మణికట్టు విరగడం (ఫ్రాక్చర్) - Fractured Wrist in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 30, 2018

March 06, 2020

మణికట్టు విరగడం
మణికట్టు విరగడం

మణికట్టు విరగడం (ఫ్రాక్చర్) అంటే ఏమిటి?

మణికట్టు 8 చిన్న ఎముకలతో తయారు చేయబడి ఉంటుంది, అవి ముంజేతి యొక్క  2 పెద్ద ఎముకులతో కలిపి ఒక జాయింట్ (ఉమ్మిడి) ని ఏర్పాటు చేస్తాయి. ఈ ఎముకలలో ఏదైనా పగులు  మణికట్టు ఫ్రాక్చర్ కు దారితీస్తుంది. ఫ్రాక్చర్ దాని తీవ్రత మరియు కారణం మీద ఆధారపడి, నొప్పిని  కలిగించవచ్చు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

 • మణికట్టు ఫ్రాక్చర్ యొక్క సంకేతాలు ఒక మాములు  ఫ్రాక్చర్ సంకేతాల వలె ఉంటాయి.
 • నొప్పి ఉంటుంది, మణికట్టును కొద్దిగా కదిలించడానికి ప్రయత్నించినా నొప్పి మరింత తీవ్రమవుతుంది.
 • నొప్పితో పాటు ప్రభావిత ప్రాంతంలో వాపు మరియు కమిలిన గాయం ఏర్పడుతుంది.
 • ఫ్రాక్చర్ అంతర్లీన కణజాలాన్ని బహిర్గతం (ఎక్సపోజ్) చేస్తే, ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంది.
 • ఎముక విరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో మణికట్టు లేదా బొటనవేలు కూడా వైకల్యానికి గురవుతాయి.
 • నొప్పితో పాటుగా, వ్యక్తి చేతిలో ఒక అసౌకర్య జలదరింపు (tingling) సంచలనాన్ని లేదా తిమ్మిరిని కూడా అనుభవిస్తాడు.
 • ఒకవేళ ఎముక దాని స్థలం నుండి మారినట్లయితే,  డిస్ప్లేసెడ్ ఫ్రాక్చర్ (displaced fracture) అని పిలువబడుతుంది.

దాని ప్రధాన కారణాలు ఏమిటి?

 • తరచుగా మణికట్టు ఫ్రాక్చర్ కిందపడిపోవడం వలన సంభవిస్తుంది. ఒక వక్తి  పడిపోయినప్పుడు అతని బరువు అంతా తన మణికట్టు మీద ఆనిపోతే లేదా మణికట్టుకు దెబ్బతగిలేలా పడిపోతే అప్పుడు ఈ ఫ్రాక్చర్ జరిగే అవకాశం ఉంటుంది
 • భారీ వస్తువులతో మణికట్టు మీద కొట్టినప్పుడు లేదా మణికట్టు మీద భారీ వస్తువు ఏదైనా పడితే కూడా అది ఫ్రాక్చర్ కు దారితీస్తుంది.
 • క్రీడలలో కొన్ని గాయాల వలన కూడా మణికట్టు ఎముకలు విరుగుతాయి.

ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?

 • భౌతిక పరీక్ష వాపు మరియు కమిలిన గాయాలను చూపుతుంది. వైద్యులు మణికట్టు యొక్క ఎక్స్-రేను ఆదేశిస్తారు.

ఎముక అనేక ముక్కలుగా విరిగిందని అనుమానం ఉంటే, సిటి (CT) స్కాన్ లేదా ఎంఆర్ఐ (MRI అవసరం. ఈ ఫ్రాక్చర్ యొక్క చికిత్స, ఫ్రాక్చర్ యొక్క తీవ్రత, విరిగిన ఎముకలు మరియు ఎముకలు స్థానభంగం (displaced) చెందిన ఫ్రాక్చర్ లేదా స్థానభంగం చెందని (non-displaced) ఫ్రాక్చర్ వంటి అంశాల పై ఆధారపడి ఉంటుంది.

 • వైద్యుడు నొప్పిని తగ్గించటానికి కొన్ని నొప్పి నివరుణులు మరియు ఇన్ఫెక్షన్ ఉంటే  యాంటీబయాటిక్స్ను ఇస్తారు.
 • బద్దకట్టు (స్ప్లింట్ ) లేదా కాస్ట్ (cast) ఎముకలను పట్టివుంచి మరియు వాటిని స్థిరపరుస్తుంది. ఇది స్థానభంగం చెందని (non-displaced) ఫ్రాక్చర్లకు ప్రభావవంతంగా ఉంటుంది.
 • కొన్నిసార్లు, ఎముకలను వాటి స్థానంలో చేర్చడానికి ప్లేట్లు మరియు స్క్రూలు కూడా అవసరం అవుతాయి. ఇది ఒక శస్త్రచికిత్సా విధానం, స్థానబంగం చెందిన (displaced) ఫ్రాక్చర్లకు ఉపయోగపడుతుంది.
 • వైద్యుల సలహా మేరకు మణికట్టు వ్యాయామాలు మరియు ఫిజియోథెరపీ, వంటివి కూడా సహాయపడుతుంది.
 • ఏవిధమైన పెద్ద సమస్యలు లేకుండా దాదాపు 8 వారాలలో చాలా ఫ్రాక్చర్లు నయం అవుతాయి. అయితే, పూర్తి స్వస్థతకు (recovery) కొన్ని నెలల వరకు పట్టవచ్చు.వనరులు

 1. Obert L et al. High-energy injuries of the wrist.. Orthop Traumatol Surg Res. 2016 Feb;102(1 Suppl):S81-93. PMID: 26782706
 2. Hanel, Jones, Trumble. Wrist fractures.. Orthop Clin North Am. 2002 Jan;33(1):35-57, vii. PMID: 11832312
 3. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Bone fractures
 4. Hsu H, Nallamothu SV. Wrist Fracture. Wrist Fracture. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
 5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Colles wrist fracture - aftercare