బంక విరేచనాలు (అమీబియాసిస్) - Amebiasis in Telugu

Dr. Ayush PandeyMBBS

November 21, 2018

March 06, 2020

బంక విరేచనాలు
బంక విరేచనాలు
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

బంక విరేచనలు (అమీబియాసిస్) అంటే ఏమిటి?

అమోబియాసిస్ అనేది ఎంటేమోబా (Entamoeba) అనే పరాన్నజీవి (parasite)  వలన సంభవించిన ప్రేగులలో సంక్రమణం (ఇన్ఫెక్షన్). సమస్యను గుర్తించడంలో సహాయపడే  కొన్ని చెప్పుకోదగ్గ సంకేతాలు ఉన్నాయి, కానీ సాధారణంగా, చాలా లక్షణాలను అనుభవించలేరు. చికిత్స చేయని పక్షంలో, అమీబియాసిస్ ప్రమాదకరమైనది కావచ్చు, ఎందుకంటే ఈ పరాన్నజీవి (parasite) సంక్రమణ ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతుంది.

బంక విరేచనాలుఅమీబియాసిస్ ప్రధాన సంకేతాలు  మరియు లక్షణాలు ఏమిటి?

లక్షణాలు పైకి కనిపించడానికి పరాన్నజీవి (parasite) లేదా ఆ జీవి విత్తనాలు (cysts) శరీరంలోకి   ప్రవేశించిన తరువాత ఒకటి నుండి నాలుగు వారాల సమయం పడుతుంది. అనేక సందర్భాల్లో, అసలు లక్షణాలు కనిపించవు లేదా సాధారణ లక్షణాలు కలిగి ఉంటాయి. సాధారణంగా ఉండే లక్షణాలు:

ఏదేమైనా, పరాన్నజీవులు అవయవాల లోకి చేరినప్పుడు, అవి మరింత తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి:

 • తీవ్ర అంటువ్యాధులు.
 • కురుపులు లేదా చీము ఏర్పడటం.
 • అస్వస్థత.
 • మరణం.

ప్రేగు మరియు కాలేయం పరాన్నజీవి (parasite)  దాడికి అత్యంత సాధారణమైన అవయవాలు.

బంక విరేచనాలు (అమీబియాసిస్) ప్రధాన కారణాలు ఏమిటి?

అమోబియాసిస్ కు  కారణమయ్యే ప్రోటోజోవా లేదా పరాన్నజీవిని  ఇ. హిస్టోలిటికా ( E. histolytica) అని పిలుస్తారు. ఈ పరాన్నజీవుల యొక్క సిస్టులు నీటిలో లేదా ఆహారాన్ని కలుషితం చేస్తాయి. అటువంటి నీరు లేదా ఆహరం తిన్నప్పుడు సాధారణంగా అవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధి సోకిన వ్యక్తి యొక్క మలపదార్థం తగిలినప్పుడు కూడా అమోబియాసిస్ కలిగించవచ్చు.

శరీరంలోకి సిస్టులు  ప్రవేశించిన తర్వాత, పరాన్నజీవులు  (parasite) విడుదల చేయబడతాయి మరియు అవి శరీరంలో వివిధ భాగాలకు వ్యాప్తి చెందుతాయి. అవి ప్రేగు లేదా పెద్దప్రేగులలోకి కూడా చేరవచ్చు. మలం లోకి  పరాన్న జీవులు మరియు సిస్టులు చేరడం ద్వారా సంక్రమణ (infection) వ్యాప్తి చెందుతుంది.

ఎలా అమోబియాసిస్ను నిర్ధారించాలి  మరియు చికిత్స ఏమిటి?

నిర్ధారణ సాధారణంగా కొన్ని దశల ఆధారంగా ఉంటుంది, వాటిలో కొన్ని:

 • ఇటీవలి ప్రయాణాల గురించి మరియు ఆరోగ్య స్థితిపై సమాచారం.
 • సిస్టులు కోసం మలం యొక్క పరీక్ష.
 • కాలేయ పనితీరు పరీక్షలు.
 • కాలేయ నష్టం లేదా గాయాల తనిఖీ కోసం అల్ట్రాసౌండ్ లేదా CT స్కాన్.
 • కాలేయంలో చీము గురించి తెలుసుకోవడానికి నీడిల్ ఆస్పిరేషన్ (Needle aspiration).
 • పెద్దప్రేగులో పరాన్నజీవుల ఉనికిని యొక్క  తనిఖీ కోసం కొలొనోస్కోపీ (Colonoscopy).

చికిత్స చాలా సరళమైనది మరియు ప్రత్యక్షంగా ఉంటుంది మరియు పరాన్నజీవిని వ్యాపిని నియంత్రించడం మరియు చంపడం లక్ష్యంగా ఉంది. అందులో ఈ క్రిందివి ఉంటాయి:

 • 10 నుండి 14 రోజులు ఉండే మెట్రోనిడాజోల్ (metronidazole)  మందుల కోర్సు.
 • పరాన్నజీవి కొన్ని అవయవాలకు నష్టం కలిగించిందని గమనించినట్లయితే, చికిత్స కేవలం పరాన్నజీవులను శరీరం  నుండి బయటకు పంపడమే కాకుండా, అవయవ పనితీరును పునరుద్ధరించడం కోసం కూడా చెయ్యాలి. పెద్దప్రేగు లేదా పెర్టోనియోనల్ కణజాలం (కడుపు అవయవాలను కప్పి ఉంచే కణజాలం) లో  కూడా నష్టం కలిగితే శస్త్ర చికిత్స సిఫారసు చేయబడవచ్చు.వనరులు

 1. Nagata N. General Information. U.S. Department of Health & Human Services. [internet]
 2. Mathew G, Horrall S. Amebiasis. Amebiasis.StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls; 2019 Jan
 3. U.S. Department of Health & Human Services. Amebiasis. centres for disease control and prevention. [internet]
 4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Amebiasis
 5. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Amoebiasis

బంక విరేచనాలు (అమీబియాసిస్) వైద్యులు

Dr. Arun R Dr. Arun R Infectious Disease
5 वर्षों का अनुभव
Dr. Neha Gupta Dr. Neha Gupta Infectious Disease
16 वर्षों का अनुभव
Dr. Lalit Shishara Dr. Lalit Shishara Infectious Disease
8 वर्षों का अनुभव
Dr. Alok Mishra Dr. Alok Mishra Infectious Disease
5 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

బంక విరేచనాలు (అమీబియాసిస్) కొరకు మందులు

బంక విరేచనాలు (అమీబియాసిస్) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।