studies.. Am J Gastroenterol. 1998 Dec;93(12):2345-7. PMID: 9860390
 3. National Health Service [Internet]. UK; Achalasia
 4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Achalasia
 5. Nidirect. Achalasia. UK. [internet].
 6. MSD mannual consumer version [internet].Achalasia. Merck Sharp & Dohme Corp. Merck & Co., Inc., Kenilworth, NJ, USA
और पढ़ें ...