myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

కన్నుగుంటకి ఫ్రాక్చర్ (ఐ సాకెట్ ఫ్రాక్చర్)  అంటే ఏమిటి?

కన్నుగుంటకి ఫ్రాక్చర్ అనేది కంటికి సంబంధించిన పరిసర ఎముకలలోని పగుళ్ల ఫలితంగా ఏర్పడుతుంది. కంటి చుట్టూ ఉన్న ఎముకను ఆర్బిట్ లేదా ఆర్బిటల్ ఎముక (orbit or orbital bone) అని పిలుస్తారు. కంటి సాకెట్ (గుంట) యొక్క ఫ్రాక్చర్ ఆర్బిటల్ గోడకు మాత్రమే సంభవించవచ్చు లేదా ఆర్బిటల్ అంచుల (lining) తో పాటు సంభవించవచ్చు.

దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సంకేతాలు మరియు లక్షణాలు ఫ్రాక్చర్ రకాన్ని బట్టి ఉంటాయి

ఆర్బిటల్ ఫ్లోర్ (orbital floor) ఫ్రాక్చర్ కు సంబంధించిన లక్షణాలు:

 • రెండుగా కనిపించడం
 • కంటి సాకెట్ (గుంట) యొక్క భాగాలు మాక్సిల్లరీ సైనస్ (maxillary sinus) లో చిక్కుకుపోతాయి
 • కంటిపాప/గుడ్డు వెనుకకు తిరిగిపోతుంది
 • కన్ను వాలిపోతుంది
 • నరాలకు గాయం ఐతే, కాంతి వంటి ప్రేరేపకాలకు (stimuli) సున్నితత్వం పెరిగిపోతుంది

ఆర్బిట్ లోపలి గోడ యొక్క ఫ్రాక్చర్ కు సంబంధించిన  లక్షణాలు:

 • ముక్కుకి ఏర్పడిన అంతర్గత ఫ్రాక్చర్ తో ముడి పడి ఉండవచ్చు
 • గాయపడిన కంటి లోపలి కోణాల (కార్నర్స్) మధ్య దూరం పెరిగిపోతుంది
 • ఆర్బిటాల్ ఫ్లోర్ ఫ్రాక్చర్ (Orbital floor fracture)
 • కంటి చుట్టూ వాపు
 • కన్నీటి వాహిక (tear ducts) కు హాని కలుగుతుంది
 • ముక్కు నుండి రక్తస్రావం

ఆర్బిట్ పైకప్పు (orbital roof)  ఫ్రాక్చర్ కు సంబంధించిన లక్షణాలు:

 • ఈ ఫ్రాక్చర్ అరుదుగా సంభవిస్తుంది, ఫ్రంటల్ సైనస్ (frontal sinus) మరియు మెదడుకు కూడా గాయం జరుగుతుంది.
 • సెరెబ్రోస్పైనల్ రినోరియా ([Cerebrospinal rhinorrhoea], సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ సైనసెస్ మరియు ముక్కు ద్వారా బయటకు వచ్చేసే ఒక తీవ్రమైన పరిస్థితి)

దీని  ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ ఫ్రాక్చర్లు సాధారణంగా ఆకస్మికంగా సంభవిస్తాయి; వాహన ప్రమాదాలు, క్రీడా గాయాలు, భౌతిక దాడుల (ప్రత్యక్షంగా  కంటిపై దెబ్బ కొట్టడం) వంటి వాటి కారణంగా సంభవించే ముఖ గాయాల వలన సాధారణంగా ఈ కనుగుంట ఫ్రాక్చర్లు జరుగుతాయి.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
కంటి సాకెట్ ఫ్రాక్చర్లకి నేత్ర వైద్యులని వెంటనే సంప్రదించాలి, వారు కంటి సాకెట్ మరియు ఆ చుట్టుప్రక్కల భాగాలను పరీక్షిస్తారు.

సాకెట్ లో కనుగుడ్డు యొక్క స్థానం మరియు కంటి చూపు అంచనా వేయబడుతుంది.

