myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

మెదడు క్యాన్సర్ అంటే ఏమిటి?

బ్రెయిన్ క్యాన్సర్ అనేది మెదడులో దాపురించే ఓ అసాధారణ గడ్డ పెరుగుదల. ఓ అనియంత్రిత విభాగానికి చెందిన జీవ కణాల పెరుగుదలే మెదడులో ఏర్పడే ఈ గడ్డ. మెదడులోని అన్ని గడ్డలు (లేక మెదడు కణితులు) మెదడు క్యాన్సర్ (brain cancer) గా మారవు. మెదడు క్యాన్సర్ రెండు రకాలుగా ఉంటుంది:

 • నిరపాయమైన (నాన్ క్యాన్సర్) మెదడు క్యాన్సర్ - ఇవి తక్కువ స్థాయి గడ్డలు (I లేదా II స్థాయి), నెమ్మదిగా పెరిగే తత్త్వం దీనిది మరియు చికిత్స తర్వాత చాలా అరుదుగా పునరావృతమవుతుంది.
 • ప్రాణాంతక (malignant) మెదడు క్యాన్సర్: ఇవి మెదడులో ఉద్భవిస్తాయి. ఇవి ఉన్నత స్థాయికి చెందినవి (III or IV) మరియు శరీరం యొక్క ఇతర భాగాలకు (ప్రాధమికం) వ్యాప్తి చెందుతాయి లేదా శరీరంలో మరెక్కడో ప్రారంభమవుతాయి, అటుపై మెదడుకు (ద్వితీయ) వ్యాప్తి చెందుతాయి.

మెదడు క్యాన్సర్ ఏర్పడ్డ చోటు (site) మరియు అది పెరిగే వేగం (లేదా పెరిగే రేటు) శరీరంలోని నాడీ వ్యవస్థ పనితీరుపై ప్రభావాన్ని నిర్ణయిస్తాయి.

మెదడు క్యాన్సర్ ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మెదడు కాన్సర్ లక్షణాలు మెదడులోని ఏ భాగానికి ఈ కాన్సర్ వ్యాధి సోకిందన్న దానిపై ఆధారపడి ఉంటాయి. క్రింద పేర్కొన్నవి మెదడు కాన్సర్ యొక్క కొన్ని లక్షణాలు.

 • తలనొప్పి తరచుగా మెదడు కాన్సర్ కణితి యొక్క మొదటి లక్షణం. ఈ తలనొప్పి తేలికపాటి స్థాయి నుంచి తీవ్రమైన, నిరంతర స్థాయి వరకూ ఉండచ్చు లేదా అప్పుడప్పుడూ వస్తూండవచ్చు.
 • మాట్లాడటం లో కష్టం
 • మూర్చ
 • వికారం, మగత మరియు వాంతులు
 • శరీరం యొక్క ఒక వైపు బలహీనత లేదా పక్షవాతం పెరగడం
 • మానసిక సమస్యలు: పదాల్ని గుర్తుకు తెచ్చుకోవడంలో కష్టపడడం
 • సంతులనం యొక్క నష్టం
 • బలహీనమైన దృష్టి, వినికిడి, వాసన లేదా రుచి

మెదడు క్యాన్సర్ యొక్క ప్రధాన కారణాలు ఏమిటి?

మెదడు క్యాన్సర్ కు గల కారణాలు తెలియదు మరియు తెలిసిన కారణాలు అనిర్దిష్టమైనవి. అయితే, మెదడు క్యాన్సర్తో సంబంధం ఉన్న కొన్ని ప్రమాద కారకాలు ఇలా ఉన్నాయి:

 • వయస్సు - వయస్సు పెరుగుదలతో పాటు మెదడు క్యాన్సర్ ప్రమాదం పెరగవచ్చు.
 • అధిక మోతాదుల్లో రేడియేషన్ కిరణాలకు గురికావడం కూడా మెదడు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
 • పిల్లల్లో మునుపటి క్యాన్సర్ చరిత్ర ఉన్నట్లయితే వారిని తరువాత జీవితంలో వారు మెదడు క్యాన్సర్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ల్యుకేమియా లేదా హడ్జ్కిన్ కాని లేదా లింఫోమా యొక్క చరిత్ర కలిగిన పెద్దలకు మెదడు క్యాన్సర్ దాపురించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
 • మెదడు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కారకాల్లో అనుకూల కుటుంబ చరిత్ర (positive family history)  మరియు కొన్ని జన్యు పరిస్థితులు కూడా ఉన్నాయి.

మెదడు కాన్సర్ ని ఎలా నిర్ధారించేది మరియు దీనికి చికిత్స ఏమిటి?

