పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డీసీజ్ (పిఐడి) - Pelvic Inflammatory Disease (PID) in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

January 09, 2019

March 06, 2020

పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డీసీజ్
పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డీసీజ్

పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డీసీజ్ (పిఐడి) అంటే ఏమిటి?

పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి/డీసీజ్ (పిఐడి) అంటే స్త్రీ పునరుత్పత్తి అవయవాల యొక్క దీర్ఘకాలిక సంక్రమణ వలన ఏర్పడే వాపు. ఈ సంక్రమణం/ఇన్ఫెక్షన్ లైంగిక అవయవాలైన ఫెలోపియన్ గొట్టాలు, అండాశయాలు మరియు గర్భాశయం వంటి అవయవాలను దెబ్బతీస్తుంది. ముందుగా చికిత్స చేయకపోతే, గర్భం ధరించడంలో తీవ్రమైన ఇబ్బందులు లేదా సంక్లిష్టమైన (సమస్యలతో కూడిన) గర్భధారణ వంటి సమస్యలకు దారితీస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఉదరం యొక్క కింది భాగంలో దీర్ఘకాలిక మొండి నొప్పి పిఐడి యొక్క అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. ప్రమాదకరమైన/అసహ్యకరమైన లేదా ఆకుపచ్చ రంగులో ఉండే అసాధారణ యోని స్రావం కూడా తరచుగా గమనింపబడే లక్షణం. స్త్రీలలో బాధాకరమైన లేదా నొప్పితో కూడిన ఋతుచక్రాలు మరియు ఋతుచక్రాల మధ్యలో రక్తం కనిపించడం మరియు ఋతుచక్ర అసాధారణతలు కూడా ఉంటాయి. వికారం లేదా వాంతులు మరియు లైంగిక సంభోగ సమయంలో నొప్పి వంటి అసాధారణ లక్షణాలు కూడా ఉంటాయి. భారతదేశవ్యాప్తంగా చాలామంది మహిళలలో సంతానలేమికి పిఐడి కూడా ఒక కారణం.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

సెర్విక్స్, గర్భాశయం యొక్క ముఖ/బయటి ద్వారము, గర్భాశయం మరియు అండాశయాలను ఏవైనా బ్యాక్టీరియాల దాడుల నుండి రక్షిస్తుంది; అయితే, అసురక్షిత లైంగిక సంభోగంలో, సెర్విక్స్ క్లమీడియా మరియు గోనేరియా అనే అంటురోగాలకు/సంక్రమణాలకు  గురైయ్యే ప్రమాదం ఉంది. ఇది అంతర్గత అవయవాలకు బాక్టీరియా చేరిపోవడానికి/ప్రవేశించడానికి దారితీస్తుంది, తద్వారా, వాపును కలిగిస్తుంది. ఇతర మరియు అసాధారణ కారణాలు ఎండోమెట్రియాటిక్ బయాప్సీ, గర్భనిరోధక పరికరాన్ని ప్రవేశపెట్టడం లేదా గర్భస్రావం వంటి కొన్ని వైద్య విధానాలను కలిగి ఉంటాయి.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

  • ప్రధానంగా స్త్రీ ఋతుచక్రాల గురించి, లైంగిక చర్యలు, మందులు, వారు పాటించిన ప్రక్రియలు (గర్భనిరోధక పరికరాలు మొదలైనవి) మొదలైనవి వాటి గురించి వివరంగా తెలుసుకుని వైద్యులు పిఐడిని  నిర్ధారిస్తారు. తరువాత, ఏదైనా రక్తస్రావం లేదా స్రావాల (డిచ్ఛార్జ్) లను తనిఖీ చెయ్యడం కోసం క్షుణ్ణమైన పెల్విక్ (పొత్తి కడుపు) పరీక్ష జరుగుతుంది. యోని స్రావాల నమూనా సేకరించి సంక్రమణలను/ఇన్ఫెక్షన్లు గుర్తించడానికి మైక్రోస్కోప్ ద్వారా పరీక్షింపబడతాయి. వీటితో పాటు, అవయవాల పరిస్థితులను పరిశీలించడానికి స్థానిక స్కాన్ ఆదేశించబడవచ్చు. ఫలితాలు వచ్చేవరకు వరకు, లైంగిక సంబంధాన్ని పూర్తిగా నివారించాలి.
  • తేలికపాటి ఇన్ఫెక్షన్ల కోసం, వైద్యులు సాధారణంగా 14 రోజుల పాటు ఉండే, ఒక యాంటీబయాటిక్ కోర్సును సూచిస్తారు. చికిత్స కోర్సును మొత్తం పూర్తి చెయ్యాడం చాలా ముఖ్యం మరియు అప్పటివరకు సెక్స్ నుండి దూరంగా ఉండాలి. నొప్పి నివరుణుల ద్వారా నొప్పి నిర్వహించబడుతుంది. తరువాత, వైద్యులని తరచూ సంప్రదిస్తూ ఉండడం మంచిది. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే, ఆసుపత్రిలో చేరడం అవసరం.
  • ఇంజెక్టబుల్ (ఇంజెక్షన్ చెయ్యడం ద్వారా) యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స చెయ్యడం జరుగుతుంది. బహుళ భాగస్వాములతో సెక్స్ నివారించాలని సలహా ఇవ్వబడుతుంది మరియు కండోమ్ల ఉపయోగం సిఫార్సు చేయబడుతుంది.



వనరులు

  1. Molenaar MC,Singer M,Ouburg S. The two-sided role of the vaginal microbiome in Chlamydia trachomatis and Mycoplasma genitalium pathogenesis. J. Reprod. Immunol. 2018 Nov;130:11-17. PMID: 30149363
  2. Di Tucci C et al. Pelvic Inflammatory Disease: Possible Catches and Correct Management in Young Women. Case Reports in Obstetrics and Gynecology Volume 2018, Article ID 5831029, 4 pages
  3. Ross J, Guaschino S, Cusini M, Jensen J. 2017 European guideline for the management of pelvic inflammatory disease. Int J STD AIDS. 2018 Feb;29(2):108-114. PMID: 29198181
  4. Wang Y et al. Characterization of pelvic and cervical microbiotas from patients with pelvic inflammatory disease. J. Med. Microbiol. 2018 Oct;67(10):1519-1526. PMID: 30113305
  5. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Pelvic inflammatory disease.
  6. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Pelvic Inflammatory Disease (PID) - CDC Fact Sheet.

పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డీసీజ్ (పిఐడి) కొరకు మందులు

Medicines listed below are available for పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డీసీజ్ (పిఐడి). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.