సెల్యులైటిస్ - Cellulitis in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 29, 2018

March 06, 2020

సెల్యులైటిస్
సెల్యులైటిస్

సెల్యులైటిస్ అంటే ఏమిటి?

సెల్యులైటిస్ అనేది ఒక చర్మ సమస్య, ఇది ప్రాథమికంగా  క్రింది కాళ్లను ప్రభావితం చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో, ముఖం లేదా చేతులను ప్రభావితం చేస్తుంది. ఇది బ్యాక్టీరియా సంక్రమణ (infection) వలన సంభవిస్తుంది, మరియు  చర్మం ఎర్రగా మారి, వాపు ఏర్పడుతుంది మరియు ఆ ప్రదేశం అత్యంత సున్నితంగా మారుతుంది. సెల్యులైటిస్ (Cellulitis) అంటువ్యాధి కాదు మరియు దానిని సులభంగా తగ్గించవచ్చు. ఏమైనప్పటికీ, చికిత్స చేయకుండా వదిలివేయడం వలన ఇది ఇబ్బంది కలిగిస్తుంది, ఎందుకంటే సంక్రమణ (infection) శోషరస కణుపుల (lymph nodes) ద్వారా రక్త ప్రవాహంలోకి వ్యాపిస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

లక్షణాలు సాధారణంగా శరీరంలో ఒక వైపు మాత్రమే గుర్తించబడతాయి మరియు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి:

  • చర్మంలో ఎరుపుదనం
  • నొప్పి మరియు సున్నితత్వం
  • చర్మ వాపు మరియు సొట్టబడడం
  • బొబ్బలు
  • ప్రభావిత ప్రాంతం చుట్టూ వెచ్చదనం మరియు తేలికపాటి జ్వరం యొక్క అవకాశం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ పరిస్థితికి కారణమయ్యే బాక్టీరియా సాధారణంగా స్టెఫిలోకాకస్ (Staphylococcus)లేదా స్ట్రెప్టోకోకస్ (Streptococcus). చర్మ అంటువ్యాధులు, శస్త్రచికిత్సా గాయాలు, పుండ్లు, గాయాలు మరియు జంతువుల కాటు కారణంగా అవి చర్మంలోకి  చేరుకుంటాయి. ఇవి సాధారణంగా కాళ్ళలో కనిపిస్తాయి.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స?

రోగ నిర్ధారణ చాలా సరళంగా మరియు సూటిగా ఉంటుంది. రోగ నిర్ధారణ లేదా సంక్రమణ యొక్క కారక జీవిని నిర్ధారించడానికి పూర్తి రక్త గణన (complete blood count) మరియు ఎర్ర రక్తకణ అవక్షేపణ శాతం (erythrocyte sedimentation) వంటి రక్త పరీక్షలు అవసరమవుతాయి.

చికిత్స సాధారణంగా నోటిద్వారా తీసుకోబడే యాంటీబయాటిక్స్ రూపంలో ఉంటుంది. సహాయక సంరక్షణను (supportive care) అందించడానికి  ఆ ప్రాంతంలో ఉపయోగించే క్రములను ఇవ్వవచ్చు. కొన్ని రోజుల తరువాత మెరుగుదల సంకేతాలు గమనించవచ్చు, అయితే వైద్యులు 10 నుంచి 15 రోజుల మధ్య ఉండే మందుల కోర్స్ ను సూచించవచ్చు. ఎటువంటి పునఃస్థితులు సంభవించకుండా ఉండడానికి, మరియు మొత్తం బ్యాక్టీరియా శరీరంలో నుండి బయటకుపోవడానికి మందుల కోర్స్ ను పూర్తి చేయడం ముఖ్యం.

జ్వరం అధికంగా ఉంటే, లక్షణాలు శరీరంలోని  మిగిలిన భాగాలకు వ్యాప్తి చెందుతాయి, లేదా రోగి నోటి మందులకు (oral medication) తగినంతగా స్పందించకపోతే, వైద్యులు యాంటీబయాటిక్స్ను నరాలకు ఎక్కించవచ్చు.వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Cellulitis
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Cellulitis
  3. Healthdirect Australia. Cellulitis. Australian government: Department of Health
  4. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Cellulitis
  5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Cellulitis

సెల్యులైటిస్ కొరకు మందులు

Medicines listed below are available for సెల్యులైటిస్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.