సిఫిలిస్ - Syphilis in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

January 10, 2019

March 06, 2020

సిఫిలిస్
సిఫిలిస్

సిఫిలిస్ అంటే ఏమిటి?

సిఫిలిస్ అనేది అంటువ్యాధి, ఇది ప్రధానంగా లైంగిక మార్గం ద్వారా వ్యాపిస్తుంది. కొన్నిసార్లు, ఇది దగ్గరి శారీరక సంబంధం ద్వారా కూడా వ్యాపించవచ్చు.

ఇది చాలా కాలం వరకు ఒక వ్యక్తిలో అంతర్లీనంగా (పైకి లక్షణాలు ఏమి చూపకుండా) ఉండవచ్చు, అటువంటి వ్యక్తులు సంక్రమణ వాహకాలుగా (carriers) ఉంటారు. సిఫిలిస్ బ్యాక్టీరియా వలన సంభవిస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సిఫిలిస్ అనేది మూడు విభిన్న దశలలో, ప్రతి దశకు ప్రత్యేక లక్షణాలు ఉంటాయి.

  • ప్రాథమిక సిఫిలిస్ (Primary syphilis):
    • ఇది ప్రారంభ దశ బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన 3 నెలల వరకు కొనసాగుతుంది.
    • ఏ ఇతర ప్రధాన లక్షణాలు లేకుండా వ్యక్తికి శరీరం మీద చిన్నచిన్న నొప్పి లేని పుండ్లు ఏర్పడతాయి.
    • ప్రాథమిక సిఫిలిస్ ఏ వైద్యం లేకుండానే కొన్ని వారాలలో తగ్గిపోతుంది.
  • ద్వితీయ సిఫిలిస్ (Secondary syphilis):
    • చేతులు, కాళ్ళు మరియు జననేంద్రియ ప్రాంతాల్లో దద్దుర్లుకు లక్షణాలు పురోగతి చెందుతాయి.
    • ఇన్ఫెక్షన్/సంక్రమణ సోకిన సుమారు 6 నెలల పాటు ఈ దశ కొనసాగుతుంది.
    • సంక్రమిత వ్యక్తిలో జ్వరం, తలనొప్పి మరియు జననేంద్రియ ప్రాంతాల్లో అసాధారణ పెరుగుదలలు ఏర్పడవచ్చు.
  • తృతీయ సిఫిలిస్ (Tertiary syphilis):
    • ఇది ప్రధాన అవయవాలు ప్రభావితమయ్యే చివరి దశ.
    • ప్రధానంగా ఈ దశలో అంధత్వం, పక్షవాతం మరియు గుండెసంబంధిత సమస్యలు సంభవిస్తాయి.
    • చికిత్స చేయకపోతే, ఇది ప్రాణాంతకం కావచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

  • సిఫిలిస్ కు కారణమయ్యే బాక్టీరియం పేరు ట్రెపోనోమా పాల్లిడియం (Treponema pallidum).
  • అసురక్షిత లైంగిక సంబంధాలు కలిగి ఉండడం ఈ సంక్రమణ వ్యాప్తి యొక్క అత్యంత సాధారణ మార్గం.
  • స్వలింగ సంపర్క పురుషులలో సిఫిలిస్ అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
  • సంక్రమిత స్త్రీ నుండి తనకు పుట్టే బిడ్డకు కూడా సంక్రమించగలదు దానిని పుట్టుకతో వచ్చే సిఫిలిస్ (congenital syphilis) అని అంటారు.
  • సంక్రమిత వ్యక్తి యొక్క బయటకి ఉండే దద్దురు లేదా పుండుని తాకినా కూడా సంక్రమణను వ్యాపించవచ్చు.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

సిఫిలిస్ వ్యాధి నిర్ధారణ:

  • పరీక్షలు నిర్వహించే ముందు, వైద్యులు రోగి యొక్క లైంగిక చరిత్రను తీలుసుకుంటారు మరియు చర్మం, ముఖ్యంగా జననేంద్రియ ప్రాంతాలను పరిశీలిస్తారు.
  • లక్షణాలు మరియు పరిశీలన ఫలితాలు సిఫిలిస్ అనుమానాన్ని కలిగిస్తే, రక్త పరీక్ష నిర్వహిస్తారు అలాగే, సిఫిలిస్ బాక్టీరియా కోసం తనిఖీ పుండు యొక్క పరీక్ష కూడా చేస్తారు.
  • తృతీయ సిఫిలిస్ అనుమానించబడితే, అంతర్గత అవయవాల స్థితిని పరీక్షించడానికి పరీక్షలు నిర్వహిస్తారు.
  • సంక్రమణలో నాడీ వ్యవస్థ ప్రమేయాన్ని గుర్తించడానికి వెన్నుముక నుండి ద్రవాన్ని సేకరించి, బ్యాక్టీరియా కోసం పరీక్షిస్తారు.
  • సిఫిలిస్ ధ్రువీకరించబడితే, రోగి యొక్క భాగస్వామికి కూడా పరీక్షలు నిర్వహించాలని సలహా ఇస్తారు.

సిఫిలిస్ చికిత్స:

  • ప్రారంభ దశ సిఫిలిస్ కోసం యాంటీబయాటిక్స్ సూచించబడతాయి, సాధారణంగా అవి ఇంజెక్టబుల్ (సూది మందు ద్వారా ఇచ్చే) యాంటీబయాటిక్స్. సిఫిలిస్ చికిత్స కోసం పెన్సిలిన్ (Penicillin) సాధారణంగా ఉపయోగించే యాంటీబయోటిక్.
  • మూడవ దశ సిఫిలిస్ కోసం, విస్తృతమైన చికిత్స అవసరం అవుతుంది, ఈ దశలో జీవి పూర్తిగా తొలగించబడదు కాబట్టి ప్రధానంగా లక్షణాలను మెరుగుపరచడానికి చికిత్స అవసరం.
  • చికిత్స వ్యవధిలో లైంగిక కార్యకలాపాలకు లేదా దగ్గరి భౌతిక సంబంధాలకు దూరంగా ఉండటం ముఖ్యం.



వనరులు

  1. Dupin N. [Syphilis].. Rev Med Interne. 2016 Nov;37(11):735-742. PMID: 27745937
  2. Peeling RW et al. Syphilis. Nat Rev Dis Primers. 2017 Oct 12;3:17073. PMID: 29022569
  3. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Syphilis - CDC Fact Sheet
  4. U.S. Department of Health & Human Services,Washington. Syphilis. HHS Headquarters [Internet]
  5. National Health Portal [Internet] India; Syphilis
  6. Lola V. Stamm. Syphilis: Re-emergence of an old foe . Microb Cell. 2016 Sep 5; 3(9): 363–370. PMID: 28357375

సిఫిలిస్ కొరకు మందులు

Medicines listed below are available for సిఫిలిస్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.