myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

క్రిప్టోకోకోసిస్ అంటే ఏమిటి?

క్రిప్టోకొక్కోసిస్ వ్యాధి ఫంగస్ కారణంగా దాపురించే ఓ సంక్రమణ (ఇన్ఫెక్షన్), క్రిప్టోకోకుస్ అనే జాతి బూజువల్ల కల్గుతుందీ వ్యాధి. ఇది పావురం రెట్ట లేదా శుభ్రపరచకుండా తిన్న ముడిపండ్ల కారణంగా మనుషులకు వ్యాపిస్తుంది. ఇది ప్రాధమికంగా ఊపిరితిత్తులు, మెదడు మరియు మెనింజీస్ (మెదడు యొక్క పొరలు) లను బాధిస్తుంది. అమెరికాలో, ఇది సాధారణంగా 40-60 సంవత్సరాల వయస్సులో ఉండే వ్యక్తుల్లో కనిపిస్తుంది. మహిళల కంటే ఎక్కువగా పురుషులకే ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. భారతదేశంలో, హెచ్ఐవి రోగులలో ఈ వ్యాధికి సంబంధించిన మెనింజియల్ సంక్రమణ ప్రబలంగా కనిపిస్తుంది మరియు దీని ఉనికిని 2.09% గా గుర్తించబడింది.

క్రిప్టోకోకోసిస్ వ్యాధి ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

శిలీంధ్ర మూలకాలకు నిరంతరంగా మనిషి బహిర్గతమవుతుండటంతో ఊపిరితిత్తుల మూలంగా ఈవ్యాధికారక బూజు సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించడంతో కింది వ్యాధి  లక్షణాలను కలుగజేస్తుంది.

మెనింజైటిస్ ఉంటే, దాని లక్షణాలు ఇలా ఉంటాయి:

క్రిప్టోకోకోసిస్ వ్యాధి ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ వ్యాధి ప్రధానంగా క్రిప్టోకాకస్ నియోఫార్మన్స్ అని పిలువబడే ఒక మధుశిలీంధ్రము లేక ఈస్ట్-వంటి బూజు చేత కలుగుతుంది. ఈ మధుశిలీంధ్రము ఎక్కువగా మట్టి లేక నేల, శిథిలమైన చెక్క మరియు పావురం లేదా కోడి రెట్టలలో ఎక్కువగా కనిపిస్తుంది; అయితే, ఈ మధుశిలీంధ్రము కారణంగా పేర్కొన్న పక్షులు తరచూ అనారోగ్యంతో ఉండవు. ఏరోసలిసిస్ (పిచికారి చేసే ద్రవాల్ని లోహపాత్రల్లో ఉంచడం) ఫంగల్ కణాల్ని పీల్చడం ప్రాధమిక సంక్రమణానికి కారణమవుతుంది, ఇది తేలికపాటిగుణాన్ని కల్గి ఉంటుంది. ఇది ప్రధానంగా సాధారణ వ్యాధినిరోధకత (ఇమ్మ్యునో కాంపోనెంట్) కల్గిన  వ్యక్తులకు వస్తుంటుంది.

నిరంతర వ్యాధి లక్షణాలకు దోహదం చేసే ప్రధాన కారణాలు:

 • శిరస్సులో (ఇంట్రాక్రానియల్) పెరిగిన ఒత్తిడి
 • చికిత్స వైఫల్యం
 • ఔషధ నిరోధకత
 • ఇతర సమస్యాత్మక అంటువ్యాధులు

ఇతర సమస్యలు:

క్రిప్టోకోకోసిస్ వ్యాధిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

హెల్త్కేర్ ప్రొవైడర్లు కిందివాటి సహాయంతో ఈ వ్యాధి పరిస్థితిని నిర్ధారిస్తారు:

 • వైద్య చరిత్ర
 • శారీరక పరిక్ష
 • ప్రయోగశాల పరీక్షలు: క్రిప్టోకాకస్ నియోఫార్మన్స్ సూక్ష్మజీవుల ఉనికిని పరీక్షించడం  కోసం రక్తం, సెరెబ్రోస్పానియల్ ద్రవం (CSF) లేదా కఫం వంటి కణజాల నమూనా లేదా శరీర ద్రవాలు పరీక్షించబడతాయి.
 • ఛాతీ ఎక్స్-రే లేదా CT స్కాన్ వ్యాధి యొక్క పురోగతిని తనిఖీ చేయడానికి వైద్యులు ఆదేశించవచ్చు.
 • CSF యొక్క పర్యవేక్షణ మరియు మెదడులో పెరిగిన CSF పీడనాన్ని తగ్గించడం

