ఏకాగ్రతా లోపం వ్యాధి - ADHD in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 26, 2018

March 06, 2020

ఏకాగ్రతా లోపం వ్యాధి
ఏకాగ్రతా లోపం వ్యాధి

ఏకాగ్రతా లోపం లేక అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) అంటే ఏమిటి? 

“సచేతన ఏకాగ్రతా లోపం వ్యాధి” లేదా ‘అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్’ (ADHD) తో కూడిన అతి చురుకుదనం అనేది మెదడు (మరియు పనితీరు) యొక్క సాధారణ అభివృద్ధిలో క్రమరాహిత్యం కావడమే. ఇది సాధారణంగా బాల్యంలోనే రోగ నిర్ధారణ చేయబడుతుంది. అయితే ఇది యుక్తవయసులో కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇది మెదడు యొక్క జన్యు, రసాయనిక, మరియు నిర్మాణ మార్పులకు సంబంధించిన వ్యాధి. ఏకాగ్రతా లోపంతో ఉన్న పిల్లలు సాధారణంగా ఇతర పిల్లల కంటే ఎక్కువ చురుకు (ఓవర్యాక్టివ్) గా ఉంటారు. వీరి అతి చురుకుదనంతో (వీరి తల్లిదండ్రులు  పెద్దలు) ఇబ్బందులెదుర్కొంటుంటారు. వీళ్ళతో సమస్య ఏంటంటే పరిణామాల గురించి ఆలోచించకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.

సచేతన ఏకాగ్రతా లోపం వ్యాధి ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ప్రధానంగా, సచేతన ఏకాగ్రతా లోపం వ్యాధి (ADHD) తో ఉండే పిల్లల్లో ఏకాగ్రతలేమి  (నిరుత్సాహంతో ఉండడం), బలహీనపడటం, మరియు అతి చురుకుదనం (హైపరాక్టివిటీ) తో ప్రవర్తించడమనేవి ప్రధాన లక్షణాలు. సచేతన ఏకాగ్రతా లోపం వ్యాధి (ADHD) ఉన్న శిశువులో పేర్కొన్న మూడు లక్షణాల్లో ఒకటి ప్రధానమైనది కావచ్చు, లేదా మూడు లక్షణాలూ కలిసిన ప్రభావం శిశువు  ప్రవర్తనలో మనం చూడవచ్చు. అయితే ఈ సచేతన ఏకాగ్రతాలోపం వ్యాధితో ఉన్న శిశువు యొక్క  అత్యంత సాధారణ లక్షణం అతి చురుకుదనం (హైపర్బాక్టివిటీ). సచేతన ఏకాగ్రతాలోపం వ్యాధి (ADHD) తో ఉన్న వ్యక్తుల్లో, ఈ ప్రవర్తనలు మరింత తీవ్రంగా ఉంటాయి. ఇంకా, వారు తరచూ ఇతరులతో కలిసినపుడు అంటే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు, ఈ లక్షణాలు తమ ప్రభావాన్ని చూపుతాయి ఉదాహరణకు పాఠశాల లేదా కార్యాలయంలో పని చేసేటపుడు వారు చేపట్టే కార్యక్రమాల నాణ్యతలో వీరి అతి చురుకుదనం వల్ల ప్రభావాలు కలగొచ్చు. పైన పేర్కొన్న మూడు ప్రముఖ లక్షణాల వివరాలను కింద వివరిస్తున్నాం:

 • మందకొడితనం (Inactivity)
  మనసును లగ్నం చేయలేక పోవడం, మరచిపోవడం లేదా వస్తువుల్ని తప్పుగా పెట్టడం లేదా తప్పుడు స్థలములోఁఉంచడం, విధిని నిర్వహించడంలో లేదా తన పనిని పూర్తి చేయడంలో ప్రయాస పడడం, ఆదేశాలు లేక చర్చల్లోని విషయాల్ని పాటించడంలో క్లిష్టత, సులభంగా అన్యమనస్కులవడం మరియు ఆరోజు జరిగిన విషయాల్ని మననము చేసుకోవడంలో క్లిష్టత.
 • ఉద్రేకం మరియు అతి చురుకుదనం (Impulsiveness and Hyperactivity)
  సుదీర్ఘకాలంపాటు ఒకేచోట కూర్చోలేక పోవడం, ప్రమాదాలకు గురయ్యే తత్త్వం, తరచూ తొందరపాటు ప్రవర్తన, నిరంతరంగా మాట్లాడుతూ ఉండడం, ఇతరులను కలవరపర్చడం, ఇతరుల నుండి వస్తువుల్ని దోచుకోవడం, తగని సమయాల్లో మాట్లాడటం (అసందర్భ ప్రేలాపన), ఎదుటి వారు చెప్పేది సరిగ్గా వినకపోవడం లేక మాట్లాడేందుకుగాను తన వంతు వచ్చేదాకా వేచి ఉండక పోవటం.
 • సంయోగ రూపం (Combined Form)
  పైన పేర్కొన్న లక్షణాలు రెండింటినీ (మందకొడితనం మరియు అతి చురుకుదనం) సమానంగా చూడవచ్చు.

