myUpchar प्लस+ सदस्य बनें और करें पूरे परिवार के स्वास्थ्य खर्च पर भारी बचत,केवल Rs 99 में -

క్లెబ్సియెల్లా అంటువ్యాధులు అంటే ఏమిటి?

క్లిబ్సియెల్లా అంటువ్యాధులు ప్రధానంగా ఆసుపత్రిలో (nosocomial) అంటుకునే జబ్బులు. వీటిలో ప్రధానమైనవి న్యుమోనియా (చాలా సాధారణమైనది), రక్తప్రసరణ యొక్క సంక్రమణ, చర్మంపై బహిర్గతంగా కనిపించే పుండు లేదా గాయం వంటి సంక్రమణలు మరియు మెదడు పొర మెనింజెస్ (మెదడుకు బయటి పొరలు) యొక్క వాపు జబ్బు. క్యాథెటర్స్ ను ఉపయోగిస్తూ వెంటిలేటర్ల సాయం తీసుకుంటున్నరోగులు, లేదా దీర్ఘకాలిక విషక్రిమినాశక (యాంటీబయాటిక్స్) మందుల్ని ఉపయోగించే రోగులు క్లెబ్సియెల్లా అంటువ్యాధులను పొందవచ్చు. ఈ రుగ్మత సూక్ష్మజీవుల యొక్క ఔషధ-నిరోధకత (drug-resistance) కారణంగా ఈ రుగ్మతల్ని చికిత్స చేయటం మరింత సవాలుగానే ఉంటుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

క్లెబ్సియెల్లా అంటువ్యాధులు భిన్నంగా వ్యక్తులలో భిన్నంగా తలెత్తుతుంటాయి. ఈ అంటువ్యాధులు శరీరంలో ప్రతికూల ప్రభావాలను కలుగజేస్తాయి మరియు ప్రాణాంతక ప్రమాదాన్ని పెంచుతాయి. సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:

 • పెరిగిన శరీర ఉష్ణోగ్రత
 • వణుకుడు లక్షణం
 • ఫ్లూ జ్వరాలన్ని పోలిన వ్యాధి లక్షణాలు పడిసెంతో కారే ముక్కు, తుమ్ములు మరియు దగ్గు
 • శ్లేష్మం (గళ్ల) పసుపురంగులో ఉంటుంది లేదా రక్త-చారల్నికల్గి ఉంటుంది
 • శ్వాసలో సమస్య

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

క్లెబ్సియెల్లా జాతులకు చెందిన క్లెబ్సియెల్లా బాక్టీరియా ఈ  జబ్బుకు ప్రధాన కారణం. ఈ బ్యాక్టీరియా జాతి శరీరంలోని స్థానాన్ని బట్టి విస్తృతమైన అంటురోగాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ సూక్ష్మజీవులు ప్రేగులలో ఉంటాయి మరియు ఎలాంటి ప్రమాదాన్ని కల్గించకుండా ఉంటాయి, కానీ అవి ఊపిరితిత్తుల వంటి ఇతర అవయవాలను చేరుకున్నప్పుడు, వాటిని గుర్తించకపోతే అవి తీవ్ర అంటువ్యాధులకు కారణమవుతాయి. ఈ సంక్రమణ కూడా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి, ముఖ్యంగా ఆస్పత్రిలో, అంటుకుని వ్యాప్తి అవుతుంది.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

క్లెబ్సియెల్లా సంక్రమణ గుర్తింపు (diagnosis) లో ముఖ్యంగా రక్తం, కఫం లేదా మూత్రం వంటి నమూనాల పరీక్ష ఉంటుంది. ఊపిరితిత్తుల అంటురోగాల విషయంలో X- రే లేదా PET (పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ) స్కాన్ వంటి ఇమేజింగ్ అధ్యయనాలు, ముఖ్యంగా కమ్యూనిటీ-న్యుమోనియా కేసుల్లో, చేయవచ్చు .

ఈ సూక్ష్మజీవుల (బాక్టీరియల్) జాతులు కొన్ని యాంటీబయాటిక్స్కు నిరోధకతను కలిగి ఉండటం వలన చికిత్స క్లిష్టతరమైందిగా ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాధి గ్రహణత (ససెప్టబిలిటీ)ను తనిఖీ చేయడానికి ఉపయోగించే అదనపు పరీక్షల ఆధారంగా, తగిన యాంటీబయాటిక్ చికిత్స ఇవ్వబడుతుంది. దీనికి  యాంటీబయాటిక్ కోర్సును కొనసాగించాలని సూచించబడింది మరియు ఈ కోర్సును  సగంలో ఆపడం తగదు. యాంటీబయాటిక్స్, సూచించినట్లుగా తీసుకున్నప్పుడు అవి గరిష్ట ప్రయోజనం ఇస్తాయి.

క్లెబ్సియెల్లా సంక్రమణ వ్యాధి పెద్ద అవయవాలకు వ్యాపించిందంటే ప్రమాదకరంగా ఉంటుంది. ఇటువంటి అంటురోగాలను దరిచేరకుండా ఉంచడానికి ఔషధ నిరోధకతను నిరోధించడం తప్పనిసరి.

 1. క్లెబ్సియెల్లా ఇన్ఫెక్షన్లు కొరకు మందులు

క్లెబ్సియెల్లా ఇన్ఫెక్షన్లు కొరకు మందులు

క్లెబ్సియెల్లా ఇన్ఫెక్షన్లు के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine Name
Clop MG खरीदें
Fubac खरीदें
Clovate GM खरीदें
Cosvate Gm खरीदें
Dermac Gm खरीदें
Etan GM खरीदें
Azonate GC खरीदें
Globet Gm खरीदें
B N C (Omega) खरीदें
Cans 3 खरीदें
Lobate GM खरीदें
Dermowen खरीदें
Gentalene C खरीदें
Exotic खरीदें
Clobenate Gm खरीदें
QD 4 खरीदें
Provate Gc खरीदें
Soltec Gm खरीदें
Quadriderm AF खरीदें
Zincoderm GM खरीदें
Xtraderm खरीदें
Obet G खरीदें
Sterisone G खरीदें
Keziderm खरीदें
Hinate G खरीदें

References

 1. National Centre for Advancing Translational Science. Klebsiella infection. U.S Department of Health and Human Services
 2. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Klebsiella pneumoniae in Healthcare Settings
 3. R. Podschun, U. Ullmann. Klebsiella spp. as Nosocomial Pathogens: Epidemiology, Taxonomy, Typing Methods, and Pathogenicity Factors. Clin Microbiol Rev. 1998 Oct; 11(4): 589–603. PMID: 9767057
 4. Ashurst JV, Dawson A. Klebsiella Pneumonia. Klebsiella Pneumonia. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
 5. Michelle K. Paczosaa, Joan Mecsas. Klebsiella pneumoniae: Going on the Offense with a Strong Defense. Microbiol Mol Biol Rev. 2016 Sep; 80(3): 629–661. PMID: 27307579
और पढ़ें ...
ऐप पर पढ़ें