అదనంగా అవసరమయ్యే పరీక్షలు:

 • స్కల్ (పుర్రె) యొక్క ఎక్స్-రే
 • ఫ్రాక్చర్ మరియు దాని చుట్టూ ఉన్న ప్రాంతం యొక్క అంచనా కోసం సిటి స్కాన్.

తీవ్ర సమస్యల సందర్భంలో, న్యూరోసర్జన్ (neurosurgeon) మరియు ఓటోలారిన్జాలజిస్ట్ (otolaryngologist) లను సంప్రదించవలసి ఉంటుంది.
కంటి సాకెట్ ఫ్రాక్చర్ చికిత్స అనేది గాయం తీవ్రత మరియు లక్షణాలు మీద ఆధారపడి ఉంటుంది.

 • సామాన్య ఫ్రాక్చర్ సందర్భాల్లో, లక్షణాల ఉపశమనం కోసం అనాల్జెసిక్స్ (analgesics),  యాంటిబయోటిక్ ప్రొఫైలాక్సిస్ (prophylaxis) సరిపోతాయి.
 • తీవ్ర సందర్భాల్లో, విరిగిన ఎముకను బాగుచేయడం కోసం మరియు స్థిరపరచడం (fixation) కోసం శస్త్రచికిత్స అవసరం పడవచ్చు.

స్వీయ సంరక్షణ:

 • తలకు దిండును ఆధారంగా చేసుకుని విశ్రాంతి తీసుకోవాలి.
 • వాపు తగ్గించడానికి  చన్నీటి కాపడం ఉపయోగించడం ముఖ్యం.
 • ముక్కును గట్టిగా చీదడం, అధికంగా  దగ్గడం లేదా తుమ్మడాన్ని నివారించాలి.
 1. కన్నుగుంటకి ఫ్రాక్చర్ (ఐ సాకెట్ ఫ్రాక్చర్) की दवा - Medicines for Fractured Eye Socket in Hindi

కన్నుగుంటకి ఫ్రాక్చర్ (ఐ సాకెట్ ఫ్రాక్చర్) की दवा - Medicines for Fractured Eye Socket in Hindi

కన్నుగుంటకి ఫ్రాక్చర్ (ఐ సాకెట్ ఫ్రాక్చర్) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
BrufenBRUFEN 400MG/2MG CAPSULE18
CombiflamCOMBIFLAM 60ML SYRUP24
Ibugesic PlusIBUGESIC PLUS 60ML SUSPENSION20
BrugelBrugel 5% W/W Gel114
TizapamTizapam 400 Mg/2 Mg Tablet42
FbnFbn 0.03% Eye Drop50
FlurbinFlurbin 0.03% W/V Eye Drop51
Espra XnESPRA XN 500MG TABLET 10S104
LumbrilLumbril Tablet16
OstofenOSTOFEN 50MG CAPSULE 10S0
OcuflurOcuflur Eye Drop44
TizafenTizafen 400 Mg/2 Mg Capsule53
EndacheEndache Gel47
FenlongFenlong 400 Mg Capsule21
Ibuf PIbuf P Tablet11
IbugesicIBUGESIC 200MG TABLET 10S7
IbuvonIbuvon 100 Mg Suspension8
Ibuvon (Wockhardt)Ibuvon Syrup9
IcparilIcparil 400 Mg Tablet23
MaxofenMaxofen Tablet5
TricoffTricoff Syrup48
AcefenAcefen 100 Mg/125 Mg Tablet23
Adol TabletAdol 200 Mg Tablet33

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. American academy of ophthalmology. What Is an Orbital Fracture?. California, United States. [internet].
 2. Boston Children's Hospital. Eye Socket Fracture Symptoms & Causes. United States. [internet].
 3. Neil J. Friedman, Peter K. Kaiser, Roberto Pineda II. The Massachusetts Eye and Ear Infirmary Illustrated Manual of Ophthalmology . Elsevier Health Sciences, 28-Feb-2014.
 4. American academy of ophthalmology. Orbital Fracture Diagnosis and Treatment. California, United States. [internet].
 5. Health Harvard Publishing. Harvard Medical School [Internet]. Eye Socket Fracture (Fracture Of The Orbit). Harvard University, Cambridge, Massachusetts.
और पढ़ें ...