దురద - Itching in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

June 28, 2017

March 06, 2020

దురద
దురద

సారాంశం

దురద (కొన్ని ప్రాంతాలలో దురదను నవ, తీట అని పిలుస్తారు) చర్మం మీద ఏదో ఒక భాగంపై  గీరుకోవాలని అనిపించే ఇంద్రియ / స్పర్శజ్ఞానానికి సంబంధించిన ప్రక్రియ. దురద అలెర్జీ లక్షణాలను కలిగి ఉంటుంది. కొన్ని సమస్యలకు  అతీతమైనది. కొన్ని చికిత్సల పర్యవసానంగా ఏర్పడే దుష్ప్రభావం (సైడ్ ఎఫెక్ట్స్) కారణంగా ప్రబలుతుంది..ఇది ఆరోగ్య స్థితిగతులలో ఒకటిగా పేర్కొనబడుతుంది. దురదలలో పెక్కు రకాలు ఉన్నాయి. దురదలను అవి కనిపించే తీరు ఆధారంగా లేదా కారణం వల్ల గుర్తించవచ్చు. సాధారణంగా కనిపించే దురదలు దద్దుర్లు లేదా ర్యాషెస్,  హైవ్స్, ఫంగల్ నవ, కీటకాలు కుట్టడంగా పేర్కొనబడతాయి. ఎండు చర్మం కలిగిన వారిలో దురద సామాన్యంగా కనిపిస్తుంది.. ఇవి బాహాటంగా ఎరుపుచర్మం,  మంట, వాపు, బొబ్బల విస్పోటనం లా కనిపిస్తాయి. దురద సాధారణంగా తీవ్రత కలిగించే జబ్బు కాదు. అయితే చాలా కాలం పాటు చికిత్స జరపకపోతే ఇది వివిధ తీవ్రమైన జబ్బులకు వీలుకల్పిస్తుంది. అవి మూత్రపండాల జబ్బు, కలేయం సరిగా పనిచేయకపోవడానికి దారితీయవచ్చు. దురదకు కారణం నిర్ధారించిన తర్వాత, చికిత్సకు పెక్కు ఫలప్రదమైనట్టి మార్గాలు ఉన్నాయి. వాటిని అమలు చేయవచ్చు.  ఈ ప్రయత్నంలో భాగంగా సమయోచితమైనట్టి ఆయంట్ మెంట్లు లేదా చర్మానికి పూసే ఇతర  మందులను వాడవచ్చు. ఇంటి వైద్యం కూడా కొంతవరకు పనిచేస్తుంది.

దురద అంటే ఏమిటి? - What is Itching in Telugu

వైద్యశాస్త్రంలో ప్యూరిటస్ పేరుతో పిలువబడే దురద అసౌకర్యం కల్పించే స్పర్శ తతంగం. ఇది గోక్కోవడానికి దారితీస్తుంది, చర్మంపై ఎర్పడిన దురదకై గోకుడు ప్రారంభిస్తారు.  దురదకు చాలా కారణాలు ప్రస్తావింపబడ్డాయి. అయితే హెచ్చు కారణమైనది పొడిచర్మం . పొడిచర్మం లేదా  పొలుసుల వల్ల ఏర్పడే చర్మం దురద కల్పించి గోకుడు కారణంగా వచ్చిన మండేస్పర్శకు వీలు కల్పిస్తుంది. దురదకు గల కారణం బట్టి దానిని అనుభవిస్తున్న వ్యక్తి ఇతర ఇబ్బందులను ఎదుర్కొనవచ్చు. అవి చేర్మం ఎర్రగా కావడం, బొబ్బలు ఏర్పడటం, ర్యాష్ లు కలగడం, రక్తస్రావం  ( హెచ్చుగా గోకడం వల్ల ఏర్పడేది)  జరుగుతాయి కొందరిలో పూర్తిగా మేలుకానట్టి మరియు కొనసాగుతున్న దురద విపత్కర ఆరోగ్య స్థితిగతులకు దారితీస్తుంది. అవి మూత్రపిండాల జబ్బు, సోరాసిస్, గర్భం మరియు చాలా అరుదుగా కేన్సర్ గా ఉండవచ్చు. చక్కెరవ్యాధి, అలెర్జీలు, ఆస్త్మా వంటి వివిధ జబ్బు కలిగినవారు హెచ్చుగా దురదను ఎదుర్కొంటారని కనుగొనబడింది వయసు మళ్లినవారు కూడా దురదకు హెచ్చుగా గురవుతుంటారు. దీనికి కారణం వయసు పెరిగినకొద్దీ వారి చర్మంలో సహజమైన తేమ తగ్గిపోతుంటుంది. 