రోగి యొక్క మోటార్ ప్రతిచర్యలు (motor reflexes), కండరాల బలం మరియు సంవేదనాత్మక ప్రతిస్పందనలను తనిఖీ చేయడం ద్వారా డాక్టర్ రోగికి చేసిన వ్యాధి పరీక్షల ఫలితాల్ని నిర్ధారించవచ్చు. కణితి మెదడులో పెరిగిన ఒత్తిడి కారణంగా ఆప్టిక్ నాడిలో ఉబ్బును (bulge) కలిగించవచ్చు.

మెదడు క్యాన్సర్ యొక్క ప్రధాన రోగనిర్ధారణ పరీక్షలు MRI మరియు CT స్కాన్లు. ఇవి సాధారణంగా కంటి పరిశీలనను మరియు చీలిక-లాంప్ కంటి పరీక్ష (slit-lamp eye examination) వంటి పరీక్షలను అనుసరిస్తాయి.

ఉపకరించే ఇతర పరీక్షలు:

 • అయస్కాంత ప్రతిధ్వని స్పెక్ట్రోస్కోపీ
 • పెట్ (PET) స్కాన్
 • ఒకే-ఫోటాన్ ఉద్గార CT (SPECT) స్కాన్
 • వెన్నుపూస పంక్చర్ (Lumbar puncture)

మెదడు కణితి యొక్కశ్రేణీకరణ (గ్రేడింగ్) దాని యొక్క విస్తృతి మీద ఆధారపడి ఉంటుంది. ఇది శరీరంలో కణితి యొక్క పరిమాణాన్ని మరియు దాని వ్యాప్తిని  సూచిస్తుంది.

 • గ్రేడ్ I మరియు II నెమ్మదిగా పెరుగుతాయి.
 • గ్రేడ్ III మరియు IV వేగంగా పెరుగుతాయి.

శ్రేణి (గ్రేడ్) ఆధారంగా, మెదడు కణితకు కింది చికిత్సలు చేస్తారు:

 • స్టెరాయిడ్స్ - కణితి చుట్టూ వాపును తగ్గించడానికి
 • శస్త్రచికిత్స - కణితిని తొలగించడానికి
 • రేడియోథెరపీ - ఏవేని అసాధారణ కణాలు ఇంకా శేషంగా మిగిలి ఉంటే, వాటి చికిత్సకు ఈ రేడియోథెరపీ
 • కెమోథెరపీ- అసాధారణమైన కణాలను చంపడానికి మందులు

నాన్ క్యాన్సర్ కాని కణితులు (నాన్-క్యాన్సర్ ట్యూమర్లు)  విజయవంతంగా మంచి రికవరీ రేటుతో చికిత్స చేయబడతాయి. సాధారణంగా, యువ రోగుల్లో మంచి రోగ నిరూపణ ఉంటుంది.

మెదడు క్యాన్సర్ వ్యాధులు అరుదుగా వస్తాయి కానీ, అవి దాపురించినపుడు మనుగడ స్థాయిల్ని అంచనా వేయడం కష్టం. వ్యాధి నిర్ధారణ అయిన మెదడు క్యాన్సర్ రోగుల్లో సుమారుగా 15% మంది 5 సంవత్సరాలు లేదా అంతకు మించి జీవిస్తారు

 
 1. మెదడు క్యాన్సర్ కొరకు మందులు
 2. మెదడు క్యాన్సర్ కొరకు డాక్టర్లు
Dr. Arabinda Roy

Dr. Arabinda Roy

ऑन्कोलॉजी

Dr. C. Arun Hensley

Dr. C. Arun Hensley

ऑन्कोलॉजी

Dr. Sanket Shah

Dr. Sanket Shah

ऑन्कोलॉजी

మెదడు క్యాన్సర్ కొరకు మందులు

మెదడు క్యాన్సర్ के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
CelplatCelplat 10 Mg Injection94.0
CisplatCisplat 10 Mg Injection94.0
CisteenCisteen 10 Mg Injection81.0
CizcanCizcan 10 Mg Injection77.0
CytoplatinCytoplatin 10 Mg Injection93.0
KemoplatKemoplat 10 Mg Injection84.0
PlatikemPlatikem 10 Mg Injection187.0
Platikem NovoPlatikem Novo 100 Mg Injection886.0
Platin (Cadila)Platin 10 Mg Injection78.0
PlatinexPlatinex 10 Mg Injection64.0
CisglanCisglan 50 Mg Infusion452.0
Oncoplatin AqOncoplatin Aq 10 Mg Injection87.0
PlatifirstPlatifirst 10 Mg Injection107.0
PlatiparPlatipar 10 Mg Injection150.0
SlatinSlatin 50 Mg Infusion315.0
UniplatinUniplatin 10 Mg Injection106.0
LomtinLomtin 40 Mg Capsule719.0
ConsiumConsium 100 Mg Injection3497.95

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

और पढ़ें ...