ప్రధాన కారణాలు ఏమిటి? 

సచేతన ఏకాగ్రతా లోపం వ్యాధికి ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ శాస్త్రవేత్తలు దీన్ని (ADHD) నివారించడానికి దాని అంతర్లీన విధానాల్ని పరిశీలిస్తూ చేస్తున్న  అధ్యయణాల్ని కొనసాగిస్తున్నారు. దీనికున్న సాధారణ ప్రమాద కారకాలు ఇలా ఉంటాయి:

 • జన్యు సంబంధమైనవి (Genetic)   
  సచేతన ఏకాగ్రతా లోపం వ్యాధి (ADHD) సంభవించినప్పుడు జన్యుసంబంధ విషయాలు ముఖ్యమైన పాత్రను పోషిస్థాయి. పరిశోధకులు జన్యు ఉత్పరివర్తనల్ని (మార్పులు) సచేతన ఏకాగ్రతా లోపం వ్యాధికున్న ప్రమాద కారకాలలో ఒకదానిగా చూపించారు. సచేతన ఏకాగ్రతా లోపం వ్యాధి (ADHD) వారసత్వంగా కూడా రావచ్చు.  
 • మెదడుకు గాయం (Brain injury)
  మెదడుకు ఏదేని గాయమవడం గాని, మెదడు పనికి గాయమవడం (లేదా అంతరాయామో కలగడం) కారణంగా ఉదార సమస్యలు కానీ లేక భవిష్యత్తులో ఆ వ్యక్తికీ సచేతన ఏకాగ్రతా లోపం వ్యాధి (ADHD) దాపూరించవచ్చు.  
 • డ్రగ్స్ (మత్తు పదార్థాలు)
  శిశువు గర్భంలో ఉన్నపుడు ఆ బిడ్డ తల్లి గర్భధారణ సమయంలో మద్యం, పొగాకు లేదా కొకైన్ వంటి మత్తు పదార్థాలను ఉపయోగించినట్లయితే, పుట్టిన తర్వాత ఆ బిడ్డకు సచేతన ఏకాగ్రతా లోపం వ్యాధి (ADHD)కి గురయ్యే అవకాశం ఉంది.  
 • సీసం (Lead)
  గర్భధారణ సమయంలో గర్భవతి సీసం వంటి పర్యావరణ కాలుష్యాల బహిర్గతానికి గురైనపుడు అది కూడా కారకం అవుతుంది.  
 • పుట్టుక లోపాలు (Birth defects) 
  నెలలు తక్కువగా జన్మించిన శిశువు లేదా తక్కువ బరువుతో జన్మించిన పిల్లలు ఈ  సచేతన ఏకాగ్రతా లోపం వ్యాధి యొక్క ప్రమాద పరిధిలోకి వస్తారు.  

సచేతన ఏకాగ్రతా లోపం వ్యాధిని నిర్ధారించేదెలా? దీనికి చికిత్స ఏమిటి? 

సచేతన ఏకాగ్రతా లోపం వ్యాధి (ADHD) యొక్క రోగ నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష లేదు. ఒక శిశువైద్యుడు లేదా మనోరోగ వైద్యుడు ఈ వ్యాధి (ADHD) ని కేవలం వ్యాధికి గురైన పిల్లలను చూసి వివరణాత్మక అంచనా వేసుకుంటాడు మరియు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి కూడా ఆ పిల్లల వైద్య చరిత్రను మరియు ప్రవర్తనా చరిత్రను అడిగి తెల్సుకుని వ్యాధి నిర్ధారానా చేస్తారు.  