దురద యొక్క లక్షణాలు - Symptoms of Itching in Telugu

దురదకు సంబంధించి స్పర్శ లేదా ఇంద్రియ జ్ఞానం సర్వసాధారణమైనది మరియు  సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. ఇది చాలా కాలం వరకు కొనసాగవచ్చు లేదా కొద్దిపాటిగా గోక్కోవడంతో సరిపోవచ్చు. అయితే దురదకు కారణం ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటే, దురద అవుతున్న చోట గోకడంతో మాత్రమే సరిపెట్టలేము. దురద వీటితో ముడిపడి ఉంటుంది.

  • చర్మం ఎరుపు కావడం
  • మంట
  • జలదరింపు లేదా శరీరం మండుతున్నట్లు అనుభూతి
  • గడ్దలు కనిపించడం
  • ఎండు చర్మం
  • తునకలు
  • చర్మం పై రక్షణ నిర్మాణం
  • చర్మం ఊడిరావడం
  • బొబ్బలు

దురద శరీరంలో విభిన్న స్థలాలపై ఎదురు కావచ్చు.  మోచేతులు, తలమీద, వీపుపై లేదా మర్మాంగం వద్ద దీని ప్రభావం ఉంటుంది

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹425  ₹850  50% OFF
BUY NOW

దురద యొక్క చికిత్స - Treatment of Itching in Telugu

దురదకు కారణం నిర్ధారించిన తర్వాత, చికిత్స క్రింది విధంగా ఉంటుంది

  • కార్టికోస్టీరాయిడ్ క్రీములు
    ఈ వైద్యపరమైన క్రీములు   చర్మానికి హాయి కల్పిస్తూ చర్మానికి ఎదురవుతున్న దురదను నయం చేస్తుంది. ఇవి ఎండిన చర్మం  మారేలా చేస్తాయి. పైగా చర్మం పై దురదను తొలగిస్తాయి. ఇవి సాధారణంగా 1% హైడ్రోకార్టిసన్ ను కలిగి ఉంటుంది. స్టీరాయిడ్ క్రీమును డాక్టరు ఔషధసూచిక లేకుండా డాక్టరును సంప్రతించకుండా  ఉపయోగించకూడదు.
  • క్యాల్షిన్యూరిన్ ఇన్ హిబిటర్స్
    ఈ మందును నిర్ణీతస్థలంలో ఎదురయ్యే దురద నివారణకు వాడవచ్చు
  • యాంటీ డిప్రెసెంట్స్
    యాంటీ డిప్రెసెంట్స్ శరీరంలోని హార్మోన్లపై ప్రభావం కలిగి ఉంటాయి. దీనితో దురద నివారణకు సహకరిస్తాయి.
  • జెల్స్
    సాధారణమైన అలోవెరా లేదా కలబంద తేమ కలిగించేదిగా సిఫార్సు చేయబడింది. ఇది దురద కలిగించే చర్మానికి హాయి కలిగిస్తుంది పైగా పొడిచర్మాన్ని మారిస్తుంది కూడా.
  • యాంటీహిస్టామైన్స్
    యాంటీహిస్టామైన్స్ మందులు ( సాధారణంగా  మౌఖికంగా తీసుకొనబడుతాయి) అలెర్జీ ప్రతిక్రియలను అదుపుచేయడంలో చక్కగా పనిచేస్తాయి. ఇవి మంటను నివారించి  తద్వారా దురదను కూడా నివారిస్తుంది 
  • లైట్ థెరపీ
    లైట్ థెరపీ క్రింద  చక్కగా నిర్ధారింపబడిన తరంగధైర్ఘ్యం లేదా వేవ్ లెంగ్త్  కలిగిన యు వి  కిరణాలను ఉపయోగిస్తారు. ఇది చర్మంపై ఎదురయ్యే దురదను అదుపు చేస్తుంది. ఈ ప్రక్రియను ఫోటొథెరపీ అని కూడా పేర్కొంటారు. దీర్ఘకాలిక ప్రయోజనాల  కోసం పెక్కుమార్లు లైట్ థెరపీ తీసుకొనవలసి ఉంటుంది
  • అంతర్లీనమైన ఆరోగ్య స్థితులకు చికిత్స
    ఆరోగ్య స్థితిగతులను నిర్ధారించే  మూత్రపిండాలు, కాలేయం లేదా రక్తంలో చక్కెరస్థాయికి చికిత్స కల్పించడం ద్వారా దురదను నివారించవచ్చు. ఈ జబ్బులకు కల్పించే చికిత్స  వీటి రోగలక్షణాలను కూడా మార్చుతుంది

