రొమ్ముల్లో నిరపాయమైన పీచుగడ్డలు (ఫైబ్రోసైస్టిస్ట్) - Benign Fibrocystic Breasts in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 28, 2018

March 06, 2020

రొమ్ముల్లో నిరపాయమైన పీచుగడ్డలు
రొమ్ముల్లో నిరపాయమైన పీచుగడ్డలు

రొమ్ముల్లో నిరపాయమైన పీచుగడ్డలంటే (ఫైబ్రోసైస్టిక్) ఏమిటి?

రొమ్ముల్లో నిరపాయమైన పీచు గడ్డలు (ఫైబ్రోసిస్టిక్) అంటే వక్షోజాల కణజాలంలో నిరపాయమైన (కేన్సర్ కాని) గడ్డలు లేదా నారతాడు లాంటి కండరాల ఉనికిని కలిగి ఉంటాయి. ఈ క్యాన్సర్ కాని గడ్డలు ఎక్కువగా వక్షోజాల యొక్క బాహ్య మరియు ఎగువ ప్రాంతంలో ఉంటాయి.  20 నుంచి 50 ఏళ్ళ వయస్సులో ఉండే మహిళల్లో ఇది సంభవిస్తుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

రొమ్ముల్లో నిరపాయమైన (ఫైబ్రోసైస్టిక్) పీచు గడ్డలు యొక్క లక్షణాలు ఏవంటే హార్మోన్ల మార్పుల వల్ల ఋతు చక్రం సమయంలోను మరియు అంతకు కాస్త ముందు  మరింత గుర్తించదగ్గవిగా ఈ గడ్డలు మారవచ్చు. ఇంకా ఈ లక్షణాలు ఏవంటే:

  • వక్షోజాల్లో నొప్పి (మరింత సమాచారం: రొమ్ముల్లో నొప్పికి కారణాలు)   
  • తాకితేనే గుర్తించదగిన వక్షోజాల (బ్రెస్ట్) సున్నితత్వం
  • రొమ్ములు చాలా బరువుగా లేదా వాపుకు గురయినట్లు భావన కల్గుతుంది.
  • రొమ్ముల్లో గడ్డల ఉనికి
  • చనుమొనల ద్వారా ద్రవాల ఉత్సర్గ
  • ఋతుస్రావం ముందు పెరిగిన రొమ్ము నొప్పి

రొమ్ముల కణజాలంలో గుర్తింపబడే గడ్డలు రబ్బర్లాగా మృదువైనవిగా కనిపిస్తాయి. తాకినప్పుడు, అవి కొద్దిగా పక్కజు జరిగి స్థానం మారుతున్నట్లు అనిపించవచ్చు.  ఈ గడ్డలు ఋతుస్రావం ముందు పరిమాణంలో కూడా కొద్దిగా పెరుగుతాయి.

నిరపాయమైన ఫైబ్రోసిస్టిక్ ఛాతీల ఉనికిని రొమ్ము క్యాన్సర్ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని మహిళ పెంచుకోవడం లేదని తెలుసుకోవడం ముఖ్యం. ఈ ఫైబ్రోసైస్టిక్ రొమ్ము మార్పులు హానిరహితమైనవి మరియు వారితో సంబంధం ఉన్న అసౌకర్యం చికిత్స చేయవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి? 

వైద్యులు రొమ్ముల్లో నిరపాయమైన పీచుగడ్డలు ఏర్పడేందుకు గల ఖచ్చితమైన కారణాన్ని గుర్తించలేకపోయారు. అయినప్పటికీ, చాలామంది ఈస్ట్రోజెన్ వంటి పునరుత్పత్తి హార్మోన్లు ఈ స్థితికి కారణం కావచ్చునని సూచించారు. ఈ పరిస్థితి రుతువిరతి తర్వాత చాలా అరుదుగా కొనసాగుతున్నందున, చాలా మంది వైద్యులు పునరుత్పత్తి సంవత్సరాలలో హార్మోన్ల మార్పులను ఈ పరిస్థితికి దారి తీసే కారకంగా భావిస్తారు.

దీనిని ఎలా నిర్ధారణచేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

రొమ్ముల్లో నిరపాయమైన పీచుగడ్డల (ఫైబ్రోసిస్టిక్స్) నిర్ధారణలో మొదటి చేసేది ఈ గడ్డల ఉనికిని గురించి తెలుసుకునేందుకు చేసే  శారీరక పరీక్ష, అంటే డాక్టర్ గడ్డల్ని గుర్తించడం కోసం మరియు రొమ్ము కణజాలంలో ఏదేని అసాధారణతను తనిఖీ చేయడానికై ఈ శారీరక పరీక్ష  సహాయపడుతుంది. శారీరక పరీక్ష తర్వాత, డాక్టర్ ఒక మామోగ్గ్రామ్ మరియు రొమ్ము అల్ట్రాసౌండ్ వంటి నిర్థారణ ఇమేజింగ్ పరీక్షల్ని కూడా రోగిని సూచించవచ్చు.

వక్షోజాల్లోని గడ్డలు నిరపాయకరమైనవా కాదా అనేదాన్ని తెలుసుకునేందుకు  కణజాలం బయాప్సీ వంటి మరిన్ని పరీక్షలు జరుగుతాయి.

రోగి ఈ పరిస్థితి యొక్క లక్షణాలను ఎదుర్కొంటుంటే మాత్రమే చికిత్స అవసరమవుతుంది. ఈ చికిత్సలో సున్నితత్వం తగ్గించడానికి నొప్పి నివారణ మందులు వాడవచ్చు. అయితే, ఈ పరిస్థితిని సదరు రోగి నిర్వహించుకోవడానికి స్వీయ రక్షణ చర్యలను వైద్యుడు ఎక్కువగా వివరించి చెప్పడం జరుగుతుంది.

వీటితొ పాటు:

  • వక్షోజాలకు మంచి సౌకర్యాన్ని సమకూర్చే మృదువైన, బాగా-సరిపోయే  బ్రాను ధరించడం
  • నొప్పి తగ్గించడానికి వక్షోజాలకు వేడి కాపడాలను పెట్టడం  
  • వాపు-నిరోధక తత్వమున్న ఆహారాలను తినడం

లక్షణాలు తీవ్రంగా ఉంటే, వైద్యుడు రోగులను జన్మ నియంత్రణ మాత్రలు లేదా ఇతర ఔషధాల సేవనను సూచిస్తారు, ఇదెందుకంటే ముఖ్యంగా నొప్పి మరియు సున్నితత్వాన్ని తగ్గించడానికి.



వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Fibrocystic breast disease
  2. American College of Obstetricians and Gynecologists. Benign Breast Problems and Conditions. Washington, DC; USA
  3. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Breast Changes and Conditions
  4. Centre for Health Informatics. [Internet]. National Institute of Health and Family Welfare What Are the Symptoms of Breast Cancer?
  5. National Health Service [Internet]. UK; Breast lumps

రొమ్ముల్లో నిరపాయమైన పీచుగడ్డలు (ఫైబ్రోసైస్టిస్ట్) కొరకు మందులు

Medicines listed below are available for రొమ్ముల్లో నిరపాయమైన పీచుగడ్డలు (ఫైబ్రోసైస్టిస్ట్). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Medicine Name

Price

₹120.0

Showing 1 to 0 of 1 entries