చికిత్స మూడు దశల్లో ఇచ్చే యాంటీ ఫంగల్ థెరపీని కలిగి ఉంటుంది: ఇండక్షన్, ఏకీకరణ మరియు నిర్వహణ దశలు. యాంటీ ఫంగల్ మందులు 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు సూచించబడతాయి. మందులు సంక్రమణ తీవ్రత, శరీరంలో ఏభాగంపై వ్యాధి సోకింది మరియు వ్యక్తి యొక్క రోగనిరోధక స్థితి మీద ఆధారపడి ఇవ్వబడతాయి. ఈ వ్యాధికిచ్చే మందుల మోతాదు, మందులసేవనా వ్యవధి మరియు చికిత్స రకం గర్భిణీ స్త్రీలు, పిల్లలు మరియు పరిమిత వనరులతో ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్నవారికి సంబంధించి చూస్తే  తేడా ఉండవచ్చు.

 • ఇండక్షన్ దశ: ఈ దశలో యాంటీ ఫంగల్ ఏజెంట్ యొక్క ఒక చిన్న కోర్సు సూచించబడుతుంది.
 • స్థిరీకరణ మరియు నిర్వహణ దశలు: సుదీర్ఘమైన చికిత్స వ్యాధి పునరావృతమయ్యే  అవకాశాలను తగ్గిస్తుంది.
 • శిలీంధ్ర పెరుగుదలను తొలగించడానికి శస్త్రచికిత్స జోక్యం అవసరం కావచ్చు.

ఈ వ్యాధిగ్రస్తత మరియు దీనివల్ల మరణాలు తగ్గించడానికి వ్యాధి ప్రారంభదశలోనే  రోగనిర్ధారణ మరియు చికిత్స అవసరమవుతుంది.

చికిత్సానంతర పరీక్ష(follow-up):

 • ప్రారంభ వైద్యసంబంధ ప్రతిస్పందనను రెండు వారాలపాటు అంచనా వేయాలి.
 • నిరంతర వైద్య తనిఖీలు (రెగ్యులర్ చెక్ అప్లు) దీర్ఘకాలంలో సమస్యలను నివారించవచ్చు.
 1. క్రిప్టోకోకోసిస్ వ్యాధి కొరకు మందులు

క్రిప్టోకోకోసిస్ వ్యాధి కొరకు మందులు

క్రిప్టోకోకోసిస్ వ్యాధి के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
SyscanSYSCAN 100MG CAPSULE 4S88
PlitePlite Cream0
Q CanQ Can 150 Mg Capsule9
ReocanReocan 150 Mg Tablet23
Saf FSaf F 150 Mg Tablet24
SkicanSkican 150 Mg Tablet11
SolcanSolcan 150 Mg Tablet10
StafluStaflu 150 Mg Tablet24
Surfaz OSurfaz O 150 Mg Tablet9
SynadilSynadil Cream0
CansCans 150 Mg/750 Mg Kit24
TheozoleTheozole 150 Mg Tablet8
Triben FTriben F 150 Mg Tablet9
UcoUco 150 Mg Tablet8
VenzolVenzol 150 Mg Tablet0
VilzoleVilzole 150 Mg Tablet11
VinfemVinfem 150 Mg Tablet0
Zecon (Zee)Zecon 150 Mg Capsule20
ZefunZefun 150 Mg Tablet24
ZerocanZerocan 150 Mg Tablet7
ZoconZOCON 150MG TABLET 2S19
ZolenZolen 150 Mg Tablet8
AdconAdcon 150 Mg Tablet13
AdifungAdifung 150 Mg Tablet10
AffluAfflu 150 Mg Tablet7

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. Eileen K. Maziarz. et al. Cryptococcosis. Infect Dis Clin North Am. 2016 Mar; 30(1): 179–206. PMID: 26897067
 2. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; C. neoformans Infection
 3. Ashar Dhana. Diagnosis of Cryptococcosis and Prevention of Cryptococcal Meningitis Using a Novel Point-of-Care Lateral Flow Assay.Published online 2013 Nov 12. PMID: 24319464
 4. Mada PK, Jamil RT, Alam MU. Cryptococcus (Cryptococcosis). [Updated 2019 Jun 5]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
 5. John R. Perfect. The Triple Threat of Cryptococcosis: It’s the Body Site, the Strain, and/or the Host. Published online 2012 Jul 10. PMID: 22782526
और पढ़ें ...