మీరు డాక్టర్ ను సందర్షించినపుడు, ఆ డాక్టర్  మీ పిల్లల యొక్క లక్షణాల గురించి విచారణ చేస్టారు. ఈ విపరీత లక్షణాలు ప్రారంభమైనదెప్పుడు, ఈ లక్షణాలు పిల్లల్లో సాధారణంగా (ఇంటిలో లేదా పాఠశాలలో) ఎపుడు చోటుచేసుకుంతున్నాయి, ఈ వ్యాధికి గురైన పిల్లల రోజువారీ మరియు సామాజిక జీవితాన్ని ఈ లక్షణాలు ప్రభావితం చేస్తున్నాయా, లేక వంశ పారంపర్యంగా సచేతన ఏకాగ్రతా లోపం (ADHD) వ్యాధి ఉన్న దాఖాలాలున్నాయా, ఈ వ్యాధికారణంగా, కుటుంబంలో మరణాలు గాని లేక విడాకులు తీసుకున్న చరిత్రలున్నాయా, పిల్లల చరిత్ర, గత ప్రవర్తనలు మరియు గాయం లేదా ఏదైనా అనారోగ్యం యొక్క వైద్య చరిత్ర ఏమిటి వంటి వాటి గురించి వైద్యుడు అడిగి తెలుసుకుంటాడు. వైద్యులు మరియు మనస్తత్వవేత్తలు సచేతన ఏకాగ్రతా లోపం వ్యాధి (ADHD) ని నిర్ధారించేందుకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వివిధ ఉపకరణాలు, ప్రమాణాలు మరియు ఇతర సూత్ర ప్రమాణాలను కూడా ఉపయోగిస్తారు.

సచేతన ఏకాగ్రతా లోపం వ్యాధి (ADHD) లక్షణాలకు అనేక విధాలుగా చికిత్స చేయవచ్చు. అనేక మందులు మరియు వివిధ చికిత్సలు మేళవించి ఈ వ్యాధికి వైద్యులు చికిత్స చేస్తారు. మందులు మెదడు-సంబంధిత కార్యాలను  నిర్వహిస్తాయి, అయితే వైద్యుడు చేసే చికిత్స (థెరపీ) రోగి ఆలోచనలు మరియు ప్రవర్తనా విధానాలను సరి చేస్తుంది.

ఉత్ప్రేరకాలు ఎక్కువగా ఔషధంగా వాడబడతాయి. ఈ  ఉత్ప్రేరకాలు వ్యాధికి గురైన పిల్లల్లో ఉండే అతి చురుకుదనాన్ని (హైపర్యాక్టివిటీని) మరియు బలహీనతని తగ్గిస్తాయి మరియు వారు (వ్యాధికి గురైన పిల్లలు) విషయాలపై మనసు కేంద్రీకరించటానికి, పనులు నిర్వహించడానికి మరియు నేర్చుకోవడానికి వీలు కల్పిస్తాయి. అభిజ్ఞ ప్రవర్తనా చికిత్స వంటి మానసిక చికిత్సలు సాధారణంగా వైద్యులు ఈ వ్యాధికి ఉపయోగిస్తుంటారు. వ్యాధికి గురైన పిల్లలకు మరియు కుటుంబ సభ్యులకు కూడా సలహాల ద్వారా కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దంపతులక్కూడా వైద్యులు సంతాన దృష్టికోణంలో సలహాలు, శిక్షణ ఇస్తారు. దీనికే ఒత్తిడి నిర్వహణ కార్యక్రమాలు కూడా అమలు చేయబడతాయి. ఏదైనా ప్రమాదం నుండి బయటపడి  ఒత్తిడి రుగ్మతలకు(పోస్ట్-ట్రామాటిక్స్ట్రెస్ డిజార్డర్) లోనైనా పిల్లల్లో కూడా సచేతన ఏకాగ్రతా లోపం వ్యాధి (ADHD) లక్షణాలకు సమానమైన లక్షణాలనే కలిగి ఉంటారు, కానీ వారికి విభిన్న చికిత్సలు అవసరమవుతాయి. సచేతన ఏకాగ్రతా లోపం వ్యాధికి బాగా సరిపోయే చికిత్స పూర్తిగా ఆ వ్యాధికి లోనైనా పిల్లల మరియు కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వ్యాధికి ఓ మంచి చికిత్స ఒనగూడాలంటే రోగికి నిరంతర, అనునయ పర్యవేక్షణ, నిరంతర వైద్య గమనాలు మరియు అవసరమైతే చికిత్సలో మరియు తీసుకుంటున్న మందుల్లో మార్పులు చేయడం అవసరమవుతుంది.వనరులు

 1. National institute of mental health. Attention-Deficit/Hyperactivity Disorder. U.S. Department of Health and Human Services
 2. National Health Service [Internet]. UK; Attention deficit hyperactivity disorder (ADHD)
 3. Centre for Health Informatics. [Internet]. National Institute of Health and Family Welfare What is ADHD?
 4. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Attention deficit hyperactivity disorder (ADHD)
 5. Mental health .Attention deficit hyperactivity disorder (ADHD). U.S. Department of Health & Human Services. [internet].

ఏకాగ్రతా లోపం వ్యాధి కొరకు మందులు

Medicines listed below are available for ఏకాగ్రతా లోపం వ్యాధి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.