జీవన సరళిలో మార్పు

కొన్నిరకాల జీవన విధానాలు లేదా జీవన సరళులు దురదను కల్పించే చర్మం నిర్వహణణకు సహకరిస్తాయని రుజువు కాగలదు.

  • చర్మంపై దురదకు దారితీసే అలంకరణ సామగ్రిని, పదార్థాలను వాడకండి
  • చర్మంపై దురద కలిగిస్తున్న ప్రాంతంలో వైద్యపరమైనట్టి లోషన్లను పూయండి.  మందుల దుకణాలలో అవి సులభంగా లభిస్తాయి. ఈ లోషన్లు పొడిచర్మం, దురద కలిగించే చోట హాయి కల్పిస్తుంది
  • చర్మంపై దురద హెచ్చుగా ఉన్నచోట గోకటాన్ని  మానివేయండి.  అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు  దురద చర్మాన్ని పాడుచేస్తుంది. పైగా చర్మంపై ఇతర ప్రాంతాలకు వ్యాపించేలా చేస్తుంది. గోకడం కారణంగా గోళ్ల ద్వారా క్రిములను ఇతర చొట్లకు వ్యాపింపజేస్తుంది ఇలా చేయడం వల్ల మంట హెచ్చవుతుంది..
  • ఒత్తిడి స్థాయిని తగ్గించుకోండి. హెచ్చయిన మానసిక ఒత్తిడి  రోగనిరోధక వ్యవస్థ అదుపు తప్పించి దురద పెరగడానికి లేదా ఇతర అలెర్జీ కారకాలకు దారితీస్తుంది


వనరులు

  1. Am Fam Physician. [Internet] American Academy of Family Physicians; Pruritis.
  2. American Academy of Allergy, Asthma and Immunology [Internet]. Milwaukee (WI); Scratching the Surface on Skin Allergies
  3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Itching
  4. Healthdirect Australia. Itchy skin. Australian government: Department of Health
  5. Garibyan L, Rheingold CG, Lerner EA. Understanding the pathophysiology of itch. Dermatol Ther. 2013 Mar-Apr;26(2):84-91. doi: 10.1111/dth.12025. PubMed PMID: 23551365; PubMed Central PMCID: PMC3696473.

దురద కొరకు మందులు

Medicines listed below are available for దురద. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Lab Tests recommended for దురద

Number of tests are available for దురద. We have listed commonly prescribed tests below: